breaking news
topers
-
జేఈఈ టాపర్స్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి: జేఈఈ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించి టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కఠినమైన పోటీ పరీక్ష అయిన జేఈఈలో ప్రతిభ కనబరిచి ఉన్నత ర్యాంకులు సాధించడం విద్యార్థుల ప్రతిభ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా వారికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చిన ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ, వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర యువత ఇలాగే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు -
తిరిగి పరీక్ష పెట్టగా టాపర్ అట్టర్ ప్లాఫ్
పాట్నా: బిహార్‌లో మరో విద్యార్థిపై వేటు పడింది. సైన్స్ లో టాపర్ వచ్చిన ఓ విద్యార్థి ఫలితాన్ని బిహార్ బోర్డు రద్దు చేసింది. మరో ర్యాంకర్ ఫలితాన్ని డిస్మిస్ చేసింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో మొత్తం 13మంది ర్యాంక్ హోల్డర్లు నిర్వహించగా వారు మునుపటిపరీక్షల్లో చూపించినంత ఫలితాన్ని చూపించలేకపోయారు. దీంతో వారి గత ఫలితాలను రద్దు చేశారు. 'బిహార్ పాఠశాలల విద్యా బోర్డు సైన్స్ టాపర్ సౌరబ్ శ్రేష్టా, మరో ర్యాంకు హోల్డర్ రాహుల్ కుమార్ ఫలితాలను రద్దు చేస్తున్నాం' అని బిఎస్ఈబీ చైర్మన్ లాల్ కేశ్వర్ ప్రసాద్ సింగ్ తెలిపాడు. మరో విషయం ఏమిటంటే కుమార్, సౌరబ్ ఇద్దరు కూడా వైశాలిలోని బిషున్ రాయ్ కాలేజీ విద్యార్థులే. కాగా, మిగితా పన్నెండు విద్యార్థులు మాత్రం గతంలో ఇచ్చిన ప్రదర్శననే ఇవ్వగలిగారు. ఇంటర్వ్యూలో కూడా బాగానే ఎదుర్కోవడంతో వారి ఫలితాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇక ఆర్స్ట్ లో టాప్ వచ్చిన విద్యార్థి రూబీ రాయ్ మాత్రం అనారోగ్య పరిస్థితులతో పరీక్షకు హాజరుకాలేదు. దీంతో అతడికి మరో వారం రోజులు గడువు ఇచ్చారు. జూన్ 11న అతడు కచ్చితంగా మరోసారి నిర్వహించే పరీక్షకు హాజరుకావాల్సిందే అనే సింగ్ చెప్పారు.


