ఒంగోలు : తీవ్ర తుపాను మురసు దక్షిణ కోస్తా జిల్లాలను ముంచెత్తింది. మంగళవారం తెల్లవారుజామున తీరం దాటిన తర్వాత రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి.
విజయవాడలో మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకూ ఎడతెగని వర్షం కురిసింది. తీవ్ర తుపానుగా తీరం దాటిన మురసు భూభాగంపైనా అదే తీవ్రతతో కొనసాగడంతో ప్రభావం ఎక్కువైంది.
తీరం దాటిన తర్వాత కూడా తుపాను గంటకు 7 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదిలింది. ఉదయం 11.30 వరకు తీవ్ర తుపానుగానే కొనసాగింది.
సాయంత్రం 5.30 గంటలకు సాధారణ తుపానుగా బలహీనపడింది.


