తిరిగి పరీక్ష పెట్టగా టాపర్ అట్టర్ ప్లాఫ్‌ | Bihar Board Cancels Result Of Science Topper, Another Rank Holder | Sakshi
Sakshi News home page

తిరిగి పరీక్ష పెట్టగా టాపర్ అట్టర్ ప్లాఫ్‌

Jun 5 2016 9:25 AM | Updated on Sep 18 2019 2:55 PM

తిరిగి పరీక్ష పెట్టగా టాపర్ అట్టర్ ప్లాఫ్‌ - Sakshi

తిరిగి పరీక్ష పెట్టగా టాపర్ అట్టర్ ప్లాఫ్‌

బిహార్లో మరో విద్యార్థిపై వేటు పడింది. సైన్స్ లో టాపర్ వచ్చిన ఓ విద్యార్థి ఫలితాన్ని బిహార్ బోర్డు రద్దు చేసింది. మరో ర్యాంకర్ ఫలితాన్ని డిస్మిస్ చేసింది.

పాట్నా: బిహార్లో మరో విద్యార్థిపై వేటు పడింది. సైన్స్ లో టాపర్ వచ్చిన ఓ విద్యార్థి ఫలితాన్ని బిహార్ బోర్డు రద్దు చేసింది. మరో ర్యాంకర్ ఫలితాన్ని డిస్మిస్ చేసింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో మొత్తం 13మంది ర్యాంక్ హోల్డర్లు నిర్వహించగా వారు మునుపటిపరీక్షల్లో చూపించినంత ఫలితాన్ని చూపించలేకపోయారు. దీంతో వారి గత ఫలితాలను రద్దు చేశారు. 'బిహార్ పాఠశాలల విద్యా బోర్డు సైన్స్ టాపర్ సౌరబ్ శ్రేష్టా, మరో ర్యాంకు హోల్డర్ రాహుల్ కుమార్ ఫలితాలను రద్దు చేస్తున్నాం' అని బిఎస్ఈబీ చైర్మన్ లాల్ కేశ్వర్ ప్రసాద్ సింగ్ తెలిపాడు.

మరో విషయం ఏమిటంటే కుమార్, సౌరబ్ ఇద్దరు కూడా వైశాలిలోని బిషున్ రాయ్ కాలేజీ విద్యార్థులే. కాగా, మిగితా పన్నెండు విద్యార్థులు మాత్రం గతంలో ఇచ్చిన ప్రదర్శననే ఇవ్వగలిగారు. ఇంటర్వ్యూలో కూడా బాగానే ఎదుర్కోవడంతో వారి ఫలితాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇక ఆర్స్ట్ లో టాప్ వచ్చిన విద్యార్థి రూబీ రాయ్ మాత్రం అనారోగ్య పరిస్థితులతో పరీక్షకు హాజరుకాలేదు. దీంతో అతడికి మరో వారం రోజులు గడువు ఇచ్చారు. జూన్ 11న అతడు కచ్చితంగా మరోసారి నిర్వహించే పరీక్షకు హాజరుకావాల్సిందే అనే సింగ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement