అరవింద్, అర్చన అయ్యర్, హారిక నారాయణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నీరో’. ఈ చిత్రాన్ని గోల్డ్ మౌంటెన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ బ్యానర్ పై అనురాగ్ పర్వతనేని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ కల్యాణ చక్రవర్తి త్రిపురనేని రూపొందిస్తున్నారు. నటుడు శివాజీ కీలక పాత్రలో కనిపంచనున్నారు. ఈ సినిమా గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అతిథిగా పాల్గొని మాట్లాడారు.
‘ఏ డైరెక్టర్ అయినా తను నమ్మిందే తెరకెక్కించాలని అనుకుంటాడు. ఆ క్లారిటీ ఉన్నప్పుడే దర్శకుడు సక్సెస్ అవుతాడు. నా సినిమాలకు పాటలతో పాటు స్క్రిప్డ్ డిస్కషన్స్ లో పనిచేసిన వ్యక్తి కల్యాణ చక్రవర్తి. ఆయన ఒక మంచి సినిమానే మన ముందుకు తీసుకొస్తాడనే నమ్మకం ఉంది. ఈ గ్లింప్స్ తోనే అది ప్రూవ్ అవుతోంది. గ్లింప్స్ చూస్తే సినిమాలో ఏది ఎంత ఉండాలో అంత ఉంది. అరవింద్ పర్ ఫార్మెన్స్ లో ఇంపాక్ట్ ఉంది. ఆడియెన్స్ ను కట్టిపడేసే ఎక్స్ ప్రెషన్స్ చూపించారు. నీరోతో ఒక మంచి హీరో వచ్చాడనే పేరు అరవింద్ కు, ఆ హీరోను తీసుకొచ్చాడనే పేరు కల్యాణ చక్రవర్తికి రావాలి’ బోయపాటి శ్రీను అని అన్నారు.
ఇదీ చదవండి: సీత పాత్రపై ట్రోలింగ్.. స్పందించిన సాయిపల్లవి)


