ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లు హతం | Two Lawrence Bishnoi Gang Shooters Killed In Haryana Police Encounter, More Details Inside | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లు హతం

Jul 5 2026 7:51 AM | Updated on Jul 5 2026 10:36 AM

Two Lawrence Bishnoi Gang Shooters Killed in Shootout

బహదూర్‌గఢ్‌: హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో ఆదివారం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు షూటర్లు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. మృతులను పర్వేష్, హిమాన్షుగా గుర్తించామని, గత నెలలో హన్సిలో ఒక జిమ్ యజమాని కపిల్ హత్య కేసులో వీరిద్దరే ప్రధాన నిందితులని ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ భూషణ్ తెలిపారు. వీరు ఆయుధాలతో ఏదో నేరానికి పాల్పడేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇన్‌ఛార్జ్ మంజీత్‌కు అందిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు.

పోలీసులు నిందితులను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు షూటర్లు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పులలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కాలికి గాయమమయ్యింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు షూటర్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడిన కానిస్టేబుల్‌ను మెరుగైన చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు, ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement