దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఇది రాజమౌళికే సొంతం
ఈ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి రాజమౌళి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా తనకు నచ్చితే వెంటనే ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో స్పందించడం, ఇలాంటి కార్యక్రమాలకు హాజరై చిత్రబృందాన్ని ప్రోత్సహించడం ఆయనలోని గొప్ప లక్షణం. ఇలాంటి అరుదైన గుణం రాజమౌళికి మాత్రమే సొంతం’ అని అన్నారు.
ఇదే కార్యక్రమంలో నటి రుహాణి శర్మ గురించి మాట్లాడుతూ నవ్వులు పూయించారు. ‘రుహాణి.. నీతో ప్రైవేట్‌గా మాట్లాడతా.. నేను నీ కోసం అబ్బాయిని వెతుకుతున్నా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు.
(ఇదీ చదవండి: రష్మిక ఇంటికెళ్తే ఎలా ఉంటుందో తెలుసా?.. వీడియో వైరల్)
#RuhaniSharma , We Will Talk Privately. I’m Searching a Boy for You. – Allu Aravind at #AakasamLoOkaTara Success Meet https://t.co/cf3VKfnYFU
— Indian Clicks (@IndianClicks) November 28, 2026


