మలయాళ బ్యూటీ మాళవిక నాయర్ (Malvika Nair) తెలుగులో చాలా సినిమాలే చేసింది. విజేత, టాక్సీవాలా, ఓరేయ్ బుజ్జిగా, థాంక్యూ, అన్నీ మంచి శకునములే, డెవిల్ ఇలా పలు చిత్రాల్లో మెరిసింది. కల్కి 2898 ఏడీలోనూ ఉత్తరగా కనిపించింది. ప్రస్తుతం 'బైకర్'తో ప్రేక్షకులను పలకరించనుంది. తన సినీ జర్నీ పట్ల సంతోషంగానే ఉన్నాను కానీ, సంతృప్తిగా మాత్రం లేనంటోంది మాళవిక. పూర్తిస్థాయిలో సంతృప్తి చెందే పాత్రలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అంటోంది.


