ysr district
-
AP: బీటెక్ చదివినా ఉద్యోగం రాలేదని..
మైలవరం(వైఎస్సార్ జిల్లా): ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్‌జిల్లాలోని మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామంలో జరిగింది. చిన్యం లావణ్య(23) అనే యువతి తాను బీటెక్ చదివినా ఉద్యోగం రాలేదని ఆవేదనతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈరోజు(గురువారం) మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో రోడ్డు పక్కన పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. రైల్వే మరియు ఇతర జాబులకు దరఖాస్తు చేసుకున్నా దక్కని ఫలితం దక్కకపోవడంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈరోజు బంధువులతో కలిసి కొన్ని పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న లావణ్య.. ఆపై ఆత్మహత్య చేసుకుంది. -
వైఎస్ భాస్కర్‌రెడ్డికి పూర్తిస్థాయి బెయిల్ మంజూరు
హైదరాబాద్: వైఎస్ వివేకా కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు మంగళవారం(ఏప్రిల్ 28వ ఏ తేదీ) పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. గతంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లకూడదంటూ కండిషన్ బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. తాజాగా పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది.ఇక విచారించాల్సిందేమీ లేదని సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేయడంతో షరతులను హైకోర్టు సడలించింది. ఫలితంగా ఎక్కడికైనా వెళ్లొచ్చని ఫ్రీ బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. -
వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కిరాయి హంతకుతో కలిసి భర్తను అంతం చేసేందుకు భార్య పన్నిన కుట్రను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్‌రెడ్డికి 15 ఏళ్ల క్రితం శిల్పారెడ్డితో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈశ్వర్‌రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న సుధీర్ అనే వ్యక్తి శిల్పారెడ్డికి పరిచయమయ్యాడు. కొద్ది రోజుల తర్వాత వారి పరిచయం వివాహేతర బంధంగా మారింది.ఈ విషయం కొన్ని రోజుల క్రితం శిల్పారెడ్డి భర్త ఈశ్వర్‌రెడ్డికి తెలిసింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు మరింత పెరిగాయి. దీంతో శిల్పారెడ్డి ఈ విషయాన్ని ప్రియుడు సుధీర్‌కు తెలిపింది. ‘అలాగైతే నీ భర్తను చంపేద్దాం ఆస్తితోపాటు ఉన్న బంగారు, డబ్బు అంతా మనకే వస్తుందని’ సుదీర్ ఆమెతో అన్నాడు. అందుకు శిల్పారెడ్డి కూడా అంగీకరించింది. ఆమె రాజుపాళెంలోని రౌడీషీటర్ నవీన్ ద్వారా హిందూపురంలో ఉంటున్న లిల్లీ గ్యాంగ్‌ను ఆశ్రయించింది.తన భర్త ఈశ్వర్‌రెడ్డిని చంపేయాలని అందుకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని శిల్పారెడ్డి వారితో రూ.10 లక్షల సుపారీ కుదుర్చుకుంది. ఈ క్రమంలో రూ.5 లక్షలు ఇవ్వడంతో హిందూపురానికి చెందిన కిరాయి గ్యాంగ్ బుధవారం ప్రొద్దుటూరు చేరుకున్నారు. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఈశ్వర్‌రెడ్డిని కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. వెంటనే వన్‌టౌన్ పోలీసులకు ఈ విషయాన్ని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వ్యూహం బెడిసికొట్టడంతో నిందితులు.. పోలీసులకు చిక్కారు. భార్య శిల్పారెడ్డి, ప్రియుడు సుధీర్, రౌడీ షీటర్ వినయ్, హిందూపురం కిరాయి ముఠాతో పాటు 10 మందిని అరెస్టు చేశారు. నిందితుల వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ విబూకృష్ణ పోలీసులు వెల్లడించారు. -
చంద్రబాబు దమ్ముంటే నేరుగా యుద్ధానికిరా.. సతీష్ రెడ్డి
వైఎస్సార్ జిల్లా, సాక్షి: టీడీపీ నేతలు అత్యంత దారుణంగా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి అన్నారు. వేంపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలు, అజెండాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. పెద్ద దస్తగిరి కుమారుడి ఫిర్యాదుని కూడా పట్టించుకోకుండా ఈనాడు నీచ కథనాలు రాస్తుందని ఆరోపించారు. ఎల్లో పత్రికలు ఎక్కడికి పోతున్నాయి. ఏం రాస్తున్నాయని ప్రశ్నించారు.చంద్రబాబు ఆపదలో ఉన్నప్పుడల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతి నీచపు రాతలు రాస్తాయన్నారు. వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్‌కు లింకులు పెడుతూ తప్పుడు కథనాలు అల్లుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు.. ఆంధ్రజ్యోతి అంటే టీడీపీ అని అందరికీ తెలుసన్నారు. తప్పుడు కథనాల ద్వారా కాకుండా దమ్ముంటే వైఎస్ జగన్ మీద డైరెక్టుగా యుద్ధం చేయగలవా చంద్రబాబు అని ప్రశ్నించారు. చంద్రబాబు పొలిటికల్ గేమ్ కోసం దిగజారి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.చంద్రబాబు తన హామీల దృష్టి నుంచి ప్రజలను మళ్లించడానికే నీచపు రాజకీయాలు చేస్తున్నారని, మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు చంపుకుంటే పిన్నెళ్లి మీద కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు తప్పులు దేవుడు లెక్కిస్తున్నాడని దస్తగిరిని హత్య చేయాల్సిన అవసరం నిత్యానింద రెడ్డికి ఏముందని ప్రశ్నించారు. రాష్టంలో జరిగే హత్యలకు ఏ1గా చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టాలన్నారు. చంద్రబాబుకు సరైన సమయంలో ప్రజలు బుద్ధిచెబుతారని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. -
Ys Jagan: కష్టాలు వింటూ.. అక్కున చేర్చుకుంటూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడారు. ప్రధానంగా కార్యకర్తల కష్టసుఖాలు అడుగుతూ.. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన బాధితుల వెతలు వింటూ నేనున్నానని.. మీకేం కాదని భరోసా ఇచ్చారు.ధైర్యంగా ముందుకు పోవడమే ఆలస్యమని.. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మంచి కాలం ముందు ఉందంటూ వివరించారు. ప్రధానంగా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి బాధలు విన్న ఆయన కొన్నింటికి సంబంధించి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో మాట్లాడుతూ మార్గం చూపారు.వైఎస్ జగన్ ఉదయం ఇప్పట్ల పర్యటన తర్వాత భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మాట్లాడారు. ముఖ్యమైన నాయకులతోనూ చర్చించారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. తెలిసిన ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరునా పలకరించడమే కాకుండా కష్ట, సుఖాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.వారిని ఆప్యాయంగా పలకరిస్తూ అక్కున చేర్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేనున్నానని.. ఏదైనా సమస్యలున్నా పార్టీ అండగా ఉంటుందని వివరించారు. కొంతమంది దివ్యాంగులు, యువత ఆయనను అభిమానంగా వచ్చి కలుసుకున్నారు. వారి కోరిక మేరకు సెల్ఫీలు దిగుతూనే మరోవైపు ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడుతూ వచ్చారు.వైఎస్ జగన్ పులివెందులకు వస్తున్నారని తెలుసుకున్న జనాలు భారీగా తరలి వచ్చారు. పార్టీ అభిమానులు, క్యాడర్‌తోపాటు యువత, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ తరలి రావడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. కార్యాలయ ప్రాంగణమంతా జగన్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులతో పోటెత్తింది. వైఎస్ జగన్ నినాదాలతో హోరెత్తింది. వైఎస్ జగన్‌ను చూడగానే ఉప్పొంగిన అభిమానంతో జై జగన్ నినాదాలతో నినదించారు. -
సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
వైఎస్ జగన్ ఇప్పట్ల పర్యటన అప్డేట్స్.. సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ఇప్పట్ల చేరుకున్న వైఎస్ జగన్సుధాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్ఇటీవల మృతి చెందిన సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్పార్నపల్లి నిర్వాసితులకు భరోసా.. కడపపార్నపల్లి రహదారిపై వైఎస్ జగన్‌ను కలిసిన రాజారెడ్డి కాలనీ వాసులు..జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్నామని నిర్వాసితులు ఆవేదన.పరిహారం విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదనపరిహారం ఇప్పించి ఆదుకోవాలని వైఎస్ జగన్‌కు వినతి.న్యాయం కోసం పోరాటం చేద్దాం.న్యాయం జరగకపోతే మూడేళ్లు ఆగండి మనం అధికారంలోకి వస్తాం..తప్పకుండా న్యాయం చేస్తామన్న వైఎస్ జగన్మీకు అన్యాయం జరగదు.. జగన్ సార్ చూసుకుంటాడని ఎంపీ అవినాష్ రెడ్డి భరోసా ఇప్పట్ల బయలుదేరిన వైఎస్ జగన్పులివెందులలో తన నివాసం నుంచి ఇప్పట్ల బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మరికాసేపట్లో ఇప్పట్ల చేరుకోనున్న వైఎస్ జగన్ఇప్పట్ల లో ఇటీవల మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్అనంతరం పులివెందుల క్యాంప్ ఆఫీసుకు వైఎస్ జగన్క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్, ప్రజల నుంచి వినతుల స్వీకరణ👉లింగాల మండలం ఇప్పట్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ సీఎం వైఎస్ జగన్👉వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్‌రెడ్డికి ఇంటికి వెళతారు. అక్కడ సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.👉వైఎస్ జగన్ పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఇప్పట్లకు బయలుదేరుతారు. నేరుగా లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్‌రెడ్డికి ఇంటికి వెళతారు. అక్కడ సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. -
ధైర్యంగా ఉండండి
సాక్షి, కడప: కష్టాలు చెప్పుకున్న వారందరికీ నేనున్నానంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం చెప్పారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, అందరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చేరుకున్న జగన్‌కు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. భాకరాపురం సమీపంలోని హెలిప్యాడ్ నుంచి ఇంటికి చేరుకునే వరకు జగన్‌ను చూసేందుకు దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా బారులుతీరారు. యువత జై జగన్ నినాదాలతో హోరెత్తించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్.. నాయకులు, కార్యకర్తలు, స్థానికులను పేరు పేరునా పలుకరించారు. పలువురితో సెల్పిలు దిగారు. మధ్యలో కాన్వాయ్‌ని ఆపిన అభిమానులతో కరచాలనం చేశారు. ప్రజల నుంచి వినతులు సైతం స్వీకరించారు. ఈ సందర్భంగా టీడీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాగా, క్యాంపు కార్యాలయంలో వేద పండితులు వైఎస్ జగన్‌ను ఆశీర్వదించారు. పులివెందులలోని తన నివాసానికి వచ్చే మార్గంలో కాన్వాయ్ ఆపి ప్రజల కష్టాలు వింటున్న మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. వివిధ అంశాలపై వారితో వైఎస్ జగన్ చర్చించారు. వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది వైఎస్ జగన్‌ను కలిసి వివాహ శుభ లేఖలు, వినతులు అందించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కె.సురేష్ బాబు, రాష్ట్ర నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. నేడు ఇప్పట్లకు వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సుధాకర్‌రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
పులివెందులలో వైఎస్ జగన్
కడప: మూడు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. వైఎస్ జగన్‌కు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నేటి నుంచి(ఏప్రిల్ 21వ తేదీ) మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు(బుధవారం, ఏప్రిల్ 22వ తేదీ) ఉదయం 9 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్‌రెడ్డి ఇంటికి బయలుదేరి వెళతారు వైఎస్ జగన్. 9.45గంటలకు సుధాకర్‌రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10.15గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి రాత్రి 6.25గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 23వ తేదీ గురువారం ఉదయం 8గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి తిరగుపయనమవుతారు. -
నేటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 21వ తేదీనుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 21వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2.30గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి బెంగుళూరు ఎయిర్‌డ్రోంకు బయలుదేరుతారు. అక్కడి నుంచి 3గంటలకు హెలీకాప్టర్ ద్వారా బయలుదేరి 3.40గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.అక్కడి నుంచి 4గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్‌కు చేరుకుంటారు. 4 నుంచి రాత్రి 7గంటల వరకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్‌లో ప్రజలతో మమేకమవుతారు. 22వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్‌రెడ్డి ఇంటికి బయలుదేరుతారు.9.45గంటలకు సుధాకర్‌రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10.15గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి రాత్రి 6.25గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 23వ తేదీ గురువారం ఉదయం 8గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి హెలీప్యాడ్‌కు రోడ్డు మార్గాన వైఎస్ జగన్ బయలుదేరుతారు. అనంతరం అక్కడి నుంచి హెలీకాఫ్టర్ ద్వారా బెంగళూరుకు తిరగుపయనమవుతారు. -
ఒంటిమిట్టలో తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. గత అర్ధరాత్రి ఎస్సీ కులానికి చెందిన హర్షవర్ధన్ పై మూకుమ్ముడిగా దాడికి పాల్పడ్డారు. 10 మంది టీడీపీకి చెందిన నాయకులు దాడి చేసి హర్షవర్థన్‌ను తీవ్రంగా గాయపరిచారు. నోట్లో గుడ్డలు కుక్కి మరీ తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు హర్షవర్థన్ పేర్కొన్నాడు. తనపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయారన్నాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్‌ను 108 అంబులెన్స్‌లో హుటాహుటిన కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు బంధువులు. దాడికి సంబంధించి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. తమకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటున్నారు బాధితులు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా చేయకుంటే ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. అవసరమైతే రాస్తారోకో చేసేందుకైనా వెనుకాడమని హెచ్చరికలు పంపాయి. -
‘కార్మికులను లోనికి వెళ్లనివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారు’
కడప: కూటమి ప్రభుత్వం పాలన పారిశ్రామిక రంగానికి ఒక శాపంగా మారిందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు. పరిశ్రమల పట్ల జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. ఎర్రగుంట్ల అల్ట్రా టెక్ సిమెంట్స్ లో అదినారాయణరెడ్డి గూండాలను పెట్టీ నడవనివ్వకుండా చేస్తున్నారన్నారు. కార్మికులను లోపలకు వెళ్ళనివ్వకుండా దౌర్జన్యానికి దిగుతున్నారని, ఆ కంపెనీలో అన్ని కాంట్రాక్టులు ఇవ్వాలని ఇబ్బందిపెడుతున్నారన్నారు. ఈ తరహా వైఖరి వల్ల ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా.. వీళ్ల దౌర్జన్యాలకు ఉన్న పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. ‘షాడో ముఖ్యమంత్రి లోకేష్ పరిశ్రమలు తెస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ.. వాస్తవంలో కూటమి ఎమ్మెల్యేలు ఉన్న పరిశ్రమలను పారద్రోలుతున్నారు. ఎర్రగుంట్ల అల్ట్రా టెక్ సిమెంట్స్ లో అదినారాయణరెడ్డి గూండాలను పెట్టీ నడవనివ్వకుండా చేస్తున్నారు. క్వారీ ముడిసరుకు రాకుండా గూండాలను పెట్టీ అడ్డుకుంటున్నారు. చివరికి ఆ కంపెనీ ఉత్పత్తి చేసే సిమెంట్ టన్నుకి కమిషన్ డిమాండ్ చేయడం దారుణం. మీ ప్రజాప్రతినిధులకు కప్పం కట్టుకుంటేనే పరిశ్రమలు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. గతంలోనే ఇదే పరిశ్రమను నెల రోజుల పాటు మూతవేయించారు. అయినా జిల్లా యంత్రాంగం స్పందించలేదు..గతంలో ముఖ్యమంత్రిని కలిసినా ప్రయోజనాంలేదు. మన ముఖ్యమంత్రి తప్పు చేస్తున్న వారిని దండించకుండా మధ్యవర్తిత్వం చేస్తున్నారు. మధ్యవర్తిత్వం చేసి కాంట్రాక్టులు ఇప్పించే పరిస్థితిఈ తీరు చూసిన తర్వాత ప్రజాప్రతినిధులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. నాలుగు రోజులుగా ఆ పరిశ్రమను నిర్బంధించి ఇబ్బంది పెడుతున్నారు. జిల్లా అధికారులు స్పందించకపోవడంపై ఆదినారాయణరెడ్డికి సహకరిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తెలిసే పరిశ్రమపై గూండాగిరి జరుగుతోందని అనుమానం ఉంది. ఎంతో మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. కార్మికులు ఫ్యాక్టరీలోకి వెళ్తుంటే పోలీసులే అడ్డుకుంటున్న తీరు దారుణం. కార్మికులు ఉండే గ్రామాల్లోకి వెళ్ళి ఆ పరిశ్రమకు పనికి వెళ్లొద్దని బెదిరిస్తున్నారు. ఇలానే వదిలేస్తే అన్ని పరిశ్రమలకు ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ నేతలు సీఎం రమేష్, అది వర్గీయుల ఆధిపత్య పోరు అదానీ కంపెనీ కూడా తాకింది. లోకేష్ రచించిన రెడ్ బుక్ పాలన పరిశ్రమలకు కూడా వర్తింపు చేస్తున్నారు. ఆర్టీపీపీలో ఫ్లై యాష్ కోసం అది, జేసీ వర్గీయులు కొట్లాటకు దిగితే చంద్రబాబు రాజీ చేశారు. తన అనుయాయులకు పరిశ్రమల నుంచి దోచిపెట్టే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇక కడప లాంటి ప్రాంతానికి పరిశ్రమలు ఎలా వస్తాయి..?, చంద్రబాబును కలిసి వచ్చిన మరుసటి రోజే ఈ పరిశ్రమపై ఆది దాడికి దిగాడంటే ఆంతర్యమేమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమలన్నీ మూత పడే పరిస్థితి ఏర్పడుతోంది’అని హెచ్చరించారు. -
ఖాజీపేట ప్రేమ్మోనాది ఘటనలో బిగ్ ట్విస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఖాజీపేట ఇంటర్ బాలిక హత్య కేసులో బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితుడు వెంకటేష్ తల్లి సుజాత.. మీడియా ముందుకొచ్చారు. తన కుమారుడు, కీర్తనకు మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తనకు తెలియదన్నారు. తన కొడుకు జేబులో ఒక లెటర్ దొరికింది. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోందని ఆమె తెలిపారు.‘‘నా కుమారుడు కీర్తన వెంట తిరుగుతున్నట్టు ఆమె తల్లిదండ్రులకు తెలిసినా.. నాకెప్పుడూ చెప్పలేదు. హత్య జరిగిన రోజు బయటకు వెళ్లి కొద్దిసేపటికే నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చాక నన్ను గుండెలకు హత్తుకొని ఏడ్చాడు. నా ప్రేమ విషయంలో కీర్తన మోసం చేసిందని ఆడగటానికి వెళ్తే కత్తి తీసుకొని గొంతు కోసుకుంటానని బెదిరించిందని చెప్పాడు. ఈ పెనుగులాటలో కీర్తన గొంతు తెగిందని ఏమైందో తర్వాత తనకు తెలియదని భయంతో వచ్చానని చెప్పాడు. నా కొడుకు అమాయకుడు. ఇంతటి ఘోరం చేసుంటాడని అనుకోవడం లేదు. చట్టపరంగా నా కొడుకుని శిక్షించండి. మరో రకంగా వద్దు. మరో రకంగా శిక్షించేటట్లయితే... నా కుమారుడితో పాటు నన్నూ శిక్షించండి’’ అంటూ సుజాత పేర్కొంది.తన కొడుకు చంపాలని వెళ్లి ఉంటే కత్తి తీసుకువెళ్ళేవాడు కదా అంటూ తల్లి ప్రశ్నిస్తోంది. పెనుగులాటలో పొరపాటున ప్రమాదం జరిగిందని కొడుకు తనకు చెప్పాడన్న తల్లి.. ముందే బాలికను పెళ్లి చేసుకుంటానని తన కొడుకు ఆమె తండ్రిని అడిగాడని సుజాత అంటోంది. ‘‘ప్రేమించుకున్నాం కదా పారిపోయి పెళ్లి చేసుకుందామని నా కుమారుడు అడిగాడు. బాలిక రానని చెప్పింది. ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తన కుమారుడిని ఎన్కౌంటర్ చేస్తారని పుకార్లు ఉన్నాయి. చట్టప్రకారం తప్పుచేసి ఉంటే శిక్షించండి. ఎన్కౌంటర్ చేస్తే.. నన్ను కూడా చంపేయండి’’ అంటూ వెంకటేష్ తల్లి వ్యాఖ్యానించారు. -
పారిపోతున్న ప్రేమోన్మాదిపై పోలీసులు కాల్పులు
-
కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం.. నిందితుడిపై పోలీసుల కాల్పులు
-
ఖాజీపేట ప్రేమోన్మాది వెంకటేష్‌పై కాల్పులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఖాజీపేట విద్యార్థినిని చంపిన ప్రేమోన్మాదిపై పోలీసులు కాల్పులు జరిపారు. బాసాపురం చెక్‌పోస్ట్ దగ్గర పారిపోయేందుకు నిందితుడు యత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడి కాలికి గాయమైంది. కడప రిమ్స్‌కు తరలించారు. ఘటనలో పోలీసులకూ గాయాలయ్యాయి.ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో బాలిక దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. అగ్రహారంలో ఇళ్లూరు శ్రీనివాసులు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె రామకీర్తన (16) ఉన్నారు. కీర్తన ఖాజీపేటలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివి ఇటీవలే పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటుంది.నిన్న(శుక్రవారం, ఏప్రిల్ 10) ఉదయం కీర్తన తండ్రి శ్రీనివాసులు తన పెద్ద కుమారునితో కలిసి మైదుకూరుకు జీవాల కొనుగోలుకు వెళ్లాడు. తల్లి నాగమణి కూలి పనులకు వెళ్లారు. కీర్తన తమ్ముడు బడికి వెళ్లాడు. దీంతో కీర్తన ఒంటరిగా ఇంటి వద్ద ఉండడంతో ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ వచ్చి కొడవలితో గొంతుకోసి పరారయ్యాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి, అతడి పెద్దకుమారుడు రక్తపుమడుగులో పడి ఉన్న రామకీర్తనను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.అప్పటికి రామకీర్తన మాట్లాడు తుండడంతో విషయం తెలుసుకుని పోలీసు లకు సమాచారం ఇచ్చారు. కీర్తన గొంతు నుంచి రక్తస్రావం జరగకుండా టవల్‌ను చుట్టి ఆమెను చేతులతో ఎత్తుకుని ఆటో వరకు తీసుకెళ్లారు. అనంతరం కడపకు తీసుకెళ్తుండగా హైవేపైకి రాగానే 108 ఎదురవడంతో అందులో కడప రిమ్స్‌కు తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందింది.ఆవుల వెంకటేష్ రెండేళ్ల నుంచి ప్రేమ పేరుతో రామకీర్తన వెంటపడుతున్నాడు. ప్రేమించాలని వేధిస్తున్నాడు. పలుమార్లు బాలిక తండ్రితో మీ కూతురు ఇతరులతో ఫోన్ మాట్లాడుతోందంటూ ఫిర్యాదు చేశాడు. దీనికి ఆమె సంగతి మేం చూసుకుంటాం.. నీవు కలగజేసుకోవద్దని శ్రీనివాసులు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రామకీర్తనపై కక్ష పెంచుకున్న వెంకటేష్ శుక్రవారం ఉదయం ఆమెతో ఫోన్లో మాట్లాడే యత్నం చేశాడు. బాలిక స్పందించక పోవడంతో ఆవేశంతో ఇంటికి వెళ్లి కొడవలితో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. -
విద్యార్థిని హత్యపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : వైఎస్సార్ జిల్లాలో కీర్తన అనే విద్యార్థిని ప్రేమోన్మాది దారుణంగా గొంతు కోసం హత్య చేసిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ పాలనలో మహిళల భద్రత కరువైంది. వ్యవస్థపై నేరస్తులకు ఎలాంటి భయం లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు మాటలే తప్ప కఠిన చర్యలు శూన్యం. పోలీసుల అప్రమత్తత కొరవడడం, సరైన నిఘా లేకపోవడమే ప్రధాన కారణం. దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నమోదు చేసి వేగంగా న్యాయం జరిగేలా చూడాలి’ అని డిమాండ్ చేశారు. అదే సమయంలో బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్.కాగా, వైఎస్సార్ జిల్లాలోని ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిని గొంతు కోసి చంపేశాడు. తనను పెళ్లి చేసుకోలేదని ఓ యువకుడు.. యువతి గొంతు కోశాడు. కడప రిమ్స్‌కు తరలిస్తుండగా చెన్నూరు వద్ద దారిలోనే యువతి ప్రాణాలు విడిచింది.ఖాజీపేట అగ్రహారంలో కీర్తన(16) అనే విద్యార్థినిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థి ఆవుల వెంకటేష్(19) పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఖాజీపేట మోడల్ స్కూల్లో కీర్తన ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
AP: ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిని గొంతు కోసి చంపేశాడు. తనను పెళ్లి చేసుకోలేదని ఓ యువకుడు.. యువతి గొంతు కోశాడు. కడప రిమ్స్‌కు తరలిస్తుండగా చెన్నూరు వద్ద దారిలోనే యువతి ప్రాణాలు విడిచింది.ఖాజీపేట అగ్రహారంలో కీర్తన(16) అనే విద్యార్థినిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థి ఆవుల వెంకటేష్(19) పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఖాజీపేట మోడల్ స్కూల్లో కీర్తన ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురు గల్లంతు
వల్లూరు: వైఎస్సార్‌జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురు యువకులు స్నానానికి దిగి గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో గల్లంతైన వారిలో కడప టౌన్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన హర్షవర్ధన్ (22), కడప విశ్వనాధ పురానికి చెందిన హరిబాబు (25), కడప ఐటి సర్కిల్ కు చెందిన కృష్ణ చైతన్య (20) లుగా గుర్తించారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. హరిబాబు, హర్షవర్ధన్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన యువకుని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
మంటల్లో బస్సు.. క్షణంలో తప్పిన ఘోర ప్రమాదం
-
వీటి ధరలు దారుణంగా పడిపోయాయి: అవినాష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ (మార్చి 31) వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చల్ల బసాయపల్లిలో పర్యటించారు. మొక్కజొన్న పంటను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మొక్కజొన్న, అరటి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. మొక్కజొన్న మద్దతు ధర రూ.2400 ఉంటే రేటు రూ.1400కి అమ్ముకోవాల్సి వస్తోంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.పక్క రాష్ట్రం తెలంగాణలో మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలోనూ వెంటనే ఏర్పాటు చేయాలి. అరటి ధర కూడా దారుణంగా పడిపోయింది. టన్నుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు కూడా రావడం లేదు. ఇరాన్ యుద్ధం, ముంబై మార్కెట్లో అరటి అధికంగా రావడంతో ధర దారుణంగా పడిపోయింది. అరటి పంటను కనీసం టన్ను రూ.10 వేల నుంచి రూ.12 వేల ధర వచ్చేలా కొనుగోలు చేయాలి. లేదంటే రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోతోంది. రేపు జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు సమస్యను తీసుకువెళ్లాలి, మొక్కజొన్న, అరటి రైతులను ఆదుకోవాలి’ అని అన్నారు. -
రాజంపేటలో దారుణం.. వదినపై మరిది లైంగిక దాడి
-
కృష్ణవేణి మరణం వెనుక దారుణాలు!
వైఎస్ఆర్ కడప జిల్లా: నందలూరు రైల్వేలోకోపైలెట్ శ్రీరామ్ శ్రీనివాస్ రెండో భార్య కృష్ణవేణి మరణం వెనుక అనేక దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణవేణి ఆత్మహత్య చేసుకున్న రాత్రంతా మద్యం సేవించి ఇంటిలోనే ఉన్నట్లు, గురువారం అటు పోలీసులకు, ఇటు మృతురాలి కుటుంబసభ్యులకు తెలియజేశాడు.శ్రీరామ్ శ్రీనివాస్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు అమ్మ చచ్చిపోయింది అని కిటికీలోంచి ఉరి వేసుకున్న కృష్ణవేణిని చూపించినట్లు తెలిసింది. అనంతరం పిల్లలకు భోజనాలు పెట్టి, తను మద్యం సేవించి, మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఇంట్లోనే పిల్లలతోనే భర్త ఉండిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణవేణి వేధింపులకు గురిచేసి ఆమె మృతికి కారణమయ్యాడని బంధువులు ఆరోపించారు.పది సంవత్సరాల క్రితం ఆయన మొదటి భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఆరుసంవత్సరాల కిందట మృతురాలిని వివాహం చేసుకున్నాడు. కాగా శ్రీనివాస్ మరో అమ్మాయి ప్రేమలో పడి భార్యకు చిత్రహింసలు పెడుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఈ కారణంగా రెండోభార్యతో తరుచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం. కాల్చి వాత పెడుతున్నట్లు, ఆ గాయాలను పుట్టింటి వారికి చూపించి బాధపడేదని బంధువులు చెబుతున్నారు. మృతురాలి వంటిపై గాయాలు కూడా ఉన్నట్లుగా సంబంధీకులు ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడు నాగరాజు మీడియా ఎదుట ఆరోపణలు చేస్తూ శ్రీరామ్ శ్రీనివాస్‌కు తగిన శిక్ష వేసి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు సర్కార్ అప్పుల్లో రికార్డులు సృష్టిస్తోంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం ఉపయోగించడం లేదంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన అనుభవాన్ని ఊరారా తప్పుడు ప్రచారాన్ని చేయడానికే వినియోగిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘దేశంలో నాకంటే సీనియర్ లేడని చెప్పుకునే చంద్రబాబు.. అబద్ధాలపైనే బతకాల్సిన పరిస్థితి. ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేసి ఓటుగా మార్చుకోవాలని చంద్రబాబు చూస్తాడు. అందుకే ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా చెప్పుకోడానికి ఏమీ లేని పరిస్థితి. ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు అన్నాడు. వైఎస్సార్సీపీని మిగిలిన వారికి దూరం చేయాలని దుష్ప్రచారానికి దిగాడు. సుప్రీం కోర్టు చెప్పినా ఇంకా అదే దుష్ప్రచారాన్ని చేస్తూనే ఉన్నాడు...చివరికి మండలి చైర్మన్ కులాన్ని ప్రశ్నించే స్థాయికి మీ పార్టీ దిగజారింది. లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నాడు. మా నాయకుడు వైఎస్ వివేకా అంశంలోనే ఇదే తరహా రాజకీయం చేశాడు. ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడం కోసం కుటిల రాజకీయం చేశాడు. పాశవికంగా చంపిన వారీని దగ్గర పెట్టుకుని విషప్రచారం చేశాడు. నేడు సుప్రీం కోర్టులో వాస్తవలేంటి అనేది అందరికీ తెలిసిపోయింది. చంపిన వారు చంద్రబాబు ప్రభుత్వంలో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు..ఆనాడు 14 లక్షల కోట్ల అప్పు అన్న వ్యక్తి.. ఇప్పుడు 3 లక్షల కోట్లు మాత్రమే అంటున్నాడు. నేడు రెండేళ్లలోనే మా ఐదేళ్లలో చేసిన అప్పులు చేశాడు. ఎవరు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది ఎవరో ప్రజలు గమనించాలి. అన్ని అంశాల్లో మోసంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. నిరుద్యోగ భృతి నుంచి సూపర్ సిక్స్ గురించే కేటాయింపులు లేవు. చివరికి కేబినెట్‌పై కూడా పట్టు కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ నిన్నటి కేబినెట్ మీటింగ్‌కు రాలేదు. పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ ధరలు పెంచుకునే బిజీలో ఉన్నాడు. రాష్ట్రంలో రైతులు నానా తంటాలు పడుతుంటే వీళ్లు సినిమా ప్రమోషన్లో ఉన్నారు..గత ఏడాది రైతులు అన్ని విధాల మోసం పోయారు. మళ్ళీ ఈ ఏడాది కూడా అదే తీరు. అన్నీ నేనే చేశాను అంటాడు. ఒక్క ప్రాజెక్ట్ డిజైన్ అయినా నువ్వు చేసావా బాబు..?. నేడు రాయలసీమ లిఫ్ట్ ఫణంగా పెట్టిన నువ్వు రాయలసీమను ఉద్ధరిస్తావా?. ఇన్ని రకాలుగా మా కడుపు కొడుతున్న నీకు దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు. నేడు పాలల్లో, నెయ్యిలో ఎక్కడ చూసినా అన్నిటా కల్తీ. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ నెయ్యి సప్లై చేసి కోట్లు కొల్లగొట్టవ్. హెరిటేజ్‌కి ఎన్ని రాయితీలు తీసుకున్నావో ప్రజలు గమనిస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. వివేకా కేసులో విచారించి వాస్తవాలెంటో తేల్చండి. ఎవరు తప్పు చేసినా మీరే చర్యలు తీసుకోండి’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
భార్య ఉరి వేసుకుంటుంటే నవ్వుతూ వీడియో తీసిన భర్త.. చివరికి..
