Rajanna
-
సిరిసిల్లలో ఉద్రిక్తత.. పోలీసులు లాఠీచార్జ్
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’.. ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ ఇరువర్గాల పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు సమాచారం. రెండు పార్టీ నేతల నిరసనలతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.వివరాల మేరకు.. సిరిసిల్లలోని నేతన్న చౌరస్తా వద్ద బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల పోటాపోటీ ధర్నాకు దిగాయి. ఈ క్రమంలో పరస్పర నినాదాలతో చౌరస్తా దద్దరిల్లింది. అనంతరం, బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణ కొట్టుకునే స్థాయికి చేరింది. ‘బండి సంజయ్ డౌన్ డౌన్’.. ‘కేటీఆర్ డౌన్ డౌన్’ అంటూ ఇరువర్గాల భారీ నినాదాలు చేశాయి. దీంతో, రంగంలోకి దిగి ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసుల లాఠీచార్జ్ చేశారు.కాగా, ఉభయ పార్టీల నేతలు.. పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో, జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రెండు పార్టీ నేతలను అటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు. -
అరచేతిలో విద్యుత్ సేవలు
ముస్తాబాద్(సిరిసిల్ల): విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా క్షణాల్లో ఫిర్యాదు చేసే సదుపాయాన్ని ఎన్పీడీసీఎల్ కల్పిస్తోంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం, బిల్లులపై సందేహాలు.. ఏ విషయమైనా కూర్చున్న స్థలం నుంచే అన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎన్పీడీసీఎల్ అధికారులు ప్రత్యేక చాట్‌బాట్ వాట్సాప్‌ను రూపొందించారు. వినియోగదారులకు పారదర్శకంగా, వేగవంతమైన సేవలు అందించే ప్రధాన లక్ష్యంతో టీఎస్‌ఎన్‌పీడీఎల్ కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాట్సాప్‌లో తెలుగు, ఇంగ్లిష్‌లో పంపే సందేశాలను అర్థం చేసుకుని.. తగిన పరిష్కారం, సమాచారం అందజేస్తుంది. బహుముఖ ఏఐ సేవలు విద్యుత్ సేవలు ఇలా..వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 80,289 గృహ విద్యుత్ కనెక్షన్లు 1,79,928 పరిశ్రమల కనెక్షన్లు 3,542 దుకాణాలు 15,128 బడులు, గుడులు 18,648 పవర్‌లూమ్స్ 8,265మెరుగైన సేవలు వినియోగదారులకు పారదర్శకంగా మెరుగైన సేవలు అందించేందుకు ఏఐ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది 24 గంటలు పనిచేస్తుంది. విద్యుత్ అంతరాయం, బిల్లుల చెల్లింపులు, ఇతర ఫిర్యాదులు ఇందులో తెలుసుకోవచ్చు. నాణ్యమైన విద్యుత్ సేవలకు చాట్బాటు ఉపయోగపడుతుంది. అధికారులు, సిబ్బంది మరింత బాగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. – విష్ణుతేజ, ఏఈ, ముస్తాబాద్ -
అకా‘డమ్మీల’ దోపిడీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాడమీల పేరుతో ఇంటర్ చదువును వ్యాపారంగా మార్చుతున్నారు. ఎడ్యుకేషన్ సొసైటీలు, కోచింగ్ సెంటర్ల పేరిట విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇంటర్‌బోర్డు, విద్యాశాఖ అనుమతి లేకుండా ఐఐటీ, జేఈఈ, నీట్ అకాడమీ అంటూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నారు. భారీ హోర్డింగులతో ప్రచారం చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంగా నిర్వహిస్తున్న బన్సాల్ క్లాసెస్, ఆకాశ్ ఇనిస్టిట్యూట్‌కు అనుమతి లేదని, ఐఐటీ, నీట్, ఎఫ్‌సెట్ అకాడమీలు ఇంటర్ బోర్డు పరిధిలోకి రావని, వాటిలో విద్యార్థులు ప్రవేశాలు పొంది మోసపోవద్దని, తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలించి అనుమతి ఉన్న కళాశాలల్లో చేర్పించాలని డీఐఈవో ఆంజనేయరావు ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. మాయలో తల్లిదండ్రులు కరీంనగర్‌లోని ఆకాశ్ ఇనిస్టిట్యూట్, బన్సాల్ క్లాసెస్ పేరిట ఉన్న కళాశాలలు ఐఐటీ, జేఈఈ, ఎన్ఐటీ, నీట్ ద్వారా మెడికల్ సీట్లు వచ్చేలా కోచింగ్ ఇస్తామని విద్యార్థులు వారి తల్లిదండ్రులను నమ్మిస్తున్నాయి. అడ్మిషన్లు తక్కువయ్యే ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి విద్యార్థులను తీసుకుంటూ.. అదే కళాశాల ద్వారా పరీక్షలు రాయిస్తున్నారు. తరగతులు మాత్రం అకాడమీల్లో నిర్వహిస్తున్నారు. ఇందుకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇంటర్‌బోర్డు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో పుట్టగొడుగుల్లా.. కరీంనగర్ కేంద్రంగా అనుమతి లేని అకాడమీలు, కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అడ్మిషన్ తీసుకుంటే చాలు అంతా తామే చూసుకుంటామని, ఇచ్చే ఫీజును బట్టి సర్టిఫికెట్ చేతిలో పెడతామని ఆఫర్ ఇస్తున్నారు. ఎక్కడో ఒకచోట బిల్డింగ్ అద్దెకు తీసుకోవడం.. విద్యాశాఖ అనుమతి లేకుండా ఎడ్యుకేషనల్ అకాడమీ పెట్ట డం.. ఎవరైనా ఫిర్యాదు చేస్తే బోర్డు తిప్పేయడం ఇక్కడ సాధారణమైపోయింది. ఎలాగోలా పిల్లలతో డిగ్రీ పూర్తి చేయించాలనుకునే తల్లిదండ్రులు, కళాశాలకు వెళ్లకుండా.. పరీక్షలు రాయకుండా పాస్ కావాలనుకునే యువతను టార్గెట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తమ వద్ద చేర్చుకుని హాస్టల్ పేరిట తమ వద్దే ఉంచుకుంటారు. పరీక్ష రాసేందుకు వీలుపడని వారుంటే వారి నుంచి ప్రత్యేకంగా నగదు తీసుకుని ‘మమ’ అనిపిస్తున్నారు. పదుల సంఖ్యలో కేంద్రాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో సుమారు 20.. ఉమ్మడి జిల్లాల్లో మరో 40 కోచింగ్ సెంటర్లు, అకాడమీలు విద్యాశాఖ అనుమతి లేకుండా నడుస్తున్నాయని ఎంఈవోల రహస్య సర్వే ద్వారా విద్యాశాఖ గుర్తించింది. చాలా సెంటర్లలో నవోదయ, కోరుకొండ, గురుకులం విద్యాలయాల ప్రవేశపరీక్షకు శిక్షణ ఇచ్చే ట్యుటోరియల్స్ అనుమతి లేకుండా నడుస్తున్నాయని నివేదిక ఇచ్చారు. ఈ నిబంధనలు తప్పనిసరి యథేచ్ఛగా ఇంటర్ అడ్మిషన్లు ఎడ్యుకేషన్ సొసైటీలు, కోచింగ్ సెంటర్ల పేరిట దందా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ఇంటర్ బోర్డు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలువిద్యార్థులు మోసపోవద్దు జిల్లాలో అనుమతిలేని అకాడమీలు, కోచింగ్ సెంటర్లలో ప్రవేశాలు పొంది విద్యార్థులు మోసపోవద్దు. జిల్లా కేంద్రంలోని ఆకాష్, బన్సాల్ లాంటి అకాడమీలకు ప్రభుత్వ గుర్తింపు లేదు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఇంటర్ కళాశాలల్లోనే పిల్లలను చేర్పించాలి. – వి.ఆంజనేయరావు, డీఐఈవో, కరీంనగర్ -
త్వరగా ధాన్యం తరలించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు త్వరగా తరలించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులను ఆదివారం పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. మిల్లర్లు హమాలీల సంఖ్యను పెంచి వెంటవెంటనే ధాన్యం అన్లోడింగ్ చేయాలని ఆదేశించారు. లారీల ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు వాహనాల సంఖ్య పెంచాలని, ధాన్యానికి అనుగుణంగా సమకూర్చాలని ఆదేశించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో పెట్టాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం మండలంలోని రాచర్లబొప్పాపూర్‌లోని ఏఎంసీ గోదాంను పరిశీలించి, అన్లోడింగ్ వేగంగా చేయాలని సూచించారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, తహసీల్దార్ సుజాత తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ -
ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని గూడెంలోని కేసీఆర్ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని కొరుతూ మహిళలు ఆదివారం ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ నెల రోజులుగా నీటికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆదివారం పంపిన ట్యాంకర్ సరిపోలేదని, మొదటి అంతస్తులో ఉన్న వారికి మరింత ఇబ్బంది అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్బెడ్రూమ్ ఇండ్లపైన ట్యాంకులు పెట్టలేదని, పైపులైన్ వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నీటి సమస్యను పరిష్కరించాల ని మాజీ సర్పంచ్ సరిత కోరారు. అంజవ్వ, ప్రమీల, శ్రీనివాస్‌రావు, నర్సవ్వ పాల్గొన్నారు. 24 నుంచి మార్కండేయ పురాణ సప్తాహం సిరిసిల్లటౌన్: బీవైనగర్‌లోని శ్రీహనుమాన్ పరివార్ మందిరంలో ఈనెల 24 నుంచి 30 వరకు శ్రీమార్కండేయ పురాణ సప్తాహం నిర్వహిస్తున్నారు. ఈమేరకు కరపత్రాలను ఆదివారం గీతా ప్రచార సేవాసమితి అధ్యక్షుడు కోడం నారాయణ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ స్వామిని దీక్షితానందభారతి మాత మార్కండేయ పురాణంపై ప్రవచనం వినిపిస్తారని తెలిపారు. 33వ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి నరేశ్, సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య, ఏనుగుల ఎల్లయ్య, ఆలయ అధ్యక్షుడు లకావత్ మోతిలాల్‌నాయక్, చిన్మయ మిషన్ ప్రధాన కార్యదర్శి నల్ల సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వ ఫ్లెక్సీలో జిల్లా విద్యార్థినులకు చోటు ఇల్లంతకుంట(మానకొండూర్): హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేట మోడల్‌స్కూల్ 10వ తరగతి విద్యార్థిని మెడకొక్కుల హర్షిని, సిరిసిల్ల హైస్కూల్ విద్యార్థిని సిరికి చోటు దక్కింది. ‘సర్కారు బడి – సక్సెస్‌కు ఒడి’ పేరుతో ఏర్పా టు చేసిన ఫ్లెక్సీలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫొటోలు, వివరాలు పొందుపర్చా రు. సిరి 589, హర్షిని 588 మార్కులు సాధించి జిల్లాలో టాపర్లుగా నిలిచారు. హర్షినిని ప్రిన్సిపాల్ గంగాధర్ అభినందించారు. తైక్వాండో పోటీల్లో కాంస్యం కోనరావుపేట(వేములవాడ): 16వ జాతీయస్థాయి ఓపెన్ తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీల్లో మండలంలోని కనగర్తి విద్యార్థిని సత్తాచాటింది. ఈనెల 15, 16, 17 తేదీల్లో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన పోటీల్లో పుట్ట శరణ్య కాంస్యం సాధించినట్లు సన్‌రైజ్ తైక్వాండో అకాడమీ కోచ్ మంగళగిరి శ్రీనివాస్ తెలిపారు. గోశాలకు 65 ట్రాక్టర్ల గడ్డి వేములవాడఅర్బన్: తిప్పాపూర్‌లోని రాజన్న గోశాలకు వివిధ గ్రామాలకు చెందిన రైతులు 65 ట్రాక్టర్ల వరిగడ్డిని అందజేశారు. పెద్దపెల్లి జిల్లా కనుకుల, మారుతినగర్, రామునిపల్లి, తొగర్రాయి ప్రాంతాలకు చెందిన జానకిరామ్ ట్రాక్టర్ ఓనర్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు 65 ట్రాక్టర్ల వరి గడ్డిని గోశాలకు అందించారు. ఈ సందర్భంగా రైతులకు స్వామివారి దర్శనం కల్పించి, ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, గోశాల పర్యవేక్షకులు విజయ్, గోశాల జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన వసతులు
సిరిసిల్ల: ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఆదివారం ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యాశాఖ విజయోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సమ్మర్ క్యాంపులు ప్రారంభించి, 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. గురుకులాలు, హాస్టళ్లలో మెనూ నాణ్యమైన భోజనం అందిస్తూ.. కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచామన్నారు. 10వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, స్కిల్ యూనివర్సిటీ, అడ్వా న్స్డ్స్ టెక్నాలజీ సెంటర్లు మంజూరు చేసినట్లు వివరించారు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. తక్కువ సెలవులు తీసుకున్న టీచర్లను సన్మానించారు. ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూపారెడ్డి, డీఈవో జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. యువజన, క్రీడా వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ ఈనెల 18 నుంచి 23 వరకు నిర్వహించే యువజన క్రీడా వారోత్సవాల పోస్టర్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆవిష్కరించారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు అంబేడ్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2కే రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 23న సిరిసిల్ల కే–కన్వెన్షన్ హాల్లో నిర్వహించే జాబ్‌మేళా పోస్టర్లు ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
ఉచిత వైద్యసేవలు
ఎమర్జెన్సీగా నవజాత శిశువులకు సంబంధించిన అత్యవసర అంబులెన్స్ సేవలు 24 గంటలపాటు అందుబాటులో ఉన్నాయి. నవజాత శిశువుకు ఏర్పడే జన్యుపరమైన వ్యాధుల నుంచి సత్వరమే వైద్యం అందించాలంటే ప్రజలు వెంటనే 108కు సమాచారం ఇస్తే సరిపోతుంది. అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలోకి వెళ్లి వైద్యం అందిస్తారు. – అరుణ్‌కుమార్, జిల్లా మేనేజర్ సీపీఆర్ సేవలు అందించాం కొన్ని సందర్భాల్లో సీపీఆర్ ద్వారా శిశువులను బతికించాం. నవజాత శిశువులకు ఏదైనా చికిత్స అవసరం అన్న సమాచారం అందిన వెంటనే స్పందిస్తాం. వారి సంరక్షణకే సిబ్బంది ప్రాధాన్యత ఇస్తుంది. ఎంతోమంది శిశువులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చుతున్నాం. ఆధునిక సదుపాయాలతో ఎన్నో ప్రాణాలను కాపాడగలిగాం. – మామిడాల ఆంజనేయులు, సీనియర్ పైలట్ వినియోగించుకోవాలి ప్రజలు 108 సేవలు సద్వినియోగం చేసుకోవాలి. నవజాత శిశువుల చికిత్సకు నియోనాటల్ కేర్ అంబులెన్స్‌లో అత్యాధునిక పరికరా లున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో శిశువులను సకాలంలో ఆస్పత్రికి చేర్చి అనేక ప్రాణాలను కాపాడాం. పసిపిల్లల రక్షణకు అన్ని వేళల్లో వైద్యసేవలకు మేము సిద్ధంగా ఉంటాం. – పెద్ది శ్రీనివాస్, పైలట్ నియోనాటల్ అంబులెన్స్ -
● సంజీవనిలా నియోనాటల్ వాహనం ● శిశువు ప్రాణాలకు రక్షణ ● 108కి కాల్ చేస్తే అందుబాటులో అంబులెన్స్
సిరిసిల్లటౌన్: నవజాత శిశువు, మాత సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంచార క్రిటికల్ కేర్ సేవలు సత్ఫలితాలిస్తున్నాయి. 108 వాహన సేవల మాదిరిగానే ప్రత్యేకంగా నియోనా టల్ వాహనాలు జిల్లాలో విస్తృత సేవలు అందిస్తున్నాయి. సమాచారం అందిన వెంటనే నవజాత శిశువుకు మెరుగైన వైద్యం అందించేలా స్పందిస్తున్న నియోనాటల్ వాహనాల సేవలపై ప్రత్యేక కథనం. అపర సంజీవనిలా నియోనాటల్ అప్పుడే పుట్టిన శిశువు నుంచి 28 రోజుల వయస్సు గల పసిపాపల పాలిట నియోనాటల్ అపర సంజీవనిలా మారాయి. పుట్టిన శిశువుకు ఆరోగ్య స మస్య ఉంటే మెరుగైన వైద్యం కోసం కరీంనగర్, వ రంగల్ హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు తరలించడం సామాన్యులకు ఇబ్బందిగా మారేది. ఇ లాంటి పరిస్థితుల్లో నియోనాటల్ వాహనాలు భరోసా అందిస్తున్నాయి. ప్రైవేట్ అంబులెన్సులు అధిక వసూళ్లతో తల్లిదండ్రులు ఆర్థిక భారం తప్పేలా సంచార మొబైల్ చికిత్సాలయాలు పనిచేస్తున్నాయి. సుమారు రెండున్నరేళ్లుగా జిల్లాలో నియోనాటల్ కేర్ అంబులెన్సులు సేవలు అందిస్తున్నా యి. నవజాత శిశువులను పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆస్పత్రులకు, అవసరమైతే కరీంనగర్, హైదరాబా ద్‌లోని ఆస్పత్రులకు భద్రంగా తరలిస్తున్నారు. మొబైల్ వైద్యసేవలు ఇలా.. జన్యులోపాలతో బాధపడుతున్న నవజాత శిశువులకు అత్యవసర చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇ లాంటి కేసుల్లో మెరుగైన చికిత్స అవసరమైతే వెంట నే 108కు సమాచారం అందిస్తే, నియోనాటల్ కేర్ అంబులెన్స్ చేరుకుంటుంది. అంబులెన్స్‌లోనే అవసరమైన వైద్యం అందిస్తూ శిశువును వైద్యులు రెఫర్ చేసిన కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ అత్యాధునిక వాహనాల్లో మినీ ఐసీయూ ద్వారా అత్యవసర వైద్యం అందుతుంది. ఆక్సిజన్ సిస్టమ్, వెంటిలేటర్, పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్, సిరింజ్ ఇన్ఫ్యూజన్ పంప్, వాల్యూమ్ ఇన్ఫ్యూజన్ పంప్, ఏఈడీ, సెక్షన్ యంత్రం, వార్మర్, లారిగోస్కోప్ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో నియోనాటల్ సేవల ప్రొఫైల్నెల 2024 2025 2026 జనవరి 77 72 49 ఫిబ్రవరి 78 71 52 మార్చి 79 21 53 ఏప్రిల్ 80 62 54 మే 82 62 – జూన్ 79 53 – జూలై 64 58 – ఆగస్టు 71 56 – సెప్టెంబర్ 72 49 – అక్టోబర్ 72 51 – నవంబర్ 72 60 – డిసెంబర్ 72 60 -
ఎప్‌సెట్‌లో ప్రతిభ
ఇల్లంతకుంట/వీర్నపల్లి: ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. వివిధ ప్రాంతాల్లో చదువుకున్న వారు ఎప్‌సెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లికి చెందిన దోనుపాటి మణిదీప్‌రెడ్డి 577వ ర్యాంక్ సాధించారు. ధోనుపాటి మనోహర్‌రెడ్డి, కవిత దంపతుల కొడుకు మణిదీప్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివారు. ఇల్లంతకుంట మండలం తాళ్లల్లపల్లికి చెందిన ఇరుమల్ల ఉదయ్‌కిరణ్ 1,304 ర్యాంక్ సాధించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివారు. కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహంకోనరావుపేట(వేములవాడ): ధాన్యం కొనుగోళ్లపై జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తీసుకొచ్చి 50 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడంం, లారీలు రాకపోవడంతో కడుపుమండిన రైతులు ఆదివారం కోనరావుపేట మండలం వట్టిమల్లలో రోడ్డెక్కారు. రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లు ఇంత ఆలస్యం కాలేదన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. నెల రోజులుగా 10 కుప్పల ధాన్యం కూడా తరలించలేదన్నారు. ఎస్సై ప్రశాంత్‌రెడ్డి అక్కడికి చేరుకొని అధికారులతో మా ట్లాడించి రైతులకు నచ్చజెప్పారు. వట్టిమల్ల సర్పంచ్ గుండ వెంకటేశ్, ఉపసర్పంచ్ గంగారం సంపత్, గొల్లపల్లి మాజీ సర్పంచ్ గోపు పరశురాములు, వరాల మల్లేశం, గుండ శ్రీకాంత్, లింగారెడ్డి, మల్లారెడ్డి, సాయి, రాములు, శేషు పాల్గొన్నారు. -
ఈ–ఫార్మసీ నోటిఫికేషన్‌ను ఉపసంహరించాలి
● తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్సిరిసిల్ల: కోవిడ్ సమయంలో 2020, మార్చి 26న జారీ చేసిన తాత్కాలిక ఈ–ఫార్మసీ నోటిఫికేషన్‌ను ఇప్పటికీ కొనసాగించడం సమంజసం కాదని, ఆ నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించాలని తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ కోరారు. సిరిసిల్లలో శనివారం మాట్లాడారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈనెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులను బంద్ చేసేందుకు నిర్ణయించామన్నారు. ఈ–ఫార్మసీ ప్లాట్‌ఫారమ్స్ నియంత్రణ, సడలింపులను దుర్వినియోగం చేస్తుందన్నారు. భౌతిక ధ్రువీకరణ లేకుండా మందుల విక్రయించడం ద్వారా యాంటీమైకోబియల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని మెడికల్ షాపుల మనుగడను కార్పోరేట్ సంస్థలు దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ–ఫార్మసీ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ప్రతినిధులు తొడుపునూరి రాజు, పెండెం కృష్ణకుమార్, శేషాద్రి, రాము తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాల పరిశుభ్రతతో డెంగీ నివారణ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పరిసరాల పరిశుభ్రతతో డెంగీని నివారించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత పేర్కొన్నారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా శనివారం తంగళ్లపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో రజిత మాట్లాడుతూ ఈ ఏడాది ‘ఐక్యమవ్వండి.. చర్యలు తీసుకోండి.. డెంగీని నివారించండి‘ అనే నినాదంతో ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. ఇళ్లలోని నీటితొట్లను, కుండలను, కూలర్లను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కిటికీలకు జాలీలు అమర్చుకోవాలని సూచించారు. 104 డిగ్రీల తీవ్ర జ్వరం, తలనొప్పి, కంటి వెనుక భాగంలో నొప్పి, చర్మంపై దద్దుర్లు, కండరాల నొ ప్పులు, వాంతులు ఉంటే డెంగీ ప్రాథమిక లక్షణా లుగా గుర్తించి సమీపంలోని ఆస్పత్రిలో చేరాలని సూచించారు. తంగళ్లపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో మీర్జా, వైద్యులు అనిత, సంపత్, స్నేహ, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, మోహన్, రాజు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. లారీల కోసం బైఠాయింపుఇల్లంతకుంట(మానకొండూర్): కొనుగోలు కేంద్రానికి లారీలు రావడం లేదని ట్రాక్టర్లతో ధాన్యం తరలింపు ఆలస్యమవుతుందని మండలంలోని అనంతారం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు శనివారం ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ ట్రాక్టర్ల ద్వారా వెళ్లిన ధాన్యం అన్‌లోడింగ్‌కు జాప్యమవుతుంద న్నారు. ఎస్సై సిరిసిల్ల అశోక్, ఎస్సై–2 లక్పతి చేరుకున్నారు. ఎస్సై అశోక్ తహసీల్దార్‌తో మాట్లాడి లా రీలు వస్తాయన్న విషయాన్ని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల నిరసన తర్వాత అనంతారం కొనుగోలు కేంద్రానికి ఓ లారీని పంపినట్లు ఆర్ఐ సంతోష్ తెలిపారు. ఇక ఎన్పీడీసీఎల్లో ‘వన్ మినిట్ రూల్’సిరిసిల్లటౌన్: టీజీఎన్పీడీసీఎల్ సిరిసిల్ల సర్కిల్ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బంది భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ వన్ మినిట్ రూల్ అమలు చేస్తున్నట్లు సూపెరింటెండింగ్ ఇంజినీర్ టి.వేణుమాధవ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే ముందు ప్రతీ ఉద్యోగి ఒక నిమిషం సమయం తీసుకుని భద్రత ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక భద్రతా విధానం ద్వారా విద్యుత్ ప్రమాదాలను తగ్గించడం, సిబ్బంది ప్రాణాలను రక్షించడం, విద్యుత్ సరఫరా వ్యవస్థను సురక్షితంగా నిర్వహించడమే లక్ష్యమన్నారు. ‘ఒక్క నిమిషం జాగ్రత్త’ సిబ్బంది ప్రాణాలను కాపాడగలదని ధీమా వ్యక్తం చేశారు. -
విద్యుత్ పొదుపుగా వాడాలి
కొత్తపల్లి: వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడవచ్చు. రోజూ ఒక్క యూనిట్ ఆదా చేస్తే జీవితకాలంలో రూ.లక్ష పొదుపు చేసినవారమవుతాం. విద్యుత్ ఆదాకు నాణ్యమైన ఐఎస్ఐ మార్కుగల, స్టార్ రేటేడ్ పరికరాలను ఉపయోగించాలి. విద్యుత్ కుక్కర్లకు బదులు ప్రెషర్ కుక్కర్లు వినియోగించాలి. వేసవికాలంలో ఏసీల వినియోగం పెరిగింది. 25 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు అమర్చుకొని అరగంట తర్వాత ఆఫ్ చేయడం, ఏసీ ఫిల్టర్లను నెలకోసారి శుభ్రం చేసుకోవాలి. – కె.ఉపేందర్, డీఈ (టెక్నికల్), కరీంనగర్ సర్కిల్ -
ముచ్చటేది!
రాజన్న సిరిసిల్లఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026మూడు చుక్కలధాన్యం కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలిసాక్షి,ప్రతినిధి, కరీంనగర్: వారంతా 2012 బ్యాచ్ సబ్ఇన్స్పెక్టర్లు, కానీ సర్వీసులో తమ కన్నా జూనియర్లయిన సీఐ (2014 ఎస్సైలు)లకు సెల్యూల్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్‌శాఖలో 2012 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ల పరిస్థితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 14 ఏళ్ల సుదీర్ఘ సేవలు పూర్తి చేసుకున్నప్పటికీ, ఇంకా రెండు చుక్కల హోదాలోనే కొనసాగుతుండటం వారిలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. నిబంధనల ప్రకా రం ఆరేళ్లు సేవ పూర్తయ్యాకే సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) ప్రమోషన్‌కు అర్హత సాధించారు. అర్హత సాధించి ఎనిమిదేళ్లు గడిచినా పదోన్నతులు అందకపోవడం గమనార్హం. ఇప్పటికే అదే బ్యాచ్‌లో కొందరు సీఐలుగా పదోన్నతులు పొంది ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారు ఇంకా ఎస్సైలు గానే కొనసాగుతున్నారు. దీంతో ఒకే బ్యాచ్‌లో తీవ్ర అసమానత నెలకొంది. మరోవైపు 2014 బ్యాచ్‌కు చెందిన కొందరు ఇప్పటికే సీఐలుగా ప్రమోషన్ పొందడంతో 2012 బ్యాచ్ ఎస్సైలు తమ కన్నా జూనియర్లకు సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 2018 బ్యాచ్ మహిళా ఎస్సైలు కూడా సీఐ ప్రమోషన్‌కు అర్హత సాధించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. జోనల్ మార్పులతో వెనుకబడిన 2012 బ్యాచ్ ప్రభుత్వం అమలు చేసిన కొత్త జోనల్ వ్యవస్థ, ముఖ్యంగా 317 ప్రభావంతో పాత జోన్ల నుంచి పెద్ద సంఖ్యలో అధికారులు మారడంతో 2012 బ్యాచ్ సీనియారిటీ తీవ్రంగా ప్రభావితమైంది. ఇతర జోన్ల నుంచి వచ్చిన అధికారులు ప్రమోషన్లు పొందగా.. అసలు సీనియారిటీ ఉన్న పలువురు 2012 బ్యాచ్ ఎస్సైలు మాత్రం వెనుకబడ్డారు. ఎస్హెచ్ఓ పోస్టులు సీఐల చేతుల్లోనే మల్టీజోన్–1 పరిధిలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రామగుండం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట తదితర జిల్లాల్లోని అనేక పోలీస్స్టేషన్లలో ఎస్‌హెచ్‌వో పోస్టులను ప్రస్తుతం సీఐలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాదాపు 20 పోస్టులు ఈ తరహాలో ఉన్నాయని తెలుస్తోంది. ఇది శాఖలో సీఐ స్థాయి అవసరం ఎంతగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచడంతో పైస్థాయి అధికారుల పదవీ కాలం పొడిగించారు. దీని ప్రభావం ప్రమోషన్ చైన్‌పై పడింది. పైస్థాయిలో ఖాళీలు లేకపోవడంతో దిగువస్థాయి ఉద్యోగుల ప్రమోషన్లు సంవత్సరాల తరబడి నిలిచిపోతున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధిక కాలం ఎస్సైలుగా కొనసాగుతున్న బ్యాచ్ మాదే’ అంటూ 2012 బ్యాచ్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 ఏళ్ల సేవ పూర్తి చేసినా పదోన్నతి రాకపోవడం తమ కెరీర్ ప్రోగ్రెషన్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2012లో ఎస్సైల సంఖ్య 1,044 మంది. రాష్ట్ర ఆవిర్భావంతో 544 మందిని తెలంగాణకు కేటాయించారు. ఈ బ్యాచ్‌లో కేవలం 180 మందికి పదోన్నతి సాధించగా,, ఐదుగురు మరణించారు. ఇంకా 364 మందికి పదోన్నతి రావాల్సి ఉంది. ఇక 2014 బ్యాచ్‌లో ముగ్గురికి సీఐలుగా ప్రమోషన్ వచ్చింది. రాష్టవ్యాప్తంగా 60 సీఐ ర్యాంకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం వీటిలోనైనా అవకాశం కల్పిస్తే.. కొందరికైనా సీఐ పదోన్నతి వస్తుందని, మిగిలిన వారికి అడ్‌హక్ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు. కనీసం కొత్త డీజీపీ హయాంలోనైనా 2012 బ్యాచ్‌కు న్యాయం దక్కాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
● వాహనాలను సమకూర్చుకోవాలి ● ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: ధాన్యం సేకరణ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కొనుగోళ్లు వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీలో జాప్యం లేకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి జిల్లాలోని అధికారులతో శనివారంటెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను తరలించేందుకు సరిపడా వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. 22న జిల్లా స్థాయి సభ జిల్లాలో ఈనెల 22న నిర్వహించే యువజన, క్రీడా వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని, ప్రణాళిక ప్రకారం మే 18న అంబేడ్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ఉదయం 6:30 గంటలకు 2కే రన్, 19న కలెక్టరేట్లో ‘కెరీర్ – నైపుణ్యాభివృద్ధి’ ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్స నిర్వహించాలన్నారు. 21న సిరిసిల్లలోని మినీ స్టేడియంలో క్రీడా దినోత్సవంలో భాగంగా కబడ్డీ, వాలీబాల్, కరాటే, షటిల్ బ్యాడ్మింటన్ వంటి పోటీలు నిర్వహించాలని సూచించారు. 22న స్వచ్ఛ తెలంగాణ, సాయంత్రం సిరిసిల్ల కొత్త చెరువు వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. 23న జాబ్ మేళా ఈనెల 23న బైపాస్ రోడ్డులోని కె–కన్వెన్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీవో శ్రీనివాసాచారి, డీవైఎస్వో అజ్మీరా రాందాస్ పాల్గొన్నారు. ‘ఎస్ఐఆర్ను పారదర్శకంగా నిర్వహించాలి’ ఎస్ఐఆర్ను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రాజేందర్‌రెడ్డి, కేఎస్బీ కుమారి, తహసీల్దార్లు మహేశ్, జయంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, రెహమాన్ పాల్గొన్నారు. -
ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయాలి
● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన బస్తాలను వాహనాల ద్వారా మిల్లులకు, గోదాంలకు తరలించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం, ముస్తాబాద్ మండలం గూడెం, ఆవునూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు, నామాపూర్, బందనకల్‌లో రైస్‌మిల్లులను శనివారం తనిఖీ చేశారు. హమాలీల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్ ఫారూఖ్ ఉన్నారు. -
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
● అడిషనల్ ఎస్పీ చంద్రయ్య సిరిసిల్ల: పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని అడిషనల్ ఎస్పీ చంద్రయ్య సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయం పరేడ్ మైదానంలో జిల్లా ఏఆర్, సివిల్ పోలీస్, హోమ్‌గార్డ్ సిబ్బందికి శనివారం నిర్వహించిన వీక్లీ పరేడ్‌ను పరిశీలించారు. ప్రతి రోజూ కనీసం అరగంట వ్యాయామం, వాకింగ్ చేయాలన్నారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ శ్రీనివాస్, ఆర్ఐలు మధుకర్, రమేశ్, ఆర్ఎస్సైలు రాజు, శ్రవణ్‌యాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘జాన్ 2న ఇందిరమ్మ గృహప్రవేశాలు’చందుర్తి(వేములవాడ): జిల్లా వ్యాప్తంగా జాన్ 2న ఇందిమ్మ ఇళ్ల మెగా గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నట్లు హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట మాధవరావు తెలిపారు. చందుర్తి మండల పరిషత్‌లో ఎంపీడీవో రాధ ఆధ్వర్యంలో శని వారం ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు మాట్లాడుతూ ఇందిరమ్మ పథకంలో జిల్లాలో 6,449 ఇళ్లు మంజూరు చేయగా.. 5,756 గ్రౌండింగ్ కాగా.. 2,227 ఇండ్లు పూర్త య్యాయని, బేస్మెంట్లో 692, పునాది 819, గోడలు 395, స్లాబ్ వరకు 1,643 ఇండ్ల పనులు సాగుతున్నట్లు తెలిపారు. హౌసింగ్ డీఈఈ ముజారుద్దీన్, ఏఈ రవీందర్ ఉన్నారు. సిరిసిల్లటౌన్: సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు అదనపు బస్సులు నడపాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని బస్టాండ్ ఎదుట శనివారం ధర్నా చేసి మాట్లాడారు. వేములవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సుల్లో సీట్లు దొరక్క సిరిసిల్లతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా సిరిసిల్ల డిపో నుంచి బస్సులు వేయాలని కోరారు. మట్టే శ్రీనివాస్, ఆరెల్లి వినయ్‌కుమార్, సాదు శేఖర్, బల్యాల ప్రవీణ్, అజ్జు పాల్గొన్నారు. పంచాక్షరికి స్వాగతంసిరిసిల్లటౌన్: తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ స ర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీహెచ్.పంచాక్షరి శనివారం సిరిసిల్లకు పర్యటనకు విచ్చేశారు. లోక్ అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఏఐపై వర్క్‌షాప్ సిరిసిల్ల: ఏఐ, లైఫ్స్కిల్స్పై నాలుగు రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి శనివారం తెలిపారు. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు, యువకులు సాంకేతిక జ్ఞానంతో ఉద్యోగావకాశాలు మెరుగు పరుచుకోవాలని కోరారు. ‘మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్’ సహకారంతో వర్క్‌షాప్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, సర్టిఫికెట్స్ జిరాక్స్‌లతో బీసీ స్టడీసర్కిల్ ఆఫీస్‌లో సంప్రదించాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 08723–223004లో ఆఫీస్ పని వేళల్లో సంప్రదించాలని కోరారు. నార్కోటిక్ జాగిలాలతో మత్తుకు చెక్తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలను నివారణే లక్ష్యంగా వపోలీసులు నార్కోటిక్ జాగిలాలతో సిరిసిల్లతోపాటు తంగళ్లపల్లి ప్రాంతాల్లోని కిరాణా కొట్లు, పాన్‌షాపులు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానిత ప్రాంతాలపై నార్కోటిక్ డాగ్స్ సహాయంతో నిఘా ఉంచుతామన్నారు. ఇలాంటి అసాంఘిక, అక్రమ వ్యవహారాలు జరుగుతుంటే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
పూడికతీతతో నీటినిల్వల పెంపు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అటవీ ప్రాంతంలో చేపట్టిన పూడికతీత పనులతో నీటి నిల్వలు పెంపొందుతాయని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మండలంలోని పదిరలో చేపట్టిన ఉపాధిహామీ పనులను శుక్రవారం పరిశీలించారు. పనులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చెక్‌డ్యాములు, నీటికుంటలు ఇతర ప్రాంతాల్లో పూడికతీత పనులు సాగుతున్నాయన్నారు. ఏపీడీ నర్సింలు, అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి మోహన్‌లాల్, ఎంపీడీవో సత్తయ్య, ఏపీవో కొమురయ్య, కార్యదర్శి అనూష పాల్గొన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలిసిరిసిల్లటౌన్: ప్రీ ప్రైమరీ టీచర్స్‌కు, ఆయాలకు కనీస వేతనాలు అందించాలని ప్రీ ప్రైమరీ టీచర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ప్రీ ప్రైమరీ టీచర్స్, ఆయా యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ టీచర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నాయకులు కూర రాకేశ్, మంత్రి లావణ్య, నిషాని మాధవి, స్వప్న, గిరిజ, అంజలి, శాంత, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్: విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాల్లో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లైబ్రరీలో చదివి ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించారు. గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు. పోటీ పరీక్షలకు సిద్ధమతున్న అభ్యర్థులు వార్త పత్రికలు చదవాలని సూచించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో టాస్క్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కంప్యూటర్ శిక్షణ తరగతులను కలెక్టర్ పరిశీలించారు. గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, రెడ్డినాయక్ పాల్గొన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు శ్రీకారం ఎస్సీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల ఉచిత శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ముందుగా స్టడీ సర్కిల్ ఆవరణలో మొక్క నాటారు. ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ స్టడీ సర్కిల్ ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేస్తామని, అభ్యర్థులు అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో సంప్రదించాలన్నారు. ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి, స్టడీసర్కిల్ హానరరీ డైరెక్టర్ మల్లేశం పాల్గొన్నారు. అపెరల్ పార్క్ గోదాములు పరిశీలన ధాన్యం నిల్వ చేస్తున్న అపెరల్ పార్క్‌లోని గోదాములను కలెక్టర్ పరిశీలించారు. హమాలీలకు మంచినీరు, భోజనం వసతి కల్పించాలని ఆదేశించారు. ధాన్యం అన్లోడింగ్ వేగంగా చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీసీఎస్వో బుచ్చిబాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ నర్సింహ, కార్మికశాఖ అధికారి నజీర్ అహ్మద్, తహసీల్దార్ మహేశ్ ఉన్నారు. -
పెట్రో పిడుగు
సిరిసిల్ల: వాహనదారులపై పెట్రోల్, డీజిల్ పిడుగుపడింది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే అమలులోకి రావడంతో శుక్రవారం నుంచే ఇం‘ధన’ భారం పడింది. జిల్లాలోని వాహనదారులపై నిత్యం రూ.15 లక్షల మేరకు అదనపు భారం పడుతుంది. డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో కూరగాయలు, నిత్యవసరాల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. నిత్యం రూ.15 లక్షల భారం జిల్లా వ్యాప్తంగా అన్ని కంపెనీల పెట్రోల్‌బంకులు 78 వరకు ఉన్నాయి. డీజిల్, పెట్రోల్‌ను వినియోగించే వాహనాలు 1,65,505 వరకు ఉన్నాయి. నిత్యం 3.50 లక్షల లీటర్ల డీజిల్, 1.05లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తున్నారు. ఈ లెక్కన పెరిగిన ధరలతో నిత్యం వాహనదారులపై రూ.15లక్షలు అంటే నెలకు రూ.4.50 కోట్ల భారం పడనుంది. తరచూ బంక్‌ల బంద్ ! జిల్లాలో చాలా బంకుల్లో డీజిల్ ఉంటే పెట్రోల్ ఉండదు.. పెట్రోల్ ఉంటే డీజిల్ ఉండని పరిస్థితి నెలకొంది. గతంలో ఇంధన కంపెనీలు అరువు(ఉద్దెర)పై డీజిల్, పెట్రోల్ ట్యాంకర్లను పంపించేవి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇంధన సమస్యలు తలెత్తడంతో ముందుగా డీడీలు తీసి పంపించిన బంకులకే డీజిల్, పెట్రోల్‌ను పంపుతున్నాయి. అయితే జిల్లాలో ఉద్దెర వ్యాపారం చేసిన పెట్రోల్ బంకుల యజమానులకు భారీ వాహనదారులు రూ.లక్షల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంది. వారి నుంచి సకాలంలో డబ్బులు రాకపోవడంతో ఇంధన కంపెనీలకు డీడీలు చెల్లించేందుకు నగదు లేక సకాలంలో ట్యాంకర్లు రావడం లేదు. అన్ని రంగాలపై ప్రభావం డీజిల్, పెట్రోల్ ధరల పెంపు అన్ని రంగాలపై పడనుంది. వ్యవసాయం నుంచి రవాణారంగంతోపాటు కూరగాయలు, వ్యాపార, వాణిజ్యరంగాలపై పెట్రోల్ పిడుగు పడుతుంది. ప్రధానంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. పొలాలు దున్నడం, వరి కోతలు, పొలాలకు పెండను తరలించడం, కొత్తగా వ్యవసాయ భూములను చదును చేయడం, మట్టి కొట్టుకోవడం వంటి పనులకు ఇంధన వినియోగం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఇలా..(లీటరుకు) ఇంధనం మొన్నటి వరకు ఇప్పుడు తేడా పెట్రోల్ రూ.108.04 రూ.111.43 రూ.3.39 స్పీడ్ పెట్రోల్ రూ.117.79 రూ.121.18 రూ.3.39 డీజిల్ రూ.96.23 రూ.99.50 రూ.3.27 -
ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృద్ధి
● మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ సిరిసిల్లటౌన్: పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. మూడో వార్డులో శుక్రవారం సీసీ రోడ్డు పనుల ప్రారంభోత్సవంలో మాట్లాడారు. గత మున్సిపల్ పాలకవర్గం సమయంలో సమస్యను ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రాజ్యసభ సభ్యుడు డి.దామోదర్‌రావుతో మాట్లాడి నిధులను అందించారన్నారు. ఆ నిధులకు అదనంగా రూ.3 లక్షలు మున్సిపల్ నిధులను కేటాయించినట్లు తెలిపారు. కౌన్సిలర్ గుడ్ల శ్రీనివాస్, డీఈ పి.వాణి, పంచాయతీరాజ్ ఏఈ అజారుద్దీన్ పాల్గొన్నారు. కోటి సూర్య నమస్కారాలకు రండి సిరిసిల్లటౌన్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న కోటి సూర్య నమస్కారాల కార్యక్రమానికి రావాలని కోరుతూ డీఎంహెచ్‌వో రజితకు తపోవన యోగా కేంద్రం ఇన్చార్జి ఎలిగేటి కృష్ణ ఆహ్వానపత్రి అందజేశారు. జూన్ 21న లక్ష మందితో 27 సార్లు సూర్య నమస్కారాలు చేసి ‘కోటి సూర్య నమస్కారాలు’ కార్యక్రమంలో పాల్గొనాలని డీఎంహెచ్‌వోతోపాటు డీఎస్పీ నాగేంద్రచారిని ఆహ్వానించారు. ఈ గిన్నిస్‌బుక్ రికార్డు ప్రయత్నాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు తపోవన యోగ కేంద్రంలో నిత్యం ఉదయం 5:30 నుంచి 7:30 వరకు ‘ఉచిత యోగా శిక్షణ శిబిరం’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 99633 38212లో సంప్రదించాలని కోరారు. దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు సిరిసిల్ల: సమగ్ర శిక్ష, అలీంకో సంయుక్తంగా గురువారం సుందరయ్యనగర్ భవిత కేంద్రం, పాఠశాలలోని దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. డీఈవో జగన్మోహన్రెడ్డి హాజరై ఎంపికై న విద్యార్థులకు ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి యంత్రాలు, కాలిపర్స్, బ్రెయిలీ కిట్లు అందించారు. 14 మంది సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు అవసరాలకు అనుగుణంగా ఉపకరణాలు అందజేశారు. దృష్టిలోపం ఉన్నా పదో తరగతిలో ప్రథమశ్రేణిలో పాసైన రుద్రవరం హైస్కూల్ విద్యార్థిని గొట్టెముక్కల పల్లవిని అభినందించారు. కొనుగోళ్లు వేగవంతం చేయండి ఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. మండలంలోని రహీంఖాన్‌పేట ఏఎంసీ గోదాం, తాళ్లపల్లి రైస్‌మిల్లు, పొత్తూరు ప్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. తాళ్లపల్లి రైస్‌మిల్లులో స్టోరేజ్ దగ్గర పడుతుందని యాజమాన్యం అడిషనల్ కలెక్టర్‌కు తెలపగా మరికొంత ధాన్యం దించుకోవాలని సూచించారు. పొత్తూరు కొనుగోలు కేంద్రంలో లారీలను పంపాలని రైతులు కోరగా పంపిస్తానని, స్థానికంగా ఉన్న ట్రాక్టర్లను ఉపయోగించు కోవాలని సూచించారు. ఇల్లంతకుంట తహసీల్దార్ సురేష్, ఏపీఎం కుమారస్వామి, ఆర్ఐ సంతోష్ ఉన్నారు. బస్తాలను మిల్లులకు తరలించాలి ఎల్లారెడ్డిపేట/బోయినపల్లి: తూకం వేసిన ధా న్యం బస్తాలను వెంటవెంటనే మిల్లులకు తరలించాలని అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, బోయినపల్లి మండలం కొదురుపాక, మాన్వాడల్లోని కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరి శీలించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. నిరుపయోగంగా ఉన్న గోదాములను వినియోగించుకోవాలని తెలిపారు. తహసీల్దార్లు సుజాత, షరీఫ్మొయినొద్దీన్ ఉన్నారు. -
జాతీయస్థాయిలో మెరిసిన మల్లారం
● డిజిటల్ విలేజీగా గుర్తింపు ● అభినందనల వెల్లువవేములవాడరూరల్: డిజిటల్ వ్యవసాయం.. గ్రామాభివృద్ధి.. పారదర్శకత విషయాల్లో వేములవాడరూరల్ మండలం మల్లారం గ్రామం మెరిసింది. ఏప్రిల్ నెలలో ప్రకటించిన జాబితాలో మల్లారం గ్రామానికి ప్రథమ స్థానం దక్కింది. డిజిటల్ వ్యవసాయం, గ్రామాభివృద్ధి, ప్రజాభాగస్వామ్యం, పారదర్శకత అనే నాలుగు అంశాలను సమన్వయం చేయడంలో గ్రామం మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవల గ్రామ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో గ్రామంలోని ప్రతీ సమస్య, అభివృద్ధి, ప్రభుత్వ పథకాలతో మరెన్నో సమాచారాలను సర్పంచ్ సంగెం అర్పిత కుమారుడు సంహిత్‌రెడ్డి రూపొందించారు. దీనిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. వెబ్సైట్ ప్రారంభించడంతో మొదటి స్థానంలో ఉన్న మల్లారం జాతీయస్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. -
బక్రీద్‌కు పటిష్ట భద్రత
సిరిసిల్లటౌన్: బక్రీద్‌కు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. బక్రీద్ నేపథ్యంలో శుక్రవారం ముస్లిం మత పెద్దలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశమయ్యారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. సరైన పత్రాలు లేకుండా పశువులను తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆవులు, దూడలను అక్రమంగా రవాణా చేసిన, వధించిన, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పశువుల అక్రమ రవాణాను గుర్తిస్తే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 87125 37826, నోడల్ అధికారి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ 87126 56410కు సమాచారం ఇవ్వాలని కోరారు. డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత
● బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతాదయాకర్రెడ్డిసిరిసిల్ల: బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత అని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సీ్త్ర, మహిళా, శిశు, వృద్ధుల, దివ్యాంగుల, ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఫంక్షన్హాల్లో బాలల హక్కుల పరిరక్షణపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సీతాదయాకర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు, వార్డుల్లో బాలల హక్కుల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. బాల్య వివాహాలు అడ్డుకోవాలని సూచించారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్ ఉండొద్దని సూచించారు. బాలకార్మిక వ్యవస్థ ఉండవద్దని స్పష్టం చేశారు. 1098 హెల్ప్‌లైన్ వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాల, బాలికలను కమిటీలు సంరక్షించాలని సూచించారు. జిల్లాలో వందకుపైగా అంగన్వాడీ భవనాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నేరమన్నారు. అనాథలకు ప్రభుత్వం మిషన్ వాత్సల్య కింద ప్రతి నెలా రూ.4వేలు సహాయం అందిస్తుందని, జిల్లాలో 117 మంది పిల్లలకు ప్రతి నెలా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వచన్కుమార్రెడ్డి, బండి అపర్ణ, మర్రిపల్లి చందన, గోగుల సరిత, వందనగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, ఏఎంసీ చైర్మన్లు స్వరూపారెడ్డి, రాములునాయక్, రాజు, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల ఆర్డీవో రాజేందర్‌రెడ్డి, డీఎస్పీ నాగేంద్రచారి పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు కలగనివ్వం
సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా కొనసాగుతోందని, రైతులకు ఇబ్బందులు కలగనివ్వబోమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల అపెరల్ పార్క్‌లోని షెడ్లలో ధాన్యం దిగుమతిని శుక్రవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి పరిశీలించారు. రైతులు ఆందోళన చెందొద్దని, చివరి గింజ వరకు కొంటామన్నారు. ధాన్యం దిగుమతికి అపెరల్‌పార్క్‌లోని షెడ్లలో వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని, ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. డీసీఎస్వో బుచ్చిబాబు, సిరిసిల్ల తహసీల్దార్ ఎస్.మహేశ్, కోనరావుపేట, వేములవాడ ఏఎంసీ చైర్మన్లు కచ్చకాయల ఎల్లయ్య, రొండి రాజు పాల్గొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కోనరావుపేట(వేములవాడ): పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని అజ్మీరాతండాలో ఇందిరమ్మ ఇంటిని శుక్రవారం ప్రారంభించి, లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. విప్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అర్హులైన ప్రతీ కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, సర్పంచులు భుక్యా తిరుపతి, బానోత్ నరేశ్, జయరాం, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, సింగిల్‌విండో చైర్మన్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ–ఫార్మసీ విధానం రద్దు చేయాలి -
పనులు లేక ఇబ్బందుల్లో ఉన్నాం
సిరిసిల్లలో ట్రాక్టర్లకు పనులు లేక ఇబ్బందుల్లో ఉన్నాం. ఆన్లైన్ ద్వారా ఇసుక పర్మిట్లు ఇస్తున్నారు. దీంతో ట్రాక్టర్లకు పూర్తి స్థాయి పనులు లేవు. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడంతో ఆర్థిక భారం పడుతుంది. ఒక్క ట్రాక్టర్ యజమానులే కాదు.. మాపై ఆధార పడిన దినసరి కూలీలు కూడా ఇబ్బందులు పడుతారు. – పాటి రాజ్‌కుమార్, ట్రాక్టర్ అసోసియేషన్, అధ్యక్షుడు, సిరిసిల్లఅందరికీ భారమే.. వ్యవసాయదారుల నుంచి అన్ని రంగాల వారిపైన డీజిల్, పెట్రోల్ ధరల పెంపు ప్రభావం ఉంటుంది. ఇప్పటికే సిలిండర్ల కొరతతో హోటళ్లలో టిఫిన్ రేట్లు పెంచారు. ఇప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలు పెరడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పవు. ఇది అందరికీ పెద్ద ఆర్థిక భారమే అవుతుంది. – దొంతరవేణి శ్రీనివాస్‌గౌడ్, గీత కార్మికుడు, నిమ్మపల్లి పెరిగిన ధరలు అమలు చేస్తున్నాం ఇంధన కంపెనీల నిర్ణయం మేరకు పెరిగిన ధరలను అమలు చేస్తున్నాం. పెట్రోల్, డీజిల్ బంకులు ప్రస్తుత విధానాలతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. నిజానికి ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. కానీ ప్రభుత్వ నిర్ణయాలను మేం అమలు చేయాల్సిందే. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి. – గూడూరి ప్రవీణ్, పెట్రోల్ బంక్ యజమాని, సిరిసిల్ల -
ఓటరు నమోదులో భాగస్వాములు కావాలి
వేములవాడఅర్బన్: ఓటర్ల నమోదులో అఖిలపక్షం పార్టీలు భాగస్వాములు కావాలని ఆర్డీవో కేఎస్బీ కుమారి కోరారు. వేములవాడ ఆర్డీవో ఆఫీస్‌లో గురువారం అఖిలపక్షం నేతలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అమె మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల పక్షాన నియోజకవర్గంలో బూతుకు ఒక్కరి చొప్పున ఏజెంట్‌ను నియమించుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా కూడ ప్రతీ బూతుకు ఒక్కరిని బూత్ లెవల్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. అనంతరం అఖిలపక్షం నాయకులు ఆర్డీవోకు రాజన్న చిత్రపటం, ప్రసాదం అందజేశారు. నిత్యానందారావు, పొలాస నరేందర్, పిన్నింటి హన్మండ్లు, తదితరులు ఉన్నారు. సర్కారు బడిలో మెరుగైన విద్య సిరిసిల్లటౌన్: సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య అందుతుందని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. స్థానిక మూడోవార్డులో గురువారం నిర్వహించిన బడిబాటలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వ పాఠశాలల సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూపరెడ్డి పాల్గొన్నారు. జాగ్రత్తగా ఉండాలి చందుర్తి/రుద్రంగి(వేములవాడ): వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రజిత ఆదేశించారు. చందుర్తి, రుద్రంగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గురువారం పరిశీలించారు. వడదెబ్బకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డీడీఎం కార్తీక్, చందుర్తి వైద్యాధికారి వేణుమాధవ్ తదితరులు ఉన్నారు. ధాన్యం త్వరగా తరలించాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని త్వరగా తరలించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. మండలంలోని రాచర్లబొప్పాపూర్ కొనుగోలు కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. లారీల కొరత లేకుండా వాహనాలను సమకూర్చాలని ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లను ఆదేశించారు. తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు. హమాలీల సంఖ్య పెంచాలి గంభీరావుపేట(సిరిసిల్ల): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీల సంఖ్యను పెంచాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట, కొత్తపల్లిలోని రైస్‌మిల్లులను గురువారం తనిఖీ చేశారు. తహసీల్దార్ మారుతీరెడ్డి, సిబ్బంది ఉన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశాలుసిరిసిల్ల: జిల్లాలో 2026–2027 విద్యాసంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల(నాన్ రెసిడెన్షియల్)లో 1వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్‌రెడ్డి గురువారం తెలిపారు. 46 మంది ఎస్సీ విద్యార్థులకు బెస్ట్ అవైలెబుల్ స్కూళ్లులో ప్రవేశానికి అవకాశం ఉందని వివరించారు. అర్హులు జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు కలెక్టరేట్లోని ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. -
హాస్టల్ భవన పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల/వేములవాడఅర్బన్: డిగ్రీ బాలికల హాస్టల్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారం డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా డిగ్రీ బాలికల హాస్టల్ భవన నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. నాంపల్లి శివారులో నిర్మిస్తున్న మినీస్టేడియం పనులు పరిశీలించారు. చంద్రగిరిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆర్డీవో కేఎస్బీ కుమారి, ఈఈ అశోక్‌కుమార్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, తహసీల్దార్ జయంత్‌కుమార్ తదితరులు ఉన్నారు. గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలి జిల్లాలో నూతన గోడౌన్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ), స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(ఎస్‌డబ్ల్యూసీ), నాబార్డ్, పరిశ్రమలశాఖ, ఎల్డీఎం తహసీల్దార్లు, మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. గోడౌన్ల నిర్మాణాని స్థలాలు గుర్తించాలన్నారు. 22న జిల్లా స్థాయి సభ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 22న జిల్లా స్థాయి సభ నిర్వహణకు ఏర్పాట్లు చే యాలని కలెక్టర్ ఆదేశించారు. ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సభలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సూచించారు. లబ్ధిదా రుల అభిప్రాయాలు వివరించాలని పేర్కొన్నారు. 18 నుంచి పర్యాటక శాఖ, యువజన వారోత్సవాలు ఈనెల 18 నుంచి 23 వరకు పర్యాటకశాఖ, యువజన వారోత్సవాలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 18న జిల్లా కేంద్రంలో 2కే రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. 21న స్పోర్ట్స్ డేలో భాగంగా సమ్మర్ క్యాంప్‌లకు హాజరవుతున్న పిల్లలతో స్పోర్ట్స్ డే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 23న మెగా జాబ్‌మేళా చేపట్టాలని తెలిపారు. ఆయా సమావేశాల్లో జిల్లా సహకార అధికారి రామకృష్ణ, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, మార్క్ ఫెడ్ అధికారి హబీబ్, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ నరసింహ, నాబార్డ్ డీడీఎం దిలీప్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు, యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, పరిశ్రమల శాఖ అధికారులు హనుమంతు, భారతి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు దొరికారు.. పరారీలో పది మంది!
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ షాప్ దోపిడీ కేసులో పోలీసులు ముగ్గురినే పట్టుకోగలిగారు. ఈ దోపిడీలో మొత్తం 13 మంది పాల్గొనగా.. మిగిలిన 10 మంది కోసం గాలిస్తున్నారు. బిహార్ జైలులో ఉన్న ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరొందిన సుబోధ్‌సింగ్ అక్కడి నుంచే ఈ ఆపరేషన్‌ను నడిపించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చూపిస్తూ గురువారం సీపీ గౌస్ ఆలం కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జారీరాసింగ్, బిహార్‌కు చెందిన రావిష్‌కుమార్ అలియాస్ ప్రద్యుమన్ వీరికి సిమ్‌కార్డులు సరఫరా చేసిన మెహతాబ్‌ఖాన్ అలియాస్ మహబూబ్‌ఖాన్‌ను అరెస్ట్ చేయగా, మరో 10 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో రూ.82.02 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు దోచుకెళ్లినట్లు తెలిపారు. దోపిడీ సమయంలో జువెల్లరీ షాప్ సిబ్బందిపై కాల్పులు జరపడంతో నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. జైలు నుంచే మాస్టర్‌ప్లాన్ ఈ దోపిడీ వెనుక బిహార్‌లోని కరుడుగట్టిన నేరగాడు సుబోధ్‌సింగ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరొందిన సుబోధ్‌సింగ్ జైలులో నుంచే తన అనుచరులకు ఆదేశాలిస్తూ దేశవ్యాప్తంగా దోపిడీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బిహార్, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో ఈ ముఠా 20కి పైగా దోపిడీలకు పాల్పడినట్లు, 400 కిలోలకుపైగా బంగారాన్ని దోచుకెళ్లినట్లు సమాచారం. సుబోధ్‌సింగ్ ఆదేశాలతో ప్రధాన నిందితులు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జారీరాసింగ్, రావిష్‌కుమార్ అలియాస్ ప్రద్యుమన్, రాధే అలియాస్ అభయ్, సూర్యమణికుమార్ అలియాస్ సనోజ్ తదితరులు రెండు నెలల క్రితమే తెలంగాణకు వచ్చారు. ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో జువెల్లరీ షాపులు, బ్యాంకులపై రెక్కీ నిర్వహించారు. చివరికి కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ షాప్‌ను ఎంచుకున్నట్లు వెల్లడించారు. రెక్కీ సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్ రూట్లను ముందుగానే డౌన్లోడ్ చేసుకుని, వాటి ఆధారంగానే పారిపోయారు. నకిలీ ఆధార్‌కార్డులు, తెలంగాణ, ఒడిషా ఫేక్ బైక్ నంబర్ ప్లేట్లు, తప్పుడు పేర్లతో లాడ్జీలలో బస చేస్తూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు వెల్లడైంది. ఈక్రమంలో సిద్దిపేట, పెద్దపల్లి, ధర్మపురి లాడ్జీల్లో బసచేశారు. వీరంతా ఒకరికితో మరొకరికి పరిచయం లేదు. అందరికీ ఇచ్చిన నకిలీ గుర్తింపుకార్డుల పేర్లతోనే పిలుచుకున్నారు. దోపిడీ చేసిన బంగారాన్ని ఇప్పటికే కరిగించి నేపాల్ చేర్చినట్లు అనుమానిస్తున్నారు. చంద్రాపూర్ అడవుల్లో తుపాకులు పోలీసుల విచారణలో నిందితుల నేరపద్ధతి సంచలనంగా మారింది. ఝార్ఖండ్–పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఒక్కో సిమ్‌కార్డును రూ.10వేల చొప్పున కొనుగోలు చేసినట్లు తేలింది. దోపిడీకి ముందు రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాల నుంచి రైలులో చంద్రపూర్ సమీపానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే ముఠాకు చెందిన వ్యక్తుల నుంచి ఆరు పిస్టల్స్, 60 బుల్లెట్లతో 12 మ్యాగ్జిన్లు తీసుకుని తిరిగి ధర్మపురికి చేరుకున్నట్లు వెల్లడించారు. ఈనెల 3న ధర్మపురి నుంచి వచ్చి జ్యువెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడి, నలుగురు సిబ్బందిని కాల్చి ముందుగానే రెక్కి చూసి మెయిన్ రోడ్లపై కాకుండా గ్రామాల్లోని కాలువలు, చిన్న రోడ్ల ద్వారా ధర్మపురి చేసుకున్నారు. ధర్మపురి వద్ద పల్సర్‌ను వదిలేసి, ముగ్గురు దొంగలు కాలినడకన గోదావరినది దాటి మంచిర్యాల వద్ద రైలెక్కి పారిపోయారు. అపాచీ మీదున్న ఇద్దరు దొంగలు ఆభరణాలతో అడవి మార్గంలో వెళ్లి క్రెటా కారులో వచ్చిన వ్యక్తులకు నగల బ్యాగ్ అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. కీలక నిందితులైన గ్యాంగ్ లీడర్ సుభోద్సింగ్తోపాటు రాధేమిశ్రా అలియాస్ అభయ్, సూర్యమణికుమార్ అలియాస్ సనోజ్, మిశ్రా తదితరులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. జ్యువెల్లరీ షాపులు, బ్యాంకులు, లాడ్జీ యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నాణ్యమైన పానిక్ బటన్లు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఐపీఎస్ అధికారి సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్‌కుమార్‌తోపాటు పలువురు సీఐలు పాల్గొన్నారు. ‘గోల్డెన్ థీఫ్’ ప్రత్యేకతలు కేసు వివరాలు -
భద్రత చర్యలు తీసుకోవాలి
సిరిసిల్ల: బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు. సిరిసిల్ల సబ్‌డివిజన్ పరిధిలోని బ్యాంకు అధికారులతో గురువారం సమావేశమయ్యారు. ప్రతీ బ్యాంకు, ఏటీఎం కేంద్రంలో సెక్యూరిటీ గార్డు, సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. దోపిడీలు, అనుమానాస్పద ఘటనల సమయంలో సిబ్బంది ఎలా స్పందించాలనే అంశంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. బ్యాంకు ప్రవేశద్వారాల వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, గార్డులకు హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏటీఎంలలో నగదు నింపే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బందిని అప్రమత్తం చేస్తామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇరుక్కుపోతున్నారు!
సిరిసిల్ల: జిల్లాలోని పలు ఆస్పత్రులు.. షాపింగ్‌మా ల్స్.. అపార్ట్మెంట్లలో లిఫ్ట్‌ల నిర్వహణ సరిగా లేదు. సామాన్యులు ఏదో ఒక చోట ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఒక పోలీసాఫీసర్ గతంలో లిఫ్ట్‌లో నుంచి కిందపడి మరణించిన ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. రెండు రోజుల క్రితం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రయాణించే లిఫ్ట్ ప్రమాదానికి గురైన సంఘటన మళ్లీ లిఫ్ట్‌ల నిర్వహణ, భద్రతపై చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని లిఫ్ట్‌లపై ప్రత్యేక కథనం. నిబంధనలకు తూట్లు భవన నిర్మాణ సమయంలో లిఫ్ట్ ఏర్పాటుకు అవసరమైన నిర్మాణాలు చేయాల్సి ఉండగా.. నిర్మాణ దారులు పట్టించుకోవడం లేదు. గాలి, వెలుతురు ఉండేలాప్రత్యేక స్థలాన్ని విడిచిపెట్టకుండా ఇరుకుగా నిర్మిస్తున్నారు. భవన నిర్మాణ సమయంలో నిబంధనలు పాటించకుండా.. పనులు పూర్తి చేసి ఆ తరువాత లిఫ్ట్‌లు పెట్టడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. బ్రాండెడ్ కంపెనీల లిఫ్ట్‌లు కాకుండా.. సిద్దిపేటకు చెందిన అసెంబుల్డ్ లిఫ్ట్‌లను నిర్మాణదారులు బిగిస్తుండడంతో తక్కువ ఖరీదుకే పూర్తవుతున్నాయి. ఆ లిఫ్ట్‌లకు వినియోగించే మోటారు, తాడు, చక్రం, ఇతర సామగ్రి నాణ్యతలో తేడా ఉండడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిర్వహణ లోపాలు లిఫ్ట్ ఏర్పాటు చేసుకున్న భవన యజమానులు ఏటా నిర్వహణపరమైన మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఏటా లిఫ్ట్ కంపెనీ ప్రతినిధులు వచ్చి దాని పనితీరును పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేసి యాన్యువల్ మెయింటనెన్స్ సర్టిఫికెట్ (ఏఎంసీ) ఇవ్వాలి. కానీ చాలా ఆస్పత్రుల నిర్వాహకులు, భవన నిర్మాణదారులు ఏఎంసీ చేయించడం లేదు. దీంతో లిఫ్ట్ నిర్వహణ లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ వంటి ప్రాంతాలతోపాటు ఖరీదైన బ హుళ అంతస్తుల భవనాలు నిర్మించే వారు లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కానీ దాని నిర్వహణను ప ట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతుంది. జిల్లా వ్యాప్తంగా 150కి పైగా లిఫ్ట్‌లు ఉన్నా యి. ఇందులో కొన్ని ప్రముఖ కంపెనీలవి ఉండగా.. చాలా వరకు స్థానికంగా త యారు చేసిన అ సెంబుల్డ్ లిఫ్ట్‌లు ఉండడం గమనార్హం. పట్టించుకోని అధికారులు జిల్లాలో క్షేత్రస్థాయిలో లిఫ్ట్‌ల నిర్వహణను పర్యవేక్షించాల్సిన మున్సిపల్, గ్రామపంచాయతీల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజల ప్రాణాల రక్షణ గాలిలో దీపంలా మారింది. ఏటా నిర్వహించే లిఫ్ట్‌ల నిర్వహణను పర్యవేక్షిస్తూ.. ప్రత్యేకంగా ఓ వ్యక్తిని లిఫ్ట్‌ల వద్ద నియమించేలా నిబంధనలు అమలు చేస్తే.. ప్రమాదాలను కొంత మేరకై నా నివారించినట్లు అవుతుంది. ఇప్పటికై నా జిల్లా అధికారులు లిఫ్ట్‌ల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సిరిసిల్ల పట్టణంలోని ఓ అపార్టుమెంట్‌లోని లిఫ్ట్‌లో నలుగురు ప్రయాణిస్తుండగా.. అకస్మాత్తుగా కరెంట్ పోయింది. ఆ లిఫ్ట్‌కు బ్యాకప్ బ్యాటరీ సిస్టమ్ లేకపోవడం, జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో లిఫ్ట్‌లో ఉన్న నలుగురు అరగంట పాటు అందులోనే నరకయాతన అనుభవించారు. చివరికి కరెంట్ వచ్చిన తరువాత హమ్మయ్య అంటూ.. ఊపిరి తీసుకున్నారు. -
పొద్దుతిరుగుడు కొనండి
● ఇల్లంతకుంటలో రైతుల ధర్నా ఇల్లంతకుంట(మానకొండూర్): మండల వ్యవసాయ మార్కెట్‌కు పొద్దుతిరుగుడు తెచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనడం లేదంటూ రైతులు గురువారం మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. మండలంలోని పత్తికుంటపల్లి, ఆరెపల్లి, గాలిపల్లి, కేసన్నపల్లి, ముస్కానిపేట, తాళ్లపల్లి గ్రామాలకు చెందిన 300 మంది రైతులు ఇల్లంతకుంట బిక్కవాగు బ్రిడ్జి వద్ద రెండు గంటలపాటు బైఠాయించారు. అనంతరం ర్యాలీగా మండల కేంద్రంలోని వివేకానందచౌరస్తా వద్దకు వచ్చి ధర్నాకు దిగి, వంటావార్పు చేపట్టారు. 2300 క్వింటాళ్లు మాత్రమే కొని మిగతావి కొనకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట వేసినప్పుడు వ్యవసాయాధికారులు సర్వే చేశారని, దాని ప్రకారం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్క్పెడ్ డీఎం అబీబ్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే కొంటామని, మూడు రోజులు ఓపిక పట్టాలని కోరారు. తహసీల్దార్ సురేష్, ఎస్సై అశోక్ రైతులతో మాట్లాడి నచ్చజెప్పారు. రైతులకు సంఘీభావంగా మాజీ జెడ్పీటీసీ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కరికె నవీన్‌కుమార్, మామిడి హరీశ్ పాల్గొన్నారు. -
దొంగతనాల నివారణకు చర్యలు తీసుకోవాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే కోనరావుపేట(వేములవాడ): గ్రామాల్లో దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలన్నారు. తరచూ గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్‌నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం ధర్మారంలోని కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడారు. కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఎదురైనా స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. చందుర్తి సీఐ రవీందర్, కోనరావుపేట ఎస్సై ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు. పశువుల అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వండి పశువుల అక్రమ రవాణా నేరమని దానికి సంబంధించిన సమాచారాన్ని పోలీస్‌శాఖకు అందించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో హిందూ సంఘాల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో హెల్ప్‌లైన్ 87125 37826ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ నోడల్ అధికారి 87126 56410లో సమాచారం ఇవ్వాలని సూచించారు. సీజ్ చేసిన పశువుల కోసం జిల్లాలో 9 ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐ రవి, ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ జయకేతనం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ సీబీఎస్ఈ సీనియర్ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థులు బుధవారం ప్రకటించిన 12వ తరగతి ఫలితాల్లో అత్యున్నత మార్కులతో జయకేతనం ఎగురవేసినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఏడుగురు విద్యార్థులు 460పైగా, 47 మంది విద్యార్థులు 400 మార్కులు పైగా సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పీసీఎం విభాగంలో వి.శ్రేయాస్‌రెడ్డి 475 మార్కులతో పాఠశాల టాపర్‌గా నిలవగా, జి.చైత్ర 471 మార్కులు, ఎన్.రత్నప్రకాశ్ 469, బి.లిఖిత్ సాయి 461, ఐశ్వర్య 458, హర్షఫ్ అర్మాన్ 456, వి.సాయి హర్షిత్ 456, బి.రోహిత్, ఎన్.కావ్య, జె.సరయు 450 మార్కులు సాధించారన్నారు. అదేవిధంగా పీసీబీ విభాగంలో డి.రుత్విక్ 476 మార్కులతో పాఠశాల టాపర్‌గా, పి.శృత్విక 472, డి.శ్రేయన్ష్ 462 సాధించగా మిగిలిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు వివరించారు. అధ్యాపకుల నిరంతర కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. -
కాలుష్య వైపరీత్యం
ప్రకృతిలో ఎన్నో మార్పులు చేర్పులు వనరులను నాశనంచేసే రసాయనాలు పట్టణంలో కలదు కాలుష్యం పరిశ్రమలు ఉత్పత్తి చేసే ప్లాస్టిక్ ఎక్కడ చూసినా కాలుష్యమయం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పరిశ్రమలు ప్రకృతిని నాశనం చేసే ఎక్కడ చూసినా కాలుష్యం నీరు తాగుదామన్న చెడు రసాయనాలు మురికి నీళ్లు తాగి మురికి తిండి తిని మానవులు రోగాల బారిన పడుతున్నారు. కెమికల్ ఉన్న ఆహారం తిని మానవులు ఆయుష్షు తగ్గిపోతుంది ఎవరిని చూసినా బీపీ, షుగర్లు ఎవరిని చూసినా ఊపిరితిత్తుల సమస్యలు ఎవరిని చూసినా కిడ్నీ సమస్యలు నియంత్రించాలి ఈ వైపరీత్యం తగ్గించాలి ఈ వైపరీత్యం పెంచాలి మానవ వనరులు తగ్గించాలి ఈ వైపరీత్యం అరికట్టాలి ఈ రసాయనాలు నియంత్రించాలి ఈ వైపరీత్యం పేరు: కుమ్మరికుంట ఆరాధ్య తరగతి: 6వ తరగతి పాఠశాల: పీఎంశ్రీ మోడల్ స్కూల్ ఊరు: గోదావరిఖని జిల్లా: పెద్దపల్లి ఎన్.శ్రీకర్ గ్రామం: ఊటూరు మండలం: మానకొండూర్ జిల్లా: కరీంనగర్ -
డాక్టర్.. నిఖిత
● మల్యాల మండలంలో మొదటి దళిత డాక్టర్ ● నిఖిత వైద్య విద్యకు ‘సాక్షి’ దాతల తోడ్పాటుమల్యాల: నిరుపేద దళిత కుటుంబం నుంచి డాక్టర్ స్థాయికి ఎదిగారు మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన బెక్కం నిఖిత. ప్రభుత్వ పాఠశాలలో చదివి.. ఎంబీబీఎస్ సీటు సాధించారు. బెక్కం గంగయ్య, పద్మ ఏకై క కూతురు నిఖిత సిరిసిల్లలోని బోనాల రెసిడెన్షియల్లో పదో తరగతి వరకు చదివారు. హైదరాబాద్ గౌలిదొడ్డి రెసిడెన్షియల్లో ఇంటర్ పూర్తి చేసి.. నీట్లో ర్యాంకుతో ఎంబీబీఎస్‌లో సీటు సాధించారు. అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ‘సాక్షి’ 2020 డిసెంబర్ 10న ‘సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం కరువు’ శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన దాతలు ఎంబీబీఎస్ విద్యకు తోడ్పాటు అందించారు. నిఖిత విజయవంతంగా ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్ పట్టా అందుకున్నారు. తమ కూతురు డాక్టర్ కావడం ఎంతో గర్వంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తన కల సాకారం చేసుకునేందుకు తోడ్పాటునందించిన అందరికీ నిఖిత కృతజ్ఞతలు తెలిపారు. -
కారు, బైక్ ఢీ
● ఒకరు మృతి.. 8 మందికి గాయాలు సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని మొదటి బైపాస్ రోడ్డులో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన గోక సదానందం, అతని భార్య వినోద, కూరపాటి విజయ, కూరపాటి శ్రీకాంత్, కూరపాటి రాజేంద్రపాద్ కారులో మూడు రోజుల క్రితం హుస్నాబాద్‌లో బంధువుల పెళ్లికి వెళ్లారు. బుధవారం సిరిసిల్లకు తిరిగి వస్తుండగా మొదటి బైపాస్‌రోడ్డులో కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేములవాడ రూరల్ మండలం అచ్చయ్యపల్లెకి చెందిన వేణు అతని భార్య హర్షిత, పిల్లలు సౌర్యనందన్, అనుశ్రీ గాయపడ్డారు. అదే వేగంతో కారు ముందుకు వెళ్లి చెట్టును ఢీకొట్టగా అందులో ఉన్న శ్రీకాంత్, రాజేంద్రసాద్ కాళ్లు విరిగిపోయాయి. విజయ తలకు తీవ్రగాయాలు కాగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది. -
దూసుకొచ్చిన స్కార్పియో
● మహిళ మృతి.. మరో ఇద్దరికి గాయాలుగంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజేశ్వర్‌రావునగర్ బస్టాండ్ వద్ద బుధవారం బస్సు కోసం ఎదురుచూస్తున్న ముగ్గురిపైకి స్కార్పియో వాహనం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు. రాజేశ్వర్‌రావునగర్ బస్టాండ్ వద్ద అదే గ్రామానికి చెందిన చల్ల లక్ష్మి, బోయిని రజిత, యశ్వంత్ సిరిసిల్లకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో కామారెడ్డి వైపు వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చల్ల లక్ష్మి(35) అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడ్డ బోయిని రజిత, యశ్వంత్‌లను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. చల్ల లక్ష్మి భార్యభర్తలు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఇంటికి పెద్ద దిక్కు అయిన లక్ష్మి మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ప్రమాదానికి కారణమైన కారు మహారాష్ట్రకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. -
బ్లడ్ కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు
కరీంనగర్: బ్లడ్ కేన్సర్ చికిత్స రంగంలో ఆధునిక సాంకేతికత, అత్యాధునిక వైద్య పద్ధతులతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం బ్లడ్ కేన్సర్ చికిత్స మరింత సమర్థవంతంగా మారిందన్నారు. బ్లడ్ కేన్సర్ చికిత్సలో ప్రస్తుతం టార్గెటెడ్ మెడిసిన్స్, ఇమ్యూనో థెరపీ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ చికిత్సల వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా కేవలం కేన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చికిత్స అందించడం సాధ్యమవుతోందన్నారు. గతంలో అందుబాటులో లేని పలు అధునాతన చికిత్సలు ఇప్పుడు భారతదేశంలో కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుండటం వైద్య రంగంలో సానుకూల పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది శ్రీకాంత్, మహేందర్ పాల్గొన్నారు. -
అమ్మాయిలు.. నాంచాక్
● ఆత్మరక్షణ విద్యలో అమ్మాయిలు అదుర్స్ ● కర్ర, నాంచాక్లో శిక్షణ ● ధైర్యసాహసాల విద్యపై ఆసక్తివేములవాడ: అమ్మాయిలే కదా.. అని అనుకోవద్దంటున్నారు ఈ చిచ్చరపిడుగులు. వారు కర్రసాము చేస్తే ఎదురుగా ఎవరూ ఉన్న బేజార్ కావాల్సిందే. వారు నాంచాక్ పడితే ఎంతటి వారైనా జీ హుజూర్ అనాల్సిందే. ఇదంతా వేములవాడ మున్సిపల్ పార్క్‌లో నిత్యం ఉదయం కనిపించే బాలికల గురించే. వారు కొన్నాళ్లుగా కోచ్ ఎంఏ మన్నాన్ సమక్షంలో కర్ర, నాంచక్ వంటి ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో అమ్మాయిలు ఆత్మరక్షణకు యుద్ధ విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. ఈక్రమంలోనే బాలికలు ధైర్యసాహసాలు ప్రదర్శించే విద్యలో శిక్షణ తీసుకుంటున్నారు. నాంచాక్ నైపుణ్యానికి మరో పేరు కరాటే విద్యలో భాగంగా వినియోగించే శస్త్రాయుధాలలో నాంచాక్కు ప్రత్యేక స్థానం. రెండు చిన్న ఐరన్ పైపులకు మధ్యలో గొలుసుతో కలిపి ఉంటుంది. చూసేందుకు సాధారణంగా కనిపించినా నిపుణుల చేతిలో పడితే శత్రువులకు భయంకర పరిస్థితులు ఎదురవుతాయి. దాడిచేయడం, ఆత్మరక్షణకు నాంచాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నాంచాక్ను సాధనతో శరీర నియంత్రణ, వేగం, స మతుల్యత పెరుగుతాయి. ఇది కేవలం దెబ్బ కొట్టే ఆయుధమే కాదు, ఒక నృత్యకళా రూపంగా కూడా చెప్పుకుంటారు. పోటీలు, ప్రదర్శనలు, ఆత్మరక్షణలో తమకు కొత్త శక్తిని అందిపుచ్చుకుంటున్నారు. -
బన్నీ వేసవి యాత్ర–6
రాత్రి 8 అయ్యింది. బస్ ఆగింది. బన్నీ దిగాడు. ఎదురుగా ఒక పెద్ద ఇల్లు. మట్టి గోడలు. గూనపెంకుల ఇల్లు. ముందు అరుగు. అరుగు మీద తాతయ్య. పక్కన నానమ్మ. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ... నవ్వుతున్నారు. ‘రా కన్నయ్య‘ అంది నానమ్మ. బన్నీని దగ్గరకు తీసుకుంది. తల నిమిరింది. తాతయ్య చెయ్యి పట్టుకున్నాడు. ‘ఇది నీ ఇల్లు రా బన్నీ‘ అన్నాడు. ఇంట్లో నుంచి పిల్లలు వచ్చారు. చాలా మంది. ముగ్గురు అత్తయ్యలు, మామయ్యలు. బాబాయ్, పిన్ని మరియు ఆరుగురు పిల్లలు. చుక్క, స్వప్న, రామ్ కూడా ఉన్నారు. ‘హాయ్ బన్నీ!‘ అన్నారు. బన్నీ ఆశ్చర్యపోయాడు. మేము కూడా వచ్చాము అన్నారు. అందరూ నవ్వుకున్నారు. నానమ్మ ఒక పళ్లెం తెచ్చింది. పళ్లెంలో గారెలు. బెల్లం గారెలు. ‘తినరా‘ అంది. బన్నీ ఒక గారె తిన్నాడు. తియ్యగా ఉంది. వేడిగా ఉంది. అమ్మ చేసినట్టే ఉంది. తాతయ్య అన్నాడు, ‘బన్నీ, ఇక్కడ అందరం ఒకే ఇంట్లో ఉంటాం. అందరం కలిసి తింటాం. కలిసి నవ్వుతాం. ఇది మన ఉమ్మడి కుటుంబం.‘ బన్నీ చుట్టూ చూశాడు. అందరి మొహాల్లో నవ్వు. బన్నీకి కూడా నవ్వు వచ్చింది. భయం పోయింది. పిల్లలకి మాట: ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు. ప్రేమతో ఉన్న మనుషులు.డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా గోంగూర పాపహలో పిల్లలూ! గోంగూరతో పప్పు వండుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. కానీ.. అమ్మాయిని తయారు చేయవచ్చా? చేయవచ్చు! చూడండి. ఈ గోంగూరమ్మాయి బాగుందా? నేను మా కుండిలో గోంగూర చెట్టును పెట్టుకున్నాను. అందుకే ఈ గోంగూరను తేత ఆకుల్ని తీసుకున్నాను. దీని ని ’రెడ్ సోరెల్’ అని పిలుస్తారు. ఇది పుల్లగా ఉంటుంది. పోషకాలున్న ఆకుకూర. ఇందులో ఐరన్, విటమినే ’ఎ’ ఉంటుంది. యాంటి ఆక్సిడెంట్లు కూ డా ఉంటాయి. గోంగూరలో ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని రెండు రకాలుంటాయి. రక్తహీనతను నివారిస్తుంది. రోగ నిరోధక శక్తినే పెంపొందిస్తుంది. -
ఒంటరితనం భరించలేక వృద్ధుడి ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): వృద్ధాప్యం.. అనారోగ్యం..ఒంటరితనం భరించలేని ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన సోల నర్సయ్య(80) భార్య నలభై ఏళ్ల క్రితం విడాకులు తీసుకుని విడిపోయింది. అప్పటి నుంచి నర్సయ్య ఒంటరిగా ఉంటున్నాడు. గుడిసెలో దుర్భర జీవితం గడుపుతున్న నర్సయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఒంటరి జీవితం ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి మృతిగోదావరిఖనిటౌన్: కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వస్తున్న కరీంనగర్–2 డిపో బస్సులో మహారాష్ట్ర సిరొంచకు చెందిన అబ్ధుల్ రజాక్ కరీంనగర్లో గోదావరిఖనికి టికెట్ తీసుకున్నాడు. స్టాఫ్ వద్ద దిగకపోవడంతో కండక్టర్ గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇతడు మార్గమధ్యలో చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. గంగాధర: మండలంలోని మప్పిడినర్సింహులపల్లి జీపీ పరిధి పెండలోనిపల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ముత్యాల హేమలత ఈ నెల 11న ఇంటికి తాళం వేసిన బంధువుల దగ్గరికి వెళ్లిది. బుధవారం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని ముప్పై తులాల వెండి, ఐదు గ్రాముల బంగారం, రూ.ఏడువేలు దొంగలు ఎత్తుకెళ్లారని, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. బాల్య వివాహం అడ్డగింతపెగడపల్లి: మండలంలోని మద్దులపల్లిలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన బాలికకు అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. విషయం తెలుసుకున్న ఆర్ఐ జమున, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ శ్రావణ్, బాలల పరిరక్షణ సమితి ఔట్రిచ్ శ్రీవాణి, అంగన్వాడీ టీచర్లు శోభ, శైలజా, పోలీసు సిబ్బంది శ్రీకాంత్, చంద్రశేఖర్ గ్రామానికి వెళ్లారు. ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ, పదో తరగతి సర్టిఫికెట్లను పరిశీలించారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నతనంలో వివాహం చేస్తే అనర్థాలు జరుగుతాయన్నారు. 18 ఏళ్లు దాటే వరకూ వివాహం చేయబోమని తల్లిదండ్రులు అంగీకార పత్రం రాయించి ఇవ్వడంతో అధికారులు వెళ్లిపోయారు. రేబిస్‌తో చిన్నారి మృతికోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన బాలులు రేబిస్‌తో బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన లోకుర్తి రాజు–మమతల కొడుకు లోకుర్తి నిశాంత్(11) ఇటీవల 5వ తరగతి పూర్తి చేసుకుని వేసవి సెలవుల్లో సరదాగా గడుపుతున్నాడు. ఏప్రిల్ 23న గ్రామంలో ఓ పిచ్చికుక్క కరవడంతో తలకు, తొంటి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి వ్యాక్సిన్లు ఇప్పించారు. వారం రోజుల తర్వాత తీవ్ర జ్వరం రావడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. రేబిస్‌తో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు నిర్ధారించిన వైద్యులు హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించారు. వారం రోజులుగా నిశాంత్ హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
విద్యుత్లైన్లను సరిచేయాలి
● ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ సిరిసిల్ల: జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను సరిచేయాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్) టి.మధుసూదన్ కోరారు. సిరిసిల్ల విద్యుత్ సర్కిల్ ఆఫీస్‌లో బుధవారం అధికారులతో సమీక్షించారు. మధుసూదన్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న కొత్త విద్యుత్ లైన్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, వినియోగదారులకు కొత్త విద్యుత్ సర్వీసెస్ రిలీజింగ్ చేయాలన్నారు. విద్యుత్ పంపిణీలో లోపాలు గుర్తించి, సవరించాలన్నారు. వరంగల్ జోనల్ సీఈ బుస్సా అశోక్, జిల్లా సర్కిల్ ఎస్ఈ టి.వేణుమాధవ్, డీఈఈలు ఎన్.అంజయ్య, వెంకటరమణ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు చేయండిఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ మండలంలోని పొత్తూరులో రైతులు బుధవారం రోడ్డుపై బైఠాయించారు. తహసీల్దార్ సురేష్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రోజుకు నాలుగు లారీలు పంపిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. పట్నం శ్రీనివాస్, ఉపసర్పంచ్ బండారి నరేశ్, రైతులు తోడేటి సతీశ్, బండారి మౌనిక, మమత, నవీన్‌కుమార్, దయ్యాల చంద్రమౌళి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
విచారణకు ‘బండి’ సహకరించాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ముస్తాబాద్(సిరిసిల్ల): చట్టం తన పని తాను చేసుకుని పోతుందని.. బండి సంజయ్‌కి చట్టంపై నమ్మకం ఉంటే విచారణకు సహకరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. ముస్తాబాద్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. బండి సంజయ్ కుమారుడి వ్యవహారంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ వాస్తవాలు చెప్పి చట్టానికి సహకరించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా క్లియర్‌గా విచారణ జరగాలన్నారని స్పష్టం చేశారు. భావోద్వేగంతో సెంటిమెంట్‌ను రంగరించేలా ప్రసంగాలు చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే నీట్ రద్దు బీజేపీ ప్రభుత్వ వైఫల్యంతోనే నీట్ రద్దయ్యిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. మూడు సార్లు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 పేపర్ కూడా లీకై ందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రూప్1, 2లను విజయవంతంగా నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, పార్లమెంట్ కోకన్వీనర్ కనమేని చక్రధర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు గజ్జెల రాజు, కొండం రాజిరెడ్డి, రాంరెడ్డి, గజ్జెల రాజు, గుండెల్లి శ్రీను, రాజేశం, ఆంజనేయులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం వేములవాడఅర్బన్/చందుర్తి: వేములవాడతోపాటు మండలంలోని చీర్లవంచ, గుర్రంవానిపల్లి, చందుర్తి మండలం ఎన్గల్ గ్రామాల్లో బుధవా రం నిర్వహించిన ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించారు. గుర్రంవానిపల్లిలో బస్‌షెల్టర్ ప్రారంభించారు. చందుర్తి మండలం ఎన్గల్ నుంచి మేడిపెల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో కనిపించిన ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్లను ఆపి వారితో మాట్లాడారు. ఏ మిల్లుకు తరలిస్తున్నారో తెలుసుకొని సదరు మిల్లు యజమానితో మాట్లాడి త్వరగా అన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పాఠశాలలు సమాజానికి బలమైన పునాదులు పాఠశాలలు సమాజానికి బలమైన పునాదులు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లిలో బుధవారం నియోజకవర్గస్థాయి సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్లకు వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డీఈవో జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, కౌన్సిలర్లు కాశ శ్రీనివాస్, వాసాల లావణ్య పాల్గొన్నారు. -
రాజన్న సిరిసిల్ల
గరిష్టం/కనిష్టం41.0 /29.0గురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 20267వేములవాడఅర్బన్: జిల్లాలోని ఏడు కేంద్రాల్లో బుధవారం పాలిసెట్ ప్రశాంతంగా జరిగింది. 2,125 మందికి 2,019 మంది హాజరైనట్లు జిల్లా కో–ఆర్డినేటర్ ప్రభాకారచారి తెలిపారు.వేములవాడ: భీమన్నను బుధవారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, కోడె మొక్కులు చెల్లించుకున్నారు.ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. వేడిగాలులు వీస్తాయి. -
సైడ్.. సైడ్ ప్లీజ్ !
చందుర్తి(వేములవాడ): సైడ్.. సైడ్ ప్లీజ్..! అంటూ లారీ డ్రైవర్లు వేములవాడ–కోరుట్ల ప్రధాన రహదారిపై భయం.. భయంగా నడుపుతున్నారు. చందుర్తి మండలం లింగంపేట నుంచి మండల కేంద్రం వరకు ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరువైపులా చెట్లకొమ్మలు అల్లుకుపోయాయి. ధాన్యం బస్తాల లోడ్‌తో వెళ్తున్న లారీలకు ఆ చెట్లకొమ్మలు తాకుతుండడంతో బస్తాలు చినిగిపోతున్నాయని డ్రైవర్లు తెలిపారు. ఇలాగే ధాన్యం కిందపోయి రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో ఈ రెండు గ్రామాల మధ్య లారీలను కుడివైపు నుంచి తీసుకెళ్తున్నారు. ఈక్రమంలో ఎదురుగా వచ్చే వాహనదారులు అప్రమత్తం కావాలని హారన్ కొడుతుంటారు. రోడ్డుపై లోడ్ లారీలకు తాకేలా ఉన్న చెట్లకొమ్మలను తొలగించాలని రైతులు, వాహనదారులు కోరుతున్నారు. -
అన్నదాత అరిగోస
రహీంఖాన్‌పేట గోదాం వద్ద అన్లోడింగ్ కోసం వేచి ఉన్న ట్రాక్టర్లు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యంచందుర్తి(వేములవవాడ): మద్దతు ధర దక్కుతుందనే ఆశతో రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ తూకం వేయకపోవడంతో రోజులకొద్దీ ఎదురుచూస్తున్నారు. ఒక్కో రైతు 50 రోజులు గడుస్తున్నా తమ ధాన్యం తూకం వేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల టన్నుల ధాన్యం సేకరించునున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు సగం కూడా సేకరించలేదు. లారీల కొరతతో కేంద్రాలకు రెండు, మూడు రోజులకో లారీ తరలిస్తున్నారు. ధాన్యాన్ని ముందస్తుగా కాంటాలు వేస్తే బరువు తగ్గి కోత విధిస్తుండడంతో నిర్వాహకులు కాంటాలు పెట్టలేకపోతున్నారు. అధికంగా ధాన్యం తూకం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టి నాలుగు రోజులు గడిచిన తర్వాత మిల్లులకు తరలిస్తున్నారు. అయితే ఎండల తీవ్రతకు బస్తాల్లోని ధాన్యం బరువు తగ్గుతుండడంతో తమకు నష్టం వస్తుందని మిల్లర్లు ధాన్యం దింపుకోవడం లేదు. దీంతో బస్తాకు 41.600 కిలోలకు బదులు 42.600 కిలోలు తూకం వేస్తున్నారు. వానాకాలం సాగుకు పెట్టుబడి కరువు యాసంగి పంట అమ్ముడుపోకపోగా.. వానాకాలం సాగుకు రోజులు దగ్గరపడుతున్నాయి. ఈక్రమంలో ధాన్యం అమ్ముడుపోక పంటల సాగు పెట్టుబడికి దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. రైతుభరోసా అందించినా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే దుస్థితి ఉండేది కాదని అన్నదాతలు వాపోతున్నారు. వర్షాలు పడితే ధాన్యం మొలకెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు. గత వానాకాలంలో చందుర్తి మండలం రామన్నపేట, తిమ్మాపూర్, నర్సింగపూర్, చందుర్తి, మల్యాల గ్రామాల్లో ధాన్యం మొలకెత్తి రైతులు ఇబ్బంది పడ్డారు.ఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యంతో వచ్చిన లారీలు, ట్రాక్టర్లు రోజులకొద్దీ గోదాంలు, మిల్లుల్లోనే ఎదురుచూస్తున్నాయి. హమాలీలు లేక ధాన్యం దింపడం ఇబ్బందిగా మారింది. ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి, చింతలకుంటపల్లి, రహీంఖాన్‌పేట గోదాంలకు మండలంలోని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలిస్తున్నారు. రహీంఖాన్‌పేట గోదాం వద్ద బుధవారం 60కి పైగా ట్రాక్టర్లు, 3 డీసీఎం వాహనాల వడ్ల బస్తాలతో వచ్చి ఉన్నాయి. రెండు రోజులుగా అక్కడే ఉంటున్నాయి. బుధవారం ఉదయం తహసీల్దార్ సురేశ్, ఏఎంసీ వైస్‌చైర్మన్ ఎలగందుల ప్రసాద్, రహీంఖాన్‌పేట గోదాం వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. గోదాం వద్ద హమాలీలు ఎవరూ లేకపోవడంతో జిల్లా అధికారులతో మాట్లాడి బుధవారం మధ్యాహ్నం వరకు రప్పించారు. గోదాంల వద్ద ఎలాంటి వసతులు లేకపోవడంతో పర్మినెంట్‌గా హమాలీలు ఉండడం లేదు. అంతేకాకుండా రహీంఖాన్‌పేట గోదాం వద్ద వే బ్రిడ్జి లేకపోవడంతో ధాన్యం లోడింగ్‌తో వెళ్లిన ట్రాక్టర్ యజమానులు ప్రైవేట్ మిల్లు వద్ద తూకం వేయిస్తున్నారు. వే బ్రిడ్జి రూ.100 వసూలు చేస్తున్నారని ఓ రైతు తెలిపారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరగా వే బ్రిడ్జి రుసుం వసూలు చేయొద్దని ప్రైవేట్ మిల్లు వారికి చెప్పినట్టు తెలిపారు. -
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్ ఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని కిష్టరావుపల్లి, కందికట్కూర్, వల్లంపట్ల కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. లారీల కొరత ఉన్నచోట ట్రాక్టర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. ఏపీఎం కుమారస్వామి, సీసీ రాజేశ్వరి, మండల సమాఖ్య అధ్యక్షురాలు కట్ట సౌమ్య పాల్గొన్నారు. సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: పాఠశాలల అభివృద్ధిలో, బడీడు పిల్లలను స్కూల్లో చేర్పించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా విద్యాధికారి డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి కోరారు. సిరిసిల్ల నియోజకవర్గస్థాయి విద్యావారోత్సవాలు బుధవారం స్థానిక లహరి గ్రాండ్లో నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ రానున్న విద్యాసంవత్సరంలో ప్రతీ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు, అల్పాహారంలో మూడు రోజులు పాలు, మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అమలు చేయనున్నట్లు తెలిపారు. పదోతరగతి ఫలితాల్లో 96 శాతం విద్యార్థులు పాసయ్యారని, 250కి పైగా 550 పైగా మార్కులు సాధించారని తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో సీ.హెచ్.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, ఏఎంసీ చైర్పర్సన్లు వెలుముల స్వరూపారెడ్డి, గౌస్ బేగం, జీసీడీవో పద్మజ, ఎంఈవోలు దూస రఘుపతి, కృష్ణహరి, రాజిరెడ్డి, రాజు, గంగారం పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న లోపాయికారీ విధానాలతోనే నీట్ పేపర్ లీకై ందని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆరోపించారు. నీట్‌పేపర్ రద్దు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం చేనేతన్న చౌక్‌లో ధర్నా చేపట్టారు. మట్టి శ్రీనివాస్, అరెల్లి వినయ్‌కుమార్, సదుల శేఖర్, ఎండీ అజ్జు, బల్యాల ప్రవీణ్, బైకని వేణుగోపాల్, లింగంపల్లి అబ్బి, పవన్, లక్ష్మణ్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్‌లో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధిస్తూ బుధవారం పాలకవర్గం తీర్మానించింది. ఎవరైనా నిషేధాన్ని ఉల్లంఘిస్తే జరిమానాలు విధించనున్నట్లు హెచ్చరించారు. గ్రామంలో జరిగే శుభకార్యాలకు గ్రామపంచాయతీ తరఫున స్టీల్‌ప్లేట్లు, గ్లాస్‌లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, ఉపసర్పంచ్ కొండాపురం వెంకటరెడ్డి, కార్యదర్శి సంతోష్, వార్డుసభ్యులు పాల్గొన్నారు. గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పేర్కొన్నారు. కళాశాలలో బుధవారం కాలేజీ ప్లానింగ్ డెవలప్మెంట్ కమిటీ, పూర్వ విద్యార్థుల కమిటీ సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఉపసర్పంచ్ కమలాకర్‌రెడ్డి, ప్రిన్సి పాల్ విజయలక్ష్మి, సైకలాజిస్టు ప్రవీణ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ పాల్గొన్నారు. -
పిల్లలు లేని వారికి దత్తత వరం
ఎల్లమ్మ పట్నం● కలెక్టర్ గరీమా అగ్రవాల్ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వెల్జీపురంలో ఎల్లమ్మ సిద్ధోగం బుధవారం నిర్వహించారు. మూడు రోజులుగా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలు పెద్దపట్నంతో ముగిశాయి.సిరిసిల్ల: పిల్లలు లేని వారికి దత్తత వరమని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో బుధవారం ఇద్దరు చిన్నారులను దత్తతకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలను చక్కగా చూసుకోవాలని చెప్పారు. ఎవరైనా చట్టబద్ధంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ద్వారా మాత్రమే ఆన్లైన్లో పిల్లలను దత్తతకు ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇతర అక్రమ మార్గాలలో చేసుకుంటే ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా ఉంటుందని హెచ్చరించారు. పిల్లలను పెంచే స్థోమత లేనటువంటి తల్లితండ్రులు తమ పిల్లల్ని దత్తత కోసం అప్పగించవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. పిల్లలను నిర్లక్ష్యం చేసినా, వదిలివేయడానికి ప్రోత్సహించిన వారికి కూడా చట్ట ప్రకారం జైలు, జరిమానా ఉంటుందని హెచ్చరించారు. ఎవరికై నా పిల్లలు పెంచే శక్తి లేనట్లయితే, అవాంచిత గర్భమైనప్పుడు వద్దు అనుకుంటే పిల్లలను ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రాలకు అప్పగించాలన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా బాలల ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్ఐసీ ఎం.గగన్‌కుమార్ పాల్గొన్నారు. ధాన్యానికి అనుగుణంగా లారీలు పెంచాలి కోనరావుపేట(వేములవాడ): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి అనుగుణంగా లారీల సంఖ్యను పెంచాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు. మండలంలోని మర్తనపేట, నాగారం గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. కొనుగోలుకు సంబంధించిన రిజిస్టర్లు తనిఖీ చేశారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ వరలక్ష్మి పాల్గొన్నారు. -
సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు
● పశువుల అక్రమ రవాణాపై నిఘా ● ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల/తంగళ్లపల్లి: జిల్లా సరిహద్దుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద బుధవారం రాత్రి చెక్‌పోస్టును ఎస్పీ మహేశ్ బీ గీతే, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తనిఖీ చేశారు. చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బక్రీద్ నేపథ్యంలో జిల్లాలో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. గోవులు, దూడలను నిబంధనలకు విరుద్ధంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ పశువుల రవాణాకు సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రజలు ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. బక్రీద్‌కు పటిష్ట భద్రత చర్యలుబక్రీద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని డీజీపీ సీ.వీ.ఆనంద్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. గోవుల అక్రమ రవాణా, గోవధ వంటి చర్యలపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. సంతల్లో కొనుగోలు చేసిన పశువులకు సంబంధిత పశు వైద్యాధికారులచే జారీ చేసిన ఆరోగ్య ధృవీకరణ పత్రాలు, రవాణా అనుమతి పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. పత్రాలు లేకుండా పశువులను రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. చెక్‌పోస్టులు వద్ద ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి 24 గంటల నిఘా కొనసాగించాలని ఆదేశించారు. గోవులను రవాణా చేస్తున్నారనే పేరుతో కొందరు వ్యక్తులు, సంఘాలు అల్లర్లు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, డీఎస్పీలు కె.నాగేంద్రచారి, శ్రీనివాసులు, జి.వెంకటేశ్వర్లు, సీఐ రవి, డీటీవో లక్ష్మణ్, పశుసంవర్ధకశాఖ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
సీరియల్ ప్రకారం కాంటాలు పెట్టాలి
● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ చందుర్తి/వేములవాడరూరల్/రుద్రంగి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. చందుర్తి మండలం మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల, వేములవాడ మండలం మల్లారం, మర్రిపల్లి, రుద్రంగి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. వేములవాడ మండలం మర్రిపల్లిలోని మారుతి, మహాలక్ష్మి, మణికంఠ రైస్‌మిల్లులను తనిఖీ చేశారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ సీరియల్ నంబర్ ప్రకారం కాంటాలు పెట్టాలని సూచించారు. ధాన్యాన్ని జాప్యం చేయకుండా తూకం వేయాలని ఆదేశించారు. సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తహసీల్దార్ భూపతి, ఐకేపీ ఏపీఎం కల్యాణి, ఆర్ఐ మహేందర్ ఉన్నారు. రుద్రంగి, చందుర్తి తహసీల్దార్లు పుష్పలత, భూపతి ఉన్నారు. -
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి
● ఎస్పీ మహేశ్ బీ గితేవేములవాడరూరల్: బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఎస్పీ మహేశ్ బీ గితే సూచించారు. మంగళవారం వేములవాడరూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌పరిధిలో కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం ప్రదర్శించకుండా నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. రౌడీషీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని ఆదేశించారు. రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలన్నారు. తరచూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా అధికారులు గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలు, మైనర్ డ్రైవింగ్‌పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. గంజాయి, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకట్రాజం, సిబ్బంది పాల్గొన్నారు. -
తుది దశ నిర్మాణాలు పూర్తి చేయండి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: జిల్లాలో టీజీఈడబ్ల్యూఐడీసీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టి తుదిదశలో ఉన్న భవనాల పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం ఘనంగా నిర్వహించాలని సూచించారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో పూర్తయిన అదనపు తరగతి భవనాలు తదితర పనులు 21 పూర్తయ్యాయని, విద్యాశాఖ వారోత్సవాల్లో పండుగ వాతావరణంలో ప్రారంభించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్లు నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి, విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఎస్ఈ గిరీశ్‌బాబు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్‌కుమార్, జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, జీసీడీవో పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్ల పరిశీలన
సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించేందుకు జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ధాన్యం తూకం వేసేలా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో లారీలు, హమాలీల కొరత ఉండడంతో స్థానికంగా అందుబాటులో ఉన్న ట్రాక్టర్లలోనూ ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఽపౌరసరఫరాల అధికారులతో పాటు, మండలాల ప్రత్యేక అధికారులు, తహసీ ల్దార్లు తమ పరిధిలోని కేంద్రాలను తనిఖీ చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రం నిర్వాహకులకు సూచనలు చేస్తూ కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లోని కేంద్రాలను మండల ప్రత్యేక అధికారి(డీపీవో) షరీఫోద్దీన్, వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి, నూకలమర్రి గ్రామాల్లోని కేంద్రాలను మండల ప్రత్యేక అధికారి(డీడబ్ల్యూవో) లక్ష్మీరాజం మంగళవారం తనిఖీ చేశారు. -
ఆ సెల్‌ఫోనే పట్టించింది
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎంత పెద్ద క్రిమినల్ అయినా.. ఏదో ఒక క్లూ వదిలేస్తాడు.. అదే దొంగలను చిక్కేలా చేస్తుంది. పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసులో ఇదే తరహాలో దొరికిపోయారు. ఈనెల 3వ తేదీన పీఎంజేలో దోపిడీ చేసి, నలుగురు సిబ్బందిని తుపాకులతో కాల్చిన అనంతరం ధర్మపురి మీదుగా పారిపోయిన దొంగలు తాము వినియోగించిన ఒక సెల్‌ఫోన్‌ను మద్దునూరు వద్ద పగలగొట్టి వెళ్లిపోయారు. స్థానికులు ఆ సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఇక్కడే కేసు మలుపు తిరిగింది. ఆ సెల్ఫోన్లో లభించిన డేటా ద్వారా దొంగల సమాచారం లభించింది. దీంతో పోలీసులు బృందాలుగా విడిపోయి బిహార్‌లో ఒకరిని, బెంగాల్లో మరొకరిని పట్టుకున్నారు. నిందితులంతా స్మార్ట్ఫోన్ల నుంచి ఎన్క్రిప్టెడ్యాప్స్ ద్వారా సంభాషించుకోవడం గమనార్హం. పోలీసులు డేటా రీట్రైవ్ చేయడం ద్వారా కీలక సమాచారం లభించింది. సినీ తరహాలో దోపిడీ ఈ మొత్తం చోరీకి బిహార్ జైలు వేదికగా ప్రణాళిక జరిగింది. దేశంలోని పలు బంగారం సంస్థలే టార్గెట్‌గా చోరీలు చేసే సుబోధ్ గ్యాంగ్ ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 70 మందికిపైగా ప్రైవేటు సైన్యంతో ఆరు రాష్ట్రాల్లో ఇతని నెట్వర్క్ విస్తరించి ఉంది. సినీ తరహాలో దోపిడీలు చేయడం వీరి ప్రత్యేకత. కరీంనగర్ దోపిడీ కోసం ఆరుగురు ఒకరితో మరొకరికి పరిచయం లేనివారిని ఎంచుకున్నారు. కేవలం దోపిడీ మాత్రమే వీరి పని. ఆ తరువాత బంగారం తరలించేందుకు ఒక గ్యాంగ్, విక్రయానికి మరోగ్యాంగ్, ఆ డబ్బు తరలించేందుకు ఇంకో గ్యాంగ్ పనిచేస్తాయి. ఒకవేళ పోలీసులకు నిందితులు చిక్కినా పూర్తిస్థాయి సమాచారం దొరకక కేసు జాప్యం అవుతుంది. ఈలోపు బంగారం విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ఈ దోపిడీలో పాల్గొన్న వారికి రూ.5లక్షలు ఇస్తామని ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రెస్‌మీట్.. ధర్మపురి వద్ద విడిపోయిన దొంగలు... వేర్వేరుగా బెంగాల్, బిహార్, రాజస్థాన్, ముంబై వైపు పారిపోయారు. ఈ నేపథ్యంలో చోరీ చేసిన సొత్తు రికవరీ చేయడం, మిగిలిన ముగ్గురు దొంగలను పట్టుకోవడం సవాలుగా మారింది. అయితే, నిందితులు సొత్తు ఎక్కడ విక్రయించారు? అన్న విషయంలోనూ పోలీసులు పలు కీలక ఆధారాలు సంపాదించారు. సుబోధ్ గ్యాంగ్ ఇప్పటి వరకూ 30 కిలోల వరకు బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు సమాచారం. ఈ గ్యాంగ్ వద్ద దొంగ బంగారం కొనే వ్యాపారుల జాబితా కూడా కరీంనగర్ పోలీసులు గుర్తించారు. మిగిలిన ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డిపార్ట్మెంట్ ధీమాగా ఉంది. త్వరలోనే నిందితులందరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. -
ఐఐహెచ్‌టీ కోర్సులతో ఉపాధి
సిరిసిల్ల: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్ల్యూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) పూర్తి చేసిన వారికి దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు సంతోష్‌కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బీవైనగర్‌లో గల చేనేత, జౌళిశాఖ ఆఫీస్‌లో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు ఈ కోర్సులో చేరితే నమ్మకమైన ఉపాధి అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపకార వేతనం అందిస్తూ శిక్షణ ఇస్తాయన్నారు. జిల్లా నుంచి ప్రస్తుతం 13 మంది మాత్రమే దరఖాస్తులు చేశారని, మరింత మంది ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్‌లోని నాంపల్లి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఐఐహెచ్‌టీలో చేరాల్సి ఉంటుందన్నారు. ఎంఎస్ఎంఈ అధికారి యుగేంధర్ మాట్లాడుతూ, సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులు బ్యాంకు రుణాలు పొందుతూ పరిశ్రమను మరింత అభివృద్ధి పథంలో నడిపించే అవకాశం ఉందన్నారు. సైకాలజిస్ట్ పున్నంచందర్, వస్త్రోత్పత్తిదారులు వేముల దామోదర్, శ్రీధర్, మధు, వెల్ది హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
● నేటి నుంచి పరీక్షలు రాయనున్న 4,200 మంది విద్యార్థులుసిరిసిల్ల: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సీహెచ్.శరత్‌కుమార్ మంగళవారం తెలిపారు. బుధవారం నుంచి ఈనెల 20 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఫస్టియర్‌లో 2,599, సెకండియర్‌లో 1,601 మొత్తం 4,200 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 చి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు 200 మంది ఇన్విజిలేటర్లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థులు హాల్ టికెట్లను టీజీఈ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని, దానిపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదన్నారు. హాల్ టికెట్లలో పరీక్షా కేంద్ర స్థానం కోసం క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంటుందన్నారు. -
‘బెస్ట్ అవెలబుల్’ ప్రవేశాలకు విద్యార్థుల ఎంపిక
సిరిసిల్ల: బెస్ట్ అవెలబుల్ పథకంలో భాగంగా 2026–27 విద్యా సంవత్సరానికి మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ గరీమా అగ్రవాల్ డ్రా పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. 3,5,8వ తరగతుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించి, గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ కేటగిరీలో సీట్లకు తల్లిదండ్రుల సమక్షంలో డ్రా తీశారు. 3వ తరగతికి ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి, 5వ తరగతికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, 8వ తరగతికి ఒక అబ్బాయిని ఎంపిక చేశారు. జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి సంగీత తదితరులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభసిరిసిల్ల: జిల్లా సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు మంగళవారం సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అండర్–10 లాంగ్‌జంప్‌లో బి.కార్తీక్ ప్రథమ, 60 మీటర్ల పరుగు పందెంలో బి.సుదీష్ణ ప్రథమ, లాంగ్‌జంప్‌లో కె.చాణక్య ద్వితీయ, 600 మీటర్ల పరుగుపందెంలో కె.సాయిసామ్రాట్ తృతీయ స్థానంలో నిలిచారు. అండర్–12 విభాగం 300 మీటర్ల పరుగుపందెంలో జె.అవినాష్ ప్రథమ, అండర్–14 లాంగ్‌జంప్‌లో బి.జస్వంత్ ప్రథమ, 60 మీటర్ల పరుగుపందెంలో బి.రేవంత్ ప్రథమ స్థానం సాధించారని కోచ్‌లు జి.బాబు, బి.నవీన్ తెలిపారు. ప్రతిభచాటిన చిన్నారులను సిరిసిల్ల కోర్టు ప్లబిక్ ప్రాసిక్యూటర్ వేణుగోపాల్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డు నారాయణ అభినందించారు. ఏబీ స్విచ్‌లతో మెరుగైన విద్యుత్సిరిసిల్ల: జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్పీడీసీఎల్ సిరిసిల్ల సర్కిల్ ఎస్ఈ టి.వేణుమాధవ్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 26 గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సింగిల్ ఫేజ్ ఏబీ స్విచ్‌లు పెట్టామని, దీంతో గ్రామాల్లో ఎక్కడైన అంతరాయం ఏర్పడితే లైన్ మొత్తం విద్యుత్ సరాఫరా నిలిపివేయకుండా కేవలం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ వద్ద నిలిపి వేసి సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. విద్యుత్ లైన్లలో సాంకేతిక లోపాలు, చెట్ల కొమ్మలు తగలడం, భారీ వర్షాలు, ఈదురుగాలుల వంటి కారణాలతో విద్యుత్ అంతరాయాలను తక్షణమే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. మరమ్మతు పనుల సమయంలో విద్యుత్ నియంత్రణ సులభమై సిబ్బంది భద్రత మరింత పెరుగుతోందని పేర్కొన్నారు. అత్యవసర విద్యుత్ సమస్యల ఫిర్యాదుల కోసం వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912లో సంప్రదించాలని కోరారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించాలిసిరిసిల్ల: జిల్లాలో క్షేత్రస్థాయిలో ఆశ నోడల్ పర్సన్లు గర్భిణులకు తరచూ పరీక్షలు చేస్తూ హైరిస్క్ ఉన్నవారిని గుర్తించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. మంగళవారం డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో నిర్వహించిన సమావేశం మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రసవాలు జరిగేలా గర్భిణులను ప్రోత్సహించాలని కోరారు. డెలివరీ సమయం వచ్చేనాటికి వారిని మానసికంగా సిద్ధం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఆరోగ్య కార్యక్రమాల్లో లక్ష్యాలు సాధించాలని, జిల్లాను అన్ని పారామీటర్స్‌లో ముందుంచేందుకు క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు. పోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంపత్‌కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, సీహెచ్‌వో శాంత, డీడీఎం కార్తీక్, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
వేములవాడ: పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల పట్టణ ప్రగతి’ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులను మంగళవారం కమిషనర్ సంపత్‌రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. మూలవాగు సమీపంలోని పంప్‌హౌస్‌ను సందర్శించారు. నిరుపయోగంగా ఉన్న పంపులకు మరమ్మతు చేయించి, వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ గల్లీలో సమస్య్చ పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చైర్మన్ రాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే నిధులు సకాలంలో అందేలా చూడాలన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాలతి, హౌసింగ్ ఏఈ సౌజన్య, ఏఈ అనన్య, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): రద్దు చేసిన ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని మంగళవారం పెద్దలింగాపురం గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఇల్లంతకుంట నుంచి పెద్దలింగాపురం గ్రామంలోకి సిరిసిల్ల డిపో బస్సు రోజూ ఉదయం, సాయంత్రం నడిచేదని, ప్రస్తుతం గ్రామంలోకి రాకుండా, ఊరుకు పక్కన ఉన్న రోడ్డు మీదుగా నడుపుతుండడంతో ఇబ్బందిపడుతున్నామని పేర్కొన్నారు. డిపో మేనేజర్‌కు గ్రామ సర్పంచ్ పలుసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో గ్రామం పక్క నుంచి వెళ్తున్న బస్సు ఎదుట గ్రామస్తులు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు, ఆర్టీసీ డిపో ట్రాఫిక్ రూట్ ఇన్చార్జి ఘటన స్థలానికి చేరుకొని బస్సును పునరుద్ధరిస్తామని చెప్పడంతో నిరసన విరమించారు. సర్పంచ్ గన్నారం వసంత నర్సయ్య, ఉపసర్పంచ్ ఎలవేణి రమేశ్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. -
పొద్దుతిరుగుడు కొనాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): పొద్దు తిరుగుడు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని, వెంటనే కొనాలని కోరుతూ రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. తహసీల్దార్ సురేష్, ఎస్సై అశోక్ అక్కడికి చే రుకొని రైతులతో మాట్లాడారు. ఫోన్లో మార్క్‌ఫెడ్ డీఎంతో తహసీల్దార్ మాట్లాడగా.. కొనుగోలు చేసేందుకు దరఖాస్తు చేశామని.. అనుమతులు రాగానే కొంటామనడంతో రైతులు ధర్నా విరమించారు. రెండు రోజుల్లో కొనుగోలు చేయకపోతే నిరాహార దీక్షకు కూర్చుంటామని రైతులు హెచ్చరించారు. పత్తికుంటపల్లి సర్పంచ్ జుట్టు శేఖర్, మాజీ సర్పంచ్ చింతలపల్లి రవీందర్‌రెడ్డి, గుమ్ముటాల నరసింహారెడ్డి, రైతులు చింతలపెల్లి రాజిరెడ్డి, బోడ రమణారెడ్డి, చింతలపల్లి శ్రీనివాసరెడ్డి, భారతవ్వ, సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆస్తిపన్నులో అగ్రస్థానం
ఇది జిల్లాలోని మూరుమూల కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామపంచాయతీ భవనం. ఈ ఊరిలో 1,040 ఇండ్లు ఉండగా.. రూ.5లక్షలకు పైగా ఆస్తి పన్ను ఏటా వసూలు చేయాల్సి ఉంది. స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి రాధిక సంయుక్త కార్యాచరణతో 2026 మార్చి నెలాఖరులోగా వంద శాతం ఇంటి, నల్లా పన్నులను వసూలు చేశారు. ఇలా జిల్లాలోని 260 గ్రామపంచాయతీల్లోనూ వందశాతం ఆస్తి పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.మండలం గ్రామ గృహాలు వసూలైన పన్ను బోయినపల్లి 23 12,693 రూ.53,80,713 చందుర్తి 19 8,301 రూ.53,35,461 ఇల్లంతకుంట 35 18,089 రూ.59,49,606 గంభీరావుపేట 22 15,935 రూ.84,57,413 కోనరావుపేట 28 16,311 రూ.49,07,736 ముస్తాబాద్ 22 16,150 రూ.1,18,09,857 రుద్రంగి 10 5,801 రూ.31,47,339 తంగళ్లపల్లి 30 17,063 రూ.97,61,617 వీర్నపల్లి 17 4,689 రూ.19,59,183 వేములవాడ అర్బన్ 11 5,527 రూ.76,24,088 వేములవాడ రూరల్ 17 8,512 రూ.28,63,577 ఎల్లారెడ్డిపేట 26 15,707 రూ.1,21,79,553 -
అందరికీ కార్పొరేట్ స్థాయి విద్య
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ: ప్రతీ ఒక్కరికి కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యావారోత్సవాలు ప్రారంభించారు. విప్ మాట్లాడుతూ ప్రతీ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్‌స్కూల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య అందుతుందన్నారు. విద్యతోపాటు క్రీడలు, వ్యక్తిత్వ వికాసం, టెక్నాలజీ ఆధారిత అభ్యాసంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వివరించారు. ఈనెల 25 వరకు కొనసాగే వేసవి శిబిరాల్లో విద్యార్థులకు కోడింగ్, కళలు, క్రీడలు, యోగా, వ్యక్తిత్వ వికాసంలో శిక్షణ ఇస్తారని తెలిపారు. సొంతింటి కల నిజం చేయడమే లక్ష్యం కోనరావుపేట/వేములవాడరూరల్/రుద్రంగి: పేదల సొంతింటి కల నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గోవిందరావుపేట, ఆరెపల్లి, రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతీ కుటుంబానికి నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సర్పంచులు భుక్యా తిరుపతి, బానోత్ నరేశ్, పన్నాల లక్ష్మారెడ్డి, దేవరాజు, బాదవేణి మురళి, రుద్రంగి సర్పంచ్ గండి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్ పాల్గొన్నారు. -
విన్నపాల వెల్లువ
● సమస్యల పరిష్కారానికే ప్రజావాణి ● 165 దరఖాస్తులు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్ బాట పట్టారు. ధాన్య కొనడం లేదని కొందరు, రైస్‌మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని మరికొందరు కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్ పెట్టకుండా సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి 165 దరఖాస్తులు స్వీకరించారు. -
బాధితులకు అండగా నిలవాలి
సిరిసిల్ల: పోలీసులు బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 21 ఫిర్యాదులు వచ్చాయి. గ్రీవెన్స్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి, సమస్య ఏ మేరకు పరిష్కారమైందో పర్యవేక్షిస్తామన్నారు. పశువుల అక్రమ రవాణాపై నిఘా జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఎస్పీ తెలిపారు. జిల్లా పరిధిలో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పశువుల అక్రమ రవాణాపై నిఘా పెట్టినట్లు తెలిపారు. పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలపాలన్నారు. -
నైపుణ్యాలు వెలికితీసేందుకు సమ్మర్‌క్యాంపులు
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఒత్తిడి కలగకుండా, వారిలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. గీతానగర్‌లోని పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం సమ్మర్క్యాంపును ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు క్షేత్ర స్థాయిలో వివరించేందుకు సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాట్యం, సంగీతం, చేతిరాత, చిత్రలేఖనం, కర్రసాము ఆటలు నేర్పించనున్నట్లు పేర్కొన్నారు. పదోతరగతి ఫలితాల్లో 589 మార్కులు సాధించిన విద్యార్థిని అంకాలపు సిరిని అభినందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఈవో జగన్మోహన్రెడ్డి, తహసీల్దార్ మహేశ్, ఎంఈవో రఘుపతి, హెచ్ఎం శారద పాల్గొన్నారు. జనగణన సిబ్బందికి సహకరించాలి జనగణన–2027 మొదటి దశలో భాగంగా నేటి నుంచి జూన్ 9 వరకు ఇంటింటికీ వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. సుభాష్‌నగర్‌లో పర్యటించి, జనగణనను పరిశీలించారు. జిల్లాలో 173 మంది సూపర్ వైజర్లు, 1,025 మంది ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపా రు. సీపీవో శ్రీనివాసాచారి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, తహసీల్దార్ మహేశ్ పాల్గొన్నారు. కంప్యూటర్ల పంపిణీ జనగణన చార్జ్ అధికారులకు కంప్యూటర్, ప్రింటర్లను కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరీమా అగ్రవాల్ అందించారు. సమాచార సేకరణ, నివేదికల తయారీ వేగవంతంగా చేసేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను 2002 ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
వైభవంగా మల్లన్న కల్యాణోత్సవం
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026నారాయణపూర్‌లో మల్లికార్జునస్వామి కల్యాణానికి హాజరైన భక్తులుమల్లన్న బోనాలతో భక్తులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో భాగంగా సోమవారం కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున పురవీధుల గుండా మల్లన్న బోనాలు తీశారు. ఇంటికో బోనం చొప్పున మహిళలు బయలుదేరారు. దారి పొడవునా శివసత్తుల పూనకాలు, బైండ్ల కళాకారుల గాండ్రింపులు, ప్రత్యేక వేషధారణలతో నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఒగ్గు కళాకారులు కల్యాణం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, వైస్‌చైర్మన్ గుండాడి రామ్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీలు ఎలుసాని మోహన్‌కుమార్, సుజాత, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎలుసాని సునీల్‌కుమార్, నారాయణపూర్, రాగట్లపల్లి యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
లైఫ్ డోనర్స్
● వైద్యులకు దీటుగా రోగులకు సేవలు ● భరోసా కల్పించేలా తల్లికి మించి సపర్యలు ● నేడు ప్రపంచ నర్సుల దినోత్సవంనర్సులు.. అమ్మకు మించిన సేవా మూర్తులు. రోగి శరీరంలో చీము, నెత్తురు, గాయాలు, దుర్వాసనలను భరించి శుభ్రపరిచి, ఉపశమన పరచడంలో నర్సులు సేవానిరతికి నిలువెత్తు రూపాలు. కన్న తల్లి, కట్టుకున్న భార్య లేదా భర్త కూడా చేయలేని సేవలు అందిస్తున్న మానవరూపంలో కనిపించే దేవతలు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగశీలురు. ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. – కరీంనగర్/కోల్‌సిటీ(రామగుండం)రాష్ట్రాలను జల్లెడ పడుతున్నారు..!కరీంనగర్‌క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో నిందితుల వేట పోలీసులకు ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టపగలు కాల్పులు జరిపి రూ.కోట్ల విలువైన బంగారం దోచుకెళ్లిన ఆరుగురు నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దొంగతనం జరిగిన రోజు నుంచి కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి పలు రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నా.. నిందితులు అడుగడుగునా ఏమరుస్తున్నట్లు తెలుస్తోంది. టవర్ లొకేషన్లతో నిందితుల జాడ దర్యాప్తులో కీలకంగా మారిన మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు పశ్చిమబెంగాల్, బిహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టినట్లు సమాచారం. నింది తులు తరచూ సిమ్ కార్డులు మార్చడం.. ఫోన్లు స్వి చ్ఛాఫ్ చేయడం, అవసరమైన సమయంలో మాత్ర మే ఫోన్లు ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేస్తుండటంతో వారి కచ్చితమైన లొకేషన్‌ను ట్రాక్ చేయడం పోలీసులకు సవాల్‌గా మారినట్లు తెలుస్తుంది. ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు ఉండకుండా గంటల వ్యవధిలో ప్రాంతాలు మారుస్తూ పోలీసు బృందాలను అయోమయానికి గురిచేస్తున్నట్లు తెలిసింది. బంగారాన్ని పంచుకుని విడిపోయారా..? దోపిడీ అనంతరం ముఠా సభ్యులు కలిసి ప్రయాణించకుండా ప్రణాళిక ప్రకారం విడిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దోచుకున్న బంగారాన్ని వాటాలుగా పంచుకుని వివిధ రాష్ట్రాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రాష్ట్రంలో బంగారాన్ని విక్రయించే ప్రయత్నం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా ధృవీకరించడంలేదు. అతడి నుంచి కీలక సమాచారం లభించినట్లు.. మరో ఇద్దరు నిందితుల జాడ కూడా పోలీసులు కనిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కాల్స్‌తోనే క్లూస్.. నిందితులు ఫోన్లు పూర్తిగా వాడకపోయినా కుటుంబసభ్యులు, పరిచయస్తులతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ ఆధారంగానే టెక్నికల్ టీమ్‌లు వారి కదలికలను విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లు, లాడ్జీలు, బంగారం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. అనుమానాస్పదంగా బంగారం విక్రయించే వ్యక్తుల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపినట్లు తెలిసింది. ప్రత్యేక బృందాల ముమ్మర వేట కేసు ఛేదన కోసం కరీంనగర్ కమిషనరేట్ గోప్యంగా పలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. బృందాలకు రాష్ట్రాలవారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, వివిధ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల సహకారంతో నిందితుల పాత నేరచరిత్ర, ముఠా లింకులు, ప్రయాణ మార్గాలపై లోతుగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరుగురిలో పలువురు నిందితుల జాడ పోలీసులు కనిపెట్టగా.. మిగితా వారి కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిసింది. నిందితులు ఎంతదూరం పారిపోయినా.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
రైతుల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
చందుర్తి(వేములవాడ): ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమైన మండలంలోని మల్యాలకు చెందిన రైతులను సోమవారం చందుర్తి పోలీసులు అడ్డుకున్నారు. ధా న్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి 50 రో జులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యా రు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై రమేశ్ తన సిబ్బందితో మల్యాలకు వెళ్లి రైతులకు నచ్చజెప్పారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి లారీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇ వ్వడంతో రైతులు వెనుదిరిగారు. ఈ విషయం తెలుసుకున్న ఐకేపీ ఏపీఎం కల్యాణి , చందుర్తి తహసీల్దార్ భూపతి మల్యాల గ్రామానికి చేరుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేసి ధాన్యం బస్తాలను లారీ, రెండు ట్రాక్టర్లల్లో లోడు చేసి రైస్‌మిల్లులకు తరలించారు. సిరిసిల్లటౌన్: దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయని, ఇగోకు పోయి సంసారాలను పాడు చేసుకోవద్దని సైకా లజిస్ట్ కె.పున్నంచందర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో సోమవారం మనో వికాస సదస్సు నిర్వహించారు. కౌన్సెలింగ్ ద్వా రా పరస్పర అవగాహన పెంపొందించుకోవచ్చన్నారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ కోసం 88018 88805, నేరుగా మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్లో సంప్రదించాలి సూచించారు. మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది బూర శ్రీమతి, కొండ ఉమ, రాపెల్లి లత పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: యజమానులు తమతో కూలీ పెంపు ఒప్పందం చేసే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతోందని ఆసాముల సంక్షేమ సంఘం కన్వీనర్ సిరిసిల్ల రవీందర్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారుల సంఘం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఆసాములతో అగ్రిమెంటు జరిగిందన్న వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. ఇప్పటి వరకు ఆసాముల సంఘంతో ఒప్పందం కుదురలేదని స్పష్టం చేశారు. -
ఎరువులు పిరమాయే..
చందుర్తి(వేములవాడ): యాసంగి పంటల సీజన్ ముగిసింది. వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎరువుల ధరలను ఆయా కంపెనీలు అమాంతం పెంచేశాయి. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ప్రభావం మన ప్రాంతంలో ఎరువులపై పడుతుంది. ఎరువులను బట్టి ఒక్కో బస్తాపై రూ.160 నుంచి రూ.400 వరకు పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.100 లోపు పెంచితే ఎరువుల ధరలు బస్తాకు వందల్లో పెరగడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో డీఏపీ, 28–28–0 ఎరువులు మినహాయించి అన్ని రకాల ఎరువుల ధరలు పెరిగాయి. పెరుగుతున్న పెట్టుబడి జిల్లాలో సుమారు 2.44 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. ఇందులో 1,86,400 ఎకరాల్లో వరి, 46,900 ఎకరాల్లో పత్తి, 10,700 ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారుల ప్రణాళికలు చెబుతున్నాయి. ఈ పంటలకు 20,450.5 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 8,223.3 టన్నుల డీఏపీ, 11,021.6 టన్నుల పొటాష్, 29,374.8 టన్నుల యూరియాను కలుపుకుని 69,070 టన్నుల ఎరువులు వినియోగిస్తారని అంచనా. ప్రస్తుతం డీఏపీ, 28–28–0 ఎరువుల ధరలు నిలకడగానే ఉన్నాయి. మిగతా అన్ని రకాల ఎరువుల ధరలు పెరగడంతో జిల్లా రైతులపై ఏటా దాదాపు రూ.1.85కోట్ల భారం పడనుంది. పంటల కొనుగోళ్లపై ఆంక్షలు పంటల సాగులో పెరిగిన ఎరువుల బస్తాల ధరలతో సాగు భారంగా మారుతుందని రైతులు భావిస్తున్నారు. ఎరువుల ధరల పెరుగుదల, పంటల మద్దతు ధరలు మొక్కుబడిగా పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొంటున్నా 12 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తే ఆంక్షలు విధిస్తున్నారు. పత్తి ధర ఆశాజనకంగానే ఉన్న కొనుగోలు సమయంలో కొర్రీలు పెడుతుండడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. ప్రభుత్వ ప్రచారంతో రైతులు సన్న వడ్లు సాగుచేస్తున్నారు. అయితే సన్నాలకు చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తుండడంతో దిగుబడి పడిపోతుంది. యాప్ తిప్పలు గతంలో రైతులకు అవసరానికి తగ్గట్లుగా ఎరువుల బస్తాలను కొనుగోలు చేసి సాగులో వినియోగించుకునే వారు. ప్రస్తుతం ఎకరాకు ఒకటి లేదా రెండు బస్తాల నిబంధనలు విధించింది. అంతేకాకుండా యాప్ ద్వారా ఎరువులు కొనాలనడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం తప్పిదాలతో ధరణిలో రైతులకు చిక్కులు ఎదురుకావడంతో పూర్తి స్థాయిలో భూములు ఆన్లైన్ కాలేవు. భూభారతితో అర్జీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో పలువురు రైతులకు సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువుల బస్తాలు అందడం లేదు. వ్యవసాయాధికారులతో పంటల సాగుపై సర్వే చేయించి, యాప్‌తో సంబంధం లేకుండా ఎరువుల బస్తాలు అందించాలని రైతులు కోరుతున్నారు. ఎరువు పాత ధర ప్రస్తుత ధర డీఏపీ రూ.1,350 రూ.1,350 28–28–0 రూ.1,850 రూ.1,850 పొటాష్ రూ.1,800 రూ.1,975 20–20–0–13 రూ.1,400 రూ.1,800 14–35–14 రూ.2,150 రూ.2,350 10–26–26 రూ.1,200 రూ.1,700 12–32–16 రూ.2,025 రూ.2,250 సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూ.600 రూ.775 16–16–16 రూ.1,675 రూ.2,050 24–24–0 రూ.2,000 రూ.2,350 -
జీరో దందాకు జీ హుజూర్ !
సిరిసిల్ల: జిల్లా ఆవిర్భవించి పదేళ్లు సమీపిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపే వస్తు సేవ పన్ను(జీఎస్టీ) ఆఫీస్ ఏర్పాటుకు సిరిసిల్లలో ప్రభుత్వ భవనమే దొరకడం లేదట. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ శాఖల ఆఫీస్‌లన్నీ ప్రభుత్వ భవనాల్లోకి మారాలని ఆదేశిస్తూ ఆరు నెలల కిందట ప్ర భుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో అన్ని ఆఫీస్‌లు కలెక్టరేట్‌లోకి, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి మారాయి. కానీ జీఎస్టీ ఆఫీస్ మాత్రం కరీంనగర్‌లోనే కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయి అధికారులకు సిరిసిల్లలో ప్రభుత్వ భవనాలు ఏవీ ఖాళీగా లేవని, జీఎస్టీ ఆఫీస్ ఏర్పాటుకు వసతులు సిరిసిల్లలో లేవని నివేదికలు ఇస్తున్నట్లు సమాచారం. పరోక్షంగా అధికారులు అక్రమంగా వ్యాపారాలు చేసే వారికే సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పనిచేసే చోట నివాసం ఉండాలనే సర్వీసు రూల్స్, కొత్త జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ భవనాల్లో ఉండాలనే ప్రభుత్వ ఆదేశాలు జీఎస్టీ ఆఫీస్ విషయంలో బుట్టధాఖలు అవుతున్నాయి. పరిధి ఎక్కువే.. రాజన్న సిరిసిల్ల జిల్లా 12 మండలాల పరిధిలో విస్తరించి ఉండగా.. జీఎస్టీ ఆఫీస్ పరిధి 15 మండలాల పరిధిలో ఉంది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు, చందుర్తి, రుద్రంగి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట, బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలోనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు పరిపాలన సాగిస్తారు. కానీ జీఎస్టీ ఆఫీస్ పరిధి జగిత్యాల జిల్లా పరిధిలోని మేడిపల్లి, కథలాపూర్, భీమారం మండలాలు కూడా ఉన్నాయి. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని ఆ మూడు మండలాలు సైతం రాజన్నసిరిసిల్ల జిల్లా జీఎస్టీ ఆఫీసర్ల పరిధిలో ఉన్నాయి. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల నుంచి మేడిపల్లి వరకు, గంభీరావుపేట మండలం పెద్దమ్మ నుంచి బావుపేట వరకు సుధీర్ఘ పరిధి ఉన్నా జీఎస్టీ అధికారులు మాత్రం కరీంనగర్‌లోనే ఉంటున్నారు. కార్యాలయంలోనే జీఎస్టీ ఆఫీసర్ల కాలక్షేపం జిల్లా పరిధిలో పనిచేయాల్సిన జీఎస్టీ ఆఫీసర్లు కరీంనగర్లో కాలక్షేపం చేస్తున్నారు. జీఎస్టీ పన్నులను ఎగవేసే గ్రానైట్, మైనింగ్, హార్డ్‌వేర్, బీడీ కంపెనీలు, వస్త్రవ్యాపారులు, తునికాకు వ్యాపారులు, ఎలక్ట్రికల్ వాహనాల డీలర్లు, ఇతర వ్యాపారుల లావాదేవీలను పరిశీలిస్తూ జీఎస్టీ చెల్లింపులను పర్యవేక్షించాల్సిన అధికారులు ఆఫీస్‌కే పరిమితమవుతున్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో ఉండే చార్టర్డ్ అకౌంటెంట్లు, వారి అసిస్టెంట్లు వ్యాపారుల లావాదేవీలను నమోదు చేస్తూ జీఎస్టీ ఆఫీస్‌లో అప్పగిస్తున్నారు. ప్రతి ఒక్క వ్యాపారి ఫైల్‌కు ఓ లెక్క చొప్పున ముడుపులు సమర్పించడంతో అంతా ‘మామూలు’గానే జీఎస్టీ తనిఖీలు సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ జీఎస్టీ ఎగ్గొట్టే వ్యాపారులకు జరిమానాలు విధిస్తూ ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చాల్సిన ఆఫీసర్లు కరీంనగర్‌లోనే కాలక్షేపం చేస్తున్నారు. జిల్లా వైపు అప్పుడప్పుడూ వస్తున్నా మొక్కుబడి తనిఖీలతో ‘మామూళ్ల’ దందాను సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సీజీఎస్టీ ఆఫీస్ ఉన్నా లేనట్లే ! జిల్లా కేంద్రంలోని భావనారుషినగర్(బ్యాంకు వీధి)లో సెంట్రల్ ఎకై ్సజ్, సర్వీస్ ట్యాక్స్(సీజీఎస్టీ) సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంది. ఓ ప్రైవేటు అద్దె భవనంలో మొదటి అంతస్తులో ఓ చిన్న గదిలో సీజీఎస్టీ ఆఫీస్ ఉంది. కానీ అక్కడ సీజీఎస్టీ ఆఫీస్ ఉన్నట్లుగా ఎవరికీ తెలియకుండా బహిరంగంగా బోర్డు కూడా లేకుండా ఏర్పాటు చేశారు. బ్యాంకు భవనం లోపలికి వెళ్లితే మొదటి అంతస్తులో ఉన్నట్లు ఆరో మార్క్‌తో ఓ బోర్డును ఏర్పాటు చేశారు. పైకి వెళ్లి పరిశీలిస్తే ఓ చిన్న గదిలో ఆఫీస్ ఉంది. అదీ కూడా తాళం వేసి ఉండడం విశేషం. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ఆఫీస్ సిరిసిల్లలో అద్దె భవనంలో ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ జీఎస్టీ ఆఫీస్ మాత్రం కరీంనగర్లో కొనసాగడం గమనార్హం. తిరుగులేని జీరో దందాలుజిల్లాలో జీఎస్టీ ఆఫీస్ లేకపోవడం.. అధికారులు తనిఖీలకు రాకపోవడంతో జీరో దందాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రతి నెలా జిల్లాలో రూ.1.50 కోట్ల జీఎస్టీ స్వచ్ఛందంగా వసూలు అవుతుంది. అదే జీఎస్టీ అధికారుల చట్టబద్ధ తనిఖీలు ఉంటే ఆదాయం నెలకు రూ.3 కోట్లకు చేరుతుందని అధికార వర్గాల అంచనా. జిల్లాలో గ్రానైట్, బీడీల వ్యాపారులు, హార్డ్‌వేర్ దుకాణదారులు, నూలు వ్యాపారులు, వస్త్రోత్పత్తిదారులు ఇలా ఎవరికి వారు వ్యాపారంలో అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నారు. కొందరు వ్యాపారులు రెండు ఆధార్‌కార్డుల(చిన్న చిన్న అక్షరదోషాలతో ఆధార్ కార్డులు పొంది)తో ఆదాయ పన్నులను, జీఎస్టీ పన్నులను ఎగవేస్తున్నారు. ఏది ఏమైనా కరీంనగర్లో కొనసాగుతున్న జీఎస్టీ ఆఫీస్ సిరిసిల్లకు వస్తే అక్రమార్కుల ఆటలకు అడ్డుకట్ట పడి ప్రభుత్వ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. -
డివిజన్ స్థాయిలోనూ ప్రజావాణి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రతీ సోమవారం సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో ఆఫీస్‌ల్లోనూ ఆర్డీవోలు అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కలెక్టరేట్లోనూ ప్రజావాణి ఎప్పటిలాగే కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. హనుమాన్ జయంతికి ఏర్పాట్లు వేములవాడ: ఈనెల 12న జరిగే హనుమాన్ జయంతికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. వివిధ శాఖల అధికారులు, అర్చకులతో తన చాంబర్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. భీమేశ్వరస్వామి, నగేశ్వరస్వామి, హనుమాన్ ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. డీఈవో భాస్కర్, ఈఈ రాజేశ్, ఏఈవోలు శ్రవణ్, జయకుమారి, అశోక్, స్థానాచార్యులు ఉమేశ్‌శర్మ పాల్గొన్నారు. పొద్దుతిరుగుడు కొనుగోలు చేయండి ఇల్లంతకుంట(మానకొండూర్): నామమాత్రపు పొద్దుతిరుగుడును కొనుగోలు చేసి తమ టార్గెట్ అయిపోయిందని చేతులు దు లుపుకోవడం సరికాదని రైతులు పండించిన మొత్తం పొద్దు తిరుగుడును కొనాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోరారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పేరుకుపోయిన పొద్దు తిరుగుడు నిల్వలను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. మండలంలో 2400 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి టార్గెట్ అయిపోయిందనడం సరికాదన్నారు. ముస్కానిపెట, ఇల్లంతకుంట ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించా రు. జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, నాయకులు కమటం రాములు, బొల్లం వెంకటేశం, ఉడుతల వెంకటేశం, చెరుకు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పున్నం చందర్‌కు పురస్కారం సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రానికి చెందిన సైకాలజిస్టు పున్నం చందర్ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. మానసిక ఆరోగ్య రంగంలో పదహారేళ్లుగా విశేష సేవలందిస్తున్న పున్నంచందర్‌కు ‘మైండ్ అండ్ మెరిట్ అవార్డ్’ వరించింది. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ద శాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డును అందజేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందజేశారు. ధాన్యం కొనుగోలు చేయాలి సిరిసిల్ల అర్బన్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని, వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్ కోరారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. కోతలు కోసి 20 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈనెల 11న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, సూరం పద్మ, అన్నల్దాస్ గణేశ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న ఆలయానికి విరాళంవేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణకు హైదరాబాద్‌కు చెందిన గోరింకల సుగుణ రూ.లక్ష, కరీంనగర్‌కు చెందిన శ్రీరాముల సత్తమ్మ రూ.లక్ష విరాళంగా అందించారు. ఆలయ అభివృద్ధికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఈవో పేర్కొన్నారు. -
దొరికిన దొంగలు?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దొంగలను అందరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. చోరీ జరిగి వారం రోజులు కాగా కమిషనరేట్ పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాల్లో వారం రోజులపాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పలు కోణాల్లో గాలింపు చర్యలు చేపట్టగా దొంగలు చోరీ చేసిన నగలను బిహార్‌లో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. బిహార్ నుంచి కరీంనగర్ తీసుకొస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేక బృందాలతో... ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌లో ఉన్న ప్రముఖ పీఎంజే జువెల్లరీస్‌లో బంగారం దోపిడీ, కాల్పుల ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. షాపు తెరిచేటప్పుడు, జనసంచారం లేని సమయాన్ని ఎంచుకుని దుండగులు ప్రణాళికాబద్ధంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి, సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులు జరపగా నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నగరం నలువైపులా నాకాబందీ చేపట్టారు. దుండగుల ప్రణాళిక, తప్పించుకున్న తీరు చూస్తే ముందస్తు రెక్కీతో జరిగిందని అంచనాకు వచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను సేకరించి, దుండగులు ఉపయోగించిన వాహనాలు, మార్గాలు, కదలికల ఆధారంగా కీలక ఆధారాలు గుర్తించారు. బిహార్‌లో నగలు విక్రయిస్తుండగా దర్యాప్తులో భాగంగా దొంగలు ఘటన అనంతరం కరీంనగర్ నుంచి ధర్మపురి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారు ఉపయోగించిన పల్సర్ బైక్‌ను వదిలిపెట్టి గోదావరినదిని దాటి పరారైనట్లు సీసీ కెమెరాలు, స్థానిక సమాచారంతో నిర్ధారించారు. ఈ మార్గం ద్వారా వారు మహారాష్ట్ర లేదా ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దోపిడీ కేసు వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి దోపిడీ ఘటనలతో పోల్చి చూశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, పాతనేరస్తులు, గతంలో దొంగతనాలకు పాల్పడిన గ్యాంగులతో విచారణ చేపట్టి నిందితుల కదలికలను, సేకరించి న సమాచారంతో బిహార్ రాష్ట్రంలో నగలు విక్రయిస్తుండగా దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారులు దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. -
‘సెస్’ బోర్డు కనుమరుగు
● నేడు ఎన్పీడీసీఎల్ బోర్డు ఏర్పాటు సిరిసిల్ల: సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఆఫీస్ ముందున్న బోర్డును తొలగించేందుకు ఎన్పీడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 56 ఏళ్ల కిందట స్థాపించిన ‘సెస్’సంస్థ ఉనికి కోల్పోనుంది. మూడు లక్షల సభ్యత్వాలు గల ‘సెస్’ సంస్థ లైసెన్స్‌ను పునరుద్ధరించకుండా.. ఏప్రిల్ 1న ఎన్పీడీసీఎల్లో విలీనం చేశారు. ఈమేరకు వ్యాపార లైసెన్స్ లేని ‘సెస్’ సంస్థను ఎన్పీడీసీఎల్ అధికారులు స్వాధీనం చేసుకుని విద్యుత్ పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘సెస్’సంస్థకు ఎన్నికై న పాలకవర్గానికి మరో 19 నెలలు పాలనపరమైన గడువు ఉంది. కానీ ఎన్పీడీసీఎల్ అధికారులు పాలకవర్గం జోలికి వెళ్లకుండానే ‘సెస్’ సంస్థ ఉద్యోగులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ‘సెస్’పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై ప్రభుత్వం, ఎన్పీడీసీఎల్ అధికారులు వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేయడంతో విచారణ కోర్టులో కొనసాగుతోంది. ఇదే సమయంలో జిల్లాలో ఎన్పీడీసీఎల్ పరిధిలోని సంస్కరణలను అమలు చేస్తున్నారు. కొత్త సబ్స్టేషన్లు, మిడిల్ పోల్స్, కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టారు. బోర్డును మార్చేందుకు ఏర్పాట్లు సెస్ బోర్డును మార్చేందుకు ఎన్పీడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు ఉత్తర మండల విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెండ్, సిరిసిల్ల సర్కిల్‌గా బోర్డును ఏర్పాటు చేయనున్నారు. సోమవా రం బోర్డును మార్చుతారని అధికారుల ద్వారా తెలి సింది. ఏది ఏమైనా ‘సెస్’ పాలకవర్గాల అవినీతి, అక్రమాలు, నిర్వహణ లోపాలు, ప్రభుత్వ బకాయిలు, పాలకుల రాజకీయ కుట్రలతో 56 ఏళ్ల సంస్థ ఉనికి కోల్పోతుంది. ఇప్పటికే జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలను అందిస్తున్న ఎన్పీడీసీఎల్ తాజా పరిణామాలతో పూర్తి స్థాయిలో ‘సెస్’ సంస్థను హస్తగతం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. -
అధిక తూకం.. కదలని ధాన్యం
ఇది ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ మార్కెట్. ఇక్కడ పది రోజుల క్రితం తూకం వేసిన ధాన్యం బస్తాలు అలాగే ఉండిపోయాయి. వాహనాలు దొరకడం లేదు. అలాగే సింగారం కొనుగోలు కేంద్రానికి 15 రోజుల క్రితం ధాన్యం తీసుకొస్తే.. వాహనాల కొరతతో తూకం వేయలేదు. మరో వైపు తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలిద్దామంటే వాహనాలు దొరకడం లేదు. ఇతను ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన రైతు కంచర్ల నర్సయ్య. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే 42.300 కిలోల చొప్పున తూకం వేస్తున్నారు. గతంలో 42.100 కిలోల చొప్పున తూకం వేసేవారు. ఈ సీజన్లో రైస్‌మిల్లర్ల షరతులతో నిర్వాహకులు రైతుల నుంచి 200 నుంచి 300 గ్రాముల వరకు అధికంగా తూకం వేస్తున్నారు. -
తడిసిన ధాన్యం కొనాలి
రుద్రంగి(వేములవాడ): అకాల వర్షాలతో ధన్యాం తడిసి ముద్దవుతుందని.. ఇప్పటికై నా కొనుగోలు చేయాలని కోరుతూ రుద్రంగిలో రైతులు ఆదివారం ధర్నాకు దిగారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిరసన తెలిపారు. కొనుగోళ్లలో జాప్యమవుతుందన్నారు. ధాన్యం ఎప్పుడు కొంటారో అధికారులు తెలపాలని కోరారు. తేమశాతం వచ్చినా కొనడం లేదన్నారు. తాతమ్మగుడి దగ్గరలోని కొనుగోలు కేంద్రంలోకి లారీలు రావడం లేదన్నారు. ఇప్పటి వరకు 4వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొన్నారని, ఇంకా 30వేల క్వింటాళ్ల ధాన్యం అలాగే ఉందన్నారు. విషయం తెలుసుకున్న రుద్రంగి తహసీల్దార్ పుష్పలత, ఎస్సై మోతిరాంనాయక్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. త్వరగా తూకం వేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, నాయకులు దయ్యాల కమలాకర్, మంచె రాజేశం తదితరులు పాల్గొన్నారు. -
మద్దతు ధర పెంచాలి
పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతుఽ ధర పెంచాలి. క్వింటాల్‌పై వరికి రూ.70, పత్తికి రూ.220 పెంచి.. ఎరువుల ధరలు వందల్లో పెంచడం అన్యాయం. పొలాల్లో వరిగింజలు తాలు పోకుండా పొటాష్ చల్లుకునేటోళ్లం. రూ.800 ఉన్న పొటాష్ మూడేళ్లలో ఏకంగా రూ.1975కు పెరిగింది. కేంద్రం స్పందించి ఎరువులపై సబ్సిడీ పెంచాలి. – బానాల లక్ష్మారెడ్డి, రైతు, కిష్టంపేట సాగు భారంగా మారింది పెరుగుతున్న సాగు ఖర్చులతో వ్యవసాయం భారంగా మారుతోంది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో కూలీ పెరిగింది. యంత్ర పరికరాల ధరలు పెరిగాయి. వీటన్నింటికి తోడు ఎరువుల ధరలు పెంచడం మరింత భారంగా మారింది. రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై ఎరువులు అందించాలి. – కటకం చంద్రయ్య, రైతు, బండపల్లి -
పట్టా లేని రైతుల వడ్లు నేరుగా మిల్లులకే
● జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగంవీర్నపల్లి(సిరిసిల్ల): పట్టాపత్రాలు లేని రైతుల ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం హామీ ఇచ్చారు. ‘పట్టాలిచ్చినా.. ఆన్లైన్ చిక్కులు’ శీర్షికన ‘సాక్షి’లో శనివా రం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండలంలోని రంగంపేటలోని కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికారి, ఏఈవో ఫజిల్‌తో కలిసి పరిశీలించారు. ఐకేపీ సెంటర్లో పట్టా ఉన్న రైతుల ధాన్యాన్ని వెంటనే కాంటా పెట్టి మిల్లులకు పంపించాలని నిర్వాహకులకు సూచించారు. పట్టాలు లేని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నేరుగా రైస్‌మిల్లర్లతో మాట్లాడి పంపించే ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాములునాయక్ ఉన్నారు. -
నా వెంటే నా పిల్లలు..
