SEC ఆఫీసు ఎదుట ధర్నా.. వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు | Cases Registered Against YSRCP Leaders in Vijayawada Over SEC Office Protest | Sakshi
Sakshi News home page

SEC ఆఫీసు ఎదుట ధర్నా.. వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు

Nov 2 2026 7:40 AM | Updated on Nov 2 2026 7:46 AM

Cases Registered Against YSRCP Leaders in Vijayawada Over SEC Office Protest

సాక్షి,విజయవాడ: రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన వైఎస్సార్‌సీపీ నేతలపై విజయవాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్‌ఈసీ కార్యాలయ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన నిర్వహించారన్న ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు లెళ్ల అప్పిరెడ్డి, తొట్టెంపూడి కల్పలతారెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లాతో పాటు మొత్తం 14 మందిపై ఈ కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఎస్‌ఈసీ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ నిరసన వ్యవహారంపై ఎస్‌ఈసీ జాయింట్ డైరెక్టర్ రామారావు సూర్యారావుపేట పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

బీఎన్ఎస్-2023 (BNS) చట్టంలోని 329(4), 126(2), 189(2), 190, 292, R/W 3(5) సెక్షన్లతో పాటు, ఐపీసీలోని 448, 341, 143, 149, 290 R/W 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సూర్యారావుపేట పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి : మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement