breaking news
Rajanna Sircilla District News
-
వైఎస్సార్ చొరవతోనే ఆరోగ్యశ్రీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటాల ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం అమలు చేశారని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి పుట్ట రవి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలో ఆరోగ్యశ్రీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆస్పత్రి, వృద్ధుల ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. దాసరి దేవచంద్రన్, సాగర్, అందె చంద్రం, మార్వాడి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల అర్బన్: జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి పుట్ట రవిమాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం ఆరోగ్యశ్రీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. రవి మాట్లాడుతూ పేద చిన్నారుల గుండె జబ్బుల చికిత్సకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఉచిత చికిత్స కోసం చేసిన ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే సామాజిక ఆరోగ్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. ప్రభాకర్, కానాపురం లక్ష్మణ్, శోభారాణి, మనోజ్‌కుమార్, జింక శ్రీధర్, బడుగు లింగయ్య, చంద్రమౌళి పాల్గొన్నారు. బోయినపల్లి: మంద కృష్ణమాదిగ పోరాట ఫలితంతోనే ఆరోగ్యశ్రీ ఆవిర్భావమైందని నాయకుడు పుట్ట రవి అన్నారు. కొదురుపాక ఎక్స్ రోడ్డులో శుక్రవారం ఆరోగ్యశ్రీ దినోత్సవం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ కొంకటి రమేశ్, నాయకులు చేన్నమనేని పురుషోత్తంరావు, ఆవునూరి ప్రభాకర్, కానాపురం లక్ష్మణ్, కత్తెరపాక రవీందర్, నేదునూరి బాబు, కత్తెరపాక మనోహర్, మల్లారెడ్డి, ధుమల రాములు తదితరులు పాల్గొన్నారు. -
మొరాయించిన 108 వాహనం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ రోగిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలిస్తున్న 108 వాహనం రోడ్డుపైనే మొరాయించింది. ఎంతకీ కదలకపోవడంతో రోగి బంధువులు ఆందోళనకు గురయ్యారు. దీంతో మరో వాహనాన్ని తెప్పించి రోగిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్‌తండాకు చెందిన భూక్య జెమిలి(85) ఇంట్లో శుక్రవారం ఉదయం జారిపడడంతో కాలుకు తీవ్రగాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. వీర్నపల్లికి చెందిన 108 వాహనం లక్ష్మీపూర్‌తండాకు వెళ్లి జెమిలిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వాహనం హఠాత్తుగా ఆగిపోయింది. 108 సిబ్బంది ఎంత ప్రయత్నించినా కదలకపోవడంతో రోగి బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఈక్రమంలోనే గంభీరావుపేటకు చెందిన 108 వాహన సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి జెమిలిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆందోళన చెందిన రోగి బంధువులు మరో వాహనం కోసం నిరీక్షణ -
మత్తడి మరమ్మతులు ఎప్పుడో?
● ప్రతిపాదనలోనే పనులు ● వృథాగా పోతున్న వర్షపు నీరువేములవాడరూరల్: ఆరేళ్ల క్రితం అత్యధిక వర్షాలు కురిసి వచ్చిన వరదతో శిథిలమైన మత్తడికి మరమ్మతులు కరువయ్యాయి. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరదకు ఎలాంటి కట్టడి లేకపోవడంతో కిందికి వెళ్లిపోతుంది. వేములవాడ మండలం మల్లారం ఆనకట్ట శిథిలం కావడంతో వర్షపు నీరు వృథాగా పోతోంది. ఈ వరద ఇక్కడ నిలిచి ఉంటే చుట్టుపక్కల ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగేవి. 1968లో నిర్మాణం వేములవాడ మండలం మల్లారం వద్ద 1968లో మత్తడి నిర్మించారు. ఇక్కడి నుండి ఫీడర్ చానల్ మీదుగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి గుడి చెరువుకు నీటిని మళ్లించారు. ఈ నీటితో వేములవాడ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేవి. దీంతోపాటు చెరువు కింద ఉన్న దాదాపు వందలాది ఎకరాల భూమి సాగులోకి వచ్చేది. ఇటీవల వచ్చిన వరదలతో ఈ చెక్‌డ్యామ్ మత్తడి కొట్టుకుపోవడంతో గుడిచెరువులోకి నీరు రావడం లేదు. అంతేకాకుండా ఈ మత్తడిని మరమ్మతు చేయకపోవడంతో ఫీడర్ చానల్లో పిచ్చిమొక్కలు, మురికినీరు నిలిచి వందల ఎకరాల భూములు కోతకు గురవుతున్నాయి. మిడ్‌మానేరు నుంచి గుడి చెరువులోకి.. గత ప్రభుత్వ హయాంలో మిడ్‌మానేరు నుంచి గుడి చెరువులోకి నీటిని ఎత్తిపోసేందుకు రూ.4కోట్లు వెచ్చించారు. మిడ్‌మానేరు నుంచి నీటిని ఎత్తిపోయడంతో దాదాపు రూ.80లక్షల కరెంట్ బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. అదే మల్లారం ఆనకట్ట మరమ్మతులు చేపడితే ఫీడర్ చానల్ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా వర్షాకాలంలో వేములవాడ గుడి చెరువులోకి భారీగా నీరు చేరుతుంది. ఈ విషయంపై గతంలో ఆ ప్రాంత రైతులు పలుసార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ స్పందించడం లేదు. -
ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
చందుర్తి: దేశభక్తిని చాటుకునేందుకు ప్రతీ పౌరుడు ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ కోరారు. మండల కేంద్రంలో హర్‌ఘర్ తిరంగాలో భాగంగా శుక్రవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. విజేందర్ మాట్లాడుతూ ఈనెల 13 నుంచి 15 వరకు జాతీయ జెండాలను ఎగురవేయాలన్నారు. ఈనెల 11 నుంచి 14 వరకు అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని కోరారు. సిరికొండ శ్రీనివాస్, మార్త సత్తయ్య, గంగాధర్, తీపిరెడ్డి మనోహర్‌రెడ్డి, చారి పాల్గొన్నారు. -
గ్యాస్ మాటున గుండెపోటు
నగరంలోని మంకమ్మతోటకు చెందిన రమేశ్(40) ఉదయం లేవగానే చాతిలో మంటగా అనిపించింది. మొదట గ్యాస్ సమస్య అనుకున్నప్పటికీ ఎంతకీ తగ్గకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలుచేయించుకోగా ఒక వాల్వ్ బ్లాక్ అయినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే స్టంట్ వేశారు● అతి పెద్ద కిల్లర్‌గా మారిన హార్ట్ ఎటాక్ ● కరీంనగర్లో పెరుగుతున్న కేసులు ● నడక, వ్యాయామంతో నివారించే అవకాశం ● జీవనశైలి, ఆహార మార్పులు తప్పనిసరి ● ముందు జాగ్రత్త మేలంటున్న వైద్యులుకరీంనగర్: ఛాతీలో మంటగా ఉంది. గ్యాస్ అయి ఉంటుంది. అజీర్ణం వల్ల నొప్పి వస్తోంది.. అంటూ చాలామంది నిర్లక్ష్యం చేసే లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెపోటుకు సంకేతాలు కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ అని అనుకుని ప్రతి ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. అదే సమయంలో ప్రతి నొప్పి గుండెపోటే అని భయపడాల్సిన అవసరం కూడా లేదని చెబున్నారు. అనుమానం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు అంటున్నారు. గుండెపోటు చికిత్సలో శ్రీగోల్డెన్ అవర్శ్రీ అత్యంత కీలకం. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన వారిలో జీవనశైలి మార్పులు, ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు, ధూమపానం వంటి కారణాలతో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. యువతలో పెరుగుతున్న ముప్పు ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపించే గుండె సంబంధిత సమస్యలు ఇప్పుడు 25 నుంచి 45 ఏళ్ల వయసు వారిలో కూడా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, నిద్రలేమి, ఫాస్ట్‌ఫుడ్ అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు వంటి కారణాలు ఇందుకు కారణం అవుతున్నాయి. గ్యాస్.. గుండెపోటు లక్షణాలు గ్యాస్ లేదా అజీర్ణం వల్ల సాధారణంగా కడుపు ఉబ్బరం, తేపులు, భోజనం చేసిన తర్వాత అసౌకర్యం, గొంతు వరకు మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు మందులు తీసుకుంటే లేదా విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. గుండెపోటు సమయంలో ఛాతీ మధ్య భాగంలో బిగుతుగా లేదా నొక్కుతున్నట్లుగా నొప్పి ఉండవచ్చు. ఆ నొప్పి చేతులు, భుజాలు, మెడ, దవడ లేదా వీపుకు వ్యాపించవచ్చు. అధిక చెమటలు పట్టడం, వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్ర నీరసం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో నొప్పి తక్కువగా ఉన్నప్పటికీ గుండెపోటు ఉండే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి... ఛాతీలో 15 నుంచి 20 నిమిషాలకు పైగా కొనసాగే నొప్పి, ఒత్తిడి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎడమ చేయి, మెడ, దవడకు వ్యాపించే నొప్పి అధిక చెమటలు పట్టడం, వికారం, వాంతులు తీవ్రమైన బలహీనత లేదా తల తిరగడం ఈ లక్షణాలు కనిపిస్తే సమీప ఆసుపత్రికి వెంటనే వెళ్లి ఈసీజీ, 2డి ఎకో వంటి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నూరైన్కు స్వర్ణ పతకం
కరీంనగర్‌స్పోర్ట్స్: హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర 12వ యూత్ అండర్ 18 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. 12 సంవత్సరాల కేటగిరీలో 60 మీటర్ల పరుగు విభాగంలో 48 మంది క్రీడాకారులు పాల్గొనగా, నూరైన్ ప్రతి భ కనబరిచి స్వర్ణ పతకం సాధించింది. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ సంఘం బాధ్యులు నూరైన్ను అభినందించి భవిష్యత్‌లో మరి న్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇద్దిరికి జైలు శిక్షకరీంనగర్క్రైౖం: ఒకరి మృతికి కారణమైన ఇద్దరికి పదేళ్ల జైలు, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కరీంనగర్ హౌసింగ్‌బోర్డ్ కాలనీలో గులాం షబ్బీర్ హుస్సేన్ తన కుటుంబంతో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వీరి పక్కనే రియాజ్ బేగం కుటుంబం ఉంటోంది. వీరు పరిసరాలు అపరిశుభ్రంగా ఉంచుకుంటున్నారని షబ్బీర్ ఇంటి ఓనర్‌కు ఫిర్యాదు చేశాడు. ఇంటి ఓనర్ రియాజ్బేగంను ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేశాడు. 2023 నవంబర్ 30న రియాజ్ బేగం కుటుంబ సభ్యులు షబ్బీర్ కుటుంబంతో గొడవపడ్డారు. ఆ సమయంలో పాలు తీసుకుని వచ్చిన షబ్బీర్ మామ మహమ్మద్ ఉస్మాన్(64)పై కర్రతో దాడి చేయడంతో గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు ఘటనకు బాధ్యులైన షేక్ మజీద్, రియాజ్ బేగం, షేక్ ఇర్ఫాన్ ఖాన్, మున్నీ బేగం, మహమ్మద్ ముబీన్‌పై కేసు నమోదు చేశారు. సీఐ వి.శ్రీనివాస్ దర్యాప్తు జరిపారు. సాక్ష్యులను సీడీవో సుధాకర్ కోర్టులో ప్రవేశపెట్టగా పీపీ ప్రతాప్ విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి శివకుమార్ షేక్ ముజీద్, షేక్ ఇర్ఫాన్ ఖాన్‌పై నేరం నిరూపణ కావడంతో జైలుశిక్ష, జరిమానా విధించారు. మిగితా వారిపై కేసు కొట్టి వేశారు. -
పుణ్యక్షేత్రాల సందర్శనలో కౌన్సిలర్లు
వేములవాడ: వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజుతోపాటు వైస్‌చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు కర్ణాటకలోని ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు వెళ్లారు. భట్కళ్లోని ప్రసిద్ధ మురుడేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గోకర్ణ మహాబలేశ్వరం, కొల్లూరులోని శ్రీమూకాంబికాదేవీని దర్శించుకున్నారు. ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం వేములవాడఅర్బన్: మండలంలోని అగ్రహారం శ్రీరాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్‌ను శుక్రవారం ప్రారంభించారు. ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి, దాతలు కంటాల శివకుమార్, పెద్ది రాణి, అధ్యాపకులు శంకరయ్య, కుమారస్వామి, సుధాకర్, శ్యామ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి సిరిసిల్లటౌన్: యూపీఎస్సీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల సాధనకు శుక్రవారం ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. సిరిసిల్లలోని గీతానగర్ బాలికల హైస్కూల్లో ప్రీప్రైమరీ ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కొనసాగుతున్న నేపథ్యంలో భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. -
సమస్యలు తీరేనా!
● రెండేళ్ల తర్వాత మండల సభలు ● అభివృద్ధి పనులు.. సమస్యలపై సమీక్ష ● 19 శాఖల అంశాలపై చర్చబోయినపల్లి(చొప్పదండి): పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపయోగపడే మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు రెండేళ్ల తర్వాత ఇటీవల జరిగాయి. 2025 డిసెంబర్లో ఎన్నికై న సర్పంచులకు ఏడు నెలల తర్వాత తమ గ్రామాల్లోని సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం లభించింది. గత జూలైలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సభలు నిర్వహించారు. సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను అధికారులు నోట్ చేసుకున్నారు. ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశలో సర్పంచులు ఉన్నారు. 19 అంశాలపై చర్చ మండల సమావేశాల్లో వ్యవసాయం, ఉద్యానశాఖ, విద్య, వైద్యం, డీఆర్డీవో, గ్రామీణ మంచినీటి పథకం, శిశుసంక్షేమం, పీఆర్ ఇంజినీర్, విద్యుత్, ఐకేపీ, పౌరసరఫరాలు, వీబీ–జీ రామ్‌జీ పథకం, పశుపోషణ, వైద్య ఆరోగ్యం, ఐసీడీఎస్, హౌసింగ్, నీటిపారుదల, ఎకై ్సజ్, అటవీ, ఆర్అండ్బీ శాఖలకు చెందిన 19 అంశాలపై చర్చించారు. మూడు నెలల ప్రగతి నివేదికలను అధికారులు చదివి వినిపించారు. సమావేశాలకు అటవీ, మైనింగ్, విద్యుత్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ తదితర డివిజన్ శాఖల అధికారులు హాజరుకాలేదు. సమస్యలు తీరేనా ? కొత్తగా ఎన్నికై న సర్పంచులు ఏడు నెలల తర్వాత అధికారికంగా మండల స్థాయి సమావేశాలకు హాజరయ్యారు. గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రోడ్ల మరమ్మతులు, తాగునీటి సమస్య, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, మొరం కావాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలు గ్రామాల్లో కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉందని తెలిపారు. సర్పంచులు లేవనెత్తిన అంశాలను అధికారులు మినిట్స్‌లో పొందుపరచారు. -
తిరుపతి–కరీంనగర్ రైలు వేళల్లో మార్పు
రామగుండం: తిరుపతి – కరీంనగర్ మధ్య నడిచే బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు(12761) వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రతీ బుధ, శనివారాల్లో తిరుపతి నుంచి రాత్రి 8.05 గంటలకు బయలుదేరాల్సిన రైలు ఇకనుంచి 7.50గంటలకేల బయలుదేరనుందని, అక్టోబర్ 10వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుందని వివరించారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. తీర్థ యాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీవిద్యానగర్(కరీంనగర్): బోనాల పండుగా సందర్భంగా హైదరాబాద్‌లోని ఆలయాల దర్శనం కోసం ఈనెల 9 ఆదివారం ప్రత్యేక టూర్ ప్యాకేజీ లగ్జరీ బస్సు సర్వీస్ ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ కరీంనగర్–1 డిపో మేనేజర్ ఐ. విజయమాధురి తెలిపారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి ఈ బస్సు సర్వీసు బయలుదేరి నిమిషాంబిక టెంపుల్, అష్టలక్ష్మి టెంపుల్, పెద్దమ్మ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, జగన్నాథ టెంపుల్, చిలుకూరు బాలజీ టెంపుల్ సందర్శన అనంతరం అదే రోజు రాత్రి కరీంనగర్ చేరుతుందని ఆమె పేర్కొన్నారు. పెద్దలకు రూ.1300, పిల్లలకు రూ.975 టికెట్ ఉంటుందని వివరించారు. వివరాలకు 73828 49352, 9959225920 ఫోన్ నెంబర్లలో సందప్రదిచాలని సూచించారు. మహిళపై సామూహిక లైంగిక దాడి జగిత్యాలక్రైం/మల్యాల: మహిళ తన సన్నిహితుడితో ఉన్న సమయంలో వీడియో తీసి, బెదిరించి ఇద్దరు సామూహిక లైంగికదాడికి పాల్పడగా, వీరికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మండలకేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఎస్సై సందీప్‌తో కలిసి సీఐ రాజ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఈనెల 3న ఓ మహిళ నూకపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో తనకు పరిచయం ఉన్న వారి ఇంటికి తన సన్నిహితుడితో వెళ్లింది. సన్నిహితుడితో ఉన్న సమయంలో రాజారం గ్రామానికి చెందిన శివరాత్రి నరేశ్, గుర్రం శ్రీకాంత్ వీడియో తీసి సామూహిక లైంగిక దాడి చేశారు. వీరికి దరూర్‌కు చెందిన మారవేని మల్లేశ్, రాజారం గ్రామానికి చెందిన గుర్రం అంజయ్య సహకరించారు. వీడియో మరికొందరికి పంపారు. దీంతో బాధితురాలు ఈ నెల 6న మల్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వారి నుంచి ఇన్నోవా వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితులు నరేశ్‌పై 13 కేసులు, గుర్రం శ్రీకాంత్‌పై 9, మారవేని మల్లేశ్‌పై 2, గుర్రం అంజయ్యపై 1 కేసులు నమోదు కాగా, రౌడీషీట్ కూడా నమోదయినట్లు సీఐ తెలిపారు. అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్యబోయినపల్లి(చొప్పదండి): ఆర్థిక ఇబ్బందులతో బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన బొటుకు మహేశ్(34) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఎన్.రమాకాంత్ తెలిపిన వివరాలు. మహేశ్ కూలీ పనులు చేస్తూ జీవనోపాధి పొందేవాడు. మహేశ్ తండ్రి నందయ్య గతంలో మృతిచెందాడు. కొద్ది నెలులుగా అప్పులు ఎక్కువ అయ్యాయి. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు భరించలేక తన ఇంట్లోనే దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేశ్‌కు భార్య నవ్య, ఇద్దరు కుమారులు లోకేశ్(6), అశ్విత్(4) ఉన్నారు. మృతుడి తల్లి బొటుకు లక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డ్రైనేజీ సమస్యకు పరిష్కారం వేములవాడరూరల్: వేములవాడలో జగిత్యాలకు వెళ్లే ప్రధాన రోడ్డు మూడో వార్డులో డ్రైనేజీ సమస్యకు మున్సిపల్ సిబ్బంది పరి ష్కారం చూపారు. ఇటీవల ఈ ప్రాంతంలోకి వచ్చిన ప్రభుత్వ హాస్టల్ నుంచి వచ్చే వ్యర్థం నీటితో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై స్థానిక మహిళలు గురువారం నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు శుక్ర వారం గుంతను తవ్వి మరో మార్గం ద్వారా మురికినీరు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రేషన్ బియ్యం పట్టివేత పెద్దపల్లి: ఎల్లమ్మ చెరువు ప్రాంతంలో ఈనెల 6న 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్థానికులు పట్టుకున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఫిర్యాదు చేశారు. -
గంజాయిని నిర్మూలించాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: గంజాయి రహిత జిల్లాగా మార్చాలని, వ్యసనాన్ని నిర్మూలించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లాలోని గంజాయి బాధితులకు చికిత్స అందించే డీ–అడిక్షన్ సెంటర్లో బాధితులకు ఆటవస్తువులు, క్యారం, చెస్‌బోర్డులను జిల్లా ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి ఆర్ఎంవో సుమన్మోహన్రా వుకు శుక్రవారం అందించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను నిర్మూలించడంతోపాటు వ్యసన బాధితులను సాధారణ జీవితంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీ–అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసేవలు, సౌకర్యాలు కల్పించాలన్నారు. మత్తు నుంచి బయటపడాలనుకునే వారికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన కౌన్సెలింగ్ చేసి, సాధారణ జీవితం గడిపేలా చర్యలు చేపడుతున్నామని తెలి పారు. ఆర్ఐ అడ్మిన్ సురేష్, వైద్యులు పాల్గొన్నారు. రాజ్యాంగ హక్కులు వినియోగించుకోవాలిసిరిసిల్లటౌన్: రాజ్యాంగం కల్పించిన హక్కులను గిరిజనులు, ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ పి.లక్ష్మణాచారి కోరారు. పెద్దూరులో శుక్రవారం నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, లీగలైడ్ అసిస్టెంట్ కౌన్సిల్ జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ కిషన్‌యాదవ్, స్థానిక నాయకులు దొంతినేని అశోక్‌రావు, లింగంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. -
˘˘çßæÇ{ç³Ýë§Šæ O¯ðlç³#׿Ņ çÜ*¹Ç¢§éĶæ$MýS…
సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ చేనేత నైపుణ్యం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కొనియాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హరిప్రసాద్ కార్ఖానాను శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. హరిప్రసాద్–రేఖ దంపతులను శాలువాతో సన్మానించారు. మగ్గంపై నేసిన పీతాంబరం, అగ్గిపెట్టెలో పట్టే చీరలను చూసి.. తయారీ ప్రక్రియను తెలుసుకున్నారు. చీర తయారీకి పట్టే సమయం, ముడిసరుకు, పెట్టుబడి వంటి అంశాల గురించి అడిగారు. హరిప్రసాద్ ఇప్పటికే సిరిసిల్ల వస్త్రపరిశ్రమ ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకెళ్లారని, మరిన్ని నూతన ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు. చేనేత, జౌళిశాఖ ఏడీ ఎస్.సంతోష్‌కుమార్, తహసీల్దార్ మహేశ్‌కుమార్ ఉన్నారు. -
మండల స్థాయిలో ప్రజావాణి
● పకడ్బందీగా నిర్వహించాలి ● 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: మండల స్థాయిలో ప్రభుత్వ పనిదినాల్లో ప్రజావాణి పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి శుక్రవారం సమీక్షించారు. ప్రజావాణికి ఎంపీడీవోలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. జిల్లాలోని జలాశయాల, చెరువులు, కుంటలు, వాగులను పర్యవేక్షించాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. చేయూత పెన్షన్లను అర్హులకు అందించాలన్నారు. ప్రతీ పనికి గడువు విధించాలి వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను గడువు విధించి.. నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో వీటీఏడీఏ అధికారులతో సమీక్షించారు. కార్మికుల సంఖ్యను పెంచి, పనులు వేగంగా పూర్తి చేయించాలన్నారు. గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ, టాయిలెట్ల నిర్మాణం, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ, ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలన్నారు. సిరిసిల్లలో కోర్టు భవనాల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 15న సీఎం చేతుల మీదుగా స్మార్ట్ రేషన్‌కార్డులు ఈనెల 15న సీఎం చేతుల మీదుగా స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ చేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్వో గొట్టె జయశ్రీ, ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, ఆర్అండ్బీ ఈఈ భీమ్లానాయక్, ఆలయ ఈఈ రాజేశ్, ఎన్పీడీసీఎల్ ఈఈ వేణుమాధవ్, కమిషనర్ లోకేశ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి పాల్గొన్నారు. -
ఉప్పొంగిన వాగులు
సిరిసిల్ల: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున వర్షం జల్లులు కురిశాయి. మానేరు, మూలవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోటు వర్షపాతాన్ని అధిగమిస్తోంది. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు మత్తడి దూకేందుకు మరో మూడు అడుగుల దూరంలో ఉంది. కామారెడ్డి జిల్లాలో పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఎగువ మానేరులోకి వరద నీరు ఎక్కువగా రావడం లేదు. బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మధ్యమానేరు జలాశయం గేట్లు ఎత్తి కరీంనగర్ ఎల్ఎండీకి నీటి విడుదల చేశారు. మిడ్‌మానేరు నీటి నిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 19 టీఎంసీలకు చేరింది. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం నిండడంతో వరదనీరు మత్తడి గుండా పారుతోంది. వెంకట్రావుపేట–బావుసాయిపేట మధ్య మట్టిరోడ్డు వరద తాకిడికి కొట్టుకుపోయింది. మూలవాగులో వచ్చే నీరు వేములవాడ మీదుగా మధ్యమానేరులోకి వెళ్తోంది. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, తంగళ్లపల్లి, గంభీరావుపేట మండలాల్లోని గ్రామాల్లో పడువాటు నీరు మానేరువాగులో కలుస్తోంది. నిండుతున్న చెరువులు జిల్లా వ్యాప్తంగా 656 చెరువులు ఉండగా.. ఇప్పటికే 27 చెరువులు మత్తడి దూకుతున్నాయి. మరో 56 చెరువులు వంద శాతం నిండాయి. 50 నుంచి 75 శాతం మేరకు 81 చెరువులు నిండగా.. 25 నుంచి 50 శాతం మేరకు 191 చెరువుల్లో నీరు చేరింది. 25 శాతం మేరకు 301 చెరువుల్లో నీరు చేరడం విశేషం. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రెండు చెరువులకు గండ్లు పడ్డాయి. చిన్ననీటి వనరుల పరిధిలో 44వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఐదు మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షం ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే అధికంగా కురిసింది. వేములవాడ, వీర్నపల్లి, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో మెరుగైన వర్షాలు పడ్డాయి. మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఎగువ మానేరు, మధ్యమానేరు నిండి ఆయకట్టుకు నీరు విడుదల చేస్తే.. యాసంగి సీజన్ పంటలకు సాగునీరు లభిస్తుందనే ఆశలు రైతుల్లో ఉన్నాయి. వేములవాడ/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి మూలవాగు పొంగి ప్రవహిస్తోంది. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల చిట్టివాగు ప్రాజెక్ట్ మత్తడి దూకింది. పరిసర ప్రాంత ప్రజలు చేపల వేటకు వెళ్లవద్దని జిల్లా ఫిషరీస్ డైరెక్టర్ నిమ్మల బాబు కోరారు. మత్తడి దూకుతున్న చిట్టివాగు ప్రాజెక్ట్ వేములవాడలో నిండుగా ప్రవహిస్తున్న మూలవాగు -
రైలు రాకపాయె!
పదేళ్లు ఐపాయె..గోపాల్రావుపల్లి.. అనుపురం మధ్య ప్రారంభమైన రైల్వే వంతెన పనులుసాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు హైదరాబాద్‌కు రైల్వే ద్వారా రాకపోకలు సాగించేందుకు కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు పనులు ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయ్యాయి. 2016 ఆగస్టు 7న అప్పటి సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించారు. హైదరాబాద్– మనోహరాబాద్– సిద్దిపేట– సిరిసిల్ల– వేములవాడల మీదుగా కరీంనగర్ చేరుకునేలా రూటు డిజైన్ చేశారు. భూసేకరణ, పరిహారం, బడ్జెట్ కేటాయింపుల్లో సమస్యలతో ప్రాజెక్టు రోజురోజుకు జాప్యమవుతోంది. రాజధాని హైదరాబాద్– పాత కరీంనగర్ జిల్లాకు కనెక్టివిటీ పెంచాలన్న ఉద్దేశంతో అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు పెద్దపీట వేశారు. తొలి ఐదేళ్లు వచ్చే నష్టాలను భరించేందుకు కేంద్రాన్ని ఒప్పించి మరీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 17 స్టేషన్లతో 151 కిలోమీటర్ల దూరం మేర విస్తరించిన ఈ ప్రాజెక్టుకు ఆరంభ వ్యయం రూ.1,167 కోట్లు కావడం గమనార్హం.కొత్తపల్లిలో 3 గుంటలు సేకరణకొత్తపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఇటీవల ఓ ఆశ్చర్యమైన ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ సమీపంలో నిర్మించిన సీసీ రోడ్డు కోసం రైల్వేకు అప్పగించేందుకు కరీంనగర్ రెవెన్యూ అధికారులు భూసేకరణ జరిపి భూమి అప్పగించారు. ఇటీవల తాము అప్పగించిన భూమి కన్నా మూడు గుంటల భూమి అధికంగా రైల్వే కోసం వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారికి పరిహారం ఇవ్వాలని పాత ఆర్డీవో మహేశ్వర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆ మూడు గుంటల భూమి కోసం నిబంధనల ప్రకారం.. ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే మొత్తం 3 గుంటల భూమికి మార్కెట్ రేటు ప్రకారం.. పరిహారం చెల్లించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.పెరగనున్న కనెక్టివిటీఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లావాసులకు రాజధానితో కనెక్టివిటీ పెరగడంతోపాటు వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు రాజధాని నుంచి భక్తులు పెరుగుతారు. కొత్తపల్లి– మనోహరాబాద్ హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. భవిష్యత్తులో ఉత్తరతెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్లకు కీలకమైన రూట్‌గా మరింత ప్రాధాన్యం దక్కించుకోనుంది. సిరిసిల్ల, సిద్ధిపేట, జగిత్యాల జిల్లాలకు పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను ఇటు హైదరాబాద్ అటు, మహరాష్ట్ర వైపు తరలింపు సులభతరంగా మారుతుంది. కొండగట్టు పరిసరాల్లోని రేర్ ఎర్త్ మెటల్స్ గనుల తవ్వకం మొదలై, ఎగుమతులనాటికి రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య మానేరువాగుపై నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పనుల జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం మానేరు నీటిలో నిల్చున్నారు. వారు మాట్లాడుతూ ఏటా వర్షాకాలంలో మానేరు ఉధృతికి మట్టిరోడ్డు కొట్టుకుపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు కోడె రమేశ్, నాయకులు పత్తి స్వామి, బోయన్నగారి శ్రీనివాస్, దేవయ్య, దేవేందర్‌యాదవ్, సర్వోత్తం, సత్యనారాయణ పాల్గొన్నారు. ఎల్ఎండీకి నీటి విడుదల బోయినపల్లి/ఇల్లంతకుంట: మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి శుక్రవారం 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి నుంచి వరదకాలువ ద్వారా 12,600, మానేరు, మూలవాగుల నుంచి 916 క్యూసెక్కుల మేర వరద ఇన్‌ఫ్లోగా వస్తోంది. మిడ్‌మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం 19.178 టీఎంసీలకు చేరింది. రైతుల హర్షం మిడ్‌మానేరు గేట్లు ఎత్తడంతో మానేరువాగు పరివాహక గ్రామాలైన పొత్తూరు, కందికట్కూర్, నర్సక్కపేట, జవారిపేట రైతులు హర్షం వ్యక్తం చేశారు. బురదరోడ్డుపై నాట్లు వేసి నిరసన ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండల కేంద్రంలో బురదమయమైన రహదారిపై బీజేపీ నాయకులు నాట్లు వేసి శుక్రవారం నిరసన తెలిపారు. ముస్తాబాద్, దుబ్బాక మార్గంలో కిలోమీటరు దూరం పూర్తిగా గుంతలమయమైందన్నారు. ఈ బురదరోడ్డుపై ప్రయాణించాలంటే ప్రజలు జంకుతున్నారన్నారు. నిరసనలో బీజేపీ మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతికుమార్, నాయకులు మెరుగు అంజాగౌడ్, మీస సంజీవ్, గోపికృష్ణ, మహేశ్వరీ, మహేందర్, తిరుపతి, మహేశ్, ప్రశాంత్, కార్తీక్‌రెడ్డి, వెంకన్న, దీటి సత్యం, అనిల్, వేణు, హరీశ్, నవీన్, వినయ్, ఆకాశ్, సాయి, నర్సింలు తదితరులున్నారు. టీజీవో జిల్లా అధ్యక్షుడిగా జబీసిరిసిల్ల అర్బన్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ జబీ, కార్యదర్శిగా బి.సాగర్‌ను శుక్రవారం ఎన్నుకున్నారు. బదిలీపై వెళ్లిన జిల్లా మాజీ అధ్యక్షుడు సమర్సేన్ను సంఘం సభ్యులు సన్మానించారు. రసూల్, చంద్రకళ, అనిల్, సాయికిరణ్, రమాదేవి, నాగరాజు, మారుతిరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నేడు మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారంలోని 120 ఎంఎల్డీ నీటిశుద్ధి కేంద్రంలో సాధారణ నిర్వహణ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రీడ్ ఈఈ ముజాహిద్ అన్వర్ తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు, మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందన్నరు. సంబంధిత గ్రామాల ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. -
నేతబజార్ ఏర్పాటు చేస్తాం
సిరిసిల్ల: సిరిసిల్లలో ఉత్పత్తి చేసిన వస్త్రాలను ఒకే చోట అమ్ముకునేందుకు వీలుగా నేత బజారును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇందుకు వస్త్రోత్పత్తి రంగంలోని అన్ని వర్గాలతో ఈ నెలాఖరులోగా వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమాల్లో కలెక్టర్ గరీమా అగ్రవాల్‌తో కలిసి పాల్గొన్నారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల బ్రాండ్ వస్త్రాలను ఉత్పత్తి చేయాలని, కాలానికి అనుగుణంగా వస్త్రోత్పత్తి రంగంలో మార్పులు చేయాలని సూచించారు. పట్టణంలోని పద్మశాలీ సంఘ భవనాన్ని పూర్తి చేస్తామని, కామన్ ఫెసిలిటీ సెంటర్(సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేస్తామన్నారు. నేతన్నలకు చేతినిండా పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు అందించామని, గతేడాది 6.60 కోట్ల మీటర్లు ఉత్పత్తి చేయగా.. ఈ ఏడాది కూడా అంతే మొత్తంలో రెండు విడతల్లో ఆర్డర్లు ఇచ్చామన్నారు. స్కూల్ యూనిపామ్స్, సంక్షేమ శాఖ అర్డర్లు ఇస్తున్నట్లు వివరించారు. అంత్యోదయ కార్డులతో వైఎస్సార్ ఆకలి తీర్చారు నేతన్నలు ఆత్మగౌరవంతో జీవించాలని దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2008లో ఒకేసారి 13వేలు అంత్యోదయకార్డులను అందించారని, మె డికల్ శిబిరం నిర్వహించి నేతన్నలకు భరోసా కల్పించారని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తితో సిరిసిల్ల చీరలకు గు ర్తింపు లభించిందన్నారు. 25 హెచ్‌పీల వరకు 50 శాతం విద్యుత్ రాయితీనిస్తూ.. రూ.350 కోట్ల బకా యిలను విడుదల చేశామన్నారు. నూలు డిపో ద్వా రా రూ.67 కోట్ల నూలును అరువుపై అందించామ ని, కార్మికుల సంక్షేమం కోసం త్రిఫ్ట్, రూ.5లక్షల బీ మా పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. నేతకార్మికులతో ర్యాలీ కోర్టు నుంచి పాత బస్టాండ్ వద్ద గల నేతన్న విగ్రహం వరకు ర్యాలీ తీశారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, చేనేత, వస్త్రపరిశ్రమ కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. నేతన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో నేత కార్మికులను సన్మానించారు. వస్త్రోత్పత్తిదారులు మగ్గాలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ.200కోట్లు మంజూరు చేయాలని, డయింగ్ యూనిట్లకు స్థలాలు కేటాయించాలని, జౌళిశాఖలో పనిచేసే సీఎఫ్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఆర్డీవో శ్రీధర్‌బాబు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ సంతోష్, తహసీల్దార్ మహేశ్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు అడెపు భాస్కర్, చేనేత వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, కౌన్సిలర్లు ఆడెపు చంద్రకళ, బొద్దుల శ్రీనివా స్, వస్త్రోత్పత్తిదారులు గోవిందు రవి, బూట్ల నవీ న్, యెల్దండి దేవరాజు, నేత కార్మికులు పాల్గొన్నారు. -
మద్యం తాగొద్దన్నారని..
● గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య తంగళ్లపల్లి(సిరిసిల్ల): మద్యం తాగొద్దని కుటుంబసభ్యులు చెప్పడంతో మనస్థాపం చెందిన వ్యక్తి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తంగళ్లపల్లి మండలంలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన అట్టె మల్లేశం(55) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మల్లేశం గత నెల 30వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగాడు. ఈవిషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి పెద్ద కుమారుడు అట్టె చంద్రశేఖర్ ఫిర్యాదుతో ఎస్సై ఉపేంద్రచారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని శ్రీగాథ శివారులో గురువారం నిర్వహించిన పోలీస్ తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలానికి చెందిన తోట నర్సింలు అనుమతులు లేకుండా ట్రాక్టర్లో ఇసుకను తరలిస్తున్నట్లు తెలిపారు. అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కొలనూర్ శివారులోని రెండు రైస్‌మిల్లుల యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కొలనూర్‌కు చెందిన లక్ష్మీగణపతి, అన్నాఫి రైస్‌మిల్లులు ధాన్యం తీసుకుని ప్రభుత్వానికి సీఎమ్మార్ ఇవ్వడం లేదని పౌరసరఫరాల డీఎం గోపాల్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు మల్లేశం, అన్వర్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. సిరిసిల్లటౌన్: ప్రతిష్టాత్మకమైన సిరిసిల్ల చేనేత వస్త్రవ్యాపార సంఘానికి ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ ఆఫీసర్ మామిడాల భూపతి విడుదల చేశారు. నామినేషన్లను శనివారం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు స్వీకరించి అదే రోజు సాయంత్రం 5 గంటల్లోపు పరిశీలిస్తామన్నారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గుర్తులు కేటాయిస్తామని తెలి పారు. ఈనెల 12న ఏజెంట్ల నియామకం చే పట్టి, 13న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తున్నట్లు వివరించారు. వేములవాడరూరల్: వేములవాడ నుంచి జగిత్యాలకు వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన ఉన్న హాస్టల్ నుంచి వస్తున్న మురికినీటి దుర్గంధంతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని ఆ ప్రాంత మహిళలు గురువారం రోడ్డెక్కారు. పట్టణంలోని మూడో వార్డులో ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవల నూతనంగా ఓ భవనంలోకి ప్రభుత్వ హాస్టల్ వచ్చింది. భవనం నుంచి మురికినీటిని రోడ్డు పక్కన ప్రత్యేక కాలువ ద్వారా వదిలిపెట్టడంతో దుర్వాసన వస్తోందని మహిళలు పేర్కొన్నారు. మహిళల నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. వెంకట్రావుపల్లిలో మరో చోరీముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని వెంకట్రావుపల్లిలోని ఓ ఇంట్లో చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితులు గురువారం ఇంటికి చేరుకోగా చోరీ విషయం బయటపడింది. వరుస చోరీలతో వెంకట్రావుపల్లి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి రెండిళ్లలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అలాగే తాళం వేసి ఉన్న మరొకరు రాజు ఇంట్లో కూడా దొంగలుపడ్డారు. ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. వారింట్లోకి చొరబడిన దొంగలు రూ.5వేల నగదు, 10 తులాల వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో ఎస్సై జ్యోతి గ్రామంలో విచారణ చేపట్టారు. కంచర్లకు రాత్రి బస్సు వేయండి వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని కంచర్లకు రాత్రివేళల్లో బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ సామర్ల దేవరాజు కోరారు. గురువారం సిరిసిల్ల డిపో మేనేజర్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు. -
నీరజ్ చోప్రాయే రోల్ మోడల్
ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా మెడల్ గెలిచిన వీడియోను యూట్యూబ్‌లో చాలా సార్లు చూశాను. ఆయన స్ఫూర్తితోనే నేను ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకున్నాను. సౌత్జోన్లో 6వ స్థానం, రాష్ట్ర పోటిల్లో బంగారు పతకాలను సాధించాను. భవిష్యత్‌లో జాతీయ పోటిల్లో పతకం సాధించడమే లక్ష్యం. – కె స్వామి నేను రెండేళ్లుగా జావెలిన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రస్తుతం లోకల్ గ్రౌండ్‌లోనే సీనియర్ల సలహాలతో నేర్చుకుంటున్నాను. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకం సాధించాను. త్వరలోనే జాతీయస్థాయి పోటీల్లో జిల్లా పేరు నిలబెడతా. ఇప్పటి వరకు మూడు రజత పతకాలను సాధించాను. – సురేష్‌నాయక్ సాధారణంగా అమ్మాయిలు జావెలిన్ వైపు రారు అనుకుంటారు. కానీ ఈ ఆటలో పవర్ మాత్రమే కాదు, ఫ్లెక్సిబిలిటీ కూడా ముఖ్యం. నీరజ్ చోప్రా విజయాలు నాలాంటి ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చాయి. అంతర్జాతీయ స్థాయిలో రాణించగల నమ్మకం నాకుంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో ఒక రజతం, ఒక కాంస్యం సాధించాను. – వి సహస్ర -
బకాయిలు లేకుండా చూడాలి
ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి ఎంతో మేలు కలిగింది. కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తోంది. అయితే బిల్లుల చెల్లింపులు వెంటనే అందిస్తే మరీ మంచిది. ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పరిశ్రమ సవ్యంగా నడుస్తోంది. పీసీ ఆర్డర్లు టెండర్ల ద్వారా కాకుండా నేతన్నల ద్వారా కొనుగోలు చేయాలి. – ఆడెపు భాస్కర్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిసిల్లలోని డయింగ్ పరిశ్రమ పురాతనమైంది. దీన్ని ఆధునీకరిస్తూ ఒకే ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలి. నీటివసతి కల్పించి రంగులు, రసాయనాల నీటిని శుద్ధి చేసే ప్లాంటు ఏర్పాటు చేయాలి. అద్దకం పరిశ్రమ తిరోగమనంలో ఉంది. ఆధునిక క్లాత్ ప్రాసెసింగ్ యూనిట్లకు చేయూతనివ్వాలి. – తాటిపాముల దామోదర్, వస్త్రోత్పత్తిదారుడు ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లతో సిరిసిల్ల పరిశ్రమ సంక్షోభం లేకుండా నడుస్తోంది. కొనుగోలు చేసిన వస్త్రానికి సంబంధించిన చెల్లింపులు జాప్యం చేయొద్దు. కార్మికులకు వెంటనే పేమెంట్స్ ఇవ్వాలి. నిర్ణీత గడువులోగా చెల్లింపులు ఇస్తే ప్రణాళిక ప్రకారం వస్త్రోత్పత్తి సాగుతోంది. – దూడం శంకర్, సిరిసిల్ల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు, వస్త్రోత్పత్తిదారుడు నేతకార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక ఆర్డర్లు ఇస్తున్నా శ్రమించే కార్మికులకు బట్టకు, పొట్టకే సరిపోతుంది. వర్కర్లను ఓనర్లను చేసే పథకాన్ని అమలు చేస్తే నేతకార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలకు వ్యవసాయానికి ఇచ్చినట్లుగా ఉచిత విద్యుత్ ఇవ్వాలి. విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలి. కార్మికుడికి నేరుగా ప్రయోజనం దక్కేలా పథకాలు అమలు చేయాలి. – మూషం రమేశ్, కార్మిక నాయకుడు -
చేనేత.. ఎదురీత !
సిరిసిల్ల: ప్రపంచానికి నాగరికత నేర్పిన చేనేతరంగం కాలానికి ఎదురీదుతోంది. వస్త్రోత్పత్తిలో వస్తున్న టెక్నాలజీతో చేనేతమగ్గాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మరమగ్గాల రాకతో వస్త్ర ఉత్పత్తిలో వేగం.. నాణ్యత.. నవ్యత రావడంతో చేనేత మగ్గాల నుంచి మరమగ్గాల వైపు నేతన్నలు మారుతున్నారు. ప్రస్తుతం చేనేతరంగంలో వయోవృద్ధులు మాత్రమే కొనసాగుతున్నారు. పవర్లూమ్(మరమగ్గాల) రంగం ఆటుపోట్ల మధ్య తలెత్తుకొని జీవించేందుకు ఆరాటపడుతోంది. చేనేతమగ్గాలపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన ఘనత సిరిసిల్ల నేతకార్మికులది. అయితే చేనేతలో అరకొర కూలితో చివరితరం నెట్టుకొస్తోంది. ఆర్థిక సంక్షోభంలోనూ శ్రమిస్తున్న నేతన్నలపై జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. అరకొర కూలి.. కడుపులు ఖాళీ ● ఆటుపోట్ల మధ్య వస్త్రపరిశ్రమ ● పవర్‌లూమ్స్ రాకతో మూలకుపడుతున్న మగ్గాలు ● నేడు జాతీయ చేనేత దినోత్సవం ● వందేళ్లు దాటిన ఘన చరిత్ర 1905లో స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ చేనేతరంగంలో విప్లవం మొదలైంది. కలకత్తా టౌన్హాల్లో అదే సంవత్సరం ఆగస్టు 7న నిర్వహించిన సమావేశంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేతరంగానికి గుర్తింపునిస్తూ 2012 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ నేతకార్మికులకు అవార్డులు అందిస్తున్నారు. ● సిరిసిల్లలోనే తొలి నేతన్న విగ్రహం దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి చేనేత కార్మికుని కాంస్య విగ్రహాన్ని సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. మగ్గం, అడ్డం పోగుల ధారంతో బట్టను నేసే జోట(నాడె), వస్త్రపరిశ్రమలోని అనుబంధ రంగాల చిత్రాలను ఆవిష్కరిస్తూ సిరిసిల్లలోని కలెక్టరేట్ కూడలిని తీర్చిదిద్దారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 78 వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 28 వేల వరకు ఉన్నాయి. వీటిపై పాలిస్టర్ వస్త్రం, 4 వేల మగ్గాలపై కాటన్ వస్త్రోత్పత్తి సాగుతోంది. నిత్యం 25 లక్షల మీటర్ల వస్త్రం తయారవుతుంది. 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సిరిసిల్లలో ఉన్న 175 చేనేత మగ్గాలపై 58 మంది వృద్ధులు పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. జాతీయ జెండాలను గతేడాది 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడి నుంచే దేశ వ్యాప్తంగా సరఫరా కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్ష అభియాన్, ఎస్సీ, బీస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖలకు అవసరమైన యూనిఫామ్ వస్త్రం ఆర్డర్లను ఇక్కడి నేతన్నలకు ఇస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పక్కనపెట్టి ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లు ఇచ్చింది. అపెరల్ పార్క్‌లో టెక్స్‌పోర్ట్, గోకుల్దాస్ గార్మెంట్ యూనిట్లలో రెండు వేలకు పైగా మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఇక్కడి నుంచి అమెరికాకు రెడీమేడ్ వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. ● బీమా ఓ వరం నేతన్నలకు రైతుల తరహాలో రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించారు. 2021 జూలై 4న సిరిసిల్ల వేదికగా ఈ పథకాన్ని ప్రకటించారు. 18–59 ఏళ్ల మధ్య వయసు గల నేతకార్మికులకు అమలు చేస్తున్నారు. బీమా వయసును 70 ఏళ్ల వరకు పొడిగించాలని నేతన్నలు కోరుతున్నారు. బీమాలో చేరిన నేతన్నలు ఏ కారణంగా మరణించినా బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ఎల్ఐసీ ద్వారా అందుతుంది. కార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీ, త్రిఫ్ట్ పొదుపు పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయి. ● ఇవి చేస్తే మేలు వస్త్రానికి మార్కెట్ వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. వస్త్రోత్పత్తి వ్యవస్థ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడంతో కార్మికులు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వపరంగా ఆజమాయిషి ఉండేలా తీర్చిదిద్దాలి. నేతకార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఆధునిక మగ్గాలపై శిక్షణ ఇవ్వాలి. పేదరికమే అర్హతగా అంత్యోదయ కార్డులు, ఆర్థిక చేకూర్పు, మహిళా సంక్షేమ పథకాల అమలు చేయాలి. నేతకార్మికులకు పీఎఫ్ సౌకర్యం, త్రిఫ్ట్ పథకంలో అందరినీ చేర్పించాలి. గుర్తింపుకార్డులు ఇచ్చి ఆరోగ్య సంరక్షణ పథకాలు అమలు చేయాలి. ● నేడు ప్రత్యేక కార్యక్రమాలుసిరిసిల్లలో జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నామని చేనేత, జౌళిశాఖ సహాయ సంచాకులు శ్రీరాం సంతోష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం 9:30 గంటలకు పాతబస్టాండ్ వద్ద ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాల వేసి, నేతకార్మికులతో కలిసి చేనేత వాక్ నిర్వహిస్తామన్నారు. ఇందిరా నగర్‌లోని వ్యవసాయశాఖ గోదాములో 10.30 గంటలకు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కాల్వశ్రీరాంపూర్: నా ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు పోగు వదిలిపెట్టను. చేనేత వస్త్రాలు నేస్తూనే ఉంటా. ప్రభుత్వం చేనేత కార్మికులను, మా కుటుంబాలను ఆదుకోవాలి. మా పిల్లలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలి. – గోలి రమణయ్య, చేనేత కార్మికుడు, కాల్వశ్రీరాంపూర్ కాల్వశ్రీరాంపూర్: చేనేత కార్మికుల పిల్లలకు ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై పవర్లూమ్ యంత్రాలు అందించాలి. వస్త్రోత్పత్తిలో శిక్షణ ఇచ్చి, బట్టను మార్కెటింగ్ చేసుకునేందుకు సబ్సిడీపై మోపెడ్స్ అందజేయాలి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరిశ్రమకు ఆదరణ ఉండేది. మళ్లీ ఆ రోజులు రావాలి. – గోలి శ్రీకాంత్, కాల్వశ్రీరాంపూర్ -
ముర్రుపాలు అమృతతుల్యం
● మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళసిరిసిల్లటౌన్: పుట్టిన శిశువుకు ముర్రుపాలు అమృతంతో సమానమని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం పేర్కొన్నారు. స్థానిక 17వ వార్డులో గురువారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో మాట్లాడారు. ముర్రుపాలు శిశువు రోగనిరోధక శక్తిని పెంచుతాయన్నారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు, చిన్నపిల్లలకు అన్నప్రాసన చేశారు. కౌన్సిలర్ సభ్యులు గుండ్లపల్లి నీరజ, దార్నం అరుణ, బత్తుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 23వ వార్డులో కౌన్సిలర్ ఆడెపు చంద్రకళ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో జాతీయ అవార్డు గ్రహీత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ పాల్గొన్నారు. తరగతి గదిలో ఈవీఎంలపై నివేదికసిరిసిల్ల: సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతిగదిలో ఎనిమిదేళ్లుగా ఈవీఎంలు ఉంటున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరింది. ‘పాఠాలు వినేదెలా’ శీర్షికతో ‘సాక్షి’లో ఈనెల 3న ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. 2018 నాటి ఎన్నికల కేసు కోర్టులో విచారణలో ఉండగా.. ఈవీఎంలతో తరగతి గదులు విద్యాబోధనకు దూరంగా ఉంటున్నాయని కథనం రావడంతో జిల్లా ఇంటలిజెన్స్ అధికారులు వాస్తవాలను వివరిస్తూ నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. కళాశాలలో విద్యాబోధనకు ఆటంకంగా మారిన తీరుపై ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్ కనక విజయ రఘునందన్ జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందించారు. ఎనిమిదేళ్లుగా ఇంటర్ విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలపై ‘సాక్షి’ కథనంతో అధికారులు స్పందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపించారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ ● సిరిసిల్లలో అర్బన్ హెల్త్ సెంటర్ తనిఖీసిరిసిల్ల: అత్యవసర మందులను ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచి, మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి జి.ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. వైద్యసేవలు, రోగుల నమోదు, ఔషధాల నిల్వలు, ప్రయోగశాల సేవలు, గర్భిణీలకు అందిస్తున్న సేవలు, టీకాల కార్యక్రమం, పారిశుధ్యం నిర్వహణను పరిశీలించారు. రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. నిజమైన పేదలే ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తారని, నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ వేగంగా చేయాలన్నారు. డాక్టర్ గీతాంజలి ఉన్నారు. -
ప్రజల సొమ్మును వాగులో పోస్తున్నారు
● ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర నాయకుడు దశరథం సిరిసిల్లటౌన్: కోట్లాది రూపాయల ప్రజాధనంతో ఎలాంటి ప్రయోజనాలు కల్పించని రోడ్డు నిర్మిస్తున్నారని ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమిశెట్టి దశరథం పేర్కొన్నారు. ఈమేరకు గురువారం సిరిసిల్ల మానేరు కరకట్ట రోడ్డు నిర్మాణంపై మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా కోసమే మానేరునదిలో రోడ్డు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో మానేరు పరివాహక రైతుల పొలాలు కోతకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. -
భూ బాధితుడి ఆత్మహత్యాయత్నం
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో భూవిక్రయాల్లో జరుగుతున్న మోసానికి ఇదో నిదర్శనం. భూవిక్రయదారుడు గతంలో విక్రయించిన భూమిని రెండోసారి మరొకరికి విక్రయించిన మోసం ఆలస్యంగా వెలుగుచూసింది. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు గాజుల నవీన్ తెలిపిన వివరాలు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌కు చెందిన గాజుల నవీన్ టెంట్ నిర్వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితం పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి తన భార్య పేరున ఉన్న భూమిని నవీన్‌కు విక్రయించాడు. స్థానిక భవానినగర్‌లోని ఆరున్నర గుంటలకు రూ.34లక్షలకు బేరం కుదిరింది. ఇరువర్గాలు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లి పత్రాలను నవీన్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఏడాది క్రితం తాను కొన్న ఆరున్నర గుంటల భూమికి కంచె వేయడానికి నవీన్ వెళ్లగా హుజూరాబాద్‌కు చెందిన వ్యక్తి ఆ భూమిలో తనకు 2012లోనే స్థలం యజమాని మూడు గుంటలు రిజిస్ట్రేషన్ చేసిచ్చినట్లు పత్రాలు చూపించాడు. దీంతో తాను మోసపోయినట్లు గమనించిన నవీన్ స్థలం విక్రేత వద్దకు వెళ్లి తనకు రావాల్సిన మూడు గుంటల డబ్బులు తిరిగివ్వాలని కోరాడు. అతను ససేమిరా అంటున్నాడు. దీంతో రెండు నెలల క్రితం భూవిక్రేత ఇంటికి కుటుంబ సభ్యులతో సహా నిలదీయడానికి వెళ్లగా నవీన్‌పై దాడి చేశారని బాధితులు పేర్కొన్నారు. ఈవిషయమై పోలీస్టేషన్లో ఫిర్యాదుకు వెళ్లినట్లు తెలిపారు. కానీ స్థలం విక్రేత తరఫున అధికార పార్టీ నేతలు వచ్చి ఎస్సైతో కలిసి తనపైనే ఉల్టా కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.3లక్షలు తీసుకో.. ఏడాదిగా పెద్దమనుషులు పంచాయితీ చేస్తున్నారని తనకు రూ.16లక్షలు రావాల్సి ఉండగా.. రూ.3లక్షలు ఇస్తామంటున్నారని రోదించాడు. ఇలా తనపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. మానసికంగా క్షోభకు గురై బుధవారం రాత్రి ఐదు పారాసిటమాల్ మాత్రలు మింగినట్లు బాధితుడు తెలిపాడు. ప్రస్తుతం నవీన్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలి
● రాజన్న జోన్–3 డీఐజీ సన్ప్రీత్సింగ్సిరిసిల్ల: సమర్థవంతమైన పోలీసింగ్‌ను పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందించాలని రాజన్న జోన్–3 డీఐజీ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌ను గురువారం సందర్శించారు. డీపీవో ఆఫీస్ పరిసరాలను, స్పెషల్ బ్రాంచ్, ఐటీ కోర్, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(డీసీఆర్బీ) విభాగాలను పరిశీలించారు. జిల్లా పోలీస్ అధికారుల సమీక్షలో డీఐజీ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో టెక్నాలజీని వినియోగిస్తూ, శాంతిభద్రతలను పరిరక్షించాలన్నారు. నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణపై దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లాలో కన్విక్షన్ రేటు మెరుగ్గా ఉండటం అభినందనీయమన్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించేలా ప్రోత్సహించాలని కోరారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై నిఘా ఉంచాలన్నారు. అంతకుముందు ఎస్పీ మహేశ్ బీ గీతే పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లా భౌగోళిక స్వరూపం, శాంతిభద్రతల పరిరక్షణ తదితర కార్యక్రమాలను వివరించారు. ఎస్పీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన తాగునీటి వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. డీఎస్పీలు శ్రీనివాసులు, జి.వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్, మొగిలి, వీరప్రసాద్, శ్రీనివాస్, నాగేశ్వర్రావు, రవీందర్ పాల్గొన్నారు. పోక్సో కేసుల్లో శిక్షలు పడాలి వేములవాడఅర్బన్: పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని రాజన్న జోన్ డీఐజీ సన్‌ప్రీత్‌సింగ్ అధికారులను ఆదేశించారు. వేములవాడ పోలీస్ సబ్‌డివిజన్ కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. భీమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేములవాడ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, రవీందర్ ఉన్నారు. -
బడి తెరిస్తే పిల్లలను పంపిస్తాం
మా ఊర్లో ప్రాథమిక పాఠశాల మూతబడి మూడేళ్లు గడుస్తోంది. ఇరువై మంది వరకు పిల్లలను పంపిస్తామని మొన్నటి బడిబాటలో చెప్పాం. సార్లు కూడా వచ్చారు. కానీ తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించకపోవడంతో మళ్లీ ఆర్థికంగా భారమైన ప్రైవేటుకు పంపిస్తున్నాం. పాఠశాల తెరిస్తే పిల్లలను పంపిస్తాం. – సతీశ్, కొదాటివానిపల్లె బడులను కాపాడుకోవాలి గన్నెవారిపల్లెలో ఇంకో టీచర్ కావాలి. కొదాటివానిపల్లెలో ప్రభుత్వ బడిని ఓపెన్ చేసేందుకు సహకరిస్తాం. ఇక్కడ పనిచేసే టీచర్‌ను తిరిగి మా ఊరికి రప్పించాలి. గ్రామస్తుల అందరి సహకారంతో ఊరి నుంచి విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లకుండా బడులను కాపాడుకుందాం. – రేసు రఘు, సర్పంచ్, గన్నెవారిపల్లె డిప్యూటేషన్ల ఆర్డర్లు రాలేదు గతేడాది జరిగిన టీచర్ల సర్దుబాట్లే ఇప్పుడు కొనసాగుతున్నాయి. కొత్తగా డిప్యూటేషన్లు చేపట్టలేదు. విద్యార్థులున్న చోటికి తప్పకుండా టీచర్లను పంపిస్తాం. అవసరమైన చోట వలంటీర్లను నియమించి బోధనకు ఆటంకం లేకుండా చర్యలు చేపడతాం. – రవీందర్, ఎంఈవో, ముస్తాబాద్ -
బాల విధ్వాంసులు
వేములవాడ: వేదాలు హిందూ ధర్మానికి మూలస్తంభాలు. ఆ వేద విజ్ఞానాన్ని, సనాతన ధర్మ సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేద, శాస్త్ర, స్మార్త, ఆగమ విద్వత్సదస్సులో భాగంగా నిర్వహించిన ‘స్మార్త ప్రవీణ‘ పరీక్షలలో పలువురు చిన్నారులు ప్రతిభచాటారు. పిన్న వయస్సులోనే పెద్ద గళం విప్పి అత్యుత్తమ శ్రేణి (ఉత్తమ గ్రేడ్)లో ఉత్తీర్ణులయ్యారు. గోపన్నగారి శితికంఠశర్మ, గోపన్నగారి వివస్వచ్ఛర్మ, గోపన్నగారి వరరుచి శర్మ, ఉపాధ్యాయుల శ్రీహర్షశర్మలు విప్ ఆది శ్రీనివాస్, ఈవో రమాదేవి, వేదపాఠశాల ప్రిన్సిపాల్ ఆంజనేయశర్మ, వేద పరీక్షాధికారుల చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నారు. ఒకే ఇంటి నుంచి.. రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ మాజీ స్థానాచార్యులు, పండితులు గోపన్నగారి శంకరయ్య గారి మనవళ్లు ఈ చిన్నారులు కావడం విశేషం. ఒకే కుటుంబం నుంచి నలుగురు బాల విధ్వాంసులు రూపుదిద్దుకుని జాతీయస్థాయిలో వేద–స్మార్త విద్యలలో విశేష పాండిత్యాన్ని ప్రదర్శించడం పండిత లోకాన్ని ఎంతగానో అలరించింది. తాతగారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని, వేద సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న ఈ చిన్నారులు స్మార్త ప్రవీణ పరీక్షలలోని క్లిష్టమైన ప్రశ్నలకు అత్యంత సులువుగా సమాధానమిచ్చి ప్రశంసలు అందుకున్నారు. పిన్న వయస్సులోనే పెద్ద గళం ఒకే ఇంటినుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నలుగురు చిన్నారులు -
విసిరితే విజయమే..
కరీంనగర్‌స్పోర్ట్స్: ఈటె.. విసిరితే సుర్రున ఆకాశమంతా ఎత్తుకెళ్తున్నాయి. పోటీలో దిగితే విజయం ఖాయం చేసుకుంటున్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జావెలిన్త్రోపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ జోష్ రావడానికి ఐదేళ్ల క్రితం అంటే 2021 ఆగస్టు 7న టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌చోప్రా సాధించిన విజయమే. అథ్లెటిక్స్ చరిత్రలోనే భారత్‌కు మొదటి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించాడు. ఆ విజయంతో దేశంలోని యువతలో జావెలిన్త్రోపై ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఆ విజయానికి గుర్తుగా భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఏటా ఆగస్టు 7ను నేషనల్ జావెలిన్ డేగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో జావెలిన్ త్రో క్రీడకు వస్తున్న ఆదరణపై ప్రత్యేక కథనం. మట్టి ట్రాక్‌లపై.. ఒకప్పుడు జిల్లాలో అథ్లెటిక్స్ అంటే రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ వరకే పరిమితం. కానీ ఐదేళ్ల నాటి ఒలింపిక్స్ విజయం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోని ఏ మైదానంలోకి వెళ్లి ఒకరిద్దరు యువకులు ఈటెలు పట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నారు. సదుపాయాలు కల్పిస్తే.. జిల్లాలో ప్రతిభకు కొదవలేకపోయినా వసతుల కొరత క్రీడాకారులను వేధిస్తోంది. నాణ్యమైన జావెలిన్ స్టిక్స్ ధరలు వేలల్లో ఉండటంతో పేద, మధ్యతరగతి క్రీడాకారులు సొంతంగా కొనుగోలు చేయలేకపోతున్నారు. జిల్లా కేంద్రాల్లో సింథటిక్ రన్వేలు, ఆధునిక జిమ్ సదుపాయాలు, ప్రత్యేక అథ్లెటిక్స్ కోచ్‌లను అందుబాటులోకి తెస్తే మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చని క్రీడావిశ్లేషకులు పేర్కొంటున్నారు.నీరజ్ చోప్రా జావెలిన్ త్రోపై ఆసక్తి చూపుతున్న విద్యార్థులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిక్షణ పొందుతున్న యువత నేడు జాతీయ జావెలిన్ దినోత్సవం గతంలో అసోసియేషన్ ట్ర యల్స్ నిర్వహిస్తే ఐదారుగురు కూడా వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో హాజరువుతున్నారు. గ్రామీణ ప్రాంత అథ్లెట్లలో సహజంగానే మంచి భుజబలం ఉంటుంది. జావెలిన్‌కు అదే ప్రధానం. దీనికి టెక్నిక్, ఫ్లెక్సిబిలిటీ తోడైతే రాణించే అవకాశాలు ఉంటాయి. – నందెల్లి మహిపాల్, అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు -
డ్రైవింగ్ లైసెన్స్‌లో తప్పులు
● పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్సిరిసిల్లటౌన్: పౌరుల గుర్తింపునకు ఉపయోగపడే డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో తప్పులు ఎలా దొర్లుతున్నాయో రవాణాశాఖ అధికారులు వివరించాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ కోరారు. జిల్లా కేంద్రంలో గురువారం మాట్లాడారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకున్న వహీద్ హుస్సేన్ సంతకానికి బదులు బి.సత్తయ్య అని ఎలా ముద్రించారని ప్రశ్నించారు. డ్రైవింగ్ లైసెన్స్ జారీలో అధికారులు నిర్లక్ష్యం వీడాలన్నారు. ఈవిషయమై డీటీవో శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. లైసెన్స్ హోల్డర్ సంతకం తప్పుగా రావడంలో తమ సిబ్బంది ప్రమేయం ఉండదన్నారు. దరఖాస్తుదారులే ఆన్లైన్ పోర్టల్‌లో నేరుగా వివరాలు, సంతకాలు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. డాక్యుమెంట్లను తప్పుగా స్కానింగ్ చేయడంతోనే సంతకం వేరే వ్యక్తిది వచ్చి ఉంటుందని తెలిపారు. మరోసారి ఆన్లైన్లో సరైన వివరాలు పొందుపరుస్తూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
సాగని సర్దుబాటు చదువులు !
ముస్తాబాద్(సిరిసిల్ల): విద్యార్థులున్న స్కూళ్లలో టీచర్ల కొరత ఉండగా.. ఉపాధ్యాయులున్న బడుల్లో విద్యార్థుల నమోదు లేదు. టీచర్ల కొరతను అధిగమించేందుకు ఏటా విద్యాశాఖ అధికారులు సర్దుబాటు చేస్తుంటారు. విద్యార్థులు తక్కువ ఉన్న స్కూళ్లలోని టీచర్లను ఎక్కువ స్టూడెంట్స్ ఉన్న పాఠశాలలకు పంపిస్తారు. కానీ ఈ విద్యాసంవత్సరం మొదలై రెండు నెలలు గడుస్తున్నా ఈ సర్దుబాటు ప్రక్రియ చేపట్టలేదు. దీంతో విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్లలో టీచర్ల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లాలో 639 ప్రభుత్వ పాఠశాలల్లో 49 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఖాళీల భర్తీ ఎప్పుడో.. జిల్లాలో 489 ప్రాథమిక పాఠశాలలు ఉండగా ఇందులో 237 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రభుత్వం 2025 ఆగస్టులో పదోన్నతులు కల్పించింది. ఇందులో పదోన్నతి పొందిన 45 మంది ఉపాధ్యాయులను ఇప్పటికి బదిలీ చేయలేదు. దీంతో వారు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేయక, ఇటు ఎస్జీటీగా ఉండలేక సతమతమవుతున్నారు. పదోన్నతి పొందిన వారు హైస్కూళ్లకు వెళ్తే ప్రైమరీ స్కూళ్లలో ఖాళీలు మరింత పెరిగే అవకాశం ఉంది. జీవో 25 ప్రకారం ఇలా ఉండాలి విద్యార్థులు టీచర్లు 1–19 ఒకరు 20–60 ఇద్దరు 61–90 ముగ్గురు 91–120 నలుగురు 121–150 ఐదుగురుఇది ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 67 మంది విద్యార్థులు చదువుతుండగా.. ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. తరచూ జరిగే శిక్షణ, సమావేశాలకు హెచ్ఎం వెళ్తుండడంతో ఉన్న ఒక్క టీచర్ ఐదు తరగతులు మేనేజ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. అసలైతే 60 మంది విద్యార్థులు దాటిన పాఠశాలకు ప్రభుత్వం ముగ్గురు టీచర్లను కేటాయించాలి. కానీ ఇక్కడ ఇద్దరే ఉన్నారు. -
రోబోటిక్స్ వర్క్‌షాప్ విజయవంతం
వేములవాడఅర్బన్: అగ్రహారంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్‌కు చెందిన రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే రోబోటిక్స్ వర్క్‌షాప్‌లలో ట్రైనర్లుగా సేవలందించేందుకు కళాశాల విద్యార్థులను సన్నద్ధం చేయడమే ఈ శిక్షణ ఉద్దేశ్యమని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ పేర్కొన్నారు. శిక్షణలో 186 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. రోబోటిక్స్ పరిజ్ఞానంతోపాటు నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్, సమస్య పరిష్కార నైపుణ్యాలు అలవడుతాయన్నారు.సమస్యలపై పోరాటమే కమ్యూనిస్టుల ధ్యేయం తంగళ్లపల్లి(సిరిసిల్ల): కేంద్రంలోని బీజేపీ ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల పాలనకు వ్యతిరేకంగా సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర ప్రారంభమైంది. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ శివారులోని సింగిరెడ్డి భూపతిరెడ్డి స్థూపానికి పూలమాలలు వేసి ఈ యాత్రను ప్రారంభించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆగస్టు 14 వరకు జిల్లా వ్యాప్తంగా ఈ పాదయాత్రలు సాగుతాయని తెలిపారు. సీపీఐ మండల కార్యదర్శి సోమ నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గుంటి వేణు, పంతం రవి, కడారి రాములు, చీపిరెడ్డి తిరుపతిరెడ్డి, మంద అనిల్, బాచుపల్లి శంకర్, కృష్ణ, హరి, సత్తవ్వ, మంజుల పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించండి సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఫీజు, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ గురువారం నిరసన తెలిపారు. పట్టణంలోని పలు కళాశాలల్లో విద్యార్థులతో సంతకాల సేకరణ చేపట్టారు. బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు, ఫీజు రీయింబర్స్మెంట్స్ జిల్లా కో కన్వీనర్ వంగ అనిల్‌కుమార్, నాయకులు తిరుపతిరెడ్డి, రాజు, చిందం నరేశ్, మెహర్ కృష్ణ పాల్గొన్నారు. పల్లెప్రకృతి వనంలో చెట్ల నరికివేత తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని గోపాలరావుపల్లి పరిధిలోని ‘పల్లె ప్రకృతి వనం’లో అనుమతి లేకుండా 61 మొక్కలను నరికివేసినందుకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి కలెక్టర్ గరీమా అగ్రవాల్ రూ.1.22లక్షలు జరిమానా విధించారు. వాల్టా చట్ట నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక్కో మొక్కకు రూ.2వేలు చొప్పున జరిమానా ఖరారు చేశారు. ఈ జరిమానా మొత్తాన్ని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల నుంచి సంయుక్తంగా వసూలు చేసి 14 రోజుల్లోగా గ్రామ పంచాయతీ ఖాతాలో జమచేయాలని స్పష్టం చేశారు. ఆరు మండలాల్లో చిరుజల్లులు సిరిసిల్ల: జిల్లాలోని ఆరు మండలాల్లో గురువారం చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా ఎల్లారెడ్డిపేట మండలంలో 16.2 మిల్లీమీటర్ల వర్షం పడగా.. రుద్రంగిలో 3.3, సిరిసిల్లలో 7.5, తంగళ్లపల్లిలో 5.6, ఇల్లంతకుంటలో 6.0, ముస్తాబాద్‌లో 0.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిగితా మండలాల్లో తుంపర్ల వర్షం పడింది. -
ఆయిల్‌పామ్ లక్ష్యం చేరుకోవాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: జిల్లాలో నిర్ధేశించిన ఆయిల్‌పామ్ లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఆయిల్‌పామ్ సాగుపై గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. రైతులకు అవగాహన కల్పిస్తూ సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం సకాలంలో అందేలా ఉద్యాన, వ్యవసాయశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జలసిరి పనులతో నీటి సంరక్షణ జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని, జలసిరి పనులతో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్ నుంచి గురువారం రాత్రి టెలీకాన్ఫరెన్స్‌లో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ ఇంజినీర్లతో మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణ, సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆగస్టు 15 నాటికి మండలాల వారీగా నిర్దేశించిన ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. మండల స్థాయిలో ప్రజావాణి సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలనే ఉద్దేశంతో మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కలెక్టర్ తెలిపారు. ప్రతీ సోమవారం(పని దినాల్లో) మండల కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మండలస్థాయి అధికారులు అందరూ హాజరుకావాలని సూచించారు. జెడ్పీ సీఈవో, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఏవో అఫ్జల్‌బేగం, హార్టికల్చర్ అధికారి శరత్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. -
మహిళల ఆత్మగౌరవమే ప్రభుత్వ లక్ష్యం
చందుర్తి(వేములవాడ): మహిళల ఆత్మగౌరవమే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని మర్రిగడ్డలో మహిళ సంఘ భవనం, శుద్ధ జలకేంద్రాన్ని ప్రారంభించి, అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. ఈసందర్భంగా విప్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో కరువును అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటే, బీఆర్ఎస్ నాయకులు మాత్రం కరువు వస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి అపవాదరావాలని వేడుకున్నారని విమర్శించారు. వరుణుఇ కరుణతో వానాకాలం పంటలకు ఢోకా లేకుండా పోయిందన్నారు. మండల సమాఖ్య సంఘాల ద్వారా సంఘాలు ఆర్థిక స్వావలంబనకు ఆర్టీసీ బస్సులను, రైస్‌మిల్లల ఏర్పాటుకు నిధులు అందజేస్తుందన్నారు. కోటి మందికి ఇందిరమ్మచీరలు అందించేందుకు జిల్లా నేతలే తయారు చేస్తున్నారన్నారు. సర్పంచ్ దూది మనీషశ్రీనివాస్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, రుద్రంగి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, పొద్దుపొడుపు లింగారెడ్డి, తహసీల్దార్ భూపతి, ఎంపీడీవో రాధ, ఐకేపీ ఏపీఎం కల్యాణి, పార్టీ అధ్యక్షుడు గొట్టె ప్రభాకర్ పాల్గొన్నారు. హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించండిసిరిసిల్ల అర్బన్: జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లోని సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేశ్ కోరారు. కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఏవో రాంరెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాకేశ్ మాట్లాడుతూ హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. బాలికల వసతి గృహాలు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మంద అనిల్‌కుమార్, నాయకులు పెండెల ఆదిత్య, గర్ల్స్ కన్వీనర్ బర్రెంకల శ్రీహారిక, కో–కన్వీనర్ బోదాసు ప్రవళిక, భూక్య సందీప్, శశి, అవినాశ్ పాల్గొన్నారు. -
పొద్దంతా గెరువు.. రాత్రంతా చినుకులు
● లోటు నుంచి సాధారణ స్థాయికి వర్షాలు ● పొంగి ప్రవహిస్తున్న మానేరు, మూలవాగులు ● మధ్యమానేరులో 17 టీఎంసీలు అప్రమత్తంగా ఉండాలి సిరిసిల్ల: జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పొద్దంతా గెరువిస్తూ.. రాత్రంతా వానచినుకులు పడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు అభివృద్ధి చెందాయి. కరువు పరిస్థితుల నుంచి సాధారణస్థాయికి వర్షపాతం చేరుకుంది. మూడు మండలాల్లో కాస్త ఎక్కువ వర్షాలు పడ్డాయి. మానేరు, మూలవాగులు పారుతున్నాయి. వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వీర్నపల్లిలో అత్యధికం అత్యధికంగా వీర్నపల్లి మండలంలో 47.6 మిల్లీమీటర్ల వర్షం పడగా, అత్యల్పంగా గంభీరావుపేట మండలంలో 9 మిల్లీమీటర్లు కురిసింది. రుద్రంగిలో 10.1, చందుర్తిలో 9.6, వేములవాడ రూరల్‌లో 24.0, బోయినపల్లిలో 12.6, వేములవాడలో 37.2, సిరిసిల్లలో 24.3, కోనరావుపేటలో 29.5, ఎల్లారెడ్డిపేటలో 27.0, ముస్తాబాద్‌లో 17.7, తంగళ్లపల్లిలో 24.3, ఇల్లంతకుంటలో 34.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 23.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, వీర్నపల్లి, వేములవాడ మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదైంది. ప్రాజెక్టులకు జలకళ బోయినపల్లి మండలం మాన్వాడ మధ్యమానేరు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 27.55 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 16.494 టీఎంసీలకు నీరు చేరింది. ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ జలాశయం పూర్తి నీటి నిల్వ 3.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.489 టీఎంసీలు ఉన్నాయి. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1482.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1478.38 అడుగులకు చేరింది. నాలుగు అడుగులు నిండితే ఎగువ మానేరు జలాశయం మత్తడి దూకనుంది. ఇప్పటికే కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం మత్తడి దూకుతోంది. జిల్లా వ్యాప్తంగా 656 చెరువులు ఉండగా.. ఒక్క చెరువు కూడా పూర్తి స్థాయిలో నిండలేదు. మత్తడి దూకుతున్న చెక్‌డ్యామ్‌లు వేములవాడరూరల్/ముస్తాబాద్/వీర్నపల్లి : వేములవాడ రూరల్ మండలంలో మంగళవారం కురిసిన వర్షానికి మల్లారం చెక్‌డ్యాం మత్తడి దూకుతోంది. ముస్తాబాద్ మండలం గూడెంలో రైతులు వరినాట్లు వేస్తున్నారు. రామలక్ష్మణపల్లె వద్ద మానేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రామలక్ష్మణపల్లె, పదిర మధ్య గల కాజ్వే పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అటు వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని సర్పంచ్ కోటగిరి ఎల్లవ్వ తెలిపారు. వీర్నపల్లి మండలం అడవిపదిరలోని ధర్మారం చెరువు మత్తడి దూకుతోంది.గూడెంలో వరినాట్లు వేస్తున్న కూలీలు మత్తడి దూకుతున్న అడవిపదిరలోని ధర్మారం చెరువుగంభీరావుపేట(సిరిసిల్ల): ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్ట్‌ను బుధవారం ఎస్పీ మహేశ్ బీ గీతే, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. పూర్తి స్థాయి నీటి మట్టం 2 టీఎంసీలు కాగా, ప్రస్తుత 1.6 టీఎంసీల నీరు ఉందని నీటి పారుదల శాఖ అధికారులు వివరించారు. ప్రాజెక్ట్ పరిధిలోని రైతులు, గ్రామస్తులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలన్నారు. సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, జిల్లా నీటిపారుదలశాఖ అధికారి దయాకర్, ప్రశాంత్, తహసీల్దార్ మారుతి, సర్పంచ్ అర్చన ఉన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉండాలి
సిరిసిల్ల: ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని, వాహనం నడిపేటప్పుడు నియమాలు పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ సూ చించారు. సిరిసిల్ల బాలికల జెడ్పీ హైస్కూల్లో బుధవారం రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. డీటీవో మాట్లాడుతూ ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారునడిపేవారు సీటుబెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. రహదారిని దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ఉపయోగించాలని, ట్రాఫిక్ సిగ్నళ్లను గౌరవించాలని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించొద్దని, అతివేగం, సెల్‌ఫోన్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ప్రమాదాలు జరుగుతాయన్నారు. ప్రధానోపాధ్యాయులు శారద, ఏఎంవీఐ పృథ్వీరాజ్‌వర్మ, ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉండాలిచందుర్తి(వేములవాడ): వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ హెచ్చరించారు. మండలంలోని మూడపల్లి, మర్రిగడ్డల్లో బుధవారం వాహనాలు తనిఖీ చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థులను తరలిస్తున్న రెండు టాటా ఏస్ వాహనాలను సీజ్ చేశారు. కానిస్టేబుల్ రమ్య, హోంగార్డు ఎల్లయ్య ఉన్నారు. వేతనాలు వెంటనే చెల్లించండి వేములవాడ: రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల మంది ఉపాధిహామీ సిబ్బందికి వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు విన్నవించారు. విప్ నివాసంలో బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఇతరత్ర టెక్నికల్ వర్కర్స్కు మూడు నెలలుగా వేతనాలు అందలేదన్నారు. హర్ ఘర్ తిరంగా విజయవంతం చేయండి సిరిసిల్లటౌన్: బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టే ‘హర్ ఘర్ తిరంగా’ను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 10న ప్రతీ ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసేలా పార్టీ కార్యకర్తలు కృషిచేయాలన్నారు. సిరిసిల్ల–సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణపై ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశామని.. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం పార్టీ జిల్లా ఎక్స్–సర్వీస్‌మెన్ సెల్ కన్వీనర్ పవన్‌కుమార్‌ను సన్మానించారు. హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ ఆసాని రామలింగారెడ్డి, రాష్ట్ర నాయకులు లింగంపల్లి శంకర్, పార్లమెంట్ కో–కన్వీనర్ ఆడెపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, బండ మల్లేశం, మల్లారపు సంతోష్‌రెడ్డి, బర్కం లక్ష్మి, నవీన్‌యాదవ్, పల్లం అన్నపూర్ణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధులకు భరోసా
కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆ ఫీసర్. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని పటిష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు వరుసలో నిరీక్షించకుండా కుర్చీలు ఏర్పాటు చేశారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేశారు. పక్షం రోజులకోసారి పర్యవేక్షిస్తున్నారు. సమస్య పరిష్కారం కాకుంటే తదుపరి చర్యలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సిఫారసు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల మెయింటెనెన్స్ విషయంలో వారి వేతనాల నుంచి కోత విధించి పేరెంట్స్ ఖాతా లకు మళ్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. – కరీంనగర్ అర్బన్ -
బోనం బైలెల్లినాదో..
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని డివిజన్ ఆఫీస్, మండల ఆఫీస్, ఫైర్‌స్టేషన్, ఐసీడీఎస్ ఆఫీస్, తెలంగాణ ప్రభుత్వ రక్తపరీక్షల కేంద్రం, ఆధార్ కేంద్రం వంటి కీలక ఆఫీస్‌లు ఉన్న ప్రాంతానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. చిన్నపాటి చినుకులకే నీటిగుంతలతో అడుగువేయలేని దుస్థితి. సిరిసిల్ల ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీస్‌లు ఉన్న సముదాయంలోని రోడ్డుపై మోకాలు లోతు గుంతలు పడ్డాయి. 1970 ప్రాంతంలో ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తాన్ని రెవెన్యూపరంగా పరిపాలన సాగించిన సిరిసిల్ల తహసీల్దార్ ఆఫీస్, 1996 కంటే ముందు ఇప్పటి జిల్లాను రెవెన్యూ పరంగా పాలించిన ఆర్డీవో ఆఫీస్‌లు ఉండే సముదాయం ఇది. రోడ్డు పాడయినా తట్టెడు మట్టి పోయించడం లేదు. నిత్యం అధికారులు చూస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వేములవాడ: రాజరాజేశ్వర దేవస్థానం ఉద్యోగుల ఆధ్వర్యంలో బద్దిపోచమ్మకు బుధవారం బోనం మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు భీమన్నకు కోడెమొక్కులు సమర్పించి అభిషేకాలు చేశారు. ఉప్పుగడ్డ హనుమాన్ ఆలయం నుంచి బద్దిపోచమ్మ ఆలయానికి బోనాలతో బయలుదేరారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య బోనాల వేడుక ఉత్సాహంగా సాగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బోనాలకు పూజలు చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈవో రమాదేవి, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొన్నారు. అధికారుల సాక్షిగా గుంతల రోడ్డు ! -
విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు అడ్డుకుంటాం
చందుర్తి(వేములవాడ): మండలంలోని లింగంపేట శివారులో చార్వాక వృద్ధుల సంఘానికి కేటాయించిన స్థలంలో విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను కొనసాగిస్తే ఊరుకోబోమని చార్వాక సంఘం వ్యవస్థాపక సభ్యుడు దయ్యాల కమలాకర్ అన్నారు. లింగంపేటలో వృద్ధులకు కేటాయించిన స్థలంలో సబ్‌స్టేషన్ పనులు చేపట్టగా అడ్డుకుని అదే ప్రాంతంలో చార్వాక వృద్ధుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహర దీక్షలు చేపట్టారు. సంఘం అధ్యక్షుడు ఇందూరి రాములు తదితరులు పాల్గొన్నారు. చార్వాక వృద్ధుల సంక్షేమానికి వ్యతిరేకం కాదు చార్వాక వృద్ధుల సంఘం సంక్షేమానికి వ్యతిరేకం కాదని, కొందరు రాజకీయ లబ్ధి కోసం సంఘ సభ్యులను తప్పుదారి పట్టిస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మర్రిగడ్డలో విలేకరులతో మా ట్లాడారు. వృద్ధుల సంఘానికి కేటాయించిన భూ మిలో సబ్‌స్టేషన్ నిర్మించడం లేదని స్పష్టం చేశారు. ముస్కు ముకుందరెడ్డి, నాగం కుమార్ ఉన్నారు. -
విద్య, వైద్యంపై ఫోకస్
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ విద్యా, వైద్యంపై దృష్టి పెడుతున్నారు. గురుకులాలు, హాస్టళ్లు తరచూ తనిఖీ చేస్తున్నారు. పిల్లలతో కలిసి భోజనం చేస్తున్నారు. వారితో కలిసి పాఠాలు వింటున్నారు.. బోధి స్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలపై ఆరా తీస్తున్నారు. ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని ఆమె ఆదేశిస్తున్నారు. కలెక్టర్ చొరవతో రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా అగ్రస్థానంలో ఉంది. – సిరిసిల్ల -
ఎక్కువ మంది మహిళలు ఉండడం సంతోషకరం
కరీంనగర్‌అర్బన్: కలెక్టర్ చిత్రామిశ్రా పాలనలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళ అధికారిగా ఆమె దిశానిర్ధేశం బాగుంది. ఎక్కువ సంఖ్యలో మహిళలే అధికారులుగా ఉండటం సంతోషకర పరిణామం. ప్రజలకు మరింత సేవ చేయాలనే కాన్ఫిడెన్స్ పెరిగింది. సహచరుల సహకారం, ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం నాకు ప్రేరణగా నిలుస్తాయి. – షర్మిళ, కరీంనగర్ ఆర్డీవో మహిళా అధికారిగా పనిచేయడం.. సమాజంలో మార్పు తీసుకురావడానికి లభించిన గొప్ప అవకాశం. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమం కోసం పనిచేయడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుంది. ప్రతీ సవాలును ధైర్యంగా ఎదుర్కొంటూ.. అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయడమే నా ప్రధాన లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం నా ఉద్యోగంలో అత్యంత విలువైన అంశం. – సరస్వతి, జిల్లా సంక్షేమాధికారి, కరీంనగర్ పరిపాలనలో లభిస్తున్న అవకాశాలు, బాధ్యతలు మాపై మరింత జవాబుదారీతనాన్ని పెంచుతున్నాయి. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ప్రతీ రంగంలో మహిళలు రాణిస్తున్నారు. కుటుంబ, పరిపాలన బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలమని నిరూపిస్తున్నారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. మహిళా సాధికారత అంటే సమాజంలో సానుకూల మార్పునకు నాయకత్వం వహించడం. ఆ దిశగా ప్రతి మహిళ ముందుకురావాలి. – అరుణశ్రీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పెద్దపల్లి -
సేవ చేయడం సంతృప్తినిస్తుంది
జగిత్యాలజోన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఒక్క ఉద్యోగంగా కాకుండా, కక్షిదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామనే తృప్తి మిగులుతుంది. ఓ వైపు ఉ ద్యోగం.. మరో వైపు కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుండటంతో హ్యాపీగా గడిచిపోతుంది. మహిళా అధి కారులుగా ఆఫీసు పనుల్లో ఎంత ఒత్తిడికి గురైనా.. ఆ భావం మన ముఖంపై కనిపించొద్దు. చిరునవ్వుతోనే చాలా సమస్యలు పరిష్కరించవచ్చనేది నా అభిప్రాయం – సి.రత్న పద్మావతి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జగిత్యాల కుటుంబ సహకారంతో ఉన్నత స్థానానికి ఎది గాను. మనం ఏ రంగంలో ఉన్నా అందులో ఉన్నత స్థానానికి ఎదగాలన్న కాంక్ష ఉండాలి. మహిళలు ఉద్యోగం.. కుటుంబ బాధ్యతలకు సమన్యాయం చేస్తున్నారు. కుటుంబంతోపాటు సమాజాన్ని అధ్యయనం చేస్తుండడంతో మరింత మెరుగ్గా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. – జి.సునీత–రవీందర్‌రెడ్డి, జిల్లా మొదటి అదనపు జడ్జి, జగిత్యాల ఓ వైపు జడ్జీగా ఉద్యోగానికి, మరోవైపు కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇస్తాను. కోర్టులో జరిగిన విషయాలను ఇంట్లో, కుటుంబ విషయాలను కోర్టుల్లో మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ఎక్కడి బాధ్యతలు అక్కడే నిర్వర్తించుకోవాలి. మహిళా అధికారులుగా అనుకున్న లక్ష్యాలను సాధించి శభాష్ అనిపించుకోవాలి. – ఆర్.లావణ్య, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జగిత్యాల -
ఎవరూ ఖాళీగా ఉండొద్దు
జిల్లాలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది. ఉద్యోగాలు కావాలని ప్రజావాణికి వస్తున్నారు. ప్రభుత్వ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావాలని ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని స్వయం ఉపాధి సాధించాలి. ఆ దిశగా యువకుల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశాం. యువకులు ఎవరూ ఖాళీగా ఉండొద్దు. వారి కోసమే జాబ్‌మేళాలు నిర్వహిస్తూ.. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పిస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఉద్యోగావకాశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాం. – నిర్మల, జిల్లా ఉపాధి కల్పన అధికారి -
ఏదీ గృహజ్యోతి?
● 194 యూనిట్లు వాడినా రూ.1,146 బిల్లు ● 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలేది? వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి క్షేత్రస్థాయిలో ఎన్నో లొసుగులు కనిపిస్తున్నాయి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. వేములవాడలో ఓ గృహ యజమాని 194 యూనిట్లు మాత్రమే వినియోగించినా బిల్లు వచ్చింది. పట్టణానికి చెందిన కనకయ్య తన ఇంటి అవసరాలకు 194 యూనిట్ల విద్యుత్ వినియోగించగా... రూ.1,146 బిల్లు వచ్చింది. అదే బిల్లులో యూనిట్‌కు రూ.2.62 చొప్పున రూ.510.21 సబ్సిడీ చూపించింది. అయినా బిల్లు చెల్లించాలని అందులో ఉంది. -
ఆమె సంతకం
● మహిళా అధికారులు.. పాలనలో ఆదర్శమూర్తులు ● ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 50కి పైగా అధికారిణులు ● అభివృద్ధి.. సంక్షేమంలో పరుగులు ● ఆదర్శంగా నిలుస్తున్న లేడీబాస్లు ఒక ఇంటిని చక్కదిద్దడమే కాదు, ఒక జిల్లాను, పరిపాలనా వ్యవస్థను ఎంత సమర్థంగా నడిపించగలరో మహిళా అధికారులు చేసి చూపుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పరిపాలన, సంక్షేమ పథకాల అమలు, న్యాయసేవలు, అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు. సేవాభావం, నాయకత్వపటిమతో కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న మహిళా అధికారులు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘కలలు కనండి... కష్టపడండి... నాయకత్వం వహించండి’ అనే నమ్మకాన్ని బలపరుస్తున్నారు. -
కాలువలో పడి సెక్యూరిటీ సూపర్వైజర్ మృతి
● బైక్ అదుపుతప్పి బూడిదకాలువలో పడి.. రామగుండం: స్థానిక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)లో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తే నయీం(50) పెద్దపల్లి జిల్లా రామగుండం అక్బర్‌నగర్‌లోని ఎన్టీపీసీ బూడిద కాలువలో బుధవారం ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. ఎస్సై సంధ్య కథనం ప్రకారం.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన నయీం స్థానిక ఐవోసీలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి రోజూ రైలులో వచ్చి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా అక్బర్‌నగర్‌లోని బూడిదకాలువలో బైక్ అదుపు తప్పి పడి చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నారు. పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాలలోని మహాలక్ష్మీనగర్‌కు చెందిన మెహమద్ మహమ్మద్ (50) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. మహమ్మద్ అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది పురుగుల మందుతాగాడు. మృతుడి బంధువు మహమద్ ముజీబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతిఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండలో గతనెల 30న స్కూల్ వ్యాన్ ఢీకొని గాయపడిన సల్వల రాజేశ్ (28) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. వర్షకొండ గ్రామానికి చెందిన రాజేశ్ తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. మెట్‌పల్లికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల వ్యాన్ పిల్లలను దింపి వస్తోంది. మూలమలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రాజేశ్ తలకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. రాజేశ్ 25రోజుల క్రితమే సౌదీ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అతడి తల్లి నర్సు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి..జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం గణేశ్‌పల్లి పోతారం గ్రామానికి చెందిన యాకసిరి సుబ్రహ్మణ్యం (29) అప్పుల బాధతో ఈనెల 3న పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి కళ్లను కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. మృతుడి భార్య గంగజల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గీత తెలిపారు. కార్యక్రమంలో ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి టెక్నీషియన్ ప్రవీణ్, ఎస్సై గీత, ఫోరెన్సిక్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. హత్యకేసులో నిందితుడికి జీవితఖైదుకరీంనగర్ క్రైౖం: యువకుడిని కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడు నద్దునూరి అనిల్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ నాలుగో అదనపు జిల్లా న్యాయస్థానం జడ్జి జే.కవిత బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రణయ్(23) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. యువతి సోదరుడు నద్దునూరి అనిల్‌కు ఇష్టం లేకపోవడంతో ప్రణయ్‌ను పలుమార్లు హెచ్చరించాడు. 2020 అక్టోబర్ 19న రాత్రి సుమారు 10 గంటల సమయంలో ప్రణయ్ యువతి ఇంటికి వెళ్లగా అనిల్ గమనించాడు. ప్రణయ్ అక్కడి నుంచి పారిపోతుండగా అనిల్ వెంటాడి కర్రతో తీవ్రంగా దాడి చేశాడు. ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో వీణవంక పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి జమ్మికుంట సీఐ సీహెచ్.విద్యాసాగర్‌రావు దర్యాప్తు చేపట్టారు. సాక్ష్యులను సీడీవో ఆర్.శ్రీనివాస్ కోర్టులో హాజరుపరచగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జూలూరు శ్రీరాములు, ప్రతాప్ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. న్యాయస్థానం నిందితుడు అనిల్‌కు జీవితఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధించారు. -
విచారణ చేపడుతున్నాం
ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అనుమతులు, లేఖలపై విచారణ చేపడుతున్నాం. ఇప్పటికే ఓమారు నోటీసులు జారీచేశాం. ఆ సమయం దాటడంతోనే అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. మున్సిపల్ నిబంధనల మేరకే ఇంటి నిర్మాణాలు కొనసాగాలి. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు జరిగితే ఉపేక్షించేది లేదు. కూల్చివేతలు చేపట్టాలంటే తప్పకుండా ఐదు శాఖల సమన్వయంతో చేయాల్సి ఉంటుంది. కట్టకింద బస్టాండు స్థలంపై హద్దులు నిర్ణయించాలని ఆర్డీవోకు లేఖ రాశాం. – లోకేశ్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ -
రైస్‌మిల్లులో విజిలెన్స్ తనిఖీలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లి శివారులోని శ్రీరాజరాజేశ్వర పారాబాయిల్డ్ రైస్‌మిల్లులో బుధవారం స్టేట్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దుమాల గ్రామ శివారులో పదిర గ్రామానికి చెందిన పది మంది దళితులకు దళితబంధులో మంజూరైన పారబాయిల్డ్ రైస్‌మిల్లును వారు నిర్వహించడం లేదు. దీంతో ఆ మిల్లును శ్రీరాజరాజేశ్వర పారాబాయిల్డ్ రైస్‌మిల్లు యాజమాన్యం అద్దెకు తీసుకొని గోదాంగా వినియోగించుకుంటున్నట్లు విజిలెన్స్ అధికారులకు వారు తెలిపారు. విజిలెన్స్ డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ తనిఖీలు పూర్తికాలేవని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. -
అధికారులకు చెప్పాం
ఇటీవల చేసిన పనులతో కాలేజీ గ్రౌండ్ పాడయింది. నిత్యం వాకింగ్‌కు వచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని అనేక సార్లు అధికారులకు చెప్పాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. – సబ్బని నరేందర్, సిరిసిల్లఅనుమతి రావాల్సి ఉంది కాలేజీ మైదానంలో కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నా యి. వర్షం వస్తే మైదానం బురదమయంగా మారుతుందని ఫిర్యాదులు వచ్చాయి. ఓపెన్జిమ్తోపాటు ఇతర పనులు చేయాలి. ఉన్నతాధి కారుల అనుమతులు వస్తే పనులు చేయిస్తాం. – ఖదీర్‌పాషా, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల -
జిల్లాలో కురిసిన వర్షం(మిల్లీ మీటర్లలో)
రుద్రంగి 12.6చందుర్తి 3.5వేములవాడరూరల్ 14.2బోయినపల్లి 6.4వేములవాడ 30.3సిరిసిల్ల 80.6కోనరావుపేట 37.4వీర్నపల్లి 44.3ఎల్లారెడ్డిపేట 105.9గంభీరావుపేట 49.7ముస్తాబాద్ 32.3తంగళ్లపల్లి 64.3ఇల్లంతకుంట 54.0 -
మానీరు పారింది
సిరిసిల్ల/గంభీరావుపేట/ఇల్లంతకుంట/బోయినపల్లి: సిరిసిల్ల పట్టణ శివారులోని మానేరువాగు భారీ వర్షాలతో పారుతోంది. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం ఇంకా పూర్తి స్థాయిలో నిండకపోయినా.. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి, గంభీరావుపేట మండలాల్లో కురిసిన వర్షంతో పాటు, అనుబంధ ఒర్రెల ద్వారా వచ్చి మానేరులో చేరడంతో వాగు పారుతుంది. వరద నీరు మధ్యమానేరు జలాశయంలోకి చేరుతుంది. మరోవైపు కామారెడ్డి జిల్లా నుంచి పాల్వంచ వాగు, సిద్దిపేట జిల్లా నుంచి కూడెల్లి వాగు ద్వారా వరద వచ్చి చేరడంతో ఎగువ మానేరు నిండుతుంది. ఒకడ్రెండు రోజుల్లో మత్తడి దూకనుంది. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం నిండడంతో మత్తడి దూకగా, వేములవాడ మూలవాగు పారుతుంది. ఆ వరదంతా మధ్యమానేరులోకి చేరుతుంది. తడిసి ముద్దయిన జిల్లా జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు వర్షం కురవడంతో జిల్లా తడిసి ముద్దయింది. సిరిసిల్ల పట్టణ నడిబొడ్డున నేతన్న చౌక్ వద్ద వర్షం నీరు, మురికి నీరు రోడ్డు ఎక్కింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వేములవాడలోనూ లోతట్టు ప్రాంతాల్లో వరద చేరింది. -
వరంగల్‌కు దారేది?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఛత్తీస్‌గఢ్– తెలంగాణ– మహారాష్ట్ర రాష్ట్రాలను కలుపుతూ వేస్తున్న జాతీయ రహదారి– 563 నిర్మాణంలో కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని ఇరుకుల్ల జంక్షన్ వద్ద అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్‌హెచ్– 563 వరంగల్– కరీంనగర్ సెక్షన్ రోడ్డు, హైదరాబాద్– రామగుండం రాజీవ్ రహదారి ఒక్కచోట కలుస్తున్నాయి. ఎన్‌హెచ్ 563 ఎలివేటేఎడ్ హైవే కావడంతో కింద నుంచి రాజీవ్ రహదారి వెళ్తుంది. ఈ హైవే నిర్మాణంతో కరీంనగర్‌లోకి భారీ వాహనాలు రాకుండా ఇరుకుల్ల నుంచే వరంగల్‌వైపు వెళ్తాయనుకున్నారంతా. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ జగిత్యాల వైపుగా వెళ్లేందుకు అనుకూలంగా కనెక్టివిటీ ఉన్నా.. వరంగల్ వైపు వెళ్లేందుకు కనెక్టివిటీ లేదు. వాస్తవానికి ఎన్‌హెచ్ 563 రోడ్డు ఇంకా నిర్మాణంలోనే ఉంది. ప్రస్తుతం ఇరుకుల్ల వరకు అందుబాటులోకి వచ్చింది. వాహనాలు వరంగల్ వైపు వెళ్లేందుకు ఎలాంటి ర్యాంపు నిర్మించకపోవడంతో కరీంనగర్ వరకు ప్రయాణించి తీగల వంతెన, మానకొండూరు మీదుగా ఎన్‌హెచ్– 563 ఎక్కుతున్నాయి.పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం నుంచి నిత్యం వేలాది లారీలు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వైపు ప్రయాణిస్తుంటాయి. బసంత్‌నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ, సింగరేణి బొగ్గు, ఎన్టీపీసీ బూడిద, మంథని ఇసుక, వ్యవసాయ ఉత్పత్తులను తరలించే లారీలు నిత్యం కరీంనగర్– వరంగల్– విజయవాడ మధ్య తిరుగుతుంటాయి. పెద్దపల్లి నుంచి బయల్దేరిన వాహనాల్లో కొన్ని హైదరాబాద్ వైపు వెళ్లగా, మెజారిటీ వరంగల్ మీదుగా వెళ్తుంటాయి. మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఎంజీఎం వెళ్లే వారు ఇదే దారిని ఎంచుకుంటారు. ఇరుకుల్ల వద్దకు రాగానే అందరికీ ఎన్‌హెచ్–563 హైవే శిఖరంలా దర్శనమిస్తోంది. కానీ, ఎలివేటెడ్ హైవేను ఎలా ఎక్కాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. కొంతదూరం సర్వీసు రోడ్డుమీద ప్రయాణించినా ఇరుకుల్ల వాగుతో రోడ్డు మూతపడుతోంది. -
అన్నపూర్ణ ప్రాజెక్టులో 1.48 టీఎంసీలు
ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టులో 1.48 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు మంగళవారం తెలిపారు. 207 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు పేర్కొన్నారు. మిడ్ మానేరులోకి భారీ ఇన్‌ఫ్లో మిడ్‌మానేరులో నీటిమట్టం మంగళవారం 15.689 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి లక్ష్మీపూర్ గాయత్రీ పంప్‌హౌస్ ద్వారా వరదకాల్వ మీదుగా 12,600 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. మూలవాగు, మానేరు వాగు నుంచి 6,045 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. వరద నీరు ప్రాజెక్టులోకి తరలుతోంది. -
శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు
వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆలయంలో జరుగుతున్న పనులను మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై సమీక్షించారు. సుమారు 55 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు విప్ తెలిపారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. త్వరలోనే శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధూశేఖర భారతి స్వామి వారిని కలిసి ఇప్పటి వరకు పూర్తైన అభివృద్ధి పనులను వివరించి, మిగిలిన పనులపై వారి సూచనలు, అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ స్పష్టం చేశారు. పట్టు పురుగుల పెంపకంతో అధిక లాభాలుచందుర్తి(వేములవాడ): పంట మార్పిడిలో భాగంగా రైతులు పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో కల్లెడ శైలేశ్, కల్లెడ లక్ష్మణ్ రెండెకరాల్లో మల్బరీ సాగు చేస్తూ పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టగా మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. మల్బరీ తోట సాగు, షెడ్ల నిర్మాణం, ఇతర పరికరాల కోసం సెరికల్చర్ శాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సబ్సిడీ అందిస్తుందన్నారు. పట్టు పురుగుల శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు ముందుకు వవచ్చి సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని కోరారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, జిల్లా ఉద్యావన శాఖ అధికారి శరత్‌బాబు, పట్టుపరుగుల శాఖ అధికారి జగన్, తహసీల్దార్ భూపతి, సర్పంచ్ మందాల శారద తదితరులు పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తులుసిరిసిల్ల: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 కోసం ఉచిత దీర్ఘకాలిక శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఎం.సౌజన్య మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌లో శిక్షణ ఇస్తారని ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 7లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని ఆమె కోరారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.5వేలు ఉపకార వేతనం, రూ.5వేల పుస్తక నిధి, నిపుణులతో శిక్షణ ఇప్పిస్తారని వివరించారు. జిల్లాలోని బీసీ కులాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణపై చైతన్యం తేవాలిరుద్రంగి(వేములవాడ): గ్రామీణ ప్రాంత ప్రజలు, యువతకు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకురావాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. మంగళవారం రుద్రంగి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, విధుల నిర్వహణ తీరును పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సేవలు అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గ్రామాల్లో రాత్రి వేళ పెట్రోలింగ్ మరింత పటిష్టం చేయాలని, రౌడీషీటర్లు, గంజాయి తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఎస్సై మోతీరాం, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరునెలలకే తారు మారు
ఇదేం బడిబాటకోనరావుపేట మండలం మల్కపేటలోని చల్మెడ జానకీదేవి ప్రాథమికో న్నత పాఠశాల దారి నీటిమయంగా తయారైంది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఒర్రెలు, పొలాల మధ్య నుంచి వస్తున్న వరద ఇదే దారిలో ప్రవహిస్తూ చెరువులోకి వెళ్తోంది. దీంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. – కోనరావుపేట కోనరావుపేట మండలం మల్కపేట రామాలయం గుట్టపైకి భక్తులు వెళ్లేందుకు నిర్మించిన రోడ్డు నాణ్యతాలోపంతో దెబ్బతింటోంది. గుట్ట పైనుంచి కింది వరకు రూ.90 లక్షల వ్యయంతో 2024 నవంబర్ 26న మల్కపేట రిజర్వాయర్ కట్టపై రోడ్డు పనులు ప్రారంభించారు. ఒక వైపు రక్షణ గోడ, మరో వైపు రక్షణగా సిమెంట్ దిమ్మెలు నిర్మించారు. పనులు పూర్తయి ఆరునెలలు దాటుతోంది. నాణ్యతా లోపంతో సిమెంట్ దిమ్మెలు పగిలిపోయాయి. మరో పక్క సైడ్‌వాల్ పగుళ్లు బారుతోంది. కాగా, ఆర్అండ్బీ రోడ్డు వరకు పనులు నాణ్యతతో పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. – కోనరావుపేట -
కాషాయం అంటేనే కాంగ్రెస్‌కు భయం
ముస్తాబాద్(సిరిసిల్ల): కాషాయం అంటేనే కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. ముస్తాబాద్‌లో పంచాయతీ భవనంపై కాషాయరంగు తొలగించడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని మంగళవారం సందర్శించి, వారికి సంఘీభావం తెలిపారు. నిబంధనల మేరకు కార్యాలయ భవనానికి సర్పంచ్, పాలకవర్గం రంగులు వేశారన్నారు. అక్షరాలు బాగా కనబడాలే అనే ఉద్దేశంతో కాషాయ రంగు వేస్తే కాంగ్రెస్ నేతలకు ఎందుకు అభ్యంతరమో చెప్పాలన్నారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కొరారు. సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు క్రాంతి, జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, మీస సంజీవ్, పద్మ, శ్రీనివాస్‌రావు, గోపి, రాంగోపాల్, మహేందర్, సత్తయ్య, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ పాఠ్యాంశంపై పట్టు సాధించాలి
సిరిసిల్ల: విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించి, శ్రద్ధగా చదువుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవా ల్ కోరారు. సుభాష్‌నగర్‌లోని అర్బన్ రెసిడెన్షి యల్ విద్యాలయాన్ని సోమవారం తనిఖీ చేశారు. స్టోర్‌రూమ్‌లో బియ్యం, పప్పులు, గుడ్లు, బెండకాయల నాణ్యత పరిశీలించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం భోజనం పె డుతున్నారా? అని తెలుసుకున్నారు. సైన్స్ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రణాళిక ప్రకా రం చదివితే భవిష్యత్‌లో మేలు చేస్తుందన్నారు. ఓటర్ల రేషనలైజేషన్ చేపట్టాలి ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఉంటే, వారిని ఒకే పోలింగ్ కేంద్రం కిందకు వచ్చేలా రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో ఎస్ఐఆర్పై సమీక్షించారు. సర్ డిజి టలైజేషన్ పూర్తి చేయాలన్నారు. సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, తహసీల్దార్లు మహేశ్, జయంత్‌కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఇదే అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
చర్యలు తీసుకోవాలి
జిల్లా కేంద్రంలోని వెంకంపేటలోని భవాని పవర్లూమ్ మాక్స్ సంఘం మాజీ సభ్యుడు వెల్దండి బాస్కర్ సంఘ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. అధ్యక్ష పదవి అనంతరం సభ్యుడు కాని ఆడెపు విఠల్‌ను సభ్యునిగా చూపించి, సంఘం బ్యాంకు ఖాతా నుంచి రూ.8లక్షలు తన వ్యక్తిగత ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. భాస్కర్‌ను సంఘం నుంచి తొలగించినా నష్టం కలిగిస్తూనే ఉన్నాడు. అతనిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోండి. – భవాని పవర్లూమ్ మాక్స్ సంఘం, సిరిసిల్ల -
ప్రజా‘వాణి’ వినండి.. పరిష్కరించండి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● 196 అర్జీలు స్వీకరణసిరిసిల్ల అర్బన్: తమ సమస్యలు విన్నవించేందుకు జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వందల సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా 196 మంది నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో 9 దరఖాస్తులు రాగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. -
ప్రతిపాదనల్లో సహకారం !
చందుర్తి(వేములవాడ): జిల్లాలోని రైతులకు సహకార సంఘాల సేవలను మరింత చేరువ చేయాలని కొత్త సంఘాల ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు. ఏడాదిన్నరగా ఇటు రైతులకు.. పదవులపై ఆశపెట్టుకున్న రాజకీయ నాయకులకు ఎదురుచూపులే మిగిలాయి. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 24 సహకార సంఘాలతోపాటు మరో 9 సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. దీనిపై ఎలాంటి ఆదేశాలు రాకపోగా.. ఇప్పటికే ఉన్న వాటికి నామినేటెడ్ పాలకవర్గాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఏడాన్నర క్రితమే ప్రతిపాదనలు జిల్లా వ్యాప్తంగా 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటి ద్వారా రైతులు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు, గోదాంలను ఏర్పాటు చేసిన ఎరువుల బస్తాలను, విత్తనాలను అందజేస్తున్నాయి. కొన్ని సొసైటీల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసిన సంఘాలు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. రైతుకు మరింత చేరువ అయ్యే దిశగా సహకార సంఘాల అడుగులు పడుతున్నాయని ఆశపడుతున్న అన్నదాతలకు ఏడాదిన్నరగా కొత్త సంఘాలపై స్పష్టత కరువైంది. గతంలో నష్టాల బాటలో ఉన్న కొన్నింటిని మూసివేశారు. అయితే తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో ఆర్థికాభివృద్ధి సాధించాయి. కొత్త మండలాల ఏర్పాటుతో రైతులకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 9 కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. నూతన సంఘాలకు ప్రతిపాదనలు మండలం గ్రామం ఇల్లంతకుంట కందికట్కూర్ ఇల్లంతకుంట పెద్దలింగాపూర్ రుద్రంగి రుద్రంగి కోనరావుపేట నిమ్మపల్లి వీర్నపల్లి వీర్నపల్లి చందుర్తి నర్సింగపూర్ తంగళ్లపల్లి బద్దెనపల్లి తంగళ్లపల్లి తంగళ్లపల్లి వేములవాడ చెక్కపల్లి -
బాధితులకు అండగా నిలవాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: బాధితులకు పోలీసులు చట్టపరిధిలో అండగా నిలవాలని, సమస్యతో వచ్చిన వారికి పరిష్కారం చూపాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 38 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది ఠాణాకు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితుల ఫిర్యాదులపై ఆ యా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్లు చేసి చట్టపరంగా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. వర్షం..హర్షంసిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా సోమవారం వర్షం కురిసింది. బోయినపల్లిలో అత్యధికంగా 39.6 మిల్లీమీటర్లు, రుద్రంగిలో 2.3, చందుర్తిలో 4.0, వేములవాడ రూరల్‌లో 1.1, వేములవాడలో 8.8, సిరిసిల్లలో 3.3, కోనరావుపేటలో 2.4, వీర్నపల్లిలో 4.9, ఎల్లారెడ్డిపేటలో 1.4, గంభీరావుపేటలో 11.9, ము స్తాబాద్లో 2.2, తంగళ్లపల్లిలో 0.9, ఇల్లంతకుంటలో 0.6 మిల్లీమీటర్లు పడింది. సిరిసిల్ల, ఇల్లంతకుంట మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. జలాశయాల్లో నీటి మట్టం మధ్యమానేరులో 13.525 టీఎంసీ నీరు నిల్వ ఉండగా.. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులో 1.048 టీఎంసీల నీరుంది. పాల్వంచ, కూడెల్లివాగుల ద్వారా కొద్దిపాటి వరద జలాశయంలోకి వస్తోంది. ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ జలాశయంలో 1.466 టీఎంసీల నీరుంది. -
బస్టాండ్ స్థలంలో అక్రమ నిర్మాణాలు
వేములవాడ/వేములవాడరూరల్: వేములవాడలో అధికారులు అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. స్థానికంగా జగిత్యాల బస్టాండ్ కోసం ప్రభుత్వం 2017లో భూమి సేకరించింది. సుమారు 20.20 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వరాదని జిల్లా అధికారులు గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. ఆ స్థలంలో 2026 మే 1, జూన్ 23 తేదీల్లో రెండు నిర్మాణాల కోసం మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఆ అనుమతులు రద్దు చేయాలి. – రామతీర్థపు మాధవి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్, 9వ వార్డు కౌన్సిలర్ -
రంగుల ‘పంచాయితీ’ ఉద్రిక్తం
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మేజర్ పంచాయతీకి రాజకీయరంగు అంటుకుంది. పంచాయతీ భవనానికి వేసే కలర్ విషయంలో రాజుకున్న వివాదం మూడు రాజకీయపార్టీల ఆందోళనకు దారితీసింది. ముస్తాబాద్ మేజర్ పంచాయతీ కార్యాలయం భవనానికి కాంగ్రెస్ నాయకులు సోమవారం జాతీయ జెండా రంగులు వేసేందుకు ప్రయత్నించారు. భవనానికి ఉన్న నాలుగు స్తంభాలకు మూడు రంగులతోపాటు అశోకచక్రం వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ నాయకులకు సర్ది చెప్పారు. అప్పుడే అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనానికి గులాబీరంగు ఉండేదని ఇప్పుడు దానిని తెలుపురంగులోకి ఎలా మార్చారంటూ నిరసనకు దిగారు. గులాబీ రంగు సైతం వేయాలంటూ ఆ పార్టీ నాయకులు సంతోష్‌రావు, భరత్ బైఠాయించారు. పోలీసులు వారిని శాంతింపజేశారు. అప్పుడే బీజేపీ మండల అధ్యక్షుడు క్రాంతి ఇతర నాయకులు గ్రామపంచాయతీ వద్దకు చేరుకుని గతంలో ఉన్న గులాబీరంగును పంచాయతీ పాలకవర్గం తీర్మానం మేరకు తొలగించారని, నేమ్‌ప్లేట్‌కు మాత్రం కనిపించేలా మరో కలర్ వేశారన్నారు. భవనానికి జాతీయ జెండా కలర్ వేస్తే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజ్జెల రాజు, ఉపసర్పంచ్ విజయ్, మహేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూడు పార్టీల నేతల ఆందోళనతో మండల కేంద్రం దద్దరిల్లింది. ఎస్సై జ్యోతి, పోలీస్ బలగాలతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు చేపట్టారు. ఎంపీడీవో లచ్చాలు సూచనతో తెలుపురంగు వేసేలా మూడు పార్టీల నాయకులతో పోలీసులు చర్చలు జరిపారు. -
ఒకే గది.. ఐదు తరగతులు !
ఇల్లంతకుంట: మండలంలోని జంగారెడ్డిపల్లె ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల్లో కలిసి 26 విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఇద్దరు టీచర్లు డిప్యూటేషన్‌పై వస్తున్నారు. అయితే వీరందరిని ఒకే తరగతిగదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. అదే తరగతిగదిలో ఆఫీస్ రూమ్ సైతం ఏర్పాటు చేసుకున్నారు. అదనపు తరగతి గది కోసం రూ.4లక్షలు మంజూరుకాగా.. నిధులు సరిపోకపోవడంతో స్లాబ్ లెవల్ వరకే ఆ గది పనులు జరిగి నిలిచిపోయాయన్నారు. అదనపు తరగతిగది పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అన్నదాన సత్రంలో ఈవో తనిఖీ
వేములవాడ: రాజరాజేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన సత్రాన్ని ఈవో రమాదేవి సోమవారం తనిఖీ చేశారు. భోజనం చేస్తున్న భక్తుల వద్దకు వెళ్లి నాణ్యత, రుచిపై ఆరా తీశారు. అనంతరం సత్రంలోని వంటశాల, భోజనశాల పరిశుభ్రతను పరిశీలించారు. అంతకుముందు భీమేశ్వరస్వామి ఆలయంలోని కోడె టికెట్ కౌంటర్లు, దీపాల కౌంటర్లు, రెండు చెక్‌పోస్టులను పరిశీలించారు. కొబ్బరి వ్యర్థాలను డస్ట్‌బిన్‌లోనే వేయాలని భక్తులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఇన్చార్జి ఒన్నారం భాస్కర్, ఇతర సిబ్బంది ఉన్నారు. మత్తుకు దూరంగా ఉండాలి వేములవాడ అర్బన్: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అగ్రహారం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.శంకర్ కోరారు. కాలేజీలో సోమవారం ‘నషా ముక్త్ యువ – వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు. ప్రి న్సిపాల్ శంకర్ మాట్లాడుతూ మత్తు వ్యసనా లను నిర్మూలించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. యాంటీ డ్రగ్ కమిటీ కోఆర్డినేటర్లు డాక్టర్ కె.వై.కరుణ, జి. ధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. బకాయిలు చెల్లించాలని స్టార్టర్ తొలగింపు కోనరావుపేట(వేములవాడ): మండలంలోని మరిమడ్లలో గ్రా మపంచాయతీ చెల్లించాల్సిన రూ.1.30 లక్షల బకాయిలు రాకపోవడంతో బస్టాండ్ సమీపంలోని తాగునీటి బోరు స్టార్టర్‌ను మాజీ సర్పంచ్ జింక పోషవ్వ కుమారుడు శ్రీనివాస్ సోమవారం తొలగించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో తాగునీటి సమస్య పరిష్కారానికి సొంత నిధులతో బోర్లు వేయించానని, బిల్లులు చెల్లించడం లేదన్నారు. అసైన్డ్ భూములను పేదలకు అందించాలి సిరిసిల్ల అర్బన్: ప్రభుత్వానికి సంబంఽధించిన అసైన్డ్ భూములను భూమి లేని అన్ని సామాజికవర్గాల నిరుపేదలకు పంపిణీ చేయాలని దళితహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ కోరారు. జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను భూభారతిలో చూపించి, నిరుపేదలకు పంపి ణీ చేసి పట్టాలు అందజేయాలని కోరారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. జిల్లా కన్వీనర్ గజ్జెల ప్రభాకర్, గొల్ల బాబు, పండుగ చంద్రన్న, ఎల్లన్న, జాన్సన్, కవిత, అనిత పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ సెక్రటరీగా రవీందర్రావు సిరిసిల్లటౌన్: ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీగా జోగినపల్లి రవీందర్రావును ఎన్నుకున్నారు. సిరిసిల్లలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఈమేరకు ఎన్నుకున్నారు. జిల్లా క్రీడల అధికారి అజ్మీర రామదాసు, ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, జిల్లా స్పోర్ట్స్ నోడల్ ఆఫీసర్ దేవత ప్రభాకర్, పీఈటీఏ అధ్యక్షుడు అనిల్‌గౌడ్, సురేశ్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ గొట్టే అంజయ్య పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2026
బోనం.. ప్రణామం సిరిసిల్లటౌన్/తంగళ్లపల్లి/వేములవాడ: కార్మిక క్షేత్రం.. ఆధ్యాత్మిక పట్టణం ఆదివారం బోనమెత్తింది. సిరిసిల్లలో పోచమ్మ, మైసమ్మలకు బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలో లక్ష్మీనరసింహస్వామి ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో బోనాలు తీశారు. వేములవాడలో విశ్వబ్రాహ్మణులు బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజులు సందడి.. శివసత్తులు పూనకాలతో ఆకట్టుకుంది. వేములవాడలో బద్దిపోచమ్మకు బోనాలు తీస్తున్న భక్తులు సిరిసిల్లలో బోనాల పండుగలో చైర్పర్సన్ జిందం కళగండిలచ్చపేటలో బోనాలు -
నేడు చీరనేత ప్రదర్శన
● మూడున్నర గంటల్లో 5.5 మీటర్ల చీరనేతకు ప్రణాళికసిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం చేనేత ప్రత్యక్ష ప్రదర్శనకు సిద్ధమయ్యారు. భారతీయ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో సాంప్రదాయ చేనేత మగ్గంపై కేవలం 210 నిమిషాల్లో (3 గంటల 30 నిమిషాల్లో) 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు గల పూర్తి చేనేత చీరను ప్రత్యక్షంగా నేయనున్నారు. అదే చీరను ప్రత్యేకమైన నైపుణ్యంతో మడిచి 12 సెం.మీ. పొడవు, 6.5 సెం.మీ. వెడల్పు, 2.5 సెం.మీ. ఎత్తు గల అగ్గిపెట్టెలో ఇమిడేలా ప్రదర్శించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేశామని హరిప్రసాద్ శ్రీసాక్షిశ్రీకి ఆదివారం తెలిపారు. చేనేత రంగానికి జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావడం, యువతలో చేనేతపై ఆసక్తి పెంపొందించడం, సిరిసిల్ల నేతన్నల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మూడున్నర గంటలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. చంద్రంపేట హరిప్రసాద్ హ్యాండ్లూమ్స్లో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి చీర నేయడం ప్రారంభిస్తానని తెలిపారు. బకాయిలు చెల్లించాలి సిరిసిల్ల అర్బన్: ఉపాధిహామీ సిబ్బందికి గత మూడు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే బకాయిలు చెల్లించాలని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు కోరారు. ఈమేరకు డీఆర్డీవో లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి కూలీలకు ఉపాధి పనులు కల్పించే కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న ఉద్యోగులకు మూడు నెలలగా జీతాలు అందడం లేదన్నారు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో కాలం వెల్లదీస్తున్న వీరికి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నాయకులు సోమ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కనగర్తి శివారులో చిరుత సంచారం? కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తి శివారులో చిరుత ఆనవాళ్లు కనిపించడంతో రైతులు, గొర్లకాపరులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన గొర్ల కాపరులు కనగర్తి–నాగారం మధ్య ఆదివారం గొర్లను మేపడానికి తీసుకెళ్లారు. వారికి నెల్లిబండల ప్రాంతంలో చిరుత పాదముద్రలు కనిపించాయి. వర్షాకాలం కావడంతో నేల తడిగా ఉండడంతో వాటి పాదముద్రలు గుర్తించారు. అటువైపుగా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని తోటి కాపరులకు, రైతులకు చెబుతున్నారు. చిరుత సంచరించిందని తెలియడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వేడుకల్లో సీనియర్ సిటిజన్స్ సిరిసిల్ల అర్బన్: తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య ఆధ్వర్యంలో గాంధీనగర్ హనుమాన్ మందిరంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ స్నేహమంటే శ్రీకృష్ణ–కుచేలుల మాదిరిగా ఉండాలని, జీవితాంతం ఆసరాగా అండగా నిలిచేదే స్నేహమన్నారు. కోడం నారాయణ, జనపాల శంకరయ్య, దొంత దేవదాస్, ఎల్లయ్య, జ్ఞానోబా, కైలాసం, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
డ్రాపౌట్స్‌కు ‘ఓపెన్’ వరం
గంభీరావుపేట(సిరిసిల్ల): ఆర్థిక ఇబ్బందులు.. ఇతర కారణాలతో ఉన్నత చదువులకు దూరమయ్యారా.. అయి తే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ చదువులు అందుబాటులో ఉన్నాయి. చదువు మధ్యలో ఆపేసిన వారికి ప్ర భుత్వం చక్కటి అవకాశం కల్పిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడిన వా రు ఎంతోమంది ఉన్నారు. ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన వారు రెగ్యులర్ డిగ్రీ పూర్తి చేసిన వారితో సమానం. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కింది స్థాయి ఉద్యోగులు ఓపెన్ డిగ్రీ పట్టాతో పదోన్నతులు పొందవచ్చు. గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దూరవిద్య సెంటర్ అందుబాటులో ఉంది. ఇంటర్ స మాన విద్యార్హతలు గల వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నచ్చి న కోర్సులు ఎంచుకొని మూడేళ్లలో డిగ్రీ పూర్తి చే యవచ్చు. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీ వరకు గడువు ఉంది. అభ్యాసకులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసేలా ప్రభుత్వం నెలకు ఐదు తరగతులు అంటే ప్రతి ఆదివారంతోపాటు రెండో శనివారం నిర్వహిస్తుంది. జత చేయాల్సిన సర్టిఫికెట్లు దరఖాస్తు ఇలా.. 2026–2027 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తు నమోదు ప్రక్రియ మొదలైంది. ఫీజు ఏడాదికి రూ.3,400 ఆన్లైన్లో చెల్లించాలి. పరీక్ష ఫీజు ప్రతీ సబ్జెక్టు పేపరుకు అదనంగా చెల్లించాలి. దరఖాస్తుకు జత చేసి పత్రాలను అధ్యయన సెంటర్లో ఇవ్వాలి. బుక్స్ కోసం రూ.500 చెల్లిస్తే పోస్టు ద్వారా ఇంటికి వస్తాయి. -
భారంగా ఎరువులు
చందుర్తి(వేములవాడ): దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎప్పుడూ దోపిడీకి గురవుతూనే ఉన్నాడు. పంట పండించినప్పటి నుంచి మార్కెట్లో విక్రయించే వరకు రైతుమాట చెల్లడం లేదు. వ్యాపారులు చెప్పిందే అన్నదాతలు వినాల్సి వస్తోంది. ఎరువల వ్యాపారులు రైతులను అడ్డగోలుగా దోచేస్తున్నారు. డీఏపీ, యూరియా ఎరువులు మినహా మిగతా కాంప్లెక్స్, ఇతర ఎరువుల ధరలు బస్తాకు రూ.700లకు పైగా చేరుకున్నాయి. దుక్కిలో వేసేందుకు ఎక్కువగా డీఏపీ ఎరువులను వినియోగిస్తారు. డీఏపీ బస్తా రూ.1350 ఉండగా.. డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఈ బస్తా కావాలంటే వారు చెప్పిన వేరే ఎరువు బస్తా కొనాల్సిందే. లేకుంటే డీఏపీ బస్తాలు లేవంటున్నారు. డీఏపీ బస్తాకు లింక్‌గా న్యూట్రియంట్స్, నానో డీఏపీ లేదంటే ఆర్గానిక్ ఎరువుల బస్తాలను అంటగడుతున్నారు. రైతులపై భారం ఎరువుల ధరలు అమాంతం పెరడగంతో రైతులపై భారం పడుతుంది. పశ్చిమాసియా యుద్ధంతో ఎరువుల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎరువులకు వినియోగించే ముడిసరుకుల ధరలు పెరగడంతో కాంపెక్స్ ఎరువుల ధర రూ.300 నుంచి రూ.750 వరకు పెరిగాయి. రైతులు ఎక్కువగా వినియోగించే 20–20–0–23 కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర రూ.1450 నుంచి రూ.2150 వరకు పెరిగింది. మ్యూరేట్ ఆఫ్ పొటాస్ రూ.1,750 నుంచి రూ.2,150కి పెరిగింది. 28–28–0 ధర రూ.1800 నుంచి రూ.2,300లకు, సింగిల్ సూపర్ పాస్పేట్ మాత్రం రూ.650 నుంచి రూ.775కు పెరిగింది. పంటల సాగులో యాంత్రీకరణ పెరగడంతో రైతుకు పెట్టుబడి ఖర్చు 40 నుంచి 50 శాతం వరకు పెరిగింది. -
స్థలం కావలెను !
వేములవాడ: వేములవాడలోని ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం కరువైంది. పట్టణంలోని మండల పరిషత్ ప్రాంగణంలో 7.5 ఎకరాలు ఉన్నప్పటికీ ఇప్పటికే ఉన్న కార్యాలయాల భవనాలతో ఖాళీ స్థలం లేదు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో అధికారులు జాగ అన్వేషణలో పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండొద్దన్న జీవోతో భవన నిర్మాణాల కోసం స్థలాన్ని వెతుకుతున్నారు. అయితే పట్టణంలో స్థలం లేకపోవడంతో శివారు ప్రాంతాల్లో అన్వేషిస్తున్నారు. మండల పరిషత్‌లో కనిపించని జాగ వేములవాడ మండల పరిషత్ ప్రాంగణంలోని 7.5 ఎకరాల్లో ఇప్పటికే పలు భవనాలు నిర్మించారు. ఈ ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాలు, పలు సంఘాల భవనాలు, కళామందిరం, క్వార్టర్లు, ఓపెన్‌జిమ్, పార్కు నిర్మించారు. అయితే ఇవి క్రమపద్ధతిలో కాకుండా ఇష్టారీతిగా నిర్మించడంతో ఖాళీ స్థలం కరువైంది. ఇటీవల కలెక్టర్ గరీమా అగ్రవాల్, అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో కుమారి, తహసీల్దార్ జయంత్ తిప్పాపూర్ ప్రాంతంలోని పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. -
డీఏపీని యాప్‌లో విక్రయించాలి
వ్యాపారులు డీఏపీ కొరత సృష్టించకుండా యూరియా తరహాలోనే యాప్‌లో విక్రయించాలి. కాంప్లెక్స్ ఎరువుల ధరలు రూ.2వేలకు పైగా ఉండడంతో డీఏపీ ధర రూ.1350గా ఉంది. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని డీఏపీ కొరత సృష్టిస్తూ.. ఇతరు ఎరువులు అంటగడుతున్నారు. – చిలుక పెంటయ్య, రైతు సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు, చందుర్తి రైతులు అడిగిందే ఇవ్వాలి రైతులు అడిగిందే వ్యాపారులు ఇవ్వాలి. అలా కాకుండా బలవంతంగా ఇతర ఎరువులు అంటగడుతున్నట్లు ఫిర్యాదులు వస్తే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఫిర్యాదు వచ్చిన ముగ్గురు డీలర్లపై చర్యలు తీసుకున్నాం. డీలర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు లింక్‌తో ఏమైనా ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. – అఫ్జల్‌బేగం, జిల్లా వ్యవసాయాధికారి -
ఆత్మబంధువు!
స్నేహ బిందువు.. జగిత్యాల: స్నేహబంధం చాలా గొప్పది. ఓపెన్‌గా మాట్లాడుకోవడం, ఏ సమస్య ఉన్నా చెప్పుకోవడం ఒక స్నేహితులతోనే ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ కడలి జయకృష్ణ. బీటెక్ పూర్తయ్యాక అమెరికాలో స్థిరపడదామని అనుకున్న. జయకృష్ణ వాళ్ల అక్కయ్య ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఆ సమయంలో జయకృష్ణ నన్ను ఐఏఎస్‌కు ప్రిపేర్ కావాలని సూచనలు ఇచ్చాడు. అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ వెళ్లి జయకృష్ణ వాళ్ల అక్కయ్య ప్రోత్సాహంతో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యా. ఐఏఎస్ రావడంలో ఒకింత జయకృష్ణ పాత్ర కూడా ఉంది. జయకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటాం. – సత్యప్రసాద్, కలెక్టర్, జగిత్యాలసప్తగిరికాలనీ(కరీంనగర్): ఒకప్పుడు స్నేహమంటే ఒకే బెంచ్, ఒకే వీధి, ఒకే ఊరు. ఇప్పుడు స్నేహమంటే ఒకే స్క్రీన్, ఒకే గ్రూప్, ఒకే వీడియో కాల్. కాలంతో పాటు మనుషులు మారారు. స్నేహం కొత్త రూపం దాల్చింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ నేటితరం జీవితంలో నిజమైన దోస్త్‌గా మారాయి. చిన్ననాటి స్నేహితులను మళ్లీ కలిపే వేదికగా, కొత్త పరిచయాలకు పునాదులుగా మారుతున్నాయి. సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొచ్చింది. పుట్టినరోజు శుభాకాంక్షలు, జ్ఞాపకాల ఫొటోలు, రీయూనియన్లు.. ఇవన్నీ డిజిటల్ వేదికలతో సాధ్యమయ్యాయి. వాట్సాప్‌లో వచ్చిన ఒక మెసేజ్‌తో రక్తదానం చేసిన స్నేహితులు, క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.లక్షలు సేకరించి వైద్యం చేయించినవారు.. వరదలు, ప్రమాదాల సమయంలో తమ ప్రాణా లను సైతం ఫణంగా పెట్టి స్నేహితులను కాపాడిన ఘటనలు నిజమైన స్నేహానికి నిర్వచనాలు.బంధంగా పుట్టకపోయినా.. అనుబంధంగా రూపుదిద్దుకుని.. కలిసిన సమయం నుంచి.. కడదాకా నీడనిచ్చేదే స్నేహం..! అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాన్ని ఇస్తాడు.. స్నేహితుడు బతుకుదారి చూపుతాడు..!! బుడిబుడి అడుగులతో మొదలయ్యే స్నేహం జీవిత చరమాంకం వరకు కొనసాగుతుంది. బడిబాటతో ముడిపడి.. జీవితంలో స్థిరపడే వరకు వెన్నంటే నడుస్తుంది. ఒకసారి ఫ్రెండ్ అనుకుంటే జీవితకాలం కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తారు. అందుకే స్నేహమంటే రెండక్షరాల పదమే కాదు.. రెండు హృదయాల బంధం.. ఈ ప్రపంచంలో స్నేహితులు లేని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఫ్రెండ్షిప్కు మారుపేరుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. ఒకేచోట చదువుకుని.. ఒకే వృత్తిలో కొనసాగుతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. స్నేహితులూ ముఖ్యమంటున్నారు. పలువురు తమ స్నేహానికి గుర్తుకు నెలకోసారి కలుసుకుంటున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా కథనం.సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన ప్రముఖ వైద్యులు పి.పెంచలయ్య, ఎన్.వి.రమణరావు, పి.చంద్రశేఖర్ 42ఏళ్ల కిందట మెడిసిన్ చదువుతున్న రోజుల్లో కర్నూల్ మెడికల్ కాలేజీలో స్నేహితులయ్యారు. ముగ్గురు పుట్టి పెరిగిన జిల్లాలు వేరైనా ప్రభుత్వ డాక్టర్లుగా సిరిసిల్లలో స్థిరపడ్డారు. కడపకు చెందిన పెంచలయ్య, నెల్లూరు జిల్లా సర్వేపల్లి మండలం నిడిగుంటపాలెం చెందిన రమణరావు, నెల్లూరు పట్టణానికి చెందిన చంద్రశేఖర్‌కు ఎంబీబీఎస్ కాలేజీ ఫంక్షన్లో స్నేహం కలిసింది. పెంచలయ్య, చంద్రశేఖర్ 1993లో, 1995లో రమణరావు సిరిసిల్లకు వచ్చారు. ఇప్పుడు సర్జన్‌గా పెంచలయ్య, ఆర్థోపెడిక్‌గా రమణరావు, డీఎంహెచ్‌వోగా చంద్రశేఖర్ మంచి గుర్తింపు పొంది ఉద్యోగ విమరణ చేశారు.ఇల్లంతకుంట: ఇల్లంతకుంట పాఠశాలలో ఒకే బెంచీపై కూర్చుని 10వ తరగతి వరకు చదువుకున్న ఇద్దరు మిత్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామానికి చెందిన గుర్రం సందీప్ రెడ్డి, మల్లారం గ్రామానికి చెందిన సింగిరెడ్డి రమణారెడ్డి పదోతరగతి వరకు కలిసి చదువుకున్నారు. గుర్రం సందీప్‌రెడ్డి 2002లో ఉపాధ్యాయుడిగా ఎంపికై , పెద్ద లింగాపూర్‌లో పనిచేస్తున్నాడు. సింగిరెడ్డి మనోహర్‌రెడ్డి 2005లో ఉపాధ్యాయుడిగా ఎంపికై స్కూల్ అసిస్టెంట్‌గా సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నాడు. ఇప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. -
హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం
సిరిసిల్ల: హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.తుకారాంజీ శనివారం సిరిసిల్లకు వచ్చారు. స్థానిక పంచాయతీరాజ్ గెస్ట్‌హౌస్‌లో జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి.పుష్పలత, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే పూలమొక్కలతో స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న న్యాయస్థాన భవనాలను పరిశీలించారు. పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు పి.లక్ష్మణాచారి, అజయ్‌కుమార్‌జాదవ్, జూనియర్ సివిల్ జడ్జి జి.మేఘన, ఆర్డీవో శ్రీధర్‌బాబు, డీఎస్పీ నాగేంద్రచారి, ఎస్బీ డీఎస్పీ జి.వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఎస్.మహేశ్ పాల్గొన్నారు. -
యువత ‘మై భారత్ పోర్టల్’లో నమోదు కావాలి
సిరిసిల్ల: జిల్లాలోని యువత ‘మై భారత్ పోర్టల్’లో నమోదు కావాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. కలెక్టరేట్లో శనివారం మై భారత్ జిల్లా సలహా కమిటీ సమావేశం జరిగింది. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మై భారత్ నమోదు డ్రైవ్‌కు సంబంధించి యువకుల్లో అవగాహన పెంచాలన్నారు. నమోదు లక్ష్యాలను సాధించేందుకు ప్రచారం చేపట్టాలన్నారు. మై భారత్ ఉమ్మడి జిల్లా అధికారి గోలి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న మై భారత్ ఇంటెన్సివ్ నమోదు, అవగాహన డ్రైవ్ జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగుతుందన్నారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జెడ్పీ సీఈవో వెంకట మాధవరావు, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, జిల్లా విద్యాధికారి మొండయ్య, డీపీఆర్వో శ్రీనివాసాచారి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రాందాస్, డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్, మైభారత్ జిల్లా కార్యక్రమ అధికారికిరణ్కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ పాల్గొన్నారు. -
వరి వద్దు.. ఆరుతడి ముద్దు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలకు తొందరపడి వరినాట్లు వేసి రైతులు నష్టపోవద్దని, తక్కువ నీటితో ఎక్కు వ ఆదాయాన్ని ఇచ్చే ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం కోరారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో శనివారం ప్రకృతి వ్యవసాయపద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్న రైతులు సందిరి శ్రీనివాస్, దానవేణి పెద్దయ్యల తో టలు పరిశీలించారు. ఎకరం వరికి అయ్యే నీటితో మూడెకరాల్లో ఆరుతడి పంటలు లేదా కూరగాయలు పండించవచ్చన్నారు. ప్రతీ వర్షపు బొట్టునూ భూమిలోనే ఇంకించేందుకు ఫామ్‌పాండ్ లేదా బోర్వెల్ రీచార్జ్ ఫిట్ తవ్వుకోవాలని సూచించారు. ఎంఏవో సంజీవ్, ఏఈవో గంగా, మండెపల్లి సర్పంచ్ గాదగోని సాగర్ పాల్గొన్నారు. నైపుణ్యాలతోనే ఆపద నివారణ సిరిసిల్ల అర్బన్: డిజాస్టర్ మేనేజ్మెంట్లో నైపుణ్యాలతోనే ఆపదలను నివారించవచ్చని 17వ బెటాలియన్ కమాండెంట్ పీజేపీసీ ఛటర్జీ పేర్కొన్నారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణ శనివారం ముగిసింది. కమాండెంట్ ఛటర్జీ మాట్లాడుతూ విపత్తులు, వరదలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది కీలకమన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో అమలు చేయాలని సూచించారు. శిక్షణను పూర్తి చేసిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌కు చెందిన 31 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అసిస్టెంట్ కమాండెంట్స్ సంజీవరెడ్డి, ఎస్డీఆర్ఎఫ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన డిజిటల్ విద్యనందించాలిసిరిసిల్లటౌన్: కేజీబీవీల్లో విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యను బోధించాలని జిల్లా విద్యాధికారి, సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి మొండయ్య సూచించారు. కస్తూ ర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్)లో భాగంగా ల్యాప్టాప్స్ అందించి మాట్లాడారు. వైఐఐఏఈ అమలుకు రాష్ట్ర కార్యాలయం ప్రభుత్వం పది ల్యాప్టాప్స్ కే టాయించినట్లు తెలిపారు. వైఐఐఏఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్నారు. విద్యార్థులకు మెరుగైన బోధన–అభ్యాస ప్రక్రియలో సమర్థంగా వినియోగించేందుకు ఈ ల్యాప్టాప్స్ ఎంతో దోహదపడతాయన్నారు. ఫీజుల వివరాలు ప్రదర్శించాలివేములవాడ: ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజుల వివరాలు ప్రదర్శించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు. వేములవాడలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్, స్కానింగ్ సెంటర్లను శనివారం తనిఖీ చేశారు. బయో మెడికల్ వేస్ట్ సర్టిఫికెట్, పొల్యూషన్ సర్టిఫికెట్స్, వైద్యుల వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమన్నారు. స్కానింగ్ వివరాలను ఏరోజుకారోజు ఆన్లైన్ చేయాలన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రెండు డయాగ్నోస్టిక్ సెంటర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. సెక్షన్ ఇన్చార్జి మహేశ్ ఉన్నారు. చట్టాల రద్దుకు కేంద్రం కుట్రముస్తాబాద్(సిరిసిల్ల): పోరాడి సాధించుకున్న కార్మిక, కర్షక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే కుట్ర చేస్తోందని సీడబ్ల్యూఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస భిక్షపతి ఆరోపించారు. జైల్‌భరో కార్యక్రమ పోస్టర్లను శనివారం ముస్తాబాద్‌లో ఆవిష్కరించారు. సీపీఎం మండల కన్వీనర్ కట్కూరి నరేశ్, ఎడ్ల రమేశ్, యాదగిరి, బాలయ్య, ప్రవీణ్, రాజయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. -
108 కలశాలతో అభిషేకం
వేములవాడ: సంవృద్ధిగా వర్షాలు కురవాలని వేములవాడ రాజన్న క్షేత్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న వరుణయాగం శనివారం పూర్ణాహుతితో ముగిసింది. రాష్ట్రంలో నెలకొన్న అనావృష్టి పరిస్థితులు తొలగిపోవాలని సంకల్పించి ఈ మహాయాగం నిర్వహించారు. ఇందులో భాగంగా రుష్యశృంగ మహర్షి ప్రతిష్ఠ, దేవతా పూజలు, గౌరీ పూజలు చేశారు. 108 కలశాలతో ప్రత్యేకాభిషేకాలు చేశారు. ఆలయ ఈవో రమాదేవి, ఏఈవో జయకుమారి, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ వేదికగా స్నేహం చిగురించి..