-
జీపీఎస్ దారి తప్పింది
మదనపల్లెటౌన్: జీపీఎస్ లోకేషన్ చూస్తూ తిరుపతి నుంచి మదనపల్లెకు బైక్‌లో వస్తున్న దంపతులకు జీపీఎస్ దారి తప్పించడంతో ప్రమాదానికి గురైన ఘటన గురువారం మండలంలోని శానిటోరియం వద్ద జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు. తిరుపతికి చెందిన దంపతులు ఆనంద్ (25), నాగలక్ష్మి (20) కుమారుడు అభి(5)తో కలసి మదనపల్లెలో జరుగుతున్న బంధువుల పెళ్లికి బైక్‌లో బయలుదేరారు. వీరు మదనపల్లె సమీపంలోని శానిటోరియం వద్దకు రాగానే రోడ్డు అభివృద్ధి పనులు సాగుతున్నాయి.దీంతో రోడ్ డైవర్షన్ ఉంది. జీపీఎస్ ఈ డైవర్షన్‌ను చూపకపోవడంతో నేరుగా చర్చి వైపు రోడ్డులోకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు అందించారు. తాలూక పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చంద్రబాబు తీరుతో సీమకు తీరని నష్టం: వైఎస్సార్సీపీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్, అంజాద్ బాషా, సాకే శైలజానాథ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. రాయలసీమ లిఫ్ట్ సాధన కోసం కార్యాచరణ నేతలు చర్చించారు. చంద్రబాబు.. రాయలసీమకు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. చంద్రబాబు చర్యల వల్ల సీమకు తీరని నష్టం జరుగుతున్న వైఎస్సార్సీపీ.. కలిసివచ్చే పార్టీలు, ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. -
జమ్మలమడుగులో 17 ఏళ్ల తర్వాత వైభవంగా పెద్దమ్మ తల్లి దేవర గ్రామోత్సవం
-
జగన్ ను చూసేందుకు పరుగులు తీసిన జనం
-
పులివెందులలో వైఎస్ జగన్
పులివెందుల(వైఎస్సార్ జిల్లా): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 24వ తేదీ) వైఎస్ జగన్ పులివెందులకు బయల్దేరి వెళ్లారు. ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు తెలుసుకోనున్నారు. పులివెందులలోని భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.25వ తేదీ ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు. అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. -
వైఎస్సార్ జిల్లా: ఎర్రముక్కపల్లిలో టీడీపీ నేతల దాష్టీకం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో అర్ధరాత్రి టీడీపీ నేతల దాష్టీకానికి దిగారు. ఓ ఇంటిని రెండు జేసీబీలతో నేలమట్టం చేసేశారు. ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులను టీడీపీ నేతలు బయటకు లాగి పడేశారు. ఇల్లు కూల్చడం వెనుక టీడీపీకి చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథరెడ్డి ఉన్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారులను సైతం బలవంతంగా టీడీపీనేతలు బయటకు లాగేశారు. కూల్చిన ఇంటి వద్దే బాధితులు ఆందోళనకు దిగారు.టీడీపీ నేతలు కూల్చివేసిన ఇంటిని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాజంపేట పరిశీలకులు సురేష్ బాబు పరిశీలించారు. బాధితులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. దళితులమైన తమపై దౌర్జన్యంగా రాత్రికి రాత్రి దాడి చేశారని బాధితులు వివరించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి దగ్గర బంధువులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో జేసీబీలతో ఇంటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వందమంది టీడీపీ మూకలు ఒక్కసారిగా ఇంటిపై దాడి చేశారని బాధితులు తెలిపారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్సీపీ నేతలు హామీ ఇచ్చారు.వైఎస్సార్సీపీ నేతలు, అంజాద్ బాషా, సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోందని.. బలహీన వర్గాలు, దళితులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ‘‘అర్ధరాత్రి ఎర్రముక్కపల్లిలో ఎమ్మెల్యే అనుచరులు 100 మంది గుండాలతో దళితుల ఇళ్లను కూల్చివేశారు. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు అని చూడకుండా ఇల్లు కూలదోశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? ఆఫ్గనిస్తాన్ లో ఉన్నామా..?. ఎమ్మెల్యే అనుచరుల కన్ను పడితే దాడులు చేసి దోచుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో దళితులని కూడా చూడకుండా రోడ్డున పడేశారు. ఈ ఇళ్ల కూల్చివేతను వైఎస్సార్సీపీ పూర్తిగా ఖండిస్తున్నాం..రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు దీన్ని ఖండిచాల్సి ఉంది. చట్టం మాకు చట్టం అంటూ ఒక కుటుంబాన్ని రోడ్డున పడేశారు. 100 మంది తాగి ఆ ఇంటిపై, మహిళలపై దాడికి దిగటం రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. కడప ఎమ్మెల్యే లాంటి ప్రజా ప్రతినిధులు మనకు అవసరమా...?’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు. -
ఇంటిపన్ను కోసం వెళ్లిన అధికారిని తరిమికొట్టిన TDP అభిమాని
-
రూ. 73 లక్షలు కాజేసిన డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టు రట్టు
బద్వేల్: వైఎస్సార్ జిల్లాలోడిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మొత్తంలో నగదు కాజేసిన ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నకిలీ పోలీసులు, అధికారుల పేరుతో బద్వేల్ కు చెందిన పీవీఎన్ ప్రసాద్ అనే న్యాయవాది వద్ద రూ. 73 లక్షలు కాజేసింది డిజిటల్ అరెస్ట్ ముఠా. ఆ ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ నచికేత విశ్వనాథ్ వెల్లడించారు. నిందితులన కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విదించినట్ల ఆయన పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్లు వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు. -
టీడీపీలో వర్గ విభేదాలు.. సర్పంచ్‌పై పచ్చ నేతల దాడి
సాక్షి, వైఎస్సార్: జిల్లాలోని సుండుపల్లె మండలంలో టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రాయవరం సర్పంచ్ షరీఫ్ ఇంటిపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు వర్గీయులు దాడి చేశారు. పచ్చ నేతల దాడిలో సర్పంచ్ షరీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, అతడిని ఆసుపత్రికి తరలించారు.అనంతరం, సర్పంచ్ షరీఫ్ మాట్లాడారు. తన సోదరుడు, మండల మైనారిటీ నాయకుడు రఫీక్‌కు ఉన్న ఆదరణను ఒర్వలేకనే చప్పిడి బ్రదర్స్ అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. తమపై దాడి చేసేందే కాకుండా.. అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలు ఎదగడం ఇష్టం లేకనే తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తమను టీడీపీ గుర్తించలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సర్పంచ్ ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. -
‘ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు’
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం ద్వారా.. సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణశాసనం రాస్తున్నారని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మాటలతో చంద్రబాబు ద్రోహం బయటపడిందని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కేవలం స్వప్రయోజనాల కోసమే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌కి చంద్రబాబు మంగళం పాడారని మండిపడ్డారు.శాసనసభ సాక్షిగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనమని తేల్చిచెప్పారు. చంద్రబాబు తప్పుకి నిష్కృతి లేదని ధ్వజమెత్తారు. కేవలం స్వప్రయోజనాల కోసమే పర్యావరణ అనుమతులు లేవన్న సాకుతో చంద్రబాబే రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ నిలిపివేశాడని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ ఏపీకి నీటి గండమేనన్న శ్రీకాంత్ రెడ్డి, ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడ్డంలో విఫలమయ్యారని తేల్చి చెప్పారు. తక్షణమే రాయలసీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. రాయలసీమను ఎడారిగా మార్చే కుట్రకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..రాయలసీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలిరాయలసీమ ప్రాంత అభివృద్ధిపై చంద్రబాబు మొదటి నుంచీ వ్యతిరేకత కనబరుస్తున్నాడు. ఈ ప్రాంతానికి కేటాయించిన ఎయిమ్స్, లా యూనివర్సిటీ, హైకోర్టులను అమరావతికి తరలించుకుపోయాడు. రాయలసీమ ప్రయోజనాల కోసం ఈ ప్రాంత నాయకులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలి. వైయస్ జగన్ ఏపీ ప్రయోజనాల కోసం తాపత్రయపడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక ఆయనతో మాట్లాడి ప్రాజెక్టును నిలుపుదల చేయించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటమే కాకుండా తన మాటలపై నిజనిర్ధారణకు అన్ని పార్టీల నుంచి నాయకులను పంపిస్తానని కూడా సవాల్ చేశాడు.చంద్రబాబు కారణంగానే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆగిపోయిందని తేటతెల్లం అయ్యింది. చంద్రబాబు చేసిన పాపానికి రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు చంద్రబాబే మరణశాసనం రాశాడని స్పష్టంగా తేలిపోయింది కాబట్టి, రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ ప్రాంతానికి చెందిన నాయకులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలి. పదవులు ముఖ్యంకాదు, రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాలి. ఇప్పటికైనా చేసిన తప్పుకి బాధ్యత వహించి రాయలసీమ ప్రాజెక్టును చంద్రబాబు తక్షణం పూర్తి చేసేవరకు వదిలే ప్రసక్తే లేదు.చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా..చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ పైనున్న రాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుంటూనే ఉన్నాయి. గతంలో కర్నాటక రాష్ట్రం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు మౌనం వహించాడు. ఇప్పుడు మళ్లీ ఎత్తు పెంచుతున్నా పట్టించుకోవడం లేదు. నీటి కేటాయింపుల కోసం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఏపీ తరఫున వాదనలు వినిపించడంలోనూ చంద్రబాబు ఫెయిలయ్యాడు. అడుగడుగునా తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెడుతూనే ఉన్నాడు. ఇలాంటి చంద్రబాబును గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు.ఆంధ్రా తెలంగాణ రెండు ప్రాంతాలకు మంచి జరగాలని వైయస్సార్సీపీ ప్రభుత్వం ఆలోచించింది. తెలంగాణ నాయకులు కూడా రాయలసీమ ప్రాంత ప్రజల గురించి ఆలోచించాలి. పాలమూరు- రంగారెడ్డి చేసుకుంటూ ఏపీలో రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుకు మద్ధతివ్వాలి. కమీషన్ల కోసం కక్కుర్తి పడి పోలవరం ప్రాజెక్టును నాశనం చేస్తే, వైయస్ జగన్ గారు సీఎం అయ్యాకనే కేంద్రంతో మాట్లాడి మళ్లీ గాడినపెట్టారు. నిధులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. రాయలసీమ ప్రాజెక్టును వ్యూహాత్మకంగా పక్కనపెట్టి బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చిన చంద్రబాబు, కొన్ని రోజులు హడావుడి చేసి దాన్ని కూడా అటకెక్కించాడు.నీటి హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ లిఫ్ట్ స్కీంశ్రీశైలం జలాశయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు. సీమ ప్రాజెక్టులకు సాగునీరివ్వడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం.కానీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్ అడ్డుకోలేదు. ఇలా తెలంగాణ సర్కార్ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంటోంది.రోజూ 3 టీఎంసీలు తరలించేలా..ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి రాయలసీమను కాపాడుకునేందకు రోజుకు 3 టీఎంసీలు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నాటి సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా తీసుకొచ్చారు. కానీ పర్యావరణ అనుమతులు లేవనే కారణం చూపెట్టి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలను పక్కన పెట్టేసింది. చంద్రబాబు తన కేసులకు భయపడి పూర్తికావొచ్చిన దశలో ఉన్న ప్రాజెక్టును నిర్ధాక్షిణ్యంగా పక్కనపెట్టి రాయలసీమకి మరణశాసనం రాశాడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటల ద్వారా ప్రజలకు అర్థమైపోయింది.చంద్రబాబు చేసిన ఈ పాపానికి ఏకంగా రాజకీయాల నుంచి వైదొలిగినా చేసిన పాపం పోదు. రాయలసీమ మీద చంద్రబాబు ఎప్పుడూ ద్వేషపూరితంగానే వ్యవహరిస్తున్నాడు. వైయస్సార్సీపీ తీసుకొచ్చిన లా యూనివర్సిటీని, హైకోర్టును అమరావతికి తరలించాడు. కేంద్రం అనంతపురంకి ఎయిమ్స్ ఆస్పత్రిని కేటాయిస్తే మంగళగిరికి తరలించుకపోయాడు.తెలంగాణలో పాలమూరు జిల్లా కరువును పారదోలడానికి అక్కడి పాలకులు ప్రయత్నిస్తుంటే చంద్రబాబు మాత్రం రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నాడని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్, రేవంత్‌రెడ్డిల మాదిరిగా తాము ప్రాతినిథ్యం వహించే ప్రాంతానికి మేలు చేయాలని ఆలోచించకుండా, చంద్రబాబు నిర్ధాక్షిణ్యంగా రాయలసీమను చంపేస్తున్నాడని ఆక్షేపించారు. ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ పడడం ద్వారా... ఏకంగా రాయలసీమను ఎడారిగా మార్చే కుట్రకు తెరలేపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘శ్రీకాంత్‌రెడ్డి జిల్లాను తెస్తే.. నువ్వు ముక్కలు చేస్తావా?’
సాక్షి, అన్నమయ్య జిల్లా: జిల్లాను నిలబెట్టలేకపోతే మీసం తీసుకుంటా అంటూ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గతంలో తొడగొట్టి మరీ చెప్పిన మాటలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాయచోటిలో ఆయన తీరుపై అసంతృప్తి.. క్రమక్రమంగా ఆగ్రహ జ్వాలలుగా మారుతోంది. తాజాగా రాయచోటిని మదనపల్లిలో కలపడంపై కేబినెట్లో సంతకం చేసిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. బయటకు వచ్చి కంటతడి పెట్టారు. అయితే ఆయనది డ్రామా అంటూ రాయచోటి ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నాడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకుని రాయచోటికి జిల్లాను తెచ్చారు. దానిని నిలబెడతానని.. లేకుంటే మీసం తీసేస్తానంటూ రాంప్రసాద్‌రెడ్డి శపథం చేశారు. ఈ క్రమంలో.. ఇప్పుడు మీసం తీసేస్తారంటూ అంటూ రాజకీయ ప్రత్యర్థులు సెటైరలు సంధిస్తున్నారు. శ్రీకాంత్‌రెడ్డి పదవీ త్యాగంతో జిల్లాను తీసుకొస్తే..రాంప్రసాద్‌రెడ్డి మంత్రి పదవి కోసం జిల్లాను ముక్కలు చేశాడంటున్న రాయచోటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. జిల్లా కేంద్రంలో రాయచోటిని తొలగించి మదనపల్లికి మార్చడంపై ఇటు ముస్లిం మత పెద్దల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. శుక్రవారం జిల్లా కేంద్రం మార్పునకు నిరసగా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించాయి. ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేయాలని.. అన్నమయ్య జిల్లాలోనే యధావిధిగా కొనసాగించాలని మత పెద్ద సర్కాజి షర్ఫుద్దీన్ హుస్సేని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించలేని పక్షంలో రాయచోటిని కడప జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారాయన. ‘‘జిల్లా కేంద్రం లేనప్పుడు పన్నుల భారం కూడ తోలగించి రాయచోటిను వైఎస్ఆర్ జిల్లాలో విలీనం చేయండి అని కోరుతున్నారాయన. -
‘మీరు జెండాలు జత కడితే.. జగన్ జనంతో జతకట్టారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : దేశంలో ఒకే ఒక్కడు వైఎస్ జగన్ అని.. తన జెండా, తన ఎజెండాతో మాత్రమే ఎన్నికలకు వెళ్లిన పార్టీ వైఎస్సార్సీపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గుర్తింపు పొందిన 6 జాతీయ పార్టీలు కూడా ఏదో ఒక సందర్భంలో పొత్తులు పెట్టుకున్నాయని.. ఎప్పుడైతే ఒక రాజకీయపార్టీ మరో జెండాతో జతకడుతుందో అప్పుడే సొంత బలం లేదని తేలిపోతుంది. వారి పాలనలో ఆలోచనలు కూడా అరువు తెచ్చుకున్నట్లు ఉంటాయి’’ అని రాచమల్లు వ్యాఖ్యానించారు.‘‘మన రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది.. ఈ మూడు పార్టీలకు విడిగా వైఎస్సార్సీపీనీ ఓడించే బలం ఉందా..?. వారికి సొంతగా గెలిచే బలం లేదు కాబట్టే మూడు పార్టీలు జత కట్టాయి. మీరు జెండాలు జత కడితే.. జగన్ జనంతో జతకట్టారు. మీరు మూడు పార్టీలు కలిసి ప్రజలకు ఏమైనా మేలు చేశారా...?. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. కేవలం చంద్రబాబు ఇచే ప్యాకేజీతో నోరు మూసుకున్నాడు. నువ్వు జగన్ చేతిలో రేఖలు తుడుపుతావా..?. ఓ పక్క టీడీపీ, మరో పక్క బీజేపీ లేకపోతే నీ మనుగడే లేదు. నువ్వు జగన్‌ను ఏమి చేయగలవు..?’’ అంటూ రాచమల్లు నిలదీశారు.‘‘ఈ దేశంలో చంద్రబాబు అంత అవకాశవాది ఎవరూ లేరు. ఆయన జత కట్టని పార్టీ లేదు.. ఆయనకు కేవలం అధికార దాహం మాత్రమే ఉంది. బీజేపీ పెద్ద ముత్తయిదువు పాత్ర.. ఏమీ చేయలేదు కానీ పేరుకు ఉంటుంది. 2 శాతం, 30 శాతం ఓట్లు ఉన్న వీళ్లు 40 శాతం ఓట్లున్న జగన్‌ను ఏమీ చేయలేరు. అందుకే జగన్ ఓడిపోయాడు కానీ.. చావలేదు అని వాళ్లే అంటున్నారు. వీళ్లెవరికీ జగన్‌ను ఢీకొట్టే పరిస్థితి లేదని వాళ్లకే తెలుసు. మీ మేనిఫెస్టోను ఆనాడు బీజేపీ ముట్టుకోలేదు. కానీ జగన్ మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నారు’’ అని రాచమల్లు గుర్తు చేశారు.‘వీళ్ళంతా రాజకీయంగా అవిటి వాళ్ళు.. ఒకరి ఊతం లేనితే మరొకరు లేరు. ఈ రాష్ట్రంలో ఎవరూ చేయని సంక్షేమం ఒక్క వైఎస్ జగన్ మాత్రమే చేశాడు. జగన్ పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. ఒక్కడు కాబట్టే.. సొంత ఆలోచనతో అనేక సంస్కరణలు చేపట్టాడు. జగన్ పొత్తుకు పోలేదంటే నైతిక విలువలు ఉన్నాయని అర్థం.. తన పాలనని నమ్ముకున్నాడు. ఓటమిని ఆహ్వానించాడు. కష్టాలను ఆహ్వానించాడు కానీ తలొగ్గలేదు. అలాంటి విలువలు కలిగిన జగన్ మా నాయకుడు అయినందుకు గర్వపడుతున్నా. నా శ్వాస ఆగిపోయేంత వరకు జగన్ తోనే నా ప్రయాణం..2029 వస్తుందంటే మీ దడ పుడుతోంది..జనంలో జనం బలమెంతో మీకు తెలుసు. అందుకే మీరు గెలిచినా మీకు ఆదరణ లేదు.. జగన్ ఒడినా ఆదరణ ఉంది. జిల్లాల విభజనలో పరిపాలన సౌలభ్యం, ప్రజల అభిప్రాయం అవసరం. తమ ఓట్లకు, సీట్లకు అనుకూలంగా జిల్లాల విభజన చేయడం సరికాదు. ప్రభుత్వాలు మారగానే జిల్లాలు మారిస్తే ఇక హేతుబద్ధత ఎలా ఉంటుంది..?. మళ్ళీ జగన్ ప్రభుత్వం రాగానే అన్నమయ్య జిల్లా రాకుండా ఉంటుందా?. చివరికి అన్నమయ్య పేరుపై ఉన్న జిల్లాను కూడా ఇలా చేయడం సరికాదు’’ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హితవు పలికారు. -
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసానిస్తూ.. ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.వైఎస్ జగన్‌ను కడప నూతన మేయర్ పాకా సురేష్ కలిశారు. నూతన మేయర్‌ను వైఎస్ జగన్ అభినందించారు. వైఎస్ జగన్‌ను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా కలిశారు.కాగా, రేపు(బుధవారం, డిసెంబర్ 24) ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం(డిసెంబర్ 25) ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. -
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: రేపటి(డిసెంబర్ 23 మంగళవారం) నుంచి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. రేపు(మంగళవారం) పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు.ఎల్లుండి(బుధవారం) ఉదయం ఇడుపులపాయలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలకు హాజరుకానున్నారు. సాయంత్రం భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు. 25న ఉదయం 8.30 గంటలకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరు కానున్నారు.23.12.2025(మంగళవారం) షెడ్యూల్:సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.24.12.2025(బుధవారం) షెడ్యూల్:ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్ళి భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు25.12.2025(గురువారం) షెడ్యూల్:ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు, ఆ తర్వాత 10.30 గంటలకు పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. -
పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ తగిలింది. వేంపల్లి మండలం అమ్మగారిపల్లి గ్రామంలో టీడీపీ కండువాలు వేసేందుకు బీటెక్ రవి వెళ్లారు. ఆయన రాకతో గ్రామస్తులు.. తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లారు.పోలీసు ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో నుంచి గ్రామం మొత్తం వైఎస్ కుటుంబం వెంటనే నడుస్తున్నామన్న గ్రామస్తులు.. టీడీపీ ఊరిలో అడుగు పెట్టడంతోనే ఊరు వదిలి రావాల్సి వచ్చిందని గ్రామస్తులు చెప్పారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నాయకులు గ్రామంలోకి రావడంతో ఊరు మొత్తం ఖాళీ చేశారు. ఇళ్లకు తాళాలు వేసి వైఎస్సార్సీపీకి అమ్మగారిపల్లి గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. అమ్మగారిపల్లి గ్రామస్తులు ఇచ్చిన స్ఫూర్తి వైఎస్సార్సీపీకి వెయ్యి ఏనుగుల బలం.‘‘టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీనపడింది. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని వైఎస్ జగన్ కోరుకున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసుల ఒత్తిళ్లకు లొంగకుండా అమ్మగారిపల్లి గ్రామస్తులు తెగువ చూపించారు’’ అని సతీషరెడ్డి పేర్కొన్నారు. -
వికటించిన మధ్యాహ్న భోజనం
తొండూరు: మధ్యాహ్న భోజన పథకం అమలులో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరుకుంది. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక పాఠశాలలో దారుణ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం సంతకొవ్వూరు పంచాయతీ పరిధిలోని యాదవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 10మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇది రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఏపాటిదో స్పష్టం చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం పాఠశాలలో మెనూ ప్రకారం అన్నం, పప్పు, రసం అందించాల్సి ఉంది. అయితే అన్నం, వంకాయ కూర, సాంబారు, స్వీట్ పొంగలిని విద్యార్థులకు వడ్డించారు. వీటిని తిన్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు అయ్యాయి. పాఠశాలలో 10 మందికి ఒకేసారి వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల ఉపాధ్యాయిని భారతి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలియజేశారు. 24 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచాలన్న వైద్యులు వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు 108 వాహనంలో పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి 24 గంటలు ఆస్పత్రిలోనే అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వల్లే విరేచనాలు, వాంతులు అయ్యాయని తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న మండల విద్యాధికారి భారతి ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపడతామని, విద్యార్థుల ఆరోగ్యంపై పూర్తిస్థాయి పర్యవేక్షణ చేస్తామని చెప్పారు. పురుగుమందుల అవశేషాల వల్లే.. కూర కోసం తోటలోని వంకాయలు తెచ్చి కడగకుండా వండారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. విషపూరిత వంకాయలతో కూర వండటం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి విద్యార్థుల్ని పాఠశాలలకు పంపిస్తుంటే.. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను కనీసం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. తరచూ ఏదో ఒకమూల మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడం.. కొందరు మరణించడం చూస్తుంటే విద్యార్థుల పట్ల ప్రభుత్వ తీరు ఎలా ఉందో అవగతం అవుతోందని విద్యార్థి సంఘాల నేతలు దుయ్యబడుతున్నారు. ఉపాధ్యాయిని సస్పెన్షన్ ఈ ఘటనతో పాఠశాల ఉపాధ్యాయిని భారతిని సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా విద్యా శాఖ కార్యాలయం ప్రకటించింది. ఎంఈవో భారతికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. -
సీఐ, ఎస్ఐ ఓవరాక్షన్.. గోవింద మాల భక్తుడిపై దాడి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయిల్ సప్లయ్ కాంట్రాక్టర్ పట్ల సీఐ, ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారు. గోవింద మాల దీక్షలో ఉన్న భాస్కర్ రెడ్డిపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.ఆయిల్ సప్లయ్ కాంట్రాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం సమయంలో సిటీలోకి ఆయిల్ ట్యాంకర్ అనుమతి లేదని ట్యాంకర్ వెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు. రాత్రి ఎనిమిది గంటల తరువాత రావాలని డ్రైవర్‌కు పోలీసులు చెప్పారు. దీంతో, రాత్రే వస్తానని డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో ట్యాంకర్ డ్రైవర్.. యజమాని భాస్కర్ రెడ్డికి ఫోన్ చేసి ఎస్ఐతో మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆగ్రహించిన పోలీసులు.. డ్రైవర్‌ను కొట్టారు. ఈ నేపథ్యంలో గోవింద మాలలో ఉన్న ట్యాంకర్ యజమాని భాస్కర్ రెడ్డి హుటాహుటిన పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. డ్రైవర్‌ను కొట్టడంపై ప్రశ్నించారు.అనంతరం, రద్దీ సమయంలో కూడా ఆయిల్ సరఫరాకి నగరంలోకి వచ్చేందుకు అనుమతి ఉందని పోలీసులు పత్రాలను చూపించారు. దీంతో, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్టేషన్లో భాస్కర్ రెడ్డి పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. తన పట్ట దురుసుగా ప్రవర్తించారని, కొట్టారని ఆరోపించారు. ఈ సందర్బంగా భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ట్యాంకర్‌కు అనుమతి ఉన్నా చలాన్లు రాశారు. చలాన్లు కట్టేందుకు స్టేషన్‌కు వెళితే నన్నే తిట్టి.. మాలలో ఉన్న నాపై చేయి చేసుకున్నారు అని తెలిపారు. దీంతో, పోలీసుల తీరుకు నిరసనంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట భాస్కర్ రెడ్డి ధర్నాకు దిగారు. -
కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. లైంగికదాడి కేసులో నిందితుడికి యావజీవ కారాగారా శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధించింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రాంప్రసాద్ రెడ్డికి యావజ్జీవ జైలు శిక్ష విధిసూ.. పోక్సోకోర్టు మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తీర్పు చెప్పారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీసీ, రైల్వే సిబ్బందిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలికి రూ.10 లక్షల 50 వేలు పరిహారం అందించాలని గుంతకల్ ఆర్ఎంకు ఆదేశాలు జారీ చేసింది. 2019 జనవరి 19న తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. రాజంపేట-నందలూరు మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక వాష్ రూమ్ వెళ్ళినప్పుడు రాం ప్రసాద్‌రెడ్డి ఆమెపై లైంగికదాడి చేశాడు.హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గుంతకల్ ఆర్ఎం కార్యాలయం నుంచి కడపకు రిఫర్ చేశారు. కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే టీసీల నిర్లక్ష్యమే ఘటనకు కారణంగా భావించిన కోర్టు.. నిర్లక్ష్యానికి కారణమైన టీసీ, పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేజిస్ట్రేట్ వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
కూటమి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం: వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి సర్కార్ అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గూండాలు దౌర్జన్యం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై పులివెందులలో వైఎస్సార్సీపీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ నేత వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి పార్టీ నేతలు సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచ సంస్కృతి అంటూ ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తామన్నారు. వైఎస్సార్సీపీ విజయంతో కూటమి ప్రభుత్వానికి బుద్ధిరావాలని అవినాష్‌రెడ్డి అన్నారు. కమిటీల ఎంపిక విషయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో కష్టపడి, ఇష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన పార్టీ ఇన్ని సంవత్సరాలుగా గట్టిగా మనుగడ సాగించిందంటే అది దివంగత నేత వైఎస్సార్ ఆశీస్సులు, జగనన్న ప్రజాదరణ, ముఖ్యంగా కార్యకర్తల రెక్కల కష్టం’’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఏడాదికి 18 వేలు వంటి పథక పథకాలను అటకెక్కించారు. పులివెందులలో మెడికల్ కాలేజీ 50 సీట్లను వెనక్కు పంపిన నీచమైన ప్రభుత్వం ఇది. పులివెందుల ప్రాంతంలో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన అరటి కోల్డ్ స్టోరేజ్‌ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి టీడీపీ నాయకులకు లేదు. అందుకే ఆ పార్టీ నాయకులు క్రైంను నమ్ముకున్నారు...పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా టీడీపీ గుండాలు దౌర్జన్యాలు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు ఇతర నాయకులను దాడులు చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టే పరిస్థితి అందరూ చూశారు. అయినా కూడా పోలీసులు బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం నీచమైన సంస్కృతి. ఇలాంటి దారుణమైన పోలీసు వ్యవస్థను ఎప్పుడూ చూడలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ గుండాల దౌర్జన్యాలు, పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతాం’’ అని అవినాష్‌రెడ్డి చెప్పారు. -
వైఎస్సార్ కడప జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
సాక్షి కడప: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటన గురువారం ముగిసింది. పులివెందులలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఉదయం ఆయన బయలుదేరి వెళ్లారు. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ తొలిరోజు పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలు, పార్టీ నాయకులతో మమేకమయ్యారు.రెండో రోజు పులివెందుల పరి«ధిలోని బ్రాహ్మణపల్లె సమీపంలో అరటి తోటలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. పలువురు నేతలను పరామర్శించడంతోపాటు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మూడోరోజు కూడా ఇల్లు, కార్యాలయం వద్ద వేచి ఉన్న ప్రజలతో మమేకమయ్యారు. -
Ys Jagan: వెల్లువెత్తిన జనాభిమానం
సాక్షి కడప: కనుచూపు మేర కటౌట్లు.. బాణా సంచా వెలుగు జిలుగులు.. అడుగడుగునా పూల వర్షం.. బైకులకు పార్టీ జెండాలు.. జై జగన్ నినాదాలు.. వెరసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి, కోలుకున్న వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి (రాము)ని పరామర్శించడానికి బుధవారం వైఎస్ జగన్ వేల్పుల వెళుతుండగా అభిమానులు, ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.కాన్వాయ్ వెంట భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ వాహనం పైనుంచి.. నలువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తుండగా, వేల్పులలో అభిమానులు మిద్దెలపై నుంచి పూల వర్షం కురిపించారు. రోడ్డంతా పూలు పరిచి స్వాగతం పలికారు. మహిళలు కరచాలనం చేస్తూ వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు.వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసిన ఆనందంలో ... అనంతరం రామలింగారెడ్డి ఇంట్లోకి వెళ్లిన వైఎస్ జగన్.. ఆయనతో చర్చించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల ముందు జరిగిన గొడవ గురించి మాట్లాడారు. రామలింగారెడ్డి తల్లి పార్వతమ్మ.. ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లింగాల ఉషారాణిలతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత తిరిగి పులివెందులకు వచ్చే క్రమంలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున రోడ్డుకు ఇరువైపులా చేరుకుని అభివాదం చేశారు.విద్యార్థుల కోసం ఓ సెల్ఫీ పలు చోట్ల అభిమానుల తాకిడికి కాన్వాయ్ ఆపి.. వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో పది కిలోమీటర్ల దూరంలోని పులివెందులకు రావడానికి పది నిమిషాలకు బదులు ఒకటిన్నర గంటల సమయం పట్టింది. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ.. సెల్ఫీలు దిగుతూ మమేకమయ్యారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్ జగన్‌ను కలిశారు. చిన్నారికి సెల్ఫీ- పులివెందుల క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజలకు నమస్కరిస్తున్న వైఎస్ జగన్ వైఎస్ జగన్‌ను చూసి చిన్నారుల కేరింతలు వేల్పులలో భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ జగన్‌ను చూసిన ఆనందంలో విద్యార్థులు -
రైతుల పరిస్థితి అగమ్యగోచరం
ప్రజలకు, రైతులకు నష్టం జరుగుతోందంటే డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు అలవాటే. వెంటనే ఏకంగా 10 వేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడానంటాడు. అన్నీ చేసేస్తాం అంటాడు. కానీ, ఏదీ చేయడు. క్వింటా ఉల్లి రూ.1,200కు కొంటామన్నారు. ఆ తర్వాత ఉల్లి రైతులకు హెక్టార్‌కు రూ.50 వేలు ఇస్తా మన్నారు.అదీ లేదు. ఇదీ లేదు.. ఏదీ లేదు. వాటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టాపిక్ డైవర్షన్. ఏదో ఒక అంశం తెరపైకి తెస్తారు. దాన్ని ఎల్లో మీడియాలో ఊదరగొడతారు. అలా వాటి నుంచి అందరి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి రైతుల పరిస్థితి బస్టాండ్ అన్నట్లు తయారైంది. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి కడప: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, అరటి రైతుల పరిస్థితి దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి రైతులన్నా, వ్యవసాయ రంగం అన్నా ప్రేమ లేదని.. ఈ 18 నెలల్లో 16 విపత్తులు వచ్చినా కనీస సాయం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు బుధవారం ఆయన పులివెందుల సమీపంలోని బ్రాహ్మణపల్లి వద్ద అరటి తోటలను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి జరిగిన నష్టాన్ని ఆరా తీశారు. కిలో అరటికి చివరకు 50 పైసలు కూడా రాకపోవడంతో, తోటల్లో అలాగే వదిలేస్తున్నామని, పశువులకు వేస్తున్నామని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.ఇంత జరుగుతున్నా, ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోవడం లేదని వాపోయారు. రైతుల బాధలు ఓపికగా విన్న వైఎస్ జగన్.. ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల సమస్యల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇకనైనా సీఎం చంద్రబాబు మారకపోతే, రాబోయే రోజుల్లో అందరితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కరెంటు ఖర్చవుతుందని వినియోగంలోకి తీసుకు రారా? ⇒ఈ ప్రాంతంలో 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్‌ను 2024 మార్చిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించాను. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 18 నెలలైంది. కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని స్టోరేజ్‌ను నడపడం లేదు. ఇలా అయితే రైతులు ఎలా బతుకుతారు? చంద్రబాబు రైతులను ఏ విధంగా పట్టించుకుంటున్నాడో చెప్పేందుకు ఈ కోల్డ్ స్టోరేజీయే నిదర్శనం.వైఎస్సార్ కడప జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అరటి తోటలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ⇒చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులు, వ్యవసాయ రంగం పరిస్థితి తిరోగమనమే. ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టితో రైతులు చాలా నష్టపోయారు. వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా, వారికి చంద్రబాబు ఇచ్చింది గుండు సున్నా.⇒మొన్నటి మోంథా తుపాను నష్టాన్ని కూడా తక్కువ చేసి చూపుతున్నారు. దాదాపు రూ.1,100 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఎగరగొట్టిన పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొడుతూ, రైతుల హక్కు అయిన, ఉచిత పంటల బీమా ఇవ్వకుండా, వారి హక్కులు కాలరాశారు. ఈ–క్రాప్ కూడా చేయడం లేదు.⇒రైతు ఏ పరిస్థితుల్లోనూ కష్టపడకూడదు.. వారికి అగచాట్లు రాకూడదని తపన పడిన ప్రభుత్వం మాది. మా ప్రభుత్వ హయాంలో ఈ క్రాప్ చేసి 84 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా సదుపాయం కల్పించాం. ఆ విధంగా దాదాపు రూ.7,400 కోట్లు అందించాం. ఈ రోజు రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే, కేవలం 18 లక్షల మంది రైతులకు పంటల బీమా సదుపాయం ఉంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకునే నాథుడే లేడు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. హక్కు అయిన ఉచిత పంటల బీమా లేదు. చంద్రబాబు వచ్చాక, ఎరువులు సైతం బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి ఉంది. ⇒మరోవైపు పెట్టుబడి ఖర్చులు దారుణంగా పెరిగాయి. వారికి పెట్టుబడి సాయం కూడా అందడం లేదు. నాడు మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఏటా రూ.13,500 క్రమం తప్పకుండా ఇచ్చాం. ఏ ఏడాది కూడా ఎగ్గొట్టలేదు. ఈ పెద్దమనిషి చంద్రబాబు రైతు భరోసా ఎగ్గొట్టి, అన్నదాతా సుఖీభవ అన్నాడు. పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు ఇస్తానని చెప్పి, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టాడు. రెండేళ్లకు మొత్తం రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.10 వేలు ఇచ్చి, మిగిలింది ఎగ్గొట్టాడు.నాడు రూ.32 వేలు.. నేడు రూ.2 వేలుమా ప్రభుత్వ హయాంలో అరటి టన్ను సగటు ధర రూ.25 వేలు కాగా, గరిష్టంగా రూ.32 వేల వరకు పోయింది. అదే ఈ రోజు కనీసం రూ.2 వేలకు కూడా కొనడం లేదు. దీంతో పంట మొత్తం చెట్ల మీదే కుళ్లిపోతోంది. అంత దారుణంగా ఉంది పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో అరటి ఎగుమతి కోసం అనంతపురం నుంచి ఢిల్లీకి రైళ్లు నడిపాం. అరటితో పాటు, ఉద్యాన పంటలు కూడా వాటిలో ఎగుమతి చేశాం. చివరకు బనగానపల్లి నుంచి గువాహటి వరకు రైళ్లు నడిచాయి.ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు ⇒దళారీలతో చంద్రబాబు కుమ్మక్కై, రైతుల బతుకులు అగమ్య గోచరంగా మార్చాడు. అందుకే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గత ఏడాది ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా, కోకో, చీనీ, మామిడి.. ఇలా ఏ పంట తీసుకున్నా దేనికీ గిట్టుబాటు ధర రాలేదు. ఈ ఏడాది కూడా ధాన్యంతో సహా ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు.⇒గతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేసేవాళ్లం. ఆర్బీకేల్లో ఆ వివరాలు ప్రదర్శించే వాళ్లం. సీఎం–యాప్ ఉండేది. ఎక్కడైనా ధరలు తగ్గితే, వెంటనే జేసీ అప్రమత్తమై, జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసేవారు. అలా రూ.7,746 కోట్లతో పంటలు కొనుగోలు చేశాం. కోవిడ్ సమయంలో కూడా రైతులను ఆదుకున్నాం. అందుకే ఈ రోజు పరిస్థితిని గమనించమని కోరుతున్నాను. హామీలన్నీ గాలికి.. అంతటా దోపిడీ ⇒సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఇస్తానన్నాడు. అలా ఏటా రూ.18 వేలు. అలా వారికి రూ.36 వేలు బాకీ. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తానన్నాడు. అలా రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అమ్మ ఒడి రూ.15 వేలు అన్నాడు. రూ.2 వేలు కట్ చేశారు. రూ.13 వేలు కూడా ఇవ్వకుండా రూ.8 వేలు, రూ.9 వేలు మాత్రమే ఇచ్చారు. అందులోనూ 30 లక్షల మందికి కోత పెట్టారు. పెన్షన్లు కొత్తవి ఇవ్వకపోగా, ఐదు లక్షలు కట్ చేశారు. మా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తే, ఈ రోజు 61 లక్షల మందికే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఎవ్వరూ సంతోషంగా లేరనేందుకు ఈ లెక్కలే నిదర్శనం.⇒ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టారు. కొత్త మెడికల్ కాలేజీలను శనక్కాయలు, బెల్లానికి అమ్మేస్తున్నారు. ఇసుక, సిలికా, క్వార్ట్జ్.. దేన్నీ వదలకుండా అన్ని వనరులు, గనులను దోచేస్తున్నారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తూ అక్కడా యథేచ్ఛగా దోచుకుంటున్నారు.ప్రజలతో కలిసి మరింతగా ఉద్యమిస్తాం చంద్రబాబూ ఇప్పటికైనా మారండి. ఇలాగే ఉంటూ రైతులను పట్టించుకోకపోతే.. విద్యార్థులు, ప్రజలను ఇలాగే కష్టాలపాలు చేస్తామంటే వారితో కలిసి మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రాబోయే రోజుల్లో వీళ్లందరి తరఫున తీవ్రమైన ఉద్యమాలు ఖాయం. చంద్రబాబును గద్దె దింపే కాలం త్వరలోనే వస్తుంది. దేవుడు కూడా మొట్టికాయలు వేస్తాడు’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.అనంతరం ఒక రైతు మాట్లాడుతూ ‘అయ్యా.. చంద్రబాబు గారూ.. మీరు వ్యవసాయం దండగ అంటున్నారు కదా.. మీరు ఏం తిని బతుకుతున్నారు? ఇనుప ముక్కలు తిని బతుకుతున్నారా? రైతులు ఒక్కసారి పంటలు వేయకపోతే.. ప్రజలు ఏం తింటారు? వారికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది?’ అని సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.పిల్లలకూ తప్పని కష్టాలుఫీజు రీయింబర్స్మెంట్ కోసం పిల్లలతో కలిసి పోరాడుతున్నాం. డిసెంబర్ వస్తే 8 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుంటాయి. ఒక్కో క్వార్టర్‌కు దాదాపు రూ.700 కోట్లు. అంటే ఏకంగా రూ.5,600 కోట్లు బకాయిలు. ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. అంటే దాదాపు రూ.4,900 కోట్లు బకాయిలు. మరో రూ.2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు. ఏటా ఏప్రిల్‌లో రూ.1,100 కోట్ల చొప్పున ఇవ్వాలి. అదీ ఇవ్వడం లేదు. దీంతో రెండూ కలిపి రూ.6 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. చదువుకునే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి కూడా రాలేదునాకున్న ఆరు ఎకరాల భూమిలో దాదాపు రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టి అరటి పంటను సాగు చేశాను. ఎరువులు, మందులు వాడటంతో పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వచ్చింది. కాయ కూడా నాణ్యంగా ఉంది. అయితే మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో వ్యాపారులు తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేయడం లేదు. దీంతో తోటలోనే పండ్లు మాగి కింద పడిపోతున్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోయాను. పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అరటి రైతులను ఆదుకోవాలి.– శ్రీనివాసరెడ్డి, బ్రాహ్మణపల్లి, పులివెందులఅరటి పంటను అడిగే నాథుడే లేడు ఎంతో కష్టపడి వేలకు వేలు పెట్టుబడి పెట్టి అరటి పంట సాగు చేసి మంచి దిగుబడి వచ్చిందన్న సమయంలో కొనుగోలు చేసే నాథుడే లేడు. అరటి చెట్లకే పండ్లు మాగి కిందపడిపోతున్నాయి. గతంలో రూ.20 వేల నుంచి రూ.32 వేల వరకు టన్ను అరటి కాయల ధర పలికింది. ప్రస్తుతం టన్ను రూ.2 వేలకు అమ్ముదామన్నా కొనే వారు లేరు. ప్రభుత్వం రైతులను పట్టించుకొని అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తుందనుకుంటే రైతుల వైపు కన్నెత్తి కూడా చూడక పోవడం దారుణం.– రామతులశమ్మ, బ్రాహ్మణపల్లి, పులివెందులపంటను దున్నేయాల్సిన దుస్థితిచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. గతంలో అరటి పంటకు మంచి ధరలు ఉన్నాయని ఆశించి ఈ ఏడాది భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేశాం. తీరా పంట దిగుబడి వచ్చి మార్కెట్లో అమ్ముదామనుకున్న సమయంలో వ్యాపారులు, ప్రభుత్వం కూడబలుక్కున్నట్లు స్పందించడం లేదు. దీంతో అరటి కాయలు చెట్లకే మాగిపోతున్నాయి. అరటి పంటను ట్రాక్టర్లతో దున్నుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా అరటి రైతుల సమస్యలను గుర్తించి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి.– రామచంద్రారెడ్డి, బ్రాహ్మణపల్లి, పులివెందులఏ పంటకూ గిట్టుబాటు ధర లేదుఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేస్తే, తీరా పంట దిగుబడి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక తల్లిడిల్లిపోతున్నాం. నేను, నా స్నేహితుడు ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అరటి, టమాట పంటలను సాగు చేశాం. దాదాపు రూ.5 లక్షలు పెట్టుబడులు పెట్టాం. కనీసం ఒక్కరూపాయి కూడా మాకు డబ్బు రాలేదు. టమాట పంటను అమ్మడానికి మార్కెట్‌కు పోతే కొనేనాథుడు లేక మార్కెట్ వద్ద పారబోశాను. ఆటో బాడుగ కూడా చేతి నుంచి పడింది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి.– బాబురెడ్డి, ఇనగలూరు, తొండూరు మండలం -
వైఎస్ జగన్ వద్ద వైద్య విద్యార్థిని ఆవేదన
పులివెందుల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా పలువురు కలిసి తమ సమస్యలు, కష్టాలు చెప్పుకున్నారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము ఎలా నష్టపోయామన్నది వైద్య విద్యార్థిని, ఘామె తండ్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు.పులివెందులకు చెందిన నాగసుందర రెడ్డి తన కుమార్తె పూజితతో కలిసివచ్చి వెలమవారిపల్లె క్రాస్ వద్ద వైఎస్ జగన్‌ను కలిశారు. పూజితకు నీట్లో 467 మార్కులు వచ్చాయని, రెండు మూడు మార్కుల తేడాతో తన కుమార్తె మెడికల్ సీట్ కోల్పోయిందని పూజిత తండ్రి నాగసుందర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెలాగా అనేక మంది వైద్య విద్య కోసం కష్టపడి చదివినా మెడికల్ సీట్లు పొందలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు, పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన 50 సీట్లు కోల్పోయామని వైఎస్ జగన్ అన్నారు. ఈ రెండు మెడికల్ కాలేజీలకు మంజూరైన సీట్లు వచ్చి ఉంటే పూజితా లాంటి విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించి మంచి డాక్టర్లయ్యేవారన్నారు. కూటమి ప్రభుత్వం వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసిందని, తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేసి వైద్య విద్యను అందించే ప్రయత్నాన్ని కూటమి నాయకులు దూరం చేయడం దారుణమని వైఎస్ జగన్ మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వారికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.ఇదీ చదవండి: జగనన్న వస్తున్నాడంటే.. మీకు భయం! -
Watch Live: అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ
-
దయలేని ప్రభుత్వమిది
సాక్షి కడప: రాష్ట్రంలో పేద ప్రజలు, రైతులంటే దయలేని ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో వివిధ సమస్యలతో సతమతమవుతున్న వారికి మంగళవారం ఆయన ధైర్యం చెప్పారు. సాయంత్రం నాలుగు గంటలకు పట్టణంలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజలతో మమేకమయ్యారు. ఆయన్ను చూడగానే కార్యాలయ ఆవరణలోని అభిమానులు, ప్రజలు జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం అందరి బాధలు, కష్టాలు విన్నారు.పరిష్కార మార్గాలు సూచిస్తూ భరోసా కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగ క్షేమాలు తెలుసుకున్నారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చేయాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు.అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్.. అందరి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వరుస తుపాన్లు, వర్షాలతో తాము అల్లాడిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస సాయం అందడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తామంతా ధైర్యంగా బతికామని, కానీ ఇప్పుడు వ్యవసాయం అంటేనే అన్నదాతలు భయపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరటితోపాటు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని చెప్పారు. వీటిపై స్పందిస్తూ రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వంపై రైతుల తరుఫున పోరాడతామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.బాబు సర్కార్ తీరుతో సీటు కోల్పోయాతమ సమస్యను వైఎస్ జగన్‌కు వివరిస్తున్న జయప్రకాశ్, చరణ్ సాయి నీట్ యూజీలో తనకు 470 మార్కులు వచ్చాయని, అయితే 471 మార్కులు కటాఫ్‌గా రావడంతో సీటు రాలేదని, అదే పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభమై ఉంటే తనకు తప్పకుండా సీటు వచ్చేదని పులివెందులకు చెందిన జయప్రకాశ్ కుమారుడు చరణ్ సాయి వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మీ హయాంలో మీరు 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో ఏడు కళాశాలలు ప్రారంభమవ్వగా, మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పులివెందుల కాలేజీకి అయితే గత ఏడాది సీట్లు కూడా కేటాయించారు.చంద్రబాబు ప్రభుత్వం ఆ సీట్లు రద్దు చేయాలంటూ ఎన్ఎంసీకి ఏకంగా లేఖ రాసింది. అలా చేయకుండా ఉండివుంటే ఈ ఏడాది నాకు తప్పకుండా ఎంబీబీఎస్ సీటు వచ్చేది’ అని వాపోయాడు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ప్రస్తుత చంద్రబాబు సర్కార్ వైద్య విద్యార్థులకు అన్యాయం చేస్తోందన్నారు. పీపీపీ విధానంతో పేదలకు వైద్యాన్ని అందకుండా చేస్తోందని మండిపడ్డారు. మహోన్నత ఆశయంతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి, ఉన్నత వైద్యంతోపాటు మెడికల్ విద్యను అందించాలన్న తమ లక్ష్యాన్ని నీరుగారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.దివ్యాంగుడితో ఆప్యాయంగా వైఎస్ జగన్ ముస్లిం అక్కచెల్లెమ్మల సమస్యలను వింటున్న వైఎస్ జగన్ పులివెందుల క్యాంప్ కార్యాలయం వద్ద జగన్‌ను చూసేందుకు పరుగుపెడుతున్న ప్రజలు -
మాకు కాదు.. మీకు భయం..!
