సంచలనంగా మంత్రి నారా లోకేష్‌ లగ్జరీ టూర్‌ | Minister Nara Lokesh luxurious tour creates a sensation | Sakshi
Sakshi News home page

సంచలనంగా మంత్రి నారా లోకేష్‌ లగ్జరీ టూర్‌

Feb 17 2026 2:47 PM | Updated on Feb 17 2026 5:32 PM

Minister Nara Lokesh luxurious tour creates a sensation

సాక్షి,అమరావతి: మంత్రి నారా లోకేష్‌ విలాసవంతమైన టూర్‌ సంచలనంగా మారింది. క్రికెట్ మ్యాచ్‌ కోసం కోట్లు వెచ్చించి ప్రత్యేక విమానంలో ప్రయాణించిన లోకేష్‌ చక్కెర్లు కొట్టారు.

ఇటీవల జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్‌. ప్రేమదాస స్టేడియంలో భారత్‌-పాక్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌ను స్టేడియంలో వీక్షిస్తున్న లోకేష్‌ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు నారా లోకేష్‌ కేవలం 24 గంటల్లోనే కొలంబో–విజయవాడ–ఢిల్లీ ప్రయాణాలు చేసినట్లు సమాచారం. 

మ్యాచ్‌ చూసేందుకు విజయవాడ నుంచి ఢిల్లీ.. అక్కడి నుంచి శ్రీలంకకు వెళ్లాల్సి ఉంది. ఇలా వెళ్లిన లోకేష్‌  విమానం అద్దెకు రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. లోకేష్‌ ఈ మెరుపు ప్రయాణాలతో ప్రజాధనం వృథా చేస్తున్నారని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రం లోకేష్ క్రికెట్ మ్యాచ్ ఖర్చు కోటి పైనే

Advertisement
 
Advertisement
Advertisement