కరీంనగర్ అర్బన్: కరీంనగర్‌లోని కలెక్టరేట్లో రెవెన్యూ విభాగంలో పనిచేసే నాయబ్ తహసీల్దార్ నేరేళ్ల కిషన్, భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండల తహసీల్దార్ కుంబాల రవికుమార్, మైన్స్‌లో నాయబ్ తహసీల్దార్(ఎపిక్) భూషణబోయిన రాకేశ్‌కుమార్, వెల్ది ప్రభుత్వ వైద్యశాలలో సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల వసంత్, నిజామాబాద్ జిల్లా రూరల్ నాయబ్ తహసీల్దార్ వినయ్‌సాగర్ 2012లో కరీంనగర్ కలెక్టరేట్లో ఉద్యోగులే. జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నప్పుడే చిగురించిన వీరి స్నేహం కష్టసుఖాల్లోనూ తోడునీడగా నిలుస్తోంది. ఉద్యోగ రీత్యా మొదలైన స్నేహం ఆదర్శంగా నిలుస్తోంది. -
‘సకుటుంబ’ స్నేహితులు
కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణానికి చెందిన గుర్రాల అమరేందర్, తడుక వెంకటరమణ, శ్రీపతి రమేశ్, జోగిన్‌పెల్లి కృష్ణమోహన్‌రావు, ఖాందేశి ఉత్తమ్‌కుమార్, తిరుమల శ్రీధర్, రాచకొండ వెంకటేశ్, జిల్లా ధనుంజయ్, మండలోజు నరేందర్, రుద్రంగికి చెందిన రానవేని శ్రీనివాస్, వెగ్యారపు చంద్రశేఖర్, ఆకుల గంగాధర్ చిన్నతనం నుంచి స్నేహితులు. వీరు వివిధ ప్రాంతాల్లో వృత్తి, ఉద్యోగరీత్యా కొనసాగుతున్నా ప్రతినెల 10వ తేదీన గత 26ఏళ్లుగా కలుసుకుంటున్నారు. ప్రతి స్నేహితుడి పెళ్లిరోజు ఆరు గ్రాముల బంగారం కానుకగా ఇస్తున్నారు. మూడేళ్లకోసారి సకుటుంబ సమేతంగా తీర్థయాత్రకు వెళ్లి తమ అనుబంధాలను కాపాడుకుంటున్నారు. -
నా బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ చవాన్
సిరిసిల్ల: నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. బెస్ట్ ఫ్రెండ్ ఎవరని చెప్పడం కష్టమే. మహారాష్ట్రలో నా బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ చవాన్ ఉన్నారు. మేం 14 ఏళ్లుగా స్నేహితులం. నా కాలేజీ రోజుల్లో రూమ్మేట్. అనుకోకుండా ఓ సారి అనారోగ్యం బారిన పడ్డారు. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయిస్తే కేన్సర్‌గా తేలింది. ఆ సమయంలో నేను అతనికి, అతని కుటుంబానికి అండగా నిలబడ్డాను. అప్పుడు ఐపీఎస్ కాలేదు. కానీ రూ.6లక్షల వరకు ఆర్థిక సాయం అందించాను. పృఽథ్వీరాజ్ చవాన్ ఇప్పుడు కేన్సర్ నుంచి కోలుకున్నారు. సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికీ మేం ఫోన్లో మాట్లాడుకుంటాం. – మహేశ్ బి గితే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల -
గెరువిచ్చి.. కురిసిన వాన
సిరిసిల్ల: జిల్లాలో నాలుగో రోజు శుక్రవారం వర్షం గెరువిచ్చి అంతలోనే కురిసింది. కోనరావుపేట, వీర్నపల్లి మండలాల్లో సాధారణం కంటే అధికం, ఇల్లంతకుంటలో లోటు, మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రోడ్డెక్కిన మురికినీరు జిల్లా కేంద్రంలోని నేతన్నచౌక్ వద్ద మురికినీరు రోడ్డుపైకొచ్చింది. సంజీవయ్య విగ్రహం వద్ద వరద పెరగడంతో పోలీసులు బారీకేడ్లు పెట్టారు. మధ్యమానేరులోకి పంపింగ్ మధ్యమానేరులోకి ఎల్లంపల్లి ద్వారా నీటి పంపింగ్ కొనసాగుతోంది. 17,867 క్యూసెక్కులు వరదకాల్వ ద్వారా వస్తోంది. 27.55 సామర్థ్యం గల మిడ్‌మానేరులో ప్రస్తుతం 9.691 టీఎంసీల నీరుంది. గంభీరావుపేట ఎగువ మానేరులోకి పాల్వంచవాగు, కూడెల్లి వాగు ద్వారా 2,590 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ జలాశయంలో ప్రస్తుతం 1.47 టీఎంసీల నీరుంది. నిండిన మూలవాగు జలాశయం కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు జలాశయం నిండి మత్తడి పారుతోంది. దీని ద్వారా నిమ్మపల్లి, వట్టిమల్ల, కొండాపూర్‌లోని ఆయకట్టు భూములకు సాగునీరు అందిస్తుంది. జిల్లాలోని 656 చెరువుల్లోకి కొద్దిగా వరద చేరుతోంది. కూలిన ఇళ్లు బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన మల్కూరి శంకరయ్య, వీర్నపల్లి మండలం బంజేరుకు చెందిన పసుల బాబాయి, వీర్నపల్లికి చెందిన పడకాపురం అంజవ్వ ఇళ్లు కూలిపోయాయి. -
జపాన్‌లో తెలంగాణ యువతకు ఉపాధి
● మండెపల్లి ఐటీడీఆర్‌ను సందర్శించిన జపాన్ ‘హనా విస్టా’ ప్రతినిధులు తంగళ్లపల్లి(సిరిసిల్ల): నైపుణ్యంగల భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కీలక అడుగుపడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని ఐడీటీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను జపాన్‌కు చెందిన ‘హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. ఇనిస్టిట్యూట్‌లోని డ్రైవింగ్ శిక్షణ విధానాలు, మౌలిక సదుపాయాలు, ఆధునిక శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, శిక్షణ వాతావరణాన్ని ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించారు. దీర్ఘకాలిక భాగస్వామ్యానికి ఆసక్తి ఈ సందర్భంగా ‘హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రతినిధులు మాట్లాడుతూ.. భారతీయ డ్రైవర్లను అంతర్జాతీయస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది, జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం మండెపల్లి ఐడీటీఆర్తో దీర్ఘకాలిక భాగస్వామ్యం ఏర్పరచుకోవడానికి ఉత్సుకత వ్యక్తం చేశారు. జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్, మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, ఐడీటీఆర్ ప్రిన్సిపాల్ దురయ్ మురుగన్ పాల్గొన్నారు. -
యూనిఫాం పిలుస్తోంది!
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న యువతకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీజీఎస్ఎల్ పీఆర్బీ) తీపి కబురు తీసుకొచ్చింది. కొన్ని నెలలుగా పోలీసు కొలువు కోసం ఎదురుచూస్తున్న యువత తాజా నోటిఫికేషన్‌తో సాధనను కఠినం చేశారు. పోలీస్ విభాగంలో మల్టీజోన్–1లో ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల– రాజన్న జోన్), జగిత్యాల– బాసర జోన్, పెద్దపల్లి– కాళేశ్వరం జోన్ పరిధిలోకి వస్తాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో వివిధ విభాగాల ఎస్సై, కానిస్టేబుళ్ల ఖాళీలకు కలిపి మొత్తం 1,061 పోస్టులు భర్తీ చేయనుంది.(ఇందులో రామగుండం కమిషనరేట్‌లోని మంచిర్యాల జిల్లా పోస్టులు కూడా ఉన్నాయి.) ఈ నేపథ్యంలో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలతో ‘సాక్షి’ కథనం. – సాక్షిప్రతినిధి,కరీంనగర్ -
44 కేసుల్లో 66 మందికి శిక్ష
● ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల: సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల సేకరణ, వేగవంతమైన విచారణతో నిందితులకు శిక్షలు పడేలా జిల్లా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఆరు నెలల్లో 44 కేసుల్లో 66 మందికి జైలుశిక్ష విధించాయి. నిందితులకు శిక్ష పడేలా కృషిచేస్తున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రశంసాపత్రాలు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో జరిగిన ఐదు హత్య కేసుల్లో 19 మందికి యావజ్జీవం పడిందని తెలిపారు. మరో మూడు కేసుల్లో 20 ఏళ్ల జైలు, మరో కేసులో నిందితులకు పదేళ్లు, ఇంకో ఏడు కేసుల్లో 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్షలు పడ్డాయని వివరించారు. ఇలా జిల్లాలో మరో 17 కేసుల్లో నిందితులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష, పది కేసుల్లో ఏడాది జైలు శిక్ష పడినట్లు ఎస్పీ వెల్లగించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, కోర్టు మానిటరింగ్ ఎస్సైలు రవీంద్రనాయుడు, శ్రావణ్‌యాదవ్, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
అభివృద్ధిపై చర్చ.. అవినీతిపై రచ్చ
సిరిసిల్లటౌన్: అభివృద్ధి పనులపై చర్చ.. అవినీ తి ఆరోపణలపై వాదనలు.. కౌన్సిలర్ల పట్ల అ మర్యాదకర వ్యా ఖ్యలు వంటి అంశాలతో సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రచ్చగా మారింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్‌చైర్మన్‌పై ప్రతిపక్షాలు ఆక్షేపణలు చేశాయి. శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అధ్యక్షతన జరిగిన సమావేశం గరం గరంగా సాగింది. 25 అంశాలతో రూపొందించిన ఎజెండాలో 24 అంశాలను ఆమోదించారు. వినాయక చవితికి నిధులు వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లకు రూ.20లక్షలు కేటాయించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ తెలిపారు. మున్సిపల్ సమావేశం అనంతరం చాంబర్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సిరిసిల్లలోని పవర్‌బోర్ల చుట్టూ ఇంకుడుగుంతలు నిర్మించాలని తీర్మానించారు. డంపింగ్‌యార్డ్ అభివృద్ధి పరిచేందుకు షెడ్డుల నిర్మాణం, సీసీ ప్లాట్‌ఫామ్స్, ఇంటర్నల్ సీసీ రోడ్డు పనులకు రూ.80 లక్షలు, ఎలక్ట్రికల్ ఆటోలు, ఒక ప్రొక్లెయిన్ కొనుగోలుకు రూ.50 లక్షలు, రోడ్లు, డ్రైనేజీల మరమ్మతు పనులు చేపట్టేందుకు రూ.16.55లక్షలు, ఇంకుడుగుంతల నిర్మాణానికి రూ.30లక్షలు, దోమల నివారణకు కెమికల్స్, స్ప్రేయింగ్ మిషన్స్ కొనుగోలుకు రూ.1.80 లక్షలు కేటాయిస్తూ పరిపాలనపరమైన మంజూరు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఖాదిర్పాషా, వైస్‌చైర్మన్ దార్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ -
అక్రమ నిర్మాణాలు అడ్డుకుంటాం
● రసాభాసగా వేములవాడ మున్సిపల్ సమావేశంవేములవాడ/వేములవాడరూరల్: పట్టణంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామని, రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. శుక్రవారం చైర్మన్ పుల్కం రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూపొందించిన 36 అంశాలతో కూడిన ఎజెండా ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపాలిటీలో వాహనాల మరమ్మతుల పేరుతో ప్రతి నెల అదనపు బిల్లులు పెడుతున్నారని పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన వాహనాలు ఉన్నప్పటికీ వాటికి మరమ్మతులు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు. 853 సర్వేనంబర్‌లో నూతన బస్టాండ్ కోసం గత ప్రభుత్వం 20 ఎకరాలు కేటాయించగా దానిని గెజిట్‌లో ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చారని పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ లోకేశ్, మేనేజర్ సంపత్‌రెడ్డి, వైస్‌చైర్మన్ నరాల శేఖర్ పాల్గొన్నారు. ఇండోర్ స్టడీటూర్‌కు.. సమావేశం అనంతరం చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ రాబోయే వినాయక చవితి పండుగకు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఇండోర్ స్టడీటూర్‌కు కౌన్సిలర్లను తీసుకెళ్లాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల కౌన్సిలర్లను కలుపుకొని పట్టణాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించడమే తమ ధ్యేయమన్నారు. నిషేధిత సర్వే నంబర్లలో అనుమతులు ఎలా ఇస్తారు? బీఆర్ఎస్ కౌన్సిలర్ రామతీర్థపు మాధవి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లలో నిర్మాణా లకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. పట్టణంలో మరణ ధ్రువీకరణపత్రాల కోసం ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కౌన్సిలర్ వెంగళ అనిత మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్‌తోపాటు పురపాలకశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బీజేపీ కౌన్సిలర్ వంగల శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలో ఎటు చూసినా అక్రమ నిర్మాణాలే కనిపిస్తున్నాయన్నారు. -
ప్రణాళికతో సన్నద్ధం కావాలి
పోలీస్ ఉద్యోగం ఉపాధి మాత్రమే కాదు. సమాజ సేవకు లభించే గౌరవప్రదమైన వేదిక. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవడంతో పాటు శారీరక దారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రోజువారీ వ్యాయామం, రన్నింగ్, క్రమశిక్షణతో కూడిన సాధన, మాక్ టెస్టులు విజయానికి కీలకం. సోషల్ మీడియా, వదంతులను నమ్మకుండా అధికారిక నోటిఫికేషన్‌లోని నిబంధనలను పూర్తిగా అధ్యయనం చేయాలి. సరైన మార్గదర్శకత్వంతో సిద్ధమైతే ఈ అవకాశాన్ని ఉద్యోగంగా మార్చుకోవచ్చు. – ఎన్.వెంకట్‌రెడ్డి, డ్రీమ్ డిఫెన్స్ అకాడమీ కరస్పాండెంట్, కరీంనగర్ -
యువతకు శుభవార్త
నిరుద్యోగులకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఒక శుభవార్త. యూనిఫాం జాబ్ కోరుకునే ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రణాళికతో రాత పరీక్ష కోసం చదవడంతో పాటు శారీరక దృఢత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి ఆహార అలవాట్లతో ఈవెంట్స్ సులభంగా సాధించవచ్చు. సెల్ఫోన్లు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. పోలీస్ ఉద్యోగాలకు మా అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. – ఎర్రంశెట్టి మునీందర్, చైర్మన్, సాన్వీ డిఫెన్స్ అకాడమీ, రేకుర్తి -
పర్యాటకాభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి
● ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: వేములవాడలో పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు వారంలోగా సిద్ధం చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం సమీక్షించారు. వేములవాడలో భక్తులకు, పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ఈవో రమాదేవి, స్వదేశ్ దర్శన్ ప్రాజెక్టు మేనేజర్ రామకృష్ణ, ఆర్అండ్బీ ఎస్ఈ భీమ్లానాయక్, క్షేత్ర ఆర్కిటెక్ట్ తేజ, పర్యాటక శాఖ ఏఈ జీవన్ పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి ఎల్‌నినో ప్రభావంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలు, తెలంగాణ జలసిరి పనులు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల్లో భూగర్భ జలాల పరిస్థితిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్, ఇతర విద్యాలయాల్లో ఇంకుడుగుంతలు ఉండాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు బోర్‌వెల్స్ రీచార్జ్ పనులు ముమ్మరంగా చేయించాలని తెలిపారు. హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, జిల్లా పంచాయతీ అధికారి జయశీల పాల్గొన్నారు. -
‘ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి’
సిరిసిల్ల: ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సృజన్ పిల్లల ఆస్పత్రిని శుక్రవారం తనిఖీ చేశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ అవసరం లేని వైద్యపరీక్షలు, శస్త్రచికిత్సలు చేయకుండా వైద్యులు నైతిక విలువలను పాటించాలన్నారు. ఆస్పత్రి పిల్లల డాక్టర్ కందేపి ప్రసాదరావు పాల్గొన్నారు. సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ కోనరావుపేట(వేములవాడ): గ్రామాల్లో సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రణలోకి వస్తాయని వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని గొల్లపల్లి, కమ్మరిపేట తండాల్లో శుక్రవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 39 బైక్‌లను గుర్తించి, పత్రాలు సమర్పించి తీసుకెళ్లాలని సూచించారు. చందుర్తి సీఐ రవీందర్, ఎస్సైలు ప్రశాంత్‌రెడ్డి, రమేశ్, మోతిలాల్ ఉన్నారు. వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి సిరిసిల్లటౌన్: వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు కోరారు. స్థానిక బి.వై.నగర్‌లోని సీఐటీయూ కార్మిక భవన్లో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నా యకుల సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. వస్త్రపరిశ్రమకు ప్రధాన కేంద్రమైన సిరిసిల్లలో ఆగస్టు 23న సీఐటీయూ అఖిల భారత టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాయకులు కూరపాటి రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, జిల్లా కార్యదర్శి సిరిమల్ల సత్యం పాల్గొన్నారు. ‘పే స్కేల్ అమలు చేయాలి’ సిరిసిల్ల అర్బన్: తమ డిమాండ్లు పరిష్కరించి, పేస్కేల్ అమలు చేసే వరకు ఉద్యమిస్తామని వీబీ–జీ రామ్ జీ ఉద్యోగుల జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గుడిసెల రమేశ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ వద్ద శుక్రవా రం నిరసన తెలిపారు. కలెక్టర్, డీఆర్డీవో, డీపీవో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ, పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ఎం.ఎ.జమీల్, రాపోలు నాగరాజు, ఎస్కే పాషా, శ్రీనివాస్, అరుణ్, తిరుమలేశ్, వెంకటేశ్, గంగజల, మాధవి, అశ్విని, తబిత, వనజ పాల్గొన్నారు. -
నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి
సిరిసిల్ల: నేతన్నలు గర్వపడేలా సిరిసిల్ల కూడలిని అభివృద్ధి చేశారని రాష్ట్ర మార్కెటింగ్, వ్యవసాయ, చేనేత జౌళి, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కలెక్టరేట్ వద్ద రూ.3.22 కోట్లతో కూడలి అభివృద్ధి, సుందరీకరణ పనులను మోడల్ బస్షెల్టర్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలతో కలిసి గురువారం ప్రారంభించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ నేతన్నలకు ఏడాది పొడవునా పని కల్పించేందుకు గత రెండేళ్లలో రూ.1,360 కోట్లు అందించామన్నారు. జిల్లాలో నూలు డిపోను ఏర్పాటు చేశామన్నారు. సిరిసిల్ల ప్రత్యేకతను చాటేలా.. రవాణాశాఖ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సిరిసిల్లలో నాణ్యమైన ఇందిరా మహిళాశక్తి చీరలు తయారవుతున్నాయన్నా రు. అందుబాటు ధరలో మోడల్ చీరను తయారు చేసి.. జీఐ ట్యాగ్ వచ్చేలా కృషి చేయాలన్నారు. అభివృద్ధికి పూర్తి సహకారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుతోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు సిరిసిల్ల ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. నాణ్యమైన చీరల ఉత్పత్తికి శ్రీకారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమలో పేరుకుపోయిన బకాయిలను దశలవారీగా విడుదల చేసి నేతన్నల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు. 2024–25లో 6.80 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చామని, ఈ ఏడాది మరో 3 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చామన్నారు. మరో 3 కోట్లకు పైగా మీటర్ల చీరల ఉత్పత్తికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఇటీవల రూ.62కోట్ల బిల్లులు చెల్లించామని, 25 హెచ్‌పీ పవర్లూమ్లకు 50 శాతం విద్యుత్ రాయితీ అమలు చేస్తున్నామని వివరించారు. భక్తులు సేదతీరేలా ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ వేములవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులు సేదతీరేలా గుడిచెరువు బండ్ పార్క్ పనులు చేశామన్నారు. రగుడు కూడలి సుందరీకరణ పనులు, రోడ్డు విస్తరణ చేసినట్లు తెలిపారు. త్రిఫ్ట్ ఫండ్ పథకంలో నేతన్నలకు ఆర్డీ కార్డులను పంపిణీ చేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కాంగ్రెస్ నాయకులు కె.కె.మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, ఏఎంసీ చైర్పర్సన్ స్వరూప, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు.వేములవాడ/వేములవాడఅర్బన్: సమృద్ధిగా వర్షాలు కురిసి.. రైతులు బాగుపడాలని జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోరారు. వేములవాడలో గురువారం వరుణయాగానికి హాజరవడంతోపాటు గుడిచెరువుపై పలు అభివృద్ధి పనులను రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలిసి గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, సంజయ్‌కుమార్ హాజరయ్యారు. వీరికి విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే స్వాగతం పలికారు. ట్యాంక్‌బండ్.. బస్టాండు ఆధునీకరణ పనులు ప్రారంభం రాజన్న గుడిచెరువు కట్టపై రూ.12కోట్లతో నిర్మించిన ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించారు. అనంతరం తిప్పాపూర్ బస్టాండును రూ.1.60కోట్లతో ఆధునీకరించే పనులకు శంకుస్థాపన చేశారు. వేములవాడ–బాసర బస్సును ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వేములవాడ బస్టాండ్‌కు నిత్యం 250 బస్సులు..560 ట్రిప్పులు నడుస్తున్నాయన్నారు. రోజుకు 50వేల మంది ప్రయాణిస్తున్నారని వివరించారు. ఈ బస్టాండ్‌ను రూ.1.62 కోట్లతో ఆధునికీరిస్తున్నామని తెలిపారు. ఈవో రమాదేవి, అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో కేఎస్బీ కుమారి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, డీఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ లోకేశ్, తహసీల్దార్ జయంత్ పాల్గొన్నారు. -
వేగంగా ‘సర్’
ముస్తాబాద్(సిరిసిల్ల): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 90 శాతం పూర్తి కానుంది. ఖచ్చితమైన ఓటరు జాబితా కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం సర్‌కు గడువు మరో మూడు రోజులే మిగిలి ఉంది. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 574 పోలింగ్ కేంద్రాల్లోని ఓటర్ల వివరాలు నమోదు చేస్తున్నారు. మానకొండూరు పరిధిలోకి వచ్చే ఇల్లంతకుంట, చొప్పదండి పరిధిలోకి వచ్చే బోయినపల్లి మండలాల్లోనూ సర్ వేగంగా కొనసాగుతోంది. ఆగస్టు 3 తర్వాత ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని వారికి అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఎన్యూమారేషన్ ఫారాలను బీఎల్వోలు ఆన్లైన్ చేస్తున్నారు. వివరాలు ఇవ్వని 13వేల మంది జిల్లా వ్యాప్తంగా 4,75,694 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ ఎన్యూమారేషన్ ఫారాలను బీఎల్వోలు అందించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 2,46,562 ఓటర్లకు ఇప్పటి వరకు 2,12,406 మంది నుంచి ఫారాలు తీసుకున్నారు. ఇంకా 10,139 మంది వివరాలు రాకపోగా, 2,284 మంది పేర్లు తొలగించడమో, తరలించడమో, లేదా మృతిచెందడమో జరిగింది. వేములవాడ పరిధిలో 2,29,132 మంది ఓటర్లు ఉండగా, 2,00,971 మంది ఓటర్ల వివరాలు తీసుకున్నారు. మరో 1,026 మంది మృతిచెందడమో, షిప్టు చేయడమో, డబుల్‌గా ఉండడమో జరిగిందని అధికారులు తెలిపారు. సిరిసిల్లలో 10,139 మంది, వేములవాడలో 3,858 మంది వివరాలు అందజేయాల్సి ఉంది. ముస్తాబాద్ మండలంలో వెంకట్రావుపల్లె, చీకోడు, మొర్రాయిపల్లి గ్రామాలు వంద శాతం సర్‌ను సాధించాయి. సిరిసిల్ల పట్టణంలో 81శాతం, కోనరావుపేటలో 94, గంభీరావుపేట, వీర్నపల్లిలో 91, ఎల్లారెడ్డిపేటలో 87, ముస్తాబాద్‌లో 89, వేములవాడలో 82, వేములవాడ రూరల్‌లో 92 శాతం వరకు చేరుకున్నాయి. -
వైభవంగా వరుణయాగం
వేములవాడ: వర్షాలు సమృద్ధిగా కురవాలని వేములవాడ భీమన్న ఆలయంలో వరుణయాగం గురువారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ యాగంలో భాగంగా రాజన్నకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. భీమేశ్వరస్వామి ఆలయంలో ఆగస్టు 1 వరకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతయాని ఈవో రమాదేవి తెలిపారు. సిరిసిల్ల అర్బన్: ప్రకృతి విపత్తుల వేళ ప్రజలకు సత్వర సహాయం అందించేందుకు సిరిసిల్ల 17వ బెటాలియన్‌లో డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణను గురువారం ప్రారంభించినట్లు బెటాలియన్ కమాండెంట్ పీజేపీసీ ఛటర్జీ తెలిపారు. సర్ధాపూర్ 17వ బెటాలియన్‌లో సిద్దిపేట పోలీసు కమిషనరేట్ సిబ్బందికి మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణలో 31 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. వేములవాడఅర్బన్: మానవ అక్రమ రవాణా తీవ్రమైన సామాజిక నేరమని ఐసీడీఎస్ సీడీపీవో సౌందర్య పేర్కొన్నారు. వేములవాడలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అమాయక మహిళలు, బాలికలను ఉద్యోగాలు, సినిమా అవకాశాలు అంటూ మోసగిస్తారన్నారు. సోషల్‌మీడియాలో ఏర్పడే పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు, టీచర్లకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా, బలవంతంగా ఎక్కడికై నా తీసుకెళ్లే ప్రయత్నం చేసినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలపాలన్నారు. 1098, పోలీస్ –100 సేవల గురించి వివరించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ శశికళ, త్రివేణి, దేవిక, అర్చన, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ మమత, ప్రిన్సిపాల్ జ్యోతి పాల్గొన్నారు. గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీ అధ్యాపకుడు, బాలసాహితీవేత్త డాక్టర్ వాసరవేణి పర్శరాములుకు జాతీయస్థాయి పురస్కారం దక్కింది. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 29న ఢిల్లీలో నిర్వహించిన తెలుగు–వెలుగు సంబరాలు–2026–సి.నారాయణరెడ్డి జయంతి వేడుకల్లో జాతీయ వాగ్దేవి విశేష ప్రతిభ పురస్కారం అందజేశారు. కేంద్ర ఉక్కు గనులు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చేతులమీదుగా అందుకున్నారు. సిరిసిల్ల: పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌గా గోపాల్ గురువారం విధుల్లో చేరారు. మొన్నటి వరకు జిల్లా మేనేజర్‌గా పనిచేసిన నర్సింహారెడ్డిని అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జి జిల్లా మేనేజర్‌గా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఎల్.బుచ్చిబాబు అదనపు బాధ్యతలు నిర్వహించారు. నూతనంగా జిల్లా మేనేజర్‌గా గోపాల్‌ను నియమించడంతో విధుల్లో చేరారు. -
‘ముసురు’కున్న వాన
● మూడో రోజూ వానజల్లు ● కూలిన చెట్లు.. విరిగిపడిన స్తంభాలు ● అత్యధికం బోయినపల్లిలో 54.7 మిల్లిమీటర్లు ● సగటు వర్షం 35.8 మిల్లిమీటర్లువర్షపాతం ఇలా..సిరిసిల్ల: జిల్లాలో మూడో రోజు గురువారం ముసురువర్షం కురుస్తూనే ఉంది. ఈ వానాకాలంలో సరైన వర్షాలు కురువక రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ వాన ఊపిరిపోసింది. కామారెడ్డి జిల్లా పరిధిలో వర్షాలు ఎక్కువ పడడంతో పాల్వంచవాగులోని వరద గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరులోకి చేరుతోంది. వేములవాడ మూలవాగు పడువాటు నీళ్లతో పారడంతో మధ్యమానేరులోకి చిన్నపాటి వరద చేరుతోంది. ఎల్లంపల్లి వద్ద మోటార్లను ఆన్ చేసి గోదావరి జలాలను పంపింగ్ చేయడంతో మధ్యమానేరులోకి నీరు వస్తోంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ శివా రు అడవుల్లో కురిసిన వర్షాలతో కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగులోకి వరద వస్తోంది. వాగులు.. ఒర్రెల్లో చిన్నపాటి పాయలు వేములవాడ మండలం హన్మాజీపేట నక్కవాగు, లక్ష్మీపూర్ సండ్రవాగు, బోయినపల్లి గంజివాగు, ఇల్లంతకుంట మండలం బిక్కవాగుల్లో వరదనీరు పారుతోంది. వీర్నపల్లి మండలంలోని గిరిజనతండాల మధ్య ఒర్రెలు పారుతున్నాయి. వర్షాలతో సిరి సిల్ల పెద్ద బజారులో చెట్టు విరిగిపడి ఒకరు గాయపడ్డారు. ఎల్లారెడ్డిపేట, చందుర్తి మండలంల్లో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను సవరించారని ఎస్ఈ వేణుమాధవ్ సిబ్బందికి సూచించారు. మండలం వర్షపాతం(మి.మీ) బోయినపల్లి 54.7 ఇల్లంతకుంట 27.7 గంభీరావుపేట 24.2 ఎల్లారెడ్డిపేట 25.4 తంగళ్లపల్లి 29.5 వీర్నపల్లి 29.3 రుద్రంగి 37.3 ముస్తాబాద్ 26.1 సిరిసిల్ల 28.9 వేములవాడ రూరల్ 53.5 కోనరావుపేట 35.7 వేములవాడ 49.9 చందర్తి 43.3జలాశయం సామర్థ్యం ప్రస్తుత నిల్వ మధ్యమానేరు(మాన్వాడ) 27.55 టీఎంసీలు 8.856 టీఎంసీలు అన్నపూర్ణ(అనంతగిరి) 3.50 టీఎంసీలు 1.46 టీఎంసీలు మల్కపేట రిజర్వాయర్ 3.00 టీఎంసీలు 1.04 టీఎంసీలు ఎగువ మానేరు(నర్మాల) 2.00 టీఎంసీలు 1.237 టీఎంసీలు చెరువులు 0–25శాతం 25–50 50–75 75–100 మత్తడి నిండినవి శాతం శాతం శాతం దూకుతున్నవి 656 259 13 06 03 0 0జిల్లా వ్యాప్తంగా 656 చెరువులు ఉండగా.. 281 చెరువుల్లోకి కొద్దిపాటి వర్షం నీరు చేరుతోంది. మిగతా 375 చెరువుల్లోకి నీరు రాలేదు. ఎల్‌నినో ప్రభావం ఉన్న ఈ సమయంలో మూడు రోజుల ముసురు వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురించాయి.ఇల్లంతకుంట/రుద్రంగి/గంభీరావుపేట/వేములవాడరూరల్/ముస్తాబాద్/ వీర్నపల్లి: ఇల్లంతకుంట మండలం రామాజీపేట పాఠశాలలో నీరు నిలిచింది. సర్పంచ్ చొప్పరి భూమయ్య పైపులైన్ వేయించి నీటి బయటకు పంపించివేశారు. ఎల్లారెడ్డిపేటలోని ఆటోస్టాండ్ సమీపంలో చెట్టు విరిగిపడింది. వేములవాడ సమీపంలోని మూలవాగు పరవళ్లు తొక్కుతోంది. హన్మాజిపేట నక్కవాగు మల్లారం ఫీడర్ ఛానల్ మీదుగా ప్రవహిస్తోంది. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లెలో లాల్‌బీ ఇల్లు కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వీర్నపల్లి మండల కేంద్రంలోని పశువుల ఆరోగ్య ఉపకేంద్రంలోకి వరద నీరు వచ్చి చేరింది. -
అప్రమత్తంగా ఉండాలి
సిరిసిల్ల: జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం అధికారులతో సమీక్షించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, భవనాలు, రహదారులు, లో లెవల్ కల్వర్టులను పర్యవేక్షించాలని సూచించారు. ఆస్తి, ప్రాణ, పంటనష్టం సంభవిస్తే జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. చెరువులు, కుంటలు, వంతెనలు, జలాశయాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు అర్హతల అధారంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే 93986 84240లో సమాచారం ఇవ్వాలని కోరారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జెడ్పీ సీఈవో వెంకట మాధవరావు, సీపీఓ శ్రీనివాసాచారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీపీవో జయశీల, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్, పంచాయితీరాజ్ ఈఈ సుదర్శన్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేశ్ పాల్గొన్నారు. -
జిల్లాను అత్యుత్తమ స్థాయిలో నిలపాలి
సిరిసిల్ల: విద్యారంగంలో జిల్లాను అత్యుత్తమ స్థాయిలో నిలపాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. పీజీఐ(పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్) తదితర అంశాలపై కలెక్టరేట్లో బుధవారం జిల్లా విద్యాధికారి మొండయ్య, అధికారులతో సమీక్షించారు. ప్రతీ 15 రోజులోకసారి అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులతో మండలాల వారీగా సమావేశం నిర్వహించి నాణ్యమైన విద్యతోపాటు, మౌలిక వసతులు విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, కో ఆర్డినేటర్లు సతీశ్, పద్మజ ఉన్నారు. గడువులోగా ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి జిల్లాలో ఎస్ఐఆర్ డిజిటలైజేషన్‌ను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 86.09 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాజకీయపార్టీల ప్రతినిధులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో ఇదే అంశంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో కేఎస్బీ కుమారి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, తహసీల్దార్లు మహేశ్, జయంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
వామ్మో రోడ్డు దిగాలా!?
