విశ్వక్ సేన్, ఏక్తా రాథోడ్ హీరో, హీరోయిన్లుగా సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లెగసీ’. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని, ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని యూనిట్ తెలిపింది.
‘‘రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విశ్వక్ సేన్ పవర్‌ఫుల్ పాత్ర చేశారు. తన తండ్రి రాజకీయ వారసత్వం కారణంగా అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిన ఓ వారసుడి జీవిత ప్రయాణమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం’’ అని యూనిట్ పేర్కొంది.


