హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ | Hyderabad International Short Film Festival Season 2 Update | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్

Nov 28 2026 6:27 PM | Updated on Nov 28 2026 6:31 PM

Hyderabad International Short Film Festival Season 2 Update

2027 జనవరి 27 నుంచి హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్-2

హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండో సీజన్‌కు సిద్ధమైంది. 2027 జనవరి 27 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా ఈ ఫెస్టివల్ జరగనుంది. దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్, తెలంగాణ ప్రభుత్వ యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ వేడుక నిర్వహించనున్నారు.

(చదవండి: నేను డ్యాన్స్‌ చేసినా.. నిజమని నమ్మరేమో : మమ్ముట్టి)

ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్‌లోని పర్యాటక భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్, టూరిజం ఎండీ క్రాంతి, దర్శకుడు అంకురం ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యువతలోని సృజనాత్మకతను ప్రోత్సహించాలని, వారితో మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ రూపొందించేలా అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శించనున్నారు. అలాగే ఐదు రోజుల పాటు ఫిల్మ్ ఎక్స్‌పో కూడా నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రముఖులతో అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement