ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా కొనసాగుతోందని, రైతులకు ఇబ్బందులు కలగనివ్వబోమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల అపెరల్ పార్క్‌లోని షెడ్‌లలో ధాన్యం దిగుమతిని శుక్రవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి పరిశీలించారు. రైతులు ఆందోళన చెందొద్దని, చివరి గింజ వరకు కొంటామన్నారు. ధాన్యం దిగుమతికి అపెరల్‌పార్క్‌లోని షెడ్లలో వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని, ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. డీసీఎస్‌వో బుచ్చిబాబు, సిరిసిల్ల తహసీల్దార్ ఎస్.మహేశ్, కోనరావుపేట, వేములవాడ ఏఎంసీ చైర్మన్‌లు కచ్చకాయల ఎల్లయ్య, రొండి రాజు పాల్గొన్నారు.
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
కోనరావుపేట(వేములవాడ): పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని అజ్మీరాతండాలో ఇందిరమ్మ ఇంటిని శుక్రవారం ప్రారంభించి, లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. విప్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అర్హులైన ప్రతీ కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, సర్పంచులు భుక్యా తిరుపతి, బానోత్ నరేశ్, జయరాం, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, సింగిల్‌విండో చైర్మన్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ–ఫార్మసీ విధానం రద్దు చేయాలి


