తండేల్’ బ్లాక్‌బస్టర్ తర్వాత అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్య చేసిని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆ రోజుల్లో అలా ఉండేది..
కమర్షియల్ సినిమాల కోసం ప్రస్తావించగా.. నాగచైతన్య తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘కమర్షియల్ సక్సెస్ అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పదేళ్ల క్రితం ఇదే ప్రశ్న అడిగితే.. సినిమాలో ఐదు పాటలు, మూడు ఫైట్లు ఉండాలని చెప్పేవారు. అవి లేకపోతే అసలు అది సినిమానే కాదనేవారు. కానీ ఇప్పుడు ఐదు పాటలు ఎందుకు? సినిమా అంతా సాగదీయడం ఎందుకు? అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడు అలాంటి ఫైట్లు పెడితే సోషల్ మీడియాలో పాత ఫార్మాట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇప్పుడు లేదు
అందుకే అప్పట్లో కమర్షియల్ సినిమా అప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు. ప్రేక్షకులు కొత్తదనం ఉన్న కథలను చూడాలనుకుంటున్నారు. నేను కూడా అలాంటి విభిన్నమైన కథతో విజయం అందుకుంటే అదే నాకు నిజమైన కమర్షియల్ సక్సెస్’ అని నాగచైతన్య చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: మట్టిలో మాణిక్యం.. ఒక్క పాటతో ఫేమస్..)
కాగా కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్పర్ష్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


