లగ్జరీ కారు యజమాని పెద్దమనసు..! ఆ ఆటో డ్రైవర్‌ కోసం.. | Lamborghini Owner Wins Hearts Online After Exchanging Cars With Auto Driver In Viral Video, Trending On Social Media | Sakshi
Sakshi News home page

లగ్జరీ కారు యజమాని పెద్దమనసు..! ఆ ఆటో డ్రైవర్‌ కోసం..

Jul 5 2026 4:31 PM | Updated on Jul 6 2026 8:21 AM

Lamborghini owner swaps keys with autorickshaw driver Goes Viral

లగ్జరీ కారులు నడిపే వాళ్లు ఏ రేంజ్‌లో ఉంటారో తెలిసిందే. అంత సులభంగా ఓ సాదాసీదా వ్యక్తులతో మాటలు కలపడం అత్యంత అరుదు. అలాంటిది సరదాగా వాళ్ల వస్తువులను ఒక్కసారి ట్రై చేస్తాం అని అడగడం అంత సులభం కానే కాదు. ఒక వేళ అడిగినా.. ఇస్తారని ‍గ్యారంటీ లేదు. కానీ ఈ లంబోర్ఘిని యజమాని తన గొప్ప మనసును చాటుకుని..నెట్టింట నెటిజన్లను ఫిదా చేశాడు. 

అసలేం జరిగిందంటే..రాకేష్ కుమార్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోని పంచుకున్నారు. ఆ వీడియోలో అతను లంబోర్ఘినిని నడుపుతుండగా రోడ్డుపై ఒక ఆటోరిక్షాను గమనిస్తాడు. సాధారణంగా మొదలైన పరిచయం తర్వాత..ఆ డ్రైవర్‌ నెమ్మదిగా తన మనసులోని మాటను బయటపెడతాడు. వెంటనే యజమాని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా సమ్మతి తెలపడమే కాకుండా ఇరువురు వాళ్ల వాహనాల తాళాలను మార్చుకుంటారు. 

ఆ డ్రైవర్‌ చక్కగా లంబోర్ఘిని నడుపుతూ తన కోరికని తీర్చుకుంటాడు. ఇక సదరు యజమాని ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆ ఆటో రిక్షాను డ్రైవ్‌ చేస్తాడు కూడా. అక్కడితో వీడియో ముగుస్తుంది. ఇక కుమార్‌ ఈ వీడియోని షేర్‌ చేస్తూ..ఈ మరపురాని క్షణం కోసం నేను నా లంబోర్ఘినిని పణంగా పెట్టాను! నిజం చెప్పాలంటే, అతని ఆటో నడపడం నన్ను బాగా కదిలించింది. 

ఆటో మీటర్ డబ్బులు కట్టడమే ఒక సవాలుగా ఉన్న నా కష్టాల రోజుల్లోకి ఇది నన్ను తీసుకువెళ్ళింది అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశాడు. ఈ క్లిప్‌పై విశేషమైన స్పందన వచ్చింది. ఆ ఆటో డ్రైవర్‌ ముఖం నవ్వుతో వికసించగా, ..ఈ యజమాని గొప్ప మనసు దయకు మాటల్లేవ్‌ అంటూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: Aamir Khan And Gauri Spratt : అలా మొదలైంది వారి ప్రేమ కథ..! 25 ఏళ్ల క్రితమే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement