ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. తీవ్ర తుపాన్‌గా ‘మురసు’ | Andhra Pradesh: Cyclone Murasu Strengthens Into Severe Cyclonic Storm | Sakshi
Sakshi News home page

ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. తీవ్ర తుపాన్‌గా ‘మురసు’

Nov 2 2026 10:49 AM | Updated on Nov 2 2026 11:12 AM

Andhra Pradesh: Cyclone Murasu Strengthens Into Severe Cyclonic Storm

సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ‘మురసు’ తీవ్ర తుపానుగా మారింది. గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 22 కిమీ వేగంతో తీవ్ర తుపాను క‌దులుతోంది. ఇవాళ అర్ధరాత్రి-తెల్లవారుజాము సమయంలో నెల్లూరు-న‌రసాపురం మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. ప్రస్తుతం నెల్లూరుకు 160 కిమీ, చెన్నైకి 180 కిమీ, కావలికి 180 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని.. ఒంగోలుకు 210 కిమీ, మ‌చిలీప‌ట్నానికి 240 కిమీ దూరంలో కేంద్రీకృతమైందని  విపత్తుల ఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్‌జైన్‌ తెలిపారు.

తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు (సోమ, మంగళవారాల్లో) కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది.

రాయలసీమలోనూ సోమ, మంగళవారాల్లో అనేక చోట్ల వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. తుపాను తీరం దాటే ప్రాంతం దక్షిణ కోస్తాలో ఉండటంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలపై ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

ఇదీ చదవండి: ఘోర విమాన ప్రమాదం.. పైలట్‌ చివరి మాటలివే!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement