జేఈఈ టాపర్స్‌కు వైఎస్ జగన్ అభినందనలు | Former CM Jagan Mohan Reddy Congratulates Students Who Excelled In JEE Exams, More Details Inside | Sakshi
Sakshi News home page

జేఈఈ టాపర్స్‌కు వైఎస్ జగన్ అభినందనలు

Feb 17 2026 2:59 PM | Updated on Feb 17 2026 5:24 PM

Former CM Jagan Mohan Reddy Congratulates Students Who Excelled in JEE Exams

సాక్షి,తాడేపల్లి: జేఈఈ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించి టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

 కఠినమైన పోటీ పరీక్ష అయిన జేఈఈలో ప్రతిభ కనబరిచి ఉన్నత ర్యాంకులు సాధించడం విద్యార్థుల ప్రతిభ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా వారికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.

రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చిన ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ, వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని వైఎస్‌ జగన్ ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర యువత ఇలాగే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు

JEE టాపర్స్ కు YS జగన్ అభినందనలు

Advertisement
 
Advertisement
Advertisement