వైఎస్ జగన్.. జనం నుంచి వచ్చిన.. వారి కోసం పుట్టిన జననేత. జగన్ వెంట నడిచే జన ప్రభంజాన్ని చూస్తే ఈ విషయం తేటతెల్లం. కానీ ఇదే జనసంద్రం కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది! చంద్రబాబుకు గుటకలు.. లోకేష్‌కు గుబులు.. పవన్ కళ్యాణ్‌కు నేల చూపులు మిగులుస్తాయి.అధికారంలో ఉన్నా తమ వెంట జనం నిలవడం లేదన్న వాస్తవం కూటమి నేతల్లో భయం పుట్టిస్తోంది. ఈ అక్కసునే వారు జగన్ పర్యటనపై ఆంక్షలు, ప్రతిబంధకాల రూపంలో తీర్చుకుంటున్నారు. అయితే కూటమి పప్పులు ఎన్నడూ ఉడికింది లేదు. గోడకేసి కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కు వస్తుందో.. జగన్ పర్యటనలకు ఆంక్షలు ఎక్కువైన కొద్దీ జన ప్రవాహం అంతకంత పెరిగింది. (YS Jagan Following In Public) )జగన్ వెంట ఎంతమంది నడవాలో కూడా వారే నిర్ణయిస్తారు.అంతే ఆంక్షలు అమల్లో పెడతారు. పోలీసుల్ని ఉపయోగించుకుంటూ ఫ్లెక్సీల ద్వారా కూడా .జగన్ పర్యటనలకు జనం వెళ్లకండనే ప్రచారం చేయిస్తారు స్థానిక నాయకులు. మరి ఇవన్నీ తమ జననేతను చూడటానికి వచ్చే ప్రజలకు తెలియవు. అభిమాన నాయకుడు వస్తున్నాడంటే జనహోరు హుషారెత్తుంది. జగన్ అంటే మీకు భయం.. మాకు కాదు అని ఎలుగెత్తుతుంది జగన్ పర్యటన ఉన్న ప్రాంతం. కూటమి నాయకులకు ఇవన్నీ స్వీయ అనుభవాలే. వైఎస్ జగన్ తాజా పులివెందుల నియోజక వర్గం పర్యటన కూడా కూటమి నేతల్లో టెన్షన్ పెంచేసే ఉంటుంది.జగన్ పర్యటనలపై కూటమి నేతల భయాన్ని అభిమానుల మాటల్లో చెప్పాలంటే....జగన్ వస్తున్నాడంటే మీకు భయం.. రోడ్లన్నీ జన నంద్రం అయిపోతాయనిజగన్ వస్తున్నాడంటే మీకు భయం .. ఊరూ-వాడా, మిద్దె-మేడా అంతా ఏకమవుతాయని...జగన్ వస్తున్నాడంటే మీకు భయం.. సందు-గొందు కిక్కిరిసిపోతాయని...జగన్ వస్తున్నాడంటే మీకు భయం... రహదారులన్నీ జై జగన్ నినాదాలతో హోరెత్తిపోతాయనిజగన్ వస్తున్నాడంటే మీకు భయం.. మీ మాట వినేవారు ఒక్కరూ మిగలరనిజగన్ వస్తున్నాడంటే మీకు భయం.. సామాన్యుడికి కొండంత భరోసా దక్కుతుందని, ఆప్యాయమైన పలకరింపులు దొరుకుతాయని!జగన్ వస్తున్నాడంటే మీకు భయం.. ఏ ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తాడోనని!-మణిశ్రీ -
నేడు పులివెందులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నుంచి 3 రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం సోమవారం ప్రకటించింది.పర్యటన షెడ్యూల్.. మంగళవారం సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందులలోని వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం బ్రాహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడుతారు.ఆ తర్వాత పులివెందుల చేరుకుని లింగాల మాజీ సర్పంచ్ మహేష్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి వేల్పులలోని లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళ్తారు. అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్‌లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలోనే బస చేస్తారు. గురువారం ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి వైఎస్ జగన్ తిరుగు పయనమవుతారు. -
కడపలో విషాదం.. పెన్నా నదిలో ఇద్దరు యువకుల గల్లంతు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో విషాదం చోటు చేసుకుంది. నగర శివారులోని వాటర్ గండి పెన్నా నది ప్రవాహంలో ఇద్దరు గల్లంతయ్యారు. కడపకు చెందిన ఐదుగురు స్నేహితులు సరదాగా ఈతకొట్టేందుకు నదిలో దిగారు. ముగ్గురు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. తోటి స్నేహితులు.. ఒకరిని కాపాడారు. మరో ఇద్దరు రోహిత్ కుమార్, నరేష్ గల్లంతయ్యారు. చిన్నచౌక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది.కోనసీమ జిల్లా: మలికిపురం మండలం చింతలమోరి బీచ్‌లో విషాదం జరిగింది. సముద్రంలో స్నానానికి దిగి బాలుడు గల్లంతయ్యాడు. నలుగురు స్నేహితులు కలిసి స్నానానికి దిగగా ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన బాలుడిది సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంగా స్థానికులు గుర్తించారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబీకులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. -
భారతి సిమెంట్స్‌పై బాబు సర్కారు కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: భారతి సిమెంట్స్ కంపెనీపై సీఎం చంద్రబాబు కక్ష సాధింపునకు దిగడంపై పారిశ్రామిక వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలపై ఇష్టానుసారం తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్న బాబు ప్రభుత్వం.. మరో అడుగు ముందుకు వేసి భారతి సిమెంట్ కంపెనీ లీజులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వాటి రద్దుకు సన్నాహాలు చేస్తోంది.లీజులు రద్దు చేస్తున్నారంటూ తన కరపత్రిక ఈనాడుకు లీకులు ఇచ్చి కథనాలు రాయిస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలంలో భారతి సిమెంట్స్ కంపెనీకి 509.18 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలంలో 235.56 ఎకరాలు గతంలోనే లీజులు మంజూరయ్యాయి. తప్పుడు ఆరోపణలతో ఈ లీజులను రద్దు చేసి, దెబ్బ కొట్టాలని చంద్రబాబు కుట్ర పన్నారు. ఇందుకోసం అధికారంలోకి రాగానే 15 ఏళ్లకుపైగా సుదీర్ఘ చట్టపరమైన, పరిపాలనా ప్రక్రియలు పూర్తయిన తర్వాత పొందిన లీజులపై ఎటువంటి కారణం లేకుండానే విచారణకు ఆదేశించారు.ఆ నివేదికను తనకు కావాల్సిన విధంగా తయారు చేయించుకుని, తద్వారా భారతి సిమెంట్స్ కంపెనీకి త్వరలో నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు టీడీపీ కరపత్రికలో శనివారం కథనం రాయించారు. నోటీసులకు కంపెనీ వివరణ ఇచ్చిన తర్వాత.. ఆ వివరణ ఎలా ఉన్నప్పటికీ, సున్నపురాయి లీజులు రద్దు చేస్తారంటూ సదరు పత్రికకు లీకులిచ్చారు. వివరణతో సంబంధం లేకుండా లీజులు రద్దు చేస్తారని చెప్పడం ద్వారా చంద్రబాబు వాటి రద్దుకు కంకణం కట్టుకున్నారని స్పష్టమవుతోంది. అది 20 ఏళ్ల క్రితం కొన్న ప్రైవేటు భూమి నిజానికి సున్నపురాయి లీజులు ఉన్న ఆ భూమిని 20 ఏళ్ల క్రితం ఆ కంపెనీ కొనుగోలు చేసింది. ఇప్పుడు లీజులు రద్దు చేస్తే, ఆ భూమి కంపెనీది కాకుండా పోతుందా? అని నిపుణులు ప్రశి్నస్తున్నారు. పరిశ్రమలు వస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, కానీ ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తే పరిశ్రమలు ఎలా వస్తాయని పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.వ్యూహాత్మకంగా భారతి సిమెంట్స్ లీజు మాత్రమే కాకుండా రామ్‌కో, ఏసీసీకి లీజులను కూడా రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని ప్రచారం చేసుకుంటూ మరోవైపు ఉన్న పరిశ్రమలపై రాజకీయ కక్ష సాధింపులకు దిగడం చంద్రబాబుకే చెల్లిందని, ఇలాగైతే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
స్కూల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
చింతకొమ్మదిన్నె: వైఎస్సార్ జిల్లా కడప శివారులోని చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు రింగురోడ్డు సర్కిల్ వద్ద ఉన్న ఓ ప్రయివేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కె.జస్వంతి (14) సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండూరు మండలం పాలూరు గ్రామానికి చెందిన కె.రవిశంకరరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల పెద్దకుమార్తె జస్వంతి ఓ ప్రయివేట్ స్కూల్ హాస్టల్లో ఉంటోంది. ఉదయం 6.40 గంటల సమయంలో జస్వంతి తాను ఉంటున్న గదికి గడియ వేసుకుంది.అదే గదిలో ఉంటున్న మరో విద్యార్థిని పాలు తాగేందుకు మెస్ వద్దకు వెళ్లి 6.55 గంటల సమయంలో రూం వద్దకు వచ్చి కిటికీలోంచి చూడగా చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది గది తలుపుల్ని పగులగొట్టి లోనికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న జస్వంతిని కడప నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. దీంతో రిమ్స్ ఆస్పత్రికి విద్యార్థిని మృతదేహాన్ని తరలించారు. యాజమాన్యం తీరుపై మండిపడ్డ డీఈవో విద్యార్థిని జస్వంతి మృతి చెందిన విషయం తెలిసి విచారణ నిమిత్తం జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ పాఠశాలకు రాగా.. సిబ్బంది పాఠశాల తాళాలు తెరవలేదు. అరగంటకు పైగా వేచి డీఈవో వేచి ఉండాల్సిన పరిస్థితి కల్పించారు. దీంతో ఆయన పాఠశాల ప్రిన్సిపాల్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం డీఈఓ వచ్చినా స్పందించరా, మీ తీరు ఏమిటో దీనిని బట్టి అర్థమవుతోంది అని మండిపడ్డారు. డీఈవో వెంట మండల విద్యాధికారులు సుబ్బరాయుడు, రమాదేవి ఉన్నారు.ఏం జరిగిందో చెప్పని పాఠశాల యాజమాన్యం ఉదయం 7.55 గంటల సమయంలో విద్యార్థిని కళ్లు తిరిగి కిందపడిపోయినట్టు ఆమె తండ్రి రవిశంకర్‌రెడ్డికి స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్‌చేసి చెప్పారు. బాలిక తల్లిదండ్రులు రిమ్స్ మార్చురీ వద్దకు చేరుకోగా.. బిడ్డ మృతి చెందిందని చెప్పడంతో తీవ్రంగా రోదించారు. సుమారు రెండు గంటలు పైగా మార్చురీ వద్ద వేచి ఉన్నప్పటికీ పాఠశాల యాజమాన్యం బిడ్డ ఎలా మృతి చెందిందనే విషయం చెప్పలేదని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన చెందారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా నినాదాలు చేస్తూ బాలిక మృతదేహంతో పాఠశాలకు వచ్చే ప్రయత్నం చేశారు.పోలీసులు వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ వద్దకు చేరుకుని వాహనాలను రహదారికి అడ్డుగా ఉంచి అడ్డుకున్నారు. దీంతో బాలిక బంధువులు, పోలీసుల మధ్య దాదాపు గంటసేపు వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. చివరకు పోలీసులు పోస్టుమార్టం జరిగితేనే వాస్తవాలు తెలుస్తాయని విద్యార్థిని బంధువులకు నచ్చజెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
శ్రీచైతన్య స్కూల్.. 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి,వైఎస్సార్: కడప చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్ గదిలో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, తల్లిదండ్రులు మాత్రం.. తమ బిడ్డ మరణానికి స్కూల్ యాజమాన్యమే కారణమంటూ అందోళన చేపట్టారు. మార్చురీలో ఉన్న బాలిక మృతదేహాన్ని స్కూల్ వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులు, బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాధితులు రోడ్డుపైనే ధర్నా చేపట్టారు.మరోవైపు విద్యార్థిని మృతిపై విచారణ చేసేందుకు వెళ్లిన డీఈవో వెళ్లారు. డీఈవో వెళ్లినా యాజమాన్యం స్కూల్ గేట్ తాళం తీయలేదు. దాదాపు అరగంట సేపు స్కూల్ గేటు వద్ద డీఈవో వేచి ఉన్నారు. అయినప్పటికీ స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడంపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సజ్జల
సాక్షి, తిరుపతి: ‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తకాన్ని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ఆవిష్కరించారు. పద్మావతి పురంలోని పార్టీ కార్యాలయంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్.కే.రోజా, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యము, రాయలసీమ మేధావులు ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాటల్లో చెప్తే.. చేతల్లో చూపించిన నాయకుడు వైఎస్సార్. ‘వైఎస్సార్ బాటలో జగన్ నడుస్తున్నారు. రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి నాడు-నేడుతో వైఎస్ జగన్.. స్కూళ్ల రూపురేఖలు మర్చారు. వైఎస్ జగన్ ఒక సంఘ సంస్కర్తగా అడుగులేశారు. ఇమామ్ ఆశీస్సులు వైఎస్ జగన్‌కు ఉండాలి..ఇమామ్ 77 ఏళ్ల వయసులో నవ యువకుడిగా ఉత్సాహంగా కొత్త ఆలోచనతో ఉన్నారు. ఏ కల్మషం లేని వ్యక్తి ఇమామ్.. ఆయన దారిలో పయనించాలి. రాయలసీమ స్ఫూర్తి, కమ్యూనిస్ట్ భావజాలంతో ముందుకు నడిచారు.’’ అని సజ్జల పేర్కొన్నారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్లలో వైఎస్ జగన్ ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ద్వారా మొదటి బ్యాచ్ పూర్తి అయ్యేది. ఏ సీఎం కూడా చేయని విధంగా దేశంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చింది ఒక్క వైఎస్ జగన్ మాత్రమే. ప్రజలకు గుర్తుండి పోయేలా వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలు చేశారు.ఆర్కే రోజా మాట్లాడుతూ.. ఇమామ్ కదలిక ద్వారా ఎన్నో సమాజంలో ఎన్నో సంస్కరణలకు కారణం అయ్యారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఇమామ్ పనిచేశారు.. కృషి చేశారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. ఇమామ్‌తో సుదీర్ఘ పరిచయం.. 21 నెలలు జైల్లో గడిపిన క్షణాలు గుర్తున్నాయి. రాజకీయం అంటే ఇతరులతో సంఘర్షణ కాదు.. ఆత్మీయతో మెలగటం -
లింగాల పీఎస్ ముందు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నా
సాక్షి, వైఎస్సార్ జిల్లా: లింగాల పోలీస్ స్టేషన్ ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నాకు దిగారు. వారం రోజులుగా రైతుల మోటార్ల వైర్లు అపహరణకు గురవుతున్నాయి. గత రాత్రి 25 మంది రైతుల కేబుల్ వైర్లు చోరీ అయ్యాయి. రైతులకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు రైతులతో కలిసి వైఎస్ అవినాష్‌రెడ్డి ఆందోళన చేపట్టారు.రైతులకు లక్షలాది రూపాయల నష్టం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే నిందితులను పట్టుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ అవినాష్‌రెడ్డి ధర్నాకు దిగారు. -
అమీన్ పీర్ దర్గా ఉత్సవాలు.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు అహ్వానం అందింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందజేశారు.నవంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉత్సవాలకు హజరుకావాలని వైఎస్ జగన్‌ను కోరారు. వైఎస్ జగన్‌ను కలిసిన కడప మాజీ మేయర్ సురేష్ బాబు, అమీన్ పీర్ దర్గా చీఫ్ ముజావర్ అమీరుద్దిన్, మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు. -
ఒంటరితనం భరించలేక.. యువతి ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : తల్లిదండ్రులిద్దరూ చిన్న తనంలోనే చనిపోయారు. ఊహ తెలిసిన నాటి నుంచి తోడుగా ఉంటున్న అక్క పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. ఒంటరి తనంతో మానసికంగా కుంగిపోయిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రొద్దుటూరులోని ఈశ్వర్‌రెడ్డినగర్‌లో చోటుచేసుకుంది. పల్లా మహేశ్వరి (26) అనే యువతి శుక్రవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈశ్వరరెడ్డినగర్కు చెందిన పల్లా కవిత, మహేశ్వరిలు అక్కా చెళ్లెల్లు. వీరి చిన్న తనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో మృతి చెందగా భర్త మరణాన్ని జీరి్ణంచుకోలేక తల్లి లక్ష్మీదేవి కూడా కొన్ని రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లను వారి తాత అయిన బడిగించల రామయ్య పెంచి పెద్ద చేశారు. మహేశ్వరి ఎంఎస్సీ వరకు చదువుకొని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో కవితకు మూడు నెలల క్రితం వివాహం అయింది. ఆమె పెళ్లి చేసుకొని వెళ్లినప్పటి నుంచి మహేశ్వరి, ఆమె తాత రామయ్యలు ఉంటున్నారు. రామయ్య వృద్ధాప్యం కారణంగా ఇంటి వద్దనే ఉండేవాడు. అతని బాగోగులన్నీ చిన్న మనవరాలే చూసు కునేది. చిన్నతనం నుంచి తోడుగా ఉన్న అక్క పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లడంతో ఒంటరిని అయ్యాననే భావన మహేశ్వరిని తరచూ వేధిస్తుండేది.దీపావళికి చెల్లెలు వద్దకు వచ్చిన అక్క..చెల్లెలితో కలిసి దీపావళి పండుగ చేసుకోవడానికి కొత్త దంపతులిద్దరూ వారం రోజుల క్రితం ప్రొద్దుటూరులోని మహేశ్వరి ఇంటికి వచ్చారు. అక్క కవితతో కలిసి చెల్లెలు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కవిత తన భర్తతో కలిసి పట్టణలోని గుడికి వెళ్లింది. ఆమె కొద్ది సేపటి తర్వాత ఇంటికి రాగా చెల్లెలు ఇంట్లో లేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతోంది కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. చుట్టు పక్కల చూసినా ఆమె కనిపించలేదు. దీంతో మేడపైన ఉన్న రేకుల ఇంట్లోకి వెళ్లి చూడగా మహేశ్వరి తాడుతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కిందికి దింపి చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యుడు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క తోడబుట్టిన చెల్లెలు దూరం కావడంతో ఆమె మృతదేహంపై పడి అక్క బోరున విలపించసాగింది. మృతురాలి అక్క కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. -
పులివెందులలో ఈసీ గంగిరెడ్డి వర్ధంతి కార్యక్రమం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో ఈసీ గంగిరెడ్డి 5వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసీ గంగిరెడ్డి ఘాట్ వద్ద ఆయన కుమార్తె వైఎస్ భారతిరెడ్డి, సతీమణి సుగుణమ్మ, కుమారుడు ఈసీ దినేష్ రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈసీ గంగిరెడ్డి వర్ధంతి సందర్భంగా భాకరాపురంలోని దినేష్ నర్సింగ్ హోమ్‌లో ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.పేదల డాక్టర్.. ఈసీ గంగిరెడ్డిదివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పేదల డాక్టర్‌గా పులివెందుల ప్రాంతంలో గుర్తింపు పొందారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా ఇట్టే నయమవుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిన్నపిల్లల డాక్టర్‌గా ప్రాచుర్యం పొందారు. 1949 ఏప్రిల్ 20వ తేదీన ఈసీ సిద్ధారెడ్డి, తులశమ్మ దంపతులకు రెండవ సంతానంగా వేముల మండలంలోని గొల్లలగూడూరులో ఆయన జన్మించారు. తన విద్యాభ్యాసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గొల్లలగూడూరు ఆర్సీఎం స్కూలు, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పులివెందులలోని జెడ్పీ హైస్కూలులోనూ, 9వ తరగతి నుంచి 11వ తరగతి వరకు వేముల జెడ్పీ హైస్కూలులోనూ, అనంతరం వైద్య విద్యను వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో పూర్తి చేశారు.అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. తర్వాత పులివెందులలోని శ్రీనివాసహాలు వీధిలో తన సతీమణి డాక్టర్ ఈసీ సుగుణమ్మతో కలిసి గంగిరెడ్డి ఆసుపత్రి స్థాపించి దంపతులిద్దరూ వైద్య సేవలు అందించేవారు. వైద్యం చేయడమే ప్రధాన ఆశయంగా ప్రతిఫలం ఆశించని డాక్టర్‌గా ఇక్కడ గుర్తింపు పొందారు.ఎలాంటి రోగమైనా ఆయన దగ్గరకు వెళ్లి ఆయన చేయి పడితే నయమవుతుందని పులివెందుల ప్రాంత ప్రజల నమ్మకం. పులివెందుల ప్రాంత ప్రజలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పొరుగు జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా ఆయన వద్దకు వచ్చి రోగులు వైద్య సేవలు పొందేవారు. వైద్య సేవలలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన భాకరాపురంలో అత్యాధునిక వైద్య పరికరాలతో తన కుమారుడి పేరిట దినేష్ నర్సింగ్ హోం (ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి) స్థాపించి వైద్య సేవలు అందించేవారు. ఈసీ గంగిరెడ్డి కుమారుడు ఈసీ దినేష్‌రెడ్డి కూడా వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. ఈసీ గంగిరెడ్డి తన దగ్గరకు వచ్చే రోగులపట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతలను కనబరిచేవారు. -
పచ్చ కుట్రలు.. కడపలో ఆగని అక్రమ అరెస్టులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు.. అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రోద్బలంతో వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో మాధవిరెడ్డిపై టీడీపీ సీనియర్ మహిళలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదే వీడియో ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతోంది.అయితే, అంజాద్ బాషా పీఏ ఖాజా వైరల్ చేశాడంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఖాజాను అరెస్ట్ చేసిన పోలీసులు తెల్లవారుజామున కడపకు తీసుకొచ్చారు. కడప శివారులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో ఉంచారు. -
‘మాధవీ రెడ్డి.. మీ అవినీతి గురించే టీడీపీలో చర్చ నడుస్తోంది’
సాక్షి, వైఎస్సార్: టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డిపై మేయర్ సురేష్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి పాలనలో ఒక్క పనైనా చేశారా?.. అభివృద్ధి గురించి వారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలే వారిని చూసి అసహ్యించుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.కడపలో మేయర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ నాయకుడు శ్రీనివాసులు రెడ్డి అవినీతి భాగవతం గురించి టీడీపీ వారే చర్చించుకుంటున్నారు. బుగ్గవంక పనుల్లో నువ్వెంత దోచుకున్నావో తెలుసు. 30లక్షల పనికి మూడు కోట్లు ఖర్చు చేసి దోచుకున్న మాట వాస్తవమా కాదా?. మీ కార్యకర్తలే నీ అవినీతి బాగోతం గురించి చర్చించుకుంటున్నారు అయినా సిగ్గు లేదా!. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మాధవీ రెడ్డి కడపకు ఎంత మేర నిధులు తెచ్చారో చెప్పే దమ్ము, దైర్యం ఉందా?. మా నిధులతో టెంకాయలు కొట్టడానికి సిగ్గుగా అనిపించడం లేదా?. వేల కోట్లతో అభివృద్ధి చేసిన చరిత్ర వైఎస్సార్సీపీది. అవినీతి చేసే మీరా మమ్మల్ని విమర్శించేది. కాలర్ ఎగరేసుకొని ఓట్లు అడగడానికి ప్రజల్లోకి వెళ్తాం.ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ ఇచ్చి గౌరవిస్తే ఆమె నియంతలా వ్యవహరించారు. సర్వసభ్య సమావేశంలోనే సాటి మహిళను ఆమె అవమానించారు. కుర్చీ కోసమే ప్రాకులాడుతున్నానని మాట్లాడటానికి సిగ్గు పడాలి. కుర్చీ కోసం ప్రాకులాడేది ఎవరో ప్రజలకు తెలుసు. అభివృద్ధి కోసం కాదు కుర్చీ కోసమే ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఆరాటం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన అజెండాను చించి వేశారు మాధవీ రెడ్డి. ప్రజా సమస్యలపై తీర్మానం చేస్తే కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యే మాధవీ రెడ్డి అభివృద్ధి నిరోధకులు కాదా?. 15వ ఫైనాన్స్ నిధులు కూడా రాకుండా చేసింది మీరు కాదా?. అవినీతి జరిగింది అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అలా నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా?’ అని ప్రశ్నించారు. -
మరోసారి బయటపడ్డ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దౌర్జన్యం
సాక్షి, వైఎస్సార్‌జిల్లా: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి(Adinarayana Reddy) దౌర్జన్యం మరోసారి బయటపడింది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్(CM Ramesh)కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ ఆఫీసుపై ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడి చేశారు. కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఎంపీ సీఎం రమేష్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇద్దరి మధ్య వివాదం కారణంగా గండికోట(Gandikota) అభివృద్ధి ఆగిపోతుంది. గండికోటలో ఎంపీ సీఎం రమేష్‌కు వచ్చిన రూ.77 కోట్ల పనులను గతంలో ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. గతంలో అదానీ హైడ్రో పవర్ ప్లాంట్‌లో సీఎం రమేష్ చేస్తున్న పనులనూ ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. అప్పట్లో అదానీ కార్యాలయంపై కూడా దాడి చేశారు.గత ఏప్రిల్ నెలలో చిలంకూరులోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో కార్యకలాపాలను ఆదినారాయణరెడ్డి వర్గం నాలుగైదు రోజులు అడ్డుకోవడంతో ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ల మధ్య పొసగడం లేదన్న సంగతి పలుసార్లు బహిర్గతమైంది. ఆదినారాయణరెడ్డి బంధువు పేకాట శిబిరాలు నడుపుతున్నాడంటూ సీఎం రమేష్.. గతంలో కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు.ఇదీ చదవండి: అప్పులపై బాబు, పవన్ డ్రామా బట్టబయలు -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై పచ్చ మూకల దాడి
వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని చక్రాయపేట మండలంలో పచ్చ మూకలు బీభత్సం సృష్టించారు. చిలేకాంపల్లె నారపురెడ్డి వారి పల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఆదినారాయణ రెడ్డిపై పచ్చమూకలు దాడికి పాల్పడ్డారు. టీడీపీకి చెందిన పలువురు అల్లరి మూకలతో కలిసి కాపుకాచి ఆదినారాయణరెడ్డిపై దాడి చేశారు. ఆదినారాయణ రెడ్డిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలు పాలైన ఆదినారాయణ రెడ్డి వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై టీడీపీకి చెందిన పలువురు అడ్డగించి మరీ దాడి చేవారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
పులివెందుల మెడికల్ కాలేజీని సందర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మెడికల్ కళాశాలను వైఎస్సార్సీపీ నేతలు ఇవాళ (సోమవారం) సందర్శించారు. మెడికల్ కళాశాల భవనాలను, ఆసుపత్రి భవనాలను, నర్సింగ్ కాలేజీ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 90 శాతం మెడికల్ కళాశాల పనులు పూర్తయ్యాయన్నారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రూ.532 కోట్ల ప్రాజెక్టుతో మెడికల్ కళాశాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో కేవలం దాదాపు రూ.120 కోట్ల రూపాయలు పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని.. ఆ పనులు ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు.టీడీపీ నాయకులు మెడికల్ కళాశాలను సందర్శించి ఫేస్ 3,4 నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ఫోటోలు దిగి మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని ఆవాస్తవాలు మాట్లాడడం సిగ్గుచేటు అని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్వయంగా పరిశీలించి 50 సీట్లకు పులివెందుల మెడికల్ కళాశాలకు అనుమతి ఇచ్చిందని.. అధికారంలో ఉన్న చేతకాని ప్రభుత్వం మెడికల్ సీట్లను వెనక్కి పంపిందన్నారు. కేవలం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం ఇలాంటి నీచ పనులు చేసిందని వైఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజాద్ భాష, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కష్టాలు వింటూ.. భరోసానిస్తూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. రెండో రోజు కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసానిస్తూ ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.ఆపన్నులకు అండగావివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు.ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైఎస్ జగన్.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. -
అంబకపల్లె చెరువుకు చేరిన కృష్ణమ్మ.. వైఎస్ జగన్ జలహారతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అంబకపల్లె చెరువు దగ్గర వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జలహారతి ఇచ్చారు. అంబకపల్లెకు కృష్ణా జలాలు వచ్చి చేరాయి. పాడా నిధుల ద్వారా అంబకపల్లె గంగమ్మ కుంటకు రూ.1.4 కోట్లతో 14 ఎకరాల భూసేకరణ చేపట్టి కొత్త చెరువును నిర్మించారు.ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎంపీ నిధులతో రూ.2.50 కోట్లు వెచ్చించి హిరోజ్‌పురం గ్రామం వద్ద భారీ సంప్‌ను ఏర్పాటు చేసి 4.5 కి.మీ మేర అంబకపల్లె చెరువుకు పైపులైన్ ఏర్పాటు చేశారు. ఫలితంగా అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరింది. దీంతో ఈ ప్రాంత వాసులంతా సంతోషం వ్యక్తం చేశారు. -
ఆ ధైర్యం టీడీపీకి లేదు: వైఎస్ జగన్
పులివెందుల: వైఎస్సార్ జిల్లాలోని నల్లపురెడ్డిపల్లెలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాన్ని నల్లపురెడ్డి గ్రామస్తులు.. వైఎస్ జగన్‌కు వివరించారు. ఓటర్ల స్వేచ్ఛను హరించిన చంద్రబాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఓటర్లపై కూటమి ప్రభుత్వం కుట్రలు అంటూ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వైఎస్ జగన్ స్పందించారు. ‘ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపే ధైర్యం టీడీపీకి లేదు. ప్రజలకు ఓట్లు వేసే అవకాశం కూడా ఇవ్వలేదు. పోలీసులను అడ్డంపెట్టుకుని దౌర్జన్యం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేశారు’ అని మండిపడ్డారు. ఇదీ చదవండి: చంద్రబాబు వ్యాపారాల కోసం రైతులతో ఆడుకుంటారా:: వైఎస్ జగన్ -
విద్యార్థులా?.. కూలీలా?
సాక్షి, మైదకూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో తరగతి గదిలో కూర్చోవాల్సిన విద్యార్థులు.. రాళ్లు, మట్టి ఎత్తుతున్నారు. విద్యా బుద్దులు చెప్పాల్సిన టీచర్లే వారితో పనులు చేయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మైదుకూరు మండలం జీవిసత్రం సమీపంలోని నంద్యాలపేట జడ్పీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.జడ్పీ పాఠశాలలో కొత్త బిల్డింగ్ పనుల సందర్భంగా విద్యార్థులతో రాళ్లు, మట్టి ఎత్తిస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు పనిచేస్తున్నారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై విద్యార్థులు పేరెంట్స్, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి అధికారులు, ఐసీడీఎస్, కార్మిక శాఖ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.This is totally unacceptable @ncbn garu.How can your govt allow such abuse of children studying in govt school?Is this how you expect the children to grow under your stewardship @naralokesh?Shameful to even say this. https://t.co/dJk7TmXslT— PVS Sarma - పి వి ఎస్ శర్మ - પી વી એસ શર્મા (@pvssarma) August 27, 2025 -
వైఎస్సార్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన తీరును ప్రశ్నిస్తూ పలువురు ఓటర్లు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో తమకు ఓటు వేయనివ్వలేదని, టీడీపీ గూండాలు బూత్‌లను ఆక్రమించారంటూ అచ్చవెల్లి,ఎర్రబల్లి గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.ఆ ఫిర్యాదులో తమ ఓటు హక్కును వేరే వారు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. దీంతో ఓటర్లు ఇచ్చిన ఫిర్యాదును జాతీయ ఎస్సీ కమిషన్ స్వీకరించింది. ఇదే అంశంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు నోటీసులు పంపింది. తాము ఈ అంశాన్ని విచారించబోతున్నామని స్పష్టం చేసిన జాతీయ ఎస్సీ కమిషన్.. 15 రోజుల్లోగా ఏం చర్యలు తీసుకున్నారో తమకు నివేదిక పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించింది. -
టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి కొత్త రూల్.. ఎస్పీకి వార్నింగ్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లా ఎస్పీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వినాయక చవితి వేడుకల్లో డీజేలకు అనుమతి తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేయగా.. డీజేలకు అనుమతి కోరితే ఊరుకునేది లేదంటూ.. మీ అనుమతులు మాకు అక్కర్లేదంటూ శ్రీనివాసులురెడ్డి హుకుం జారీ చేశారు. డీజేలకు అనుమతులు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నా.. అలా తీసుకోవడం కుదరదంటూ ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వినాయక చవితి పందిళ్లు, డీజే మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పనసరి అని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ఇస్తుంటే మీరు ఆంక్షలు పెట్టడం ఏంటంటూ శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు.ప్రభుత్వ నిబంధనలను కూడా అధికార పార్టీ నేతలు ఉల్లంఘిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఏడాదీ ఉత్సవ నిర్వాహకులు అనుమతులు తీసుకుంటున్నారు. అనుమతి ప్రకారం కావాల్సిన భద్రతను పోలీస్‌శాఖ కల్పిస్తోంది. కానీ అనుమతులు తీసుకోవాలంటే.. ఊరుకునేది లేదంటూ శ్రీనివాసులురెడ్డి కొత్త రూల్ పెట్టారు. -
యూట్యూబర్ సుంకేశుల ఆదిశేషుపై దాడి
సాక్షి,వైఎస్సార్: యూట్యూబర్ సుంకేశుల ఆదిశేషుపై దాడి జరిగింది. ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆదిశేషు వైఎస్సార్సీపీ తరుఫు ప్రచారం చేశారు.అయితే, వైఎస్సార్సీపీ తరుఫున ప్రచారం చేశారనే నెపంతో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. ఆదిశేషుపై దాడి చేశారు. కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఆదిశేషుకు తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. ఇక ఈ దాడి చేసింది టీడీపీకి చెందిన తుమ్మలపల్లి విశ్వనాథ్‌రెడ్డి అనుచరులేననంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘లై డిటెక్టర్ టెస్ట్’.. గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి,వైఎస్సార్: విద్యార్థిని హత్య కేసులో ఆమె తల్లిదండ్రులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా వారికి లై డిటెక్టర్ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు. లైడిటెక్టర్ టెస్టుల్లో పాల్గొనాలని వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ విద్యార్థిని హత్య అనంతరం పోలీసులు అన్నీ కోణాల్లో పోలీసులు విచారించారు. ఈ విచారణలో విద్యార్ధిని హత్యలో ప్రేమికుడు ప్రమేయం లేదని గతంలోనే తేల్చారు. కుటుంబ సభ్యులను విచారించారు. కానీ నిందిలు ఎవరనేది పోలీసులు గుర్తించ లేకపోయారు. చివరికి పరువు కోసం కుటుంబ సభ్యులే విద్యార్ధిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజ నిర్ధారణ చేసేందుకు వారికి లై డిటెక్టర్ టెస్టులు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే..గత జులై నెలలో వైఎస్సార్ కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న వైష్ణవి(17) కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి విగతజీవిగా మారింది.ఘటన జరిగిన రోజు ఉదయం 8గంటలకు తన ప్రియుడు లోకేష్‌తో బైక్‌పై గండికోటకు బయలుదేరింది. వీరు మధ్యలో పాలకోవ సెంటర్ వద్ద ఆగి కోవా తీసుకుని గండికోట టోల్ గేట్‌కు చేరుకున్నట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది.అక్కడ 2 గంటల పాటు తిరిగి 10:47 నిమిషాలకు బైక్‌పై లోకేష్ ఒక్కడే బయలుదేరినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది.వైష్ణవి కాలేజీకి రాలేదని యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని, తాము కాలేజీకి వెళ్లి ఆరా తీస్తే వైష్ణవి గండికోటకు వెళుతున్నానని తన స్నేహితులకు చెప్పినట్లు తెలిసిందని మృతురాలి సోదరుడు సురేంద్ర పోలీసులకు చెప్పాడు. దీంతో తాము గండికోటకు వెళ్లి గాలించగా.. మంగళవారం ఉదయం తన సోదరి మృతదేహం కనిపించిందని పేర్కొన్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు లోకేష్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు.హత్యా? పరువు హత్యా.?హత్యకు గురైన రోజు ఉదయం 10:28 నిమిషాల వరకు వైష్ణవి, లోకేష్ కలిసే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సోమవారం ఉదయమే వైష్టవిని హత్య చేసి ఉంటే శరీరం డీకంపోజ్ అయ్యేదని, మృతదేహం చూస్తే రాత్రి చంపినట్లు ఉందని పోలీసులు గుర్తించారు. నిర్జీవ ప్రాంతంలో బాలిక బంధువులు మృతదేహం ఉందని గుర్తించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీంతో నిజంగా ఇది హత్యా లేక పరువు హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. -
ఇంతకంటే దారుణం ఉంటుందా?: సతీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి పౌరుడికి ఉన్న ఆస్తి ఓటు.. నిజమైన స్వాతంత్ర్యం అంటే నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడమేనన్నారు. ఎల్లో మీడియా నీచమైన వార్తలు రాస్తోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పులివెందులలో టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డారు. మరణాయుధాలతో దాడులు చేసి చాలామందిని గాయపరిచారు. ఎస్పీని కలిసి పులివెందుల వచ్చే లోపే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై దాడి చేశారు. వారు ఉన్న కారుపై పెట్రోల్ పోసి చంపడానికి యత్నించారు. ఇప్పటికీ వేల్పుల రాము ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. తిరిగి మా వాళ్లపైనే ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టారు’’ అంటూ సతీష్‌రెడ్డి నిప్పులు చెరిగారు.‘‘గ్రామాల్లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలపై కూడా తప్పుడు కేసులు పెట్టారు. 11న అర్ధరాత్రి ఎంపీ అవినాష్‌రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు. వందల కిలోమీటర్లు తిప్పుతూ అవినాష్‌రెడ్డిని వేధించారు. నన్ను కూడా అక్రమంగా నిర్బంధించారు. జడ్పీటీసీ ఎన్నిక కోసం 700 మంది పోలీసులను పెట్టారు. 3 వేల మందికిపైగా టీడీపీ గూండాలను పులివెందులలో దింపారు. టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ము కాశారు. పోలింగ్ బూతులకు ఓటర్లను రాకుండా అడ్డుకున్నారు. వచ్చిన ఓటర్లను బెదిరించి స్లిప్పులు లాక్కున్నారు. 13 బూత్‌ల్లోకి మీడియాను కూడా అనుమతించలేదు’’ అంటూ సతీష్‌రెడ్డి దుయ్యబట్టారు.‘‘పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నిక జరిగిందని ఎల్లో మీడియా రాయడం విడ్డూరం. ఈ దిగజారిన వార్తలు చూసి సిగ్గుపడే పరిస్థితి. వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి పులివెందుల్లో ఏనాడు ఎన్నికల్లో అక్రమాలు జరగలేదు. టీడీపీ ఏనాడు ఎన్నికల్లో పులివెందుల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదు చేయలేదు. అలాంటప్పుడు 30 ఏళ్లుగా పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదని ఎలా వార్తలు రాస్తారు..?. గతంలో మేం టీడీపీలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలవడం నిజం కాదా..?పులివెందుల్లో కూటమి ప్రభుత్వం కొత్త సంప్రదాయాన్ని తీసుకుచ్చింది. టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోల్లోనే దొంగ ఓటర్లు ఉన్నారు. వారు దొంగ ఓటర్లు కాదు అని నిరూపించగలరా..?. జిల్లా కలెక్టర్ తను ఉన్న ఫోటోలో దొంగ ఓటర్ ఉన్నాడని గ్రహించి ఫోటోను డిలీట్ చేయలేదా..?. 700 మంది పోలీసులు బూత్‌లను స్వాధీనం చేసుకుని దొంగ ఓటర్లతో పోలింగ్ చేయించారు. దొంగ ఓట్లతో గెలిచిన వ్యక్తిని సీఎం సతీమణి అభినందించడం దారుణం’’ అని సతీష్‌రెడ్డి మండిపడ్డారు. -
బ్యాలెట్ బాక్సులనే మాయం చేశారు: ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల ప్రక్రియను అపహాస్యంపాలు చేసేలా నిర్వహించిన ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కనీవినీ ఎరగని అరాచకాన్ని చూశామని వైఎస్సార్సీపీ ఒంటిమిట్ట జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక చిన్న జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం చంద్రబాబు ఏకంగా ఏడుగురు మంత్రులను మండలంలో మోహరించినప్పుడే మా సత్తా అర్థమైందని అన్నారు.మంత్రి రాంప్రసాద్‌రెడ్డి 300 మంది రౌడీలను వెంటేసుకుని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు 17 పోలింగ్ బూత్‌లలో తిరుగుతూ మా ఏజెంట్లపై దాడులు చేసి బయటకు పంపించారని, ఏకంగా బ్యాలెట్ బాక్సులనే మాయం చేసి రిగ్గింగ్‌కి పాల్పడ్డారని సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అరాచకాలను కళ్లారా చూసిన జాయింట్ కలెక్టర్ కానీ, ఫోన్లో ఫిర్యాదు చేస్తే జిల్లా ఎస్పీ కానీ స్పందించకపోవడం చూస్తుంటే ఎన్నికలు ఎంత లోపభూయిష్టంగా జరిగాయో అర్థంఅవుతోంది. అందుకే రీపోలింగ్ ని బహిష్కరించామని, కౌంటింగ్‌కి కూడా వైయస్సార్సీపీ హాజరుకాబోవడం లేదు. కానీ ప్రశాంతంగా ఉంటే ఒంటిమిట్టలో కోదండరాముడి సాక్షిగా మంత్రి చేసిన అరాచకాలకు తప్పకుండా గుణపాఠం నేర్పుతాం. ఒంటిమిట్ట నుంచే మంత్రి రాంప్రసాదరెడ్డి పతనం ప్రారంభమైంది.ముగ్గురు మంత్రులు మండలంలో తిష్ట వేశారుఒంటిమిట్టలో నామినేషన్ వేసింది మొదలు ముగ్గురు మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, సవిత, రాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో ప్రలోభాలు, బెదిరింపుల పర్వం నడిచింది. మరో నలుగురు మంత్రులు ప్రచారం పేరుతో మండలంలో విపరీతమైన హడావుడి చేశారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి ఒంటిమిట్ట మండలంలో పార్టీకి గట్టిగా అండగా నిలబడిన దాదాపు 50 మంది వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేశారు. అన్నీ ఎదుర్కొని ఎన్నికల రోజున ఉదయం 5 గంటలకే ఏజెంట్లను నిలబెట్టగలిగాం. కానీ కీలకమైన పార్టీ ఏజెంట్లను గుర్తించి పోలీసులే బయటకు బూత్‌ల నుంచి బయటకు గెంటేశారు.దీనిపై జిల్లా ఎస్పీకి ఉదయం 9 గంటలకు ఒకసారి, 11 గంటలకు మరోసారి ఫిర్యాదు చేయడం జరిగింది. మండలంలో ఎన్నికలు జరుగుతుంటే రాజంపేట, రాయచోటితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పోలింగ్ బూత్‌ల వద్ద యాక్టివ్‌గా తిరుగుతూ కనిపిస్తున్నారని, గొడవలు జరిగే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశాను. కొంతమంది వ్యక్తులను గుర్తించి అక్కడే ఉన్న పోలీసులకు చెప్పడం కూడా జరిగింది. అయినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా ఫిర్యాదు చేసిన మమ్మల్నే అక్కడ్నుంచి బలవంతంగా పంపించి వేశారు. పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే యూనిఫాంకే చెడ్డపేరు తెచ్చారు.17 బూత్‌లలో మంత్రి రిగ్గింగ్ చేయించాడుఉదయం 11 గంటల ప్రాంతంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి 300 మంది రౌడీలతో చిన్నకొత్తపల్లికి వచ్చి హల్ చల్ చేశాడు. 700 మంది ఓటర్లున్న చాలా చిన్న బూత్ అది. మా వారు 5 గురు ఏజెంట్లుగా ఉన్నారు. పోవడం పోవడం మా పార్టీ ఏజెంట్లను బయటకు ఈడ్చి దారుణంగా కొట్టారు. ఆ విషయం తెలిసి నేను ఈ బూత్ వద్దకు వెళితే నన్ను కూడా బెదిరించాడు. ఇదేం పద్దతని నేను ఆయన్ను నిలదీస్తే పోలీసులు నన్ను అక్కడ్నుంచి పంపించేశారు. ఆ తర్వాత మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మంటపంపల్లి అనే మరో ప్రాంతానికి వెళ్లి అక్కడా అంతే.వందల మంది రౌడీలతో వెళ్లి మా ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టిపడేశారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తనకు సంబంధం లేని ప్రాంతానికి వచ్చి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ఆయనకు చిన్నకొత్తపల్లిలో ఓటు కూడా లేదని జాయింట్ కలెక్టర్‌కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని నేను మా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డికి చెప్పడం జరిగింది. ఆయనతో కలిసి నేను మంటపంపల్లెకి వెళ్లేసరికి అక్కడ బాక్సుల్నే మాయం చేశారు.పోలింగ్ బూత్ ఖాళీగా ఉంది. మాతోపాటే వచ్చిన జాయింట్ కలెక్టర్‌కి కూడా జరిగిన విషయాన్ని చెబితే ఆమె కూడా కళ్లారా చూశారు. ఆ తర్వాత ఆమె కూడా అక్కడ్నుంచి మెల్లిగా జారుకున్నారు. మంత్రిని అడ్డుకోవడానికి మేం ప్రయత్నిస్తుంటే పోలీసులు వెళ్లనీయకుండా మా కార్లను అడ్డుకుంటున్నారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 17 పోలింగ్ బూత్‌లల్లో పోలీసుల అండతో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నాడు.కౌంటింగ్‌ను కూడా బహిష్కరిస్తున్నాంప్రజాస్వామ్యంలో నిన్నటి రోజు ఒక చీకటి దినం. ప్రశాంతంగా ఉన్న మండలంలో మంత్రి అరాచకం సృష్టించాడు. ఏడాది తర్వాత అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరిగితే ఆయన ఇదే విధంగా చేయగలడా? భవిష్యత్తులో టీడీపీకి ఏజెంట్లు కూడా ఉండరు. మంత్రి బెదిరింపులకు నేను వెనక్కి తగ్గేదే లేదు. చిన్న మండలంలో సొంతంగా గెలవలేక 780 మంది పోలీసులను తెచ్చుకున్నారు. మంత్రి అండ చూసుకుని నన్ను భూస్థాపితం చేస్తానని అన్నోళ్లు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి.పులివెందుల, ఒంటిమిట్టలో జరిగింది ఎన్నికే కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు. రీపోలింగ్‌ను బహిష్కరించాం. కౌంటింగ్‌ను కూడా బహిష్కరిస్తున్నాం. మీ ఇష్టమైన మెజారిటీ రాసుకోండి. రాబోయే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తాం. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అనుసరించిన తీరుని రాష్ట్ర ప్రజలంతా చూశారు. భవిష్యత్తులో మంచి గుణపాఠం చెబుతారు. కోదండరాముని సాక్షిగా చెబుతున్నా ఈ జడ్పీటీసీ ఎన్నిక మంత్రి పతనానికి ఆరంభం. -
జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. యర్రగుంట్లలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సుధీర్‌రెడ్డితో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారు. నిన్న(మంగళవారం) వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అక్రమ అరెస్ట్‌ను సుధీర్‌రెడ్డి అడ్డుకున్నారు. కూటమి అరాచకాలకు వ్యతిరేకంగా నిన్న ఆయన ర్యాలీ నిర్వహించారు.కాగా, పులివెందులలో నిన్న (మంగళవారం) సూర్యోదయానికి ముందే పచ్చ ఖాకీలు గూండాగిరీకి తెరతీసిన సంగతి తెలిసిందే. భారీగా పోలీసు అధికారులు, సిబ్బంది వేకువజామునే ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి నివాసంపై దండెత్తారు. దురాక్రమణదారుల మాదిరిగా ఇంట్లోకి దూసుకెళ్లారు. ఎంపీని అక్రమంగా అరెస్టు చేశారు. ఎంపీగా తన నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ ఉప ఎన్నికలను పర్యవేక్షించడం ఆయన హక్కు, బాధ్యత. కానీ, దీన్ని పోలీసులు కాలరాశారు. ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు.పోలీసుల దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలపగా వారిని ఈడ్చి పడేశారు. ఎంపీని తమ వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని ముద్దనూరు వైపు తీసుకువెళ్లారు. నిడిజివ్వి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇంటి వద్ద దింపి ఇక్కడే ఉండాలని ఆదేశించారు. అక్కడికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు యర్రగుంట్ల వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. -
జగన్ ప్రెస్‌మీట్.. ఆ ఫొటోలు డిలీట్ చేసిన కలెక్టర్
సాక్షి,వైఎస్సార్: పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్‌లో రిగ్గింగ్ రాజ్యమేలింది. నల్లపురెడ్డిపల్లెలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ గూండాలు యథేచ్చగా దొంగ ఓట్లు గుద్దుకున్నారు. క్యూలో దర్జాగా రకరకాల ఫోజులతో నిలబడి మరీ ఓట్లు వేశారంటూ ఇవాళ మీడియా సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధారాలతో సహా ఆ విషయాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో.. కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎదురుగానే దొంగ ఓట్లుపడ్డ సంగతిని వైఎస్ జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకు సంబంధిత దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారాయి. అయితే ఫోటోలో ఉన్నది దొంగ ఓటర్లని బహిర్గతం కావడంతో కలెక్టర్ కంగుతిన్నారేమో..! దీంతో అప్పటికే ఆ ఫోటోలను తన ఎక్స్‌లో పోస్ట్ చేసిన జిల్లా కలెక్టర్ వెంటనే వాటిని డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. -
పులివెందుల: రెండు కేంద్రాల్లో రీపోలింగ్.. పచ్చ నేతల దొంగ ఓట్ల దందా
పులివెందుల ఎన్నికలు..రీపోలింగ్.. మళ్లీ దొంగ ఓట్ల దందా..పులివెందుల రీపోలింగ్‌లోనూ అదే దొంగ ఓట్ల పర్వంఈ.కొత్తపల్లి గ్రామంలో ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డ టీడీపీ నాయకుడుకమలాపురం మండలం నసంటపురం గ్రామానికి చెందిన గజ్జల నారాయణయాదవ్గా గుర్తింపుఅదే గ్రామంలో తిష్టవేసి ఉన్న కమలాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు👉ఈసీ తీరును నిరసనగా.. రీపోలింగ్‌ను బహిష్కరించిన వైఎస్సార్సీపీ👉15 బూత్‌ల్లో రీపోలింగ్ జరపాలని వైఎస్సార్సీపీ డిమాండ్పులివెందులలో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న రీపోలింగ్‌ను బహిష్కరించిన వైఎస్సార్సీపీముందు వెబ్ కాస్ట్ రీలీజ్ చేసి దొంగ ఓటర్లను గుర్తించిన తర్వాత మొత్తం 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలని డిమాండ్పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం రీపోలింగ్ బహిష్కరణవెంటనే వెబ్ కాస్టింగ్ అభ్యర్థులకు ఇవ్వాలని, భారీ ఎత్తున అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామన్న వైఎస్సార్సీపీదొంగ ఓటర్లను గుర్తించిన తర్వాతే అన్ని పోలింగ్ బూత్‌లలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నేడు రెండు చోట్ల రీపోలింగ్ఈ.కొత్తపల్లి రీపోలింగ్ కేంద్రానికి 45 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న పోలింగ్ మెటీరియల్ఉదయం 7 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు వరకు రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశాలుఇంత వరకు పోలింగ్ ఏజెంట్లను లోపలికి అనుమతించని పోలీసులుమరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న రీపోలింగ్ నేడు రెండు చోట్ల రీ-పోలింగ్అచ్చివెల్లి, ఈ.కొత్తపల్లిలో రీ పోలింగ్‌కు ఏర్పాట్లు14వ పోలింగ్ కేంద్రం ఈ.కొత్తపల్లిలో 1273 ఓటర్లుఉదయం 7 గంటలకు రీ-పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంత వరకు ప్రారంభం కాని పోలింగ్ఈ.కొత్తపల్లిలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని పోలింగ్ మెటీరియల్రీ-పోలింగ్ ఏజెంట్లను లోపలికి అనుమతించని పోలీసులు అచ్చవెల్లి రీ-పోలింగ్‌లో సైతం టీడీపీ నాయకుల హవాపోలింగ్ ప్రారంభానికి ముందే పోలింగ్ వద్ద టీడీపీ నాయకులు తిష్టచేతిలో వందకుపైగా స్లీప్స్తో పచ్చ పార్టీ నాయకులుఇంటి నుండి బయటకు రాని సామాన్య ఓటర్లు👉పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ అరాచకాల కారణంగా వాస్తవ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, అందువల్ల రీ–పోలింగ్ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మంగళవారం లేఖ రాశారు. పోలింగ్ సందర్భంగా టీడీపీ చేసిన అరాచకాలను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. 14వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరారు. టీడీపీ గూండాల అరాచకంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని వివరించారు.👉ఈ నేపథ్యంలో పులివెందులలో టీడీపీ నేతల అరాచకాన్ని కప్పి పుచ్చేందుకు ఎన్నికల కమిషన్ కంటి తుడుపు చర్య తీసుకుంది. కేవలం రెండు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే రీ-పోలింగ్‌కి ఆదేశించింది. నేడు 3 (అచివెల్లి), 14 (ఈ.కొత్తపల్లి) బూత్‌లలో పోలింగ్ జరగనుంది. అయితే, మొత్తం పోలింగ్ బూత్‌లలో మళ్ళీ పోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కోరినప్పటికీ వారి అభ్యర్థనను ఈసీ పెడచెవిన పెట్టింది👉ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన టీడీపీ నేతలు. చివరికి ఏజెంట్లను సైతం బూత్ లోకి వెళ్లనివ్వకుండా అరాచకం. మొత్తం 15 బూత్‌లలో ఏ ఒక్క చోటా ప్రజాస్వామ్యయుతంగా జరగని ఎన్నికలు. తక్కువ ఓట్లు ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలను ఎంచుకుని రీ పోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం 15 కేంద్రాల్లో మళ్ళీ తాజాగా పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒంటిమిట్టలో పలు కేంద్రాల్లో రిపోలింగ్ కోరితే పట్టించుకోని ఈసీ.👉రీ-పోలింగ్ మొత్తం కలిపి కేవలం 1765 ఓట్లకు మాత్రమే రీపోలింగ్. ఈ కొత్తపల్లిలో 1273 ఓట్లు, అచివెల్లిలో 492 ఓట్లకు మాత్రమే పోలింగ్. 15 బూత్‌లలో 10,601 ఓట్లకు ఫ్రెష్ పోలింగ్ జరపాలని అభ్యర్ధులు డిమాండ్ చేశారు. -
నన్ను ఓటు వేయనీయలేదు
-
‘ఒంటిమిట్టలో రిగ్గింగ్‌పై.. ఈసీకి జడ్పీటీసీ అభ్యర్ధి ఫిర్యాదు
సాక్షి,వైఎస్సార్: పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పచ్చమూక రెచ్చిపోయింది. అధికార బలాన్ని అడ్డంపెట్టుకొని పోలింగ్ బూత్‌లలోనే దొంగ ఓట్లు వేయించింది. అందుకు పోలీసులు కొమ్ముకాయడంతో ప్రజలు తమ విలువైన ఓట్లను వినియోగించుకోలేకపోయారు. పోలింగ్ బూత్‌లలో దొంగ ఓట్లు వేస్తున్నారని, మా ఓట్లను మేం వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసుల కాళ్లమీద పడ్డా ఫలితం లేకుండా పోయింది.ఈ క్రమంలో జడ్పీటీసీ ఉప ఎన్నికపై ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్ధి సుబ్బారెడ్డి ఎన్నికల అధికారులను ఆశ్రయించారు. 17బూత్‌లకు రీపోలింగ్ జరపాలని కోరారు. ఈ మేరకు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి ఓబులమ్మకు ఫిర్యాదు చేశారు. మొత్తం 30 బూత్‌లకు 17బూత్‌లలో రీపోలింగ్ జరపాలని విజ్ఞప్తి చేశారు. -
ఒంటిమిట్టలో మంత్రి వీరంగం.. పోలింగ్ బూత్‌లో బూతు పురాణం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: చిన్న కొత్తపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరుల వీరంగం సృష్టించారు. మంత్రి సమక్షంలోనే వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై టీడీపీ నేతలు చేయి చేసుకున్నారు. ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లపై బెదిరిరింపులకు పాల్పడుతూ.. రెచ్చిపోతున్నారు. కర్రలతో కొడుతున్నారంటూ ఓటర్లు వాపోతున్నారు. ప్రజలతో మాట్లాడేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు.మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. బూతు పురాణం అందుకున్నారు. పక్క జిల్లా నుంచి ఒంటిమిట్టకు వచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. అసలు ఒంటిమిట్టకు సంబంధం లేకపోయినా కానీ మంత్రి హడావుడి చేశారు. మంత్రి వచ్చి.. పొలింగ్ బుత్లలో దౌర్జన్యం చేస్తున్నా కానీ పోలీసులు పట్టించుకోలేదు.ఓటర్లను ప్రలోభపెట్టేలా.. ఒంటిమిట్ల పోలింగ్ బూత్‌లోకి మంత్రి వెళ్లారు, మరో వైపు, జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైఎస్ ఛైర్మన్ దొంగ ఓటు వేశారు. నల్లపురెడ్డి బూత్ క్యూలైన్లో నిలబడి వైఎస్ ఛైర్మన్ దొంగ ఓటు వేశారు. మరో బూత్ క్యూలైన్లో వేంపల్లికి చెందిన దొంగ ఓటరు ఓటు వేశారు. క్యూ లైన్లో జమ్మలమడుగు వాసులను వైఎస్సార్సీపీ శ్రేణులు గుర్తించాయి. -
‘మమ్మల్ని ఆపకండయ్యా..’ పోలీసుల కాళ్లు పట్టుకున్న పులివెందుల ఓటర్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో పోలీసుల సాయంతో టీడీపీ గూండాలు ఇష్టారాజ్యం రెచ్చిపోతున్నారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులతో ఓట్లు వేయిస్తున్న టీడీపీ.. అసలు ఓటర్లను ఎక్కడికక్కడే అడ్డుకుంటోంది. ఈ క్రమంలో ఖాకీలు ఈ చోద్యమంతా చూస్తూ ఉండిపోతున్నారు. అయితే తాము ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ కొందరు ఓటర్లు అనూహ్య రీతిలో నిరసనకు దిగారు. పులివెందుల మండలం కనంపల్లిలో గ్రామస్తులను పోలీసులు అడ్డున్నారు. అయితే తమను ఓటు వేయనివ్వండంటూ వాళ్లు పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నారు. ‘‘మమ్మల్ని ఆపకండయ్యా.. మా ఓటు మమ్మల్ని వేయనీయండయ్యా’’ అంటూ అభ్యర్థించారు. అయినా పోలీసులు కనికరించలేదు. ఈ క్రమంలో ఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారని.. దగ్గరుండి పోలీసులే రిగ్గింగ్ చేయిస్తున్నారంటూ స్థానికులు మండిపడ్డారు.మరోవైపు.. తమనూ ఓటేయకుండా అడ్డుకుంటున్నారంటూ పులివెందుల మండలంలోని పలువురు మహిళా ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇళ్లలోకి దూరి పోలీసులే మమ్మల్ని బెదిరించారు. మీ ఇంట్లో మగవారు ఎటు వెళ్లారు?అంటూ గదమాయించారు. మా చేతుల్లోని ఓటర్ స్లిప్పులను లాక్కున్నారు. ఓటేయడానికి వెళ్తే ఇక అంతే సంగతులు అంటూ బెదిరించారు అంటూ కొందరు వాపోయారు. ఈ స్థాయిలో అరాచకం ఎప్పుడూ చూడలేదని.. వందల మంది స్థానికేతర రౌడీలు తమ ఓట్లను వేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. -
టీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారు: హేమంత్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారంటూ పులివెందుల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా కానీ పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘నా ఇంటి చుట్టూ టీడీపీ గూండాలు మోహరించారు. కర్రలు, రాడ్లతో ఓటర్లను భయపెడుతున్నారు. ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనీయడం లేదు’’ అంటూ హేమంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు.ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ మూకలు అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్‌ని కూడా ఓటు వేయనివ్వని టీడీపీ గూండాలు.. ఇప్పటికే గ్రామంలోని రెండు పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్‌ని బూత్ దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా కాపలా కాస్తున్నారు. ఎస్ఫీకి కాల్ చేసినా ఫలితం కనిపించలేదు. హేమంత్ గన్‌మెన్‌ని ఉన్నపళంగా అధికారులు మార్చేశారు. నిన్నటి వరకు ఉన్న గన్‌మెన్‌ను తొలగించి మరొకరిని పంపించారు. బయటి నుండి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు.నల్లపురెడ్డిపల్లిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. స్వయం ప్రతిపత్తి ఎలక్షన్ కమిషన్ చెప్పే మాటలన్నీ నీట మూటలయ్యాయి. వైఎస్సార్సీపీ ఏజెంట్లను, ఓటర్లను టీడీపీ గుండాలు నిర్భందించారు. ఏజెంట్‌గా ఉన్న మాజీ ఎంపీపీ బలరాంరెడ్డిని బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఓటేసేందుకు అడ్డుకుంటున్నారని సామాన్య ఓటర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే టీడీపీ అరాచక శక్తులకు అండగా ఉన్నారని మాజీ ఎంపీపీ బలరాం రెడ్డి మండిపడ్డారు. మాపై దాడులు చేసేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నిస్తున్నారు. జమ్మలమడుగు నుంచి టీడీపీ గుండాలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఓటేసేందుకు వెళ్తే ఓటర్ స్లిప్పులను చించేశారంటూ ఓటర్ల ఆవేదన వ్యక్తం చేశారు. -
పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్
