దేశంలో అతిపెద్ద స్కామ్ అమరావతి క్యాపిటల్ అని చెప్పుకొచ్చారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.
అమరావతి ప్రజల రాజధాని కాదు.. కుంభకోణాల రాజధాని అని ఆరోపించారు.
అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు అని అన్నారు.
తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి 1100 కోట్లు వృథా చేశారని తెలిపారు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు.
2018లో ఏ పనులు, ఎవరు చేశారో, 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ అవే కంపెనీలకు పనులు దక్కాయి.
ప్రజల రాజధాని సంగతి దేవుడెరుగు అతిపెద్ద స్కాంకు, కరప్షన్‌కు చంద్రబాబు నిజంగానే క్యాపిటల్ చేసేశాడు.
బెంగళూరు, హైదరాబాద్‌లాంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో చదరపు అడుగుకు రూ.4,500 దాటదు. కానీ, అమరావతిలో టవర్-1కు 2018లో టెండర్ విలువ రూ.932 కోట్లు
కాంట్రాక్టర్‌కు అన్ని మినహాయింపులు ఇచ్చి టెండర్ పెంచారు
మొత్తం కాంట్రాక్ట్ విలువ 1762 కోట్లకు పెంచారు
టవర్-2కు 2018లో టెండర్ విలువ 762 కోట్లు
ఇప్పుడు అన్ని మినహాయింపులు ఇచ్చి 1545 కోట్లకు పెంచారు
జీఏడీ టవర్.. 2018లో కాంట్రాక్ట్ విలువ 554 కోట్లు
ఇప్పుడు జీఏడీ టవర్ పనులను రూ.1046 కోట్లకు పెంచేశారు.


