‘సుడిగాలి’ సుధీర్ హీరోగా నటించిన చిత్రం ‘జీవోఏటీ’ (గోట్). ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్స్’ అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్‌గా నటించారు. వేదవ్యాస్ దర్శకత్వంలో చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కాగా, ఏషియన్ సినిమాస్ సమర్పణలో నవంబరు 12న ఈ సినిమాను విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. ‘‘కమర్షియల్ హంగులతో ఉంటూనే, నేటి యువతను ఆలోచింపజేసేలా ఈ కథనం ఉంటుంది. సుధీర్ కెరీర్‌లో ఈ మూవీ ఒక మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది.


