breaking news
Cyclone Murasu
-
ఏపీకి బిగ్ అలర్ట్.. తీవ్ర తుపాన్‌గా ‘మురసు’
సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ‘మురసు’ తీవ్ర తుపానుగా మారింది. గడచిన 6 గంటల్లో గంటకు 22 కిమీ వేగంతో తీవ్ర తుపాను కదులుతోంది. ఇవాళ అర్ధరాత్రి-తెల్లవారుజాము సమయంలో నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. ప్రస్తుతం నెల్లూరుకు 160 కిమీ, చెన్నైకి 180 కిమీ, కావలికి 180 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని.. ఒంగోలుకు 210 కిమీ, మచిలీపట్నానికి 240 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని విపత్తుల ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు.తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు (సోమ, మంగళవారాల్లో) కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.రాయలసీమలోనూ సోమ, మంగళవారాల్లో అనేక చోట్ల వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. తుపాను తీరం దాటే ప్రాంతం దక్షిణ కోస్తాలో ఉండటంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలపై ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.ఇదీ చదవండి: ఘోర విమాన ప్రమాదం.. పైలట్ చివరి మాటలివే! -
దూసుకొస్తున్న ‘మురసు’ తుపాను
సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి తుపానుగా బలపడింది. ‘మురసు’ అని నామకరణం చేసిన ఈ తుపాను సోమవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుంది. మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు–నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆదివారం రాత్రి చెన్నైకి 420, నెల్లూరుకు 490, మచిలీపట్నానికి 500, ఒంగోలుకు 530, విశాఖపట్నానికి 500 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.రెండు రోజులపాటు వర్షాలుతుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. రాయలసీమలోనూ సోమ, మంగళవారాల్లో అనేక చోట్ల వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. తుపాను తీరం దాటే ప్రాంతం దక్షిణ కోస్తాలో ఉండటంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలపై ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. రానున్న తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్షరాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రస్తుత వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మంగళవారం ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటొచ్చని తెలిపారు. అత్యంత భారీ వర్షాల అంచనా ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాలో 9, కృష్ణా జిల్లాలో 5, ఎన్టీఆర్ జిల్లాలో 5, బాపట్ల జిల్లాలో ఒకటి ఉన్నాయన్నారు. బుడమేరు సహా పలుచోట్ల వరద ముప్పు..భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరు వద్ద మంగళవారం సుమారు 32,500 క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర జలాశయాల్లో కూడా భారీ వరద వచ్చే అవకాశం ఉందని వివరించారు. బలమైన గాలుల వల్ల 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