Pulivendula Vontimitta ZPTC Election.. Polling Updates:పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్భారీగా దొంగఓట్లు వేసిన జమ్మలమడుగు టీడీపీ గూండాలురిగ్గింగ్కు పాల్పడ్డ కమలాపురం,మైదుకూరు టీడీపీ గూండాలుక్యూలైన్లలో నిలబడి టీడీపీ గూండాలే ఓట్లు వేసిన వైనంఅసలు ఓటర్లకు బదులు దొంగ ఓట్లు వేసిన టీడీపీ గూండాలు ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున రిగ్గింగ్‌టీడీపీ గూండాలకు కొమ్ముకాసిన పోలీసులు ముగిసిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్క్యూలైన్లో ఉన్నవారికి మాత్రమే ఓటువేసేందుకు అవకాశం భారీ భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లను తరలించనున్న అధికారులు పులివెందులపై పోలీసులు పగబట్టారు: అవినాష్రెడ్డిపులివెందులలో భారీ రిగ్గింగ్ జరిగిందిప్రతీ గ్రామంలోనూ టీడీపీ గూండాలు రిగ్గింగ్ చేశారుపోలీసులు, టీడీపీ గూండాలు కలిసి రిగ్గింగ్ చేశారుఈ ఎన్నికలను బర్తరఫ్ చేయాలికేంద్ర బలగాలతో రీ పోలింగ్ నిర్వహించాలికార్యకర్తలు సంయమనం పాటించాలిపోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారుఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండిఅన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొందాంఓటర్ ప్లిప్‌లు లాక్కోని బయటకు పంపారుటీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై కుట్రలు చేశారుఇంత చెత్త, ఘోరమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదుకనంపల్లి గ్రామస్తులను ఓట్లు వేసుకోనివ్వలేదుమా ఏజెంట్లను పోలింగ్ బూత్‌లో లేకుండా చేశారుబయట నుంచి వేలాది మంది టీడీపీ గూండాలను తెచ్చారుపార్టీ కార్యకర్తలను కాల్చేస్తానంటూ డీఎస్పీ బెదిరించడం దారుణం : అంబటిపులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు దొంగఓట్లు వేస్తున్నారువారికి పోలీసులు సహకరిస్తున్నారుపోలీసుల అండతోనే యథేచ్ఛగా వారు ఓటు వేస్తున్నారుటీడీపీ నేతలు నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని బయటకు రానివ్వకుండా డీఐజీ కోయ ప్రవీణ్ కాపలా వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను కాల్చేస్తానంటూ డీఎస్పీ బెదిరించడం దారుణంఖాకీదుస్తులు వేసుకుంటున్నారా? దానికి బదులు పచ్చచొక్కాలు వేసుకుని తిరిగితే బాగుంటుంది.డీఐజీ కోయ ప్రవీణ్ ఉద్యోగ ధర్మాన్ని పూర్తిగా విస్మరించారుఇటువంటి అధికారిని చూస్తుంటే సిగ్గేస్తుంది.జమ్మలమడుగు ఎమ్మెల్యే తిరుగుతున్నా, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కాన్వాయితో తిరుగుతున్నా పోలీసులకు కనిపించదుజమ్మలమడుగు టీడీపీకి చెందిన ఉపాధ్యక్షుడు పులివెందుల ఎన్నికల్లో ఓటు అలాంటి ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పడం డీఐజీ కోయ ప్రవీణ్ దివాలాకోరుతనానికి నిదర్శనంపులివెందులపులివెందులలో మధ్యాహ్నం 3గంటల వరకు జరిగిన పోలింగ్ 71.36శాతంమొత్తం పోలింగ్ స్టేషన్లు:15మొత్తం ఓటర్లు:10,601పోలైన ఓట్లు:7,565ఒంటిమిట్టఒంటిమిట్టలో మధ్యాహ్నం 3గంటల వరకు జరిగిన పోలింగ్ 66.39 శాతంమొత్తం పోలింగ్ స్టేషన్లు:30మొత్తం ఓటర్లు:24,606పోలైన ఓట్లు:16,336 టీడీపీ మూకల దౌర్జన్యం.. ఓటర్లు భయభ్రాంతులుమా ఊర్లో ఓటు వేసే పరిస్థితి లేదు: మెట్‌నూతనపల్లి గ్రామస్థులుఓటు వేయడానికి వస్తే ఓటర్ స్లిప్ తీసుకుని తరిమేశారుబయట వ్యక్తులు వందలాదిగా వచ్చి ఓట్లు వేస్తున్నారుమేము చేసేది లేక వెనుదిరిగి వెళ్లిపోతున్నాంవైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టు వైఎస్సార్సీపీ నేతలను అక్రమ అరెస్టు చేస్తున్న అన్నమయ్య జిల్లా పోలీసులు వైఎస్సార్సీపీ నేతలు అంజాద్ భాష, రవీంద్రనాథ్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు రహస్య ప్రదేశానికి తరలిస్తున్న పోలీసులు ప్రజాస్వామ్యం ఖూనీ : మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషదాడి చేసిన అధికార పార్టీ నేతలు కాకుండా వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేయడం దారుణంమంత్రి రాంభూపాల్ రెడ్డి యదేచ్ఛగా పోలింగ్ బూతులకు వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురిఅయినా వారిపై చర్యలు లేవు ఈరోజు ప్రజాస్వామ్యం ఖూనీ అయిందిపోలీసులు పచ్చ పార్టీ కార్యకర్తలు లాగా వ్యవహరిస్తున్నారుపోలీసులు వ్యవహరిస్తున్న తీరు సమాజానికి మంచిది కాదు దుర్యోధనుడు జూదంలో గెలిచాడు..కానీ..చివరికి :గోరంట్ల మాధవ్ ప్రజా స్వామ్యం అపహాస్యం చేస్తూ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు చేశారుపోలింగ్ బూత్‌లు స్వాధీనం చేసుకున్నారుపోలీసులు కాళ్లకు ఓటర్లు మొక్కుతున్నారుదొంగ ఓటర్లు గ్రామాల్లో యదేచ్ఛగా ఓట్లు వేస్తున్నారుస్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేశారు..ఇప్పుడు ఇంట్లో నిర్బంధించారుదుర్యోధనుడు జూదంలో గెలిచాడు..కానీ..చివరికి పాండవులే గెలిచారుప్రజాస్వామ్యం ఖూనీ చేసే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేశారుపోలీసు అధికారులకు నా విజ్ఞప్తి, ప్రజాస్వామ్యం కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందిజడ్పీటీసీ ఉప ఎన్నికలు పై కోర్టుకు వెళ్తాం, రీపోలింగ్ కోరతాంజమ్మలమడుగు ,కమలాపురం చెందిన వారితో దొంగ ఓట్లు వేయించారుపులివెందుల జెడ్పీటిసీ ఉప ఎన్నికలు నిర్వహణ తీరు ప్రజాస్వామ్యంపై గొడ్డలి పెట్టుచంద్రబాబు కుట్ర పూరితమైన ఎన్నికల తీరుపై మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారుపోలిసులు, ఈసీ కూటమి ప్రభుత్వానికి లొంగి ఊడిగం చేయడం బాధాకరంఎంపీ అవినాష్ రెడ్డితో అచ్చివెల్లి గ్రామస్తుల భేటీతమను ఓటు వేయనీయకుండా టిడిపి గుండాలు అడ్డుకున్నారు.ఏజెంట్లుగా కూర్చున్న మహిళలను బెదిరించారు కర్రలు కత్తులతో పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చారు పోలింగ్ కేంద్రాల నుంచి మహిళా ఏజెంట్లు వెళ్లక పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారువచ్చిన వాళ్లంతా ఇతర ప్రాంతాల నుంచి మా గ్రామంలోకి వచ్చారు మా గ్రామంలో 600 ఓట్లకు గాను 300 మంది గుండాలను మోహరించారు మా ఓటు హక్కును అడ్డుకునే అధికారం టీడీపీ నేతలకు ఎవరు ఇచ్చారు గతంలో ఎన్నడు ఇటువంటి దౌర్జన్యాలు జరగలేదు. మహిళలను కూడా చూడకుండా బూతులు తిట్టారు.. చంపుతామని బెదిరించారుఎంపీ అవినాష్ రెడ్డితో అచ్చివెల్లి గ్రామస్తులు ఒంటిమిట్టలో అరగంట పాటు నిలిచిన పోలింగ్పోలింగ్ కేంద్రంలో దొంగఓట్లు వేస్తున్న టీడీపీ నేతలు పోలింగ్ బూత్ లోపల టీడీపీ నేతల్ని నుంచి ఉంచి గడియపెట్టిన పోలీసులు పోలింగ్ కేంద్రం గేటు బయటే వైఎస్సార్సీపీ శ్రేణులు పోలింగ్ కేంద్రంలో టీడీపీ దొంగఓట్లు వేయిస్తోందంటూ ఆందోళనలోపలికి రానివ్వకుండా వైఎస్సార్సీపీ శ్రేణుల్ని అడ్డుకున్న పోలీసులు గందరగోళంతో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో అరగంటపాటు పోలింగ్ నిలిపివేత ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్వైఎస్సార్సీపీ కార్యాలయంలో డీఐజీ కోయ ప్రవీణ్ కామెంట్స్ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేశాంఐదు గంటల వరకు అదుపులోనే ఉంటారురిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండిఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జడ్పిటిసి అభ్యర్థి అరెస్టుకు యత్నంఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పిటిసి అభ్యర్థి సుబ్బారెడ్డి ఆఫీసుకు చేరుకున్న అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.ఎస్పీతోపాటు సుమారు 150 మంది పోలీసులుసుబ్బారెడ్డి ఆఫీస్‌లో వైఎస్సార్సీపీ నేతలు రవీంద్ర నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అమ్జాద్ భాష, కొరుముట్ల శ్రీనివాసులు వైఎస్సార్సీపీ నేతలతో మాట్లాడుతున్న ఎస్పీవైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేసేందుకు పోలీసుల యత్నంపులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వైఎస్సార్సీపీ కార్యాలయం గేట్లు మూసివేసిన పోలీసులులోపలి వారిని బయటకు, బయటి వారిని లోపలికి అనుమతించని వైనంగేటు వద్ద మహిళలు ఆందోళనమా కార్యాలయంలోకి పంపడానికి ఇబ్బంది ఏంటి అంటూ ప్రశ్నిస్తున్న కార్యకర్తలు..పులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయంలో పోలీసుల వీరంగంపులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న పోలీసుల వీరంగం పార్టీ గేటు వద్ద లోపలికి కార్యకర్తలను ఎవరినీ రానివ్వకుండా గేట్లు వేసి అడ్డుకుంటున్న పోలీసులుమహిళలపై కూడా జులుం ప్రదర్శిస్తున్న పోలీసులుతమ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి వద్దకు వెళ్లాలంటూ పోలీసులతో వాదనకు దిగిన మహిళలుఅయినా అడ్డుకుంటున్న పోలీసులు..ఒంటిమిట్ట జడ్పీ హైస్కూల్ వద్ద ఉద్రిక్తతటీడీపీ నేతలను లోపలికి పంపి ఓట్లు వేయిస్తున్న పోలీసులువైఎస్సార్‌సీపీ నేతలను గేటు వద్ద అడ్డుకున్న పోలీసులుగేట్లు తోసుకొంటూ లోపలికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు కనంపల్లిలో పోలీసుల ఓవరాక్షన్ సర్పంచ్ రామాంజనేయులు ఇంట్లో గన్ ఉంచి బెదిరిస్తున్న పోలీసులు కనంపల్లిలో ఓట్లు వేయనియకుండా ఓటర్లును తిప్పిపంపిస్తున్న పోలీసులు పోలీసుల తీరుపై ఓటర్ల ఆగ్రహం పులివెందులపై పోలీసులు పగబట్టారు: ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిపోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారుఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండిఅన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటాంకార్యకర్తలు సంయమనం పాటించాలి కలెక్టర్‌కు పులివెందుల జడ్పీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థుల లేఖ పులివెందులలో అరాచకం చేసి ఎన్నికను ఏకపక్షం చేసుకోవాలని టీడీపీ ప్రయత్నం చేస్తోందిఏ ఒక్క ఏజెంటునూ పోలింగ్ బూత్‌లోకి వెళ్లనివ్వలేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన అభ్యర్థులురీపోలింగ్ జరపాలని కలెక్టర్‌ను కోరిన ఇండిపెండెంట్ అభ్యర్థులుఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆఫీస్‌కు భారీగా పోలీసులుపులివెందుల వైఎస్సార్సీపీ కార్యాలయానికి డీఐజీ కోయ ప్రవీణ్వైఎస్సార్సీపీ కార్యకర్తలను దూషించిన పోలీసులుపోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల నినాదాలు ఉదయం 11 గంటల వరకు 38.64 శాతం నమోదుపులివెందుల:మొత్తం పోలింగ్ స్టేషన్లు: 15మొత్తం ఓటర్లు: :10,601పోలైన ఓట్లు: 4803ఓట్ల శాతం: 45.31ఒంటిమిట్ట:మొత్తం పోలింగ్ స్టేషన్లు: 30మొత్తం ఓటర్లు: 24,606పోలైన ఓట్లు: 9057 ఎర్రగుంట్లలో వైఎస్సార్సీపీ నేతల భారీ ర్యాలీపోలీసులు, అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనపులివెందులలో యథేచ్ఛగా రిగ్గింగ్: వైఎస్ అవినాష్రెడ్డిజమ్మలమడుగు టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారుకొత్తపల్లిలో బీటెక్ రవి అనుచరులు రిగ్గింగ్ చేశారుమా పార్టీ ఏజెంట్లను కొట్టి బయటకు పంపారుఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్న పట్టించుకోలేదుపులివెందుల మండల ఓటర్లతో రిగ్గింగ్ చేయించడం అసాధ్యంఅందుకే బయట నుంచి దొంగ ఓటర్లను దింపారుపులివెందులలో దౌర్జన్యాలతో ఎవరూ గెలవలేరుదాడులు చేసి గెలిచామనకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదుఎర్రిపల్లిలో బీటెక్ రవి తమ్ముడు మహిళలను కొట్టాడుపోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ బయటకు తీయాలితప్పు చేసిన వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాంమంత్రి రాంప్రసాద్‌రెడ్డి అనుచరుల వీరంగంచిన్న కొత్తపల్లిలో మంత్రి సమక్షంలోనే వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై చేయి చేసుకున్న టీడీపీ నేతలుఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లపై బెదిరిరింపులుకట్టెలతో కొడుతున్నారంటూ వాపోతున్న ఓటర్లుప్రజలతో మాట్లాడేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డిసుబ్బారెడ్డిపై దాడికి యత్నించిన టీడీపీ కార్యకర్తలుబూతు పురాణం అందుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డిమంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘనఓటర్లను ప్రలోభపెట్టేలా మంత్రి పర్యటనఒంటిమిట్ల పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన మంత్రిదొంగ ఓటు వేసిన జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైఎస్ ఛైర్మన్నల్లపురెడ్డి బూత్ క్యూలైన్లో వైఎస్ ఛైర్మన్మరో బూత్ క్యూలైన్లో వేంపల్లికి చెందిన దొంగ ఓటరుక్యూ లైన్లో జమ్మలమడుగు వాసులను గుర్తించిన వైఎస్సార్సీపీ శ్రేణులుపులివెందుల ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లుప్రతి పోలింగ్ బూత్ వద్ద జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ గూండాలుక్యూల్లో నిలబడి వారే ఓట్లేస్తున్న వైనంక్యూ లైన్లలో అసలు ఓటర్ల బదులు దొంగ ఓటర్లు అయినా పట్టించుకోని పోలీసులుపోలింగ్ స్టేషన్ వద్ద తిష్ట వేసి ఓటరు స్లిప్పులను ఇచ్చి జమ్మలమడుగు వాళ్లను పంపుతున్న టీడీపీ నాయకులుదొంగ ఓటు వేయాలన్నా స్లిప్పులో ఉన్న పేరుకు, వయసుకు తేడా వస్తుందన్నా ఏం కాదని పంపుతున్న టీడీపీ నాయకులునల్లపురెడ్డిపల్లి, నల్లగొండువారిపల్లి, ఎర్రిబల్లి, కనంపల్లితో పాటు ప్రతి గ్రామంలో వందల కొద్దీ టీడీపీ గూండాలుగ్రామాల శివార్లలోనే వాహనాలను అడ్డుపెట్టి ఎవర్నీ గ్రామంలోకి రానివ్వని టీడీపీ నేతలుకర్రలు, రాడ్లతో పహారా, పోలీసులు ఉన్నా ప్రేక్షక పాత్రఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు రాకుండా అడ్డగింత...గ్రామాల్లో ప్రజలను భయబ్రాంతులను చేసిన టీడీపీ మూకలుమీడియాను కూడా గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్న టీడీపీ గూండాలుప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున రిగ్గింగ్...దొంగ ఓటర్లతో నిండిపోయిన పోలింగ్ బూత్లుటీడీపీ అరాచకాల ఆధారాలను ప్రదర్శించిన వైఎస్సార్సీపీ నేతలుప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలువిజయవాడ: ఎస్ఈసీ కార్యాలయానికి వైఎస్సార్సీపీ నేతలుపులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదుతక్షణమే స్పందించాలంటూ ఈసీ కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ నేతల నిరసనఎన్నికల కమిషనర్‌ను కలిసిన మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్..మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు,హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డిమొండితోక అరుణ్ కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డిఎస్పీకి ఫోన్ చేసినా కానీ పట్టించుకోలేదుపులివెందుల జడ్సీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి ఆగ్రహంమా ఇంటి చుట్టూ 150 పోలీసులను పెట్టారుమా ఏజెంట్లు వస్తే కాళ్లు చేతులు విరిచేస్తామంటూ బెదిరించారుఇంటి నుంచి 100 మీటర్ల దూరంలో 100 మందిపైగా టీడీపీ రౌడీ మూకలుఇక్కడ ఉండేది 1200 ఓట్లు.. బయట నుండి వచ్చి 900 మంది రౌడీలు తిరుగుతున్నారు144 సెక్షన్ ఉందన్నా.. బయటకు వాళ్ళకు వర్తించదా?పోలీసులు దగ్గరుండి ఓట్లు వేయించిస్తున్నారునేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదుప్రజాస్వామ్యంలో ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలిగెలుపు ఓటములు సహజంపులివెందులను భ్రష్టు పట్టిస్తున్నారుతప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తున్నారుఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలిఎస్పీకి ఫోన్ చేసిన ఇంతవరకు రెస్పాన్స్ లేదుపోలీసుల తీరుపై ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జడ్పిటిసి అభ్యర్థి సుబ్బారెడ్డి ఆగ్రహంపూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా జడ్పీటీసీ ఎన్నికలురాయచోటి నుంచి ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ రౌడీ మూకలను తరలించి ఎన్నికలకు అంతరాయం కలిగిస్తున్నారుప్రతి బూత్ వద్ద బయటి వ్యక్తులు 50కి పైగా ఉన్నాకానీ.. పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారుఆ బయట వ్యక్తులు ఉన్నారని పేరుతో సహా చెప్పిన పోలీసులు టీడీపీ వారికి సహకరిస్తున్నారు..పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారుప్రజాస్వామ్యం పద్ధతులకు విరుద్ధంగా ఎన్నికలు జరిగితే దానికి ఎస్పీఏ బాధ్యులవుతారుఉదయం 9 గంటల వరకు 14.87 శాతం నమోదుపులివెందుల:మొత్తం పోలింగ్ స్టేషన్లు: 15మొత్తం ఓటర్లు: :10,601పోలైన ఓట్లు: 2,222ఓట్ల శాతం: 20.96ఒంటిమిట్టమొత్తం పోలింగ్ స్టేషన్లు: 30మొత్తం ఓటర్లు: 24,606పోలైన ఓట్లు:3,658 మహిళల అడ్డగింతతో.. వెనుదిరిగిన పోలీసులువైఎస్సార్ జిల్లా తుమ్మలపల్లి లో వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులుఓటు వేయడానికి రావాలంటూ కోరిన పోలీసులు‘‘మీరు టీడీపీ వారికే కాపలా.. పోండి’’ అంటూ అడ్డుకున్న మహిళలుఉదయం నుంచి టీడీపీ రిగ్గింగ్ కి సహకరిస్తూ ఇప్పుడు అభ్యర్థి ఓటు అంటూ వస్తారా? అని ఆగ్రహంఅసలు ప్రజలనే ఓటు వేయనీయకుండా చేసి ఇక్కడి వచి నీతులు చెప్తారా? అంటూ అడ్డగింతమహిళల అడ్డగింతతో వెనుతిరిగిన పోలీసులుఆ పది మంది టీడీపీ వాళ్లే!పులివెందుల ఈ కొత్తపల్లిలో కొనసాగుతున్న టీడీపీ అరాచకంపోలింగ్ బూత్ ల నుంచి ఓటర్లను వెనక్కి పంపుతున్న టీడీపీ నేతలుపోలింగ్ బూత్ లను ఆక్రమించిన టీడీపీ నేతలు.పోలీసులను అడ్డం పెట్టుకొని రిగ్గింగ్ కు పాల్పడుతున్న వైనంటీడీపీ అరాచకాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలుఓన్లీ ఎల్లో మీడియా చానల్స్ ను మాత్రమే పోలింగ్ బూత్ లోకి అనుమతిపదిమంది టీడీపీ ఓటర్లను క్యూ లైన్లో నిలబెట్టి వీడియోలు తీయిస్తున్న టీడీపీఎన్నిక సక్రమంగా జరిగిందంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం పులివెందుల-నల్లపురెడ్డి గ్రామానికి చెక్ పోస్ట్ఓటర్లకు, వైఎస్సార్సీపీ శ్రేణులకు నో ఎంట్రీటీడీపీ నాయకుల కార్లు అయితే రైట్ రైట్ఒంటిమిట్టలో టీడీపీ అరాచకంకొనరాజుపల్లి కి భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు10 జీపుల్లో బయట నుండి వచ్చిన టీడీపీ శ్రేణులుభారీ ఎత్తున రిగ్గింగ్ కోసం ప్రయత్నాలు ఒంటిమిట్టలో టీడీపీ అరాచకంగొల్లపల్లి , నరసనగారి పల్లి పోలింగ్ బూత్ హేండ్ ఓవర్ చేసుకున్న టీడీపీ శ్రేణులుఓట్లు వేసుకొంటున్న టీడీపీ శ్రేణులుపోలింగ్ బూతుల నుండి వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటికి లాగేసిన టీడీపీ శ్రేణులుచోద్యం చూస్తున్న పోలీసులుటీడీపీ రిగ్గింగ్‌పై ఆగ్రహజ్వాలలుపులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్కనంపల్లిలో వేముల, దుగ్గన్నగారిపల్లి గ్రామాల్లో టీడీపీ ఇష్టారాజ్యంఓట్లు రిగ్గింగ్ చేసుకుంటున్నారని మహిళల గ్రహంపోలీసుల కాళ్లు పట్టుకుంటున్న ఓటర్లుపులివెందుల నల్లగొండు వారి పల్లె లో ఓటర్ల ఆందోళనఓటు వెయ్యనివ్వండని పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్న ఓటర్లుటీడీపీ నేతలు రిగ్గింగ్ చెయ్యడం తో నిజమైన ఓటర్ల ఆందోళనపోలీసులు కి వేడుకుంటున్న ఓటు హక్కు వినియోగించుకొని దుస్థితిఓటరు స్లిప్పులు లాక్కుంటున్న టీడీపీ నేతల పై ఓటర్ల ఆగ్రహం👉లోకేష్ శునకానందం కోసం పోలీసులు పని చేస్తున్నారు: ఎస్వీ సతీష్రెడ్డివేంపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి హౌస్ అరెస్ట్నేడు ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది: ఎస్వీ సతీష్‌రెడ్డి లోకేష్ శునకానందం కోసం పోలీసులు పని చేస్తున్నారు లోకేష్ ఆనందం కోసం చంద్రబాబు ధృతరాష్ట్రుడు అయ్యాడు ప్రజాస్వాయం అవహేళనకు గురవుతుంటే చంద్రబాబు లోకేష్ ఆనందిస్తున్నారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు పులివెందులలో ఉన్న పోలీసులకు ఖాకి చొక్కా వేసుకునే అర్హత లేదునేటి పోలింగ్ జరుగుతున్న తీరుతో ప్రజాస్వామ్యం మీద ఆందోళన కలిగిస్తోంది పరిస్థితి ఈ విధంగా ఉన్నాక పోలింగ్ నిర్వహణ ఎందుకు?👉పులివెందులలో మహిళా ఓటర్ల ఆవేదనఓటేయకుండా అడ్డుకుంటున్నారుఇళ్లలోకి దూరి పోలీసులే మమ్మల్ని బెదిరించారుమీ ఇంట్లో మగవారు ఎటు వెళ్లారంటూ నానా హంగామా చేశారుఓటర్ స్లిప్పులను లాక్కున్నారుఓటేయడానికి వెళ్లే ఇక అంతే సంగతులు అంటూ హెచ్చరించారుఈస్థాయిలో అరాచకం ఎప్పుడూ చూడలేదువందల మంది స్థానికేతర రౌడీలు మా ఓట్లను వేస్తున్నారు.👉పులివెందులలో టీడీపీ ఇష్టారాజ్యంఅన్ని పోలింగ్ బూత్‌ల్లో రిగ్గింగ్చేస్తున్న టీడీపీ గూండాలుటీడీపీ గూండాల చేతిలో నల్లపురెడ్డి పోలింగ్ స్టేషన్జమ్మలమడుగు నుంచి మనుషుల్ని పిలిపించి రిగ్గింగ్అందరి ఓట్లు వాళ్లతోనే వేయిస్తున్న పచ్చగూండాలు👉కనంపల్లిలో గ్రామస్తులను ఓట్లు వేయనివ్వని పోలీసులుఓటు వేయనివ్వండంటూ పోలీసుల కాళ్లు పట్టుకున్న ఓటర్లుఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారు: స్థానికులుదగ్గరుండి పోలీసులే రిగ్గింగ్ చేయిస్తున్నారుబయటి నుంచి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ గూండాలుటీడీపీ గూండాలకే సపోర్ట్ చేస్తున్న పోలీసులు👉పులివెందుల మండలం కనంపల్లి గ్రామంలో ఉద్రిక్తతపోలింగ్ బూత్‌లకు వెళ్ల నియ్యకుండా అడ్డుకుంటున్న టీడీపీ మూకలుఓటు వేయడానికి వెళ్తున్న మహిళ ఓటర్లపై దౌర్జన్యానికి పాల్పడుతున్న టీడీపీ మూకలుతమ ఓటు హక్కును అడ్డుకోవడానికి మీరెవ్వరు అంటూ పచ్చ మూకలపై తిరగబడ్డ మహిళలుకనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు బయటికి రానివ్వకుండా బెదిరిస్తున్న పోలీసులు👉నల్లపురెడ్డిపల్లిలో యథేచ్ఛగా రిగ్గింగ్వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసిన టీడీపీ గూండాలువిచ్చలవిడిగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ గూండాలు👉ఆర్. తుమ్మలపల్లిలో అరాచకంవైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్‌ని కూడా ఓటు వేయనివ్వని టీడీపీ గూండాలుఇప్పటికే గ్రామంలోని రెండు పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకున్న టీడీపీవైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్‌ని బూత్ దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా కాపలాఎస్ఫీకి కాల్ చేసినా కనిపించని ఫలితంహేమంత్ గన్‌మెన్‌ని ఉన్న పళంగా మార్చేసిన అధికారులునిన్నటి వరకు ఉన్న గన్‌మెన్‌ను తొలగించి మరొకరిని పంపిన అధికారులుబయటి నుండి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ నేతలుటీడీపీ గూండాలకే వత్తాసు పలుకుతున్న పోలీసులు👉టీడీపీ గూండాల అరాచకాలపై పట్టించుకోని పోలీసులుపులివెందుల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి ఆగ్రహందాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారుటీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారుఓటర్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారునా ఇంటి చుట్టూ టీడీపీ గూండాలు మోహరించారుకర్రలు, రాడ్లతో ఓటర్లను భయపెడుతున్నారుదాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారుఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనీయడం లేదు👉ఈ కొత్తపల్లిలో రెండు పోలింగ్ బూత్‌లను ఆక్రమించిన టీడీపీ నేతలుఈ కొత్తపల్లిలో కొనసాగుతున్న టీడీపీ నేతల దౌర్జన్యంటీడీపీ ఓటర్లను తప్ప మిగతా వారిని ఓటు వేయడానికి అనుమతించని టీడీపీ నేతలుఓటు వేయడానికి వెళ్లిన వారిని తిరిగి పంపించేస్తున్న టీడీపీ గుండాలునిస్సహాయంగా వెనక్కి తిరిగిపోతున్న ఓటర్లుఓటు వేయడానికి ఉదయాన్నే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళాముదౌర్జన్యంగా వెనక్కి పంపించేశారుగతంలో ఎన్నడు బూతులను ఆక్రమించలేదుపోలింగ్ బూత్‌ల్లో పులివెందులకు సంబంధించిన వ్యక్తులు లేరుబయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే పోలింగ్ బూత్‌ల్లో ఉన్నారుపోలీసులు వారికే కొమ్ము కాస్తున్నారుఒక్క బూత్‌లో కూడా పోలీసులే లేరుమా గ్రామాల్లో ఓటు వేయకుండా, పక్క గ్రామంలో బూత్‌లు మార్చారుఎప్పుడు బూతులు మార్చిన దాఖలాలు లేవంటున్న ఓటర్లు👉పులివెందులలో మీడియాపై దాడికి దిగుతున్న కూటమి నేతలుపోలింగ్ బూత్ లను ఆక్రమించి ఎవర్నీ గ్రామంలోకి రానివ్వని అల్లరి మూకలుఊరి బయటే వాహనాలను తనిఖీ చేసి వెనక్కి పంపుతున్న టీడీపీ మూకలుప్రతి గ్రామంలో 300 మందికి పైగా అల్లరి మూకలుమీడియాను సైతం వదలని టీడీపీ మూకలుమీడియా ప్రతినిధులను గ్రామం బయటే అడ్డుకుని కెమెరాలు లాక్కుంటున్న వైనంసాక్షి ప్రతినిధులపై దాడికి దిగిన టీడీపీ గూండాలువైఎస్సార్సీపీ ఏజెంట్లను అసలు బూత్ లోపలికి వెళ్లనివ్వని టీడీపీ👉పులివెందుల, ఒంటిమిట్లలో ప్రజాస్వామ్యం ఖూనీపోలింగ్ బూత్‌ల్లో టీడీపీ గూండాల స్వైర విహారంవైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసిన టీడీపీ గూండాలుమీడియా ప్రతినిధులపైనా టీడీపీ గూండాల దాడులుటీడీపీ గూండాల అరాచకాలను పట్టించుకోని పోలీసులు👉పులివెందులలో టీడీపీ గూండాల దౌర్జన్యంఅచ్చివెల్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుక్ను టీడీపీ గూండాలుఎర్రిపల్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకున్న టీడీపీ గూండాలుటీడీపీ గూండాల అరాచకాలతో గ్రామాల్లో భయాందోళనలునిస్సహాయంగా వెనక్కి తిరిగి వెళ్తున్న ఓటర్లుటీడీపీ గూండాలు దౌర్జన్యంగా వెనక్కి పంపేశారని ఆవేదనగతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదంటున్న ఓటర్లుపోలింగ్ బూత్‌ల్లో బయటి వ్యక్తులు ఉన్నారంటున్న ఓటర్లుఒక్క పోలింగ్ బూత్‌లో కూడా పోలీసులు లేరంటున్న ఓటర్లు👉పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభంతీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైన పోలింగ్ఎక్కడికక్కడే పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకున్న టీడీపీ మూకలువైఎస్సార్సీపీ ఏజెంట్లను రాకుండా అడ్డుకున్న టీడీపీ నేతలుగ్రామాల్లో కర్రలు పట్టుకుని తిరుగుతున్న పచ్చ మూకలు👉పులివెందుల మండలం ఎర్రిపల్లిలో ఉద్రిక్తతపోలింగ్ బూత్ ను ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ మూకలుపోలీసులను సైతం తరిమేస్తున్న టీడీపీ మూకలుగ్రామంలో మహిళలపై దాడి.. అసభ్యంగా ప్రవర్తిస్తున్న పచ్చ మూకలుగ్రామంలో వారు ఓటు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ👉పులివెందుల మండలంలో భయానక పరిస్థితులువైఎస్సారసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి హౌస్అరెస్ట్వేంపల్లిలోని తన నివాసంలో గృహ నిర్బంధం చేసిన పోలీసులువైఎస్సార్‌సీపీ నేతల కార్లను ధ్వంసం చేసిన టీడీపీ గూండాలుమౌన ప్రేక్షక పాత్రలో వందలాది మంది పోలీసులుగ్రామాల్లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు👉ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్ట్తెల్లవారుజామున అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులుఇంటికొచ్చి బలవంతంగా అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులుఎన్నికలు జరిపే విధానం ఇదేనా?: అవినాష్రెడ్డిమా కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారుకేవలం వైఎస్సార్సీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారుపోలీసులు గూండాలుగా వ్యవహరిస్తున్నారుఇంత దారుణ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు👉వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోవివిధ కారణాలతో 28 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా, కోర్టులో కేసుల పేరుతో కేవలం పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.👉పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు కోసం వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులు, అక్రమ కేసుల బనాయింపు మొదలు.. ఎన్ని అడ్డదారులు తొక్కినప్పటికీ టీడీపీ అభ్యర్థికి ఘోర పరాజయం తప్పదని అంతర్గత సర్వేల్లో స్పష్టమవడంతో పెదబాబు, చినబాబు ఇద్దరూ బరితెగించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జెడ్పీటీసీ ఉప ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు పథక రచన చేశారు. మంగళవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సోమవారం కొత్త కుట్రకు తెరతీశారు.👉ఇప్పటికే అధికారులు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పుల్లో తప్పులు ఉన్నాయని అబద్ధం చెబుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తల ద్వారా వాటిని సేకరిస్తున్నారు. ఇవ్వని వారి నుంచి బలవంతంగా లాక్కున్నారు. సోమవారం సాయంత్రం వరకు పంపిణీ చేయని ఓటరు స్లిప్పులను అధికారుల నుంచి గంపగుత్తగా టీడీపీ నాయకులు తీసేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు, కమలాపురంతోపాటు.. సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను భారీ ఎత్తున రప్పించి పులివెందుల మండలంలో పోలింగ్ బూత్‌లు ఉన్న గ్రామాల్లో తిష్ట వేయించారు.👉ఈ ఓటరు స్లిప్పులను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఒక గ్రామం పోలింగ్ బూత్‌ను పక్క గ్రామంలోకి మార్చిన నేపథ్యంలో ఓట్లు వేయడానికి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి పలు గ్రామాల ఓటర్లు వెళ్లాల్సి ఉంటుంది.ఈ క్రమంలో నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, యర్రబల్లె ఓటర్లను మార్గం మధ్యలో పోలీసుల ద్వారా ఆపేసి.. పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పి అడ్డుకోవాలనే ఎత్తు వేశారు. తద్వారా వారి ఓట్లను కూడా ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దొంగ ఓట్లు వేయించుకోవాలన్నది టీడీపీ నేతల పన్నాగం. -
మా ఓటు వేయడానికి మీరెవరూ.. టీడీపీ నేతలకు ఝలక్ ఇచ్చిన ఓటర్లు
సాక్షి,వైఎస్సార్: జిల్లాలోని ఒంటిమిట్టలో టీడీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారు. ధవంతం పల్లి ఎస్సీ కాలనీలో పోలింగ్ బూతు నెంబర్ తేడా పడిందంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఓటర్ స్లిప్పు తీసుకున్నారు. టీడీపీ నేతల తీరుతో ఆగ్రహానికి గురైన ఓటర్లు.. గ్రామమంతా వదిలేసి తమ దగ్గరే ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఓటర్ స్లిప్‌లో తేడా వచ్చింది, మళ్లీ కొత్తవి ఇస్తామంటూ టీడీపీ నేతలు బుకాయించారు. మా ఓట్లు మేమే వేసుకుంటాం.. మధ్యలో మీరేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కొత్తస్లిప్లు వస్తాయి.. ఇస్తామంటూ టీడీపీ కార్యకర్తలు మెల్లగా జారుకున్నారు. -
చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచక వాది: వైఎస్ జగన్
తాడేపల్లి: ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచక వాది అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేసే వ్యక్తి కాదని జగన్ దుయ్యబట్టారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ చంద్రబాబు చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.‘చంద్రబాబు కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్ను పోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరి కొంతమంది పోలీసులు వీరంతా ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారు’ అని జగన్ విమర్శించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అమలు చేస్తున్న కుట్రపూరిత పథకాల్ని వైఎస్ జగన్ ట్వీట్ రూపంలో ప్రస్తావించారు. .@ncbn అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని, కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలుచేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే… pic.twitter.com/MaZrGo174C— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2025 1. పులివెందుల, ఒంటిమిట్ట ZPTCల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వందలమంది వైయస్సార్సీపీ, నాయకులను కార్యకర్తలను బైండోవర్ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్‌స్టేషన్ గడపతొక్కని వారిని, ఎలాంటి కేసులు లేనివారిని కూడా బైండోవర్ చేసి, వైఎస్సార్సీపీ తరఫున పనిచేస్తున్నవారిని, ప్రచారంచేస్తున్న వారిని పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.2. ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడిచేశాయి. ఈ ఘటనలో అమరేష్‌రెడ్డి, సైదాపురం సురేష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లివారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్ రెడ్డి తదితరులపైనా దాడికిదిగారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పనిచేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరికగా దీనికి పాల్పడ్డారు.3. ఆగస్టు6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ MLC రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్యచేయడమే లక్ష్యంగా నల్లగొండువారిపల్లెవద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు,రాళ్లు, రాడ్లతో దాడిచేసి, వీరిని తీవ్రంగా గాయపరిచారు. కార్ని బద్దలు కొట్టారు. పెట్రోల్ పోసి ఆ కారుకు నిప్పంటించే ప్రయత్నంకూడా చేశారు. రమేష్ యాదవ్‌కు గాయాలుకాగా, తీవ్రగాయాలతో రక్తం ఓడుతున్న వేల్పుల రామలింగారెడ్డిని ఆస్పత్రిలో చేర్పించారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహించారు. వైఎస్సార్సీపీ నాయకులెవ్వరినీ పల్లెల్లో తిరగనీయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఈరకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే టీడీపీ గ్యాంగులతో ఈ దారుణాలకు ఒడిగట్టారు.4. తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి, ఆగస్టు 6, మధ్యాహ్నం 3.30గంటలకు వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడిచేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయకపోగా, జరగని ఘటనను జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి, దాని ఆధారంగా బాధితుడైన వేల్పుల రాముసహా మరొక 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ మరియు హత్యాయత్నం కేసుపెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకుని, ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. పోలింగ్ రోజున మరింతమంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారు.5. ఆగస్టు8, వైఎస్సార్సీపీకి చెందిన ఒక నాయకుడ్ని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, తమవైపునకు లాక్కుని, అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని, తప్పుడు కేసుపెట్టి, దాని ఆధారంగా వైఎస్సార్సీపీకి చెందిన రాఘవరెడ్డి, గంగాధరరెడ్డి, వైయస్.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డిలకు నోటీసులు జారీచేశారు.6. ఆగస్టు8: అధికారపార్టీతో చేతులు కలిపిన అధికారులు, వైయస్సార్సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూత్‌లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఓటు వేయాలంటే రెండు గ్రామాల ప్రజలు 2 కి.మీ, మరో రెండు గ్రామాల ప్రజలు 4 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంటుంది. పులివెందుల జడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు4వేల మంది ఓటర్లను, పక్కా వైయస్సార్సీపీకి చెందిన గ్రామాలకు చెందినవారిని ఈ రకంగా ఇబ్బందిపెట్టి, వీళ్లు ఓటేయడానికి వెళ్లే క్రమంలో వారిని వెళ్లనివ్వకుండా బెదిరించడం, భయపెట్టడ్డం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకుని, తద్వారా ఓటింగ్‌ను తగ్గించడం, బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డం, చంద్రబాబుగారు ఈమాదిరి కుట్ర చేస్తున్నారు. (పోలింగ్ బూత్‌లను అడ్డగోలుగా ఎలా మార్చారన్న టేబుల్‌ను అటాచ్ మెంట్లో ఉంది. పరిశీలించగలరు)7. ఆగస్టు8 రాత్రి, నల్లగొండువారిపల్లెవద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డిపైనే తప్పుడు ఎస్సీ, ఎస్టీకేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో కొంతమంది, ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్న సమయంలో వాళ్లు బైండోవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్‌స్టేషన్‌లో, పోలీసుల సమక్షంలోనే ఉన్నారు. అయినా వారిమీదకూడా ఎస్సీ, ఎస్టీకేసు పెట్టారు. సాక్ష్యాలు, రుజువులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో వీరిని పోలీసులు వదిలిపెట్టాల్సి వచ్చింది. మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులో రిమాండ్‌కు తరలించారు. ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్లు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే, టీడీపీ కండువా కప్పుకోగానే ఒకర్ని ఈ కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించారు.8. ఇక ఎన్నికల పోలింగ్ రోజున, ఓటింగ్ తగ్గించేందుకు, తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్‌లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడిచేస్తున్నారు. వారిపై దాడులకూ సిద్ధమవుతున్నారు. లైవ్ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసంచేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి.అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడిమీద నమ్మకం ఉంది. ప్రజలమీద నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. -
వైఎస్సార్సీపీ నేత సతీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తనపై దాడి జరగబోతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాడి చేయబోతున్నట్లు టీడీపీ నేతలే తనకు చెప్పారన్నారు. ‘‘నన్ను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే. నాపై దాడి జరిగితే సుమోటోగా స్వీకరించండి. నాపై దాడి జరిగితే లోకేష్, బీటెక్ రవే బాధ్యత వహించాలి’’ అని సతీష్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘నాకు ఏమైనా జరిగితే సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి. ఇక్కడి పోలీసులతో న్యాయం జరగదు. ఎందుకంటే పోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారు’’ అంటూ సతీష్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందులలో జరుగుతున్న వ్యవహారాలు రాష్ట్రాన్ని దిగ్భ్రాంతి కల్గిస్తున్నాయి. పోలీస్, టీడీపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం పోయేలా చేస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం పెళ్లికి వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అది మరువక ముందే మరుసటి రోజు ఒక ఎమ్మెల్సీ, వేల్పుల రాముపై హత్యాయత్నం చేశారు...దాడి చేసిన వారే వైఎస్సార్సీపీ నేతలపై ఎదురు కేసు పెట్టీ ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేశారు. ఒక డీఐజీ స్థాయి అధికారి పత్తి వ్యాపారానికి వెళ్లారా అని మాట్లాడుతున్నాడు. మీరు మాట్లాడే తీరు చూస్తే మీకు కానిస్టేబుల్‌కి ఇచే గౌరవం కూడా ఇవ్వరు. పోలీసులు 100 మీటర్ల దూరంలో ఉండి కూడా మీ పోలీసులు రాలేదు. మీరు లేకపోతే తలకాయలు ఎగిరిపోయేవి అంటున్నారా?. ఇంత పనికిమాలిన వ్యవస్థ అండ చూసుకుని టీడీపీ చెలరేగిపోతోంది. ఇప్పుడు సాక్షి వాహనాలను ధ్వంసం చేస్తామని బెదిరిస్తావా?. కొంత మంది వ్యక్తులు చేస్తున్న పైశాచికాన్ని మీ ప్రభుత్వం కాపాడుతున్నారు..నాకు కూడా భద్రత లేదు.. అయినా ఎన్నికలను జరిపిస్తాం. ఒక వైపు వీళ్లే దాడి చేయడం, ఆ నెపం మాపై నెట్టడం వాళ్లకి రివాజుగా మారింది. నిన్న రాత్రి మా వాళ్లను కొంత మంది అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వాళ్లు ఆ సమయంలో పోలీసు స్టేషన్లోనే ఉన్నారు. ఈ అరాచకాలు భరించలేక ఈ ఎన్నిక వదిలిపెడతాం అనుకుంటున్నారేమో.. మా మహిళలే ముందుండి ఎన్నికలు నడిపిస్తారు. చంద్రబాబు ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏంటి..? మాకు హై కమాండ్ నుంచి ఆదేశాలు అని చెప్తున్నారు..లోకేష్ ఎన్ని దౌర్జన్యాలు చేసైనా పులివెందుల గెలిచి తండ్రికి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాడు. లోకేష్ మీరు అనుచితంగా మాట్లాడితే.. మేము అలానే మాట్లాడతాం. నేను మాట్లాడానని నాపై వేధింపులు చేస్తానంటే భయపడే వారు లేరు. ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ అంశాలు అన్నీ తీసుకెళ్లాం. మీకు ఎన్నిక నిర్వహించలేనప్పుడు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం..?. ఒక గ్రామ ఓటర్లు వేరే గ్రామంలో ఓటు వేయాలా..?. ఈ అరాచకాలు ఆగేటట్లు లేవు...పులివెందుల ఆడబిడ్డలు ముందుండి నడపండి. ఈ ఎన్నిక పులివెందుల పౌరుషానికి, లోకేష్ రెడ్ బుక్ అహంకారానికి మధ్య పోరు. దాని కోసం అక్రమ మార్గాలు, దౌర్జన్యంతో గెలవాలని చూస్తున్నారు..ప్రజలు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, పిల్లలకు వస్తున్న కృష్ణా జలాలను చూడండి. స్వార్థంతో కొంతమంది చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిండి. ఈ 14 నెలల కాలంలో ఈ పులివెందులకు కూటమి ప్రభుత్వం ఏమి చేసిందో గమనించండి. పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 మెడికల్ సీట్లు వెనక్కి పంపిన వాళ్లు పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ నాయకులు, వారికి మద్దతు పలికే నాయకులను ప్రశ్నిస్తున్నా.. మీరు పులివెందులకు ఏమి చేశారు..?.అసలు మీరు ధైర్యంతో పులివెందుల ప్రజల ఓట్లు అడుగుతున్నారు?. ఏమి చూసి మీకు ప్రజలు ఓటు వేయాలి అని ప్రశ్నిస్తున్నా.. పైగా అరాచకాలు, మీడియా వాహనాలు పగలగొడతాం అంటున్నారు. ఒక పెద్ద మనిషిగా ఇవన్నీ ఆపాల్సిన స్థానంలో ఉన్న చంద్రబాబు ఏమీ చేయడం లేదు. చివరి అంకంలో చంద్రబాబు ఇలాంటివి అనుమతించి మరింత చెడ్డపేరు తెచ్చుకుంటారు. మీరు దాడులు, అక్రమాలు చేసి గెలిచినా అది గెలుపు కాదు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. డీఐజీ ఒక ఉన్నత అధికారిగా వ్యవహరించడం లేదు.’’ అంటూ సతీష్‌రెడ్డి మండిపడ్డారు. -
పులివెందులలో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ: వైఎస్సార్సీపీ
సాక్షి, విశాఖపట్నం: పులివెందుల్లో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని కూటమి సర్కార్ పట్టపగలే ఖూనీ చేసిందన్నారు. నల్లగొండువారిపల్లెలో ప్రభుత్వ అండతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు.. చివరికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై కూడా దాడికి దిగడం దారుణమని బొత్స అన్నారు.ఒక శాసనమండలి సభ్యుడికి పోలీసులు కనీస భద్రత కల్పించలేరా..?. వైఎస్సార్సీపీ నేత వేల్పుల రాముతో పాటు పలువురిపైన దాడులు చేశారు. వాహనాలను ధ్వంసం చేసి, పెట్రోల్ పోసి నిప్పంటిస్తామంటూ అరాచకం సృష్టించారు. టీడీపీ గూండాల దాడులకు పోలీసులు మద్దతిస్తున్నారా?. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా.? నియంత పాలనలో ఉన్నామా.?’’ అంటూ బొత్స నిలదీశారు.‘‘సీఎం చంద్రబాబు ఈ ఘటనకు బాధ్యత వహించాలి. పులివెందుల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లా: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో మేము ముందుగా చెప్పినట్లే టీడీపీ అరాచకాలు ప్రారంభమయ్యాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వరుసగా బైండోవర్ కేసులు, కౌన్సిలింగ్ అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను స్టేషన్లకు పిలిపిస్తున్నారు. మా వాళ్ళపై ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. పులివెందులలో హింస చెలరేగిపోతోంది’’ అంటూ రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.కేవలం వైఎస్ జగన్‌ను ఓడించాం అని చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. నిన్న మా వాళ్లు పెళ్లికి వెళ్తే దాడులకు దిగారు. హత్యాయత్నం చేశారు. అందర్నీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రజలని ఓటింగ్‌కి రాకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 16 మందిపై హత్యాయత్నం కేసు పెట్టామన్నారు. వాళ్లను అరెస్ట్ చేశారా..?. దేనికోసం వారు ఈ దాడులకు దిగుతున్నారు అనేది బయటకు చెప్పాలి. వెంటనే వారిని రిమాండ్‌కి పంపండి. ఇవాల మరొక నాయకుడు వేల్పుల రాముపై దాడికి దిగారు....ప్రజాస్వామ్యంలో ఇది సక్రమమైన పద్ధతేనా..? ప్రజలు దీన్ని హర్షిస్తారా..?.. పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తే ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతాయి..?. రానున్న రోజుల్లో హత్యలు కూడా చేయడానికి వెనుకాడరు. ఈ హింసను ప్రజలు, పులివెందుల ఓటర్లు గమనించాలి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. -
పులివెందులలో పచ్చ అరాచకం.. వైఎస్సార్సీపీ నేతలపై బైండోవర్
సాక్షి,వైఎస్సార్: పులివెందులలో పచ్చ నేతల అరాచకం తారాస్థాయికి చేరుకుంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తాము ఓడిపోతామనే అసహనానికి గురైంది. అధికారబలాన్ని ఉపయోగించి వైఎస్సార్సీపీ కీలక నాయకులను అరెస్ట్ చేసి బైండోవర్ కేసులు నమోదు చేస్తోంది.ఎటువంటి కేసులు లేకపోయినా కావాలని బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. నల్లపురెడ్డిపల్లికి చెందిన భాస్కర్ రెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ అంటూ స్టేషన్‌కు తరలించింది. మంగళవారం ఎన్నిక జరిగే పులివెందుల మండలానికి సంబంధం లేని లింగాల రామలింగారెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ నమోదు చేసింది. ఇలా ఈ రెండు రోజుల్లోనే 100 మందికి పైగా వైఎస్సార్సీపీ నాయకులను బైండోవర్ చేసింది. మరో వైపు కూటమి శ్రేణులు.. వైఎస్సార్సీపీ నేతలపై ప్రత్యక్ష దాడులకు తెగబడుతున్నారు. వివాహానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడి చేశారు. హత్యా యత్నానికి ప్రయత్నించారు. కాగా, పులివెందులలో విచ్చలవిడిగా టీడీపీ మూకలు చెలరేగిపోతున్నా .. పోలీసులు కట్టడి చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రొద్దుటూరులో ఘరానా మోసం.. సచివాలయ ఉద్యోగస్తులమంటూ..
ప్రొద్దుటూరు క్రైం: వృద్ధాప్య పింఛన్‌ను దివ్యాంగుల పింఛన్‌కు మారుస్తానని నమ్మించిన ఓ మోసగాడు 5 తులాల బంగారు నగలతో ఉడాయించాడు. ఈ ఘటన ప్రొద్దుటూరులోని చోటు చేసుకుంది. బద్వేలి గురివిరెడ్డి, లక్ష్మీదేవి వృద్ధ దంపతులు. నెహ్రూరోడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. లక్ష్మీదేవికి వచ్చే వృద్ధాప్య పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సచివాలయం నుంచి వచ్చానని ఒక వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. మీకు వస్తున్న వృద్ధాప్య పింఛన్‌ను దివ్యాంగుల పింఛన్‌గా మార్పు చేయడానికి వచ్చానని నమ్మబలికాడు.వృద్ధాప్య పింఛన్ కంటే దివ్యాంగుల పింఛన్‌కు ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పడంతో వృద్ధ దంపతులు సంతోషించారు. వెంటనే ఆథార్ కార్డు తీసుకొని వెళ్తే మున్సిపల్ ఆఫీసులో ఒక సర్టిఫికెట్ ఇస్తారని అతను వారితో అన్నాడు. ఆ సర్టిఫికెట్‌ను తెచ్చి సచివాలయంలో ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గురివిరెడ్డి మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లాడు. అతను వెళ్లగానే లక్ష్మీదేవి ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు.ఫొటో అప్డేట్ చేయాలని చెప్పి వృద్ధురాలికి ఫోటో తీసేందుకు సెల్‌ఫోన్ బయటికి తీశాడు. ఆమె ఒంటిమీద బంగారు నగలు ఉండటంతో వాటిని తీయమని చెప్పాడు. నగలతో ఫొటో దిగితే పింఛన్ రాదని, నగలను పక్కన పెట్టాలని చెప్పాడు. దీంతో ఆమె బంగారు గాజులు, ఇతర నగలను తీసి కిచెన్ రూంలో పెట్టింది. ఫొటో తీయమని ఆమె చెప్పగా ఇక్కడ చీకటిగా ఉందని ఫొటో సరిగా రాదని చెప్పి ఆమెను బెడ్ రూం సమీపంలోకి తీసుకెళ్లాడు.ఇదే అదునుగా భావించిన ఆ అగంతకుడు లక్ష్మీదేవిని బెడ్రూంలోకి తోసేసి గడియ పెట్టాడు. కిచెన్ రూంలో ఉన్న నగలను తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో బయట ఉన్న వ్యక్తులు గడియ తీశారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి బంగారు నగలను దోచుకెళ్లాడని ఆమె బోరునా విలపించింది. లక్ష్మీదేవి ఐదు తులాల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తి దోచుకెళ్లాడని త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హనుమంతు తెలిపారు. -
గండికోట బాలిక కేసులో మరో కొత్త మలుపు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: గండికోటలో బాలిక హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ప్రియుడు లోకేష్.. బాలికను హత్య చేయలేదని కర్నూలు రేంజ్ డీఐజీ తేల్చి చెప్పారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. మరో వైపు బాలిక సోదరుడే హత్య చేశాడంటూ చేస్తున్న ప్రచారం దారుణమని తల్లిదండ్రులు అన్నారు. ఎవరైనా చెల్లిని వివస్త్రను చేసి హత్య చేస్తాడా అంటూ ప్రశ్నించారు. బాలిక సోదరుడు సురేంద్ర పరువు కోసం హత్య చేశాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సురేంద్ర పాత్రను తల్లిదండ్రులు కొట్టి పారేస్తున్నారు.లోకేష్‌ని ఎన్కౌంటర్ చేయాలి: వైష్ణవి తల్లితన బిడ్డను హత్య చేసిన వారిని ఎన్కౌంటర్ చేయాలంటూ వైష్ణవి తల్లి పసుపులేటి దస్తగిరమ్మ అన్నారు. నా బిడ్డను కోల్పోయిన బాధలో నేనున్నా.. కొన్ని మీడియా ఛానళ్లు మా పై పనిగట్టుకొని వార్తలు రాస్తున్నాయి. మేమి చెప్పినవి వేయడం లేదు. ఇష్టం వచ్చినట్లు మాపై నిందలు వేస్తున్నారు. పాప కనిపించడం లేదని తెలిస్తే వెతుకులాడటం మేము చేసిన తప్పా.సొంత చెల్లెలిని అన్న చంపుతాడా? సొంత చెల్లెలిని అన్న చంపుతాడా? మరీ ఇంత క్రూరంగా వివస్త్రను చేసి చంపుకుంటామా...? అత్యాచారం జరగలేదంటే పాప ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయి.?పోలీసులు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపాలి. నిజానిజాలు తెలియపరచాలి. మాకు న్యాయం జరగాలి. అనుమానితున్ని తెలియపరిచాం. లోకేషే నా బిడ్డను చంపాడు. మాకు న్యాయం జరగాలంటే లోకేష్‌ని ఎన్కౌంటర్ చేయాలి. నాకు జరిగిన అన్యాయం ఇంకో తల్లికి జరగకూడదు’’ అంటూ వైష్ణవి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.కర్నూల్ రేంజీ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న గండికోటలో విద్యార్థి వైష్ణవి హత్య కేసులో ప్రియుడు లోకేష్ పాత్ర లేదని.. బాలికపై ఎటువంటి హత్యాచారం జరగలేదన్నారు. మాకు ఇవాళ కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభించాయి. రాత్రి 9.00 గంటలకు జిల్లా ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీ పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తారు’’ అని ఆయన తెలిపారు. -
గండికోటలో దారుణం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడి.. హత్య చేశాడు. బాలికను బైక్‌పై గండికోట తీసుకొచ్చిన ఎర్రగుంట్లకి చెందిన లోకేష్.. గండికోటలోని ధాన్యాగారం వద్ద దారుణానికి ఒడిగట్టాడు. బాలికను వివస్త్రగా విడిచిపెట్టి వెళ్లాడు.బాలిక ప్రొద్దుటూరులోని ఓ ఇంటర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ అశోక్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. -
పులివెందుల పోలీసులకు ఏపీ హైకోర్టు షాక్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల పోలీసులకు హైకోర్టులో మరోమారు చుక్కెదురైంది. కేసుకు సంబంధం లేని సెక్షన్లను ఎలా పెడతారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఆవేదనతో 7వ తేదీ రాత్రి వేంపల్లి వాసులు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. తోపులాటలో పోలీసు స్టేషన్ కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 200 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టులు చేస్తున్నారు.హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పోలీసులు.. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు. దీంతో బాధితులు.. హైకోర్టును ఆశ్రయించారు. పులివెందుల పోలీసుల తీరుపై మండిపడిన హైకోర్టు.. స్టేషన్‌ను చుట్టుముడితే హత్యాయత్నం ఎలా అవుతుందంటూ ప్రశ్నించింది. వెంటనే ఆ సెక్షన్ తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దాడికి పాల్పడి ఉంటే సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి.. ఆ తర్వాత 41ఏ నోటీసులిచ్చి విచారించాలని హైకోర్టు తెలిపింది. నిన్నటి నుంచీ అరెస్టులు చేస్తున్న పోలీసులు.. ఇప్పటికీ దాదాపు 70 మందిని వరకూ అరెస్ట్ చేశారు. -
వైఎస్ జగన్ సోషల్ మీడియా పోస్టు.. దెబ్బకు దిగొచ్చిన కూటమి ప్రభుత్వం
సాక్షి,వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా పోస్టుకు కూటమి ప్రభుత్వం దిగివచ్చింది. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో మెరిట్ విధానంలో అడ్మిషన్స్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.మంగళవార ఇడుపులపాయ సమీపంలోని వీరన్నగట్టుపల్లె వద్ద మంగళవారం డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తమ భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తోందని విద్యార్థులు ఆయనకు వివరించారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. డాక్టర్ వైఎస్సార్ ఏఎఫ్‌యూ విద్యార్థులకు అండగా నిలుస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.ఈ మేరకు ఈ ప్రభుత్వం నిద్రాణ స్థితి నుంచి మేల్కొంటుందని ఆశిస్తున్నాను.. మేలుకో బాబూ’ అంటూ సీఎం చంద్రబాబుకు చురకలంటిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దీంతో ఇవాళ హడావిడిగా తప్పుల తడకలతో నేరుగా అడ్మిషన్స్ అంటూ ఆదేశాలు జారీ చేసింది. -
వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చింతలమడుగు పల్లెకు చెందిన సయ్యద్ సుమయ(18) మిస్సింగ్‌కు సంబంధించి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు స్థానిక ప్రజలు. ఆమె గొర్రెలు మేపుతుండగా ఐదు మంది యువకులు సుమయాను చుట్టుముట్టారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే వారిని తమకు అప్పగించాలని స్థానికులు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఆమెను చంపేశారా.. తప్పిపోయిందా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అడవి మొత్తం గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. పోలీస్ స్టేషన్ ఎదుట కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
పులివెందులలో వైఎస్ జగన్
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనకు పులివెందులకు చేరుకున్నారు. ఈ మేరకు పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్‌ను చూసేందుకు అభిమాన సంద్రం పోటెత్తింది. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బర్ నిర్వహించారు. వైఎస్ జగన్‌కు తమ సమస్యలు విన్నవించారు ప్రజలు. వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్.. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ రోజు స్థానిక ప్రజలతో పాటు, నాయకులను వైఎస్ జగన్ కలిశారు.. రేపు(జూలై 8) వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు వైఎస్ జగన్. అనంతరం తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు.. -
పులివెందుల పోలీసులకు చుక్కెదురు
పులివెందుల: వైఎస్సార్ జిల్లా కడపలో ఇటీవల జరిగిన మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు పులివెందుల రింగ్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహాల చుట్టూ టీడీపీ పచ్చ తోరణాలు, జెండాలు కట్టిన విషయంపై తలెత్తిన వివాదంలో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా బనాయించిన కేసుల విషయంలో పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురైంది. వివరాలివీ..అప్పట్లో వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలు కట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేతలు వాటిని తొలగించాలని కోరుతూ పులివెందుల మున్సిపల్ కమిషనర్‌తోపాటు, డీఎస్పీకి వినతిపత్రాలు సమర్పించారు. వీరు స్పందించకపోవడంతో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు వాటిని తొలగించారు. దీన్ని సాకుగా చూపి హోంమంత్రి ద్వారా పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి ఆదేశాలతో ఓ టీడీపీ నాయకుడితో వారిపై ఫిర్యాదు చేయించారు. దీంతో.. టీడీపీ నేతపై దాడిచేసినట్లు వైఎస్సార్సీపీ వారిపై అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయించారు.పోలీసులు వారిని అరెస్టు చేయడంతోపాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో.. పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వైఎస్సార్సీపీ నాయకులు జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌కు తెలిపారు. వారికి మెడికల్ టెస్టులు నిర్వహించాలని మేజిస్ట్రేట్ ఆదేశించగా.. వారిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పోలీసులతోపాటు టీడీపీ నాయకులు డాక్టర్లపై ఒత్తిడి తెచ్చి దెబ్బలులేనట్లుగా రిపోర్టులు ఇప్పించారు. దీనిపై నిందితులు మళ్లీ హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీవ్రంగా స్పందించి వారికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ టెస్టులు నిర్వహించాలని, నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించింది.పులివెందుల పోలీసుల ఓవరాక్షన్..ఇక ఈ మెడికల్ టెస్టుల్లో తమకు వ్యతిరేకంగా నివేదిక వస్తుందనే అనుమానంతో పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, అర్బన్ సీఐ చాంద్ బాషా, రూరల్ సీఐ వెంకటరమణ కర్నూలులో మకాంవేసి అధికార పార్టీ నేతల ద్వారా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అంతేకాక.. కర్నూలు డీఎస్పీ కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని రిపోర్టులను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పైగా.. కర్నూలు సూపరింటెండెంట్‌తో పాటు వీరంతా కలిసి ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.ఈ వీడియోలో మీడియా కంటపడకుండా సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తన ముఖం చాటేయడం కనిపించింది. వీటి ఆధారంగా పిటిషనర్లు మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక.. తమకు తగిలిన గాయాలను ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా గాయాలున్నట్లు తేలిన నివేదికను కోర్టుకు సమర్పించారు. దీంతో.. హైకోర్టు ఈ వారంలోగా వారికి తిరుపతి స్విమ్స్ కేంద్రంగా మళ్లీ మెడికల్ టెస్టులు నిర్వహించాలని పులివెందుల అర్బన్ సీఐ చాంద్ బాషాను ఈనెల 1న ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను గురువారం ఆయనకు అందజేశారు. -
ఎలక్ట్రిక్ స్కూటీ పేలి మహిళ మృతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ స్కూటీ పేలి మహిళ మృతి చెందింది. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో తెల్లవారుజామున ఇంటి ఆవరణంలో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ స్కూటీ పేలిపోయింది. పక్కనే సోఫాలో నిద్రిస్తున్న ఉండేలా వెంకటలక్ష్మమ్మ(62) మంటల్లో కాలిపోయింది. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఎలక్ట్రిక్ స్కూటర్లు బాంబుల్లా పేలిపోతున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. బ్యాటరీలు కారణంగానే బ్లాస్ట్ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ నిర్వహణ సరిగా చేయకపోవడం, ఛార్జింగ్ పెట్టడంలో తప్పుడు పద్ధతులు కారణంగా బ్యాటరీలు పేలతాయని అంటున్నారు. -
వైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ కక్షసాధింపు చర్యలు
వైఎస్సార్ జిల్లా: జిల్లాలో టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. బద్వేల్ మండలం బయనపల్లిలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఇంటిని కూల్చేందుకు రెవెన్యూ అధికారులు యత్నిస్తున్నారు. రాత్రి సమయంలో అక్కడకు చేరుకుని ఇంటిని కూల్చేందుకు రెవెన్యూ సిబ్బంది యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. చెరువు ల్యాండ్‌లో ఇల్లు నిర్మించారని ఆరోపిస్తూ.. ఆ ఇంటిని కూలగొట్టేందుకు రాత్రి సమయంలో అధికారులు రావడంతో ఇది సరైన చర్య కాదని వైఎస్సార్సీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నోటీసు ఇవ్వకుండా ఇల్లును ఎలా కూలుస్తారంటూ అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. -
ఆ ముగ్గురు చేతులెత్తేశారు: సతీష్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: హామీల అమలుపై ప్రజలు కూటమి నేతల చొక్కాలు పట్టుకుని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాము చెప్పినవన్నీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. లేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయాలన్న లోకేష్ మాటలను ఇప్పుడు ఆచరణలో చూపించేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారన్నారు.వారికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. నిత్యం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై కుట్ర రాజకీయాలు చేయడం తప్ప ఈ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన ఒక్క మంచిపని కూడా లేదని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. ప్రజలను నమ్మించేందుకు బాండ్లు తయారు చేసి, వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి మరీ ప్రజలకు అందించారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఈ హామీలు ఎలా చేయాలో తమ వద్ద ప్రణాళిక ఉందని, సూపర్ సిక్స్ అమలు చేయకలేకపోతే తన కాలర్ పట్టుకోవాలని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ సవాల్ విసిరాడు. కానీ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక ఏడాదిలోనే ఈ ముగ్గురూ చేతులెత్తేశారు.ఈ చేతకాని చంద్రబాబు పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దేశంలోనే అధ్వాన్నంగా తయారైంది. ప్రతినెలా జీఎస్టీ వసూళ్లు చూస్తే నెగిటివ్ గ్రోత్ రేట్ కనిపిస్తుంది. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి మదనపల్లె ఫైల్స్, తిరుమల లడ్డూలో కొవ్వు కలిసిందని, ప్రకాశం బ్యారేజ్‌కి బోట్లు అడ్డం పెట్టారని, కాకినాడ నుంచి రేషన్ బియ్యం అక్రమ సరఫరా అని.. డైవర్షన్ పాలిటిక్స్‌తోనే సరిపోయింది. కూటమి నాయకుల దుష్ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్ గురించి ప్రజల్లో స్పష్టమైన అవగాహన వచ్చేసింది. వైఎస్ జగన్ పర్యటనలకు వచ్చే ప్రజాస్పందనే దీనికి నిదర్శనం.రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే తత్వం చంద్రబాబుదిరాజకీయ మనుగడ కోసం ఎంతకైనా దిగజారే మనిషి చంద్రబాబు తప్ప ఇంకెవరూ ఉండరు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఆయన కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతిచెందాడని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. వారు చెబుతున్నదే నిజమైతే, నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఇచ్చి ఉంటే, రోప్ పార్టీ ఉంటే ఇటువంటి ప్రమాదం జరుగుతుందా? వైఎస్ జగన్ ఏ పర్యటన వీడియోలు చూసినా పోలీసు భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించాల్సిందిపోయి ఆయన పర్యటనలకు ప్రజలు రాకుండా అడ్డుకోవడానికి వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లకు పోలీసులను పంపిస్తున్నారు. సత్తెనపల్లిలో జరిగిన ప్రమాదాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చంద్రబాబు కుట్రలు చేయడం ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ట. దివంగత మహానేత వైఎస్సార్ సీఎంగా ఉండగా బాలకృష్ణ ఇంట్లో నిర్మాత బెల్లకొండ సురేష్ పై కాల్పులు జరిగిన విషయాన్ని చంద్రబాబు గుర్తు తెచ్చుకోవాలి. నందమూరి కుటుంబం పట్ల ఆరోజు సీఎంగా ఉన్న వఘెస్సార్ హుందాగా వ్యవహరించారే కానీ అవకాశాన్ని చౌకబారు రాజకీయాలకు వాడుకోవాలని చూడలేదు. కానీ చంద్రబాబు మాత్రం సత్తెనపల్లిలో జరిగిన ప్రమాదాన్ని కూడా నేరంగా చిత్రీకరించాలని చూడటం దుర్మార్గం.రాయలసీమపై చంద్రబాబుకు ప్రేమలేదుబనకచర్ల ప్రాజెక్టును కడతామంటే రాయలసీమ వాసులుగా మేమంతా సమర్థిస్తాం. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఈ ఏడాది కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక్క రూపాయైనా ఖర్చు చేశారా? ఒక్క పిడికెడు మట్టయినా తీసుంటే చూపించాలి. చంద్రబాబుకి నిజంగా రాయలసీమ అభివృద్ధి మీద బాధ్యత ఉంటే జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింకప్ ప్రాజెక్టుకి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే పూర్తవుతుంది. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. దాదాపు రూ. రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్లో రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించలేకపోయారు.రూ.వెయ్యి కోట్లతో అయిపోయే ప్రాజెక్టులను పూర్తి చేయకుండా రూ.40 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను చేపడతానని చెబితే గుడ్డిగా నమ్మడానికి రాయలసీమ వాసులు సిద్ధంగా లేరు. పూర్తయ్యే స్థితిలో ఉన్న ప్రాజెక్టుల్లో భారీగా కమీషన్లు రావు కనుక, కొత్త ప్రాజెక్టులైతే దోచుకోవచ్చనేది చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబు సీఎం అయ్యాక కూటమి పాలనలో అన్ని వ్యవస్థల్లో అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి అవినీతిమయం చేశారు కాబట్టే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడితప్పిపోయాయి.అన్ని వ్యవస్థల్లో వేళ్లూనుకునిపోయిన అవినీతి కారణంగా, కమీషన్లు ఇచ్చుకోలేక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలెవరూ ముందుకు రావడం లేదు. కూటమి పాలనలో కట్టబెట్టిన టెండర్లన్నీ సమీక్ష చేస్తే భారీగా అవినీతి బయటపడుతుంది. ఆయన పిలిచిన టెండర్లను 20 శాతం తక్కువకి ఇస్తే ఆ పనులు చేసేదానికి ఎంతో మంది సిద్దంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పార్టీ కార్యకర్త వరకు అవినీతి అజెండా పాలన సాగుతోంది. విజయవాడకి వరదలొస్తే ఆ సందర్భాన్ని కూడా అవినీతికి వాడుకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.30 కోట్లు కేటాయించారంటే ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోదీని మెప్పించడం కోసం ఒక పూట చేసిన యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించి రూ. 300 కోట్లు ప్రజాధనం వృథా చేశాడు. -
అక్రమ కేసులపై మరోసారి కూటమి సర్కార్‌కు చుక్కెదురు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అక్రమ కేసులపై మరోసారి కూటమి ప్రభుత్వానికి చుక్కెదురైంది. పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి జెండాలు తొలగించిన అంశంపై రెండు హత్యాయత్నం కేసులను పులివెందుల పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్‌తో పాటు 18 మందిపై తప్పుడు కేసులను నమోదు చేశారు.వైఎస్సార్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలను తొలగిస్తే.. హత్యాయత్నం చేసినట్లు టీడీపీ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేశారు. విచారణ చేయకుండానే పోలీసులు కేసులు నమోదు చేశారు. 13 మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసిన పోలీసులు.. ఆ తర్వాత రిమాండ్‌కు పంపించారు. తాజాగా ముగ్గురు బాలురుతో సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులు కూడా టీడీపీ వారిపై హత్యాయత్నం చేశారంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు.బాలురుపై హత్యాయత్నం కేసు పెట్టి జువైనల్ హోమ్‌కు పోలీసులు తరలించారు. ఈ రెండు కేసులపై హైకోర్టుకు వెళ్లిన బాధితులు.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టుకు నివేదించారు. రెండు కేసుల్లో విచారణను వెంటనే నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. తప్పుడు ఫిర్యాదులపై వేధింపులకు గురిచేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. -
పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్‌కు బెయిల్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్‌కు బెయిల్ మంజూరైంది. వరప్రసాద్ సహా 13 మందికి కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ నాయకుల తప్పుడు ఫిర్యాదుతో వారిని పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు.వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలు కట్టారని పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ జెండాలు, తోరణాలను వైఎస్సార్ విగ్రహం వద్ద తొలగించారు. అయితే, వాటిని తొలగించినందుకు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు అత్యుత్సాహంతో హత్యాయత్నం కేసును వైఎస్సార్సీపీ నాయకులపై నమోదు చేసిన విషయం తెలిసిందే.అధికార పార్టీ అండదండలతో తమను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారంటూ వైఎస్సార్సీపీ నాయకులు జడ్జికి వివరించారు. అరెస్టయిన వారితో పాటు కేసులో ఉన్న ఇతరులకు కూడా కడప జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి పులివెందులలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. -
మంత్రి సొంత జిల్లాలోనే ఇలానా.. చేతులెత్తేసిన కూటమి సర్కార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే దారుణం జరిగింది. మైదుకూరులో పట్టపగలే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళం పడింది. నిర్వహణ చేతకాక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తనిఖీకి వెళ్లిన సందర్భంలో తాళం వేసిన ఆసుపత్రి దర్శనమిచ్చింది.వైఎస్ జగన్ హయాంలో మంచి భవనాలు కట్టించి.. సిబ్బంది ఏర్పాటు చేశారు. అన్ని వసతులు సమకూర్చినా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వహించడం చేతకాక తాళం వేశారు. సిబ్బంది తాళం వేసుకుని వెళ్లిపోయారంటూ టీడీపీ ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్ నానా హంగామా చేశారు. డీఎం అండ్ హెచ్‌వోకి ఫిర్యాదు చేశారు. వెంటనే సిబ్బందిని సస్పెండ్ చేయాలంటూ హుకుం జారీ చేశారు.సొంత పార్టీ ఎమ్మెల్యే తనిఖీలోనే కూటమి ప్రభుత్వ చేతగానితనం బట్టబయలైంది. కనీసం మండల స్థాయిలో ఉన్న పీహెచ్‌సీని కూడా నిర్వహించలేని కూటమి సర్కార్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విఫల మంత్రి అంటూ కామెంట్లు పెడుతున్నారు -
వైఎస్సార్ జిల్లాలో విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నీటి సంపులో పడి ఇద్దరు పిల్లలు మృతిచెందారు. మృతులు ఇద్దరు పిల్లలను నాగసానీపల్లెకు చెందిన వారిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. చక్రాయపేట మండలం బాలతిమ్మయ్య గారి పల్లెలో విషాదం నెలకొంది. మామిడి తోటకు కాపలాగా ఉన్న ఇద్దరు పిల్లలు నీటి సంపులో పడి సోమవారం ఉదయం మృతి చెందారు. మృతులు ఖాజీపేట మండలం నాగసానీ పల్లెకు చెందిన వారిగా గుర్తించారు. అయితే, పిల్లలు ఇద్దరు బతుకు దెరువు కోసం కాజీపేట నుండి చక్రాయపేటకు వచ్చినట్టు తెలుస్తోంది. చిన్నప్పుడే పిల్లల తండ్రి చనిపోవడంతో మేనమామ దగ్గర పెరుగుతున్నారు. -
వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైఎస్ జగన్.. నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన నారాయణరెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో ఆయన పరువు పోయిందని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అరెస్టు సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులు తీవ్రంగా హింసించారని వైఎస్ జగన్‌కు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పూలు అమ్ముకుని జీవించే నారాయణరెడ్డి మరణంతో భార్య, ఇద్దరి పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారింది. అధైర్య పడొద్దని కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చారు. వారి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
అక్రమ కేసు పెట్టి..
