
సాక్షి,వైఎస్సార్: పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పచ్చమూక రెచ్చిపోయింది. అధికార బలాన్ని అడ్డంపెట్టుకొని పోలింగ్ బూత్‌లలోనే దొంగ ఓట్లు వేయించింది. అందుకు పోలీసులు కొమ్ముకాయడంతో ప్రజలు తమ విలువైన ఓట్లను వినియోగించుకోలేకపోయారు. పోలింగ్ బూత్‌లలో దొంగ ఓట్లు వేస్తున్నారని, మా ఓట్లను మేం వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసుల కాళ్లమీద పడ్డా ఫలితం లేకుండా పోయింది.
ఈ క్రమంలో జడ్పీటీసీ ఉప ఎన్నికపై ఒంటిమిట్ట వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్ధి సుబ్బారెడ్డి ఎన్నికల అధికారులను ఆశ్రయించారు. 17బూత్‌లకు రీపోలింగ్ జరపాలని కోరారు. ఈ మేరకు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి ఓబులమ్మకు ఫిర్యాదు చేశారు. మొత్తం 30 బూత్‌లకు 17బూత్‌లలో రీపోలింగ్ జరపాలని విజ్ఞప్తి చేశారు.