వైఎస్సార్ జిల్లా పులివెందులలోని 38వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై రాళ్ల దాడికి తెగబడుతున్న టీడీపీ గూండాలు..
అధికారమదం తలకెక్కింది... ఉన్మాదం ఉర్రూతలూగింది. వ్యవస్థల్ని గుప్పిటపెట్టుకున్న ధృతరాష్ట్ర పాలనలో పచ్చమూకలు ప్రజాస్వామ్యానికి వలువలూడదీసి వికటాట్టహాసం చేశాయి. పవిత్రమైన ఎన్నికల ప్రక్రియను ఏకపక్షం చేసుకునే క్రమంలో ఆదివారం ఉదయం తెల్లవారుతూనే పచ్చమూకల దమనకాండ ప్రారంభమైంది. ఓటరును పోలింగ్ బూత్ దగ్గరకు రానిస్తే తమకు ఓటమి తప్పదని గ్రహించిన పచ్చనేతలు బెదిరింపులు, దాడులతో భయభ్రాంతులకు గురిచేశారు. ప్రతిపక్ష ఏజెంట్లను గెంటేశారు. ఎదురుతిరిగినవారి రక్తం కళ్లజూశారు.
ప్రతిపక్ష నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించి ప్రజాస్వామ్యానికి ఊపిరిపోయాల్సిన అధికారగణం అధికారానికి దాసోహమైంది. కాపలాగా నిలవాల్సిన పోలీసులు యథాశక్తి అధికారపార్టీ నేతల అక్రమాలకు అండగా నిలిచారు. మొత్తానికి ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడానికి ఎన్ని అడ్డదారులు తొక్కవచ్చో రాష్ట్రంలో అధికారపార్టీ నేతలు ప్రపంచానికి చాటిచెప్పారు.
పులివెందుల మునిసిపల్ ఆఫీస్ వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ధైర్యం చెబుతున్న ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి

పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని భర్తపై పాశవికంగా దాడి చేస్తున్న టీడీపీ మూక

ఓటు వేయడానికి వచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ గూండాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పులివెందులలోని అహోబిలపురానికి చెందిన మహిళలు

చిత్తూరు కైనికట్టువీధిలో దొంగఓట్లపై ప్రశ్నించినందుకు టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆసుపత్రిలో ఉన్న రోషన్
ఒంగోలు సెయింట్ జేవియర్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌పై దాడి చేస్తున్న టీడీపీ గూండాలు

కడప నగర మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగిన ఘటనలపై కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు వినతిపత్రమిస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్ అభ్యర్థి దీప్తి రెడ్డి

పులివెందుల మునిసిపల్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి వైఎప్ ప్రమీలమ్మ, అభ్యర్థులు

పులివెందులలోని బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న తమ ఇళ్లపై టీడీపీ గూండాలు ఇళ్లపైకి రాళ్లు విసిరారని చూపిస్తున్న మహిళలు

చిత్తూరు వల్లియప్ప నగర్ పాఠశాలలో రిగ్గింగ్ జరుగుతుంటే బయట వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు

తమను ఓటు వేయకుండా అడ్డుపడుతున్న టీడీపీ మూకలు, పోలీసులపై తీవ్రంగా మండిపడుతున్న పులివెందులలోని చెన్నారెడ్డి కాలనీకి చెందిన మహిళలు

గుంటూరు 57వ డివిజన్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ పోలింగ్ బూత్ వద్ద వైఎస్సార్‌సీపీ నాయకుడు భాస్కర్‌రెడ్డిపై పాశవికంగా దాడి చేస్తున్న టీడీపీ గూండాలు