ఇల్లంతకుంట: నేను, మా ఆయన వెంకటేశ్వరరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులం. మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి చైత్ర 8వ తరగతి, చిన్నమ్మాయిని ఫ్రీ ప్రైమరీ స్కూల్లో చేర్పించా. పిల్లలిద్దరినీ నేను పని చేసే పాఠశాలలోనే చదివిస్తున్నా. విధులు నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలు, పిల్లలను చూసుకోవడం కష్టంగానే ఉన్నా ఇష్టంగానే చేస్తుంటా. ఉదయం 4 గంటలకు లేచి ఇంటి పని చేసుకుని పిల్లలను స్కూల్‌కు వెళ్తాం. ఇంటి పనుల్లో భర్త చేదోడు వాదోడుగా ఉంటారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో గడుపుతూ వారికి మంచి విలువలు, సంప్రదాయాలు నేర్పిస్తా. – సుప్రియ, ప్రభుత్వ టీచర్, ముస్కానిపేట -
వైభవంగా వేంకటేశ్వరుని కల్యాణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమాలలో భూదేవి, శ్రీదేవి సహిత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రూ.కోటిన్నర వ్యయంతో నిర్మించిన నూతన ఆలయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పాత రోజుల్లో ప్రతీ గ్రామంలో బడి, గుడి ఉండేవని.. వాటి ద్వారా ప్రజల్లో చదువు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేదన్నారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడంలో ముందున్న సర్పంచ్ శరవిందు, ఉపసర్పంచ్ విశాల్, ఆలయ కమిటీ చైర్మన్ బాలయ్యతో పాటు గ్రామస్తులను అభినందించారు. అనంత రం ఆలయ కమిటీ స్వామివారి చిత్రపటాలు, శాలు వాలతో ప్రభుత్వ విప్‌తోపాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మహేందర్రెడ్డిలను సన్మానించారు. ఏఎంసీ చైర్పర్సన్ సాబేరబేగం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ గుల్లపల్లి నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ శంకర్లు, బాలకిషన్, మాజీ సర్పంచ్ కదిరె శ్రీనివాస్‌గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
హనుమాన్కు క్షీరాభిషేకం
వేములవాడ: రాజన్న అనుబంధ నగరేశ్వరస్వామి ఆలయంలో హనుమాన్ భక్తులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వేములవాడ పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జై శ్రీ రామ్’ నామం మారుమోగింది. ఆలయ ఈవో రమాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కనకరపు రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. తూకంలో మోసంపై నిరసనఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైస్‌మిల్లర్లు తూకంలో మోసానికి పాల్పడుతున్నారంటూ మండలంలోని సింగారంలో రైతులు శనివారం కొనుగోలు కేంద్రంలో నిరసనకు దిగారు. కొద్దిసేపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. బస్తాకు 42.500 కేజీలు పెడితేనే దింపుకుంటామని మిల్లర్లు హెచ్చరించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకోవడంతో మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు మొదలయ్యాయి. -
అనుమానితులతో అప్రమత్తంగా ఉండాలి
● స్వీయ గణనకు నేడు తుది గడువు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల/సిరిసిల్ల అర్బన్: పదేళ్లకోసారి నిర్వహించాల్సిన జనగణన ఈసారి చాలా ఏళ్ల తరువాత జరుగుతుందని, జనగణన పేరుతో ఎవరైనా అనుమానితులు మీ ఇంటికొచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని.. జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. జిల్లా కేంద్రంలో స్వీయ జనగణనపై శనివారం అవగాహన వాక్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీచేసిన గుర్తింపుకార్డుల మీద క్యూఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్సైట్లో పొందిపరిచిన వారి వివరాలు వస్తాయని తెలిపారు. స్వీయగణనకు ఆదివారం చివరి అవకాశమని స్పష్టం చేశారు. సోమవారం నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వస్తారని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ముఖ్య ప్రణాళికాధికారి పీ.బీ.శ్రీనివాసాచారి, కమిషనర్ ఖదీర్‌పాషా, జిల్లా అధికారులు అఫ్జల్‌బేగం, సౌజన్య, లక్ష్మీరాజం, స్వప్న, తహసీల్దార్ జయంత్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, ఎస్వో సంపత్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించి తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడులో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. కేంద్రంలో రైతుల సౌకర్యాలు, దిగుబడి వివరాలు, హమాలీల గురించి ఆరా తీశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు వాహనాల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. మిల్లుల్లో జాప్యం చేయకుండా అన్లోడ్ అయ్యేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. డీఎస్వో బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, డీఏవో అప్టల్ బేగం, సహకారశాఖ అధికారి రామకృష్ణ, మెప్మా ఏవో మిర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ జయంత్ పాల్గొన్నారు. 11 నుంచి 17 వరకు విద్యాశాఖ వారోత్సవాలు ఈనెల 11 నుంచి 17 వరకు విద్యాశాఖ వారోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. డీఈవో జగన్మోహన్రెడ్డి, డీఐఈవో శరత్, సీపీవో శ్రీనివాసాచారి పాల్గొన్నారు. -
అమ్మ ప్రోత్సాహంతోనే ఐపీఎస్‌గా..
గోదావరిఖని(రామగుండం): నా విజయంలో చిన్నప్పటి నుంచి అమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మ కిరణ్కుమారిఝా కెమిస్ట్రి రిటైర్డ్ ఫ్రొఫెసర్. బిహార్ రాష్ట్రం మధుబని సొంత స్థలం. తండ్రి నందికిషోర్ఝా ఎంబీబీఎస్ డాక్టర్. సోదరి పారుల్ప్రియా సుంప్రీకోర్టు న్యాయవాది. సోదరుడు క్లిసైకిషోర్ఝా మైరెన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో మా నిర్ణయానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సొంత ప్రాంతమైన మదుబనిలో 12వ తరగతి వరకు చదివా. తిర్చి ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. చిన్ననాటి నుంచి పోలీస్‌శాఖలో చేరాలనే ఆకాంక్ష ఉండేది. సివిల్స్ రాసి ఐపీఎస్‌గా ఉద్యోగం సాధించా. అమ్మ అన్ని విషయాల్లో తోడుంటూ మమ్మల్ని ప్రోత్సహించింది. ఏనాడూ టార్గెట్ పెట్టి చదివించలేదు. కెమిస్ట్రి ప్రొఫెసర్‌గా చేస్తూనే ఉన్నత విద్యాభ్యాసానికి బాటలు వేసింది. ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ రుణం తీర్చుకోలేనిది. – అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండంతల్లీ.. నీకువందనం..‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా’.. ‘అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తీయనంటా’.. అని కొందరు సినీ కవులు అన్నట్లు అమ్మ మాటల్లో తీయదనం ఉంటుంది. సృష్టికి మూలమైన రెండక్షరాల అమ్మ అనే పదం ప్రతీ గుండెను తాకుతుంది. తల్లి తమ పిల్లలకు ధైర్యం నింపుతుంది. నవమాసాలు కడుపున మోయడంతో మొదలయ్యే తల్లి బాధ్యత తన చివరి అంకం వరకు ఉంటుంది. నాన్న భవిష్యత్‌ను తీర్చిదిద్దితే.. తల్లి బతుకును అందిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పలువురు తల్లులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కన్న బిడ్డలను కంటికి పాపలా కాపాడుకుంటున్నారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. అచేతన స్థితిలో ఉన్న బిడ్డలకు అన్నీతానై సేవలందిస్తున్నారు. పేదరికం వారిని పగబట్టినా బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మాతృమూర్తులు. ఆదిలోనే మాంగళ్య బంధం తెగిపోయినా అధైర్య పడకుండా నేనున్నాను అంటూ అండగా ఉంటున్నారు. బిడ్డలను ఉన్నత శిఖరాలకు చేర్చి వారి కళ్లలో ఆనందాన్ని నింపుకుంటూ అమ్మతనాన్ని చాటుకుంటున్నారు. అనాథలైన చిన్నారులను చేరదీసి వారికి అమ్మలవుతున్నారు మరికొందరు. కొందరు తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. పలువురు ఉద్యోగులు.. ఇంట్లో తల్లిగా.. సమాజంలో అధికారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భూదేవి అంత ఓపికతో.. కన్న బిడ్డలకు అండగా ఉంటున్న మాతృమూర్తి నీకు వందనం.. నేడు మదర్స్ డే సందర్భంగా...కొత్తపల్లి(కరీంనగర్): కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త శ్రీరాముల శ్రీనివాస్ సహకారంతో ఒత్తిడి తెలియకుండా ఉద్యోగంలో రాణిస్తున్నా. రెవెన్యూ శాఖలో పని ఒత్తిడి ఉన్నా ఇంట్లో అర్థం చేసుకునే భర్త, సహకరించే అత్త ఉండడం వల్లే ఉద్యోగం, ఇంటి బాధ్యతలను బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. అమ్మ అనేది ఒక సంబంధం కాదు.. కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమానంగా నడిపించే శక్తి. మదర్స్ డే సందర్భంగా ప్రతీ తల్లికి గౌరవం, గుర్తింపు, సహకారం అందాలని కోరుకుంటున్నా. – రేవెల్లి వెంకటలక్ష్మి, తహసీల్దార్, కొత్తపల్లి -
అన్ని వార్డుల అభివృద్ధే ధ్యేయం
● మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ సిరిసిల్ల అర్బన్: మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామని మున్సిపల్ చైర్పర్సన్ జింద కళ పేర్కొన్నారు. 9వ వార్డులో స్థానిక కౌన్సిలర్ దొంతరవేణి కళ్యాణితో కలిసి రూ.3లక్షలతో చేపట్టే పోచమ్మ గుడి అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజ చేశారు. వైస్‌చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు ఎలుక వెంకటేశం, బత్తుల రమేశ్, మాజీ కౌన్సిలర్లు సత్యనారాయణ, పూర్ణచందర్, అశోక్‌రావు, సంపత్, సాయికృష్ణ, సింగిల్‌విండో చైర్మన్ జెల్ల కిషన్ పాల్గొన్నారు. వీహెచ్ దీక్షకు ‘సంగీతం’ సంఘీభావం సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో ఓబీసీలను కూడా లెక్కించాలన్న వీహెచ్ దీక్షకు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం ఓబీసీ ఎంపీల ఫోరం మాజీ కన్వీనర్, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల అభ్యున్నతికి, బీసీ జనాభా ప్రతిపాదికగా న్యాయం జరగాలంటే జనగణనలో బీసీ జనాభా కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. వీహెచ్‌కు పూలదండ వేసి మద్దతు పలికారు. వినియోగదారులకు ‘వాట్సాప్ చాట్‌బాట్’ సేవలు వేములవాడ: ఎన్పీడీసీఎల్ వినియోగదారులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తున్నామని జిల్లా సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ టి. వేణుమాధవ్ శనివారం తెలిపారు. ఈనెల 8 నుంచి వాట్సాప్ చాట్‌బాట్(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సేవలు ప్రారంభించినట్లు వివరించారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సమాధానం తెలుసుకోవచ్చన్నారు. విద్యుత్ బిల్లులు, ఫిర్యాదులు, విద్యుత్ అంతరాయ సమాచారం వంటివి తెలుసుకోవచ్చని తెలిపారు. 87124 81489 ద్వారా వాట్సాప్‌లోకి వెళ్లి కావలసిన సేవలను సులభంగా పొందవచ్చన్నారు. నేరుగా ఈ లింక్‌పై https://wa.me/918712481 489 క్లిక్ చేయవచ్చని తెలిపారు. ఐడీటీఆర్‌లో డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రెయినింగ్సిరిసిల్ల అర్బన్: డ్రైవర్ల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మూడు రోజుల రిఫ్రెషర్ ట్రెయినింగ్‌ను ఐడీటీఆర్‌లో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సి పాల్ తెలిపారు. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం డ్రైవర్లు, స్కూల్, కాలేజీ బస్ డ్రైవర్లు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయిన డ్రైవర్లు ఈ శిక్షణ తప్పనిసరిగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రతీ సోమవారం, గు రువారం కొత్త బ్యాచ్‌లతో ప్రారంభమవుతుందని, ప్రతీ బ్యాచ్‌లో 100 మంది డ్రైవర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. వివరాలకు 89 854 31720లో సంప్రదించాలని సూచించారు. 11న సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు సిరిసిల్ల అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పోటీల్లో 8, 10, 12, 14 ఏళ్ల బాల, బాలికలకు ఎంపిక పోటీలు సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 17న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. -
అమ్మ జ్ఞాపకంగా నిత్యాన్నదానం
సప్తగిరికాలనీ(కరీంనగర్): చిన్నతనంలోనే అమ్మ దూరమవగా.. తన జ్ఞాపకార్థం వేల మంది కడుపు నింపుతున్నాడు రేకుర్తికి చెందిన చెందిన గోదరి జితేందర్. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన ఆయన రేకుర్తిలో స్థిరపడ్డాడు. తన రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. ఆమె జ్ఞాపకార్థం 2016 ఫిబ్రవరి 15న గోదరి కాంతలక్ష్మి సేవా సమితిని స్థాపించాడు. ‘అమ్మ ప్రేమ.. సమాజ సేవ’ నినాదంతో 2020 నవంబర్ 27 నుంచి ప్రారంభించిన నిత్యాన్నదానం నేటికి 1,987 రోజులుగా నిరంతరంగా కొనసాగుతోంది. భార్య శరణ్య, స్నేహితులు, బంధువుల సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. తాను బతికున్నంతకాలం అమ్మ జ్ఞాపకార్థం నిత్యాన్నదానం కొనసాగుతుందని జితేందర్ చెబుతున్నాడు. -
‘బంగారు’ తల్లి..
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీకి చెందిన బంగారు లక్ష్మి–రాజయ్య దంపతులకు ఐదుగురు కూతుళ్లు. వారి చిన్నతనంలోనే 2000 సంవత్సరంలో అనారోగ్యంతో రాజయ్య మృతిచెందాడు. అప్పటి నుంచి లక్ష్మి కూరగాయలు విక్రయిస్తూ, కూలీ పనులు చేస్తూ కూతుళ్లను చదివించి అందరికీ పెళ్లి చేసింది. ప్రసుత్తం చిన్న కిరాణ షాపు నడుపుతోంది. పెద్ద కుమార్తె స్వరూప డిగ్రీ పూర్తి చేసి ఆశవర్కర్‌గా ఉద్యోగం చేస్తోంది. రెండో కూతురు మంజుల 10వ తరగతి చదివి ఇంట్లోనే కుట్టు మిషన్ వర్క్ చేసుకుంటోంది. మూడో కూతురు రమాదేవి ఎంబీఏ చదివి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. నాలుగో కుమార్తె పద్మిని పీజీ చేసింది. ఐదో కుమార్తె సంగీత పీజీ (ఎమ్మెస్సీ) పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తోంది. -
తాగునీటి కటకట
ఈ చిత్రం సిరిసిల్ల శివారులోని ఇప్పలపల్లె ప్రాంతం. గుంపులుగా మహిళలు వెళ్లి కిలోమీటరు దూరంలో ఉన్న కరెంటు మోటారు నుంచి నీటిని ఎత్తుకొస్తున్నారు. ఇక్కడి బోర్లలో నీరడుగంటి పోతున్నాయి. 200 కుటుంబాల్లో సుమారు వేయి మంది ఎండాకాల కన్నీటి కష్టాలు పడుతున్నారు. పలుసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్లలో మిషన్ భగీరథ స్వరూపంజనాభా : 1,10,000 వార్డులు : 39 నివాసాలు : 31,601 నల్లాలు : 16,510 పైపులైన్ పొడవు : 139.80 కిలోమీటర్లు అంతర్గత పైపులైన్ : 130.5 కిలోమీటర్లు ప్రధాన పైపులైన్ : 9.5 కిలోమీటర్లు నిర్మాణ వ్యయం : రూ.60 కోట్లు -
రాష్ట్ర ప్రగతికి కేంద్రం పెద్దపీట
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్లటౌన్: తెలంగాణ సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్లలోని తన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మే 10న తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి, పలు ప్రాజెక్టులను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, జిల్లా కోశాధికారి ఆసాని రామలింగారెడ్డి, మెరుగు శ్రీనివాస్, సీనియర్ నాయకులు గజభీంకార్ చందు, ఊరగొండ రాజు, ఎర్రం విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో చేరిన డీఎస్పీ వెంకటేశ్వర్లు
సిరిసిల్ల: చందుర్తి సీఐగా పనిచేస్తూ ఇటీవల డీఎస్పీగా పదోన్నతి పొందిన గాండ్ల వెంకటేశ్వర్లును జిల్లాకు కేటాయిస్తూ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు వెంకటేశ్వర్లు డీఎస్పీ హోదాలో ఎస్పీ మహేశ్ బీ గీతేను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి విధుల్లో చేరారు. వెంకటేశ్వర్లు 2001లో కోనరావుపేట ఎస్సైగా జిల్లాలో విధుల్లో చేరారు. అప్పట్లో నక్సలైట్ల ప్రాబల్యం గల కోనరావుపేట మండలంలో సమర్థ అధికారిగా పనిచేశారు. ఎల్లారెడ్డిపేటలోనూ ఎస్సైగా పనిచేశారు. సీఐగా ఏసీబీలో పనిచేసిన వెంకటేశ్వర్లు సీఐగా చందుర్తిలో పనిచేశారు. డీఎస్పీగా పదోన్నతి పొంది జిల్లాకు రావడం విశేషం. -
పొద్దుతిరుగుడు అమ్ముడేలా?
ఇల్లంతకుంట(మానకొండూర్): సన్‌ఫ్లవర్(పొద్దు తిరుగుడు) అమ్మకాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇల్లంతకుంట మండలంలో నర్సక్కపేట, ముస్కాన్‌పేట, పత్తికుంటపల్లి, గాలిపెల్లి, ఆరేపల్లె, రేపాక గ్రామాల్లో రబీ సీజన్లో 1600 ఎకరాల్లో సన్‌ఫ్లవర్ సాగు చేశారు. పంట దిగుబడి అధికంగా రావడంతో రైతులు ఏఎంసీ కేంద్రానికి పొద్దతిరుగుడు ఉత్పత్తులను తీసుకొచ్చారు. మార్కెట్‌శాఖ అధికారులు మాత్రం కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రైతుల వద్దే దిగుబడులు మండలంలో సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 2,393 క్వింటాళ్ల పొద్దుతిరుగుడును 163 మంది రైతుల నుంచి మార్కెటింగ్ అధికారులు కొనుగోలు చేశారు. ఇంకా ఇల్లంతకుంట ఏఎంసీ షెడ్లలో 8 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలుకు సిద్ధంగా ఉంది. రైతుల ఇండ్లలో మరో 8 వేల క్వింటాళ్ల వరకు ఉన్నట్లు తెలిసింది. అధికారులు మా త్రం తమ టార్గెట్ పూర్తయింందని చెబుతున్నారు. దండుకుంటున్న దళారులు ప్రభుత్వం క్వింటాల్ పొద్ద తిరుగుడుకు మద్దతు ధర రూ.7,721 పెడుతుంది. అయితే ప్రైవేట్ వ్యా పారులు మాత్రం క్వింటాల్‌కు రూ.5,500 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తూ ఒక్కో క్వింటాల్‌కు రూ.2వేలకు పైగానే నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించిన మద్దతు ధర కు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఇసుక ట్రాక్టర్ల అడ్డగింత
ఇల్లంతకుంట(సిరిసిల్ల): మండలంలోని పొత్తూరు మానేరు వాగు రీచ్ నుంచి శుక్రవారం ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్లను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. పొత్తూరు మానేరువాగు నుంచి ఇసుకను ప్రైవేటు కంపెనీ కోసం ప్రొక్లెయిన్లతో తోడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా ఇసుక తరలించడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పొత్తూరు సమీపంలోని ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ సురేశ్, ఎస్సై సిరిసిల్ల అశోక్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఇసుక తరలింపును అడ్డుకోవద్దని సూచించారు. మైనింగ్, ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఎస్సై–2 లక్పతి, రైతులు పట్నం శ్రీనివాస్, బండారి నరేశ్, మహేందర్, సతీశ్, కుదురు శేఖర్ పాల్గొన్నారు. -
తాగునీటి పైపులైన్ పాడైంది
మా కాలనీలో వేయి మందిమి ఉంటున్నాం. తాగునీటి పైపులైన్ పాడై మూడేళ్లుగా గోస పడుతున్నాం. ట్యాంకర్ల ద్వారా నీరు పోస్తున్నా సరిపోవడం లేదు. డబుల్బెడ్రూమ్ గృహాల్లో పై అంతస్తుల్లో ఉండేవాళ్లు ట్యాంకర్ నుంచి బిందెలతో మోసుకుపోయేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మా కాలనీలోని ట్యాంకు పూర్తయితేనే మాకు నీళ్ల బాధ తీరుతుంది. – మంచాల పుష్పలత, డబుల్బెడ్రూం కాలనీ, పెద్దూరు ఏడాదిగా గోస పడుతున్నం ఏడాదిగా నీళ్లకు అరిగోస పడుతున్నం. ఎండాకాలం మొదలైనప్పటి నుంచి వార్డులో ఏ బోరులో నీరుంటే అక్కడికి పోయి తెచ్చుకుంటున్నాం. తాగునీటి కోసం నల్లాలు పెట్టే వ్యక్తిని అడిగితే కోపానికి వస్తుండు. అడుగంగ..అడుగంగ ట్యాంకర్ పంపిస్తారు. తాగడానికి నీళ్లు సాలవు. పొలాల వద్ద వ్యవసాయ బావుల వద్ద మొగోళ్లు తానాలు చేస్తుండ్రు. ఆడోళ్లు అరిగోస పడుతుండ్రు. – గొర్రె పద్మ, ఇప్పలపల్లె ప్రత్యేక నిధులు వెచ్చించాం మానేరులో రూ.5లక్షలతో పైపులైన్ ద్వారా పెద్దూరు, శివారుపల్లెలకు నీరందిస్తాం. మిషన్ భగీరథ నీళ్లు రాకుంటే ట్యాంకర్లు పంపుతాం. ప్రజల అవసరాలను బట్టి కొత్త బోర్లు వేయిస్తున్నాం. పట్టణంలో 17 మోటార్లు రిపేర్లు చేయిస్తున్నాం. సిబ్బంది, అధికారులతో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. – జిందం కళ, మున్సిపల్ చైర్పర్సన్ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశాం సిరిసిల్ల, విలీనగ్రామాల్లో ప్రత్యేకంగా సమ్మర్ ప్లాన్ అమలు చేస్తున్నాం. తాగునీటి సమస్యపై చర్యలు తీసుకునేందుకు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. 78935 93330కు ఫోన్ చేస్తే సత్వరమే పరిష్కరిస్తాం. నీళ్లు రాని ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా అందిస్తున్నాం. డబుల్బెడ్రూమ్ కాలనీకి ట్యాంకర్లు పంపిస్తున్నాం. పట్టణంలో పాడైన పవర్‌బోర్లను రిపేర్లు చేయిస్తున్నాం. – ఎం.ఎ.ఖదీర్‌పాషా, మున్సిపల్ కమిషనర్ -
పనిచేసినోళ్లకు గుర్తింపు
● డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సిరిసిల్లటౌన్: పార్టీ కోసం పనిచేసినోళ్లకు గుర్తింపు దక్కుతుందని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీస్‌లో శుక్రవారం ఎస్సీసెల్ అధ్యక్షుడి పదవి కోసం జరిగిన దరఖాస్తుల స్వీకరణలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఎస్సీసెల్ పరిశీలకులు కొరివి అరుణ్‌కుమార్ పరిశీలించారు. పార్టీలో మూడేళ్లకు పైగా పనిచేసిన అనుభవం, నిబద్ధత గల వారికి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులుగా నియమించే అవకాశం ఉందని తెలిపారు. ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఆకునూరు బాలరాజు, జిల్లా ఆర్టీఏ మెంబర్ సంగీతం శ్రీనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ కిరణ్, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు మేకల కమలాకర్ పాల్గొన్నారు. సమాజ సేవకులకు చేయూతనిద్దాం ముస్తాబాద్(సిరిసిల్ల): స్వార్థం లేకుండా సమాజం కోసం పనిచేసే వారికి చేతనైనంత చేయూతనందించాలని సర్ధాపూర్ 17వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాందాస్ పేర్కొన్నారు. మండలంలోని గూడెం అన్నపూర్ణమ్మ ఫౌండేషన్‌కు రిఫ్రిజిరేటర్‌ను శుక్రవారం అందజేశారు. రాందాస్ మాట్లాడుతూ ఏడుగురు సాధారణ మహిళలు ఆరు నెలలుగా 60 మంది పేదలు, వృద్ధులకు రెండు పూటల భోజనాలు అందించడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ అధ్యక్షురాలు కుర్ర సావిత్రి, బొప్ప విజయ, దేవేందర్, పర్శరాములు తదితరులు పాల్గొన్నారు. పిల్లల హక్కులను కాపాడాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని లోక్ అదాలత్ సభ్యుడు, న్యాయవాది ఆడెపు వేణు కోరారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వేణు మాట్లాడుతూ పిల్లల భద్రత, హక్కుల పరిరక్షణ, లైంగిక వేధింపుల నివారణ లక్ష్యంగా సురక్షిత్ బచ్పన్ సురక్షిత్ భవిష్యత్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోక్సో చట్టంపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎస్.మల్లేశ్‌యాదవ్, లోక్ అదాలత్ సభ్యులు గుర్రం ఆంజనేయులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకుల ధర్నా వేములవాడ: కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వాహనాలపై బీజేపీ నాయకుల దాడిని నిరసిస్తూ శుక్రవారం వేములవాడలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందన్నారు. ఎమ్మెల్యే స్థాయి నాయకులకే రక్షణ లేకుండా పోయిందన్నారు. నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్‌గౌడ్, సిరిగిరి చందు, మారం కుమార్, వాసాల శ్రీనివాస్, కందుల క్రాంతికుమార్, గన్నమనేని రామారావు, కొండ కనకయ్య, నీలం శేఖర్, నీరటి మల్లేశం, అంజద్‌పాషా తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీవోగా లక్ష్మీనారాయణసిరిసిల్ల: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి(డీఆర్డీవో)గా కె.లక్ష్మీనారాయణను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎంపీడీవోగా ఉన్న లక్ష్మీనారాయణకు పదోన్నతి కల్పిస్తూ డీఆర్డీవోగా నియమించారు. -
వేగంగా అన్లోడింగ్ చేయాలి
● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్కోనరావుపేట(వేములవాడ): రైస్‌మిల్లుల్లో ధాన్యం అన్ లోడింగ్ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. కోనరావుపేట, ఎగ్లాస్పూర్, నాగారం, కనగర్తి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను, కొలనూర్‌లోని మారుతి రైస్‌మిల్లు, కనగర్తిలోని సరస్వతి, కనకదుర్గ రైస్‌మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. మిల్లులకు తరలించడానికి కాంట్రాక్టర్లతో మాట్లాడి వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మిల్లుల్లో అన్‌లోడింగ్‌కు జాప్యమవుతుందని, వెంటనే అన్లోడింగ్ చేయాలని సూచించారు. తహసీల్దార్ వరలక్ష్మి, నాయబ్ తహసీల్దార్ ప్రవీణ్ ఉన్నారు. -
రైతులు సుభిక్షంగా ఉండాలి
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట/వీర్నపల్లి: వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ ప్రాంత రైతులు సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో మల్లికార్జునస్వామి, దుమాలలోని శ్రీవేంకటేశ్వరస్వామి, వీర్నపల్లిలోని శ్రీజగదాంబమాత, సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ, గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ ముత్యాల పోచమ్మ దేవి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. దుమాలలో ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ ద్వారా రూ.50లక్షలు కేటీఆర్ మంజూరు చేయించారు. టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీలు ఎలుసాని మోహన్‌కుమార్, సుజాత, మాజీ ఏఎంసీ చైర్మన్ గుల్లపల్లి నరసింహారెడ్డి, సర్పంచ్‌లు సోమారం శరవింద్, పిట్ల ఎల్లయ్య, దయాకర్‌రావు, లక్ష్మణ్, అంజయ్య, కిష్టయ్య, దుబాసి రాజు తదితరులు పాల్గొన్నారు. -
స్వీయ గణనలో పాల్గొనాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: జనగణన–2027లో భాగంగా స్వీయ గణన నమోదులో భాగస్వాములు కావా లని కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరీమా అగ్రవాల్ కోరారు. ఆదివారంతో స్వీయ గణన నమోదు ముగియనుందని తెలిపారు. స్వీయ గణనకు https:iise.census.gov.in వెబ్సైట్ ద్వారా లాగిన్ కావాలని సూచించారు. ప్రజల సమాచారం పూర్తిభద్రంగా ఉంటుందని వెల్లడించారు. 34 ప్రశ్నలకు సరైన సమాచారం నమోదు చేసి ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్నంబర్ 1855లో సంప్రదించాలని సూచించారు. నేడు జిల్లా కేంద్రంలో మారథాన్ జనగణన–2027 తొలి దశపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం ఉదయం 7 గంటలకు సిరిసిల్లలోని అంబేడ్కర్ కూడలి నుంచి బతుకమ్మ ఘాట్ వరకు మారథాన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. లాడ్జీల్లో పక్కా సమాచారం ఉండాలివేములవాడ: లాడ్జీలలో పక్కా సమాచారం ఉండాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరికీ గదులు అద్దెకు ఇవ్వరాదని డీఎస్పీ శ్రీనివాసులు లాడ్జీ నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం రాత్రి టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సై రాంమోహన్‌తో కలిసి లాడ్జీలను తనిఖీ చేశారు. లాడ్జీలలో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
పట్టాలిచ్చినా.. ఆన్లైన్ చిక్కులు!
వీర్నపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వం పట్టాలిచ్చిందని సంతోష పడాలో.. ఆన్లైన్లో వివరాలు లేవని బాధపడాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు రైతులు. అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా భూమి పట్టాలు అందుకున్న రైతులు.. తమ బతుకులు బాగుపడతాయని సంబరపడ్డారు. కానీ చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే భూముల వివరాలు ఆన్లైన్లో లేక ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో భూముల వివరాలు లేకపోవడంతో ధాన్యం కొనబోమంటూ ఐకేపీ అధికారులు తెలపడంతో ఏం చేయాలో తెలియక రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట రైతులు దిక్కులు చూస్తున్నారు. ఆనందం ఆవిరి గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, అప్పటి కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆధ్వర్యంలో రంగంపేటలో పలువురి రైతులకు భూ పట్టాలు పంపిణీ చేశారు. రెవెన్యూ అధికారుల సంతకాలతో కూడిన అధికారిక పహాణి ప్రతులను రైతులకు మంత్రి అందజేశారు. దీంతో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతోపాటు ధాన్యం విక్రయాల్లో తమ కు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఆ గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు ఆశపడ్డారు. ఆన్లైన్లో కనిపించని వివరాలు ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ధాన్యం తూకం వేసే సమయంలో సర్వేనంబర్లు ఆన్లైన్లో చూపించడం లేదంటూ ఐకేపీ నిర్వాహకులు చెప్పడంతో రైతులు షాక్‌కు గురయ్యారు. అప్పటి మంత్రి చేతుల మీదుగా, రెవెన్యూ అధికారుల సంతకాలతో అందిన పట్టాలు ఉన్నప్పటికీ, డిజిటల్ రికార్డుల్లో నమోదు కాకపోవడం ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. ఈ సమస్యపై ఏపీఎం దేవరాజు, ఏఈవో ఫాజిల్‌ను వివరణ కోరగా.. కేవలం రైతుబంధు వస్తున్న రైతుల ధాన్యాన్ని మాత్రమే ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నామని, ఈ సమస్య రెండు రోజులలో పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. -
ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని రైస్‌మిల్లర్లను, ప్యాడీసెంటర్ల సిబ్బందిని అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. మండలంలోని చింతలకుంటపల్లె, తాళ్లపల్లి గ్రామాల రైస్‌మిల్లులను అనంతారం, పెద్దలింగాపురం, రామాజీపేట ప్యాడీసెంటర్లను గురువారం సందర్శించి మాట్లాడారు. లారీల కొరత ఉంటే స్థానికంగా ఉండే ట్రాక్టర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. పెద్దలింగాపురం కొనుగోలు సెంటర్లో రైతులు లారీల కొరత తీవ్రంగా ఉందని అన్లోడింగ్ సమస్య ఉందని అడిషనల్ కలెక్టర్ దృష్టి తీసుకొచ్చారు. తహసీల్దార్ సురేష్, సర్పంచ్ మామిడి రాజు, ఏపీఎం కుమారస్వామి, ఆర్ఐ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. లారీల కోసం రోడ్డెక్కిన రైతులు బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత ఏర్పడడంతో గురువారం పలువురు రైతులు కొదురుపాక చౌరస్తాలో పడిగాపులు కాశారు. లారీలను ఆపి కొనుగోలు కేంద్రాలకు రావా లని కోరారు. రైతులకు మద్దతుగా బీజేపీ మండల నాయకులు కొనుకటి హరీశ్ లారీ లను కేంద్రాలకు మళ్లించేందుకు ప్రయత్నించారు. ఆర్ఐ మనోజ్ సైతం లారీలు కేంద్రాలకు పంపేందుకు ప్రయత్నించారు. బీడీ కార్మికులకు పెరిగిన వేతనం ముస్తాబాద్(సిరిసిల్ల): బీడీలు చుట్టే కార్మికురాలితోపాటు ఇతర విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు మూల వేతనం పెంచుతూ బీడీ కంపెనీ యాజమాన్యాలు, కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈమేరకు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో కార్మిక సంఘాలకు, బీడీ కంపెనీ యజమాన్యాల మధ్య గురువారం చర్చలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిగొండ నారాయణ తెలిపారు. నూతన ఒప్పందంలో బీడీ కార్మికురాలికి రూ.6 పెంచడంతో వెయ్యి బీడీలకు వేతనం రూ.275.24 అయ్యిందని తెలిపారు. ప్యాకర్లకు మూల వేతనం రూ.4,500, బట్టి కార్మికులు, టేబుల్ క్లర్కులు, ఇతర సిబ్బందికి నెలకు రూ.2200 పెరిగిందని వివరించారు. పెరిగిన వేతనాలు మే నుంచి వర్తిస్తాయని తెలిపారు. బీఆర్ఎస్ నేతల అరెస్టుసిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నా యకుల అరెస్ట్ నేపథ్యంలో నిరసనలు మిన్నంటాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అ ధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్ సహా పలువురు నేతలను పోలీసులు గురువారం ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, ఎలుక వెంకన్న, నంది శంకర్, అన్నారం శ్రీనివాస్, సబ్బని హరీశ్ పాల్గొన్నారు. సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లాలిసిరిసిల్ల: జిల్లా పరిధిలోని పలు పోలీస్స్టేషన్లలో వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకుని, సీజ్ చేసిన వాహనాలను యజమానులు తీసుకెళ్లాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. 15 వాహనాలను జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఆరు నెలల్లోపు సంబంధిత పత్రాలు సమర్పించి వాహనాలు తీసుకెళ్లవచ్చని తెలిపారు. గడువులోగా తీసుకెళ్లకపోతే నిబంధనల ప్రకారం వేలం వేయనున్నట్లు ప్రకటించారు. వివరాలకు 87126 56428, 90009 10619లో సంప్రదించాలని తెలిపారు. -
మిల్లుల్లో హమాలీల సంఖ్య పెంచాలి
సిరిసిల్ల: జిల్లాలోని రైస్‌మిల్లుల్లో హమాలీల సంఖ్యను పెంచి వేగంగా ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చూడాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ మార్కెట్ కమిటీ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ధాన్యం రాశులు పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. మిల్లర్లు హమాలీల సంఖ్యను పెంచి వెంటవెంటనే ధాన్యం అన్లోడింగ్ చేయాలని ఆదేశించారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ జయంత్‌కుమార్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై టెలీకాన్ఫరెన్స్ ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ అన్ని మండలాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. 9న జనగణనపై మారథాన్ స్వీయ గణనకు మే 10వ తేదీ చివరిది కావడంతో అందరూ స్వీయగణనను చేసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. ఈనెల 9న జనగణనపై జిల్లా కేంద్రంలో మారథాన్ రన్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. జనగణనపై రాష్ట్ర సంచాలకులు భారతి హోళికేరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీపీవో పీ.బీ.శ్రీనివాసాచారి, డీపీవో షరీపొద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఖధీర్‌పాషా, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, ఈడీఎం శ్రీనివాస్, ఎస్వో సంపత్‌కుమార్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ పాల్గొన్నారు. -
ఏటీఎం దొంగలు ఏమయ్యారు?
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం మిషన్ దొంగతనం సంఘటన ఇంకా కొలిక్కి రాలేదు. చోరీ జరిగి 27 రోజులు గడుస్తున్నా దొంగలను పోలీసులు పట్టుకోలేకపోయారు. గత నెల 11న అర్ధరాత్రి సంఘటన జరుగగా.. ఇప్పటి వరకు దొంగలకు సంబంధించిన ఎలాంటి క్లూ దొరకలేదు. ఇప్పటికీ పోలీస్ బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం. వరుస ఘటనలతో భయం..భయం ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లిన దొంగల ఆచూకీ కోసం జిల్లా పోలీసులు మొదట్లో ఒక డీఎప్పీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైల ఆధ్వర్యంలో 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు మహారాష్ట్రతోపాటు సరిహద్దు జిల్లాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ జ్యువెల్లరీ షాప్‌లో జరిగిన దొంగతనం సంఘటనతో ఏటీఎం మిషన్ చోరీ ఘటనను జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అసలే వేసవికాలం.. అందరూ ఆరుబయట పడుకునే అవకాశం ఉందని.. ఇదే అదునుగా దొంగలు తెగబడితే పరిస్థితి ఏంటని భయాందోళన చెందుతున్నారు. అపరిచిత వ్యక్తులపై నిఘా గ్రామాల్లో సంచరిస్తున్న అపరిచితులపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. గ్రామాల్లోకి సంబంధం లేని వ్యక్తులు వస్తే తమకు సమాచారం అందించాలని ఇప్పటికే పోలీసులు ప్రచారం చేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు, కొత్త వ్యక్తుల సంచరిస్తే ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఏటీఎం మిషన్ చోరీ విషయంలో కూడా అపరిచితులు వారం ముందు నుంచే రెక్కి నిర్వహించారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. సరిహద్దుల్లో ఇప్పటికీ తనిఖీలు జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్‌ల వద్ద ఇప్పటికీ దొంగల కోసం తనిఖీలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కరీంనగర్ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జ్యువెల్లరీ దొంగలతోపాటు ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లి వారిని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రహదారుల వెంట ఉన్న సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నారు. -
● కేటీఆర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలి ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గుచేటుసిరిసిల్లటౌన్: కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్‌కుమార్ హేయమైన భాషతో తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వ్యాఖ్యలు సిగ్గుచేటని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గురువారం ప్రెస్మీట్లో మాట్లాడారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి ఇంటికి కూతవేటు దూరంలో నగలషాపులో దొంగలు తుపాకులతో వచ్చి దోచుకెళ్లడంపై కేటీఆర్ విమర్శించడం ప్రతిపక్ష నేతగా బాధ్యత అని పేర్కొన్నారు. కరీంనగర్లో శాంతిభద్రతలు కాపాడాల్సింది పోయి అనుచరులు, గూండాలతో ఎమ్మెల్యే గంగుల క్యాంపు ఆఫీస్, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కారుపై దాడులు చేయించం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పేర్కొన్నారు. హేయమైన భాషను మాట్లాడకుండా ఉండటం నేర్చుకోవాలని హితవు పలికారు. కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హుందాగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఎస్‌పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, నాయకులు మ్యాన రవి, గుండ్లపెల్లి పూర్ణచందర్, కుంభాల మల్లారెడ్డి, నంది శంకర్ పాల్గొన్నారు. ఫైర్ సిబ్బంది మాక్డ్రిల్సిరిసిల్లటౌన్: జిల్లా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదాల నివారణపై గురువారం ఫైర్ సిబ్బంది అవగాహన కల్పించారు. ఫైర్ ఆఫీసర్ ఎన్.నరేందర్ మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై మాక్‌డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ విద్యార్థులకు 15వేల సైకిళ్లిస్తా
సిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ఈ ఏడాది కూడా 15వేల సైకిళ్లు అందిస్తానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌మార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సినారె కళామందిరంలో గురువారం ఇండియన్ ఆయిల్ కంపెనీ సీఎస్ఆర్ కింద దివ్యాంగులకు రూ.83 లక్షల విలువైన 813 ఉపకరణాలు పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ భవిష్యత్‌లో అర్హులైన దివ్యాంగులకురి ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఎంతో మంది దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. దివ్యాంగులకు అందరూ మద్దతుగా ఉండాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలని, డ్రాపౌట్స్ ఉండవద్దని తెలిపారు. దివ్యాంగులు సంక్షేమానికి కృషి చేస్తున్న కలెక్టర్ గరీమా అగ్రవాల్, అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో యూడీఐడీ కేంద్రంలో అన్ని వసతులు కల్పించామని, వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రతి నెలా చేయిస్తున్నామని వివరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వినికిడి యంత్రాలు, బ్యాటరీ సైకి ల్స్, సుగమ్య కేన్, స్మార్ట్ ఫోన్, ఇతర పరికరాలు అందజేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, మార్కెట్ కమి టీ చైర్పర్సన్ స్వరూపారాణి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఐఓసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ వినీత్కౌల్, సీఎస్ ఆర్ హెడ్ హైదరాబాద్ కై లాస్కాంత్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్ పాల్గొన్నారు. మోదీ సభకు భారీగా తరలిరండి సిరిసిల్ల: ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 10న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగసభకు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్కే కన్వెన్షన్ హాల్లో గురువారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ తరువాత ప్రధాని తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. సభకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్న వారికి తగిన రవాణా, భోజన సౌకర్యాలు కల్పించాలన్నారు. మోదీ సభ సక్సెస్‌తో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం తథ్యమనే సంకేతాలు పంపుదామని స్పష్టం చేశారు. ఈనెల 12న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో నిర్వహించే హిందూ ఏక్తాయాత్రకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్‌రావు, పార్టీ నాయకులు అల్లాడి రమేశ్, ఎర్రం మహేశ్, గరిపెల్లి ప్రభాకర్, బండ మల్లేశం, దుమాల శ్రీకాంత్ పాల్గొన్నారు. -
దోపిడీకి స్కెచ్!
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026● దేశవ్యాప్తంగా సుశిక్షితులైన 70 మందితో క్రిమినల్ నెట్వర్క్ ● బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కేసులు ● చోరీ చేసిన మొబైళ్లు, ఎన్క్రిప్టెడ్ యాప్స్ (ఫేస్టైంతోసహా)తో జైలు నుంచే వీడియో కాల్స్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఆదేశాలు. ● గోల్డ్ లోన్ కంపెనీలు, నగల దుకాణాలు, జువెల్లరీ షోరూంలే టార్గెట్ ● అనుచరులకు వేతనాలు, నేరాల్లో ప్రతిభ కనబరిస్తే బోనస్‌లు ● పలు రాష్ట్రాల్లో తనిష్క్, మణప్పురం, ముత్తూట్ తదితర సంస్థల నుంచి 30కిలోలకు పైగా బంగారం తస్కరణ. ● పారిపోయేందుకు ప్రత్యామ్నాయాలు, దోపిడీకి ముందు రెక్కీ ఈ గ్యాంగ్ ప్రత్యేకత. ● ప్రస్తుతం బిహార్, వెస్ట్‌బెంగాల్‌లో కేసులు. బిహార్ జైలు నుంచిసాక్షిప్రతినిధి,కరీంనగర్ : జులాయి సినిమాలో విలన్ ఒక దొంగ.. చోరీ చేసిన ప్రతిసారీ పోలీసులకు తప్పుడు క్లూ వదిలి.. తాను మాత్రం మరో మార్గంలో పరారవుతుంటాడు. దీనినే పోలీసు పరిభాషలో ‘అటెన్షన్ డైవర్షన్’ అంటారు. ఈ టెక్నిక్‌నే కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ దోపిడీలో దొంగలు వినియోగించినట్లు తెలుస్తోంది. దేశంలోని అనేక జువెల్లరీ షాపులను నిలువుదోపిడీ చేసిన బిహార్‌కు చెందిన ‘గోల్డ్ థీఫ్’ అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ గ్యాంగ్ ఉత్తర భారతంలో దోపిడీలు, కిడ్నాప్‌లు, అక్రమ వసూళ్లకు ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా గోల్డ్ థీఫ్కి క్రిమినల్ నెట్వర్క్ ఉంది. ఇతను కన్నేశాడంటే.. ఇతని అనుచరులు పథకం పన్ని బంగారం మొత్తం ఊడ్చి పారేస్తుంటారు. సుశిక్షితులైన దొంగలు కావడంతో ఇప్పటివరకు అన్నీ భారీ చోరీలే నమోదయ్యాయి. ప్రస్తుతం గోల్డ్ థీఫ్ బిహార్ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచే దోపిడీకి ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మపురికి వచ్చింది మొత్తం ఆరుగురు.. ఈనెల 3న.. కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్‌లో దొంగతనం చేసింది ఐదుగురు కాదు.. ఆరుగురిగా పోలీసులు గుర్తించారు. ఈనెల ఒకటిన ఉదయం ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జిలో తొలుత నలుగురు, తర్వాత మరొకరు వచ్చారు. ఇంకోవ్యక్తి సాయంత్రం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతడే ఈ ఽఐదుగురిని ధర్మపురి నుంచి ఛత్తీస్‌గఢ్ లేదా ఝార్ఖండ్ వైపు తప్పించి ఉంటాడని అనుమానిస్తున్నారు. జార్ఖండ్‌కు చెందిన సౌరభ్కుమార్మిశ్రా పేరుతో విజయలక్ష్మి లాడ్జిలో రూ.1200కు గది అద్దెకు తీసుకున్నారు. ధర్మపురిలో దైవదర్శనం కూడా చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఉత్తరభారతంలో దొంగలు చోరీకి ముందు పూజలు చేయడం ఆనవాయితీ. ఏప్రిల్ 27నుంచి 30వరకు దొంగలు పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో బస చేశారు. అక్కడ నుంచే దొంగతనానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్కడ కూడా జార్ఖండ్‌కు చెందిన చిరునామాతో గుర్తింపుకార్డులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే వ్యక్తులు మార్చి నెలలోనూ ఇదే లాడ్జిలో బస చేసినట్లు కూడా దర్యాప్తులో తేలింది. చోరీకి ముందు సిద్దిపేట పరిసరాల్లోనూ ఈ ముఠా సంచరించినట్లు సమాచారం. ఘటనాస్థలంలో మహారాష్ట్రకు చెందిన బ్యాగు, గోదావరి తీరంలో బైక్‌ను అటెన్షన్ డైవర్షన్ కోసమే కావాలని వదిలేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్సర్ బైకు చాసీస్‌ను గుర్తించిన పోలీసులు అది ఢిల్లీదిగా తేల్చారు. బ్యాగు, బైకు విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించి దర్యాప్తు జాప్యానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. అది అనుభవమున్న దొంగలకే సాధ్యం. చోరీలో పాల్గొన్న వారి ఆచూకీని ఇప్పటికే కనుగొన్న పోలీసులు బిహార్‌లోని నిందితుల ఇళ్లు, నిందితులు, స్నేహితుల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. ఎలాగైనా రెండు రోజుల్లో పట్టుకుంటామని ధీమాగా ఉన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై నిరసన
కోనరావుపేట(వేములవాడ): జిల్లాలో వడ్ల కొనుగోళ్ల జాప్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. కోనరావుపేట క్రాసింగ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఇసుక తరలింపునకు వందల లారీలు వస్తున్నాయని, కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో లారీల కొరత లేకుండా చూశారన్నారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించి, ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న నాయకులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధర్నాలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, మాజీ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య, సర్పంచ్ మల్లేశ్, ప్యాక్స్ వైస్ చైర్మన్ అనుపాటి భూంరెడ్డి, నాయకులు జవ్వాజి మల్లయ్య, కెంద గంగాధర్, తిక్కల నవీన్, రవీందర్‌గౌడ్, రమణారెడ్డి, శివతేజరావు, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోండి
● కరీంనగర్ గ్యాస్ లారీని అడ్డుకున్న డీలర్లు ● సివిల్ సప్లై అధికారికి ఫిర్యాదుసిరిసిల్లటౌన్: జిల్లాలో కరీంనగర్‌కు చెందిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అక్రమ నిల్వలకు పాల్పడుతున్నారని సిరిసిల్లలోని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఆరోపించారు. ఈమేరకు కరీంనగర్ నుంచి సిరిసిల్లకు బుధవారం వచ్చిన ఓ గ్యాస్ ఏజెన్సీ లారీని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పౌరసరఫరాలశాఖ డిప్యూటీ తహసీల్దార్ రజిత అక్కడికి చేరుకున్నారు. ఆమెతో స్థానిక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాట్లాడుతూ కరీంనగర్ నుంచి లారీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారన్నారు. ఈవిషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్వోకు నివేదించాం సంఘటనపై క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాం. ఇరువర్గాలకు పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి రావాలని సూచించాం. సిరిసిల్లలోని డీలర్ల ఫిర్యాదులను జిల్లా పౌర సరఫరాల అధికారికి నివేదించాం. ఉన్నతాధికారుల తదుపరి ఉత్తర్వులను అమలు చేస్తాం. – రజిత, సివిల్ సప్లై, డీటీ -
మిల్లర్లు హమాలీల సంఖ్య పెంచుకోవాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్బోయినపల్లి(చొప్పదండి): రైస్‌మిల్లర్లు హమాలీల సంఖ్య పెంచుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వెంటనే అన్లోడింగ్ చేయించుకోవాలని సూచించారు. మండలంలోని జగ్గారావుపల్లిలో సుహాస్ రైస్‌మిల్లును, కొదురుపాక కొనుగోలు కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. పౌరసరఫరాలశాఖ అధికారులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించిన రైతుల ఖాతాల్లో డబ్బులు వేగంగా జమయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఎల్.బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, డీఏవో అఫ్జల్‌బేగం, తహసీల్దార్ షరీఫ్ మొయినొద్దీన్, సర్పంచ్ సుద్దాల మధు పాల్గొన్నారు. లారీల సంఖ్యను పెంచాలి వేములవాడఅర్బన్: వేములవాడ అర్బన్ మండలం అనుపురంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గరీమా అగ్రవాల్ బుధవారం పరిశీలించారు. ఇప్పటి దాకా ఎంత ధాన్యం వచ్చింది, ఎంత కొనుగోలు చేశారు, రైస్‌మిల్లులకు ఎంత తరలించారు అని ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకానికి అనుగుణంగా లారీలు సమకూర్చాలని ఆదేశించారు. -
వస్త్రపరిశ్రమలకు ప్రభుత్వం అండ
సిరిసిల్ల: వస్త్రపరిశ్రమకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. కోటి ఇందిరా మహిళాశక్తి నూతన చీరల ఆర్డర్‌ను అందించామని, గడువులోగా అందించాలన్నారు. కలెక్టరేట్లో బుధవారం చేనేత, జౌళిశాఖ ఇందిరా మహిళాశక్తి కొత్త చీరల రంగులను ఆవిష్కరించి, ఆర్డర్లను వస్త్రోత్పత్తిదారులకు అందించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వస్త్రపరిశ్రమ సంక్షేమం, ఆర్థిక వృద్ధికి ఈ ఆర్డర్లు ఎంతో మేలు చేస్తాయన్నారు. గత ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్ పూర్తి చేసిన వస్త్ర పరిశ్రమ బాధ్యులను అభినందించారు. కొత్త చీరల ఆర్డర్లతో సిరిసిల్లలోని మ్యాక్స్ సంఘాలకు ఆరు నెలల పాటు ఉపాధి లభిస్తుందన్నారు. స్థానిక వస్త్రపరిశ్రమకు 25 హెచ్‌పీల వరకు 50 శాతం విద్యుత్ రాయితీ, కేటగిరీ మార్పు వంటి సమస్యలను పరిష్కరించామన్నారు. చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ చీరలు నాణ్యతగా ఉన్నాయని, రానున్న ఆర్డర్లు సైతం నాణ్యతతో తయారు చేయాలని సూచించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ స్థానిక వస్త్రపరిశ్రమలో తయారైన ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళలు ధరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్మికుల శ్రమ, పనితనానికి ఈ చీరలు గుర్తుగా నిలుస్తాయన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూప, రాములునాయక్, చేనేత జౌళి శాఖ జేడీ వెంకటేశ్వరరావు, ఏడీ సంతోష్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో వేగం పెంచాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి సమీక్షించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతీ మండలానికి ప్రత్యేకాధికారులను నియమించి ధాన్యం సేకరణ పూర్తి చేయాలన్నారు. ప్రత్యామ్నాయ గోదాముల్లో ధాన్యం దిగుమతికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. లారీల కొరత లేకుండా చూడాలని, వ్యాన్లు, ట్రాక్టర్లలోనూ ధాన్యం తరలించాలన్నారు. డీఆర్డీవో గీత, డీఏవో అఫ్జల్ బేగం, డీసీఎస్వో బుచ్చిబాబు, పౌరసరఫరాల శాఖ మేనేజర్ నరసింహ, డీటీవో లక్ష్మణ్ కుమార్, డీసీవో రామకృష్ణ, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. -
ఎక్కడి కుప్పలు అక్కడే!
● మొగులుతో గుబులు ● నెల రోజులుగా పడిగాపులు ● పట్టించుకోని అధికారులు ● తూకం వేయక ఆందోళనలో అన్నదాతలుసిరిసిల్ల అర్బన్: పంట పండించేందుకు ఎంత కష్టపడుతున్నారో అన్నదాతలు ధాన్యాన్ని విక్రయించుకునేందుకు అంతకుమించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటను కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించి ఇరువై రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. వాతావరణంలో కలుగుతున్న మార్పులతో రైతుల పడుతున్న ఆందోళన చెప్పలేనిదిగా ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తూకం వేసే సమయంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలతో ఎండిన పంటలు తడిసి ముద్దవుతున్నాయి. చేసేదేమి లేక మళ్లీ ఆరబోయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. 15 రోజులుగా కేంద్రాల్లోనే.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దబోనాల కొనుగోలు కేంద్రం పరిధిలోని మార్కెట్పల్లిలో ధాన్యం పోసుకొమ్మని మెప్మా అధికారులు చెప్పారు. దీంతో 70 మంది రైతులు ధాన్యం కుప్పలు పోశారు. 15 రోజుల క్రితం కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ తూకం వేయడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రంలో ఎక్కడి కుప్పలు అక్కడే పేరుకుపోయాయి. ఇప్పటికే తేమశాతం తగ్గి నష్టపోతున్నామని, వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి రంగు మారి, మొలకలు వచ్చి నష్టపోవాల్సి వస్తుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దొంగల బస!
