ఎవరీ డాక్టర్‌ ల్యుడ్మిలా ఖోఖ్లోవా? రష్యాలో భారత్‌ గురించి.. | Russian Indologist Lyudmila Khokhlova Honoured With Padma Shri For Promoting Indian Culture, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

ఎవరీ డాక్టర్‌ ల్యుడ్మిలా ఖోఖ్లోవా? రష్యాలో భారత్‌ గురించి..

Jul 5 2026 11:22 AM | Updated on Jul 5 2026 4:40 PM

Dr Lyudmila Khokhlova: The Scholar Behind Global Indian Studies

మన దేశ సంస్కృతి,, భాషలు వంటి వాటిని ఇష్టపడటమే గాదు..తనదేశంలో భోధించి, జ్ఞానాన్ని వ్యాప్తి చేసేందుకు కృషి చేసింది ఓ విదేశీయురాలు. పరభాష ఆంగ్లంపై ఉన్న వ్యామోహంతో మన భాషనే సరిగ్గా మాట్లాడం, పైగా మాట్లాడేందుకు సిగ్గుపడుతుంటారు కొందరు. అలాంటిది విదేశీయురాలై ఉండి కూడా మన దేశ ఔన్యాత్యాన్ని తెలయజేసేలా మన భాష, సంస్కృతిని తన దేశంలో బోధించడమంటే మాములు విషయం కాదు. ఆ నేపథ్యంలో ఆమె అశేష కృషి చూసి ముచ్చటపడి మన భారత ప్రభుత్యం దేశ​ అత్యున్నత పురుస్కారమైన పద్మశ్రీతో గౌరవించి సత్కరించింది. ఎవరామె అంటే..

ఆ మహిళే రష్యాకు చెందిన డాక్టర్ ల్యుడ్మిలా ఖోఖ్లోవా. ఆమె ప్రసిద్ధ ఇండాలజిస్ట్‌(భారత దేశ చరిత్ర నిపుణురాలు), విద్యావేత్త కూడా. తన జీవితంలో ఎక్కువ భాగాన్ని రష్యాలో భారతదేశం గురించి బోధించడానికి, అచంచలమైన జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేశారామె. ఎందరో విద్యార్థులకు భారతదేశ చరిత్ర, సాహిత్యం, తత్వశాస్త్రం, సంస్కృతం, హిందీ వంటి భాషలు దాని గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలను పరిచయం చేశారామె. అంతేగాదు ఆమె  భారతీయ సంస్కృతిపై విస్తృతంగా రచనలు చేశారు. 

అలాగే అనేక విద్యా కార్యక్రమాలు, సాంస్కృతికి మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె చేసిన కృషి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశ వారసత్వాన్ని, మేధో సంప్రదాయాలను మరింతగా అర్థం చేసుకోవడానికి సహాయపడింది. ఇవేగాక రష్యన్‌, ఇంగ్లీష్‌, హిందీ భాషలలో మొత్తం ఆరు పుస్తకాలు, సుమారు 92 పరిశోధనా పత్రాలను రచించారు. ముఖ్యం సిక్కు మతం మూలాలు, అభివృద్దిపై అధ్యయనంతో సహా చారిత్రక భాషాశాస్త్రంపై ఆమె గణనీయమైన పరిశోధన చేశారు. 

ఆమె చేసిన ఈ కృషికి గానూ భారతదేశ అత్యున్న పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీని ప్రదానం చేసి గౌరవించింది. ఆమె ప్రస్థానం విద్య విభిన్న సంస్కృతులను ఎలా అనుసంధానించగలదో , అలాగే దేశాలను ఎలా దగ్గర  చేయగలదో చూపించింది. అభ్యాసం, సాంస్కృతిక మార్పిడి బలమైన అంతర్జాతీయ సంబంధాలను ఎలా నిర్మించగలదో నిరూపిస్తూ..విద్యార్థులకు, ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచింది డాక్టర్‌ ఖోఖ్లోవా.

(చదవండి: ఆ రోజుల్లో..ఇరుగూ పొరుగే..మెరుగు!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement