‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Dont Trouble The Trouble Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Oct 2 2026 12:35 AM | Updated on Oct 2 2026 1:05 AM

Dont Trouble The Trouble Movie Review And Rating In Telugu

టైటిల్‌: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌
నటీనటులు: ఫహాద్‌ ఫాజిల్‌, బేబీ సారా, మహేశ్‌ మంజ్రేకర్‌, సౌరభ్‌ సచ్‌దేవ్‌, సుబ్బరాజ్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్స్స్‌
నిర్మాతలు: ఎస్‌ ఎస్‌ కార్తికేయ, శోభూ యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని
రచన-దర్శకత్వం: శశాంక్‌ ఏలేటి
సంగీతం: కాల భైరవ
విడుదల తేది: అక్టోబర్‌ 2, 2026

మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. విభిన్నమైన కథలు, విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ నేడు(అక్టోబర్‌ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? ఫహద్‌ మరోసారి తన నటనతో మెప్పించారా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం

కథేంటంటే.. 
సూరి(ఫహాద్‌ ఫాజిల్‌) ఓ అనాథ. అంబుల్‌లెన్స్‌ డ్రైవర్‌గా పని చేస్తూ. ఈజీ మనీకి అలవాటు పడతాడు. ఫ్రెండ్స్‌ దగ్గర పందెం కట్టడం..ఇల్లీగల్‌ పనులు చేస్తూ డబ్బును సంపాదిస్తుంటాడు. అలా ఆ ఏరియా డాన్‌ అస్లాం భాయ్‌(మహేశ్‌ మంజ్రేకర్‌)ని కూడా మోసం చేసి గొర్రె పొట్టేల పందెంలో గెలుస్తాడు. ఆ తర్వాత అసలు విషయం అస్లాంభాయ్‌కి తెలుస్తుంది. దీంతో సూరి దగ్గరకు వచ్చి రెండు నెలల్లో రూ. 25 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని హెచ్చరిస్తాడు. అంత డబ్బు సంపాదించడానికి మళ్లీ అడ్డుదారినే ఎంచుకుంటాడు. స్కూల్‌ బయట స్నేహితుడితో మ్యాజిక్ చేయిస్తూ.. స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ ప్రయత్నం బెడిసి కొడుతుంది. అదే సమయంలో సూరికి బేబీ దివ్య పరిచయం అవుతుంది.  ఆమెకి  కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. అసలు దివ్య ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ఆమె సూరికి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? దివ్య పరిచయం తర్వాత సూరీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి ?దివ్యకు ఉన్న  స్పెషల్ పవర్స్ ని సూరి ఎలా వాడుకున్నాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
రాజమౌళి కొడుకు నిర్మాత.. రాజమౌళి సమర్పణ.. ఇండియాలోనే గొప్ప నటుల్లో ఒకరైన ఫహద్ ఫాజిల్‌ హీరో.. ఇవి చాలు సినీ ప్రియుడుకి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా పై అంచనాలు పెట్టుకోవడానికి. అయితే అదే అంచనాలతో థియేటర్ కి వెళ్తే మాత్రం కొంతవరకు నిరాశ తప్పదు. కథలో కొత్తదనం లేకపోవడం కంటే, ఉన్న కథను ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో చెప్పలేకపోవడమే ప్రధాన సమస్య. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం, సెకండాఫ్‌లోనూ సాగదీత ఉండటం, హీరో–బేబీ ఎమోషన్ పూర్తిగా వర్కౌట్ కాకపోవడం సినిమాకు మైనస్‌లు. అక్కడక్కడ కామెడీ, ఫహద్ ఫాజిల్ నటన, క్లైమాక్స్ మాత్రం కొంత ఉపశమనం ఇస్తాయి.

అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు ఇంకా చెప్పాలంటే ఫస్ట్ అఫ్ అంత  సోసోగానే ఉంటుంది. సూరి పాత్ర నేపథ్యాన్ని తెలియజేసే  సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. సూరి డబ్బులు కోసం చిన్న, చిన్న తప్పులు  చేసి దొరికిపోవడం.. చివరకు విలన్‌నే మోసం చేసి డబ్బులు తీసుకోవడం...అతను వచ్చి వార్నింగ్‌ ఇవ్వడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. బేబీ దివ్య ఎంట్రీ తర్వాత సినిమా జోనర్ పూర్తిగా మారిపోతుంది. 

ద్వితియార్థంలోనే అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే ఇక్కడ కూడా కథనం పరుగులు పెట్టించకుండా నెమ్మదిగా సాగదీస్తూ.. బోరింగ్‌గా సాగుతుంది. బేబీ దివ్యకు సంబంధించిన అసలు విషయం తెలిసిన తర్వాత కూడా మళ్లీ సాగదీత సన్నివేశాలతో  ముందుకు నడిపించాడు. అక్కడక్కడ కామెడీ సీన్లు వర్కౌట్‌ అయ్యాయి కానీ.. హీరో, బేబీ ఎమోషల్‌ పూర్తి స్థాయిలో వర్కౌట్‌ కాలేదు. చాలా వరకు సాగదీతగా, లాజిక్‌ లెస్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌ కొంతవరకు ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే..
ఫహాద్‌ పాజిల్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఈజీగా ఒదిగిపోతాడు. సూరి పాత్రలోనూ ఆయన తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక బేబీ సార పాత్ర కూడా ఈ సినిమాలో చాలా కీలకం. దివ్య పాత్రలో ఆమె ఒదిగిపోయింది. అమాయకపు మాటలు.. చూపులతో అందర్నీ ఆకట్టుకుంటుది. ఇక విలన్‌గా మహేశ్‌ మంజ్రేకర్‌ తెరపై కనిపించేది కాసేపే. అటు పూర్తిగా విలన్‌గా భయపెట్టలేదు..ఇటు కమెడియన్‌గా నవ్వించనూ లేదు. సౌరవ్‌ సచ్‌దేవ్‌, వెంకటేష్‌ కాకుమాను, సుబ్బరాజ్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాల భైరవ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో చాలా వరకు సాగదీత సీన్లు ఉన్నాయి..వాటిని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌
 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement