breaking news
India Pakistan match
-
ఆసియా కప్‌లో ‘6-0’ సంజ్ఞ వివాదం.. హారిస్ రవూస్పై పాక్ రక్షణ మంత్రి ప్రశంసలు
ఇస్లామాబాద్: ఆసియా కప్‌లో పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ ‘6-0’అని సంజ్ఞ చేయడం వివాదస్పదంగా మారింది. అయితే, హారిస్ రవూస్ అలా సంజ్ఞ చేయడాన్ని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సమర్ధించాడు. భారత్‌తో అలా వ్యవహరించడం సరైందేనంటూ ట్వీట్ చేశాడు. ‘హారిస్ రవూఫ్ వారితో సరిగ్గా వ్యవహరిస్తున్నావు. దీన్ని ఇలాగే కొనసాగించండి. భారత్ 6-0ని మరచిపోదు. ప్రపంచం కూడా గుర్తుంచుకుంటుంది’ అంటూ ట్వీట్ చేశారు.గత ఆదివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ చెలరేగి బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఒకానొక సమయంలో భారత్ బ్యాట్స్‌మెన్ దెబ్బకు పాక్ పేసర్ హారిస్ రవూఫ్ సహనం కోల్పోయి.. ‘6-0’ సంకేతంతో విమానాలు కూలుతున్నట్లు సంజ్ఞ చేశాడు. ఈ సంకేతానికి కారణంగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా వారు భారత ఆరు ఫైటర్ జెట్లను కూల్చేశారట. కానీ, ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అంతర్జాతీయ వేదికలపై పాక్ పరువు పోగొట్టుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి.ఈ సంఘటనపై పాక్ కాలమిస్ట్ అయాబ్ అహ్మద్ చేసిన పోస్ట్‌ను ఖవాజా ఆసిఫ్ రీపోస్టు చేస్తూ కామెంట్స్ చేశారు. జెంటిల్మెన్ గేమ్ ఇలాంటి సంజ్ఞలు క్రీడా ఆచారాలకు విరుద్ధమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
‘సమఉజ్జీల సమరం’ ఏమాత్రం కాదు!
దుబాయ్: ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం...అదే ఒకడు మీద పడిపోతే దండయాత్ర’... తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఇది. భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరిగ్గా ఇదే అర్థం వచ్చేలా పాకిస్తాన్ గురించి చెప్పాడు. భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే ఇప్పుడు పూర్తిగా ఏకపక్షమని అతను గుర్తు చేశాడు. అసలు ఇరు జట్ల మధ్య ఆటను ‘వైరం’తో పోల్చాల్సిన అవసరమే లేదని అతను స్పష్టం చేశాడు. భారత్, పాక్ మధ్య 2018 నుంచి జరిగిన గత 7 వన్డేల్లో భారత్ 6 గెలవగా, 1 మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఇరు జట్ల మధ్య మొత్తం 15 టి20 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 11 గెలిచి, 3 మాత్రమే ఓడింది. వరుసగా గత 4 మ్యాచ్‌లలో మనదే పైచేయి. 2022లో ఓటమి తర్వాత రెండు ఫార్మాట్లు కలిపి మన జట్టు వరుసగా 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆధిపత్యంపై సూర్య తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లకు ‘వైరం’ అనే మాటను ఇకపై వాడవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అసలు ఇరు జట్ల మధ్య వైరం అనాల్సినంతగా పోటీ ఎక్కడ ఉంది. నా అభిప్రాయం ప్రకారం రెండు జట్ల మధ్య 15–20 మ్యాచ్‌లు జరిగి ఇద్దరూ 7–7తో సమంగా ఉండి లేదా 8–7తో కాస్త ఆధిక్యంలో ఉంటే సమ ఉజ్జీల సమరం అని చెప్పవచ్చు. కానీ సరిగ్గా అంకెలు గుర్తు లేవు కానీ ప్రస్తుతం ఇది 13–0 లేదా 10–1గా ఉంది. కాబట్టి ఇకపై ఇది అసలు పోటీనే కాదు’ అని సూర్య ఘాటుగా వ్యాఖ్యానించాడు. దూబే స్పెల్ కీలక మలుపు... పాక్ ఇన్నింగ్స్ డ్రింక్స్ విరామ సమయంలో ఆట మలుపు తిరిగిందని సూర్యకుమార్ అన్నాడు. సాధారణంగా పవర్‌ప్లే తర్వాత ఆట మారుతుందని, కానీ 10–17 ఓవర్ల మధ్య తాము పాక్‌ను కట్టడి చేయడంలో సఫలమయ్యామని కెపె్టన్ చెప్పాడు. ఈ 8 ఓవర్లలో పాక్ 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. ‘స్పిన్నర్లు బాగానే బౌలింగ్ చేసినా నా దృష్టిలో శివమ్ దూబే స్పెల్ ఆటను మలుపు తిప్పింది. ఈసారి అతను తనకు లభించిన అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటూ పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేశాడు. ప్రాక్టీస్ సెషన్లలో దూబే బౌలింగ్‌లో బాగా శ్రమించాడు. కొత్త బంతితో కూడా సాధన చేశాడు. ఈ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో అతను వచ్చాడు’ అని సూర్య చెప్పాడు. మరోవైపు నీరు–నిప్పులాంటి గిల్, అభిషేక్ భాగస్వామ్యంపై కూడా సారథి ప్రశంసలు కురిపించాడు. ‘అభిషేక్ బ్యాటింగ్ శైలి అలాగే ఉంటుంది. పవర్‌ప్లే తర్వాత కూడా అతను తగ్గడు. గిల్ ఎలా ఆడతాడో కూడా అందరికీ తెలుసు. ఏ రకంగానైనా అతను పరుగులు రాబట్టగలడు. మైదానం బయట కూడా మంచి స్నేహం ఉంటే ఫలితం ఎలా ఉంటుందో వీరిద్దరు చూపించారు. నీరు–నిప్పులాంటి వీరిద్దరు కలిసి ఆడుతుంటే సమన్వయానికి ఒక కనుసైగ చాలు’ అని కెపె్టన్ వ్యాఖ్యానించాడు. ‘వాళ్లు అలా చేయడం నచ్చలేదు’ భారత్, పాక్ మ్యాచ్‌లలో సహజంగా కనిపించే కవ్వింపులు, మాటల యుద్ధం ఆదివారం మ్యాచ్‌లో కూడా కనిపించింది. వేర్వరు సందర్భాల్లో అభిషేక్ శర్మ, శుబ్ మన్ గిల్‌లకు హారిస్ రవూఫ్, షాహిన్ అఫ్రిదిలతో వివాదం రేగింది. దీనిపై మ్యాచ్ తర్వాత అభిషేక్ స్పష్టతనిచ్చాడు. పాక్ ఆటగాళ్ల ప్రవర్తన వల్లే తాను స్పందించాల్సి వచి్చందని అతను చెప్పాడు. ‘ఎలాంటి కారణం లేకుండా వారు మాపైకి దూసుకొచ్చి కవి్వంచే ప్రయత్నం చేశారు. అది నాకు అస్సలు నచ్చలేదు. నేను దూకుడుగా ఆడి చెలరేగడమే దానికి సరైన మందు అని భావించాను’ అని అభిషేక్ వెల్లడించాడు. తన బాల్య మిత్రుడు గిల్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పడం, అది జట్టు విజయానికి కారణం కావడం పట్ల అభిషేక్ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు హాఫ్ సెంచరీ చేశాక తాను గన్ షూటింగ్ తరహాలో చేసిన సంబరంలో ఎలాంటి తప్పూ లేదని పాక్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ అన్నాడు. ‘ఆ క్షణంలో వచి్చన ఆలోచనతోనే నేను గన్ తరహాలో బ్యాట్‌తో అలా చేశాను. నేను సాధారణంగా 50 దాటినప్పుడు ఎలాంటి సంబరాలు చేసుకోను. అప్పటికప్పుడు నాకు అలా చేయాలనిపించింది. జనం దాని గురించి ఎలా ఆలోచిస్తారనేది నాకు అనవసరం. దానిని నేను పట్టించుకోను’ అని ఫర్హాన్ స్పష్టం చేశాడు. -
భారత్-పాక్ మ్యాచ్‌పై సీమా హైదర్ ఏమన్నదంటే..
నోయిడా: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు(ఆదివారం ఫిబ్రవరి 23) భారత్-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌కు ముందు సీమా హైదర్(Seema Haider) భారత జట్టకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు ఆమె చెప్పారు. భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే దేశమంతటా సంబరాలు జరుగుతాయని సీమా హైదర్ పేర్కొన్నారు.పాకిస్తాన్ నుంచి తన ప్రియుణ్ణి కలుసుకునేందుకు భారత్ వచ్చిన సీమా హైదర్ ఎప్పుడూ భారత్‌కు మద్దతుపలుకుతూనే వస్తున్నారు. తాజాగా ఆమె ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ‘బెస్ట్ ఆఫ్ లక్’ చెప్పారు. టీమిండియా ఎప్పటిలానే అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని అన్నారు.భారత్- పాక్ మ్యాచ్(India-Pakistan match) చూసేందుకు తాను ఎంతో ఆతృతతో ఉన్నానని, భారత్ మ్యాచ్ గెలవాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం దేశవాసులకు గర్వకారణంగా నిలుస్తుందని, అందరూ కలసి పండుగ చేసుకుంటారని సీమా పేర్కొన్నారు. ఈరోజు తన కుమార్తె పరీ పుట్టినరోజు కావడం విశేషమని, భారత్ గెలిస్తే కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా రెండు వేడుకలు చేసుకుంటామన్నారు.ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోదీ.. క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన -
ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు కనువిందైన కానుక
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్(The Greatest Rivalry: India vs Pakistan) సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.భారతదేశంలో సినిమా తరువాత ఏది ఇష్టం అంటే సగటు భారతీయుడు ఠక్కున చెప్పేది క్రికెట్ అనే. నాటి రేడియో రోజుల నుండి నేటి డిజిటల్ ప్రొజెక్షన్ రోజుల వరకు ఎదుగుతున్న సాంకేతికత కన్నా మెరుపు వేగంలో ఎదుగుతోంది ఈ క్రికెట్ అభిమానం. మరీ ముఖ్యంగా ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్ అంటే దేశం మొత్తానికి ఆ రోజు అప్రకటిత సెలవు లాంటిది. దాయాదుల పోరు అని చాలామంది ముద్దుగా పిలుచుకునే ఈ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ జరిగినా ప్రపంచం నలుమూలల నుండి ఆకాశమంత ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ ఇరు దేశాల క్రికెట్ ఆటపై ‘ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్’ అనే సిరీస్ రూపొందించింది. నాలుగు భాగాలతో ఉన్న ఈ సిరీస్‌లో భారతదేశం సాధించిన నాటి ప్రపంచ కప్ నుండి నేటి ప్రపంచ కప్ వరకు ప్రతిదీ విశ్లేషించిన ప్రయత్నం అత్యంత ప్రశంసనీయం. సిరీస్‌లో పత్రికా విలేకరుల నుండి పరోక్ష, ప్రత్యక్ష ఆటగాళ్లతో వివరించిన విధానం ఓ అద్భుతమనే చెప్పాలి. ఈ సిరీస్ ద్వారా ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు ఎన్నో వివరణలు, విశ్లేషణలు, రహస్యాలు దృశ్య రూపంలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎంత ఉత్కంఠగా ఉంటుందో అంతకు వేయి రెట్లు ఉత్కంఠ, ఉత్సాహం ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు కలుగుతుందనడంలో సందేహమే లేదు.క్రికెట్ మ్యాచ్ టీవీలలో ప్రసారమనేది మామూలే కానీ, అదే క్రికెట్ వెనుక జరిగిన తతంగం చూపడమనేది వంద క్రికెట్ మ్యాచులు ఒకేసారి చూడడం లాంటిది. ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్ ఈ విషయంలో మాత్రం ప్రేక్షకుల నాడి సరిగ్గా పట్టుకుంది. ఈ సిరీస్ మొత్తం తెలుగులోనూ లభ్యం. కాబట్టి కాసేపు ఈ క్రికెట్ రైవల్రీ ఏంటో చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
మ్యాచ్ రూపురేఖల్ని మార్చేసిన బుమ్రా
-
India-Pakistan Match: 70 బిరియానీలు ఆర్డర్ చేసిన కుటుంబం
క్రికెట్‌కు భారత్‌లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అభిమానులు పనులన్నీ మానుకుని మరీ టీవీలకు అతక్కుపోతారు. టాస్ దగ్గర నుంచి మ్యాచ్ చివరి బాల్ వరకూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తారు. ప్రస్తుతం భారత్‌లో క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా చంఢీగడ్‌లో ఓ కుటుంబం ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఏకంగా 70 బిరియానీలు ఆర్డర్ పెట్టింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ స్విగ్గీ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్టు పెట్టింది. దీనిపై యూజర్లు పలు రకాలుగా కామెంట్లు పెట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్.. పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 30.3 ఓవర్లలలోనే లక్ష్యాన్ని చేధించింది. 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. గతంలో ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇలాగే 62 బిరియానీలు ఆర్డర్ పెట్టింది. 70 biryanis ordered by a household in chandigarh in one-go, seems they already know who's winning 👀 #INDvsPAK pic.twitter.com/2qQpIj5nhu — Swiggy (@Swiggy) October 14, 2023 -
వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై తిరుగులేని భారత్..!
-
అన్ని విధాలుగా భారత్ చాలా స్ట్రాంగ్
-
మరికాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా భారత్ - పాక్ మధ్య హై వోల్టేజ్ ఫైట్
-
Ind Vs Pak: పాక్‌పై చారిత్రక ఇన్నింగ్స్.. కోహ్లి నేర్పిన 'పంచ సూత్రాలు'
వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లి వీరోచిత పోరాటం చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ గ్రేట్ ఇన్నింగ్స్ నుంచి మనమంతా ఐదు విషాయాలు నేర్చోవాలని తెలిపారు ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్. ఇందుకు సంబంధించి ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కోహ్లీ నుంచి అందరూ నేర్చుకోవాల్సిన ఆ ఐదు విషయాలెంటో ఇప్పుడు చూద్దాం.. బ్యాడ్ టైమ్ తాత్కాలికమే.. శాశ్వతం కాదు. ప్రదర్శనతోనే బదులివ్వాలి చివరి క్షణం వరకు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి ప్రజలు దేన్నైనా త్వరగా మర్చిపోతారనే విషయం గుర్తుంచుకోవాలి మీ ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు ఎంతపెద్ద కష్టాన్నైనా సులభంగా అధిగమించవచ్చు #ViratKohli𓃵 की पारी से सीख: 1. आपका बुरा समय भी स्थायी नहीं है 2. सिर्फ़ अपने परफ़ॉर्मेंस से ही जवाब दिया जा सकता 3. अंतिम समय तक अपनी भावनाओं पर नियंत्रण रखना 4. लोगों की याददाश्त बहुत छोटी होती है 5. जब आत्मविश्वास बढ़ता है तो कठिन परिस्थिति भी आसान लगती है — Awanish Sharan (@AwanishSharan) October 24, 2022 ఐఏఎస్ అధికారి చెప్పినట్లు ఈ ఐదు విషయాలు కోహ్లి ఇన్నింగ్స్ నుంచి అందరూ నేర్చుకోవచ్చు. పాక్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను హార్దిక్ పాండ్యతో కలిసి విజయతీరాలకు చేర్చాడు కోహ్లి. మ్యాచ్ పూర్తయాక భావోద్వానికి లోనయ్యాడు. తన కెరీర్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అన్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడినట్లు చెప్పాడు. చదవండి: Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
స్నేహితులతో కలిసి భారత్-పాక్ మ్యాచ్ చూస్తుండగా గుండెపోటు
చివరిబంతి వరకు ఉత్కంఠగా సాగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ 34 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. మరణించిన వ్యక్తిని బిటు గొగొయ్(34)గా గుర్తించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం థియేటర్లో ప్రత్యక్షప్రసారం చేస్తున్న భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు బిటు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. అయితే మ్యాచ్ చూస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో ఫ్రెండ్స్ వెంటనే అతడ్ని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ బిటు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. థియేటర్లో అరుపులు, ఈలల గోల కారణంగా శబ్ద కాలుష్యంతో అతనికి గుండెపోటు వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బిటు తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు. 34 ఏళ్లకే బిటుకు నూరేళ్లు నిండుతాయని ఊహించలేదని కన్నీటిపర్యంతమయ్యారు. చదవండి: Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్: కోహ్లి సేన గెలవాలని పూజలు
-
ఇండియా పాక్ మ్యాచ్‌కు ఎర్త్ అవర్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: సమతుల్య వాతావరణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవసరం లేని లైట్లను స్విచ్ ఆఫ్ చేసి ఎర్త్ అవర్ పాటించనున్న విషయం తెలిసిందే. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఎలా ఉన్నా భారత్, పాకిస్థాన్‌లో భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే ఇండియా పాకిస్థాన్‌ల మధ్య శనివారం సాయంత్రం 7.30గంటల ప్రాంతంలో టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్ గంటపాటు అంటే 8.30 నుంచి 9.30 వరకు పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీని ప్రభావం ఈ మ్యాచ్ కోసం చూస్తున్న వారిపై పడే అవకాశం ఉంది. ఆ సమయంలో చాలామంది ఇళ్లలో ఎన్ని టీవీలు ఉంటే అన్ని టీవీలు కచ్చితంగా ఆన్ చేసే ఉంటాయి. ఒక వేళ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని గౌరవిస్తూ ఎర్త్ అవర్ పాటించాల్సి వస్తే చాలామంది తమ ఇళ్లలో టీవీలు కట్టేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సోలార్ పవర్ ఉపయోగించేవారి ఇళ్లలో ఉండే టీవీలను షేర్ చేసుకుంటూ మ్యాచ్ చూడాల్సిందిగా ఇప్పటికే అధికారులు విజ్ఞప్తి చేశారు. పారిస్ ప్రొటోకాల్ ప్రకారం ఉష్ణోగ్రతల పెరుగుదల రెండు శాతానికి మించకుండా ప్రతీ దేశంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు. 2007 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్‌ను ప్రతీ ఏడాది పాటిస్తున్నారు. -
పాకిస్తాన్ నుంచి భారీగా...
కోల్‌కతాలో శనివారం భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగే టి20 ప్రపంచకప్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఆ దేశం నుంచి భారీ బృందం రానుంది. ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్, ఇమ్రాన్ ఖాన్, షహర్యార్ ఖాన్‌లతో పాటు పీసీబీ నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు రానున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు బెంగాల్ క్రికెట్ సంఘం సెహ్వాగ్‌ను సన్మానించనుంది. సచిన్, గవాస్కర్, కపిల్ తదితర దిగ్గజాలు కూడా మ్యాచ్‌కు వస్తారు.