సంస్కృతం చదవడం రాదు.. ఐనా భగవద్గీతను ఎంబ్రాయిడరీ చేసింది! | Hemoprova Chutia: embroidered the entire bhagwad gita on 280 foot cloth | Sakshi
Sakshi News home page

సంస్కృతం చదవడం రాదు.. ఐనా భగవద్గీతను ఎంబ్రాయిడరీ చేసింది!

Jul 6 2026 10:54 AM | Updated on Jul 6 2026 11:59 AM

Hemoprova Chutia: embroidered the entire bhagwad gita on 280 foot cloth

మనకు ఒక భాష చదవడం వస్తే సులభంగా టైప్‌ చేయగలం. ప్రతి అక్షరం అర్థం తెలుసు కాబట్టి సునాయసంగా రాసేస్తాం. చదవడం రాని భాషలో ప్రతి అక్షరాన్ని రాయడం కూడా కాకుండా వస్త్రంపై ఎంబ్రాయిడరీ చేయడం అంటే మాటలు కాదు కద. అందులోనూ కుట్టు పనికి చాల ఓపిక అవసరం. అలాంటిది చదవడం రాని అక్షరాలను మగ్గంపై క్షుణ్ణంగా ప్రతి అక్షరం నేయడం అంటే..అద్భుతమైన కళే అని చెప్పొచ్చు. ఆ విలక్షణమైన నైపుణ్యంతోనే వార్తల్లో నిలిచి అందరి ప్రశంసలు అందుకోవడమే కాదు, భారత ప్రభుత్వంచే  అత్యున్నత పురస్కారమైన పద్శశ్రీతో గౌరవ సత్కారం పొందింది. ఎవరా ఆ కళాకారణి అంటే..

ఆ మహిళే అస్సాంకు చెందిన హేమోప్రోవ చుటియా. నేతపనితో ఆమెకు చాలా లోతైన అనుబంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అస్సాంకు పేరు తెచ్చిన బంగారు వర్ణపు వస్త్రమైన 'ముగా సిల్క్'ను ఉపయోగించి కూడా ఆమె కొన్ని వస్త్రాలను సృష్టించారు. నిజానికి సాంప్రదాయ అస్సామీ నేతపని సాధారణంగా పూల లేదా జ్యామితీయ నమూనాలపై ఆధారపడి ఉండగా, ఆమె మాత్రం ఒక విభిన్నమైన అంశాన్ని పరిచయం చేశారు. 

మగ్గం కేవలం వస్త్రాన్ని తయారు చేయడం కంటే ఎక్కువ చేయగలదని ఆమె పని నిరూపిస్తుంది. అది ఒక కథను, భక్తిని, చరిత్రను భద్రపరచగలదని ప్రూవ్‌ చేసింది. అక్షరాలు చదవలేనప్పడూ రాయడం కష్టమువుతుంది. కానీ ఇక్కడ హోమోప్రోవాకు సంస్కృత అక్షరాల గురించి తెలియదు. చదవడం రాదు ఆమెకు అది తనకు కేవలం ఆకారం మాత్రమే. సింపుల్‌గా చెప్పాలంటే ఓ బొమ్మ మాదిరి నమునా అంతే.  అలాంటి ఆమె భగవద్గీతను వస్త్రంపై కుట్టే సాహసం చేశారామె. 

ఆమె ఆ సంస్కృత అక్షరాల రూపాన్నే అధ్యయనం చేసినట్లు ప్రతి అక్షరాన్ని తన కుట్టుతో ముద్రించింది. అక్కడ ఒక్క చిన్న పొరపాటు జరిగినా..పదమే పూర్తిగా మారిపోవడమే కాదు అర్థం కూడా మారిపోతుంది. పైగా తప్పు రాశానా లేదా చెక్‌చేసుకోలేదు ఎందుకంటే చదవడం ఆమెకు రాదు కాబట్టి. ఇన్ని సవాళ్లు ఉన్నా..ఒక్కో అక్కరం చూసుకుంటూ అద్దంలో ప్రతిబింబించినట్లు అక్షరాలు కనిపించేలా మగ్గంపై ఎంబ్రాయిడరీ చేసింది. ఎలాంటి యంత్రం, ప్రింటర్‌ లేకుండా చేతులు, దారం సాయంతో అక్షరాలు, అది కూడా భగవద్గీత శ్లోకాలు ముద్రించడం అంటే సామాన్య విషయం కాదు. 

కానీ హెమోప్రోవా సుమారు 280 అడుగు పొడవు, దాదాపు రెండు అడుగుల వెడల్పు ఉన్న వస్త్రంపై పూర్తి భగవద్గీతను ఎంబ్రాయిడరీ చేసిందామా. అందుకు ఆమెకు సుమారు రెండేళ్లపైనే పట్టింది. తాను నేస్తున్న కథకు ఎప్పుడూ నిజంగా అర్థం వచ్చిందో గమనించకుండానే సదా అక్షరాలు సరిగా ఉన్నాయా అని చెక్‌చేసుకుంటూనే ఉందామె. అంతేగాదు అలా 16వ శతాబ్దానికి చెందిన భక్తి గ్రంథమైన ‘నామ్ ఘోసా’ను, అస్సామీ సాధు సంస్కర్త శ్రీమంత శంకరదేవ్ రచించిన గుణమాలను కూడా నేసింది. 

కేవలం అస్సామీ రచనలతోనే ఆగిపోలేదు, ఆగ్ల, హిందీ భాషలలో సైతం ఎంబ్రాయిడరీ చేయడం విశేషం. ఈ పనిని పత్తి, పట్టు, ఉన్ని చివరకు వెదురుతో కూడా చేసింది. ఆమె ఎల్లప్పుడూ కొత్త వస్తువులను సృష్టిస్తూనే ఉంటుంది. ఆమె కళానైపుణ్యానికి ప్రతిఫలం అస్సాం గౌరవ్ అవార్డు, బకుల్ బోన్ అవార్డు, ఆయీ కనకలత అవార్డు, రాష్ట్ర చేనేత వస్త్ర అవార్డులు వంటివి ఎన్నో వరించాయి. ఆమె వారసత్వాన్ని నిర్వచించకపోయినా..తన కళా ప్రతిభతో ఆ దిశగానే కృషి చేశారామె. ఆ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీతో గౌరవించి, సత్కరించింది. 

 

(చదవండి: ఫ్లైట్‌లో కూతుర్ని అలా చూసి.. తల్లిదండ్రులు షాక్‌! ఎందుకలా చెప్పావ్‌..)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement