ప్రియుడిని పెళ్లాడిన బోనీ కపూర్ కూతురు | Boney Kapoor’s Daughter Anshula Kapoor Marries Rohan Thakkar In Grand Mumbai Wedding, Photo Trending On Social Media | Sakshi
Sakshi News home page

ప్రియుడిని పెళ్లాడిన బోనీ కపూర్ కూతురు

Jul 6 2026 9:58 PM | Updated on Jul 7 2026 11:18 AM

Boney kapoor Daughter Anshula marries Rohan Thakkar in Mumbai

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా కపూర్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు రోహన్ థక్కర్‌ను ఆమె పెళ్లాడింది. ఈ పెళ్లి వేడుక ముంబయిలో గ్రాండ్‌గా జరిగింది. తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో  జరిగిన ఈ పెళ్లికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అన్షులా మామ అనిల్ కపూర్, సిస్టర్స్ జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌ వేడుకలో మెరిశారు. కాగా.. అన్షులా కపూర్, రోహన్‌ 2025 జూలైలో నిశ్చితార్థం చేసుకున్నారు. 2022లో ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మొదటిసారి కలుసుకున్నామని అన్షులా కపూర్ వెల్లడించింది.

కాగా.. నిర్మాత బోనీ కపూర్‌ మొదటి భార్య పేరు మోనా శౌరీ కపూర్‌. ఈవిడ కూడా నిర్మాతే! వీరిద్దరూ 1983లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అర్జున్‌ కపూర్‌, అన్షులా కపూర్‌ సంతానం. 1996లో బోనీ.. భార్య మోనాకు విడాకులిచ్చాడు. అదే ఏడాది హీరోయిన్‌ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్‌ సంతానం. కాగా మోనా శౌరీ.. 2012లో కన్నుమూయగా, శ్రీదేవి 2018లో మరణించింది. జాన్వీ, ఖుషి సవతి తల్లి కూతుర్లయినప్పటికీ అర్జున్‌, అన్షులా.. వారితో అన్యోన్యంగా ఉంటారు. ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement