సిరిసిల్లలో 20.. వేములవాడలో 16
సిరిసిల్లటౌన్: బల్దియా ఎన్నికలలో భాగంగా బుధవారం నామినేషన్ల పర్వం మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు మున్సిపల్ ఆవరణలో కమిషనర్ ఖదీర్‌పాషా నేతృత్వంలో 39 వార్డులకు 13 కౌంటర్లను ఏర్పాటు చేశారు. 15 మంది ఆర్‌వో, 15 మంది ఏఆర్‌వోలకు విధులు కేటాయించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి నలుగురు అధికారులతో ‘హెల్ప్‌డెస్క్’ ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ పర్యవేక్షించారు. నామినేషన్ సెంటర్‌కు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు. సిరిసిల్లలో 20 మంది 20 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 3వ వార్డు నుంచి తాజా మాజీ చైర్‌పర్సన్ జిందం కళ(బీఆర్‌ఎస్), 12వ వార్డు నుంచి సూర నిర్మల(కాంగ్రెస్), 30వ వార్డు నుంచి నాగుల రూప(బీజేపీ) తదితరులు నామినేషన్లను అఽధికారులకు అందజేశారు. బీఆర్‌ఎస్ నుంచి 11, కాంగ్రెస్ 4, బీజేపీ ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
సర్టిఫికెట్ల జారీలో జాప్యం
నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికెట్లు పొందడానికి అధికారుల నుంచి స్పందన కరువైందని వారు వాపోయారు. రాత్రి వరకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై విమర్శలు గుప్పించారు. నో డ్యూ సర్టిఫికెట్లు లేక పలువురు అభ్యర్థులు నామినేషన్ల దాఖలును ఒక రోజు వాయిదా వేసుకున్నారు.
వేములవాడలో 16 నామినేషన్లు
వేములవాడ: వేములవాడలో మొదటి రోజు 16 నామినేషన్లు దాఖలైనట్లు కమిషనర్ సంపత్‌కుమార్ తెలిపారు. కాంగ్రెస్ నుంచి 8, బీఆర్‌ఎస్ నుంచి 5, బీజేపీ నుంచి 3 నామినేషన్లు దాఖలయ్యాయి.


