కోతులు, కుక్కల బెడద నుంచి రక్షించండి | - | Sakshi
Sakshi News home page

కోతులు, కుక్కల బెడద నుంచి రక్షించండి

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

కోతులు, కుక్కల బెడద నుంచి రక్షించండి డీఈవో భాస్కర్‌ బాధ్యతలు స్వీకారం పంట నష్టం పరిశీలన ● డీసీఎస్‌వో బుచ్చిబాబు ● జిల్లా అల్పసంఖ్యాక సంక్షేమాధికారి భారతి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కోతులు, కుక్కల బెడద నుంచి గ్రామస్తులను రక్షించాలని బీజేపీ నాయకులు బుధవారంసర్పంచ్‌ ఇల్లందుల గీతాంజలి, కార్యదర్శి సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గ్రామంలో కోతులు, కుక్కల దాడిలో అనేక మంది గాయపడ్డారన్నారు. నాలుగు రోజుల క్రితం కోతుల దాడిలో గాలిపెల్లి దేవవ్వ గాయపడిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో కుక్కల దాడిలో నీరటి విష్ణుప్రసాద్‌, లింగమ్మగారి భాస్కర్‌లకు కూడా గాయాలైనట్లు వివరించారు. కోతులు, కుక్కల బెడద తొలగించాలని కోరారు. నాయకులు ముత్యాల చంద్రారెడ్డి, ల్యాగాల సతీశ్‌, చల్ల పద్మారెడ్డి, వంగ బాపురెడ్డి, కొండాపురం సత్యంరెడ్డి, విభూది హనుమంత్‌, మారావేణి రంజిత్‌కుమార్‌, భిక్షపతి పాల్గొన్నారు.

వేములవాడ: రాజన్న ఆలయ డీఈవోగా నియమితులైన భాస్కర్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. యాదగిరిగుట్ట డీఈవోగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్‌ను దేవాదాయశాఖ కమిషనర్‌ ఇటీవల రాజన్న ఆలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆమేరకు వేములవాడకు చేరుకుని భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈవో రమాదేవి ఉన్నారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని ముస్కానిపేట, ఆరేపల్లి, కేసన్నపల్లి, దాచారం గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వర్షానికి నేలకొరిగిన మక్కచేను పంటను మండల వ్యవసాయాధికారి సందీప్‌ బుధవారం పరిశీలించారు. కేసనపల్లి సర్పంచ్‌ పోతరాజు చంటి, వ్యవసాయ విస్తరణ అధికారి గంగ, అభిషేక్‌, రైతు రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కోఆప్షన్‌ నామినేషన్‌ షురూ..

సిరిసిల్లటౌన్‌: జిల్లా కేంద్రం సిరిసిల్ల బల్దియాలో కోఆప్షన్‌ సందడి షురువైంది. నాలుగు కోఆప్షన్‌ సభ్యుల కోసం బుధవారం నుంచి మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఎ.ఖదీర్‌పాషా నామినేషన్లను ఆహ్వానించారు. మైనార్టీ మహిళ కోటాకు చెందిన కోఆప్షన్‌ పోస్టు కోసం ఎం.డి.ఆస్మా బుధవారం బీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్‌ వేశారు. బుధవారం ఒకే నామినేషన్‌ వచ్చినట్లు కమిషనర్‌ తెలిపారు.

మూడు నెలల బియ్యం కోటా విడుదల

సిరిసిల్ల: జిల్లాలోని రేషన్‌ కార్డుదారులకు మూడు నెలల సన్నబియ్యం కోటా విడుదలైందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎల్‌.బుచ్చిబాబు బుధవారం తెలిపారు. జిల్లాలోని 1,95,554 కుటుంబాలకు చెందిన రేషన్‌కార్డుదారులకు 1,11,721.65 క్వింటాళ్ల సన్న బియ్యం మంజూరైనట్లు వివరించారు. ఏప్రిల్‌, మే, జూన్‌ మూడు నెలల రేషన్‌ బియ్యం తీసుకెళ్లాలని కోరారు. అంత్యోదయ కార్డులున్న వారికి కిలో చక్కెరను రూ.13.50 అందిస్తారని వివరించారు.

మైనార్టీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు

సిరిసిల్ల: మైనార్టీ యువకులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని జిల్లా అల్పసంఖ్యాక సంక్షేమాధికారి భారతి బుధవారం తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీలకు చెందిన అభ్యర్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి, విదేశీలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 99499 10328లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement