విజయవాడ: చంద్రబాబు నాయడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంం మరో భారీ అప్పు తెచ్చింది. తాజాగా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు చేసింది చంద్రబాబు సర్కారు. మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పును తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ వేలం ద్వారా అప్పు సమీకరించింది. గడిచిన 18 నెలల్లో రూ. 2.77 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. ఫలితంగా అప్పుల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది చంద్రబాబు సర్కారు.
చంద్రబాబు ప్రభుత్వం ఈనెల ఆరంభంలో బడ్జెట్ లోపల రూ.3,000 కోట్ల అప్పు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.3,000 కోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చింది
ఇలా బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు.. సూపర్ సిక్స్‌లోని ప్రధాన హామీలు సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. అలాగే ఇప్పటివరకు చేసిన అప్పులతో ప్రజలకు ఆస్తులు కల్పించకపోగా.. గత వైఎస్సార్‌సీపీ సర్కారు అభివృద్ధి చేసిన ఆస్తులను సైతం ప్రైవేటుపరం చేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలతో ఆస్తుల కల్పన చేయగా.. ఇప్పుడు వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది.
కేవలం ఏడాదిన్నర పాలనలోనే చంద్రబాబు సర్కారురూ. 2.77 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించట్లేదా అని ఆర్థిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కానీ గత వైఎస్సార్‌సీపీ పాలనలో లేని అప్పులు కూడా ఉన్నట్లుగా ఎల్లో మీడియా ఇష్టారీతిన దుష్ప్రచారం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ బాబు అండ్ కో గగ్గోలు పెట్టిందని పేర్కొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు నోరు మెదపకపోవడం గమనార్హమని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


