అధికార తెలుగుదేశం పార్టీ గూండాలు అరాచకానికి పాల్పడ్డ పులివెందుల నియోజకవర్గంలో కేవలం 4 పోలింగ్ కేంద్రాల్లోనే రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కడప నగరంలో ఒక పోలింగ్ కేంద్రం, జమ్మలమడుగులో మూడు, పల్నాడు జిల్లా మాచర్లలో రెండు, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఒకటి, అనంతపురంలో ఒక పోలింగ్ బూత్‌లో సోమవారం రీపోలింగ్ జరపాలని ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠ ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది.
వైఎస్సార్ జిల్లా:
నేడు పులివెందులలో 4 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్
ఇంకా తెరుచుకొని పోలింగ్ కేంద్రాలు
రీపోలింగ్ లోనూ బూత్ లను ఆక్రమించేందుకు చేరుకుంటున్న పచ్చ మూకలు
ఓటర్లను రానివ్వకుండా చేసే కుట్ర..రిగ్గింగ్ కు సన్నాహాలు
జమ్మలమడుగు మున్సిపాలిటిలో..
- నామమాత్రంగా మూడు బూత్‌లకు రీ పోలింగ్
- నిన్న జమ్మలమడుగులో కూటమి రౌడీలు, పోలీసుల అరాచకాల ఆనవాళ్లు తుడిచేందుకు నామమాత్రపు రీపోలింగ్
అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్..
- ఒక పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్
- 30వ డివిజన్ 3వ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ చేసిన మంత్రి సత్యకుమార్ వర్గీయులు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విడియోలు
- 30వ డివిజన్ 3వ పోలింగ్ కేంద్రం లో రీ పోలింగ్‌కు ఆదేశించిన ఎన్నికల సంఘం
- పోలింగ్ సరళిని పరిశీలించిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్, కార్పొరేటర్ అభ్యర్థి వెన్నం శివరామిరెడ్డి
రీపోలింగ్ జరిగే పోలింగ్ కేంద్రాలు
పులివెందుల: 1వ వార్డులోని 1–1 బూత్, 3వ వార్డులోని 3–1 బూత్, 7వ వార్డులోని 7–1 బూత్, 8వ వార్డులోని 8–1 బూత్‌లలో ఛైర్‌పర్సన్, వార్డు మెంబర్లకు రీపోలింగ్ జరుగుతుంది.
జమ్మలమడుగు: 3వ వార్డు 3–2 బూత్, 17వ వార్డు 17–1 బూత్, 29వ వార్డు 29–1 బూత్‌లలో మున్సిపల్ ఛైర్‌పర్సన్, వార్డులకు
పల్నాడు జిల్లా మాచర్ల: 23వ వార్డు 23–1, 23–2 పోలింగ్ బూత్‌లలో ఛైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్
కడప నగరపాలక సంస్థ: 15 వార్డు 15–2 బూత్‌లో మేయర్, కార్పొరేటర్ పదవులకు
అనంతపురం కార్పొరేషన్: 30వ వార్డు 30–3 పోలింగ్ బూత్‌లో మేయర్ పదవితో పాటు వార్డు కార్పొరేటర్ పదవులకు
ప్రకాశం జిల్లా చీమకుర్తి: 14వ వార్డు 14–1 పోలింగ్ బూత్‌లో ఛైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్ పదవులకు