ఖాజీపేట: పోలీసుల వేధింపులు.. తప్పుడు కేసుకు ఒక నిండు ప్రాణం బలైపోయింది. వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యకు కారణమైంది. తీవ్ర మానసిక వేదనకు గురైన అతను ఏకంగా విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుని బంధువుల, స్థానికుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి పేకాట ఆడుతున్నట్లు అనుమానించి మే 6న ఖాజీపేట పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అతనితోపాటు మరో 9 మందిని పిలిపించి విచారణ చేపట్టారు.తాము పేకాట ఆడలేదని వారు చెప్పినా.. పోలీసులు వినిపించుకోలేదు. రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డిని పోలీసులు తీవ్రంగా వేధించారు. అనంతరం అతనితోపాటు విచారణకు వచ్చిన అందరినీ ఇంటికి పంపించారు. 7,8 తేదీల్లో స్టేషన్‌కు మళ్లీ విచారణ పేరుతో పిలిపించారు. 9న వారి పై పేకాట కేసుతోపాటు గంజాయి కూడా అమ్ముతున్నట్లు తప్పుడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి తోపాటు మరో 8 మందిని నిందితులుగా చూపుతూ, వారి వద్ద నుంచి 2.570 కిలోల గంజాయితోపాటు రూ 20,500 నగదు 52 పేకముక్కలు దొరికినట్లు చూపించారు. తనకు సంబంధంలేని గంజాయి కేసులో అరెస్టయిన శివలక్ష్మినారాయణరెడ్డి మే 29న బెయిల్‌పై బయటకు వచ్చారు.తన భార్య సుభాషిణికి జరిగిన విషయం వివరించారు. ఖాజీపేట సీఐ మోహన్ తనను అక్రమంగా పేకాట, గంజాయి కేసులో ఇరికించారని ఆవేదన చెందారు. తనను చిత్ర హింసలకు గురిచేసినట్లు చెప్పారు. తగిలిన దెబ్బలను భార్యకు చూపించి తీవ్ర మనోవేదన చెందారు. సీఐ మోహన్‌పై ప్రైవేటు కంప్లయింట్ వేసి కోర్డులోనే న్యాయం కోరదామని ఆమె నారాయణరెడ్డికి సర్ది చెప్పే యత్నం చేశారు. ఆయన బుధవారం మైదుకూరులో జరిగిన వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.జరిగిన అన్యాయాన్ని అక్కడ వైఎస్సార్సీపీ నాయకులకు చెప్పి బాధపడ్డాడు. తీవ్ర మనోవేదనతో రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు పోయి పుప్పగిరి వెళ్లే దారిలో ఉన్న సబ్‌స్టేషన్ మెయిన్ తీగలను పట్టుకుని విద్యుదాఘాతానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎంతకూ ఇంటికి రాక పోవడంతో భార్యతోపాటు బంధువులు వెతికారు. చివరకు సబ్‌స్టేషన్‌లో విద్యుత్ తీగ పట్టుకుని చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. సీఐ మోహన్‌పై మృతుడి భార్య ఫిర్యాదుఖాజీపేట సీఐ మోహన్ తన భర్త నారాయణరెడ్డిని డబ్బుల కోసం, వేధించారని, డబ్బులు ఇవ్వక పోవడంతో అక్రమంగా కేసు నమోదు చేసి జైలుకు పంపి తన భర్త మృతికి కారణమయ్యాడని సుభాషిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త ఆత్మహత్యకు కారణమైన సీఐ మోహన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు ఎస్పీ అశోక్ కుమార్‌ను కలిశారు. సీఐది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని నాయకులకు ఎస్పీ భరోసా ఇచ్చారు. అనంతరం దుంపలగట్టు గ్రామంలో జరిగిన లక్ష్మీనారాయణరెడ్డి అంత్యక్రియల్లో నాయకులు పాల్గొన్నారు. -
టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సీమరాజా దౌర్జన్యం
-
వైఎస్సార్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో..
సాక్షి, వైస్సార్ జిల్లా: జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఉరివేసి చంపిన భర్త.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నూరు పట్టణంలో ఈ ఘటన జరిగింది. బంధువుల సమాచారం ప్రకారం.. కొత్త గాంధీనగర్ చెందిన వల్లెపు నిత్యానంద్ 11 రోజుల క్రితం కువైట్ నుంచి స్వగ్రామానికి నిత్యానంద తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానంతో చిన్నపాటి తగాదాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున నిత్యానంద్ తన భార్య లక్ష్మీకుమారితో గొడవపడ్డాడు. దీంతో భార్యకు ఉరివేసిన భర్త.. తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులకు ఇద్దరు కుమార్తెలు గంగా మేఘన (8) గంగా మౌనిక (5) ఉన్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న సీఐ కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు. -
లోకేష్ బెదిరింపులకు ఎవరూ భయపడరు: సతీష్‌కుమార్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్.. కడప జిల్లాకు సేవచేసి అభివృద్ధి పథంలో నడిపించారు.. అటువంటి మహనీయుడు విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా..? అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సున్నితంగా ఇది తప్పు అని పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. దీంతో అక్కడి ప్రజలు ఆ జెండాలను పక్కన పెట్టారు. ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉంది’’ అంటూ సతీష్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు.‘‘అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి ఇష్టారీతిన కొట్టారు. ఆ పోలీసులకు టీడీపీ నాయకులు జీతాలు ఇస్తున్నారా...?. మేము అతన్ని పోలీసుగా కాకుండా రౌడీగా పరిగణిస్తాం. మీ పరిధి దాటి మీరు రౌడీగా ప్రవర్తిస్తే మేము సహించాలా..?. తప్పు చేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మొన్న యువకులను నడిరోడ్డుపై ఇష్టారీతిన కొట్టారు. కొందరు అధికారులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు. రేపు వైఎస్సార్సీపీ గెలిచాక ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది..?. మహానాడులో వైఎస్సార్సీపీ వాళ్లకు తడిసిపోతుంది అంటున్నారు. మాకు కాదు తడిసిపోయేది.. మీ కార్యకర్తలకు తడిసిపోతుంది. ..ఇది తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబు కూడా వైఎస్సార్సీపీ వారికి ఏ పథకం ఇవ్వొద్దు అంటున్నాడు. మీరు తెస్తున్న ఈ సంస్కృతి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది..?. గతంలో నేను టీడీపీలో ఉండి మీటింగు పెడితే ఒక కల్యాణ మండపం కూడా నిండలేదు. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి వస్తారు. అది బలుపు కాదు వాపు.. నువ్వు కడపలో పెట్టీ మాట్లాడాలంటే నువ్వు రద్దు చేసిన మెడికల్ సీట్ల గురించి చెప్పాలి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి ప్రజల నెత్తిన భారం వేస్తున్నావు..ఏంటి తడిసిపోయేది లోకేష్.. ఏమి చేయగలవ్.. అరెస్ట్ చేయించి కొట్టిస్తావు అంతేగా.. ఆ తర్వాత నీ పరిస్థితి ఎంతో ఆలోచించుకో.. నీ కార్యకర్తల పరిస్థితి ఏంటో గుర్తు చేసుకో. మీరు, ఎమ్మెల్యేలు చేస్తున్న దోపిడీ నుంచి మీరు తప్పించుకునే అవకాశమే లేదు. మీరు భయపడితే ఇక్కడ ఎవరు భయపడరు. ఈ ఏడాది కాలంలో నువ్వు చేసింది పింఛన్ పెంపు మాత్రమే. అదీ ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదు. గ్యాస్ లబ్ది ఏ ఊరికి వెళ్ళైనా అడుగుదాం... సగానికి పైగా అందలేదు. నువ్వు ఎంతమందిని జైల్లో వేయగలవు లోకేష్..?..లక్ష కోట్లు ఒక్క రాజధానికి పెట్టడం సమంజసమా..?. నువ్వు తీసుకునే లక్ష కోట్లా అప్పు.. అమరావతి వాళ్లే కడతారా..?. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ ఆ అప్పు కట్టాలి. ఎన్టీఆర్ కంటే మహానాడులో జగన్ నామ స్మరణ మాత్రమే చేశారు. జగన్ బయటకు వెళితే జనం రాకతో రోడ్లు పట్టడం లేదు.. అదే జగన్ అంటే.. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో.. మేము కూడా జైలు బరో చేస్తాం. నీకు, నీ కొడుకుకి వినాశ కాలే విపరీత బుద్ధి అన్నట్లుంది’’ అని సతీష్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. -
కోవర్టులంటూ కొత్త కుట్ర రాజకీయం!
ప్రతిపక్ష పార్టీలపై కొత్త కొత్త ఆరోపణలు చేయడం.. ప్రతి చెడు ఘటనను కూడా వారికి ఆపాదించేలా చేయడంలో చంద్రబాబు దిట్ట. ఎల్లోమీడియా అండ ఎలాగూ ఉంది కాబట్టి ఆయనకు ఈ పని మరింత సులువు అవుతుంది. తాజాగా ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారిని కోవర్టులంటూ వ్యాఖ్యానించి ఒక సంచలనం సృష్టించారు. ఇటీవలి మహానాడు సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు తన పార్టీ అంతర్గత వ్యవహారాలనూ వైసీపీకి పులిమే ప్రయత్నం చేయడం ఆయన వక్రబుద్ధిని చెబుతోంది. ఈ మధ్య టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు కాస్తా హత్యలకూ దారితీస్తున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ వారు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసినా, హత్యలకు పాల్పడ్డా లోకేశ్ తీసుకొచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం బాగానే అమలవుతోందంటూ ఆ పార్టీ నేతలు సంబరపడ్డారు. కానీ తమ పార్టీ నేతలను తమవారే హత్య చేస్తున్నారన్నది వారు కూడా ఊహించి ఉండరు.కొంతకాలం క్రితం ఒంగోలు ప్రాంతం మద్యం సిండికేట్, ఇతర దందాల్లో తలెత్తిన గొడవల నేపథ్యంలో బాపట్ల జిల్లాలో స్థానిక టీడీపీ నేత చౌదరి హత్యకు గురయ్యారు. వెనుక ఉన్నది టీడీపీ వారేనని పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తి ఏ రకంగా సన్నిహితుడో తెలియదు కానీ.. చంద్రబాబు స్వయంగా ఆయన అంతిమక్రియలకు హాజరయ్యారు. ఆ సందర్బంలోనూ వైసీపీ నేతలపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు అప్పటికే టీడీపీ నేతల పాత్రను తేల్చేశారు. అయితే చంద్రబాబు అప్పుడైనా ఇలాంటి పనులకు పాల్పడరాదన్న హితవు పలకడానికి బదులు వారికి దన్నుగా నిలిచినట్లు వ్యవహరించారు. మాచర్ల వద్ద జరిగిన ఇంకో ఘటనలోనూ ఇద్దరు టీడీపీ నేతల మధ్య గొడవతో హత్య జరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం సరే పనికట్టుకుని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కూడా కేసు నమోదు చేశారు. ఇది ఆ ప్రాంత ప్రజల్లో ప్రభుత్వంపై అసహ్యం కలిగే పరిస్థితి కల్పించింది. హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న వాహనం వెనుక స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జేబీఆర్ పేరు కూడా ఉన్నా పోలీసులు ఇంత అధ్వాన్నంగా వైసీపీ వారిపై కేసులు పెట్టారు. విశేషం ఏమిటంటే ఈ టీడీపీ వర్గాలలోని వారు గతంలో కాంగ్రెస్ లో ఉండి, తదుపరి టీడీపీలో చేరారట.ఇంకో సంఘటనలో కర్నూలు జిల్లా ఆలూరులో ఒక కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యారు. గుత్తి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడే ఈ హత్య చేయించారని ఆరోపణలు వచ్చాయి. జయరాం గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి, ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. చంద్రబాబు కోవర్టులంటూ ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ.. ఇది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలందరికి ముల్లులా గుచ్చుకున్నట్లయింది. మహానాడు వేదిక మీద ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆయన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, నూజివీడు నుంచి గెలిచి మంత్రి అయిన కొలుసు పార్ధసారధి, మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, లోక్ సభలో పార్టీ నేతగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రభృతులు వైసీపీ నుంచి వెళ్లినవారే. వీరిలో కొంతమందికి చంద్రబాబు,లోకేశ్‌లతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. పార్టీకి భారీగా ఆర్థిక సాయం చేసేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి సహజంగానే కోవర్టు వ్యాఖ్య చిన్నతనం అవుతుంది.అంతేకాదు..ఈ మధ్యకాలంలో వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లు రకరకాలుగా ప్రలోభ పెట్టో, లేక భయపెట్టో టీడీపీలో చేర్చుకున్నారు. మరి వీరిలో ఎవరు కోవర్టులో, ఎవరు కాదో తెలుసుకుని పార్టీలోకి తీసుకున్నారా?అంటే అదేమీ లేదు. 2014-19 మధ్య 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల మాదిరిగా ఇప్పుడు కూడా అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. తనపార్టీలో చేరిన వారంతా మంచి వారని, లేకుంటే చెడ్డవారని ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటే. గతంలో తాను ఎవరినైతే తిట్టి ఉంటారో, వారు పార్టీలోకి రాగానే పవిత్రులైనట్లుగా ప్రసంగాలు కూడా చేస్తుంటారు.కోటంరెడ్డి ,గుమ్మనూరు, కొలుసు వంటి వారిపై టీడీపీ ఎన్ని ఆరోపణలు చేసిందో తెలుసు. కాని వారిని టీడీపీలోకి తీసుకోవడానికి ఇబ్బంది పడలేదు. ఇప్పుడు అలా వచ్చిన వారిని కోవర్టులు అని అంటున్నారు. వైసీపీ వారిని టీడీపీలో చేర్చి హత్యలు చేయిస్తున్నారని చంద్రబాబు అనడం ద్వారా తన ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో ఎంత వైఫల్యం చెందింది చెప్పకనే చెబుతున్నట్లయింది. అలాగే తెలుగుదేశం పార్టీలో అరాచక శక్తులు ఏ స్థాయిలో ఉంది కూడా తెలియ చేసినట్లయింది. పైగా చంద్రబాబు తాను ఎవరిని నమ్మనని చెబుతున్నారు. అలాగే పార్టీలో ఉన్నవారు కూడా ఆయనను అంతగా నమ్మరు. కాని పరస్పర అవసరాల కోసం కలిసి ప్రయాణం చేస్తుంటారన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ ఎప్పటి నుంచో ఉంది.గత చరిత్ర చూస్తే కోవర్టుల రాజకీయం చేయడంలో చంద్రబాబును మించిన సిద్దహస్తుడు మరొకరు లేరని ఆయన ప్రత్యర్ధులు తరచు వ్యాఖ్యానిస్తుండే వారు. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావులు టీడీపీలో ఉన్నప్పుడు చెరో వర్గం నడిపే వారు.అప్పట్లో దగ్గుబాటి వర్గంలో కూడా చంద్రబాబు మనుషులు ఉండేవారని, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంటారన్న ప్రచారం ఉండేది. దానికి మించి ఎన్టీ రామారావు వద్దే తనకు రహస్యంగా సమాచారం ఇచ్చే కొందరిని కూడా ఏర్పాటు చేసుకున్నారని అంటారు.ఎన్టీ రామారావు ఎక్కడ లక్ష్మీపార్వతికి పదవి కట్టబెడతారో అన్న సందేహంతో చంద్రబాబు వర్గానికి చెందిన కొందరు రకరకాల వదంతులు ప్రచారం చేసేవారని అంటారు. పార్టీ టిక్కెట్ల సమయంలో తన వర్గం వారిని వ్యూహాత్మకంగా లక్ష్మీపార్వతి వద్దకు పంపించి ఆమెతో కూడా సిఫారసులు చేయిస్తుండేవారట. ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని కైవశం చేసుకున్న తర్వాత విపక్ష కాంగ్రెస్ నేతలతో కూడా సంబంధాలు ఉండేలా చూసుకునే వారు. వైఎస్ జగన్ పై కాంగ్రెస్‌తో కలిసి సీబీఐ కేసు వచ్చేలా చేయడంలో చంద్రబాబు పాత్ర అందరికి తెలిసిందే. మరి ఇవన్ని కోవర్టు రాజకీయాలో, కాదో చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కొందరు కోవర్టులను ఆ పార్టీలోకి పంపించి, రహస్య సమాచారం సేకరించే వారని, స్వయంగా చిరంజీవే కొన్ని సందర్భాలలో వాపోయారు. 2019లో ఓటమి తర్వాత తెలివిగా నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించిన చరిత్ర కూడా ఆయనదేనని చాలామంది నమ్ముతారు. దానికి తగ్గట్లుగానే ఆ నలుగురు పేరుకు బీజేపీ. సేవ చేసేదంతా చంద్రబాబు కోసమేనన్నది బహిరంగ రహస్యమే. తదుపరి పవన్ కళ్యాణ్ తో పాటు, బీజేపీలో చేరిన టీడీపీ నేతలతో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుని తిరిగి పొత్తు పెట్టుకున్నది కూడా ఆయనే కదా! ఇలా కోవర్టు రాజకీయం చేయడంలో చంద్రబాబు ఘనాపాటి. మరో సంగతి చెప్పాలి. ఎన్టీ రామారావు ఆత్మో, లేక మరొక పేరో తెలియదు కాని ఏఐ ఉపయోగించి చంద్రబాబు, లోకేశ్ లను పొగుడుతున్నట్లు మాట్లాడించడం మహానాడులో ఒక హైలైట్.ఎందుకంటే ఎన్టీఆర్ మరణించడానికి కొద్ది రోజుల ముందు వరకు కూడా చంద్రబాబును తీవ్రంగా విమర్శించే వారు. చంద్రబాబు సైతం ఎన్టీఆర్‌కు విలువలు లేవని, ఆయన అవసరం టీడీపీకి లేదని, ఇతరత్రా విమర్శలు చేస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చిన రికార్డులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. తనను ఔరంగజేబుతో పోల్చినా, ఇంకా అనేక ఆరోపణలు చేసినా, చంద్రబాబు అసలు ఏమీ జరగనట్లు, చంద్రబాబు పాలనకు ఎన్టీఆర్ మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఆత్మతో మాట్లాడించినట్లు వీడియో రూపొందించి ప్రదర్శించారంటే ఇంతకన్నా క్రిమినల్ ఆలోచన ఇంకేమైనా ఉంటుందా? అన్న విమర్శను వైసీపీ చేస్తోంది.ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆత్మ తనతో మాట్లాడిందని, చంద్రబాబు, లోకేశ్‌లు చేస్తున్న అరాచక పాలనను తీవ్రంగా దుయ్యబట్టారని అన్నారు. చంద్రబాబు తన ఆశయాలకు విరుద్ధంగా పాలన చేస్తున్నారని, జగన్ పేదల కోసం పని చేశారని చెప్పారని ఆమె అంటున్నారు. గతంలో జగన్ ఆత్మలతో మాట్లాడినట్లు కొందరు ఐఎఎస్‌లు చెబుతున్నారంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మహానాడులో నేరుగా ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడిందని చెబుతుంటే దానికి భజంత్రి చేసిందే! ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబు, లోకేశ్ లను పొగిడిందంటే ఎవరైనా నమ్ముతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పులివెందుల: కొనసాగుతున్న ‘కూటమి’ వేధింపులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ వేధింపులు కొనసాగుతున్నాయి. అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ సహా 13 మందిని పోలీసులు ఇంకా కోర్టులో ప్రవేశ పెట్టలేదు. వైఎస్సార్సీపీ నేతల్ని స్టేషన్లు మార్చి తిప్పుతున్నారు. పులివెందుల నుంచి వేముల, వేముల నుంచి కడపకు తరలించారు. పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి పచ్చ తోరణాలు కట్టి టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. తిరిగి ఎదురు కేసు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.నిన్న(బుధవారం) సాయంత్రం అరెస్ట్ చేసి ఇంతవరకు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టలేదు. వేముల పోలీస్ స్టేషన్ నుంచి 8 మందిని విడదీసి అకస్మాత్తుగా కడప తరలించారు. కోర్టుకు పెట్టకుండా మళ్లీ కడపకు తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఏ తప్పూ చేయని వారిపై చేయిచేసుకున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 13 మంది వైఎస్సార్సీపీ నాయకులను రెండు గ్రూపులుగా చేసిన పోలీసులు.. 8 మందిని కడపకు తరలించారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్‌తో పాటు మరో నలుగురిని వేముల స్టేషన్లోనే పోలీసులు ఉంచారు. -
పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో.. పులివెందుల, వేములలో గత అర్ధరాత్రంతా హైడ్రామా నడిచింది. మహానాడు నేపథ్యంతో ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కడితే.. వాటిని తొలగించారంటూ వైఎస్సార్సీపీ నేతలపై అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బుధవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్ సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై పులివెందుల నుంచి వేముల పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఎస్‌కు చేరుకుని పోలీసులను నిలదీశారు. ‘‘ మా పార్టీ నేతలను అరెస్ట్ చేయం దారుణం. వైఎస్సార్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలు తొలగించమంటే పోలీసులు స్పందించలేదు. తమ మనోభావాలు దెబ్బ తినడంతో తోరణాలు తొలగించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలపై కేసులు పెట్టడం దారుణం’’ అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: వైఎస్సార్.. ఓ ఎమోషన్ -
మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం
సాక్షి,వైఎస్సార్: మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీడీపీ కార్యకర్తల హత్యల వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందుకే టీడీపీ నేతల హత్యలపై చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కోవర్టుల ముద్ర వేశారు.మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. వీరయ్య చౌదరి హత్య జరిగాక అనుమానం వచ్చింది. మన దగ్గర ఉండి కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారు. కోవర్టులే హత్యా రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ వాళ్లు వాళ్లనే చంపుకుంటున్నారని చెడ్డపేరు తెస్తున్నారు. కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తే ఎవ్వరినీ ఉపేక్షించను. కోవర్టులను మన దగ్గరకు పంపించారు.కోవర్టుల ద్వారా అజెండాను నెరవేర్చాలంటే ఒప్పుకోను. వలస పక్షులు వస్తాయి.. పోతాయి. నిజమైన కార్యకర్తే శాశ్వతంగా ఉంటాడు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’ అంటూ మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యానించారు. -
‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’
సాక్షి,వైఎస్సార్ జిల్లా: ‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’ అని కూటమి నేతలకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మహా నాడుతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు పేరుతో వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్సార్ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు. వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్‌లు వేసి భజన చేసుకున్నారు. వైఎస్ జగన్ జిల్లాలో మహానాడు అంటూ పైశాచిక ఆనందం పొందారు. మీరు చేసిన దుష్ప్రచారం అందరికీ తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో హామీలు ఇచ్చారు. అన్నీ హామీలకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు.వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా ఓటమి తప్పదు. ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు. కూటమి ప్రభుత్వంపై ఆరు నెలలకే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోండి. టైం వచ్చినప్పుడు ప్రజలు దెబ్బ కోలుకోలేని దెబ్బ కొడతారు. వైఎస్సార్ విగ్రహాల చుట్టూ పచ్చ జెండాలు, తోరణాలు కట్టారు. అభ్యంతరకర రీతిలో వైఎస్ విగ్రహాల చుట్టు జెండాలు కట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ వైఎస్సార్. వైఎస్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యత కాదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని టీడీపీ చెబుతోంది. పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపులకు పాల్పడుతూ.. దద్దమ్మ రాజకీయం చేస్తున్నారు.మేం కక్ష సాధింపు రాజకీయం చేసి ఉంటే మీ పరిస్థితి వేరే విధంగా ఉండేది. మాకు తగిలిన దెబ్బ మరిచిపోం. వైఎస్సార్‌ను అగౌర పరుస్తున్నారు. టీడీపీ కవ్వింపు చర్యలకు దూరంగా ఉండాలని మా కార్యకర్తలకు తెలిపాం. మేము ఎన్టీఆర్‌ను అగౌర పరచలేదు. చేసిన తప్పులు ఇప్పటికైనా తెలుసుకోండి. పులివెందులలో వైఎస్ విగ్రహాలు చుట్టు కట్టిన తోరణాలు తొలగించాలని అధికారులకు తెలిపాం. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. జిల్లా ఎస్పీ, పులివెందుల డీఎస్పీకి తెలిపాం. ఇప్పటి వరకు పోలీసులు స్పందించలేదు. కావాలనే రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్‌ను అగౌరవ పరిచే విధంగా తొరణాలు కట్టారని’ దుయ్యబట్టారు. -
చిన్నారిని చిదిమేసినా.. చలించని మంత్రులు
సాక్షి ప్రతినిధి, కడప/జమ్మలమడుగు: ఎవరైనా కష్టాలు, బాధల్లో ఉన్నప్పుడు.. నాలుగు ఓదార్పు మాటలు చెబితే వారికి ఎంతో మనో ధైర్యంగా ఉంటుంది. కానీ, ఈ కనీస మానవత్వం మరిచారు టీడీపీ కూటమి మంత్రులు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నె గ్రామంలో శుక్రవారం నాలుగేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడ్డ కామాంధుడు రహంతుల్లాను గ్రామస్థులే పట్టించారు. ఇక ఇంతటి తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న చిన్నారి కుటుంబాన్ని కడపలోనే ఉన్న మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, మండిపల్లి రాంప్రసాదరెడ్డి, సంధ్యారాణిల్లో ఒక్కరూ పరామర్శించలేదు.టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సహా వీరంతా మహానాడు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జరిగిన ఘటనను వారు చాలా తేలిగ్గా తీసుకోవడంపై పరిశీలకులు ఆవేదన చెందుతున్నారు. ఇక కడప ఇన్చార్జి మంత్రి సవిత, హోం మంత్రి అనిత సానుభూతి ప్రకటనతో సరిపెట్టారు. అందుబాటులో ఉండి కూడా బాధిత కుటుంబాన్ని మంత్రులు, జిల్లా కలెక్టర్ పరామర్శించకపోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. కాగా, జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలోని నిందితుడు రహంతుల్లా ఇంటిని స్థానికులు శనివారం జేసీబీతో కూల్చివేశారు.మరోవైపు హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇచ్చి అండగా నిలవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం బాధితురాలి తల్లితో కలిసి జమ్మలమడుగు పాత బస్టాండ్ తాడిపత్రి రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పట్టుబట్టారు. అరగంటసేపు బైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆర్డీవో సాయిశ్రీ వారితో మాట్లాడి శాంతింపజేశారు. కాగా, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు తెలియడంతో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ శనివారం మధ్యాహ్నం బాధితులను పరామర్శించి ప్రభుత్వ సాయంగా రూ.5 లక్షలు ప్రకటించారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. -
YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
వైఎస్సార్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.వైఎస్సార్ జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. లారీ-కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి’ అని అన్నారు. -
వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
-
YSR జిల్లాలో విషాదం
-
AP: ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురు మృతి
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కడపలోని ఘాట్ రోడ్డులో వెళ్తున్న లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. దీంతో, విషాదఛాయలు అలుముకున్నాయి.వివరాల ప్రకారం.. కడపలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి, ఒక పురుషుడు మృతిచెందారు. మృతులు బద్వేలు మండలం చింతపుత్తయ పల్లెకు చెందిన వారుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వారుగా నిర్ధారణ అయ్యింది. జాతర నేపథ్యంలో వీరంతా రాయచోటి నుంచి కడపకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.ఇక, గువ్వల చెరువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బద్వేలు, బీకోడూరు మండలాల్లో చెందిన వారికి ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. -
దారుణం.. మూడేళ్ల బాలికపై హత్యాచారం
వైఎస్సార్ జిల్లా: మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో దారుణ ఘటన జరిగింది. తల్లిదండ్రులతో పాటు వివాహానికి వెళ్లిన మూడేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రొద్దుటూరులోని అమృతనగర్‌కు చెందిన దంపతులు వారి మూడేళ్ల కుమార్తెతో బంధువుల పెళ్లి నిమిత్తం మైలవరం మండలం కంబాలదిన్నెకు వెళ్లారు.మూడేళ్ల బాలిక పెళ్లి మండపం బయట ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి అరటి పండు ఇస్తానని ఆశ చూపించి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటపడుతుందని బాలికను హత్య చేశాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సమీపంలో గాలించగా.. ముళ్ల పొదల్లో బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
పచ్చ దండుకు కరోనా టెన్షన్
సాక్షి,వైఎస్సార్ జిల్లా: ఏపీలో కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. నమోదవుతున్న కోవిడ్-19 కేసులతో కూటమి నేతల్లో టెన్షన్ మొదలైంది. అందుకే కోవిడ్-19 కేసుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, వైఎస్సార్ జిల్లాలో కరోనా కేసు నమోదైంది. ఆ కేసును దాచిపెట్టేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదుపై కడప డీహెచ్ఎంవో నాగరాజు స్పందించారు. కడప జిల్లాలో ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న చాగలమర్రి మహిళకు కోవిడ్ లేదు. ఆమెకు కొంత ఊపిరితిత్తుల సమస్య మాత్రమే ఉంది’ అని అన్నారు. కానీ రిమ్స్‌లో చికిత్స పొందుతున్న మహిళకు కరోనా సోకినట్లు రిమ్స్ సూపరింటెండెంట్ రమాదేవి తెలిపారు. బాధిత మహిళకు వైద్యం చేస్తున్న అధికారులు కరోనా పాజిటివ్ అంటుంటే డీఎంహెచ్ఓ కాదని చెప్పడంతో అధికారుల తీరుపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే? ఈ నెల (మే) 27 నుంచి కడపలో టీడీపీ మహానాడు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలో కోవిడ్ కేసులు నమోదు కావడంతో పచ్చ నేతల్లో ఆందోళన మొదలైంది. కోవిడ్ అంటే మహానాడుకు ఎవరూ రారనే భయంతో కేసులే నమోదు కాలేదని వైద్యాదికారులతో చెప్పిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.బాధిత మహిళకు చికిత్స చేస్తున్న రిమ్స్ సూపరింటెండెంట్ కోవిడ్ నిర్దారణ అయిందని స్పష్టం చేయడం.. జిల్లా వైద్యాధికారి కోవిడ్ లేదని చెప్పడమే అందుకు నిదర్శనమంటూ ప్రజలు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. -
కడపలో కరోనా పాజిటివ్ కేసుపై డీహెచ్ఎంవో కీలక ప్రకటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు ప్రచారంపై కడప డీహెచ్ఎంవో నాగరాజు స్పందించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణపై డీహెచ్ఎంవో నాగరాజు కీలక ప్రకటన చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..‘కడప జిల్లాలో ఎక్కడా కోవిడ్ కేసులు లేవు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న చాగలమర్రి మహిళకు కోవిడ్ లేదు. ఆమెకు కొంత ఊపిరితిత్తుల సమస్య మాత్రమే ఉంది. అందుకే ఆమెను కోవిడ్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నాం. ఆమెకు కరోనా నిర్ధారణ కాలేదు. వదంతులను నమ్మవద్దు అని తెలిపారు. ఇదిలా ఉండగా.. విశాఖలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ..రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాల వంటివి వాయిదా వేసుకోవాలని కోరింది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు వంటి స్థలాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలి.జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కావడం లేదా ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. ఆరోగ్యశాఖ అన్ని పరీక్ష సౌకర్యాలతో కూడిన 24 గంటలు పని చేసే ల్యాబ్‌లో మాస్కులు, పీపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. -
ఏ ఆధారాలతో వారిని అరెస్ట్ చేశారు?: రాచమల్లు
సాక్షి, కడప: కూటమి ప్రభుత్వం చేసే అరెస్ట్‌లు కుట్రలో భాగమేనని వైఎస్సార్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. మద్యం పాలసీతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు సంబంధమే లేదన్నారు. కక్ష సాధింపుల్లో భాగంగానే వారిని అరెస్ట్ చేశారన్నారు.ఏ సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్ట్ చేశారో ప్రభుత్వం చెప్పగలదా? అంటూ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నిలదీశారు. ‘‘సత్యప్రసాద్ అనే చిన్న ఉద్యోగిని బెదిరించారు. అతని బెదిరించి వారికి కావాల్సిన స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను బెదిరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు ధైర్యంగా పనిచేయగలుగుతున్నారా?. ఐఏఎస్, ఐపీఎస్‌లు జైళ్లకు పోవాల్సిందేనా?’’ అంటూ రాచమల్లు దుయ్యబట్టారు.‘‘కొన్ని బ్రాండ్లే అమ్మారు.. అన్ని బ్రాండ్లు అమ్మలేదని ఆరోపణ.. కూటమి ప్రభుత్వం ఆరోపణలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కూటమి ప్రభుత్వం చర్యలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఎవరిని జైలుకు పంపాలని ఉద్దేశంతో అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు?. రూ.3,200 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో ఆధారాలతో చెప్పగలరా?. చంద్రబాబు మద్యం పాలసీ అత్త నీతులు చెప్పినట్లుంది. ఎన్నికలకు ముందు మద్యం ధరలు తగ్గిస్తామన్నారు.. తగ్గించారా?’’ అంటూ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. -
చెరువులో మునిగి ఐదుగురు పిల్లలు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లాలో ఈతకు వెళ్ళి ఐదుగురు చిన్నారులు మృతిచెందడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వాన్ని కోరారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెకి చెందిన ఉప్పలపాటి నారాయణ యాదవ్ ఇంటికి అతడి చెల్లెళ్లు సావిత్రి, భవాని హైదరాబాద్ నుంచి పిల్లలతో కలిసి వచ్చారు. వేసవి సెలవులు కావటంతో ఈత కొట్టాలని భావించి ఐదుగురు పిల్లలు చెరువులోకి దిగారు. ఈ క్రమంలో చెరువులో ఈతకు దిగి చరణ్ (15), పార్థు (12), హర్ష (12), దీక్షిత్ (12), తరుణ్ యాదవ్ (10) నీటిలో మునిగిపోయి మృతిచెందారు. చీకటి పడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లారు.పిల్లల బట్టలు ఒడ్డున ఉండటం.. చుట్టూ ఎక్కడా పిల్లల జాడ కనిపించపోవడంతో చెరువులో పిల్లలు గల్లంతైనట్టు తెలుసుకుని గాలించారు. సమాచారం అందుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ శివప్రసాద్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. -
‘కూటమి’ అక్రమాలు.. ప్రశ్నిస్తే వేధింపులా?: రవీంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ పనిచేస్తోందని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో స్కీములు లేవు.. కానీ అన్ని స్కాములే’’ అంటూ దుయ్యబట్టారు. 1.70 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనులు చేయలేదని మండిపడ్డారు.‘‘సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు అప్రజాస్వామికం. కనీసం ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా కుటుంబ సభ్యులను వేధించడం దారుణం. సాక్షి మీడియా ప్రతినిధులను బెదిరిస్తూ అక్రమాలు ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. లేని లిక్కర్ స్కాం బయటకు తీసి అబద్ధాలే ఆరోపణలుగా కేసులు పెడుతున్నారు. అధికారులను, నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అమాతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.ఆపరేషన్ సిందూర్‌పై ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం నిత్యం శ్రమిస్తున్న సైనికులకు సెల్యూట్ చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం హర్షణీయం అని రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విద్యార్థుల ధర్నా
-
రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ విఫలం: వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అకాల వర్షాలకు, వడగళ్ల వానకు నష్టపోయిన అరటి రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన పులివెందులలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నష్టపోయిన రైతులను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఆనాడు వైఎస్సార్సీపీ తరపున సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు నష్టపోయిన ప్రతి హెక్టారుకు రూ.20 వేల సాయం అందిస్తాం. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఒక్క రూపాయి సాయం అందించలేదు. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి’’ అని అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఇటీవల అకాల వర్షాల వల్ల లింగాల మండలంలో చోటు చేసుకున్న ఉద్యాన పంటల నష్టానికి.. రైతులకు పరిహారం ఇచ్చేందుకు వైఎస్ జగన్ సముఖత వ్యక్తం చేశారు. 630 మంది రైతులకు హెక్టారుకు రూ. 20 వేల చొప్పున పార్టీ తరఫున పరిహారం ఇచ్చేందుకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ పరిహారానికి సంబంధించిన త్వరలోనే ఆయా గ్రామాల వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులందరికీ డీడీలు అందిస్తాం. 630 మందికి రూ. 1.30 కోట్ల పరిహారాన్ని డీడీల రూపంలో అందజేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరుచుకోవాలి. తన బాధ్యతను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ అని అవినాష్‌రెడ్డి హితవు పలికారు.‘‘రూ.26 కోట్లతో అరటి రైతుల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌ను ఏర్పాటు చేసింది.. కానీ దాని వినియోగంలోకి తీసుకురావడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం విఫలమైంది. పులివెందుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధితో ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ కోల్డ్ స్టోరేజ్‌ని వినియోగంలోకి తీసుకొచ్చి ఉంటే ధరల స్థిరీకరణకు అవకాశం ఉండేది. ధరల స్థిరీకరణ జరిగితే రైతుకు ప్రయోజనం కలిగేది. గత నెలలో అరటి ధర ఓ మోస్తారుగా ఉండేది. ఇప్పుడు అరటి ధర పడిపోయి రైతుకు గిట్టుబాటు కావడం లేదు..మెడికల్ కాలేజ్ నిర్మించి 50 సీట్లు మంజూరు అయ్యేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తే.. వచ్చిన సీట్లను వద్దని రాసి పంపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. 6 సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా, కడప నుంచి నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు సీఎం గా గెలిచి పులివెందులను అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు మెడికల్ కాలేజీకి ఆయన పేరును తీసివేసి కూటమి ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతుంది. మెడికల్ కాలేజీ మెయిన్ గేట్‌కు ఉన్న వైఎస్సార్ పేరు తొలగిస్తారేమో కానీ.. ఈ ప్రాంత ప్రజల్లో ఆయనకున్న స్థానాన్ని అయితే చెరిపి వేయలేరు. చెయ్యని పనులు చేసినట్లు చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఏ పని ఎవరు చేశారో ప్రజలందరికీ తెలుసు’’ అని వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గండి క్షేత్రంలో 26 కోట్లతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్న చిన్న చిన్న పనులు చేయలేక అసంపూర్తిగా వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో గంజాయి రవాణా విస్తృతంగా పెరిగిపోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యపానాన్ని కట్టడి చేస్తే.. ఈ ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా వీధికి ఒక మద్యం షాపును తెరిచింది’’ అని అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
సోలార్కు ‘ఆది’ రెడ్‌బుక్ పవర్!
జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ‘ఆది’ మార్క్ రాజ్యాంగం నడుస్తోంది! స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అండతో ఓ సోలార్ కంపెనీ ప్రభుత్వ భూములను ఆక్రమించి చదును చేస్తున్నా, పేదల డీకేటీ భూముల్లో పాగా వేసినా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. కొండపాపాయపల్లి 224 సర్వే నంబర్లో 501.34 ఎకరాల పుల్లరి భూమి (పశువుల మేత)ని అక్రమంగా చదును చేసినా రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు. ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన డీకేటీ పట్టా భూముల్లో సోలార్ ప్లాంటు పనులు చేపట్టి అడ్డుపడిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.యథేచ్ఛగా పుల్లరి భూముల్లో పనులు224 సర్వే నంబర్లో ఉన్న 501 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తున్నా సీల్ (ఎస్ఏఈఎల్) కంపెనీ దీన్ని పట్టించుకోకుండా భారీ యంత్రాలతో పనులు చేస్తోంది. అధికార పార్టీ నాయకుల అండతో సోలార్ కంపెనీ ప్రతినిధులు రెచి్చపోతున్నారు. దీనిపై తహసీల్దార్, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొండ కల్వటాల గ్రామంలో 2023లో ప్రభుత్వం డీకేటీ భూములను మంజూరు చేసింది. అందులో సోలార్ ప్యానెళ్ల నిర్మాణం కోసం యంత్రాలతో గుంతలు తవ్వి స్తంభాలు పాతుతున్నారు.గ్రామానికి చెందిన అక్కంరెడ్డి మధుసూదనరెడ్డి దీనిపై ప్రశి్నంచడంతో కంపెనీ ప్రతినిధులు బెదిరించి రూ.పది వేలు అపహరించినట్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సుబ్బారావు క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ చేపట్టకుండా మధుసూదన్‌రెడ్డిపై 308 సెక్షన్‌తో పాటు మరికొన్ని సెక్షన్లు మోపారు. కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇవ్వకుండా రిమాండ్‌కు తరలించారు. వైఎస్సార్సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచి్చనా సోలార్ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.అక్రమ కేసు.. సోలార్ కంపెనీ ప్రతినిధులు మాకు సమాచారం ఇవ్వకుండా, పరిహారం గురించి మాట్లాడకుండా పొలాల్లో ప్యానెల్స్ ఏర్పాటు పనులు చేపట్టారు. పట్టా భూముల్లో పనులను అక్కంరెడ్డి మధుసూదన్‌రెడ్డి అడ్డుకోవడంతో సోలార్ కంపెనీ ప్రతినిధులు దొంగతనం ఆరోపణలు మోపారు. పోలీసులు విచారణ చేపట్టకుండానే అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. – సుజాత, డి.కల్వటాల, పెద్దముడియం మండలం ‘ఆది’ రెడ్‌బుక్ రాజ్యాంగం.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. అధికారం ఉందని విచ్చలవిడిగా భూములను ఆక్రమించి సోలార్ కంపెనీతో పనులు చేయిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకున్నా పాపాయపల్లిలో 500 ఎకరాల భూమిని చదును చేశారు. దిగువ కల్వటాల గ్రామంలో పంట పొలాల్లో సోలార్ ప్యానెల్స్ పాతుతున్నారు. ఇదేమని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌కు తరలిస్తున్నారు. సోలార్ కంపెనీ ప్రతినిధులు, రైతులతో సఖ్యతగా వ్యవహరించకుంటే కంపెనీ సాగదన్న విషయాన్ని గ్రహించాలి. – పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ, జమ్మలమడుగు -
పెరిగిపోతున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి పీఏ వాహిద్ ఆగడాలు
వైఎస్ఆర్ జిల్లా : కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పీఏ వాహిద్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళలను మోసం చేస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గతంలో డబ్బులు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వాహిద్ పలువురు యువతుల్ని మోసం చేశాడు. ఉద్యోగాల కోసం ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్యాలయానికి వెళితే.. బాధుతుల్ని తమ చెల్లెళ్లుగా పరిచయం చేసేవాడు. ఇలా గత ఏడాది డిసెంబర్లో ఓ యువతికి డబ్బులు, ఉద్యోగం ఎరగా చూపించాడు వాహిద్. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. తీరా పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం అడిగితే మోహం చాటేసినట్లు తెలుస్తోంది. తాజాగా పీఏ వాహిద్ మాటలకు మోసపోయామని గుర్తించిన ఓ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పీఏ వాహిద్ అంగబలం, ఆర్ధిక బలం ముందు బాధితులకు న్యాయం జరగలేదు. పైగా, న్యాయం చేయాలని కోరినందుకు తన కుటుంబంపై దాడి చేశాడని మహిళ ఆరోపిస్తోంది.బాధిత మహిళ తమ గోడువెళ్ల బోసుకునేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి వెళ్లారు. తాను వాహిద్ మాటలు నమ్మి మోసపోయామని,న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి సైతం పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కడపలో ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. రూ.12 కోట్లకు కుచ్చుటోపి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ట్రేడింగ్ పేరుతో యువతకు కుచ్చుటోపి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన పాపిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి చేతిలో 35 కుటుంబాలు మోసపోయాయి. అధిక లాభాల పేరుతో సోమశేఖర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు 12 కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇచిన డబ్బును తిరిగి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు లబోదిబో అంటున్నారు.మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పెట్టుబడి పెట్టిన వారిలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహ్యతే గతి అంటూ మిగతా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తారాస్థాయికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు
వైఎస్సార్,సాక్షి : అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఐదు సున్నపు రాయి టిప్పర్లను సీజ్ చేయించారు. కంపెనీలోని కాంట్రాక్ట్ కార్మికులపై జులుం ప్రదర్శించారు. కాంట్రాక్ట్ కార్మికులను బయటకు పంపించేశారు. కాంట్రాక్ట్ కార్మికులు లేకపోవడంతో కంపెనీలో పనులు నిలిచిపోయాయి.సీఎం చంద్రబాబుతో మాట్లాడి దాడులు చేయిస్తామంటూ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.అల్ట్రాటెక్ సిమెంట్‌పై తాను వ్యవహరించిన తీరు తప్పు కాదంటూ సమర్థించుకున్నారు. అక్కడి కాంట్రాక్ట్‌లన్నీ తనకే కావాలని ఉత్పత్తిని అడ్డుకున్నారు. ఇన్ని చేస్తూనే తన తప్పులేదని బుకాయించడం చూసి విస్తుపోతున్నారు స్థానికులు. మూడున్నర దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధి..చిలంకూరు సిమెంట్ పరిశ్రమలో సుమారు 35 ఏళ్ల నుంచి స్థానికులు ఉపాధి పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకే అన్ని పనులు కావాలంటూ పరిశ్రమకు రవాణా అవుతున్న సున్నపురాయి, ఫ్లైయాష్‌ను బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులు శనివారం నుంచి అడ్డుకుంటున్నారు. దీంతో సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అగిపోయి మూతపడే దశకు వచ్చింది.అల్ట్రాటెక్ పరిశ్రమలో ఉత్తరం వైపు సున్నపురాయి మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినా మొత్తం పనులు తమకే కావాలని ఆదినారాయణరెడ్డి వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. చిలంకూరులోని ఐసీఎల్ (అల్ట్రాటెక్) సిమెంట్ పరిశ్రమకు సరఫరా అయ్యే సున్నపురాయిని ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవటంపై యజమాన్యం ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు.చిలంకూరు సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అడ్డుకోవడంపై ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులైన ఎస్.జగదీశ్వర్‌రెడ్డితో పాటు పది మందిపై కేసు నమోదు చేసినట్లు యర్రగుంట్ల సీఐ నరేష్‌బాబు తెలిపారు. చిలంకూరు ఐసీఎల్ (అల్ట్రాటెక్) మైనింగ్ క్వారీ వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ఇవి అరాచకాలు👉గండికోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టిన అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను తమ వర్గీయులకే అప్పగించాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరులు మందీ మార్బలంతో విధ్వంసం సృష్టించారు.👉ఆర్టీపీపీ నుంచి సిమెంట్ కంపెనీలకు ఫ్లైయాష్ రవాణా చేస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన లారీలను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం దీన్ని తమకే అప్పగించాలంటూ వీరంగం సృష్టించింది.👉 ఎర్రగుంట్ల మండలం చిలంకూరు పరిధిలో అల్ట్రాటెక్ (ఐసీఎల్) సిమెంటు పరిశ్రమకు ఫ్లైయాష్, సున్నపురాయి, ఇతర ముడి ఖనిజం సరఫరా, ప్యాకింగ్ ప్లాంట్ కాంట్రాక్టు పనులను 40 ఏళ్లుగా మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు ఎంవీ రమణారెడ్డి చేస్తున్నారు. ఆ పనులన్నీ తమ వర్గీయులకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొంతకాలంగా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తోంది. -
YSR జిల్లాలో టీడీపీ నేత బీటెక్ రవి అనుచరుల అరాచకం
-
అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి ఆదినారాయణరెడ్డి బెదిరింపులు
-
ఆది అరాచకం.. అల్ట్రాటెక్‌కు మరోసారి బెదిరింపులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అరాచకాలు మితిమీరిపోతున్నాయి. మరోమారు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై బెదిరింపులకు దిగారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి దాడులు చేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అల్ట్రాటెక్ సిమెంట్స్‌పై తాను వ్యవహరించిన తీరు తప్పు కాదంటూ సమర్థించుకున్నారు.అక్కడి కాంట్రాక్టులన్నీ తనకే కావాలంటూ ఉత్పత్తి అడ్డుకున్నారు. ముడిసరుకు, ఉత్పత్తి బయటకు వెళ్లకుండా బస్సు అడ్డుగా పెట్టీ మరీ బెదిరింపులకు దిగారు. అదినారాయణరెడ్డి దౌర్జన్యంపై జిల్లా కలెక్టర్‌కు ఫ్యాక్టరి యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పోలీసు బందోబస్తుతో తిరిగి ఉత్పత్తి పునరుద్ధరించారు. అయినా తన తప్పేమీ లేదంటూ ఆదినారాయణరెడ్డి బుకాయించారు. పైగా సీఎంతో మాట్లాడి దాడులు చేయిస్తానంటూ మరోసారి బెదిరింపులకు దిగారు.కాగా, చిలంకూరులోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో కార్యకలాపాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవడంతో గత రెండు రోజుల క్రితం కూడా ఉత్పత్తి ఆగిపోయిన సంగతి తెలిసిందే. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న బెదిరింపులు మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.మొన్న అదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను అడ్డుకుని విధ్వంసం..! నిన్న ఆర్టీపీపీలో ఫ్లైయాష్ రవాణా లారీలను అడ్డుకుని దౌర్జన్యం..! తాజాగా అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి బెదిరింపులు..! వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి ఆది నుంచి అరాచకాలనే ప్రోత్సహిస్తూ దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. -
ఎమ్మెల్యే ఆదినారాయణ అరాచకం.. కలెక్టర్‌ను ఆశ్రయించిన అల్ట్రాటెక్
సాక్షి, వైఎస్సార్: జమ్మలమడుగులో పారిశ్రామికవేత్తలపై కూటమి నేతల అరాచకం మరింత పెరిగింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరుల దాదాగిరి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి అరాచకంపై జిల్లా కలెక్టర్‌కు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.వివరాల ప్రకారం.. జమ్మలమడుగులో అన్ని కాంట్రాక్టులు తమకే కావాలంటూ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి కూటమి నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరుల దాదాగిరి చేస్తున్నారు. ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రతీ ఒక్క కాంట్రాక్టూ తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో, ఇప్పటికే కాంట్రాక్టు నిర్వహిస్తున్న వారిని బయటకు పంపలేమని యాజమాన్యం స్పష్టం చేసింది. ఎమ్మెల్యే ఒత్తిడితో కొన్ని కాంట్రాక్టులు ఇచ్చినా ఆదినారాయణరెడ్డి వర్గం శాంతించలేదు. ఫ్యాక్టరీ ముడిసరుకు, సిమెంట్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను అడ్డుకున్నారు.సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సరుకు బయటకు వెళ్లకుండా బస్సులు అడ్డుపెట్టి మరీ అరాచకం సృష్టిస్తున్నారు. దీంతో, ఓ ప్లాంటులో ఉత్పత్తి ఆగిపోగా, మరో ప్లాంటులోనూ ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి అరాచకంపై కంపెనీ యాజమాన్యం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసు భద్రత ఏర్పాటు చేసింది జిల్లా యంత్రాంగం.అయితే, ఫ్యాక్షన్ పోకడలతో పారిశ్రామికవేత్తలను ఆదినారాయణరెడ్డి వేధిస్తున్నారు. మూడు నెలల క్రితం అదానీ పవర్ ప్లాంటుపైకి కూడా ఇదే విధంగాదాడి చేసిన ఆదినారాయణరెడ్డి వర్గం దాడి చేసింది. ఆర్టీపీపీ ఫ్లైయాష్ తరలింపులోనూ అంతా తామే చేయాలని రగడ సృష్టించింది. అప్పట్లో జేసీ వర్గంతో తలపడ్డ ఆదినారాయణరెడ్డి వర్గం.. జేసీ వాహనాలను అడ్డగించిన విషయం తెలిసిందే. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో జిల్లాకు పరిశ్రమలు రాకుండా పోతాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో సోషల్ మీడియా కార్యకర్త పవన్‌కు ఊరట లభించింది. తాము చెప్పేవరకు కేసు విచారణ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. హత్య సినిమాలో క్లిప్పింగ్‌లు షేర్ చేశాడని సోషల్ మీడియా కార్యకర్త పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలుమార్లు పవన్‌ను పులివెందుల పోలీసులు విచారించారుపవన్తో పాటు హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితపైనా కేసులు పెట్టారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పైనా కేసు నమోదు చేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఉన్న సినిమా క్లిప్పింగ్ షేర్ చేయడం తప్పు ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడంతో.. విచారణను నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి ఊరట.. పోలీసులకు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్లో భాగంగా తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది.మద్యం అమ్మకాలపై సీఐడీ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ముందస్తు బెయిల్‌పై జస్టిస్ జేబీ. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ విచారణ జరిపింది. ఈ క్రమంలో మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఇదే సమయంలో, మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక, పిటిషన్‌పై మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.ఇదిలా ఉండగా, అంతకుముందు.. మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ తెలిపింది. దీంతో, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ కోసం ప్లాన్ చేస్తున్నాయి. దీంతో, మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఇక, మద్యం వ్యవహారంలో ఆది నుంచీ ఏపీ సీఐడీ పోలీసుల తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వ్యక్తులను బెదిరించి సీఐడీ తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంది. తప్పుడు వాంగ్మూలాల్లో తమకు కావాల్సిన వారి పేర్లను చెప్పించారు సీఐడీ అధికారులు. ఈ క్రమంలో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా వారి అరెస్టుకు ముందడుగులు వేస్తున్నారు. అలాగే, తప్పుడు వాంగ్మూలాల్లో పేర్కొన్న వ్యక్తుల ఇళ్లలో సీఐడీ సోదాలు చేసింది. నిన్న హైదరాబాద్‌లో పలువురి ఇళ్లల్లో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల సందర్భంగా ఇళ్లల్లో ఉన్న మహిళలను బెదిరింపులకు గురిచేసినట్టు సమాచారం. పోలీస్ స్టేషన్లకు రప్పిస్తామంటూ మహిళలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ అహ్మద్ భాషా అరెస్ట్.. పీఎస్ వద్ద భారీ బందోబస్తు!
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా సోదరుడు వైఎస్సార్సీపీ నేత అహ్మద్ భాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆయనను ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.ఏపీలో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ నేత అహ్మద్ భాషాను ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, ముంబై నుంచి బెంగళూరుకు విమానంలో తరలించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏపీకి తీసుకువచ్చారు. అయితే అహ్మద్ భాషాను ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నగర శివారులోని పోలీసు శిక్షణ కేంద్రంలో ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం.మరోవైపు.. కడప చిన్న చౌక్ పోలీసు స్టేషన్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లోనే ఆయనపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో కడప తాలూకా పోలీసు స్టేషన్లో స్థల వివాదం విషయంలో అహ్మద్ భాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం రామగోవిందరెడ్డి జడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.కాగా, బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డిని వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేశారు.కాగా, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.కాగా, చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన ఎన్నికలో వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికల అధికారి అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. -
నేడు వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నిక
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10గంటలకు నామినేషన్ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన పూర్తి, అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 1 గంటలకు నామినేషన్ ఉపసంహరణ చేపట్టనున్నారు. ఆపై పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగించనున్నారు.జిల్లాలో 50 మంది జెడ్పీటీసీ సభ్యులుండగా వారిలో పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి ఓ ప్రమాదంలో చనిపోయారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథరెడ్డి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతూ రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జెడ్పీకి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో 48 మంది జెడ్పీటీసీ సభ్యులున్నారు. వారిలో గోపవరం మండల జెడ్పీటీసీ జయరామిరెడ్డి మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. మిగతా అందరూ వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులే కావడం విశేషం. వైఎస్సార్సీపీ సభ్యులకు విప్ జారీ... జిల్లా పరిషత్‌లో 47మంది జెడ్పీటీసీలకు వైఎస్సార్సీపీ విప్ జారీ చేసింది. జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి సూచన మేరకు వేముల జెడ్పీటీసీ బయపురెడ్డి ద్వారా సభ్యులకు విప్ జారీ చేశారు. విప్ జారీ చేసిన రిసిప్ట్ కాపీలు ఎన్నికల అధికారికి అందజేయనున్నారు. విప్ అందుకున్న సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. విప్ ధిక్కరిస్తే ఆయా సభ్యులు సభ్యుత్వం కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ముక్తకంఠంతో వెల్లడిస్తున్నారని సమాచారం. దాంతో వైఎస్సార్సీపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. చైర్మన్‌గిరిని పార్టీ ఖాతాలో జమ చేసుకునేందుకు సన్నద్ధంగా ఉంది.రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్ పీఠంబ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డికి జెడ్పీ చైర్మన్ పీఠం దక్కనుంది. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యరి్థగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతిని«థ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యరి్థత్వాన్ని ఎంపిక చేశారు. అధినేత సూచనలు మేరకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు చైర్మన్ ఎన్నిక కోసం కంకణబద్ధులై ఉన్నారు. కలిసికట్టుగా ఎన్నిక ప్రక్రియ వ్యవహారం నడిపించేందుకు సన్నాహాలు చేస్తుండడం విశేషం. తెలుగుదేశం పార్టీ ద్వంద్వనీతిజిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించింది. -
వాట్సప్‌లో టెన్త్ మ్యాథ్స్ పేపర్ లీక్.. నిందితుల అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో లీకైన గణితం ప్రశ్నాపత్రం లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రం లీకేజీలో ప్రమోయమున్న తొమ్మదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులు పూర్తి కాగా, ఇటీవల నిర్వహించిన గణితం పరీక్షలో పేపర్ లీకేజీ జరిగింది. వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాల బి కేంద్రంలో గణితం ప్రశ్నా పత్రం వాట్సప్‌లో షేర్ చేసినట్లు తెలిసింది.పేపర్ లీకేజీపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, పోలీసుల విచారణలో సాయి అనే వాటర్ బాయ్ ద్వారా ప్రశ్నాపత్రం ఫోటో తీయించి లీక్ చేసినట్లు నిర్ధారించారు.ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి వాటర్ బాయ్ వాట్సప్ ద్వారా కమలాపురం వివేకానంద ఇంగ్లీష్ మీడియం యాజమాన్యానికి పంపినట్లు తేలింది. నిందితుల్లో వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ రామసుబ్బారెడ్డితో సహా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోయం ఉన్నట్లు తేలింది. మాస్ కాపీయింగ్ కోసమే పేపర్ లీక్ చేశారంటూ పోలీసుల సైతం ప్రకటించారు. -
రైతులపై కూటమి ప్రభుత్వ కపట ప్రేమ: వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం: ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం కారణంగా వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. వర్షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడింది. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదు.వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేది. మన వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ రైతుకు న్యాయం చేశాం. అరటి సాగులో రాష్ట్రంలోనే పులివెందుల నంబర్ వన్ స్థానంలో ఉంది. మా ప్రభుత్వంలో రూ.25కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు కూడా వాడుకోలేకపోతున్నారు. యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. మళ్లీ ప్రతీ రైతు కళ్లలో ఆనందం కనిపించేలా చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం’ అని రైతులకు హామీ ఇచ్చారు. అకాల వర్షానికి భారీ నష్టం..శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. -
అరటి రైతుల ఆత్మహత్యాయత్నం
యల్లనూరు/పులివెందుల రూరల్: వారం రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట అకాల వర్షానికి దెబ్బతినడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక ఇద్దరు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నంచిన ఘటన అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జాంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.బాధిత కుటుంబాల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న వెంగప్ప 9 ఎకరాలు, లక్ష్మీనారాయణ మరో 10.5 ఎకరాల్లో అరటి తోటలు సాగు చేశారు. అప్పులు తెచ్చి ఒక్కొక్కరూ రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వారం రోజుల్లో పంట కోత కోయాల్సి ఉంది. ఒక్కో రైతుకు కనీసం రూ.20 లక్షల వరకు వస్తుందని ఆశపడ్డారు. కానీ.. శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి పంట దెబ్బతింది.వడగళ్లు అరటి గెలలపై పడటంతో కాయలకు మచ్చలు వస్తాయని, దీనివల్ల పంటను ఎవరూ కొనరని బాధిత రైతులు ఆవేదన చెందారు. పంట నష్టాన్ని పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆదివారం ఉదయం ఉద్యాన శాఖ అధికారులను ఫోన్లో కోరారు. సెలవు రోజు కావడంతో అధికారులు సరైన రీతిలో స్పందించలేదు. దీంతో రైతులిద్దరూ తాము తీవ్రంగా నష్టపోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. అప్పులు తీర్చే దారిలేక... చివరకు ఆత్మహత్యలే గతి అని భావించి తోటలోనే పురుగు మందు తాగారు.చిన్నవెంగప్ప భార్య రాజమ్మ ఈ విషయాన్ని గమనించి గ్రామస్తులకు చెప్పగా.. ఇద్దరినీ పులివెందుల ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. పంట నష్టం జరిగిన తోటలను ఆదివారం మధ్యాహ్నం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఉద్యాన అధికారి ఉమాదేవి, తహసీల్దార్ రాజా పరిశీలించారు. కాగా.. రైతులు ఫోన్ చేసినా తాము స్పందించలేదనడంలో వాస్తవం లేదని, వెంటనే పొలాల వద్దకు వెళ్లి బాధిత రైతులను ఆస్పత్రికి తరలించడంలో సహాయపడ్డామని ఉద్యాన అధికారి ఉమాదేవి చెప్పారు. ఎవరూ పట్టించుకోవడం లేదుమొత్తం పదిన్నర ఎకరాల్లో అరటి పంట వేశాను. 15 వేల మొక్కలు నాటాను. ప్రస్తుతం ఐదు వేల చెట్లలో పంట కోతకు వచ్చింది. రెండు, మూడు రోజుల్లో కోసి విక్రయించేవాళ్లం. మా ఖర్మ ఏమైందో గానీ వడగళ్ల వాన వచ్చింది. పంట మొత్తం దెబ్బతింది. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి?. ఒక్క అధికారి కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. – లక్ష్మీనారాయణ, ఆత్మహత్యాయత్నం చేసిన రైతుతీవ్రంగా నష్టపోయాంతొమ్మిది ఎకరాల్లో అరటి పంట వేశా. రూ.లక్షలు అప్పు చేసి పంట పెట్టా. 11 నెలలు పడ్డ కష్టానికి రెండు రోజుల్లో ఫలితమిచ్చేది. గెలలు విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో కాస్తయినా అప్పులు తీర్చుకునేవాళ్లం. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. మా ఆశలపై నీళ్లు పడ్డాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే ఆత్మహత్యే శరణ్యం. – చిన్నవెంగప్ప, ఆత్మహత్యాయత్నం చేసిన రైతు -
అకాల వర్షం.. అపార నష్టం.. నేడు పరిశీలించనున్న వైఎస్ జగన్
ఇది నిన్నటి దృశ్యం.పచ్చటి అరటి తోటలు.. బారెడు గెలలతో కోతకు సిద్ధమయ్యాయి.. తమ ఆశలు పండించేలా ఉన్న తోటల్ని చూసి రైతు కళ్లల్లో ఆనందం తాండవించింది. ఇక అప్పులన్నీ తీరతాయని ధైర్యం వచ్చింది. ఇది నేటి పరిస్థితి.ఎటు చూసినా విరిగిన అరటి చెట్లు.. నేలవాలిన తోటలు. చేతికందే దశలో పంట నేలపాలై కంట నీరు పెట్టుకుంటున్న రైతులు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని దీనస్థితి. అమరావతి/లింగాల/అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షాలకు వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. పెద్దకుడాల గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. 3 ఎకరాల్లో యాలకి (సుగంధాలు) అరటి సాగు చేయగా.. పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. గోరుచుట్టుపై రోకలి పోటులా.. గోరుచుట్టుపై రోకలి పోటులా అకాల వర్షం వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని అరటి రైతులను దెబ్బతీసింది. గత నెలలో టన్ను అరటి ధర రూ.23 వేల నుంచి రూ.25 వేలు ఉండేది. ఇప్పుడు ధరలు పడిపోవడంతో పెట్టుబడులు దక్కుతాయో లేదోనని అరటి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు చేసి పంటల్ని సాగుచేస్తే చేతికందాల్సిన పంట నేలనంటిందని వాపోతున్నారు. పురుగు మందులు, ఎరువుల ధరలు ఏటా పెరుగుతుంటే.. పంట సాగుచేసిన తమకు గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటల్ని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రైతుల్ని ఆదుకుంటాం: సీఎం అకాల వర్షాలు ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పంటలు దెబ్బతిన్న జిల్లాల కలెక్టర్లతో సీఎం ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయి అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లికి చెందిన ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై సీఎం ఆరా తీశారు. ఆ ఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.ప్రభుత్వం ఆదుకోవాలికోటి ఆశలతో అప్పులు చేసి అరటి పంటను సాగు చేస్తే అకాల వర్షం, ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ వర్షానికి తీవ్రంగా నష్టపోయాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – శ్రీనివాసులరెడ్డి, అరటి రైతు, ఎగువపల్లెఈ స్థితి వస్తుందనుకోలేదుఏటా ఏప్రిల్, మే నెలల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసేవి. ఆలోగా రైతులు అరటి పంట దిగుబడి చేతికందేది. ఈ ఏడాది ముందుగానే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో తీవ్రంగా నష్టపోయాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. – రామాంజనేయరెడ్డి, అరటి రైతు, పెద్దకుడాలనేడు వైఎస్ జగన్ పర్యటన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ మండల కన్వినర్ బాబురెడ్డి తెలిపారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిన అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారన్నారు. -
రేపు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) పులివెందులలో పర్యటించనున్నారు. లింగాలలో పడిపోయిన అరటి తోటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. భారీవర్షాలు, ఈదురు గాలులకు అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. బాధిత రైతులను ఆయన పరామర్శించనున్నారు.వైఎస్సార్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానకు భారీగా అరటి పంటలు నేలకూలాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పులివెందుల: చవ్వా విజయశేఖర్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు.అనంతరం విజయశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.పులివెందుల ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్‌రెడ్డి అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ప్రజల సందర్శనార్ధం ఆయన పార్థివదేహాన్ని పాల్‌రెడ్డి ఫంక్షన్ హాలులో ఉంచారు. విజయశేఖర్‌రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్‌కి దగ్గరి బంధువు. -
AP: ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం.. 1000 ఎకరాల్లో..!
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్, అనంతపురం జిల్లాలల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్థరాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానకు భారీ ఎత్తున అరటి పంటలు నేలకూలాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాలతో పాటు అనేక గ్రామాలలో అరటి చెట్లు నేలకూలాయి. సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో లబోదిబోమని అంటున్నారు రైతులు.రెండు జిల్లాలో పరిధిలో సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆకస్మికంగా వచ్చిన ఈదురుగాలులతో కూడా వడగాళ్ల వానకు తన పంట పూర్తిగా నేలకొరికిందని అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పురుగుల మందుల తాగి లక్ష్మీ నారాయణ, వెంగప్ప అనే రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుత వీరికి పులివెందుల మెడికల్ కాలేజ్ లో చికిత్స అందిస్తున్నారు. పంట నష్టపోయిందని బాధతో అధికారులకు ఫోన్ చేస్తే ఈ రోజు సెలవు అన్నారని , దాంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు..పులివెందుల నియోజకవర్గంలో భారీ పంట నష్టంపులివెందుల నియోజకవర్గంలో భారీ అరటి పంట నష్టం జరిగిందని హార్టికల్చర్ అధికారి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని లింగాలలో భారీగా అరటి చెట్లు నేలకూలయాన్నారు. నిన్న రాత్రి ఆకస్మాత్తుగా వచ్చిన వర్షం, ఈదురుగాలులతో తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపామని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. మొత్తం రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామన్నారు. -
వర్రా రవీంద్రారెడ్డికి బెయిల్.. జైలు నుంచి విడుదల
అమరావతి: సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టైన వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు వర్రా రవీంద్రారెడ్డి శనివారం బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మడకశిరలో వర్రా రవీంద్రా రెడ్డిపై నమోదైన కేసులో బెయిల్ వచ్చింది. దీంతో వర్రాపై నమోదైన 26 కేసుల్లోనూ వర్రాకు బెయిల్ మంజూరైనట్లయ్యింది. దీంతో వర్రా రవీంద్రా రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం. వైఎస్సార్సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసింది. వర్రా రవీంద్రారెడ్డిని గత నవంబర్ లో అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. ఇలా రవీంద్రారెడ్డిపై 26 కేసులు నమోదు చేశారు. మొత్తం అన్ని కేసుల్లో ఇప్పటికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు వర్రా రవీంద్రారెడ్డి -
డ్రోన్ లేడీ!
ఆసక్తి ఉంటే అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగవచ్చని... ప్రత్యేక గుర్తింపు పొందవచ్చని నిరూపించారు వైఎస్సార్ జిల్లా కమలాపురం మున్సిపాలిటీలోని కె.అప్పాయపల్లె గడ్డ వీధికి చెందిన నామాల జ్యోత్స్న. పొదుపు సంఘంలో క్రియాశీలకంగా ఉన్న ఆమె డ్రోన్ పైలట్‌గా ఎదిగారు. తొమ్మిది మండలాల్లోని పొలాలకు డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. స్థానికంగా డ్రోన్ మహిళగా గుర్తింపు పొందారు. –కమలాపురంరూ.3లక్షల వరకు వచ్చాయినేను కలలో కూడా డ్రోన్ పైలట్ అవుతానని అనుకోలేదు. ఇప్పటి వరకు కమలాపురం, చెన్నూరు, వల్లూరు, సీకే దిన్నె, కడప, వేముల, సిద్ధవటం, మైదుకూరు, ఖాజీపేట మండలాల్లో డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేశాను. ఎకరాకు రూ.400 తీసుకుంటున్నా. తొమ్మిది మండలాల్లో 58 రోజుల్లో దాదాపు 700 ఎకరాల్లో పురుగుమందులు పిచికారి చేశా. రూ.3లక్షల వరకు ఆదాయం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. – నామాల జ్యోత్స్న, కె.అప్పాయపల్లె, కమలాపురం, వైఎస్సార్ జిల్లాపొదుపు సంఘం నుంచి ఢిల్లీ వరకుదేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని పంట పొలాల్లో డ్రోన్ల ద్వారా పురుగుమందులు పిచికారి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో వైఎస్సార్ జిల్లా ఒకటి. వైఎస్సార్ జిల్లా నుంచి కమలాపురానికి చెందిన జ్యోత్స్నను డ్రోన్ పైలట్‌గా ఎంపిక చేశారు. ఆమె కమలాపురంలోని ‘నికితా’ పొదుపు సంఘం లీడర్‌గా ఉన్నారు. గ్రూప్ లీడర్‌గా బాగా పనిచేస్తున్న జ్యోత్స్నను డీఆర్డీఏ అధికారులు గుర్తించి కరోనా కాలంలో క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ద్వారా కమలాపురంలో మినీ నర్సరీని ఏర్పాటు చేయించారు. ఆమె బంతి, నిమ్మ, గుమ్మడి, వంగ, మిర్చి, వరి నారు పెంచి రైతులకు విక్రయిస్తున్నారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా తన పొలంలో పంటలు పండించి ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహిళలను డ్రోన్ పైలట్లుగా తయారు చేసేందుకు ప్రవేశ పెట్టిన ‘లక్పతి దీదీ’ పథకానికి కూడా జ్యోత్స్నను అధికారులు ఎంపిక చేశారు. ఆమె 2023 డిసెంబర్ 11 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. లక్పతి దీదీ పథకాన్ని 2024 మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. గుంటూరులో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆమెకు సర్టిఫికెట్‌తోపాటు డ్రోన్ అందజేశారు. మార్చి 27న అధికారికంగా ఆమె ఇంటికి డ్రోన్ వచ్చింది. ఇప్పటి వరకు ఆమె 58 రోజులపాటు డ్రోన్ ఉపయోగించి పురుగుమందులు పిచికారి చేసి రూ.3లక్షల వరకు ఆదాయం పొందారు.స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరు..ఢిల్లీలో 2024 ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకలను తిలకించేందుకు డ్రోన్ పైలట్లకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం పంపింది. వైఎస్సార్ జిల్లా నుంచి జ్యోత్స్న వెళ్లి స్వాతంత్య్ర దిన వేడుకలను తిలకించారు. ఇది తన జీవితంలో మరపురాని ఘట్టమని ఆమె తెలిపారు. కడపలో 2024, జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో డీఆర్డీఏ తరఫున ఆమె డ్రోన్ ఎగురవేసి రూ.25వేలు నగదు బహుమతి పొందారు.