చందుర్తి(వేములవాడ): చెదిరిన తారు రోడ్డును బాగు చేయించిన అధికారులు సైడ్బర్మ్స్ వేయించడంలో విఫలమయ్యారు. నాలుగేళ్లుగా సైడ్బర్మ్స్ లేక వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలకు సైడ్ ఇవ్వాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, పాలకులు స్పందించడం లేదు. స్పీడ్‌గా వెళ్తే అంతే.. ఆర్అండ్బీ రోడ్డు పరిధిలో వేములవాడరూరల్ మండలం హన్మాజీపేటనుంచి చందుర్తి మండలం ఎన్గల్, బండపల్లి మీదగా కోనరావుపేట మండలం బావుసాయిపేట వరకు 10.800 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతు చేశారు. రూ.1.49కోట్లతో 2022లో పనులు చేశారు. కానీ రోడ్డుకు ఇరువైపులా మొరం పోయించలేకపోయారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డుపై ఇప్పటికే పదికి పైగా కార్లు, రెండు లారీలు, ట్రాక్టర్లు సైడ్ ఇవ్వబోయి బోల్తా పడ్డాయి. సూచికబోర్డులు లేక తిప్పలు ఆర్అండ్బీ అధికారులు సూచికబోర్డుల ఏర్పాటును మరిచిపోయారు. దారి పొడవునా ఎక్కడ మూలమలుపులు ఉన్నాయో, ఎక్కడ ఎత్తువంపులు ఉన్నాయో తెలియక స్పీడ్‌గా వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్తున్నాయి. తారు రోడ్డు వేసి మట్టి పోయకుండా వదిలేసిన బండపల్లి–ఎన్గల్ రహదారిబండపల్లిలో ధాన్యం లోడుతో బోల్తాపడ్డ లారీ (ఫైల్)మొరం పోయిస్తాం తారు రోడ్డు పనులు చేయించినప్పుడు ఇక్కడ నేను లేను. సైడ్బర్మ్స్ పోయించకపోవడంతో ఎదురెదురుగా భారీ వాహనాలు వస్తే రోడ్డు దిగడం ఇబ్బందిగా ఉన్నది వాస్తవమే. మెయింటనెన్స్ నిధులు ఉంటే మొరం పోయిస్తాం. లేదంటే గతంలో తారు వేసిన కాంట్రాక్టర్‌తో మాట్లాడుతాం. – నవ్యశ్రీ, ఆర్అండ్బీ ఏఈ, చందుర్తి -
ఆశల వర్షం
సిరిసిల్ల: జిల్లాలో వాన ముసురుకుంది. ఈ సీజన్లో అత్యధిక వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే వాన మొదలైంది. వర్షం కోసం నిరీక్షిస్తున్న రైతులకు ఊరటనిచ్చింది. ఇప్పటికే నార్లు పోసి పడిగాపులు కాస్తున్న అన్నదాతలకు ఊపిరినిచ్చింది. పొలాలను రైతులు పొతం చేస్తూ వరినాట్లు వేస్తున్నారు. నార్లు పోసుకోని రైతులు ఆరుతడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబస్టాండు నేతన్నచౌక్ వద్ద వరద రోడ్డుపైకి చేరింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సంజీవయ్యనగర్, శ్రీనగర్‌కాలనీ, ఆసిఫ్‌పుర ప్రాంతాల్లో వరద రోడ్డుపై పారింది. సిరిసిల్ల శివారు ప్రాంతాల్లో రోడ్లు బురదమయంగా మారాయి. వేములవాడ పట్టణంతోపాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వర్షం నీటితో బురదమయంగా మారాయి. పారుతున్న వాగులు పొరుగున ఉన్న కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షంతో పాల్వంచవాగు పారుతోంది. వరదనీరు గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయంలోకి చేరుతోంది. సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కూడెల్లివాగు పారుతోంది. ఈ రెండు వాగుల వరద ఎగువ మానేరులోకి చేరుతోంది. నిజామాబాద్ జిల్లా పరిధిలోని సిరికొండ అటవీప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరదనీరు కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగులోకి చేరుతోంది. ఎల్లారెడ్డిపేటలో అత్యధికం జిల్లాలో అత్యధికంగా ఎల్లారెడ్డిపేటలో 81.4 మిల్లీ మీటర్ల వర్షం పడింది. జిల్లా సగటు వర్షపాతం 46 మిల్లీ మీటర్లగా నమోదైంది. గతేడాది ఇప్పటి వరకు 340.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. ఈ ఏడాది 282.9 మిల్లీమీటర్లు పడింది. జిల్లాలో సాధారణ వర్షంపాత 343.5 మిల్లీమీటర్లు ఉంది. ఇంకా 18 శాతం లోటు వర్షపాతం ఉంది. చిగురించిన ఆశలు గంభీరావుపేట: మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లా పాల్వంచవాగు నుంచి వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 31 ఫీట్లు కాగా.. ప్రస్తుతం 18 ఫీట్లకు చేరింది. మూలవాగు పరవళ్లు కోనరావుపేట: మండలంలోని కొండాపూర్ శివారులోని పెంటివాగు ప్రవాహం మూలవాగులో కలవడంతో జలకళ సంతరించుకుంది. మూలవాగు పరవళ్లు తొక్కుతోంది. పాలన కేంద్రాలు జలదిగ్బంధం! వేములవాడ: వేములవాడ మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లో వర్షం నీరు నిలిచింది. డ్రైనేజీ సరిగ్గా లేకపోవడంతో నీరు బయటకు పోకపోవడంతో నీరు నిలిచింది. మిడ్‌మానేరుకు ఇన్‌ఫ్లో బోయినపల్లి: మిడ్‌మానేరులోకి వరద వచ్చి చేరుతోంది. మూలవాగు, మానేరువాగుల్లోంచి ప్రాజెక్టులోకి బుధవారం 4,556 క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లోగా వస్తోంది. ప్రాజెక్టు నుంచి 112 క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా వెళ్తోంది. మిడ్‌మానేరు ప్రాజెక్టులో 7.576 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. సండ్రవాగుకు జలకళ తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని అంకుసాపూర్ శివారులోని సండ్రవాగుకు జలకళ వచ్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగులోకి వరద చేరుతోంది. పొంగుతున్న లేతమామిండ్ల వాగు ఎల్లారెడ్డిపేట: మండలంలోని అక్కపల్లి శివారులోని లేత మామిండ్లవాగు వంతెన పైనుంచి పొంగిపొర్లుతోంది. ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిట్టివాగు, పాలేటివాగులకు వరద చేరుతోంది. కూలిన ఇల్లు మండల కేంద్రానికి చెందిన కోనేటి మల్లయ్య ఇల్లు వర్షం ధాటికి కూలింది. ఇంటి పై కప్పు ఒక్కసారిగా కూలడంతో కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. చెరువులకు జలకళ వీర్నపల్లి: మండలంలోని మద్దిమల్ల పరిధిలోని రాయిని చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వన్‌పల్లి, గర్జనపల్లి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. వాగుల పరిసర ప్రాంతాల ప్రజలు, శిథిలావస్థ ఇళ్లలో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వేములవాడరూరల్: వేములవాడరూరల్ మండలంలో వరినాట్లు జోరందుకున్నాయి. వర్షంలోనూ వ్యవసాయ కూలీలు నాట్లు వేస్తున్నారు. రుద్రంగి: మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి రైతులు పొలాలు దున్నుతున్నారు. మరికొందరు రైతులైతే వరినాట్లు వేస్తున్నారు. వర్షపాతం ఇలా..మండలం వర్షం(మి.మీ) ఎల్లారెడ్డిపేట 81.4 రుద్రంగి 42.0 చందుర్తి 36.5 వేములవాడరూరల్ 37.5 బోయినపల్లి 33.6 వేములవాడ 32.7 సిరిసిల్ల 43.6 కోనరావుపేట 57.2 వీర్నపల్లి 56.1 గంభీరావుపేట 60.0 ముస్తాబాద్ 27.6 తంగళ్లపల్లి 55.5 ఇల్లంతకుంట 34.4ఫీడర్ చానల్ పరిశీలన వేములవాడరూరల్: వేములవాడ మండలంలోని మల్లారం ఫీడర్ చానల్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నక్కవాగు హన్మాజిపేట మీదుగా మల్లారం ఫీడర్ చానల్ నుంచి ప్రవహిస్తోంది. ఫీడర్ ఛానల్ దెబ్బతినడంతో గుడి చెరువులోకి నీరు రాకుండా వృథాగా పోతోంది. ఫీడర్చానల్ను మరమ్మతు చేస్తామని విప్ హామీ ఇచ్చారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వకుళాభరణం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సోయినేని కరుణాకర్, సర్పంచులు సంగెం అర్పిత, రంగు వెంకటేశంగౌడ్, సామ తిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ శ్రీకాంత్, నాయకులు వీరారెడ్డి, మల్లేశం, చిలుక ప్రభాకర్ ఉన్నారు. -
భద్రత ఏర్పాట్ల పరిశీలన
వేములవాడఅర్బన్: వేములవాడలో గురువారం మంత్రుల పర్యటన సందర్భంగా చేపట్టిన భద్రత ఏర్పాట్లను ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ బుధవారం పరిశీలించారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం, రాజన్న గుడిచెరువులో ట్యాంక్‌బండ్ పార్క్ ప్రాంతాలను సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రత చర్యలను కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. డీఎస్పీలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐ వీరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ లోకేశ్, తహసీల్దార్ జయంత్‌కుమార్, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భూపతిరెడ్డి, మేనేజర్ శ్రీనివాస్ ఉన్నారు. ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని దమ్మన్నపేట హైస్కూల్లో బుధవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహించారు. అటవీశాఖ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘పులుల సంరక్షణ’పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం నారాయణ, ఉపాధ్యాయులు సంపత్‌కుమార్, గుడికాడి కొమురయ్య, శని గరం నారాయణ, అజ్మీర కవిత పాల్గొన్నారు. భూముల రీసర్వేపై అవగాహన తంగళ్లపల్లి/ఇల్లంతకుంట(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలం రామచంద్రపూర్, ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామాలను భూముల రీసర్వే కోసం పైలట్ గ్రామాలుగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా బుధవారం ఆయా గ్రామాల్లో భూముల కొలతలు, రికార్డుల పరిశీలన విధానం, సర్వే సమయంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు. డీఐ వెంకటాచారి, ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్లు మురళీకృష్ణ, సురేశ్, ఆర్ఐ సాయికృష్ణ, సర్వేయర్లు చంద్రమోహన్, మధుసూదన్, సర్పంచులు గంధం శ్రీనివాస్, గొడుగు విఠల్ తదితరులు పాల్గొన్నారు. రేపు సిరిసిల్లలో మినీ జాబ్ మేళా సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో ఈనెల 31న మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల బుధవారం తెలిపారు. ప్రైవేటు కంపెనీ విశ్వ ఆగ్రోటెక్ నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు రూ.18వేల వరకు వేతనం లభిస్తుందని, వివరాలకు 95027 47820, 73827 94374లలో సంప్రదించాలన్నారు. -
ఇంత‘లా’ హడావుడి దేనికి..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనిర్సిటీ లా ఆరో సెమిస్టర్ పరీక్షల నిర్వహణలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆగస్టు మూడో తేదీ నుంచి ఆరో సెమిస్టర్ పరీక్షలు అంటూ బుధవారం సాయంత్రం షెడ్యూల్ ప్రకటించిన వర్సిటీ అధికారులు న్యాయ విద్యార్థుల నెత్తిన పిడుగేశారు. ఈ సెమిస్టర్ సెకండ్ ఇంటర్నల్ 31వ తేదీన, మరునాడు ఆగస్టు 1న మూట్ కోర్ట్ ప్రాక్టీస్ షెడ్యూల్ గత వారమే విడుదలైంది. అయితే, విద్యార్థులు ఇంకా పరీక్ష ఫీజు కడుతూనే ఉన్నారు. జూలై 31 వరకు విద్యార్థులకు, ఆగస్టు 1వ తేదీన పరీక్షలకు ఆన్లైన్లో ఫీజు గడువు విధించారు. వాస్తవానికి ఆగస్టు 1 శనివారం రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్లో చెల్లింపులకు అవకాశమిచ్చారు. అదే ఆగస్టు 3న ఉదయం 10 గంటల నుంచి ఆరో సెమిస్టర్ తొలి పరీక్ష నిర్వహించనున్నారు. యూనివర్సిటీ అధికారులు కనీసం విద్యార్థులకు ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా షెడ్యూల్ ఖరారు చేసిన విషయం తీవ్ర వివాదం రేపుతోంది. సెంటర్ ఎక్కడ..? హాల్‌టికెట్ ఎలా? శనివారం సాయంత్రం వరకు పరీక్ష ఫీజు కట్టించుకునేలా షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు, సోమవారం ఉదయం 10 గంటలకు పరీక్ష పెట్టడంపై విద్యార్థులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తాము హాల్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి..? సెంటర్ ఎక్కడ? అన్న కనీస విషయాలు తెలసుకునే వీలు లేకుండా పరీక్షకు షెడ్యూల్ విడుదల చేయడంపై విద్యార్థులు బిత్తరపోతున్నారు. కేవలం 24 గంటల్లో హాల్‌టికెట్లు ఎలా విడుదల చేస్తారు? ఎలా పంపిణీ చేస్తారు? అన్న విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఇంటర్నల్ పరీక్షలు పూర్తయిన కనీసం వారం నుంచి 15 రోజుల వ్యవధి అనంతరం సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలి. కానీ, అధికారులు ఈ విషయాల గురించి కనీసం ఆలోచించనట్లుగా స్పష్టమవుతోంది. ఈ విషయమై శాతవాహన వర్సిటీ పరీక్షల కంట్రోలర్ సురేశ్‌ను సంప్రదించగా.. ఎల్ఎల్ఎం కౌన్సెలింగ్‌కు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని పలు న్యాయకళాశాలలు, విద్యార్థుల నుంచి అనేక వినతులు వచ్చిన నేపథ్యంలో పరీక్షల ఆల్మోనాక్ (విద్యా వార్షిక ప్రణాళిక)ను మార్చి మరీ ముందుకు జరిపినట్లు వివరణ ఇచ్చారు. మరోవైపు పరీక్షలు ముందుకు జరపడంపై తమకు అభ్యంతరం లేకున్నా.. కనీసం హాల్ టికెట్ తీసుకునే సమయం, పరీక్ష కేంద్రం తెలుసుకునే వ్యవధి అయినా ఇవ్వకపోవడంపై న్యాయ విద్యార్థులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. శాతవాహన న్యాయ పరీక్షల్లో గందరగోళం ఇంటర్నల్ మరునాటి నుంచే ఆరో సెమిస్టర్ మొదలు ఆగస్టు ఒకటి వరకు ఫీజు చెల్లింపు మూడో తేదీన ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు హాల్‌టికెట్ తీసుకునే సమయమూ ఇవ్వని అధికారులు -
కూడలి.. వస్త్రోత్పత్తి శైలి
సిరిసిల్ల: కార్మికక్షేత్రం.. వస్త్రపరిశ్రమకు నిలయం. వస్త్రోత్పత్తి దశలు కళ్లముందుంచుతూ కలెక్టరేట్ కూడలిలో ఏర్పాటు చేసిన శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి. రూ.3.10 కోట్లతో రగుడు బైపాస్ కూడలి సుందరీకరణలో భాగంగా బీటీ రోడ్డు విస్తరణ, హైమాస్ట్ లైట్లు, గ్రీనరీ, రోడ్డు భద్రత చర్యలు, వస్త్రపరిశ్రమలో వివిధ దశల నమూనాలు ఏర్పాటు చేశారు. ఈ కూడలిని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్‌గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం ప్రారంభించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఎస్పీ నాగేంద్రచారి బుధవారం పర్యవేక్షించారు. -
మట్టి పోయించాలి
తారురోడ్డు వేయడంతో రోడ్డు ఎత్తు పెరిగింది. ఎదరుగా భారీ వాహనాలు వస్తే రోడ్డు దిగుదామంటే మట్టి రోడ్డు లోతుగా ఉండి వాహనాలకు కింద పడిపోతున్నాయి. తారు రోడ్డు వేసిన వెంటనే మట్టి పోయించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. – గసికంటి ప్రవీణ్, ఎన్గల్ ప్రమాదాలు జరుగుతున్నాయి కాంట్రాక్టర్ రోడ్డు వేసి మొరం పోయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఏడాదిగా వందకు పైగానే ప్రమాదాలు జరిగాయి. పాలకులు పట్టించుకోవాలి.– అంబాల శ్రీకాంత్, బీజేవైఎం నాయకుడు, బండపల్లి -
అంతర్జాతీయంగా రాణిస్తా
హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో మూడు సార్లు పాల్గొన్నా. పతకాలు సాధించలేదు. జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. టేబుల్‌టెన్నిస్‌లో అంతర్జాతీయస్థాయిలో ప్రాతినిథ్యం వహించేలా ఎదగడం నా లక్ష్యం. – అన్విక్ష్ నందన్ జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. తప్పకుండా పోటీల్లో రాణిస్తాను. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర ర్యాంకింగ్ టోర్నమెంట్లో రాణించాను. భవిష్యత్‌లో గొప్ప క్రీడాకారిణిగా మారాలని ఉంది. – ఎ.అనన్య -
కార్గో లేక కష్టాలు
● వేములవాడ బస్టాండ్‌లో నిలిచిన సేవలు ● పట్టించుకోని అధికారులువేములవాడ: వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో కార్గో ప్యాకేజ్/పార్శిల్ సేవలు అందుబాటులో లేక స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆర్టీసీ కార్గో సేవలు ఇక్కడ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వేములవాడ నుంచి ఇతర ప్రాంతాలకు అత్యవసరంగా ఏదైనా పార్శిల్ పంపాలన్నా, బయటి నుంచి వచ్చే పార్శిళ్లను తీసుకోవాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పార్శిల్ పంపాలన్నా 12 కిలోమీటర్ల దూరంలోని సిరిసిల్ల, 35 కిలోమీటర్ల దూరంలోని కరీంనగర్‌కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో సమయంతో పాటు రవాణా భారం పడుతోందని స్థానికులు వాపోతున్నారు. బస్టాండ్‌లో అన్ని వసతులు ఉన్నా, డిపో అధికారులు కార్గో కౌంటర్ నిర్వహణను పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ ప్రక్రియలో ఉంది వేములవాడ బస్టాండ్‌లో కార్గో పార్సిల్ సర్వీసు సేవలు నిలిచిపోయాయి. మూడుసార్లు టెండర్ కాగా సరైన గిడ్ రాకపోవడంతో రద్దయింది. మరోసారి టెండర్ నిర్వహించి ప్రయాణికులు, స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – బోనాల శ్రీనివాస్, డీఎం, వేములవాడ -
ఫంక్షన్‌కు వెళ్లి.. రైల్వే ట్రాక్ వద్ద శవమై..
మెట్‌పల్లిరూరల్: మెట్పల్లి మండలం సత్తక్కపల్లి శివారులో రైలు ఢీకొని ఒకరు మృతి చెందారు. మంగళవారం సాయంత్రం సమయంలో గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ వద్ద ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేటకు చెందిన మామిడి రాజగంగారాం(60)గా గుర్తించారు. రాజగంగారాం కమ్మర్పల్లి సమీపంలోని నాగాపూర్‌లో ఓ ఫంక్షన్ వచ్చినట్లు సమాచారం. అక్కడ మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు రైల్వే ట్రాక్ పక్కన శవమై కనిపించడంతో కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఘటనపై విచారణ చేపడుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చెట్టిపల్లి శ్రీకాంత్ (38) మంగళవారం ఓ ఇంట్లో కరెంట్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే వేములవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి తల్లి రాజేశ్వరి ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై వెంకట్రాజంను వివరణ కోరగా, శ్రీకాంత్ ఫిట్స్‌తో మృతిచెందాడని, ఇప్పటి వరకు మృతుడి బంధువుల నుంచి ఏలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. దీనిపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తానని తెలిపారు. బండరాయి మీద పడి కూలీ మృతిమానకొండూర్: గంగిపల్లి గ్రామ శివారులో రెడ్డి కొమురయ్య(52) అనే కూలీ పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బండరాయి మీద పడి బావిలోనే దుర్మరణం చెందాడు. గంగిపల్లి గ్రామ శివారులో కొండపల్కల గ్రామానికి చెందిన బాపురెడ్డి వ్యవసాయ బావిలో పూడిక తొలగింపు పనులు క్రేన్ సహాయంతో చేపట్టారు. బావిలోకి దిగిన కొమురయ్య తోటి కూలీలతో పని చేస్తున్న సమయంలో క్రేన్ బకెట్(డబ్బా) నుంచి బండరాయి జారి అతడి తలపై పడింది. తీవ్ర గాయాలతో కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మానకొండూర్ సీఐ పి.శ్రీలత ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం ఇస్తేనే మృతదేహాన్ని కరీంనగర్‌కు తరలించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేయగా.. వారికి నచ్చజెప్పి న్యాయం చేస్తామని సీఐ మృతదేహాన్ని కరీంనగర్‌కు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉండగా.. అందరికీ వివాహమైంది. కోనరావుపేటలో ఒకరికి డెంగీ కోనరావుపేట(వేములవాడ): మండలకేంద్రంలో ఒకరికి డెంగీ పాజిటివ్ వచ్చినట్లు వైధ్యాధికారులు గుర్తించారు. సదరు వ్యక్తి కొద్ది రోజులక్రితం హైదరాబాద్ వెళ్లి వచ్చాడు. తర్వాత అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా రక్త కణాలు తగ్గినట్లు గుర్తించారు. వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మండల వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో ఇంటింటా సర్వే చేపడుతున్నారు. -
జాతీయ వేదికపై కరీంనగర్ కెరటాలు
● నేషనల్ టేబుల్ టెన్నిస్ బరిలో జిల్లా క్రీడాకారులు ● ఆగస్టు 16 నుంచి 23 వరకు కాన్పూర్‌లో పోటీలుఢిల్లీ, డయ్యూడామన్, తమిళనాడులో జరిగిన ఎస్జీఎఫ్ జాతీయ పోటీల్లో మూడుసార్లు పాల్గొన్నాను. పతకం సాధించలేదు. ఈ సారి తప్పకుండా పతకం సాధిస్తా. టేబుల్ టెన్నిస్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతిరోజూ సాధన చేస్తున్నా. – ఎల్లా అవనిరెడ్డి రాష్ట్రస్థాయి పోటీల్లో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో మూడుసార్లు పాల్గొన్నాను. చీఫ్ మినిస్టర్స్ కప్‌లో 3వ స్థానం సాధించాను. జిల్లాస్థాయి పోటీల్లో 19 పతకాలు గెలుచుకున్నాను. ప్రస్తుతం జరుగనున్న పోటీల్లో పతకం సాధించడమే నా లక్ష్యం. – కటికిరెడ్డి అద్వికనాథ్ కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ క్రీడాకారులు జాతీయస్థాయిలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. స్థానిక స్పోర్ట్స్ అకాడమీకి చెందిన టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు వచ్చే ఆగస్టులో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగే నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్–2026కు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు ఎంపికయ్యారు. ఆగస్టు 16 నుంచి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం క్రీడాకారులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సుమారు ఐదు గంటల పాటు కఠినమైన సాధన చేస్తున్నారు. -
జిల్లా అంతటా జల్లులు
సిరిసిల్ల: జిల్లా అంతటా మంగళవారం మోస్తరు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బోయినపల్లి మండలంలో 55.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. రుద్రంగి 11.9, చందుర్తి 14.7, వేములవాడరూరల్ 42.7, వేములవాడ 44.5, సిరిసిల్ల 15.3, కోనరావుపేట 43.6, వీర్నపల్లి 38.9, ఎల్లారెడ్డిపేట 10.4, గంభీరావుపేట 15.6, ముస్తాబాద్ 19.9, తంగళ్లపల్లి 20.2, ఇల్లంతకుంట 13.2 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 26.6 మి.మీ నమోదైంది. జిల్లాలో మంగళవారం వరకు సాధారణ వర్షపాతం 335.1 మి.మీ కాగా, ఇప్పటి వరకు 236.9 మి.మీ వర్షం కురిసింది. జిల్లా అంతటా 29మి.మీ లోటు వర్ష ఉంది. కాగా, బుధవారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలుసిరిసిల్ల: మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగించాలన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిని గుర్తించి, వారికి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి హిమశ్రీ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శరత్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో స్నేహభావంసిరిసిల్ల అర్బన్: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని 17వ బెటాలియన్ కమాండెంట్ పీజేపీసీ చటర్జీ అన్నారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్ధాపూర్ బెటాలియన్‌లో ఇంటర్ కంపెనీస్ అన్నుయల్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు హాజరై మాట్లాడారు. సిబ్బందిలో ఒత్తిడి తగ్గించేందుకు ఏటా స్పోర్ట్స్ మీట్ నిర్వహించి బహుమతులు అందిస్తున్నట్లు వివరించారు. క్రీడా పోటీలతో విధి నిర్వహణలో సిబ్బంది చురుకుగా పనిచేస్తారన్నారు. అసిస్టెంట్ కమాండెంట్లు జె.రాందాసు, ఎస్.సురేశ్, ఎం.రాజు, ఆర్ఐలు రామబ్రహ్మం, శ్రీనివాస్, కుమారస్వామి, శ్యాంరావు పాల్గొన్నారు. కథల పోటీల్లో జాతీయస్థాయి బహుమతి గంభీరావుపేట(సిరిసిల్ల): ఉషాబాల పత్రిక వారు నిర్వహించిన పిల్లల కథల పోటీల్లో గంభీరావుపేట మండలం లింగన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పర్ష వర్షిక జాతీయ స్థాయి బహుమతికి ఎంపికై ంది. తాను రాసిన పట్టుదల అనే కథ అందరినీ ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగిన ఓ విద్యార్థి జీవితాన్ని కథ రూపంలో రాసి జాతీయస్థాయికి ఎంపికై ంది. రిషికను హెచ్ఎం గంగారాం, ఉపాధ్యాయులు అభినందించారు. ఎంజేపీటీబీసీలో నేడు స్పాట్ అడ్మిషన్లుసిరిసిల్ల: జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీ సీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి బుధవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్ సుస్మిత తెలిపారు. సిరిసిల్ల ఎంజేపీటీబీసీ సంక్షేమ గురుకులంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అడ్మిషన్ల ప్రక్రియ చేపడతామని వివరించారు. బీసీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడునని, ఎస్సెస్సీలో 450 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్పాట్ అడ్మిషన్‌కు రావాలని పేర్కొన్నారు. -
ధాన్యం కొను‘గోల్మాల్’ డీఎం సస్పెన్షన్
జిల్లాలో ధాన్యం కొను‘గోల్మాల్’ వ్యవహారంలో మరి కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పౌరసరఫరాల శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకరు గతేడాది గన్నీ సంచుల లెక్కల్లో తేడాలు వచ్చాయంటూ, ఒక్కో కొనుగోలు కేంద్రం నిర్వాహకుల వద్ద రూ.3వేల నుంచి రూ.5వేల వ రకు వసూలు చేశారు. సదరు అవుట్ సోర్సింగ్ ఉ ద్యోగి ధాన్యం కొను‘గోల్మాల్’ వ్యవహారంలో చే తివాటాన్ని ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. అత డి అక్రమాలు బయటకు రాకుండా ఉన్నతాధికారు ల స్థాయిలో మేనేజ్ చేసినట్లు సమాచారం. ఇప్పటి కేపలువురు అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లపై చర్యలేవీ? ధాన్యం కొనుగోళ్లలో 13 లారీల ధాన్యం పక్కదారి పట్టించారు. ఇందులో 12 లారీల ధాన్యం వేములవాడ ప్రాంతానికి చెందినవి కాగా, ఒక్క లారీ సిరిసిల్ల ప్రాంతానికి చెందినది. ఒక్క లారీకి సంబంధించిన ఆదిత్య లారీ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసి అతన్ని బ్లాక్ లిస్ట్‌లో ఉంచారు. మరి ఆ 12 లారీల ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుంది. సదరు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ తన పలుకుబడితో పౌరసరఫరాల శాఖ అధికారులను మేనేజ్ చేశారనే ఆరోపణలున్నాయి. జరిమానాతో వదిలేశారు కోనరావుపేట మండలం మర్తనపేటకు చెందిన వినాయక రైస్ మిల్లుకు చెందిన ఏపీ 16టీసీ 9677 నంబరు గల లారీ ఇటీవల ధాన్యం లోడుతో సిరిసిల్ల శివారు చంద్రంపేట వద్ద పార్కింగ్ చేసి ఉంది. లారీలోని ధాన్యాన్ని తరలించేందుకు వే బిల్లు ఏమీ లేక పోవడంతో డ్రైవర్ పరార్ అయ్యారు. దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ చేపట్టి 800 బస్తాల లోడుతో ఉన్న లారీని రాఘవేంద్ర రైస్ మిల్లులో సీజ్ చేసి ఉంచారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు రూ.50వేలు జరిమానాతో ఆ లారీని వదిలి వేసినట్లు సమాచారం. ఈ కేసులో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలిసింది. ఎలాంటి వే బిల్లు లేకుండా, మరో రైస్ మిల్లుకు వడ్లను తరలించడంపై రూ.50వేల జరిమానాతో వదిలేయడం అనుమానాలకు తావిస్తుంది. ఏది ఏమైనా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు.. అటు అధికా రులు ఇటు రైస్ మిల్లర్లలో వణుకు పుట్టిస్తున్నాయి. సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొను‘గోల్మాల్’ వ్యవహారంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహారెడ్డిని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సిరిసిల్ల అపరెల్ పార్క్ గోదాం ఇన్చార్జి ఉత్కం గోపాల్‌తో చేతులు కలిపి 13 లారీల ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఘటనలో నర్సింహారెడ్డిని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సరెండర్ చేయగా, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌గా గోపాల్‌ను నియమించినట్లు సమాచారం. ఆయన ఒకట్రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నారు. -
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
వేములవాడ: ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని, ప్రతీ ఫిర్యాదుపై తక్షణం స్పందించి బాధితులకు చట్టప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. వివిధ విభాగాలు, పలు రికార్డులు తనిఖీ చేశారు. పెండింగ్, విచారణలో ఉన్న కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. పోలీస్‌శాఖ వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరిస్తూ, వారిపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. గంజాయి, పేకాట మొదలగు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై రాజు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. నేడు వేములవాడకు మంత్రి రాక వేములవాడ: రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం రాత్రి వేములవాడకు చేరుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 30న వేములవాడ భీమన్న ఆలయంలో జరిగే వరుణయాగంలో పాల్గొంటారని, అనంతరం రూ.1.65 కోట్లతో వేములవాడ బస్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా ఈనెల 30,31, ఆగస్టు 1న మూడు రోజులపాటు వరుణయాగాలు నిర్వహిస్తున్న క్రమంలో గర్భగుడి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈవో రమాదేవి ప్రకటించారు. -
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ ఈవీ బస్సు
మెట్పల్లి: డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 8 మంది ప్రయాణకులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆర్టీసీ వరంగల్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు మంగళవారం ఉదయం 3.30 గంటల సమయంలో నిజామాబాద్ నుంచి బయల్దేరింది. ఆ సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం ఐదు గంటలకు మెట్పల్లి సమీపంలోకి రాగానే.. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న షౌకత్ అలీ, పంకజ్, అక్షయ్, నదీమ్, ఖదీర్, రాజు, జుబేర్, ప్రవీణ్ గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం కొందరిని జగిత్యాలకు తరలించారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గాయపడ్డ ప్రయాణీకులు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం 8 మంది ప్రయాణికులకు గాయాలు -
తప్పుల సవరణే సవాల్
● ఎన్యూమరేషన్ ఫారాల్లో పొరపాట్లు ● దిద్దుబాటు బాధ్యతల్లో స్వచ్ఛంద సేవకులువేములవాడ: ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంటుంది. ఎన్యూమరేషన్ ఫారాలలో పలు రకాల తప్పులు దొర్లడంతో వాటిని సరిదిద్దడం సిబ్బందికి సవాలుగా మారింది. దరఖాస్తుదారులతో పాటు బీఎల్ఏలు, బీఎల్వోలు పూర్తి చేసిన ఫామ్స్లలోనూ తప్పులు దొర్లడంతో వాటిని సవరించేందుకు స్వచ్ఛంద సేవకులు తహసీల్దార్ కార్యాలయంలో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఫామ్స్ నింపడం సులువని, దిద్దడం తలనొప్పిగా మారిందని వాపోతున్నారు. అవగాహన లోపం ఓటర్ల నుంచి స్వీకరించిన ఫారాలలో పలుచోట్ల అసంపూర్తి వివరాలు, తప్పుడు సమాచారం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఓటరు వివరాల కాలమ్‌లో పాత, కొత్త ఎపిక్ సంఖ్యలు తారుమారు కావడం, కుటుంబ సభ్యులు, బంధుత్వాల వివరాలు సక్రమంగా పూరించకపోవడం, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం సంఖ్యలను తప్పుగా రాయడం, వివాహమై వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాల నమోదులో స్పష్టత లేకపోవడం, కొన్ని చోట్ల ఆధార్ సంఖ్యలు, ఫోన్ నంబర్లు అరకొరగా నమోదు చేయడంతో ప్రక్రియ మందగించింది. స్వచ్ఛంద సేవకుల సేవలు అమోఘం ఎన్యూమరేషన్ ఫారాలలో తప్పులను సరిదిద్దేందుకు స్వచ్ఛంద సేవకుల సేవలను తహసీల్దారు కార్యాలయంలో వినియోగించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటి నుంచి తెప్పించిన ఫారాల్లోని తప్పులను సరిచూడడం, ఆన్లైన్లో అప్లోడ్ చేయడం వంటి పనుల్లో పలువురు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మూడో తేదీ చివరి అవకాశం ఎస్ఐఆర్ ఫారాల దాఖలు, దిద్దుబాట్లకు ఆగస్టు 3 వరకు మాత్రమే గడువు ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తమ ఓటు వివరాల్లో ఏమైనా తప్పులు, మార్పులు, చేర్పులు ఉంటే సంబంధిత పోలింగ్ కేంద్రం బీఎల్వో లేదా అధికారిక పోర్టల్ ద్వారా సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. -
న్యాయం జరిగే వరకు పోరాటం
● టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తంగళ్లపల్లి: నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో మంగళవారం పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన నేరెళ్ల ఘటన బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పారు. అనంతరం బాధితులు పెంట బానయ్య, కోల హరీశ్ తదితరులను పరామర్శించారు. తాను కేవలం పరామర్శించి వెళ్లేందుకు రాలేదని, నేరెళ్ల ఘటన బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం అందేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి పార్టీ నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామని నమ్మబలికి ఓట్లు దండుకున్నారని, ప్రభుత్వంలోకి వచ్చాక వారిని మరిచారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం ఉన్నా బాధితులకు న్యాయం చేకూరే వరకు పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. అంతకముందు కవిత కాన్వాయ్కి జిల్లా శివారులోని జిల్లెల్ల గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లెల్లలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు సుమలత సుధాకర్ శర్మ, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి మహ్మద్ మజీద్, మండల ఇన్చార్జి చెరుకుపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు. -
ఆరుతడి పంటలు వేయాలి
వేములవాడరూరల్: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగుచేయాలని తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం వేములవాడ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.సాయికుమార్ సూచించారు. జూలై 23 నాటికి జిల్లాలో సాధారణంగా 283.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 190.4 మి.మీ నమోదై, 33 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలోని 13 మండలాలకు 11 మండలాల్లో లోటు వర్షపాతం, రెండు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. అత్యధికంగా రుద్రంగిలో 48 శాతం, ఇల్లంతకుంట 46, తంగళ్లపల్లి 44, సిరిసిల్ల 43, బోయినపల్లి 38, వేములవాడరూరల్ 36, వీర్నపల్లి 16, కోనరావుపేటలో 18 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. జిల్లా సగటు భూగర్భ జల మట్టం గతేడాదితో పోలిస్తే 2.91 మీటర్లు లోతుకు వెళ్లిందని వివరించారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని సూచించారు. కంది, పెసర, మినుము, నువ్వులు, వేరుశెనగ, జొన్న, సజ్జ, రాగి వంటి పంటలు వేసుకోవడం ఉత్తమమన్నారు. అవసరమైన చోట డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులు వినియోగించాలని సూచించారు. భూగర్భ జలాల మట్టం ఇలా.. మండలం మీటర్లు వేములవాడఅర్బన్ 21.38 సిరిసిల్ల 18.38వీర్నపల్లి 18.06ఎల్లారెడ్డిపేట 17.74గంభీరావుపేట 13.16 తంగళ్లపల్లి 12.54ముస్తాబాద్ 12.04కోనరావుపేట 11.54రుద్రంగి 10.44ఇల్లంతకుంట 9.22చందుర్తి 8.53వేములవాడరూరల్ 8.10బోయినపల్లి 7.82 -
ఆర్థిక ఇబ్బందులతో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలకేంద్రానికి చెందిన పిట్ల రాములు(41) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాములు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్, గడ్డి కట్టల మిషన్ తీసుకున్నాడు. ఆశించిన స్థాయిలో పని దొరక్కపోవడంతో ఇప్పటి వరకు ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాడు. ఫైనాన్స్ వారు ట్రాక్టర్‌ను తీసుకెళ్తారేమోనని మానసిక ఆందోళనకు గురయ్యాడు. తాను చనిపోతే ఆర్థిక సమస్యలు ఉండవని గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులతో చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
ముందే గుర్తిస్తే హెపటైటిస్ దూరం
సిరిసిల్లటౌన్: లక్షణాలను ముందే గుర్తిస్తే హైపటైటిస్ వ్యాధిని దరి చేరకుండా చేయొచ్చని నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీధర్‌గౌడ్ అన్నారు. మంగళవారం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లాసుపత్రిలో కాలేయ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆయన మాట్లాడారు. కాలేయానికి సోకే హెపటైటిస్–బి, సి వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. నిరంతరం రోగుల సేవలో ఉండే హెల్త్ కేర్ వర్కర్లు ముందస్తు జాగ్రత్తగా టీకా తీసుకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీ, హెల్త్ కేర్ వర్కర్లకు హెపటైటిస్–బి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నాగేందర్‌బాబు, ఆర్ఎంవో డాక్టర్ సుమన్‌మోహన్‌రావు, హెచ్ఓడీ డాక్టర్ నాగన్న తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
● 120 గ్రాముల గంజాయి స్వాదీనం జగిత్యాలక్రైం: జగిత్యాల శివారు మోతె శ్మశానవాటిక ఎదురుగా గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మంగళవారం నిందితులను అరెస్ట్ చూపారు. పట్టణ శివారు లింగంపేటకు చెందిన జవ్వాజి తేజ, హౌసింగ్‌బోర్డుకు చెందిన గజ్జెల అజయ్, లక్ష్మీపూర్‌కు చెందిన ఆలకుంట్ల గణేశ్, తులసీనగర్‌కు చెందిన ఏళ్ల మనోజ్ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి వెళ్లి 120 గ్రాముల గంజాయి కొనుక్కుని వచ్చి మోతె శ్మశాన వాటిక వద్ద విక్రయిస్తున్నారు. వారిని పట్టణ ఎస్సై సుప్రియ పట్టుకుని 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై కుమారస్వామి పాల్గొన్నారు. పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు సిరిసిల్ల: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.2,000 జరిమానా విధిస్తూ జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం తీర్పునిచ్చారు. ఎస్పీ మహేశ్ బీ గీతే కథనం ప్రకారం.. సిరిసిల్లకు చెందిన బూర్ల చంద్రశేఖర్ ఓ మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేసి చంద్రశేఖర్‌ను రిమాండ్‌కు తరలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో భాగంగా ఏఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్సైలు రవీందర్‌నాయుడు, శ్రవణ్‌యాదవ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ జనార్ధన్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల 15 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున పీపీ రజినీకాంత్ వాదించారు. న్యాయమూర్తి సాక్ష్యాలు పరిశీలించి నిందితుడికి జైలు, జరిమానా విధించారు. ధాన్యం బకాయిలు చెల్లించాలివేములవాడరూరల్: రైతుల ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. మంగళవారం మండల అధ్యక్షుడు బూరుగుపల్లి పరమేశ్ ఆధ్వర్యంలో వే ములవాడ రూరల్ కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో చోటుచేసుకున్న కుంభకోణంపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఈ వ్యవహారంలో ఎంతమంది రైతులు నష్టపోయా రు, బాధ్యులపై ఎం చర్యలు తీసుకుంటున్నారనే వి షయాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డి మాండ్ చేశారు. మర్రిపల్లి, మల్లారం, నూకలమర్రి రైతులు బకాయిల కోసం ఆందోళనలు చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం దురదష్టకరమన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కేటాయించిన నిధులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీని వాస్, జిల్లా కార్యదర్శి సురేందర్‌రావు, ఓబీసీ మో ర్చా జిల్లా అధ్యక్షుడు రేగుల సంతోష్‌బాబు, కౌన్సిల్ సభ్యుడు జక్కుల తిరుపతి, వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్‌గౌడ్ పాల్గొన్నారు. -
క్రీడాప్రాంగణంలో శవం పూడ్చివేత
సైదాపూర్: ఆరెపల్లిలోని తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణంలో మంగళవారం శవాన్ని పూడ్చివేసిన ఘటనతో క్రీడాకారులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన లొల్లేటి భిక్షపతి మృతిచెందగా.. మృతదేహాన్ని ఆరెపల్లి తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణంలోనే పూడ్చేశారని గ్రామస్తులు, క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే శ్మశాన వాటిక ఉన్నా.. కాల్చకుండా ఎదురుగా ఉన్న క్రీడాప్రాంగణంలో పూడ్చేశారు. ఈ ఏడాది వర్షాల్లేక.. చెరువులోకి నీరు రాక మైదానం ఆటలకు అనుకూలమైంది. నెల రోజులుగా ఈ క్రీడాప్రాంగణంలో సైదాపూర్, వెన్కెపల్లి, జాగీర్పల్లి, రాంచంద్రాపూర్, ఎలబోతారం, వెన్నంపల్లి గ్రామాలతోపాటు మానకొండూర్ నియోజకవర్గం నుంచి కూడా క్రీడాకారులు వచ్చి క్రికెట్ టోర్నమెంట్, క్రీడలు నిర్వహించుకున్నారు. మండలంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడాప్రాంగణాల్లో ఎక్కడ ఆట స్థలం లేదు. కేవలం ఆరెపల్లి క్రీడాప్రాంగణంలో మాత్రమే మైదానం ఉండడంతో.. మైదానాన్ని చదును చేసుకొని రోజూ క్రీడలు నిర్వహించుకుంటున్నారు. పంచాయతీ అధికారులు, పాలకులు చర్యలు తీసుకొని క్రీడాప్రాంగణాన్ని వినియోగంలోకి తేవాలని గ్రామస్తులు, క్రీడాకారులు కోరుతున్నారు. -
ప్రైవేట్ పాఠశాల వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సు
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని యావర్‌రోడ్‌లో.. అటవీశాఖ కార్యాలయం సమీపంలో కృష్ణానగర్ వైపు వెళ్తున్న ప్రైవేటు పాఠశాల వాహనాన్ని ఆర్టీసీ అద్దె బస్సు మంగళవారం ఉదయం ఢీకొంది. కృష్ణానగర్‌కు చెందిన ఓ ప్రైవేటు వాహనం 20 మంది విద్యార్థులతో కొత్తబస్టాండ్ నుంచి కృష్ణానగర్ వైపు వెళ్తోంది. అదే సమయంలో పాతబస్టాండ్ నుంచి కొత్తబస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు అతివేగంగా వెళ్లి ఢీకొంది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే యావర్‌లో సంఘటన జరగడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ ఉన్న వారంతా చిన్నారులను చేరదీశారు. ప్రైవేట్ వాహన డ్రైవర్, జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటకు చెందిన చక్రాల సుదర్శన్ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ మారంపల్లి నరేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు -
కూరగాయల సాగుతో ఆదాయం
వేములవాడఅర్బన్: రైతులు సంప్రదాయ పంటలు కాకుండా కూరగాయలు సాగు చేసి మంచి ఆదాయం పొందాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. కాలానికి అనుగుణంగా తీరొక్క కూరగాయలు సాగు చేస్తున్న వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామానికి చెందిన రైతు చెరుకు తిరుపతి వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం సందర్శించారు. వర్షాలు లేనందున తనకున్న ఐదెకరాల్లో వరికి బదులు ఆరుతడి పంటలు వేస్తానని, 30 గుంటల్లో కూరగాయలు సాగుచేస్తున్నట్లు కలెక్టర్‌కు రైతు తెలిపాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తిరుపతి కూరగాయలు సాగు చేయడాన్ని చూసి కలెక్టర్ అభినందించారు. మిగతా రైతులు కూడా ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలన్నారు. ఉద్యానవన, ఇతర శాఖల నుంచి వచ్చే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకముందు మారుపాక రైతువేదికలో రైతునేస్తం కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు ఆదర్శ రైతులను సన్మానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దని, మార్కెట్ డిమాండ్, నేలకు అనుకూలమైన పంటలు సాగు చేయాలన్నారు. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఆత్మ కమిటీ డివిజన్ అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, డీఏవో అఫ్జల్ బేగం, తహసీల్దార్ జయంత్ కుమార్, రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సాయి కుమార్ పాల్గొన్నారు. -
ఆర్టీవో చలాన్ పేరుతో సైబర్ మోసాలు
● ఓపెన్ చేయొద్దని పోలీసుల సూచన వేములవాడ: సైబర్ మోసాలు రోజుకో తీరున జరుగుతున్నాయి. షాపింగ్‌పై డిస్కౌంట్లు, బంపర్‌డ్రా వచ్చిందంటూ ఇన్నాళ్లు మోసాలకు పాల్పడ్డ సైబర్ నేరస్తులు తాజాగా మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందంటూ వాట్సాప్‌లో ఆర్టీవో పేరట మెసేజ్‌లు పంపుతున్నారు. ఆ టెక్ట్స్ ఫైల్‌ను ఓపెన్ చేస్తే బ్యాంక్ ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతుండడంతో వేములవాడ పట్టణంలో సోమవారం వైరల్‌గా మారింది. పట్టణానికి చెందిన సురేష్‌కు ఆదివారం ఈ మెసేజ్ రాగా.. ఓపెన్ చేయడంతో ఖాతాలోని డబ్బులు ఖాళీ అయ్యాయి. తాను మోసపోయానని గ్రహించిన సురేష్ స్థానికంగా ఉన్న సోషల్‌మీడియా గ్రూప్‌లలో ఇలాంటి మెసేజ్ వస్తుందని అలర్ట్ చేశారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930లో ఫిర్యాదు చేయాలని స్థానిక పోలీసులు సూచిస్తున్నారు. -
పేద విద్యార్థికి ఉచిత ఇంజినీరింగ్ సీటు
● ముందుకొచ్చిన జ్యోతిష్మతి కళాశాల యాజమాన్యంతిమ్మాపూర్/ముస్తాబాద్: ఆ తల్లి చివరి కోరిక నెరవేరింది. ఆర్థిక ఇబ్బందులతో కొడుకును ఇంజినీరింగ్ చదివించలేకపోతున్నానని ఆ మాతృమూర్తి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది. ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కరీంనగర్‌లోని జ్యోతిష్మతి కళాశాల యాజమాన్యం స్పందించింది. మానవత్వంతో ఆ తల్లి చివరి కోరికను నెరవేర్చింది. ముస్తాబాద్ మండలం ఆవునూరుకు చెందిన బండి లావణ్య పదిహేను రోజుల క్రితం కొడుకు ఇంజినీరింగ్ చదువుకు ఫీజు చెల్లించలేకపోతున్నానని మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. లావణ్య భర్త రవీందర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ సంఘటనపై సాక్షి ఈనెల 24న ‘చితికి పోతున్నారు’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి కరీంనగర్ జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల యజమాని జువ్వాడి సాగర్‌రావు స్పందించారు. వికాస్‌కు జ్యోతిష్మతి కళాశాలలో పూర్తి ఉచిత బీటెక్ ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లపాటు హాస్టల్ వసతి కూడా ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థి భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వికాస్.. చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, సెక్రటరీ జువ్వాడి సుమిత్‌సాయిలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు బైరి శ్రీనివాస్‌గౌడ్, ఆశాగౌడ్, సావిత్రి తదితరులు సాగర్‌రావు, సుమిత్‌సాయిలకు, సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. -
నేడు నేరెళ్లకు కల్వకుంట్ల కవిత
● బాధితులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ పరామర్శ ● న్యాయపోరాటానికి అండగా ఆర్థికసాయంసాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నేరెళ్లలో పర్యటించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో సంచలనం రేపిన నేరెళ్ల ఘటన బాధితులను పరామర్శించేందుకు ఆమె వస్తున్నారు. 2017లో పోలీసుల థర్డ్ డిగ్రీలో తీవ్రంగా గాయపడి 9 ఏళ్ల పాటు అనేక ఇబ్బందులు పడి ఇటీవల కన్నుమూసిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులను కవిత మంగళవారం ఉదయం 10.30 గంటలకు పరామర్శిస్తారు. కొంతకాలం క్రితం నేరెళ్ల బాధితులు కవితను కలిసి తమ గోడు చెప్పుకోగా వారికి అన్నివిధాల అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వారి న్యాయపోరాటానికి కొంత సాయం అందించారు. నేరెళ్ల దురాగతంలో భాగస్వాములుగా ఉన్న వారికి న్యాయపరంగా శిక్షపడే వరకు బాధితులకు వెన్నంటి ఉంటానని కవిత భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే మంగళవారం ఆమె బాధితుల కుటుంబాలతో మాట్లాడుతారు. ఘటన నేపథ్యం మిడ్ మానేరు రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యే మానేరునదిలో ఇసుక తవ్వకాలకు 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నేతలు మానేరు నది నుంచి పెద్దఎత్తున ఇసుక తీసి లారీల్లో హైదరాబాద్ తరలించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఇసుక తరలిస్తున్న లారీలతో సిరిసిల్ల ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. 2017 జూలై 2న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని నేరెళ్లకు చెందిన రైతు బదనపు భూమయ్య చనిపోయారు. భూమయ్య మరణంతో భగ్గుమన్న గ్రామస్తులు నేరెళ్లలో ఇసుక లారీలను తగులబెట్టారు. ఈ ఘటనకు బాధ్యులుగా గ్రామానికి చెందిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కరీంనగర్ జైలుకు తరలించిన తర్వాత 8 మంది బాధితుల్లో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ల పరిశీలనలో థర్డ్ డిగ్రీ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి పోలీసుల చిత్ర హింసల నుంచి బాధితులు ఇప్పటికీ కోలుకోలేదు. నేరెళ్ల బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ ఇటీవల మృతిచెందారు. మరో బాధితుడు పెంట బాణయ్య కిడ్నీల సమస్యతో బాధ పడుతున్నాడు. మిగతా వారు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. -
వెన్నెలవాడగా మార్చుతాం
వేములవాడ: పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణ బ్యూటిఫికేషన్లో భాగంగా రూ.2.65కోట్లతో సెంట్రల్ లైటింగ్‌ను సోమవారం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, స్థానిక కౌన్సిలర్ అనితలతో కలిసి ప్రారంభించారు. వెన్నెలవాడగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొదటి, రెండో బైపాస్‌రోడ్లలోని ప్రధాన ప్రాంతాల్లో 150 స్తంభాలు, 300 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో 82 విద్యుత్ స్తంభాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. తిప్పాపూర్ బస్టాండ్ ఆధునికీకరణకు రూ.1.60కోట్లు కేటాయించామన్నారు. బస్టాండ్‌లో దిగిన ప్రయాణికులు సులభంగా ఆలయానికి చేరుకునేలా ప్రత్యేక మార్గాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులు 45 శాతం పూర్తయ్యాయని తెలిపారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం బద్దిపోచమ్మ ఆలయం, భారీ శివుడి విగ్రహం, టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని వివరించారు. -
డీఎం అవుట్ !
ధాన్యం కొనుగోల్‌మాల్..● పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహారెడ్డి సరెండర్ ● డీసీఎస్వోకు జిల్లా మేనేజర్‌గా అదనపు బాధ్యతలుసిరిసిల్ల: ధాన్యం కొనుగోళ్ల అక్రమాలు కొలిక్కి రావడం లేదు. కంచె చేను మేసిన చందంగా రోజుకో అక్రమం వెలుగుచూస్తోంది. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహారెడ్డిని విధుల నుంచి తప్పిస్తూ.. ఆ శాఖకు సరెండర్ చేశారు. అతని స్థానంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అప్పటికే పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహారెడ్డి షోకాజ్ నోటీసు అందుకున్నారు. అతను ఇచ్చిన సమాధానంతో జిల్లా ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా అతన్ని సరెండర్ చేయగా.. మరిన్ని అవినీతి మరకలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారి బ్యాంకు ఖాతాలోకి రూ.5లక్షలు! ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న గోదాం ఇన్చార్జి ఉత్కం విజయ్ ద్వారా జిల్లా స్థాయి అధికారి బ్యాంకు అకౌంట్‌కు రూ.5లక్షలు నెఫ్ట్ ద్వారా బదిలీ అయినట్లు సమాచారం. 13 లారీల వడ్లను పక్కదారి పట్టించిన తరువాతే.. ఈ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఆ రూ.5లక్షల్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖ డీఎంను సరెండర్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులే తొలి ఫిర్యాదుదారులు సిరిసిల్ల అపెరల్ పార్క్‌లో 86 బస్తాల ధాన్యం పక్కదారి పట్టాయని తొలుత ఫిర్యాదు చేసిన గోదాం ఇన్చార్జి విజయ్ 13 లారీల వడ్లు పక్కదారి పట్టేందుకు అసలు సూత్రధారి. ఈ ఘటనలపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నర్సింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. తాజాగా నిందితుల బ్యాంకు అకౌంట్ నుంచి జిల్లా స్థాయి అధికారి ఖాతాకు రూ.5లక్షలు బదిలీ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సదరు అధికారిని సరెండర్ చేసినట్లు తెలిసింది. ఫిర్యాదుదారులే అక్రమాల్లో భాగస్వాములైనట్లు సమాచారం. మరికొందరు అధికారులకు భాగస్వామ్యం ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి. నిందితులకు కండిషన్ బెయిల్ ! ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో అరెస్టయిన ఆరుగురికి ఇటీవల కండిషన్ బెయిల్ మంజూరైంది. జైలు నుంచి వచ్చిన అపెరల్ పార్క్ గోదాం మేనేజర్ ఉత్కం విజయ్, వేములవాడరూరల్ అచ్చన్నపల్లికి చెందిన వాసాల గణేశ్, రుద్రంగి మండలం మానాలకు చెందిన ఐకేపీ ఇన్చార్జి గడ్డం స్వామి అలియాస్ నర్సిరెడ్డి, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ ఆఫీస్‌లో పనిచేసే కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన కమ్మరి రాజశేఖర్, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పీఏసీఎస్(సింగిల్ విండో) ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జి గాజుల నవీన్, వేములవాడ చెందిన రైస్‌మిల్లర్ చేపూరి మధుకర్లకు కండిషన్ బెయిల్ వచ్చింది. వీరు ప్రతీ శనివారం సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో సంతకాలు చేయాల్సి ఉంది. సస్పెన్షన్లు.. నోటీసులు.. లైసెన్స్‌ల తొలగింపు ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న ఏడుగురు జైలుకు వెళ్లి బెయిల్‌పై రాగా.. పౌరసరఫరాలశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి కమ్మరి రాజశేఖర్, కోనరావుపేట మండలం మల్కపేట ఐకేపీ సెంటర్ బుక్‌కీపర్ జంగిటి శ్రీనివాస్, ఐకేపీ వీఓఏ పి.పర్శరాములు, రుద్రంగిలో డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు గడ్డం నర్సిరెడ్డి, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో పీఏసీఎస్ నిర్వాహకుడు గాజుల నవీన్, జిల్లా పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వేణు, కోనరావుపేట ఐకేపీ ఏపీఎం రాజేశంను, సిరిసిల్ల సింగిల్‌విండో సెక్రటరీ బి.నరేశ్‌ను, ఐకేపీ సీసీ శ్రీదేవి, వీర్నపల్లి ఐకేపీ ఏపీఎం దేవరాజులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ సస్పెండ్ చేశారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఎల్.బుచ్చిబాబు, జిల్లా మేనేజర్ నర్సింహారెడ్డి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా సహకార అధికారి టి.రామకృష్ణలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని ఆదిత్య లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసి, బ్లాక్ లిస్టులో పెట్టారు. రుద్రంగి మండలం మానాలకు చెందిన గడ్డం స్వామి అలియాస్ నర్సారెడ్డికి చెందిన ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఫెర్టిలైజర్, సీడ్స్ షాపు లైసెన్సులను రద్దు చేశారు. వేములవాడలోని మల్లికార్జున రైస్‌మిల్లు పారిశ్రామిక లైసెన్స్ రద్దుకు నోటీసులు జారీ చేశారు. తాజా పరిణామాలతో ధాన్యం కొను‘గోల్మాల్’ జిల్లా అధికార యంత్రాంగాన్ని కుదిపేస్తోంది. -
ఇసుక తోడేస్తున్నారు..
కోనరావుపేట(వేములవాడ): అనుమతి మూడెకరాలు తీసుకుంటే.. పది ఎకరాలకు మించి ఇసుక తోడుతున్నారు. మూలవాగు పరిసరాల్లో వ్యవసాయ బావులు, బోరుబావుల్లో నీటి ఊటలు ఇంకిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక క్వారీ పేరిట అనుమతులు ఒక చోట తీసుకొని.. తవ్వకాలు మరో చోట చేపట్టి సహజ వనరులను కాంట్రాక్టర్ దోచుకుంటున్నాడని రైతులు సోమవారం ఆందోళనబాట పట్టారు. ఇసుక వ్యాపారులకు అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపించారు. గతంలో అనుమతులు రద్దు కోనరావుపేట మండలం బావుసాయిపేట–మామి డిపల్లి మద్య మూలవాగు ప్రవహిస్తుంది. గతంలో బావుసాయిపేటకు చెందిన సర్వేనంబర్ 83సీలో చీటి అశోక్‌రావుకు చెందిన భూమిలో ఇసుక మేటలు పెట్టాయని వాటిని తొలగించుకునేందుకు అనుమతులు తీసుకున్నారు. అందులోంచి ఇసుకను తరలించగా ఆ సమయంలో అధిక వర్షాలు కురిసి ఆ ప్రాంతం ముంపునకు గురైంది. దీంతో ఆ ప్రాంత రైతులు తమను ఆదుకోవాలంటూ అప్పటి కలెక్టర్‌ను కోరగా ఇసుక రీచ్ అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 3.30 ఎకరాలలో అనుమతి ఈ యేడాది 3.30 ఎకరాలలో 16వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాల కోసం మే 26న అనుమతులు తీసుకున్నారు. పట్టా భూమిలో కాకుండా మూలవాగులో 10 నుంచి 12 ఎకరాలలో రెండు నెలలుగా తవ్వకాలు చేపడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అనుమతులకు మించి ఇసుక తోడుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు. -
సీపీఎస్ రద్దే ధ్యేయం
సిరిసిల్ల అర్బన్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు.. ఓపీఎస్ పునరుద్ధరణే ధ్యేయంగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన జనజాగరణ యాత్ర 17వ రోజు సోమవారం సిరిసిల్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్నర్‌మీటింగ్ నిర్వహించారు. ఆగస్టు 23న చేపట్టే చలో హైదరాబాద్ సభ పోస్టర్లు ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, గడ్డం వెంకటేశ్, మహాదేవ్, చంద్రకాంత్, పీఆర్టీయూ, టీపీటీఎఫ్ జిల్లా నాయకులు దుమాల రమానాథ్‌రెడ్డి, కిషన్, ఎస్టీయూ సదానందం పాల్గొన్నారు. -
వాంతులు.. జ్వరాలు
సిరిసిల్లటౌన్: జిల్లాలో ప్రతీ ఇంట్లో జ్వరపీడితులు ఉన్నారు. పడకేసిన పారిశుధ్య నిర్వహణ.. పెరిగిన దోమలతో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. రోడ్లపైనే పారుతున్న డ్రెయినేజీలు.. జనావాసాల మధ్య ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. వాతావరణ పరిస్థితుల్లోనూ తీవ్ర మార్పులతో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి నిత్యం 700 మంది వరకు రోగులు ఓపీలో వైద్యసేవలు పొందుతున్నారంటే జ్వరాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో విషజ్వరాలపై ఫోకస్. ఇవీ పాటించాలి 24 గంటలు వైద్యసేవలు జిల్లా ఆస్పత్రిలో మూడు షిఫ్టుల్లో 24గంటలు వైద్యసేవలు అందిస్తున్నారు. జూలైలో 68 మంది జ్వరపీడితులు ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందారు. పిల్లల వార్డులో 53 మంది ఐపీగా చికిత్స పొందారు. ఇక జీజీహెచ్ టెస్టుకు 1,800, మలేరియా టెస్టులకు 1,800 కిట్లు చికెన్‌గున్యాకు టీ–హబ్‌లో 500 కిట్లు అందుబాటులో ఉన్నాయి. జ్వరాలకు సంబంధించిన ఐవీఎఫ్(12వేలు), పారాసిటమాల్ టాబ్లెట్స్(2.60లక్షలు), ఇంజక్షన్లు(7,200), యాంటిబయాటిక్స్(13) చొప్పున అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సి వస్తే అన్నిరకలా రక్తనమూనాలు 59 అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు మలేరియా, టైఫాయిడ్, డెంగీ కేసులు రాలేదని పేర్కొన్నారు. -
మీరాబాయి చాను
బంగారు స్ఫూర్తి...కరీంనగర్‌స్పోర్ట్స్: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్–2026లో భారత వెయిట్‌లిఫ్టింగ్ స్టార్ మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించడం దేశవ్యాప్తంగా క్రీడాకారుల్లో నూతనోత్సాహం నింపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణించాలని కలలు కంటున్న యువ క్రీడాకారుల్లో ఈ విజయం ఆత్మవిశ్వాసం నింపుతోంది. సరైన శిక్షణ, కఠోరసాధన, లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం సాధ్యమేనని ఆమె నిరూపించారు. ఆమె విజయం ఉమ్మడి జిల్లా వెయిట్ లిఫ్టర్లకు స్ఫూర్తిగా నిలుస్తోందని జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం ప్రతినిధులు, క్రీడాకారులు పేర్కొన్నారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, లక్ష్యసాధనతో ప్రపంచ వేదికపై విజయాలు సాధించవచ్చని మీరాబాయి మరోసారి నిరూపించారని కొనియాడారు.కామన్వెల్త్ పతకంతో మీరాబాయి చాను జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న శృతి (కరీంనగర్) మీరాబాయి చాను విజయం మహిళా క్రీడాకారిణులకు గొప్ప ప్రేరణ. కష్టపడి సాధన చేస్తే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఆమె నిరూపించారు. ఆమె విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మరింత పట్టుదలతో శిక్షణ కొనసాగిస్తాను. ఒకరోజు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల. – ఎం సాయిదుర్గ, జాతీయ వెయిట్‌లిఫ్టర్ -
సీఎమ్మార్ లక్ష్యం పూర్తి చేయండి
సిరిసిల్ల: రైస్‌మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్)ను గడువులోగా అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో సోమవారం రైస్‌మిల్లర్లతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ వేలం వేసిన ధాన్యం బకాయిలు గడువులోగా చెల్లించాలని, గత సీజన్లో సీఎమ్మార్ ఇవ్వడంలో జాప్యం చేయొద్దని సూచించారు. రోజువారీ లక్ష్యాలు నిర్ణయించి, సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఏఎస్పీ చంద్రయ్య, ఎఫ్‌సీఐ జిల్లా మేనేజర్ రవిప్రకాశ్, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి బుచ్చిబాబు, రైస్‌మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు చేపూరి నాగరాజు, గరిపల్లి ప్రభాకర్, పబ్బ నాగరాజు ఉన్నారు. చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి ఇవ్వాలి చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి ఇవ్వాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. నాలుగు రకాల చెత్త డబ్బాలను పరిశీలించారు. ఆకుపచ్చ డబ్బా తడి చెత్త, నీలం డబ్బా పొడి చెత్త, ఎరుపు డబ్బా శానిటరీ చెత్త, నలుపు రంగు డబ్బా హానికరమైన ప్రత్యేకమైన చెత్త కోసం వినియోగించేందుకు ఏర్పాటు చేశారు. డీఎల్పీవో నరేశ్, సచ్ఛభారత్ మిషన్ జిల్లా కో–ఆర్డినేటర్ సురేశ్ పాల్గొన్నారు. -
జోరుగా మానేరు రివర్ ఫ్రంట్ పనులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: కరీంనగర్ జిల్లా కేంద్రానికి తలమాణికంగా మారుతుందని చెప్పుకుంటున్న మానేరు రివర్‌ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) కోసం మరింత భూమి అవసరమైంది. తాజాగా నదికి ఎడమవైపున 8.05 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం రూ.410 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నీటిపారుదల, పర్యాటక శాఖ సంయుక్తంగా చేపట్టాయి. ఇందులో రూ.300 కోట్ల వరకు నీటిపారుదల శాఖ భరించగా, మిగిలిన నిధులను పర్యాటకశాఖ వెచ్చించనుంది. గుజరాత్‌లోని సబర్మతీ నదీ తీరం స్ఫూర్తిగా గత ప్రభుత్వం మానేరు తీరాన్ని అభివృద్ధి చేయాలని ఈ ప్రాజెక్టును చేపట్టింది. నదికి రెండు వైపులా కాంక్రీట్ గోడలు నిర్మించి తీరాన్ని రెండువైపులా పర్యాటపరంగా అభివృద్ధి చేయాలన్న తలంపుతో చేపట్టిన మానేరు రివర్‌ఫ్రంట్ పురోగతి ప్రభుత్వం మారిన కొన్ని నెలల తర్వాత పర్యావరణ, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా నెమ్మదించింది. ఇటీవల ఈ ప్రాజెక్టుకు జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ప్రాధాన్యం ఇవ్వడంతో పనులు తిరిగి వేగం పుంజుకున్నాయి. రూ.40 కోట్ల చెల్లింపునకు సిద్ధం మానేరు రివర్ ఫ్రంట్‌లో భాగంగా ఎడమవైపు (నగరం వైపు) 8.05 ఎకరాల స్థలం అవసరం అయింది. నదీతీరం వైపు తవ్వేందుకు స్థలం కావాల్సి వచ్చింది. ఈ మేరకు తొలుత అధికారులు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఎంత స్థలం కావాలి అన్న విషయంలో పలు సాంకేతిక సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో తొలిదశలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు అంతా సిద్ధమైనా.. ఆఖరు నిమిషంలో నోటిఫికేషన్ విడుదల కాకుండా నిలిచిపోయింది. చివరికి రెవెన్యూ డిపార్ట్మెంట్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ)లు విషయాన్ని కొలిక్కి తీసుకురావడంతో 8.05 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే.. ఈ మొత్తం భూమికి యజమానులకు దాదాపు రూ.40 కోట్ల వరకు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా మంత్రులంతా పనులపై నిరంతరం ఆరా తీస్తుండటంతో భూసేకరణకు అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. తొలి దశలో 82శాతం పనులు పూర్తి.. రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి దశలో 3.75 కిలోమీటర్ల వరకు, రెండో దశలో 6.25 కిలో మీటర్ల మేర ఇరువైపులా అభివృద్ధి చేయనున్నారు. మానేర్ రివర్ ఫ్రంట్‌లో 12 నుంచి 13 అడుగుల లోతు వరకు నీరు నిల్వ ఉంటుంది. స్పీడ్ బోట్లు, క్రూజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ కన్సల్టెన్సీ మానేర్ రివర్ ఫ్రంట్ పనులు చేపడుతోంది. తొలిదశ పనుల్లో ఇప్పటి వరకు 82 శాతం పూర్తయ్యాయి. 3.75 కి.మీ ప్రొటెక్షన్ వాల్లో ఎడమవైపు 3.5 కి.మీ మేర, కుడివైపు 3.25 కి.మీ మేర గోడ నిర్మాణం అయిపోయింది. మరో 250 మీటర్ల మేర పనులు పెండింగ్ ఉన్నాయి. ప్రొటెక్షన్ వాల్స్‌కు ఇరువైపులా మట్టితో నిర్మించిన కట్ట పనులు కూడా పూర్తయ్యాయి. మొత్తంగా రూ.277 కోట్లను నీటిపారుదల శాఖ పనులకోసం వెచ్చించింది. ఇందులో భాగంగా తీగల వంతెన పక్కన నిర్మించనున్న చెక్ డ్యాం పనులు దాదాపు పూర్తయ్యాయి. వీటికి బిగించేందుకు అధికారులు గేట్లు కూడా తీసుకువచ్చారు. ఈ గేట్లతోనే మానేరు రివర్‌ఫ్రంట్‌లో నీటిని నియంత్రించనున్నారు. ఇటీవల కలెక్టర్ చిత్రా మిశ్రా సైతం మానేరు రివర్ ఫ్రంట్ విషయంలో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, బ్యూటిఫికేషన్ వర్క్స్, రైలింగ్, గార్డెనింగ్ వంటి అభివృద్ధి పనులపై ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు. ఇరిగేషన్, టూరిజం కార్పొరేషన్, రెవెన్యూ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. -
చైన్‌స్నాచింగ్‌కు విఫలయత్నం
● మహిళ కేకలు వేయడంతో పరారైన ఆగంతకుడుబోయినపల్లి(చొప్పదండి): కిరాణ స్టోర్‌లో ఉన్న మహిళ మెడలోంచి బంగారు చైన్ లాగేందుకు ఓ ఆగంతకుడు యత్నించగా.. మహిళ కేకలు వేయడంతో పరారయ్యాడు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో కొండం విజయ తన కిరాణ దుకాణంలో ఒంటరిగా ఉంది. మొదట హెల్మెట్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి సిగరెట్ కొనుగోలు చేసి వెళ్లాడు. అనంతరం అదే వ్యక్తి మళ్లీ వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేయడంతో ఆగంతకుడు పరారయ్యాడు. బాధితురాలు కొండం విజయ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. -
భద్రతా ప్రమాణాలు పటిష్టంగా అమలు చేయాలి
గోదావరిఖని: బొగ్గుగనుల్లో భద్రతా ప్రమాణాలు మరింత పటిష్టంగా అమలు చేయాలని ధన్‌బాద్‌కు చెందిన డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్తాహ్ అన్నారు. సోమవారం రాత్రి ఎన్టీపీసీ శ్రీమయి కన్వెన్షన్ హాల్లో జరిగిన 56వ వార్షిక భద్రతా పక్షోత్సవం బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ముందుగా గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల ఆత్మకుశాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రమాదాల్లేని సింగరేణిగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. సింగరేణి డైరెక్టర్ ఎల్వీ సూర్యనారాయణ మాట్లాడుతూ గనుల్లో పటిష్టమైన రక్షణ చర్యలు అమలు చేస్తున్నామని, రక్షణకు పెద్దపీట వే స్తున్నామన్నారు. డీవైడీజీఎంఎస్ అధికారులు క న్న న్, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, తిరుమల్‌రావు, వెంకన్న, ఇతర అధికారులు, యూనియన్ నాయకులు సీ తారామయ్య, జనక్‌ప్రసాద్ పాల్గొన్నారు. పలుగనులకు రక్షణ బహుమతులు అందజేశారు. -
చట్టపరిధిలో న్యాయం చేయాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్ల: బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేయాలని, ఫిర్యాదుదారులపై మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 17 మంది బాధితుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ఠాణాల ఎస్‌హెచ్‌వోలతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించేలా చూస్తామన్నారు. ఆధునిక విధానాలతో అధిక దిగుబడులు తంగళ్లపల్లి(సిరిసిల్ల): సాంప్రదాయ పద్ధతులు కాకుండా ఆధునిక విధానంలో సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం రైతు విత్తన మేళా నిర్వహించారు. అఫ్జల్ బేగం మాట్లాడుతూ ఆరుతడి పంటల ప్రాధాన్యత గురించి వివరించారు. మండల వ్యవసాయ అధికారి సంజీవ్, సర్పంచ్ మోర లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. పనిచేసే వారికి గుర్తింపు వేములవాడ: పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందని ఈవో రమాదేవి పేర్కొన్నారు. రాజన్న ఆలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులను అందజేశారు. పారువెల్లి భానుశర్మ ప్రధాన అర్చకులుగా, కూరగాయల శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్‌గా, మేకల వెంకటేశ్ జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. డీఈవో నవీన్ తదితరులు పాల్గొన్నారు. 29న జావలిన్ డే ఎంపిక పోటీలు సిరిసిల్ల అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న జావలిన్ డే ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. పట్ట ణంలోని బతుకమ్మఘాట్ వద్ద నిర్వహించే జా వలిన్, పరుగుపందేల ఎంపిక పోటీలకు అండర్–6 నుంచి అండర్–20లోపు మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 7న హనుమకొండలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 30 నుంచి వరుణయాగం వేములవాడ: భీమన్న ఆలయంలో మూడు రోజులపాటు వరుణయాగం నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి సోమవారం తెలిపారు. ఈనెల 30 నుంచి ఆగస్టు 1 వరకు వరుణయాగాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రాజన్న ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం, భీమేశ్వర ఆలయంలో రుశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ యాగం నిర్వహించనున్నట్లు వివరించారు. విద్యుత్ సరఫరాలో లోపాలు అధిగమించాలిసిరిసిల్లటౌన్: విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ టి.మధుసూదన్ సూచించారు. సిరిసిల్లలోని జిల్లా విద్యుత్‌శాఖ సర్కిల్ ఆఫీస్‌లో సోమవారం సమీక్షించారు. రైతులకు ఇస్తున్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులు, ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు, కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ ఉపకేంద్రాలు, కొత్త పరిశ్రమలకు సరఫరా చేస్తున్న లైన్లు, కొత్త సర్వీసుల మంజూరుపై ఆరా తీశారు. చీఫ్ ఇంజినీర్ అశోక్, ఎస్ఈ వేణుమాధవ్, డీఈలు అంజయ్య, వెంకటరమణ పాల్గొన్నారు. -
హెచ్చుతగ్గులుగా ఉంది
నేను చాలా ఏళ్లుగా సిరిసిల్లలో కారీలు అమ్ముతూ ఉపాధి పొందుతున్న. నాలుగు రోజుల క్రితం తీవ్రమైన జలుబుతో జ్వరం వచ్చింది. అచేతనంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి వచ్చిన. టెస్టులు చేసిండ్రు. జ్వరం తగ్గుతూ..మళ్లీ వస్తోంది. – అబ్దుల్ రషీద్, కారీ విక్రయదారుడు, సిరిసిల్ల విరోచనాలు మా బాబు సుశాంత్‌కు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. వెంటనే వాంతులు అయ్యాయి. తగ్గడానికి మందు వేస్తే విరోచనాలు మొదలయ్యాయి. ఆలస్యం చేయకుండా ఆదివారం జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చినం. – పుల్లూరి సుశాంత్, ముస్తాబాద్ చికిత్స అందిస్తాం జ్వరాలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రోగులకు చికిత్స అందించేందుకు జిల్లా ఆస్పత్రిలో ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు, ఓఆర్ఎస్లు, యాంటిబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఐసీయూలో పది పడకలు కేటాయించాం. – డాక్టర్ సుమన్ మోహన్‌రావు, ఆర్ఎంవో -
బావిని పూడ్చారు
బావుసాయిపేట ఇసుక తవ్వకాలకు సమీపంలో మూలవాగులో ఉన్న వ్యవసాయ బావిని పూడ్చివేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే మా భూమి నుంచే మరింత ఇసు కను తీస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. – కర్నాల శ్రీకాంత్, బావుసాయిపేటఇసుకరీచ్ రద్దు చేయాలి బావుసాయిపేటలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్తో పొలాలు దెబ్బతింటున్నాయి. మూడేళ్ల క్రితం వచ్చిన వరదతో పంటలు మునిగిపోయాయి. ఇప్పుడు కూడా అలాగే తవ్వడంతో భారీ వర్షాలు వస్తే ఈ ప్రాంతంలోని పంట పొలాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. – దువ్వల రాములు, బావుసాయిపేట మా పరిధిలోకి రాదు బావుసాయిపేటలోని ఇసుక క్వారీ మా పరిధిలోకి రాదు. క్వారీకి టీజీఎండీసీ అనుమతులు తీసుకున్నారు. అనుమతులున్న చోటనే తవ్వకాలు చేపట్టాలి. రెవెన్యూ అధికారులను ఫీల్డ్ వద్దకు పంపించి విచారణ చేపడతాం. మరో చోట ఇసుకను తవ్వితే చర్యలు తీసుకుంటాం. – వరలక్ష్మి, తహసీల్దార్, కోనరావుపేట -
ధాన్యం డబ్బులు ఇప్పించండి
● 30 మంది రైతులు.. 3 గంటలపాటు ఆందోళన ● పది రోజుల్లో న్యాయం చేస్తామన్న అధికారులువేములవాడరూరల్: ధాన్యం డబ్బులు రావడం లేదని.. న్యాయం చేయండి అంటూ రైతులు నిర్మాణంలో ఉన్న ఇంటిపైకి ఎక్కి సోమవారం నిరసన తెలిపారు. మూడు గంటలపాటు ఆందోళన చేపట్టగా అధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో శాంతించారు. రైతులు, అధికారులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ మండలం మర్రిపల్లి, నూకలమర్రి, మల్లారం గ్రామాలకు చెందిన దాదాపు 46 మంది రైతులు వేములవాడ సొసైటీకి 7 లారీల ధాన్యం విక్రయించారు. ఈ ధాన్యానికి సంబంధించి దాదాపు రూ.52 లక్షలు రావాల్సి ఉంది. సొసైటీ ద్వారా జిల్లా కేంద్రంలోని ఓ గోదాంకు వెళ్లింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మధుకర్ ఆ ధాన్యాన్ని పక్కదోవ పట్టించాడు. ఈ విషయంలో సదరు వ్యక్తిపై కేసు నమోదుకావడంతోపాటు రిమాండ్‌కు తరలించారు. ఈక్రమంలోనే రైతుల డబ్బులు వారి ఖాతాల్లో జమకావడం లేదు. మధుకర్ వేములవాడలో నిర్మిస్తున్న ఇంటిపైకి ఎక్కిన రైతులు దాదాపు మూడు గంటలపాటు నిరసన తెలిపారు. వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, డీసీవో బుచ్చిబాబు, తహసీల్దార్లు జయంత్, అబుబాకర్లు అక్కడికి వెళ్లి 10 రోజుల్లో డబ్బులు జమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వకుళాభరణం శ్రీనివాస్, మల్లారం మాజీ ఎంపీటీసీ వీరారెడ్డి, మల్లారం ఉపసర్పంచ్ కొంపెల్లి శ్రీకాంత్, నూకలమర్రి ఉపసర్పంచ్ శంకరయ్యగౌడ్ ఉన్నారు. -
తండ్రి మృతి.. కూతుళ్లు అనాథలు
ముస్తాబాద్(సిరిసిల్ల): రెండేళ్ల క్రితం తల్లి.. నేడు తండ్రి మృతిచెందడంతో ముగ్గురు కూతుళ్లు అనాథలయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా పోతుగల్‌కు చెందిన జిల్లెల వెంకటేశ్(45) రైస్‌మిల్లులో కార్మికుడిగా పనిచేసేవాడు. భార్య వినోద రెండేళ్ల క్రితం క్యాన్సర్‌తో మృతిచెందింది. ముగ్గురు పిల్లలను అన్నీ తానై పోషించిన వెంకటేశ్ మూత్రపిండాల వ్యాధికి గురికావడంతో రూ.8లక్షల వరకు అప్పుచేసి చికిత్స అందించారు. అయినా వ్యాధి నయంకాక ఆదివారం రాత్రి మరణించాడు. తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో ముగ్గురు కుమార్తెలు అనాథలయ్యారు. ఈ విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి సమాచారం ఇచ్చారు. ఆయన స్పందించి రూ.25 వేల నగదును పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు క్రాంతి ద్వారా బాధిత కుటుంబానికి అందించారు. ఉపసర్పంచ్ కోల కృష్ణ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.కల్యాణకట్టలో అదనపు వసూళ్లపై ఫిర్యాదువేములవాడ: రాజన్న ఆలయ కల్యాణకట్టలో అదనపు వసూళ్లు చేస్తున్నారంటూ వరంగల్‌కు చెందిన భక్తురాలు హసీనా ఆలయ ఈవో రమాదేవికి సోమవారం ఫిర్యాదు చేశారు. యాకూబ్భాష, హసీనా కుటుంబ సభ్యులతో కలిసి తలనీలాలు సమర్పించుకునేందుకు కల్యాణకట్టకు వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న వెంకటేశ్ అనే నాయీబ్రాహ్మణుడు అధికారిక రుసుంపై అదనంగా రూ.50 ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. నగదు లేదని చెప్పడంతో రూ.50 ఫోన్‌పే చేయాలని బలవంతం చేయడంతో పంపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్పెద్దపల్లి: కమాన్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్‌ను సస్పెన్షన్ చేస్తూ ఇంటర్మీడియట్ డైరెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేశారు. ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించే సమయంలో అనుచిత ప్రవర్తన, కార్యాలయ క్రమశిక్షణ పాటించకపోవడం తదితర ఆరోపణలు రావడంతో క్రమశిక్షణా చర్యలు సిఫార్సు చేయడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. -
భూ వివాదాలతో రావొద్దు..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా కలెక్టర్.. పోలీసు విభాగానికి మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. భూ సమస్యలకు సంబంధించిన ఎలాంటి వివాదాలూ తమ వద్దకు తీసుకురావద్దని జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎదుట పోలీసులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ బోర్డులు గమనించకుండా వెళ్లిన వారికి ప్రజావాణి లేదా రెవెన్యూ విభాగానికి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో చేసేది లేక బాధితులు ప్రజావాణి బాట పడుతున్నారు. వాస్తవానికి కోర్టు పరిధిలో ఉన్న అంశాలు, ఆస్తి పంపకాలు, అద్దె గొడవలు, సివిల్ వివాదాల విషయాల్లో పోలీసులు కలగజేసుకోరు. కానీ.. ఈ వివాదాల నేపథ్యంలో ఏవైనా గొడవలు, కొట్లాటలు, ఇతర హింసాత్మక చర్యలు తలెత్తితే మాత్రం వారి జోక్యం అనివార్యం. ఇటీవల పెద్దపల్లి డీసీపీ కూడా ఎలాంటి భూవివాదాల్లోనూ పోలీసులు జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఠాణాల ఎదుట ఈ బోర్డులు వెలిశాయి. నాటి వివాదమే కారణమా..? ఇటీవల రెవెన్యూ, పోలీసు శాఖలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా పలువురు పోలీసులు దారి తప్పుతున్నారని, ఎవరు ఏమేం చేస్తున్నారో తనకు అంతా తెలుసని, ప్రతీ ఒక్క పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డిపార్ట్మెంట్ అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ పోలీస్ శాఖకు నేరుగా హెచ్చరికలు జారీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కలెక్టర్ హెచ్చరికలను డిపార్ట్మెంట్లోని కొందరు స్వాగతించగా.. మరికొందరు విభేదించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మెజారిటీ పోలీసులు కలెక్టర్ తీరుపై అసంతప్తిగానే ఉన్నా.. బయటకు వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖలో రెవెన్యూ విభాగానికి చెందిన భూ సమస్యల ఫిర్యాదులు తీసుకోకూడదంటూ పెద్దపల్లి డీసీపీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామే తప్ప.. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో బోర్డులు ఏర్పాటు చేయలేదని పోలీసులు అధికారులు స్పష్టంచేస్తున్నారు. పోలీసు శిక్షణకు పరస్పర దూరం రెవెన్యూ, పోలీసు విభాగాల మధ్య దూరం లేదని పైకి చెబుతున్నా.. వారి చర్యలు మాత్రం మరోలా కనిపిస్తున్నాయి. ఇటీవల జిల్లాలో పోలీసు ఉద్యోగార్థుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించారు. గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు కనిపించలేదు. అదే పెద్దపల్లిలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పోలీసు విభాగం నుంచి ఎవరూ పాల్గొనలేదు. ఈ రెండు కార్యక్రమాల్లో సంబంధిత విభాగాలు పాల్గొనలేకపోవడానికి కారణం సమాచార లోపమా..? లేక రెండు విభాగాల మధ్య పెరుగుతున్న దూరమా..? అనే విషయంపై ఎవరూ స్పష్టతఇవ్వడం లేదు. మొత్తానికి రెండు విభాగాల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందని జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో మాత్రం చర్చ మొదలైంది. పోలీస్స్టేషన్ల ఎదుట బోర్డులు పెట్టిన జిల్లా పోలీస్ యంత్రాంగం అలాంటి సమస్యలుంటే రెవెన్యూ విభాగానికి వెళ్లాలని సలహా ఇటీవల కలెక్టర్ ‘క్లాస్’తోనే ఫ్లెక్సీలు వెలిశాయన్న చర్చ అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్న పోలీసులు పోలీసు అభ్యర్థుల శిక్షణ కార్యక్రమాల్లో పరస్పర దూరం -
క్విట్ ఇండియా స్ఫూర్తితో జైల్‌భరో
సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా క్విట్ ఇండియా స్ఫూర్తితో జైల్ భరో కార్యక్రమాన్ని చేపడుతున్నామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. ఆదివారం బీవైనగర్‌లోని పార్టీ కార్యాలయంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు సూరం పద్మ, జిల్లా నాయకులు కోల శ్రీనివాస్, జిందం కమలాకర్, బింగి సంపత్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. -
దేశ గౌరవ ప్రతీక కార్గిల్ దివస్
సిరిసిల్లటౌన్: కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌ను భారత సేనలు మట్టికరిపించిన విజయ్ దివస్ జూలై 26 దేశ గౌరవానికి ప్రతీక అని మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ అన్నారు. బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో పట్టణంలోని కార్గిల్లేక్పై వైజయంతి యుద్ధ ట్యాంకు వద్ద అమర జవాన్లకు నివాళి అర్పించారు. 1999లో కార్గిల్ యుద్ధంలో మన సైనికులు ధైర్యంతో పోరాడి 527 మంది వీరులు తమ ప్రాణాలు అర్పించారన్నారు. అనంతరం పట్టణంలోని మాజీ సైనికులను సన్మానించారు. కౌన్సిలర్ ఎర్రం వెంకట్రాజం, ఎర్రం మహేశ్, శీలం రాజు, నవీన్‌యాదవ్, నాగుల శ్రీనివాస్, గాజుల వేణు, వేముల వైశాలి, మోర శ్రీహరి, అంకారాపు రాజు, చేపూరి అశోక్, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రజా ప్రభుత్వంలో మెరుగైన రవాణా సౌకర్యం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి (వేములవాడ): రెండు జిల్లాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం చందుర్తి మండలం ఎన్గల్ గ్రామం నుంచి నిజాబామాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రం వరకు బస్సును ప్రారంభించి మాట్లాడారు. సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ మార్గంలో మళ్లీ బస్సు సర్వీస్ ప్రారంభం కావడం హర్షణీయమన్నారు. ప్రజా ప్రభుత్వంలో వేములవాడ డిపోకు 20 కొత్త బస్సులు అందించామన్నారు. వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను విస్తరిస్తున్నట్లు వివరించారు. సర్పంచ్ అసనిపర్తి శోభారాణి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, పార్టీ మండల అధ్యక్షుడు గొట్టే ప్రభాకర్, జిల్లా పధాన కార్యదర్శి షేక్ ఫిరోజ్ పాషా, నాయకులు గసికంటి ప్రభాకర్, లాండే తిరుపతి, ఎదురుగట్ల అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు
వేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుంటుంటారనీ, భక్తుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని ఈవో రమాదేవి హెచ్చరించారు. ఆదివారం ప్రొటోకాల్ కార్యాలయంలో నాయీబ్రాహ్మణులతో మాట్లాడారు. భక్తులను నగదు అడుగుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రచారంలోకి రావడంతో ఆలయ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందన్నారు. భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయకుండా నేరుగా ఆలయ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు డిమాండ్ చేయరాదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఈవో జయకుమారి, నాగుల మహేశ్, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, రాజేందర్ పాల్గొన్నారు. ఫీజు బకాయిలు చెల్లించాలిసిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: పేద విద్యార్థులకు బకాయిపెట్టిన ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి డిమాండ్ చేశా రు. విద్యార్థుల హక్కుల సాధనకు ‘ఫీజు బకాయి– బీజేపీ లడాయి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటున్న విధానాన్ని నిరసిస్తూ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. జింక అనిల్, రాజ్‌కుమార్, పెద్దూరి పరశురాంగౌడ్, కోడం శివప్రసాద్, చిందం నరేశ్, జితేందర్‌రెడ్డి, మల్లడపాట భాస్కర్ పాల్గొన్నారు. నైపుణ్యాలు వెలికి తీసేందుకు క్రీడలు దోహదంసిరిసిల్లఅర్బన్: గ్రామీణ యువతలో నైపుణ్యాలను వెలికి తీసేందుకు క్రీడాపోటీలు దోహదపడుతాయని జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి అజ్మీరా రాందాస్ అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని రాజీవ్‌నగర్ మినీ స్టేడియంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ లెవెల్ త్రోబాల్, వాలీబాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. మహిళలకు త్రోబాల్, పురుషులకు వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వాలీబాల్ పోటీల్లో 30, త్రోబాల్‌లో 7 జట్లు పాల్గొంటాయని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్‌రెడ్డి, సురేశ్, ప్రభాకర్, బీజేపీ నాయకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
28న నేరెళ్లకు కవిత
తంగళ్లపల్లి: మండలంలోని నేరెళ్ల గ్రామానికి ఈనెల 28న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రానున్నట్లు మండల ఇన్చార్జి చెరుకుపల్లి శైలజ తెలిపారు. ఇటీవల మృతి చెందిన నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పేర్కొన్నారు. వాసరవేణికి జాతీయ పురస్కారంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన వాసరవేణి పర్శరాములు తెలుగు భాషా సాహిత్యానికి చేస్తున్న కృషి, బాల సాహిత్యంలో రచన, పరిశోధనలకు గాను జాతీయ తెలుగు విశేష ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. పర్శరాములు కొంతకాలంగా తెలుగు భాషా సంస్కృతి, అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. వీటిని గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేశ్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ, పల్లె భాషలో ప్రజల కష్టాలు, చిన్నారుల గాథల గురించి అనేక పరిశోధనలు చేయడం జరిగిందన్నారు. 20కి పైగా పుస్తకాలు రచించి బాల సాహిత్యంలో పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవి ద్యాలయం నుంచి డాక్టర్ పట్టా పొందారని, 500కు పైగా వ్యాసాలు రాశారన్నారు. జూలై 28న న్యూఢిల్లీలో అవార్డు అందుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా పర్శరాములును రచయితలు జలపాల శంకరయ్య, మహేశ్వరశర్మ, లక్ష్మయ్య, మ హేందర్, నీలకంఠం, దేవరాజు అభినందించారు. -
తుది దశకు మూలవాగు బ్రిడ్జి
వేములవాడ మూలవాగుపై మూడో బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి. ‘ముచ్చటగా’ మూడుసార్లు నిర్మాణ దశలోనే కూలిపోయి తీవ్ర విమర్శలపాలైన ఈ వంతెన.. నేడు పటిష్టంగా రూపుదిద్దుకుంది. గతంలో కాంట్రాక్టర్ల అజాగ్రత్త, ఇంజినీరింగ్ లోపాల వల్ల వంతెన కూలిపోవడంతో ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. విప్ ఆది శ్రీనివాస్ చొరవతో లోపాలను సరిదిద్ది రూ.6 కోట్లు మిగులు పనులకు, రూ.6.90 కోట్లు భూసేకరణకు నిధులు మంజూరు చేయించి పనులు వేగవంతం చేశారు. మూడో బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రాజన్న భక్తులు, స్థానికులకు మూలవాగు వద్ద ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. – వేములవాడ -
లక్షలు వెచ్చించి.. లక్షణంగా వదిలేసి !
ప్రజలు వ్యాయామ చేసేందుకు రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఓపెన్‌జిమ్ పరికరాలు నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేక ఎక్కడికక్కడ విరిగిపోయి కనిపిస్తున్నాయి. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో రూ.80లక్షలతో 16 ప్రాంతాల్లో ఓపెమ్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి పనికిరాకుండా పోయాయి. పాడయిన పరికరాలను చాలా రోజులుగా మరమ్మతు చేపట్టడం లేదు. పరికరాలు సరిగా లేక వ్యాయామం చేయలేకపోతున్నామని ఉదయం వాకింగ్ వెళ్లేవారు, క్రీడాకారులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సిరిసిల్ల అర్బన్ -
పత్తికి అనుకూలం.. వరికి ప్రతికూలం
సిరిసిల్ల: జిల్లాలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం పత్తి పంటకు అనుకూలమైన వర్షాలు పడుతుండగా.. వరికి మాత్రం ప్రతికూలంగా ఉంది. జిల్లాలో కురుస్తున్న చిరు జల్లులతో అన్నదాతలు ఖరీఫ్ సాగుపై ఆశలు పెంచుకుంటున్నారు. ఇప్పటికే వరినారు ఎదగడంతో నీటి కోసం నిరీక్షించిన రైతులు చిన్న పాటి వర్షం జల్లులు పడడంతో ఆశతో నాట్లు వేస్తున్నారు. బోర్లలో నీరున్న రైతులు ఇప్పటికే వరినాట్లు వేయగా, తుకం పోసి పడిగాపులు కాస్తున్న రైతులు కొద్ది పాటి వర్షాలు పడడంతో నాట్లు వేస్తున్నారు. 2.48 లక్షల ఎకరాల్లో.. జిల్లాలో 2.48 లక్షల ఎకరాల్లో వానాకాలంలో పంట లు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో వరి 1,91,366 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. కానీ కాలం లేక, వర్షాభావ పరిస్థితుల్లో ఇప్పటి వరకు సుమారు లక్ష ఎకరాల్లో వరి వేశారు. 47,120 ఎకరాల్లో పత్తి, 3,430 ఎకరాల్లో మొక్కజొన్న వేయగా, ఇతర అన్ని పంటలు కలిపి 5,593 ఎకరాల్లో వేశారు. జిల్లాలో 665 చెరువులు ఉండగా, ఏ చెరువులోనూ వర్షం నీరు చేరలేదు. జిల్లాలోని జలాశయాలన్నీ నీరు లేక వెలవెలబోతుండడంతో ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఆయకట్టు రైతులకు సాగునీరు అందించలేమని నీటిపారుదలశాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలోని మానేరువాగు, వేములవాడ మూ లవాగుల్లో నీరు లేక ఎడారిగా మారాయి. వర్షాభావ పరిస్థితుల్లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అధికార యంత్రాంగం ప్రచారం చేస్తుంది. కానీ, అలవాటుగా మారిన వరి సాగుపైనే అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. వారం రోజు లుగా చిరు జల్లులు కురుస్తుండడంతో వానాకాలంపై ఆశలతో వరి నాట్లు వేస్తున్నారు. పత్తి రైతులు మాత్రం అంతరకృషితో ముందుకు సాగుతున్నారు. జిల్లా అంతటా వర్షాలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం వర్షం జల్లులు కురి శాయి. అత్యధికంగా వేములవాడ రూరల్‌లో 33.6 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. రుద్రంగి 3.9, చందుర్తి 26.9, బోయినపల్లి 19.8, వేములవాడ 11.3, సిరిసిల్ల 2.5, కోనరావుపేట 11.3, వీర్నపల్లి 5.5, ఎల్లారెడ్డిపేట 5.3, గంభీరావుపేట 14.6, ముస్తాబాద్ 8.9, తంగళ్లపల్లి 3.1, ఇల్లంతకుంటలో 1.1 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 11.4 మి.మీ నమోదైంది. రుద్రంగి, ఇల్లంతకుంట మండలాల్లో 51 శాతం లోటు వర్షపాతం ఉంది. పత్తికి అనుకూలంగా.. కొద్దిపాటి వర్షం రావడంతో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. మరోవైపు పత్తి రైతులు కలుపు తీస్తూ డౌరాలు కొడుతూ ఎరువులు వేస్తున్నారు. జిల్లాలో పత్తికి అనుకూలంగా ఉండగా, పంటను రక్షించుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు. నల్లరేగడి నేలల్లో పత్తి మొక్కలు ఏపుగా ఎదిగాయి. వరి సాగు చేయాలని ఆశిస్తున్న రైతులకు సాగునీటి లభ్యతపై అనుమానాలున్నాయి. మొక్కజొన్న, కందులు, పెసర, బబ్బెర వంటి పంటలు వేసుకో వాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. వరి వద్దంటూనే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, ఎకరం కూడా ఖాళీగా ఉంచవద్దని అధికారులు చెబుతున్నారు. నీరు లేకుంటే ఏ పంట అయినా దిగుబడి రాదని, వర్షాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఏది ఏమైనా జిల్లాలో ఈ వర్షాకా లం కలిసి రాకపోవడంతో భిన్నమైన పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారు. -
కార్గిల్ కీర్తి.. యువతకు స్ఫూర్తి
సిరిసిల్ల: అది... 1999. ఇండియా–పాకిస్థాన్ సరిహద్దుల్లో భీకరయుద్ధం. భారత భూభాగంలోకి పాకిస్థాన్ ప్రేరేపిత చొరబాటుదారులు చొరబడ్డారు. భారత సైన్యం వీరోచిత పోరాటం సాగించింది. రెండు నెలలపాటు సాగిన భీకర యుద్ధంలో సుమారు 500 మంది భారత జవానులు అసువులు బాశారు. కార్గిల్ పర్వత శ్రేణులను ఆక్రమించిన పాకిస్థాన్ చొరబాటుదారుల నుంచి మన భూభా గాన్ని సైన్యం స్వాధీనం చేసుకుంది. భారత సైన్యం విజయం సాధించిన రోజు జూలై 26. మన సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా, భారత జవానుల త్యాగానికి చిహ్నంగా ఏటా జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తారు. 27 ఏళ్ల కిందట జరిగి న కార్గిల్‌యుద్ధంలో పాల్గొన్న వైజయంతి యుద్ధ ట్యాంక్‌ను 2002లో సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. కార్గిల్ లేక్‌గా వర్ధన్కుంట సిరిసిల్లకు పశ్చిమదిశలో ఊరిలోకి ప్రవేశించే దారి లోనే వర్ధన్కుంట ఉంది. వర్ధన్కుంటకు కార్గిల్లేక్గా 2002లో నామకరణం చేశారు. కార్గిల్‌యుద్ధంలో అమరుల స్ఫూర్తిగా వైజయంతి యుద్ధ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు అప్పటి భారత రక్షణశాఖ మంత్రి జార్జి ఫెర్నాండేజ్, రక్షణశాఖ అధికారులతో చర్చించి యుద్ధ ట్యాంక్ ఏర్పాటుకు కృషి చేశారు. మున్సిపల్ అప్పటి చైర్మన్ ఆడెపు రవీందర్ గద్దె నిర్మాణానికి అప్పట్లో రూ.4లక్షలు వెచ్చించారు. 40 టన్నుల బరువైన ఆ యుద్ధ ట్యాంక్‌ను ఢిల్లీ నుంచి సిరిసిల్లకు తెప్పించేందుకు అప్పటి మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఢిల్లీకి వెళ్లారు. అభివృద్ధికి అడుగులు కార్గిల్లేక్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యానవనం, బోటింగ్ సదుపాయం, కుర్చీలు, విశ్రాంతి బెంచీలు, వాకింగ్‌ట్రాక్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. లేక్ సమీపంలోనే సాయిబాబా, అయ్యప్ప ఆలయాలు ఉండడంతో పర్యాటక శోభ వస్తుందని ఆశించారు. కానీ చాలా కాలంగా నిర్లక్ష్యపు జాడలు కనిపిస్తున్నాయి. కార్గిల్ లేక్ అభివృద్ధికి రూ.21.10 లక్షలు కేటాయించి కొన్ని పనులు చేశారు. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ‘అమృత్’ 2.0లో రూ.1.30 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో కార్గిల్ లేక్ కట్ట మరమ్మతులు, మురికినీటిని కట్టడి చేసే పనులు, డ్రెయినేజీలు, సుందరీకరణ పనులు చేపట్టారు. ఇటీవల కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, చైర్పర్సన్ జిందం కళాచక్రపాణితో కలిసి సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. నేటి తరానికి స్ఫూర్తి వైజయంతి యుద్ధట్యాంక్ నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పర్యాటక స్థలంగా మార్చితే పట్టణ వాసులకు, కొత్తగా పట్టణానికి వచ్చే వారికి సైనికుల తెగువ స్ఫూర్తినిస్తోంది. కార్గిల్ యుద్ధం జరిగిన నాటి సంగతులను గుర్తుకు తెచ్చేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కానీ కార్గిల్లేక్ ఆత్మహత్యలకు వేదికగా మారింది. కొంతమేరకు భూమి ఆక్రమణలకు గురైంది. చెరువుకట్ట సైతం కబ్జా కోరల్లో చిక్కింది. కబ్జాలు తొలగించి అభివృద్ధి చేస్తే.. సిరిసిల్లకు అదనపు అందం చేకూరనుంది. సైనికుల విజయ పతాక కార్గిల్ లేక్ 27 ఏళ్ల కిందట పోరాటం 24 ఏళ్ల కిందట వైజయంతి యుద్ధ ట్యాంకర్ ఏర్పాటు ఏటా సిరిసిల్లలో కార్గిల్ విజయ్ దివస్ -
ఒక గొప్ప వేదిక
ఖోఖో మాలో టీమ్ స్పిరిట్‌ను పెంచుతుంది. ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలో నేర్పుతుంది. మేము ఎవరికీ తక్కువ కాదని నిరూపించుకోవడానికి ఒక గొప్ప వేదిక. గతంలో డిస్ట్రిక్ లెవల్ ఆడాను. ప్రస్తుతం క్లస్టర్లో ఆడుతున్నారు. ఫ్యూచర్లో ఇండియన్ టీం కు ఆడాలని ఉంది. – జ్యోషిత, అండర్ 14 విభాగం తెలంగాణలోని స్కూల్ జట్లతో పోటీ పడటం కొత్త అనుభూతిని ఇస్తోంది. మైదానంలో మేమంతా క్రీడాకారులమే, ఇక్కడ రాష్ట్రాల బేధం లేదు. మహిళలు ఏ రంగంలోనైనా దూసుకుపోగలరని చెప్పడానికి మా పరుగే నిదర్శనం. రెండు సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న. – పూజ్య, రాప్తాడు, అనంతపురం, అండర్ 14 విభాగం అండర్–19లో మా టీం ఫైనల్‌కు చేరింది. ఆడపిల్లలు ఆటల్లో రాణించలేరు అనే పాత ఆలోచనలను మార్చడానికే ఇక్కడికి వచ్చాం. మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించి పంపించారు. గెలిచి తీరుతాం. గతంలో ఒకసారి రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొన్నా. ఖేలో ఇండియాలో పతకం సాధించాలని ఉంది. – కావ్యసుధ, వయ్యారావుపేట, అనకాపల్లి అండర్ 19 విభాగం -
వేద విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
వేములవాడ: వేద విద్యావ్యాప్తికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. వేములవాడలో ఐదు ఎకరాలు ఎంపిక చేసినట్లు విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న క్షేత్రంలో ఐదు రోజులు కొనసాగిన వేద–స్మార్త ఆగమ విద్వత్ సదస్సు శనివారం ముగిసింది. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేద, సంస్కృత పాఠశాలల భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి, అధ్యాపకులకు స న్మానించారు. ఈనెల 21న ప్రారంభమైన ఈ మహోత్సవాలు 25న పూర్తయ్యాయి. ఈవో రమాదేవి, డీఈవో నవీన్ పాల్గొన్నారు. వేద సంస్కృతి పరిరక్షణ దేశ నలుమూలల నుంచి వేదపండితులు వేములవాడకు రావడం గర్వకారణమన్నారు. వేద సంస్కృతి పరిరక్షణకు ఏటా మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి వేదాలతోపాటు మరిన్ని శాస్త్రాల పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. అనువంశిక అర్చకులకు ప్రాధాన్యం వేములవాడ దేవస్థానంలో అర్చక నియామకాల విషయంలో అనువంశిక అర్చకులకు ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు విప్ తెలిపారు. గతంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నియామక ప్రక్రియలో మొత్తం 191 పోస్టులను భర్తీ చేయగా, వాటిలో వేములవాడకు 21 పోస్టులు కేటాయించగా.. 10 పోస్టులు అనువంశిక అర్చకులకు లభించాయని తెలిపారు. వేములవాడలోని 128 అనువంశిక అర్చక కుటుంబాల నుంచి కనీసం ఒక్కో విద్యార్థిని వేద పాఠశాలలో చేర్పించి వేద విద్యను అభ్యసించేలా కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. పరీక్షల ఫలితాలు ఐదు రోజుల వేద–స్మార్త పరీక్షా మహోత్సవాల్లో మొత్తం 130 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 124 మంది ఉత్తీర్ణత సాధించారు. 40 మంది పరీక్షాధికారులు పరీక్షలను నిర్వహించారు. అనుత్తీర్ణులైన ఆరుగురు విద్యార్థులు నిరుత్సాహపడకుండా వచ్చే ఏడాది మరింత కృషి చేసి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. వేద పాఠశాల ప్రిన్సిపాల్ ఆంజనేయశర్మ, ఈవో రమాదేవి, డీఈవో నవీన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముగిసిన జాతీయస్థాయి వేద–స్మార్త పరీక్షలు విద్యార్థులకు పట్టాలు.. అధ్యాపకులకు సన్మానం -
ఏటా కార్గిల్ దివస్ నిర్వహిస్తాం
ఏటా జూలై 26న కార్గిల్ దివస్ నిర్వహిస్తాం. దేశరక్షణలో ప్రాణాలొడ్డిన వీరసైనికులకు నివాళి అర్పిస్తాం. నేను మున్సిపల్ చైర్మన్‌గా ఉండగా 2002లో అప్పటి కేంద్ర మంత్రి విద్యాసాగర్‌రావు చొరవతో వైజయంతి యుద్ధట్యాంక్‌ను ఢిల్లీ నుంచి తెప్పించారు. మున్సిపల్ నిధులతో కార్గిల్లేక్పై వేదికను ఏర్పాటు చేశాం. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ఇటీవల నిధులు కేటాయించారు. సుందరీకరణ పనులు సాగుతున్నాయి. సిరిసిల్ల పట్ట ణానికి కార్గిల్ లేక్ ఐకాన్‌గా నిలుస్తోంది. – ఆడెపు రవీందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ -
భీమన్న సన్నిధిలో నాగరాజు
వేములవాడ: తొలి ఏకాదశి శనివారం నాడు భీమన్న ఆలయం ఎదుట నాగుపాము కలకలం రేపింది. స్నేక్ క్యాచర్ జగదీశ్ పట్టుకొని అటవీప్రాంతంలో వదిలేశారు. భీమన్న ఆలయం ఎదుట తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొన్న వేళ నాగుపాము ప్రత్యక్షమైంది. పామును గమనించిన భక్తులు భయాందోళనకు గురికాగా.. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ జగదీశ్ వెంటనే అక్కడికి చేరుకొని చాకచక్యంగా పట్టుకున్నారు. జగదీశ్ సమయస్ఫూర్తితో స్పందించడంతో ఆలయానికి వచ్చిన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా వెంటనే అటవీశాఖ, శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలని కోరారు. చిన్నారిని బలిగొన్న కేన్సర్జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన మోటూరి తేజాన్ష్ (7) కేన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. గ్రామానికి చెందిన మాటూరి మహేశ్, రాధ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు తేజాన్ష్. మహేశ్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం తేజాన్ష్ అనారోగ్యం బారినపడడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చూపించారు. వారు కేన్సర్‌గా గుర్తించారు. తేజాన్స్కు నాలుగు నెలలుగా హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించి మృతిచెందాడు. శనివారం స్వగ్రామంలో బాలుడికి అంత్యక్రియలు నిర్వహించారు. వెయిటర్, హెవీ డ్రైవర్ పోస్టులు ఈనెల 28న ఇంటర్వ్యూలువేములవాడ: యూఏఈలోని ప్రముఖ ‘జీటీఎం కేటరింగ్’ సంస్థలో వెయిటర్లు, హెవీ డ్రైవర్ల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జీటీఎం ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ సంస్థ ప్రతినిధి చీటి సతీశ్‌రావు శనివారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు జీటీఎం ఇంటర్నేషనల్‌కు చెందిన అన్ని శాఖల కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. ఉద్యోగాలు: వెయిటర్లు, హెవీ డ్రైవర్లు(చెల్లుబాటు అయ్యే యూఏఈ లైసెన్స్ తప్పనిసరి). వయోపరిమితి 21 నుంచి 40 ఏళ్లు. వేతనం : వెయిటర్లకు నెలకు ఏఈడీ 1,200(సుమారు రూ.32వేలు), హెవీ డ్రైవర్లకు ఏఈడీ 3,500(సుమారు రూ.93వేలు). ఇతర సౌకర్యాలు: ఉచిత భోజనం, వసతి, రవాణాతోపాటు ఉచిత వీసా, ఫ్లైట్ టికెట్(100 శాతం ఉచిత నియామకం, ఎలాంటి సర్వీస్ చార్జీలు ఉండవు) అందిస్తారు. అర్హతలు–నిబంధనలు : ఆంగ్లంలో మాట్లాడటం, వెయిటర్‌గా అనుభవం ఉన్నవారు అర్హులు. శరీరంలో బయటకు కనిపించే టాటూలు ఉండకూడదు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ పాస్‌పోర్ట్, అప్డేటెడ్ సీవీలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని చీటి సతీష్‌రావు కోరారు. మరిన్ని వివరాలకు.. సికింద్రాబాద్‌లో 8332052299, నిజామాబాద్‌లో 8686860999, ఆర్మూర్‌లో 8332062299, జగిత్యాలలో 8332042299, సిరిసిల్లలో 9391661522 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
పట్టుదల..కృషి.. శ్యామ్‌ప్రసాద్‌లాల్
సిరిసిల్ల: పట్టుదలకు కృషి తోడైతే ఏదైనా సాధించవచ్చని ఐఏఎస్ అధికారి శ్యాంప్రసాద్‌లాల్ ప్రస్థానం సాక్ష్యం. సాధారణ మధ్యతరగతి పద్మశాలి కుటుంబంలో పుట్టి.. సర్కారు బడిలో అక్షరాలు దిద్దిన విద్యార్థి.. నేడు ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. దేశంలోనే అత్యున్నతమైన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్(ఐఏఎస్)కు ఎంపికవడం ఎంతో మంది కల. ఆ కలను కొంతమంది సాధిస్తారు. ఈ కోవాలోకి వస్తారు జి.వి.శ్యాంప్రసాద్‌లాల్. రెవెన్యూశాఖలో డిప్యూటీ తహసీల్దార్(డీటీ)గా ఉద్యోగంలో చేరి.. అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ సాధించిన గాజుల వెంకట శ్యాంప్రసాద్‌లాల్ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 1995లో డిప్యూటీ తహసీల్దార్‌గా.. 1995లో డిప్యూటీ తహసీల్దార్(డీటీ)గా గ్రూప్–2లో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. కరీంనగర్ కలెక్టరేట్లో ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్‌గా 1995 జూలై 31న విధుల్లో చేరారు. 1996 ఆగస్ట్ 1న గంభీరావుపేటలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధుల్లో చేరి 1998 డిసెంబరు వరకు పనిచేశారు. తహసీల్దార్‌గా పదోన్నతి పొంది 1998లో బోయినపల్లి, 2003లో సిరిసిల్ల, 2004లో పెద్దపల్లి, 2005లో హుజూరాబాద్, 2006లో కరీంనగర్, 2008లో కాటారం, కోరుట్ల తహసీల్దార్‌గా పనిచేశారు. 2009లో కొద్ది నెలలపాటు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల తహసీల్దార్‌గా, ఆ తరువాత 2010లో కోరుట్ల తహసీల్దార్‌గా పనిచేశారు. 2011 మార్చిలో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. వరంగల్‌లో భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా, 2013లో రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేశారు. 2014లో వరంగల్‌లో ఆర్వీఎం ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేశారు. 2014లోనే నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీవోగా, 2016లో సిరిసిల్ల ఆర్డీవోగా పనిచేశారు. 2017లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేశారు. 2019లో అదనపు కలెక్టర్‌గా పదోన్నతి పొంది కరీంనగర్లో పనిచేశారు. 2023లో పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. 2024లో మహాత్మా జ్యోతిభాపూలే విద్యాసంస్థ జాయింట్ సెక్రటరీగా పనిచేసిన శ్యాంప్రసాద్ లాల్ 2026 జనవరిలో ఐఏఎస్‌గా కన్ఫార్మ్ అయి.. నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేరారు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా చేరి విధులు నిర్వహిస్తున్నారు.తల్లిదండ్రులు: సత్యవతి (బీడీ కార్మికురాలు), గాజుల రాజేశం(రజనిశ్రీ) ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రముఖ రంగస్థల నటుడు, నాట్యాచార్యుడు. భార్య, పిల్లలు: మాధవి కుమారి, మేఘాంశ్ ప్రసాద్, ప్రీతమ్ ప్రసాద్ పెళ్లి: 1995 మే 3న (సిరిసిల్ల అత్తగారి ఊరు) పేరులో ప్రత్యేకతలు: గాజుల వెంకట శ్యాంప్రసాద్‌లాల్(తాత వెంకటయ్య పేరు కలిసి వచ్చేలా వెంకట, నవంబరు 14న జన్మించిన నేపథ్యంలో జవహర్‘లాల్’ను పేరు చివర వాళ్ల నాన్న రజనిశ్రీ పెట్టడం విశేషం) హాబీలు: సాహిత్యం చదవడం, షటిల్ ఆడడం, పాటలు వినడం. జర్నలిస్ట్‌గా: ‘వాన కురిసింది.. పుడమి మురిసింది’ అంటూ.. ఉత్తమ శీర్షికలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి ఐఏఎస్ వరకు.. అంచెలంచెలుగా ఎదిగిన హుస్నాబాద్ కుర్రాడు యువతకు స్ఫూర్తి జి.వి.శ్యాంప్రసాద్‌లాల్ ప్రస్థానంహుస్నాబాద్ టు హైదరాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో 1969 నవంబరు 14న జన్మించారు. హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం, 1984లో పదో తరగతి, 1986లో ఇంటర్ పూర్తి చేశారు. 1989లో సిద్దిపేటలో బీఎస్సీ, 1991లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ(తెలుగు) పూర్తి చేశారు. 1992లో జర్నలిజం చేసిన ఆయన 1992లో ఓ దినపత్రిలో సబ్ ఎడిటర్‌గా చేరారు.


