హైదరాబాద్ : ఖైరతాబాద్‌లో సోమవారం రాత్రి సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
నవయుగ యాదవ సంఘం, మంగళారపు చౌదరి యాదయ్య సోదరుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్, మాజీ మంత్రి తలసాని, మాజీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, చింతల రామచంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు.