ధర్మపురిలో సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్‌లో భారీ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ నెల ఒకటిన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయ లక్ష్మి లాడ్జిలో బసచేసి, కరీంనగర్లో చోరీ అనంతరం 3వ తేదీన లాడ్జి ఖాళీచేశారు. అంతకన్నా ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనూ బసచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇలాఉంటే దొంగలు వినియోగించిన నల్లరంగు పల్సర్ (220 సీసీ), హెల్మెట్‌ను ధర్మపురి గోదావరి తీరంలోని ఇటుకబట్టీల సమీపంలో మంగళవారం ఉదయం కనుగొన్నారు. టీఎస్ 08 ఎఫ్జీ 6876 నంబరు ప్లేటుతో ఉన్న ఈ బండిని దుండగులు చోరీ కోసం వినియోగించిందేనని ధ్రువీకరించారు. కానీ.. ఈ బైకుది ఫేక్ నంబరు ప్లేటుగా పోలీసులు తేల్చారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన రమేశ్ అనే వ్యక్తికి చెందిన కారుదిగా గుర్తించారు. బండి చాసీస్ నంబరు ఆధారంగా ప్రయత్నించినా.. దాన్ని కూడా ముందే ధ్వంసం చేయడంతో బైకులను సెకండ్ హ్యాండ్లో కొన్నారా? లేక ఎత్తుకొచ్చారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రా లేదు. చోరీ కోసం వినియోగించిన మరో బైకు అపాచీ(తెలుపు) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దానికి పెట్టిన నంబరు ప్లేట్ కూడా ఫేక్‌గానే భావిస్తున్నారు. -
రెవెన్యూ అధికారుల బదిలీ
సిరిసిల్ల: జిల్లాలో రెవెన్యూ శాఖ భారీ కుదుపునకు గురైంది. ఖాళీగా ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా గ్రేటర్ హైదరాబాద్‌లో పనిచేస్తున్న వి.రమాదేవిని నియమించారు. సిరిసిల్ల ఆర్డీవోగా పనిచేస్తున్న సీ.హెచ్.వెంకటేశ్వర్లు జనగామ ఆర్డీవోగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో డిప్యూటేషన్‌పై తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీలో పనిచేస్తున్న ఎన్.రాజేందర్‌రెడ్డి(డిప్యూటీ కలెక్టర్)ని నియమించారు. వేములవాడ ఆర్డీవోగా డిప్యూటేషన్‌పై తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కే.ఎస్.బి.కుమారిని నియమించారు. వేములవాడ ఆర్డీవో రాధాభాయి భూసేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్‌గా పనిచేయనున్నారు. విధుల్లో చేరిన డీఎఫ్వోసిరిసిల్ల: జిల్లా ఫారెస్ట్ అధికారిగా ఎస్.సత్యనారాయణ మంగళవారం విధుల్లో చేరారు. ఇప్పటి వరకు డీఎఫ్‌వోగా ఉన్న బాలమణి కుమురంభీం ఆసిఫాబాద్ డీఎఫ్‌వోగా బదిలీ కాగా.. ఆమె స్థానంలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారిగా సత్యనారాయణను నియమించారు. సిరిసిల్లలో బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్ప నాదేవి మొక్కను అందించి స్వాగతం పలికారు. ● టీటీడీ చైర్మన్‌తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో ఫోన్లో కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ఆలయ కమిటీ మంగళవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి నిధుల విడుదల కోసం విన్నవించింది. ఈమేరకు కేటీఆర్ టీటీడీ చైర్మన్‌తోపాటు మంత్రి లోకేశ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట ఆలయానికి రూ.5 కోట్లు, సిరిసిల్ల ఆలయానికి రూ.7 కోట్లు మంజూరు చేయించాలని కోరారు. ఆలయ నిర్మాణ నమూనాతోపాటు గతంలో మంజూరు ఇచ్చిన పత్రాలను చైర్మన్ బీఆర్ నాయుడుకి మెయిల్ పంపించారు. సర్పంచ్ ఎలగందుల నరసింహులు, ఆలయ కమిటీ చైర్మన్ గుండం సుధాకర్‌రెడ్డి, వైస్‌చైర్మన్, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు మీసం రాజం, నేవూరి వెంకట నరసింహారెడ్డి, ఎడ్ల సందీప్ ఉన్నారు. సిరిసిల్లటౌన్: కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజ య్‌కుమార్ బుధవారం జిల్లాలో పర్యటిస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. ఉదయం 9:30 గంటలకు పట్టణంలోని కార్గిల్లేక్ సుందరీకరణకు భూమిపూజ చేస్తారు. ఉదయం 10:30 గంటలకు సినారె కళామందిరంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేస్తారు. ఉదయం 11:30 గంటలకు వాసవి కల్యాణ మండపంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. గ్రామీణ మహిళలకు త్రోబాల్‌లో శిక్షణసిరిసిల్ల అర్బన్: గ్రామీణ మహిళల కోసం జిల్లాలో ఇషా త్రోబాల్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఇషా గ్రామోత్సవం నిర్వాహకులు వంగ అనిల్ తెలిపారు. ఖమ్మం, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనంలో ఈనెల 13 నుంచి 17 వరకు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పాల్గొనే వారికి రూ.5లక్షల వరకు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు 96664 44843లో సంప్రదించాలని కోరారు. -
లూజ్వైర్లకు మరమ్మతు
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని రంగంపేట, బంజేరు గ్రామాల్లోని ప్రమాదకర విద్యుత్ సమస్యలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించారు. శని, ఆదివారాల్లో రంగంపేటలో లూజ్వైర్లతో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి పశుగ్రాసం, పైపులు, స్టార్టర్లు కాలిపోయాయి. బంజేరు నుంచి బీరప్పతండాకు వెళ్లే దారిలో ఒక స్తంభం వంగిపోయి ప్రమాదకరంగా మారింది. ఏఈ రమేశ్ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. రంగంపేటలో లూజ్‌వైర్లను సరిచేశారు. వంగిపోయిన స్తంభం స్థానంలో కొత్త స్తంభం ఏర్పాటు చేశారు. సింగిల్ సిలిండర్లు : 78,907 డబుల్ సిలిండర్లు : 48,087 దీపం సిలిండర్లు : 21,481 సీఎస్ఆర్ : 50,280 ఉజ్వల : 20,409 వాణిజ్య సిలిండర్లు : 1,687 నిత్యం వినియోగమయ్యే సిలిండర్లు : 2500 -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రజాసంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గంభీరావుపేటలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం హాజరయ్యారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. 99రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతీ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఇబ్బంది కలగకూడదని ఆదేశించారు. లారీల కొరతను సాకుగా చూపి ధాన్యం రవాణాను ఆపవద్దన్నారు. అవసరమైతే గ్రామాల్లో అందుబాటులో ఉండే ట్రాక్టర్లను ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని సూచించారు. పంట ఉత్పత్తుల కొనుగోలు సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. జూన్ 15 వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మైనర్ రిపేర్లు, తాగునీరు, రన్నింగ్ వాటర్ సౌకర్యాలు పూర్తి చేయించాలని సూచించారు. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న డైట్ చార్జీలను ఇప్పటికే క్రమబద్ధీకరించామని, ఇకపై ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తామన్నారు. రెసిడెన్షియల్ విద్యాలయాలను జిల్లా అధికారులు నిత్యం సందర్శించి, భోజనం నాణ్యత పరిశీలించాలని సూచించారు. వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యుత్ చార్జీలను యూ నిట్‌కు రూ.2 వరకు తగ్గించేలా ఎన్పీడీసీఎల్ అధి కారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల ని ర్మాణంలో రాష్ట్రంలో ముందు ఉన్న సందర్భంగా అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచాలి : తుమ్మల నాగేశ్వర్రావు జిల్లాను అన్ని రంగాల్లో ముందుస్థానంలో ఉంచాలని జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బంది రావద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ తదితరులు పాల్గొన్నారు. ఒకే వేదికపై అన్ని శాఖలు జిల్లా కేంద్రం కాకుండా ఇతర ప్రాంతంలో అన్ని శాఖల అధికారులు ఒకే వేదికపై హాజరుకావడం తొలిసారి. -
సమష్టిగా పనిచేసి మన్ననలు పొందాలి
వేములవాడ: సమష్టిగా పనిచేసి ప్రజల మన్ననలు పొంది విజయవంతం కావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికలో పాల్గొన్నారు. కమిషనర్ సంపత్‌రెడ్డి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. కో–ఆప్షన్ సభ్యులుగా కట్కూరి శ్రీనివాస్, ఫీర్ మహమ్మద్, దుర్గం విజయపర్శరాము, తుమ్మ జ్యోతిలను ఎన్నుకున్నారు. కమిషనర్ సంపత్‌రెడ్డి ఎన్నిక సర్టిఫికెట్ అందించడంతోపాటు ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో వేములవాడ మున్సి పాలిటీలో ఉన్న నాలుగు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికై న కోఆప్షన్ సభ్యులను సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. నూతనంగా ఎన్నికై న నలుగురు సభ్యులకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ ఎదుట పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. -
దొంగలను పట్టుకుంటాం
● రాజకీయం చేయడం బీఆర్ఎస్కు తగదు ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కరీంనగర్ కార్పొరేషన్: జువెల్లరీ దొంగలను పట్టుకొని, ఆభరణాలను రికవరీ చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. దొంగతనం జరిగిన పీఎంఏ జువెల్లరీని సోమవారం ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. దొంగల దాడిలో గాయపడ్డ సిబ్బందిని హాస్పిటల్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గాయపడ్డ వారిని మెరుగైన చికిత్సకోసం అవసరమైతే హైదరాబాద్ తరలిస్తామన్నారు. దొంగతనంపై గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డిలు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. పోలీస్ శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ కల్చర్, పబ్‌కల్చర్, గంజాయిలపై ఈగల్‌ను తీసుకువచ్చి ఉక్కుపాదం మోపారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వామన్‌రావు దంపతులను నడిరోడ్డుపై చంపిన దిక్కులేదని, దిశలాంటి ఎన్నో కేసులు జరిగాయని గుర్తు చేశారు. ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం మూడు రోజుల్లో విరమింప చేస్తే కూడా బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుందన్నారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బయోగ్యాస్ ప్లాంట్‌కు భూమి పూజ
● నేడు గంభీరావుపేటకు డిప్యూటీ సీఎం ‘భట్టి’ రాకగంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. గంభీరావుపేటలో బయోస్ట్రాటమ్ టె క్నాలజీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం ఆధ్వర్యంలో భూమి పూజ చేయనున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం పాల్గొననున్నారు. పర్యటనను విజయవంతం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు గంభీరావుపేట మండలంలో మంత్రుల పర్యటనను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీని వాస్ కోరారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్ద కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ గంభీరావుపేటలో ఏర్పాటు కాబోతుందని తెలిపారు. ఉపాధి కేంద్రంగా ప్లాంట్ దోహదపడనుందన్నారు. పర్ష హన్మండ్లు, మల్లుగారి నర్సాగౌడ్ తదితరులు ఉన్నారు. మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రత మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు వివిధ శాఖల మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. మంత్రుల పర్యటన దృష్ట్యా భద్రత ఏర్పాట్లు, హెలిప్యాడ్‌ను ఎస్పీ సోమవారం పరిశీలించారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వెంకటేశ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రవి, ఆర్ఐలు మధుకర్, రమేశ్, ఎస్సై అనిల్ ఉన్నారు. -
మిల్లుల్లో వేగంగా ధాన్యం దింపుకోవాలి
● హమాలీలు, లారీల సంఖ్యను పెంచాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే లారీల నుంచి ధాన్యాన్ని వెంటనే అన్లోడింగ్ చేయాలని రైస్‌మిల్లర్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ధాన్యం కొనుగోలు, రవాణా అంశాలపై పౌర సరఫరాల అధికా రులు, రైస్‌మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమీక్షించారు. రైస్‌మిల్లర్లు హమాలీల సంఖ్యను పెంచుకోవాలని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వేగంగా అన్లోడింగ్ చేయించాలని ఆదేశించారు. అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని ఆ దేశించారు. డీఆర్డీవో మచ్చ గీత, డీసీఎస్వో బుచ్చి బాబు, మేనేజర్ నరసింహ, డీసీవో టి.రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ పాల్గొన్నారు. నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకం తంగళ్లపల్లి(సిరిసిల్ల): వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే నేలల సంరక్షణ, ఎరువుల సమతుల్య వినియోగం కీలకమని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ’ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తంగళ్లపల్లి మండలం తాడూర్‌లో సోమవారం నిర్వహించిన రైతు వారోత్సవాల అవగాహన సదస్సులో మాట్లాడారు. రైతులు తమ పొలంలో భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే అవగాహన వస్తుందన్నారు. ఇష్టారీతిన రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడడం ద్వారా నేల ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తుందని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలన్నారు. సదస్సు ప్రారంభంలో ’జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపించి, నేలల సంరక్షణపై రైతులందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆదర్శ రైతులను సన్మానించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, సర్పంచులు రెడ్డిమల్ల సదానందం, గుండు ప్రేమ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, ఉద్యానవన అధికారి శరత్, డీపీవో షర్ఫుద్దీన్, ఏఎంసీ డైరెక్టర్లు పొన్నాల పర్శరాములు, కల్లెపల్లి తిరుపతిరెడ్డి, అరెపల్లి బాలు, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో మీర్జా అఫ్జల్ అహ్మద్ బేగ్, ఏవో సంజీవ్, ఆర్ఐ దినేశ్, నాయకులు లింగాల భూపతి, మిరాల శ్రీనివాస్, సురభి నవీన్‌రావు పాల్గొన్నారు. -
ఈ ప్రాంతానికి కేసీఆర్ సముద్రం తెచ్చారు
● సిరిసిల్ల స్వరూపం మార్చారు ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సిరిసిల్ల: మానేరు వాగులో సముద్రాన్ని తలపించేలా నీటిని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెచ్చారని, ఎట్లుండే సిరిసిల్ల ఎట్లా మారిందో మీ కళ్ల ముందే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో సోమవారం స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ బొల్గం వైష్ణవి–నాగరాజుగౌడ్‌లు వందలాది మంది కార్యకర్తలతో బీఆర్ఎస్లో చేరారు. వీరిని కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ మాట్లాడుతూ తాలూక కేంద్రంగా ఉన్న సిరిసిల్లను జిల్లాను చేసి, కరీంగనర్‌లో ఉండే కలెక్టర్‌ను, ఎస్పీని సిరిసిల్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. మానేరువాగు ఎండిపోయి ఉండేదని, గోదావరి జలాల రాకతో రామప్పగుట్ట ఎక్కితే సముద్రాన్ని తలపిస్తుందని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెరిగి పుట్ల కొద్ది పంటలు పండుతున్నాయన్నారు. కేసీఆర్ పాలనలతో భూముల రేట్లు ఎలా ఉండేవని, ఇప్పుడెలా ఉన్నాయని ప్రశ్నించారు. మల్కపేట రిజర్వాయర్ ద్వారా చిన్నబోనాల, పెద్దబోనాలకు నీళ్లు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. చిన్నబోనాల పోచమ్మ గుడికి సాయం చేస్తానన్నారు. ఊరు అన్నప్పుడు అనేక సమస్యలు ఉంటాయని, వాటిని పరిష్కరిస్తూ పోవాలన్నారు. కౌన్సిలర్ వైష్ణవి, నాగరాజుగౌడ్‌లు పార్టీలో చేరిక సందర్భంగా బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తెస్తామని, కేసీఆర్ సీఎం అయ్యేందుకు అంతఃకరణశుద్ధితో పని చేస్తామని ప్రతిజ్ఞ చేయడం ఆకట్టుకుంది. టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, ఉమ్మడి జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, పార్టీ నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం కళాచక్రపాణి, దార్ల సందీప్, మాజీ ఎంపీపీలు గజభీంకార్ రాజన్న, శ్రవణ్‌రావు, పార్టీ నాయకులు కుంబాల మల్లారెడ్డి, మ్యాన రవి, మంచె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిమ్ ప్రారంభం సిరిసిల్ల కొత్తచెరువు కట్ట వద్ద కేటీఆర్ జిమ్‌ను ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి పాల్గొన్నారు. అనంతరం సాయిమణికంఠ ఫంక్షన్‌హాల్ ఎర్రం శంకర్ కొడుకు రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. -
మా గోస పట్టించుకోండి
● కలెక్టరేట్ బాట పడుతున్న బాధితులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● 220 దరఖాస్తుల స్వీకరణసిరిసిల్ల అర్బన్: క్షేత్రస్థాయిలో పట్టించుకునే వారు లేక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు కలెక్టరేట్ బాట పడుతున్నారు. సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరీమా అగ్రవాల్ అర్జీలు స్వీకరించి భరోసానిస్తున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి 220 దరఖాస్తులు స్వీకరించారు. మాది ఇల్లంతకుంట మండలం రేపాక. ఇక్కడ ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లో సన్నవడ్లు గత నాలుగేళ్లుగా కొనుగోలు చేయడం లేదు. నేను 70 క్వింటాళ్ల వరకు సన్నవడ్లు పండించాను. ఈ వడ్లను కొనుగోలు చేసి తగిన మద్దతు ధర కల్పించాలి. – రోండ్ల భూపతిరెడ్డి, రేపాకమాది సిరిసిల్లలోని శివనగర్. నా భర్త 9 ఏళ్ల క్రితం నన్ను, నా పిల్లలను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఇద్దరి పిల్లల పోషణ ఇబ్బందిగా ఉంది. నాకు ఏదైనా పని కల్పించి, పెన్షన్ మంజూరు చేయండి. – మడత రాధిక, సిరిసిల్లమాది బోయినిపల్లి మండలం కొదురుపాక. నా భర్త అనారోగ్యంతో గతేడాది మృతిచెందాడు. మాకు ఇద్దరు చిన్న పిల్లలు. వారి చదువు, పోషణ ఇబ్బందిగా మారింది. నాకు జిల్లాలో ఎక్కడైనా ఏధైనా ఉపాధి కల్పించండి. – సంగీతమాది తంగళ్లపల్లి మండలం బాలమల్లుపల్లె. మా గ్రామంలోని ఇండ్లు లేని నిరుపేదలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసింది. నిర్మాణాన్ని ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. అప్పులు తీసుకొచ్చి నిర్మాణాలు పూర్తిచేశాం. బిల్లులు రాకపోవడంతో వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికై నా బిల్లులు వచ్చేలా చూడాలి. – బాలమల్లుపల్లె గ్రామస్తులుఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కొంతకాలంగా మానువాడ నుంచి ఇసుకను రవాణా చేశాం. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్లో మన ఇసుక మన వాహనం ద్వారా మాకు ఇల్లంతకుంట మండలం పొత్తూరు క్వారీ నుంచి అనుమతి ఇచ్చారు. ఇల్లంతకుంట మండలం వారు మా ట్రాక్టర్లను అనుమతించడం లేదు. కాబట్టి మానువాడ నుంచి ఇసుకకు అనుమతి ఇవ్వాలి. – బోయినపల్లి మండల ఇసుక ట్రాక్టర్ల యజమానులు -
గంట ముందే స్పాట్‌కు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నగరంలోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎలాంటి బెరుకూ లేకుండా ఉదయాన్నే భారీ దోపిడీ చేసి, యథేచ్ఛగా పారిపోయిన వైనాన్ని సవాలుగా తీసుకున్నారు. దొంగల సంచారం, కదలికలు, వారి చిరునామా, నేరచరితపై కీలక సమాచారం సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను మహారాష్ట్ర, బిహార్‌కు పంపినట్లు సమాచారం. మరికొంతమంది పోలీసులు సీసీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. వారి ఫొటోల ఆధారంగా క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఏ) సాయంతో నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు పుణే, మరొకరు నందూర్బర్ జిల్లాలతో పాటు బిహార్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీని ‘రివర్స్ మేనర్’(ఎలా వచ్చారు? అన్న విజువల్స్)లో విశ్లేషించినప్పుడు దొంగలంతా దోపిడీకి కేవలం గంట ముందే కరీంనగర్‌కు వచ్చినట్లు రికార్డు అయ్యింది. అంటే ముందు రోజు ఎక్కడా బస చేసిన దాఖలాలు లేవు. కొంతకాలంగా రెక్కీ నిర్వహించి, పారిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టే నింపాదిగా వచ్చారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర బ్యాగే పట్టిస్తోంది..? చోరీ సమయంలో నిందితుల్లో ఒకరి బ్యాగు కీలకంగా మారింది. ఆ బ్యాగుపై ‘ఐ లవ్ నందూర్బర్’ అని రాసి ఉంది. నందూర్బర్ ఉత్తర మహారాష్ట్రకు చెందిన జిల్లా. గుజరాత్ సరిహద్దులో ఉంటుంది. నిందితుల్లో మరొకరు పుణే జిల్లాలో నేరచరిత కలి గిన పఠాన్‌గా గుర్తించినట్లు తెలిసింది. మహారాష్ట్రకు పారిపోవాలంటే పెద్దపల్లి, మంథని మీదుగా వెళ్లవచ్చు. కానీ.. ఆ మార్గంలో ట్రాఫిక్, చెక్‌పోస్టులు ఎక్కువ. అందుకనే చోరీ అనంతరం శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్, రామడుగు, లక్ష్మీపూ ర్, రుద్రారం, గుండి, పెగడపల్లి, జగిత్యాల మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లుగా సీసీ ఫుటేజీని పోలీసులు సంపాదించారు. ప్రధాన రహదారుల వెంట వెళ్తే సులువుగా పట్టుబడతామని, పోలీసుల కళ్లు గప్పేందుకు గ్రామీణ రహదారిని ఎంచుకున్నారు. వీరిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర, బిహార్‌కు బయల్దేరాయి. మరో నాలుగు బృందాలు (ఒక్కో బృందంలో నలుగురు చొప్పున సభ్యులు) కరీంనగర్ నుంచి జగిత్యాల మీదుగా మహారాష్ట్ర, బీహార్, ఇటువైపు హైదరాబాద్ వరకు వందలాది సీసీ కెమెరాల ఫుటేజీని వడపోస్తున్నారు. నిందితులు వాడిన అపాచీ, పల్సర్ బైకు నంబర్లు స్పష్టంగా లేకపోవడంతో గుర్తింపు కష్టంగామారింది. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లినట్టే వెళ్లి దారిమార్చి, వాహనాలనూ మార్చినట్లు పోలీసులు గుర్తించారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞాన్ని విస్తృతంగా వాడుతున్నారు. నిందితుల ఫొటోల ఆధారంగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ గ్రిడ్ (నాట్‌గ్రిడ్) సాఫ్ట్వేర్ సాయంతో వారి నేరచరిత, ఎఫ్ఐఆర్, జైలు జీవితం, ఫోన్‌నంబర్లు తదితర వ్యక్తిగత వివరాలతో సహా కీలక అంశాలను ఇప్పటికే సేకరించారు. బందిపోట్లు, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల డేటాను నాట్గ్రిడ్లో పొందుపరుస్తారు. ఇది తిరిగి సీసీటీఎన్‌ఎస్‌తో అనుసంధానంగా ఉంటుంది. ఈ డేటాబేస్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర జాతీయ దర్యాప్తు సంస్థలు వినియోగిస్తాయి. గతేడాది నుంచి ఈ డేటాబేస్ ఎస్పీ ర్యాంకు ఆఫీసర్లకు ఉగ్రవాద, ఇతర కీలక కేసుల్లో దర్యాప్తు కోసం యాక్సెస్ కల్పించారు. వచ్చిన వారు ఉగ్రవాదులు అయి ఉంటారన్న అంశాన్ని పోలీసులు కొట్టిపారేయకపోవడం గమనార్హం. నిందితులు వచ్చిన మార్గంలోని అన్ని సెల్టవర్ల పరిధిలో అనుమానిత సెల్‌ఫోన్ సంభాషణల కోసం డంప్ (సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్స్ వివరాలు)ను సీడాట్ పద్ధతిలో జల్లెడ పడుతున్నారు. ఇందులోనూ కొన్ని అనుమానిత నంబర్లను పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ల సంచారం ఆధారంగానే పోలీసులు దొంగలను వెంటాడుతూ వెళ్లారని సమాచారం. చోరీ అనంతరం దొంగలు ఆ నంబర్లను మార్చడం గమనార్హం. -
గ్రీవెన్స్ డేలో 19 ఫిర్యాదులు
సిరిసిల్ల: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా 19 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి వేగంగా పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. అర్జీదారుల వినతులను స్వీకరించిన ఎస్పీ, సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఫిర్యాదులను చట్టపరంగా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. గంభీరావుపేట(సిరిసిల్ల): రైసుమిల్లుల దోపిడీని అరికట్టాలని, రైతులకు అన్యాయం చేస్తున్న రైసుమిల్లుల లైసెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ గంభీరావుపేట మండలం దమ్మన్నపేట, నాగంపేటలకు చెందిన రైతులు సోమవారం పెద్దమ్మ స్టేజీ వద్ద ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల వరి ధాన్యాన్ని అధికంగా తూకం వేయిస్తూ అన్నదాతలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నా కోనరావుపేట: ధాన్యం కొనుగోలు చేయాలని మండలంలోని సుద్దాలలో రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. నెల రోజులుగా కేంద్రంలోనే పడిగాపులు కాస్తున్నామన్నారు. వేములవాడ: బంగారం విక్రయిస్తున్న దుకాణాల నిర్వాకంతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ పట్టణ స్వర్ణకారులు తమ దుకాణాలను సోమవారం బంద్ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ తీశారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు గిన్నెల శ్రీనివాస్ మాట్లాడుతూ జ్యువెల్లరీ దుకాణాల యజమానులు వారి వద్ద బంగారం కొనుగోలు చేసే వినియోగదారులకు తామే ఆభరణాలు కూడా తక్కువ ధరకు తయారు చేసి ఇస్తామంటూ తమ పొట్ట కొడుతున్నారని వాపోయారు. బంగారం విక్రయించే వరకు బాగానే ఉన్నా తమ పనిని కూడా వారే తీసుకొని ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా వైఖరి మార్చుకోకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి కత్రోజు వెంకటేశ్, రాము, ప్రసాద్, శంకరయ్య, కట్ట రమేశ్, రాజేశ్, అరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు. ‘పెద్దింటి’కి కథా పురస్కారంసిరిసిల్ల అర్బన్: జిల్లాకు చెందిన సినీ కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌కు ఎస్జీ ఫౌండేషన్ కథా పురస్కారం లభించినట్లు ఫౌండేషన్ చైర్మన్ పి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ నెల చివరి వారంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో నగదుతోపాటు అవార్డు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సాహిత్యరంగంలో విశిష్ట కృషి చేసిన అశోక్‌కుమార్ ఇప్పటి వరకు 300 కథలు, 7 నవలలు, 5 నాటికలు రచించారు. 12 కథా సంకలనాలను ప్రచురించారు. అలాగే పది సినిమాలకు రచన అందించారు. కథా సాహిత్యంలో చేసిన కృషికి గుర్తింపుగా పెద్దింటికి ఈ పురస్కారం లభించడం విశేషం. సిరిసిల్ల: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈనెల 5న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి అజ్మీర రాందాస్ సోమవారం తెలిపారు. జిల్లాలోని యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని పలు ప్రైవేటు కంపెనీలు ఈ జాబ్‌మేళాకు వస్తాయని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఈ–మెయిల్ ద్వారా పొంది హాజరుకావాలని కోరారు. నేడు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికవేములవాడ: వేములవాడ మున్సిపల్లో నలుగురు కో–ఆప్షన్ సభ్యులను మంగళవారం ఎన్నుకోనున్నారు. ఇందులో భాగంగా సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చైర్మన్, వైస్‌చైర్మన్, కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. సభ్యుల ఎన్నిక కోసం అభిప్రాయ సేకరణ నిర్వహించారు. సభ్యులంతా తమ అభిప్రాయాలు వెల్లడిస్తూనే తుది నిర్ణయం తమదేనని విప్‌నకు చెప్పినట్లు తెలిసింది. -
సెంట్రల్ బోర్డ్ ఫిలిం ప్యానల్ మెంబర్‌గా వైశాలి
సిరిసిల్లటౌన్: సెంట్రల్ బోర్డ్ ఫిలిం ప్యానల్ మెంబర్‌గా జిల్లా కేంద్రానికి చెందిన వేముల వైశాలి నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైశాలి మాట్లాడుతూ, తన నియామకంతో మరింత బాధ్యత పెరిగిందని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీకి, కేంద్ర మంత్రి సంజయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లుసిరిసిల్లఅర్బన్: పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు అన్నారు. ఆదివారం పట్టణంలోని 12వ వార్డు చంద్రంపేట, 2వ వార్డు శాంతినగర్‌లో లబ్ధిదారులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరై నూతనవస్త్రాలు అందజేశారు. ఇందిరమ్మ పథకం ద్వారా అనేక మంది నిరాశ్రయులకు సొంతింటి కల సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మడుపు శ్రీదేవి, కౌన్సిలర్ వెంగళ లీల, లక్ష్మీనారాయణ, సూర నిర్మల, నూనే శ్రీనివాస్, ఎల్లయ్య, శంకర్, పర్శరాములు, నర్సయ్య పాల్గొన్నారు. సీడీఎంఏకు వేములవాడ కమిషనర్వేములవాడ: వేములవాడ మున్సిపల్లో విధులు నిర్వహిస్తున్న కమిషనర్ సంపత్‌కుమార్‌ను సీడీఎంఏకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆయన బదిలీ కాస్త ఆగినట్లే ఆగి తిరిగి మళ్లీ బదిలీ కాక తప్పలేదు. సంపత్‌కుమార్‌ను రిలీవ్ చేసి సీడీఎంఏలో జాయిన్ కావాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆయన హైదరాబాద్‌కు వెళ్లగా, అతడి స్థానంలో ఇన్చార్జి కమిషనర్‌గా మేనేజర్ సంపత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు సంపత్‌రెడ్డి శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. కాగా, మంచిర్యాలలో విధులు నిర్వహిస్తున్న కమిషనర్ అన్వేశ్ వేములవాడకు రావాల్సి ఉండగా అక్కడి ఎమ్యెల్యే అన్వేశ్ అక్కడే ఉండాలని కోరడంతో ఆయన బదిలీ ఆగిపోయిన విషయం తెలిసిందే. సిరిసిల్లఅర్బన్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 10న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చే యాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పి లుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి రూ.7,800 కోట్లకు పైగా నిధులతో పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డంకులు పె ట్టిందన్నారు. రైతు సమస్యల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలమయ్యాయని ఆరోపించారు. సభను విజయవంతం చేయాడానికి ప్రతీ కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. సభ రాష్ట్రానికి కీలక మలుపు కావాలని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్‌రావు, మీసాల చంద్రయ్య, జిల్లా ఇన్చార్జి గంగాడి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
నిధులు మంజూరు కాగానే..
నిధులు మంజూరు కాగానే పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు అందజేస్తాం. చిన్న పంచాయతీల్లో కొంత ఇబ్బంది ఉన్నా వారికి కూడా త్వరలోనే వేతనాలు మంజూరు చేస్తాం. – షరీఫొద్దీన్, జిల్లా పంచాయతీ అధికారి ముస్తాబాద్ మండలం రామ్రెడ్డిపల్లె గ్రామం. నేను ఐదేళ్లుగా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నా. మూడునెలలుగా జీతం రావడం లేదు. అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న వేతనం మంజూరు చేయాలి. – గద్దల సుధాకర్, కార్మికుడు, రామ్రెడ్డిపల్లె, ముస్తాబాద్ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయా లి. కొన్ని పంచాయతీల్లో మూడు నుంచి ఆరునెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు స్పందించి త్వరగా మంజూరు చేయాలి. – అన్నల్దాస్ గణేశ్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా బాధ్యులు -
స్విమ్మింగ్.. ట్రైనింగ్
ఎండలు మండుతున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ పార్క్‌లోగల స్విమ్మింగ్‌పూల్‌లో విద్యార్థుల సందడి నెలకొంటుంది. ఈత నేర్చుకునేందుకు చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారు. నిర్వాహకులు ఉదయం, సాయంత్రం వేళల్లో బ్యాచ్‌ల వారీగా స్విమ్మింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. కొందరు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు స్విమ్మింగ్‌పూల్‌ను ఆశ్రయిస్తున్నారు. అన్ని రకాల రక్షణ చర్యలు పాటిస్తూ ఈత కొడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల -
యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
చందుర్తి(వేములవాడ): యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజక వర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంటులో పాల్గొన్న మండలంలోని 10 జట్లు, రుద్రంగి మండలం 5 జట్లకు ఆదివారం మండలకేంద్రంలోని పెరుక కమ్యూనిటీ హాల్లో క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, తిరుపతి, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, రుద్రంగి మాజీ ఎంపీపీ గంగం స్వరూపరాణి, కేడీసీసీ డైరెక్టర్ జలగం కిషన్‌రావు, చందుర్తి సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు తిప్పని శ్రీనివాస్, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు ఏనుగుల శ్రీనివాస్, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మిల్లర్ల దోపిడీ అరికట్టాలి
ఎల్లారెడ్డిపేట( సిరిసిల్ల): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధర ఇస్తారనే ఆశతో కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే మిల్లర్లు తూకంలో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆదివారం మండలంలోని పదిర గ్రామానికి చెందిన అన్నదాతలు సిరిసిల్ల– కామారెడ్డి రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ, తాము పండించిన ధాన్యాన్ని 15రోజుల క్రితం కేంద్రానికి తీసుకువస్తే, నిర్వాహకులు 40 కిలోలకు బదులు 42.500 కిలోలు తూకం వేస్తున్నారని ఆరోపించారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. తూకంలో రెండున్నర కిలోల మోసం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న రైతులకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సై రాహుల్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన విరమించాలని కోరగా, రైతులు, నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారులతో మాట్లాడుతామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, నాయకులు సల్ల సత్యంరెడ్డి, కంచర్ల పరుశరాములు, వినయ్, రైతులు పాల్గొన్నారు. -
పంచాయతీల్లో నిధుల కొరత
సిరిసిల్లఅర్బన్/వేములవాడరూరల్: జిల్లాలోని గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. ముఖ్యంగా ఆదాయ వనరులు అంతగా లేని చిన్న పంచాయతీల్లో కనీసం కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. వచ్చే వర్షాకాలానికి సంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన పనులకు నిధులు లేక కార్యదర్శులు సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచులు సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు చేపట్టగా బిల్లులు మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సుమారు 1,244 మంది కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి మూడునెలలుగా వేతనాలు రావడం లేదని వాపోతున్నారు. విడుదల కాని ఎస్ఎఫ్సీ నిధులు ఈ ఏడాది జనవరిలో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు కొద్దిమేర గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ కాగా, అవి ప్రత్యేక అధికారుల పాలనలో అయిన ఖర్చులకే సరిపోవడం లేదని పలు వురు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావల్సిన ఎస్ఎఫ్సీ నిధులు విడుదల కాక కార్మికులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసినా నిధులు రావాయే.. ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సర్పంచ్‌లు దృష్టి పెట్టారు. రెండేళ్లుగా గ్రామాల్లో ఉన్న పలు పెండింగ్ పనులకు పెట్టుబడి పెట్టారు. ప్రభుత్వం మంజూరు చేసిన పనులు, కరెంట్ బోర్లు తదితర పనులను సొంత ఖర్చులతో చేపట్టినా ఐదు నెలలుగా బిల్లులు రావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కనిపించని సన్నద్ధత ఈ ఏడాది వరుసగా ఎన్నికల హడావుడి కనిపిస్తుండడంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో జిల్లాలోని పలు పంచాయతీల్లో అపరిశుభ్రత, అస్తవ్యస్థంగా మురుగు కాల్వలు, తాగునీటి వెతలు తదితర సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మరో నెల రోజుల్లో వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. నిధుల లేమితో అధికారులు ముందస్తు సన్నద్ధత కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. మాది గంభీరావుపేట మండలం పొన్నాలపల్లె గ్రామం. ఇక్కడ ఇద్దరం పనిచేస్తాం. నేను ఏడేళ్లుగా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నా. ఆరునెలలుగా జీతాలు రావ డం లేదు. అధికారులను అడిగితే వారి నుంచి సరైన సమాధానం లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. పెండింగ్ జీతాలు అందజేయాలి. – భగవంతం, పంచాయతీ కార్మికుడు, పొన్నాలపల్లె జిల్లాలో.. మండలాలు 12 గ్రామపంచాయతీలు 260 సిబ్బంది 1,244 (సుమారు) -
కూరగాయలే ఆధారం
మాకున్న కొద్దిపాటి భూమిలో కూరగాయలు సాగు చేసుకుంటాం. మేము పండించిన కూరగాయలను వేములవాడకు తీసుకొచ్చి విక్రయిస్తుంటాం. స్వయంగా అమ్ముకోవడం ద్వారా లాభాలు వస్తాయి. కూరగాయలే మా కుటుంబానికి ఆధారం. – కడుదుల లక్ష్మి, రైతు, కోనాయపల్లి మాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నప్పటికీ 20 గుంటల్లో కూరగాయలు సాగుచేస్తాం. అందులో అన్ని రకాల పంటలను వేసి సొంతంగానే విక్రయిస్తాం. సీజన్ల వారీగా కూరగాయలు సాగుచేస్తాం. మంచి లాభాలు వస్తున్నాయి. – కాసారపు పుష్పలత, రైతు, 13వ వార్డు, వేములవాడ -
పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
● డీవైఎస్వో అజ్మీరా రాందాస్ సిరిసిల్ల: భారత ప్రభుత్వం 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ఇచ్చేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి అజ్మీరా రాందాస్ శనివారం తెలిపారు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ వివిధ రంగాలలో నిష్ణాతులైన యువతీ యువకులకు పద్మ అవార్డులను ఇచ్చేందుకు దరఖాస్తులను కోరుతున్నట్లు పేర్కొన్నారు. వివిధ రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని, ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆఫీస్‌ను సంప్రదించాలని కోరారు. విద్యుత్ అంతరాయ నివారణకు ప్రత్యామ్నాయ లైన్లు సిరిసిల్ల: జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలకు ఏర్పడే విద్యుత్ అంతరాయాలను నివారణకు ప్రత్యామ్నాయంగా 33 కేవీ ఇంటర్‌లింక్ విద్యుత్లైన్లు ఏర్పాటు చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ శనివారం తెలిపారు. జిల్లా పరిధిలో నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. విద్యుత్ లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి 13 కొత్త సబ్స్టేషన్లు మంజూరైనట్లు వివరించారు. స్థిరమైన విద్యుత్ సరఫరా కోసం 19 బంచ్డ్ బ్రేకర్ల విభజన పనులు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటికే లక్ష్మీపూర్ సబ్‌స్టేషన్‌లో ఒక బ్రేకర్ చార్జ్ చేశామని, ఇల్లంతకుంట మండలం గాలిపల్లి సబ్‌స్టేషన్‌లో 11 కేవీ నర్సక్కపేట ఫీడర్ చార్జ్ చేసినట్లు వివరించారు. రైతులకు 902 నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదల చేసినట్లు తెలిపారు. లోడ్ డిమాండ్‌కు అనుగుణంగా 55 కొత్త అదనపు డీటీఆర్లు(ట్రాన్స్ఫార్మర్లు) ఒక కెపాసిటర్ బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ అంతరాయాలను అరికట్టడానికి భారీ ఎత్తున మరమ్మతు పనులు చేస్తున్నామని, 20 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్ల నిర్వహణ పనులు పూర్తి చేసి 105 మధ్య స్థంబాలను ఏర్పాటు చేసి, 54 దెబ్బతిన్న స్తంభాల పునరుద్ధరణ చేశామని వేణుమాధవ్ వివరించారు. అంతరాయాన్ని వెంటనే గుర్తించేందుకు ‘ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు’ లైన్లలో అమర్చమన్నారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఊరటనిస్తూ 166 పవర్లూమ్ సర్వీసులను కేటగిరీ–3 నుంచి కేటగిరీ–4 మార్చినట్లు తెలిపారు. నెల రోజుల్లో జిల్లాలో విప్లవాత్మక మార్పులకు ఎన్పీడీసీఎల్ శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. -
కూరగాయల ముల్లెలు
ఆ పల్లెలు.. ● తోటల పెంపకంతో ఆర్థికంగా స్థిరత్వం ● సొంతంగా మార్కెట్లో విక్రయాలు ● ఆదర్శంగా నిలుస్తున్న పల్లె రైతులువేములవాడరూరల్: ఏటా సంప్రదాయ పంటలు సాగుచేస్తూ లాభాలు అంతంతే రావడంతో ఆ పల్లె రైతులు తమ తీరు మార్చుకున్నారు. పంటల మార్పిడి చేపట్టారు. కూరగాయలు సాగుచేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. తమకున్న భూమిలో పలు రకాల కూరగాయలు సాగుచేస్తున్నారు. అంతేకాకుండా వాటిని దళారులకు ముట్టజెప్పకుండా మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు. ఇలా అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాల్లో ఎటూ చూసిన కూరగాయల తోటలే కనిపిస్తున్నాయి. ఎటూ చూసిన తోటలే.. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయపల్లి, అయ్యోరుపల్లి, నాంపల్లి, శాలరామన్నపల్లి, హన్మక్కపల్లిల్లో కూరగాయల తోటలు సాగుచేస్తూ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వేములవాడరూరల్ మండలం నాగాయపల్లి, పోచెట్టిపల్లి, మర్రిపల్లి, ఎదురుగట్ల, మల్లారం, హన్మాజిపేట, లింగంపల్లి, చెక్కపల్లితోపాటు బోయినపల్లి మండలంలోని కొదురుపాక, నీలోజిపల్లి, రత్నంపేట గ్రామాల రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. -
వార్పిన్ కార్మికుల కూలి పెంచాలి
సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్రోత్పత్తి రంగంలోని వార్పిన్ కార్మికుల కూలి పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి కోరారు. సిరిసిల్లలోని చేనేత, జౌళిశాఖ ఆఫీస్ వద్ద శనివారం కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. వార్పిన్ కార్మికుల కూలి పెంపు కోసం ఈనెల 4న కలెక్టర్ ఆఫీసు వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు సిరిమల్ల సత్యం, ఉడుత రవి, మచ్చ వేణు, ప్రవీణ్, నర్సయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. లారీల కోసం రైతుల రాస్తారోకో కోనరావుపేట(వేములవాడ): కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ క్రాసింగ్ వద్ద బైఠాయించారు. లారీలు వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. రైతులు మాట్లాడుతూ నిజామాబాద్‌లోని ఐకేపీ కేంద్రంలో 4వేల బస్తాలు తూకం వేసి పెట్టారన్నారు. అధికారులు స్పందించి వెంటనే లారీలు పంపించి ధాన్యాన్ని తరలించాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడి లారీలు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. విద్యార్థులు ఉన్నతంగా రాణించాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు భవిష్యత్‌లోనూ కష్టపడి చదివి ఉన్నతంగా రాణించాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి, ఎంఈవో కృష్ణహరి సూచించారు. మండలంలోని నారాయణపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన సూర స్నేహలత 572, కాసారపు శ్రీకర్ 569, దీప్తి 567 మార్కులు సాధించి మండల స్థాయిలో ఉత్తమంగా నిలిచారు. వీరిని డీఈవో, ఎంఈవోలు అభినందించారు. హెచ్ఎం చంద్రశేఖర్ర్ తదితరులు పాల్గొన్నారు. పదో తరగతి టాపర్లకు ఎస్పీ సన్మానం తంగళ్లపల్లి: పదోతరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన శ్రీసరస్వతి, ప్రగతి విద్యాలయ విద్యార్థులు ఎల్.ప్రదీప్(577), ఈ.సంజన(570)లను ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు. కరస్పాండెంట్ ఎం.శ్రీనివాస్‌యాదవ్, మనోహ ర్, సాయిప్రియ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీలను విస్మరించిన బీఆర్ఎస్ సిరిసిల్లటౌన్: గతంలో పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఏఐసీసీ మైనార్టీ శాఖ పరిశీలకులు మహ్మద్ ఫయాజ్ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మైనార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. మొదటి నుంచి మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు. అహ్మద్‌ఖాన్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
● మానేరువాగులో ఒకే చోట దహనం ● ఐదు రథాలు.. రెండు కాష్టాలు.. ఆరు శవాలు ● ఘెల్లుమన్న సిరిసిల్ల
సిరిసిల్ల: కార్మిక క్షేత్రం కన్నీటి సంద్రమైంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు.. బాధ్యతగా కుటుంబాలను పోషించే ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సిరిసిల్లలో కన్నీరు ఉబికింది. అయ్యో దేవుడా.. ఏమిటీ దారుణం అంటూ గుండెలు బాదుకుంటూ కుటుంబ సభ్యులు రోదించారు. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగురోడ్డులో పెద్ద గోల్కొండ–తొండుపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల సర్ధార్‌నగర్‌కు చెందిన రెండు కుటుంబాల్లోని ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఉ స్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగించుకుని ఆరు మృతదేశాలు శనివారం సిరిసిల్లకు తీసుకొ చ్చారు. రెండు కుటుంబాలకు చెందిన ఆరు శవాలు రావడంతో సర్ధార్‌నగర్ శోకసంద్రంలో మునిగింది. అతివేగంతో నిండు ప్రాణాలు బలి సిరిసిల్లకు చెందిన బొల్లి రాజు బీడీ కంపెనీ టేకేదార్. అతనికి ముగ్గురు పిల్లలు. శివకుమార్, స్వేత, శిరీష్. పెద్దకొడుకు, కోడలు శివకుమార్, లాస్య దంపతులు, వాళ్ల పాప రిషిత హైదరాబాద్ సనత్‌నగర్‌లో నివాసం ఉంటారు. చెల్లెలు స్వేత, కోడం శ్రీనివాస్, అల్లుళ్లు కృష్ణచంద్ర, మాధవ్‌లు గురువారం సనత్‌నగర్‌లోని ఇంటికి వెళ్లారు. వీరంతా యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయాలను సందర్శించుకుని చిలుకూరి బాలాజీ ఆలయ దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వ్యాగనార్ కారు ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టడంతో ఆరు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. స్వేత ఒక్కరే మాత్రం చావుబతుకుల్లో ఆస్పత్రిపాలైంది. ఆ కారుపై అప్పటికే అతివేగంగా వెళ్లినట్లు రెండు ఈ–చలానాలు ఆన్లైన్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఆరు శవాలు.. ఐదు రథాలు.. రెండు కాష్టాలు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని నాలుగు వైకుంఠ రథాలతోపాటు, కోనరావుపేటకు చెందిన మరో వైకుంఠరథాన్ని తెప్పించి, ఆరు శవాలను ఐదు రథాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. మానేరువాగులో ఒక్క కాష్టంపై బొల్లి శివకుమార్, అతని భార్య లాస్య, కూతురు రిషిత మృతదేహాలను ఉంచి శివకుమార్ తండ్రి బొల్లి రాజు చితికి నిప్పు అంటించా రు. మరో కాష్టంపై కోడం శ్రీనివాస్, అతని ఇద్దరు కొడుకులు కృష్ణచంద్ర, మాధవ్ మృతదేహాలను ఉంచారు. శ్రీనివాస్ తల్లి కోడం మల్లవ్వ గుండెల నిండా దుఃఖంతో ఒక్కగానొక్క కొడుకు చితికి నిప్పటించారు. బాధిత కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ కుటుంబాన్ని హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించగా.. సిరిసిల్లలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, ట్రాక్టర్ యజమానులు, బీడీ కంపెనీ టేకేదార్లు సందర్శించి నివాళి అర్పించారు. సిరిసిల్ల చరిత్రలో మూడో పెద్ద ఘటన సిరిసిల్ల పట్టణ చరిత్రలో మూడో పెద్ద ఘటన ఇది. ఆరు శవాలను ఒకేసారి ఊరేగించడం, అదీ ఐదు వైకుంఠ రథాలపై తీసుకెళ్లడం చూపరులను కలచివేసింది. మూడున్నర దశాబ్దాల కిందట కొండ నారాయణ కుటుంబం దైవదర్శనానికి వెళ్తూ ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం. సిరిసిల్లకు చెందిన ప్రముఖ డాక్టర్ పూర్ణచందర్ కుటుంబం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ రెండు ఘటనల తరువాత శుక్రవారం నాటి ఔటర్ రింగురోడ్డు ప్రమాదమే పెద్దది. ప్రేమ పెళ్లి.. ప్రమాదంలో బలి బొల్లి శివకుమార్ కులాంతర వివాహం చేసుకున్నారు. కామారెడ్డికి చెందిన రెనికిండి రాజేశ్వరి అలియాస్ లాస్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి రిషిత అనే కూతురు ఉంది. లాస్య కేంద్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే లాస్య, బీడీ కంపెనీని నిర్వహించే శివకుమార్, వారి కూతురు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మరణించగా.. వారిని ఒకే చితిపై దహనం చేయడం కలచివేసింది. కోడం శ్రీనివాస్, అతని ఇద్దరు కొడుకులతో సహా ఒకే చితిపై దహనం చేశారు. -
30 ఎకరాల్లో పశుగ్రాసం దగ్ధం
● రంగంపేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని రంగంపేటలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి పడిన నిప్పురవ్వలతో దాదాపు 30 ఎకరాల్లో కోసి పెట్టిన పశుగ్రాసం కాలిపోయింది. విద్యుత్ తీగలు తగిలి షార్ట్‌సర్క్యూట్ కావడంతో ఎగిసిపడిన నిప్పురవ్వలు ఎండిన వరికట్టలపై పడడంతో మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పంటతోపాటు పొలాల వద్ద ఉన్న పైపులు, స్టార్టర్లు, విద్యుత్ వైర్లు కాలిపోయాయి. లూజ్ వైర్లతోనే ఏటా షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరుగుతున్నాయని, తీగలను సరిచేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నాయకులు ప్రభుత్వానికి విన్నవించారు. -
కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు
● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోనరావుపేట(వేములవాడ): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పేర్కొన్నారు. మండలంలోని కొలనూర్, ధర్మారం గ్రామాల్లోని సింగిల్‌విండో కొనుగోలు కేంద్రాలను, కనగర్తిలోని మారుతి, కనకదుర్గ, కొలనూర్‌లోని సరస్వతి రైస్‌మిల్లులను శనివారం తనిఖీ చేశారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం, ట్యాబ్ ఎంట్రీపై ఆరా తీశారు. సరిపడా హమాలీలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలన్నారు. అనంతరం కోనరావుపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంకు వెళ్లే దారిలో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. -
డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: డ్రగ్స్‌ను నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్‌ను అందించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో క్రీడాకారులు యువకులు విద్యార్థులతో కలిసి 2కే రన్ నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి విద్యార్థి, యువకుడు ‘యాంటీ డ్రగ్ సోల్జర్’గా మారి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని కోరారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో హెల్ప్‌లైన్ నంబర్ 87126 71111కు, సమీప పోలీస్ స్టేషన్‌కు అందించాలని సూచించారు. ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యువతతో డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్ఐలు శ్రీకాంత్, డీసీపీఓ కవిత పాల్గొన్నారు. -
పేదలకు పథకాలు అందిస్తున్నాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: పేదలకు ప్రభుత్వ పథకా లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, గత ప్రభుత్వ హయాంలోని ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నా రు. పట్టణంలోని ఎస్సారార్ ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. గ్రామ, మండల సభల్లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. కార్పోరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామన్నారు. రాజన్న ఆలయాన్ని రూ.150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, త్వరలోనే కుడి, ఎడమ కాలువల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టర్ గరీ మా అగ్రవాల్‌తో కలిసి లబ్ధిదారులకు పరికరాలు అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, ఆర్డీవో రాధాభాయి, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. స్టాళ్లు పరిశీలన మహిళా సంఘాల ఫుడ్‌స్టాల్, వ్యవసాయ, ఉద్యానవనశాఖ ఆయిల్‌పామ్ ఉత్పత్తులు, సన్న వరి సాగు, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖీ కేంద్రం, పోషణ మాసం, బాలల భద్రత.. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల స్టాళ్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు సన్నరకం వడ్లు, ఆయిల్‌పామ్ సాగు చేయాలని సూచించారు. వేములవాడ నియోజకవర్గంలో వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను వెల్లడించారు. మర్రిపల్లి ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయండి వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి మినీ ప్రాజెక్టు పనులు వర్షాకాలంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మర్రిపల్లి ప్రాజెక్టును కలెక్టర్ గరీమా అగ్రవాల్‌తో కలిసి శనివారం పరిశీలించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంత ప్రజల నీటి కష్టాలను గుర్తించి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలని ఆలోచించారన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కుడి, ఎడమ కాల్వల ద్వారా మల్లారం, నాగాయపల్లి, పోచెట్టిపల్లి, కొనాయపల్లి, కాశాయపల్లి, ఎదురుగట్ల, చెక్కపల్లి, అచ్చన్నపేట, వెంకటాంపల్లి, బాలరాజుపల్లి గ్రామాలకు సుమారు 3,600 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. భూసేకరణకు సంబంధించిన కొంతమంది రైతులకు ఇంకా ఇవ్వాల్సిన నష్టపరిహారం పంపిణీ చేయాలని కలెక్టర్‌కు సూ చించారు. మర్రిపల్లిలోని ప్రభుత్వ స్థలంలో మార్కెట్‌యార్డు, రైతువేదిక, గోదాముల నిర్మాణానికి 12.20 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ అబుబాకర్, మండల పార్టీ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పోరాటాలతోనే కార్మిక హక్కులు సాధ్యం
● మేడే వేడుకల్లో నాయకులుసిరిసిల్లటౌన్: పెత్తందార్ల పెట్టుబడి వ్యవస్థపై పోరాడితేనే కార్మికుల హక్కులు సాధిస్తామని వక్తలు స్పష్టం చేశారు. శుక్రవారం మేడే వేడుకలు కార్మిక క్షేత్రం సిరిసిల్లలో ఘనంగా జరిగాయి. అన్ని ప్రధాన ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహించారు. సిరిసిల్ల డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్టీసీ కార్మిక నాయకులు చింతకింది బాణయ్య, చొప్పదండి ప్రకాశ్, సూర దేవరాజు, బొప్ప దేవయ్య, రెడ్డిమల్ల భాను తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు వెంగల శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించారు. ఉత్తమ కార్మికులను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖదీర్‌పాషా, స్థానిక కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణ, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక బీవైనగర్ సీపీఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రమేశ్ జెండా ఆవిష్కరించారు. జిల్లా నాయకులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల కార్మిక భవనం సీపీఐ కార్యాలయంపై జిల్లా కార్యదర్శి సుదర్శన్ జెండా ఎగరేశారు. స్థానిక పెద్దబజారులో హిందు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. సిరిసిల్ల డైయింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిపారు. ఏఐఎఫ్టీయూ న్యూ ఆధ్వర్యంలో జాతీయ నాయకుడు ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు ధశరథం జెండా ఎగరేశారు. -
కొనుగోళ్లలో వేగం పెంచాలి
● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు వేగం పెంచాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. రాచర్లతిమ్మాపూర్లోని శ్రీసాయి ఇండస్ట్రీస్ మిల్లును శుక్రవారం తనిఖీ చేశారు. ధాన్యం దిగుమతి, ఇతర అంశాలపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వెంటవెంటనే దించుకొని లారీలు పంపాలని సూచించారు. ముందుగా గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. తహసీల్దార్లు మారుతిరెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పోలీస్ యాక్ట్సిరిసిల్ల: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం మే 1 నుంచి 31 వరకు జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ మహేశ్ బిగితే వెల్లడించారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని స్పష్టం చేశారు. డీజే సౌండ్ సిస్టమ్ వినియోగం కూడా నిషేధితమని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టొద్దని హెచ్చరించారు. జిల్లా ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారమందించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. ఇల్లంతకుంట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పొత్తూరు గ్రామంలో మంచే లక్ష్మి, చిక్కుడువానిపల్లెలో కంకటి రేవతి–రమేశ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి శుక్రవారం గృహప్రవేశం చేయగా.. ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పేదవారికి సొంతింటి కల నెరవేరుతోందన్నారు. అర్హులు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్పంచులు పట్నం అశ్విని, చింతమడక కళ్యాణ్, చొప్పరి భూమయ్య, మామిడి రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ పాశం రాజేందర్‌రెడ్డి, పసుల వెంకటి, ఉప సర్పంచ్ చిక్కుడు సత్యం తదితరులు పాల్గొన్నారు. ఎక్కడి కమిషనర్లు అక్కడే..?వేములవాడ: వేములవాడ మున్సిపల్ కమిషనర్‌గా మంచిర్యాల కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న అన్వేశ్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు వెలువరించింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సంపత్‌కుమార్‌ను హైదరాబాద్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆమేరకు శుక్రవారం వీరు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ రాజకీయ జోక్యంతో మంచిర్యాల కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న అన్వేశ్‌ను అక్కడే ఉండేలా అక్కడి ప్రధాన నాయకుడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే అన్వేశ్ మొన్నటివరకు వేములవాడ కమిషనర్‌గా సేవలందించడంతో ఆయన సేవలను ఇక్కడ వినియోగించుకునేందుకు ఇక్కడి నాయకత్వం సైతం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అక్కడి నాయకుడు ఇక్కడి నాయకుడితో మాట్లాడి వీరి సేవలను ఎక్కడికక్కడే వినియోగించుకునేందుకు ఫైనల్ చేసినట్లు సమాచారం. దీంతో అన్వేశ్ మంచిర్యాలకు, సంపత్‌కుమార్ వేములవాడకు పరిమితం కానున్నారు. ప్రభుత్వం మరో ఆర్డర్ వెలువరించనుంది. -
ఆరు గ్యారంటీలను ఆవిష్కరించాలి
● ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ఆవిష్కరిస్తూ సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలస్థాయి సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గస్థాయి సభల నిర్వహణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలతో కరపత్రం రూపొందించి పంపిణీ చేయాలని, ఈ సభలకు మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, రైతులు, వివిధ పథకాల లబ్ధిదారులను ఆహ్వానించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు సీహెచ్ వెంకటేశ్వర్లు, రాధాభాయ్, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, డీఆర్డీవో మచ్చ గీత, సీపీవో పీబీ శ్రీనివాసాచారి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫోద్దీన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా పాల్గొన్నారు. నూతన ఇసుక రీచ్‌లపై సమీక్షసిరిసిల్ల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర నిర్మాణాలు, స్థానిక అవసరాల కోసం గుర్తించిన నూతన ఇసుక రీచ్‌లపై కలెక్టర్ డిస్ట్రిక్ట్ లెవెల్ సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. -
‘క్రిటికల్ కేర్’
మెడికల్ కాలేజీలోఇది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవుట్ పేషెంట్(ఓపీ) విభాగం. ఇక్కడ నిత్యం సగటున వెయ్యి నుంచి 1,400 మంది రోగులు ఓపీ చిట్టీలు తీసుకొని వివిధ రకాల వైద్య నిపుణుల వద్దకెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటారు. సిరిసిల్ల నడి బొడ్డున అంబేడ్కర్ సర్కిల్లోని ఈ ఆస్పత్రిలో 330 పడకలుండగా.. నిత్యం 200 నుంచి 300 మంది రోగులు అడ్మిట్ అవుతుంటారు. 50 పడకల ఆస్పత్రిగా ఉన్న ఆ సర్కారు దవాఖానను 330 పడకలకు పెంచుతూ పోవడం, మెడికల్ కాలేజీకి అనుబంధంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా మార్చడంతో రోగుల సంఖ్య పెరిగి ఇలా రద్దీగా మారింది. ఉదయం 10 గంటలకు ఆస్పత్రికెళ్తే.. కాలు పెట్ట సందు లేకుండా రోగులు, వారి బంధువులు, వాహనాల రద్దీతో జిల్లా జనరల్ ఆస్పత్రి కిటకిటలాడుతుంది.ఇది పట్టణ శివారులోని పెద్దూరు బైపాస్ రోడ్డు పక్కన నిర్మించిన మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రి. ఈ ఆస్పత్రి భవనాన్ని సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు ప్రవీణ్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(సివిల్ సర్జన్) సుమన్‌మోహన్‌రావు, మెడికల్ కాలేజీ డాక్టర్ల బృందం క్షేత్రస్థాయిలో ఇటీవల పరిశీలించారు. ఇక్కడ ఉన్న వసతులు, ఇంకా అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వానికి ఈ బృందం నివేదిక పంపించింది. ఈ ఆస్పత్రిలో 50 పడకల వసతులతో కూడిన భవనం సిద్ధమైంది. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇరుకిరుకుగా కొనసాగుతున్న క్రిటికల్ కేర్ యూనిట్ ఐసీయూ, అత్యవసర చికిత్స కేంద్రం(ఎమర్జెన్సీ సెంటర్) వంటి వాటిని మెడికల్ కాలేజీ పరిధిలోని క్రిటికల్ కేర్ యూనిట్‌కు మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మెడికల్ కాలేజీలో వసతులను కల్పిస్తున్నారు. -
బండ్ల ప్రదక్షిణ
ఇల్లంతకుంట: రేపాకలో శుక్రవారం సాయంత్రం మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా బండ్ల ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. ఆలయం చుట్టూ ఎడ్లబండ్లు, మేకపోతుల బండి, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు ప్రదక్షిణ చేయించారు. ప్రతి ఏటా జాతర నిర్వహిస్తామని సర్పంచ్ కాత మల్లేశం తెలిపారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జాతరలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తాళళ్లపల్లి సర్పంచ్ కనకరాజు, ముస్కాన్‌పేట సర్పంచ్ భాస్కర్‌రెడ్డి, ఇల్లంతకుంట సర్పంచ్ రాజు, కాంగ్రెస్ నాయకుడు రాజయ్య పాల్గొన్నారు. -
ఖాళీ బిందెలతో వార్డు సభ్యురాలి ధర్నా
● పంచాయతీ కార్యాలయంలో ఆందోళనముస్తాబాద్: ముస్తాబాద్ మేజర్ పంచాయతీ కార్యాలయంలో తొమ్మిదో వార్డు సభ్యురాలు బండి సుమలత ఖాళీ బిందెలతో శుక్రవారం ధర్నా చేపట్టారు. స్వయంగా వార్డు సభ్యురాలే నీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలని ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. వార్డు సభ్యురాలు మాట్లాడుతూ.. తన వార్డులో నెల రోజుల క్రితం బోరు మోటారు కాలిపోయిందన్నారు. దానిని మరమ్మతు చేసేందుకు పంచాయతీ సిబ్బంది ఇప్పటివరకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా వార్డు ప్రజలకు నిత్యం ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తుండగా, కొంతమంది దానిని అడ్డుకున్నారన్నారు. బోరు మోటారు బాగు చేయక, ట్యాంకర్‌ను పంపించక వార్డు ప్రజలపై ఎవరు కక్ష కట్టారో తేలాలని పట్టుబట్టారు. స్టోర్‌రూమ్‌లో అదనంగా మోటారు ఉన్నా.. దానిని పంపించలేదని అన్నారు. కార్యదర్శి రమేశ్ స్పందిస్తూ.. త్వరలోనే మోటారును పంపిస్తామని, సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. -
కార్మిక సంక్షేమమే ధ్యేయం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● మండేపల్లి ఏటీసీలో ఘనంగా మేడే వేడుకలు ● హాజరైన కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గితేతంగళ్లపల్లి(సిరిసిల్ల): అన్ని రంగాల కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం మేడే సందర్భంగా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గితేతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ ఫోన్ ద్వారా కార్మికులకు తన శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ సమాన గౌరవం గాంధీజీ ఆశయాల ప్రకారం ప్రతీ కార్మికుడికి సమాన గౌరవం దక్కాలని కలెక్టర్ అన్నారు. భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖలో పేర్లు నమోదు చేసుకొని పథకాలను పొందాలని సూచించారు. అండగా పోలీస్ శాఖ వివిధ పరిశ్రమల్లో, రోజూవారీ కూలీలుగా పని చేస్తున్న కార్మికులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ అన్నారు. డీఎస్పీ నాగేంద్రాచారి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, పరిశ్రమల అధికారి హనుమంతు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. బాలల భద్రత.. వేములవాడఅర్బన్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల భద్రత.. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా బాల భరోసాపై వేములవాడ ఏరియా ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులందరికీ ‘ఇందిరమ్మ’వేములవాడ: అర్హులైన పేదలకు సొంతిల్లు అప్పగించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలో పూర్తయిన పలు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రభుత్వం సైలెన్స్
‘సెస్’ లైసెన్స్..● కోర్టుపైనే ‘సెస్’ పాలకవర్గ ఆఖరు ఆశలు ● ఎన్పీడీసీఎల్ స్వాధీనం చేసుకుని నేటికి నెల ● విద్యుత్ వినియోగదారుల మిశ్రమ స్పందనసిరిసిల్ల: జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ (సెస్) పాలకవర్గం ఆశలన్నీ కోర్టుపైనే ఉన్నాయి. ఐదేళ్లకోసారి ‘సెస్’ వ్యాపార లైసెన్స్‌ను రెన్యువల్ చేయాల్సిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) లైసెన్స్ ఇవ్వకుండా ఎన్పీడీసీఎల్ పరిధిలోకి ‘సెస్’ను మార్చుతూ ఏప్రిల్ 1న ఆదేశాలు జారీ చేశారు. ‘సెస్’ను రద్దు చేస్తున్నట్లు టీజీఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ‘సెస్’ సేవలు రద్దయి.. ఎన్పీడీసీఎల్ సేవలు మొదలై శుక్రవారం నాటికి (మే 1వతేదీ) నెల రోజులు అవుతుంది. విద్యుత్ వినియోగదారుల నుంచి ‘సెస్’ రద్దుపై విశ్రమ స్పందన వస్తుంది. 56 ఏళ్లుగా సేవలు అందించే ‘సెస్’ ఉండాలని కొందరు భావిస్తుండగా, ఎన్పీడీసీఎల్ సేవలే బాగున్నాయని మరికొందరు భావిస్తున్నారు. ‘సెస్’ ఉనికి కరువై నెల 2026 మార్చి 31తో ‘సెస్’ లైసెన్స్ గడువు ముగియడంతో సిరిసిల్ల ప్రాంతంలో విద్యుత్ పంపిణీ సేవలను ఉత్తర డిస్కంలో విలీనం చేశారు. ‘సెస్’ను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుని వ్యాపార కార్యక్రమాల నిర్వహణకు వీలుగా ఎన్పీడీసీఎల్కు టీజీఈఆర్సీ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 1న ‘సెస్’ను ఎన్పీడీసీఎల్ అధికారులు ఆధీనంలోకి తీసుకుని విద్యుత్ పంపిణీ సేవలు అందిస్తున్నారు. సెస్ పాలకవర్గం పదవీ కాలం మరో 20 నెలలు ఉండగా, నోటీసు కూడా ఇవ్వకుండా, లైసెన్స్ రెన్యూవల్ చేయకుండా సంస్థను రద్దు చేయడాన్ని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, వినియోగదారులు ఓట్లు వేసి ఎన్నుకున్న పాలకవర్గ పదవీ కాలం ఉండగానే, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ‘సెస్’ ఉసురు తీస్తున్నారని పేర్కొంటూ కోర్టులో కేసు వేశారు. జస్టిస్ వై.రేణుక ఈ కేసు విచారణకు స్వీకరించారు.. ‘సెస్’ విషయంలో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులు ఒక్క మాటైనా మాట్లాడకుండా నెల రోజులుగా సైలెంట్‌గా ఉండటం విశేషం. సంస్థను ఎన్పీడీసీఎల్లో విలీనం చేసిన అంశాన్ని వినియోగదారులు పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. సిరిసిల్లపైనే ఫోకస్ ‘సెస్’ను ఎన్పీడీసీఎల్లో విలీనం చేసుకుంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 3 లక్షల మందికిపైగా వినియోగదారులున్న సంస్థను టేకోవర్ చేస్తే అవాంఛనీయ ఘటనలను ఏమైనా చోటు చేసుకుంటాయని అంచనా వేశారు. ఈ మేరకు ఏప్రిల్ 1న సంస్థను ఆధీనంలోకి తీసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎంతో బిజీగా ఉంటే ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి ‘సెస్’లో సమీక్షలు నిర్వహించి విద్యుత్ పంపిణీలో వినియోగదారులకు ఇబ్బందులు రానీయొద్దని అన్ని స్థాయిల అధికారులకు స్పష్టం చేశారు. నెల రోజుల్లో సిరిసిల్ల ప్రాంతాన్ని నాలుగు సార్లు సందర్శించి విద్యుత్ సేవలపై ఫోకస్ పెంటారు. ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లోనే పర్యటించారు. ‘సెస్’ ఎండీ భిక్షపతిని బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో ఎస్ఈగా వేణుమాధవ్ నియమించారు. కొత్త విద్యుత్ సబ్స్టేషన్లకు భూసేకరణలో నిమగ్నమయ్యారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమలోని పవర్‌లూమ్స్ కేటగిరిని మార్చుతూ రూ.10 కోట్ల విలువైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను స్టోర్స్‌కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న విద్యుత్ విధానాలను అమలు చేస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వినియోగదారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ముందుచూపుతో జిల్లాపై ఫోకస్ పెట్టారు. జిల్లాలో కొత్త తరహా విద్యుత్ పంపిణీ సేవలు అందుబాటులోకి రావడంతో ఒక వర్గం వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పెద్దలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. మరో వైపు సంస్థ ఉసురు తీయొద్దని మరో వర్గం కోరుతున్నారు. వేసవి సెలవుల గండం ‘సెస్’ విలీనంపై హైకోర్టు సోమ, మంగళవారాల్లో విచారించే అవకాశం ఉంది. కోర్టు విచారణపైనే పాలకవర్గం ఆశలు సజీవంగా ఉన్నాయి. కానీ, ఆ రెండు రోజుల్లో హైకోర్టులో విచారణకు రాకుంటే.. కోర్టుకు వేసవి సెలవులు కావడంతో మళ్లీ జూన్‌లో విచారణ ఉండే అవకాశం ఉంది. ‘సెస్’ను ఎన్పీడీసీఎల్ అధికారులు స్వాధీనం చేసుకుని నెల అవుతుండగా, ఎన్పీడీసీఎల్ అధికారులు ఆ సంస్థ’ యంత్రాంగంతోనే పనులు చేయిస్తుండగా, పాలకవర్గం మాత్రం ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. -
శుక్రవారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2026
కల్యాణ వైభోగమే..వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న దత్తత ఆలయం నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో రమాదేవి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం 10.30 గంటలకు శ్రీభూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. కన్యదాతలుగా రాచకొండ రామాచార్యులు సంధ్య, కల్యాణోత్సవ దాతలుగా కరీంనగర్‌కు చెందిన కోటోజు శ్రీనివాస్ సుష్మ వ్యవహరించారు. స్వామివారిని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే గిట్టుబాటు ధర
● కలెక్టర్ గరీమా అగ్రవాల్తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా టార్పాలిన్లు, గన్నీ సంచులు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే ముందే ప్యాడీ క్లీనర్లను ఉపయోగించి నాణ్యతను పెంచుకోవాలని పేర్కొన్నారు. కేటాయించిన మిల్లులకు మాత్రమే ధాన్యం పంపాలని, సేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ విజయ్‌ప్రకాశ్‌రావు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
భవిష్యత్‌లో ఉన్నతస్థాయిలో నిలవాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత స్థాయిలో నిలవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఇల్లంతకుంట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని మాందాడి హనీ పదో తరగతిలో 586 మార్కులతో సొసైటీ స్థాయిలో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించడంతో మంత్రి గురువారం హైదరాబాద్‌లో సన్మానించారు. క్రమశిక్షణతో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు అభినందించారు. నిరసన దీక్ష విజయవంతం చేయాలిసిరిసిల్ల: ఉద్యోగుల డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే దీక్ష సమరాన్ని విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ కోరారు. జిల్లా కేంద్రంలోని అర్బన్‌బ్యాంకులో గురువారం ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఉద్యమ ఖిల్లాగా పేరుందని, ఆ పేరును నిలబెట్టుకునేలా దీక్షలు చేపట్టాలన్నారు. నిరసన దీక్షలలో ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. జేఏసీ చైర్మన్ ఎలుసాని ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై నిరసన దీక్షను విజయవంతం చేస్తామన్నారు. జేఏసీ కార్యదర్శి సమరసేన, టీజీవో, టీఎన్జీవో నాయకులు సయ్యద్ జబీ, అహ్మద్రసూల్, గాజుల సుదర్శన్, ఎండీ రియాజ్, మెట్టు శ్రీకాంత్, ఆర్.శేఖర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెన్షనర్స్ పాల్గొన్నారు. బోయినపల్లి(చొప్పదండి): అనాథలకు అండగా మిషన్ వాత్సల్య విభాగం కృషి చేస్తుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. పజా పాలన ప్రగతి ప్రణాళిక, బాలల భద్రత డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని కొదురుపాకలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో తల్లిదండ్రుల సపోర్ట్ లేని వారి వివరాలు సేకరించగా మొత్తం 302 మంది పిల్లలు ఉన్నారని గుర్తించడం జరిగిందన్నారు. వీరికి జనన ధ్రువీకరణ, తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, కులము, ఆదాయం, బ్యాంక్ అకౌంట్, ఆధార్ లాంటివి అందించడానికి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. పిల్లల దత్తతకు చట్ట ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. అక్రమంగా పిల్లలను కొనుగోలు చేసినా, విక్రయించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలను పెంచడానికి ఏవైనా సంస్థలు ముందుకు వస్తే వారి వివరాలు ప్రభుత్వానికి పంపి ఆన్లైన్లో నమోదు కోసం సాయం అందిస్తామన్నారు. అడిషనల్ సీడీపీవో సుచరిత, జిల్లా విమెన్ హబ్ కోఆర్డినేటర్ రోజా, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కవిత, లీగల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అంజయ్య, తహసీల్దార్ షరీఫ్ మోయినొద్దిన్, ఎంపీడీవో జయశీల, ఎస్సై రమాకాంత్, సర్పంచు కత్తెరపాక మంజుల, ఉపసర్పంచు గోపాల్, ఎంఈవో శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి మూడు స్టడీ ప్రాజెక్టులు ఎంపిక గంభీరావుపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుంచి మూ డు జిజ్ఞాస స్టూడెంట్ ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ఇంగ్లిష్, కెమిస్ట్రీ, బోటనీ సబ్జెక్టుల నుంచి ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. సంబంధిత విద్యార్థులను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. -
అచ్చయ్యకుంటకు ఎల్లంపల్లి నీరు
రుద్రంగి(వేములవాడ): రుద్రంగిలో తాగునీటి కొరత రాకుండా విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు నాగారం చెరువు, అచ్చయ్యకుంటకు ఎల్లంపల్లి నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు, సర్పంచ్ గండి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి పేర్కొన్నారు. అచ్చయ్య కుంటకు నీరు తరలించే ఎల్లంపల్లి కాలువను గురువారం పరిశీలించారు. ఎండిపోతున్న పంట పొలాలకు మూడుసార్లు, ఇప్పుడు తాగునీటి కోసం మందుచూపుతో ఎల్లంపల్లి నీటిని విడుదల చేయిస్తున్న విప్ ఆదికి రుద్రంగి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డీసీసీ కార్యదర్శి గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
‘ఆది’ ఆశీస్సులు ఎవరి‘కో’
● ఈనెల 4న వేములవాడ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక?వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. గతనెల 22న నామినేషన్ ప్రక్రియ ముగియగా, స్క్రూటినీలో మొత్తం 22 నామినేషన్లకు 8 తిరస్కరణకు గురవడం చర్చనీయాంశమైంది. 14 మంది పోటీలో ఉండగా, తుది ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 4 వరకు నలుగురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నికోవాల్సి ఉంటుంది. విప్ చేతుల్లో తుది నిర్ణయం కో ఆప్షన్ ఎంపికలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాత్ర కీలకంగా మారింది. అధికార పార్టీ ఆధిపత్యం ఉన్న కౌన్సిల్ కావడంతో, ఆయన సూచనల మేరకే తుది ఎంపిక జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికార పాలకవర్గాలు చెబుతున్నాయి. అందుకే అభ్యర్థులు విప్ మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 4న ఎన్నిక? ఈనెల 4న కోఆప్షన్ ఎన్నిక నిర్వహించేందుకు మున్సిపల్ కమిషనర్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. కౌన్సిల్ సమావేశం ద్వారా ఈ ఎన్నిక జరగనుంది. దీంతో అప్పటివరకు రాజకీయ లాబీయింగ్ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. టెన్షన్..టెన్షన్ మొత్తం నాలుగు స్థానాల్లో 2 మైనార్టీ, 2 స్పెషల్ నాలెడ్జ్ పర్సన్స్‌కు కేటాయింపు ఉన్న నేపథ్యంలో వర్గాల మధ్య సమతుల్యత సాధించడం అధికార పార్టీకి సవాల్‌గా మారింది. ఒకవైపు అర్హతలు, మరోవైపు రాజకీయ నిబద్ధతం రెండు అంశాలను బేరీజు వేసుకుంటూ తుది జాబితా ఖరారు చేసే ప్ర క్రియ సాగుతోంది. దీంతో విప్ నిర్ణయం మేరకు అ భ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరి పేర్లు బయటికి రాకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ‘ఆది’ చుట్టూ ఆశావహులు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ గడువు పూర్తికావడంతో ఇక ఎన్నిక ఒక్కటే మిగిలింది. ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకు ఆశావహులు విప్ ఆది శ్రీనివాస్ మన్ననల కోసం ఆయన వద్దకు చేరుకుంటున్నారు. తమకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. శీనన్న ఎవరికి అవకాశం కల్పిస్తారోనని పార్టీ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. -
ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ సిరిసిల్ల
సిరిసిల్లటౌన్: ప్రజల బాధ్యతాయుత భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సిరిసిల్ల సాధ్యమైందని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. గురువారం బల్దియా ఆధ్వర్యంలో స్థానిక రిసోర్స్ పార్క్‌లో నిర్వహించిన వేస్ట్ టు కంపోస్ట్ విండ్రో– వర్మి కంపోస్టింగ్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఇంటింటా తడి చెత్త సేకరణ నుంచి కంపోస్ట్ తయారీ వరకు అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. పట్టణాలను స్వచ్ఛతగా తీర్చిదిద్దడంలో పారిశుధ్య కార్మికులది చాలా కీలకమైన పాత్రన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో తడి పొడి, హానికరమైన చెత్తలను వేరు చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో వేయడాన్ని పూర్తిస్థాయిలో అరికట్టామని వివరించారు. కార్యక్రమానికి వివిధ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు హాజరై సిరిసిల్ల బల్దియా పరిధిలో నిర్వహిస్తున్న పద్ధతులను పరిశీలించి అభినందించారు. కంపోస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హేమలత పాల్గొన్నారు. -
ఫలించిన కూలి పోరాటం
సిరిసిల్లటౌన్: పవర్‌లూమ్స్, వైపని కార్మికుల కూలి పోరాటం ఫలించింది. గురువారం యజమానులతో జరిగిన చర్చలు ఫలించాయి. గురువారం పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘంలో యజమానులు, పవర్లూమ్ వార్పిన్, వైపని కార్మికుల కూలిపై చర్చలు జరిపారు. అనంతరం పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ మాట్లాడుతూ, పవర్లూమ్, వైపని కార్మికుల కూలి పెంపు అగ్రిమెంట్ జరిగిందని, వార్పిన్ కార్మికుల కూలి సమస్య పరిష్కారం కాలేదన్నారు. పవర్లూమ్ కార్మికులకు చిన్న పన్నకు 28 పైసలు, పెద్దపన్నకు 29 పైసలు ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగిందన్నారు. వైపని కార్మికులకు పాలిస్టర్ వెయ్యి పోగులకు రూ.100 ఇవ్వడానికి అంగీకారం కుదిరిందన్నారు. ఇట్టి కూలి మే 1 నుంచి అమలుకు యజమానులు సమ్మతించారని పేర్కొన్నారు. వార్పిన్ కార్మికుల కూలి అగ్రిమెంటు జరగని నేపథ్యంలో వారి సమ్మె యథాతథంగా కొనసాగిస్తామన్నారు. యజమానుల సంఘం అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, కార్యదర్శి ఆంకారపు రవి, గోవింద్ రవి, దూడం శంకర్, దూస భూమయ్య, బండారి అశోక్, మండల బాలరాజ్, శ్రీరామ్ సత్యం, కోడం రమణ, సిరిమల్లె సత్యం, ఉడుత రవి, మచ్చ వేణు, ఒగ్గు గణేశ్, ఎలిగేటి శ్రీనివాస్, కుసుమ గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదమరిస్తే అంతే..
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట ప్రమాదం పొంచి ఉంది. మున్సిపల్ డ్రైనేజీపై వేసిన సిమెంట్ మూతలు శిథిలం కావడంతో ఆదమరిస్తే.. చాలు.. కాలు విరగడం ఖాయమన్నట్లుగా ఉంది. ఇప్పటికే పలువురు ఆ శిథిలాల్లో పడి గాయపడ్డారు. మున్సిపల్ అధికారులు షాపుల అద్దైపె ఆసక్తి చూపుతున్నారే తప్ప.. ఆ షాపుల ముందు పొంచి ఉన్న ప్రమాదాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


