'ఆ డైరెక్టర్‌ తీరు నచ్చలేదు.. నాపై తప్పుడు ప్రచారం'.. లావణ్య త్రిపాఠి | Tollywood actress Lavanya Tripathi about casting couch experience | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: 'నాపై తప్పుడు కథనాలు.. ఆ సమయంలో చాలా ఏడ్చేశా'

Mar 14 2026 8:21 PM | Updated on Mar 14 2026 8:28 PM

Tollywood actress Lavanya Tripathi about casting couch experience

మెగా కోడలు లావణ్య త్రిపాఠి సంచలన కామెంట్స్ చేసింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కు గురైనట్లు వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన లావణ్య తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. తాను ఓ తమిళ సినిమా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ సమయంలో దర్శకుడి తీరుతో చాలా అసౌకర్యానికి గురయ్యానని వివరించింది. అందువల్లే ఆ సినిమాకు నేను నో చెప్పేశానని లావణ్య త్రిపాఠి పేర్కొంది.

ఆ సమయంలో నాకు ఎవరూ కూడా సపోర్ట్ కూడా లేదని లావణ్య తెలిపింది. ఆ తర్వాత నన్ను టార్గెట్‌గా చేసి వేధించారని అన్నారు. నాపై కేసు పెట్టడమే కాకుండా.. తప్పుడు కథనాలు కూడా రాసుకొచ్చారని ఆవేదన వ్యక్తం తెలిసింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఏడ్చేశానని లావణ్య త్రిపాఠి వివరించింది.

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ..'ఒకప్పుడు నేను ఒక తమిళ సినిమా చేయాల్సి వచ్చింది. కానీ ఆ దర్శకుడి తీరు నాకు కరెక్ట్ అనిపించలేదు. నాకు అక్కడ సౌకర్యంగా లేదని అనిపించింది. అందుకే ఆ సినిమాకు నో అని చెప్పా. ఆ తర్వాత వారు నా గురించి వార్తాపత్రికల్లో తప్పుడు కథనాలను ప్రచురించడం మొదలుపెట్టారు' అని చెప్పుకొచ్చింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement