మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య

Feb 5 2026 7:45 AM | Updated on Feb 5 2026 7:45 AM

మద్యం

మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య

మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య ఉపాధి లేక మనస్తాపం చెంది.. బావిలో దూకి వృద్ధురాలి..

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): మద్యం తాగొద్దని తల్లి హితవు చెప్పినా వినకుండా పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్‌కాలనీ రాజీవ్‌ నగర్‌ తండాకు చెందిన గుగులోతు రవి నాయక్‌(28) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రవినాయక్‌ తండ్రి అనారోగ్యంతో ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లితో కలిసి ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో మద్యం తాగుతున్నాడు. అయితే, మద్యం తాగద్దని తల్లి చేప్పినా వినలేదు. మద్యం తాగినప్పుడు మతిస్థిమితం కోల్పోయినట్లు వ్యవహరించేవాడు. ఈక్రమంలో ఈనెల 3న మద్యం తాగివచ్చి తల్లితో గొడవపడ్డాడు. ఆ తర్వాత తల్లి తనకూతురు ఇంటికి వెళ్లగా.. మనస్తాపం చెందిన రవినాయక్‌ ఇంట్లోని ఇనుపరాడ్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. తల్లి నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు సీఐ ప్రసాద్‌రావు తెలిపారు.

కల్వచర్లలో యువకుడి ఆత్మహత్య

రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామ పంచాయతీ పరిధి గోకుల్‌నగర్‌కు చెందిన బాదం రవికిరణ్‌(21) గడ్డిమందు తాగి మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. రవికిరణ్‌ కొద్దిరోజులుగా ఉపాధి లేదని బాధపడుతున్నాడు. ఈక్రమంలో మనస్తాపం చెంది మంగళవారం గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు కరీంనగర్‌కు ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

కథలాపూర్‌(వేములవాడ): కథలాపూర్‌ మండలం సిరికొండ గ్రామానికి చెందిన శనిగారపు బుచ్చిరాజు (60) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డినట్లు పోలీసులు తెలి పారు. వారి కథనం ప్రకారం.. బుచ్చిరాజుకు కొన్నాళ్లుగా మతిస్థిమితం సరిగా ఉడడం లేదు. కుటుంబసభ్యులు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బుచ్చిరాజు భర్త లింగన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్‌ తెలిపారు.

కోదండ రామాలయంలో చోరీ

జగిత్యాలరూరల్‌: జగిత్యాల శివారు ధరూర్‌ క్యాంప్‌లో.. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీకోదండరామాలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎప్పటిలాగే పురోహితులు గుడికి తాళం వేసి వెళ్లారు. ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాతోపాటు, దేవతలపై ఉన్న పావుకిలో వెండి ఆభరణాలు, 10 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయ పూజారి జగన్మోహనాచారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య 1
1/2

మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య

మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య 2
2/2

మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement