మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హిందూ యువతి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ యువతి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం గాలించగా, కచేరీ మసీదు ఇమామ్ (మౌలానా) మన్సూర్ కుమారుడు ఫైజ్ ఆమెను మభ్యపెట్టి తన వెంట తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలిసింది. యువతి స్నేహితురాలి ద్వారా ఈ సమాచారం బయటకు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు.
అనంతరం అఖిల భారత హిందూ సురక్షా సంఘటన్ కార్యకర్తలతో కలిసి బాధిత కుటుంబీకులు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. తమ కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేసే అవకాశం ఉందని, ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: జాబిల్లిపై రాకెట్ క్రాష్.. భారీ గుంతను గుర్తించిన నాసా!


