ఓటరుకు షాక్‌.. చాలెంజ్‌ ఓటుకు అవకాశం | Chance to challenge vote | Sakshi
Sakshi News home page

ఓటరుకు షాక్‌.. చాలెంజ్‌ ఓటుకు అవకాశం

Nov 2 2026 8:27 AM | Updated on Nov 2 2026 8:59 AM

Chance to challenge vote

విశాఖపట్నం: నార్త్‌ జోన్‌ 54వ వార్డులో ఓ యువకుడికి వింత అనుభవం ఎదురైంది. తాటిచెట్లపాలెం హైవే, అన్నా కాంటీన్‌ సమీపంలోని 54/7 పోలింగ్‌ బూత్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో బొక్క మారుతి దుర్గాప్రసాద్‌ ఓటు వేసేందుకు వచ్చాడు. అయితే అతని ఓటును ఇప్పటికే మరొకరు వినియోగించుకున్నట్లు అధికారులు చెప్పడంతో అవాక్కయ్యాడు. దీనిపై అధికారులను ప్రశ్నించగా చివరకు అతనికి చాలెంజ్‌ ఓటు అవకాశం కల్పించారు. 

ఇదే బూత్‌లో ఓటర్ల ఆధారాలను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే కొందరిని అనుమతించారని పలువురు ఓటర్లు తెలిపారు. ఇదే కేంద్రానికి సాయంత్రం 5.02 గంటలకు వచ్చిన మరో ఓటరును అధికారులు లోపలికి అనుమతించలేదు. కనీసం 10 నిమిషాల సమయం ఇవ్వాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని సదరు ఓటరు వాపోయారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement