విజయ్ సేతుపతి ట్రైన్.. ట్రైలర్ వచ్చేసింది | Vijay Sethupathi and Shruti Haasan Train Movie Trailer Out now | Sakshi
Sakshi News home page

Train Movie Trailer: విజయ్ సేతుపతి ట్రైన్.. ట్రైలర్ రిలీజ్

Nov 28 2026 1:24 PM | Updated on Nov 28 2026 1:24 PM

Vijay Sethupathi and Shruti Haasan Train Movie Trailer Out now

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ ట్రైన్. ఈ చిత్రంలో శృతిహాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మిస్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి ఆశించినస్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఓ ట్రైన్‌ జర్నీలో చోటుచేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలు, ఆ ట్రైన్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు, ప్రయాణికుల ఇబ్బందుల నేపథ్యంలోనే ఈ మూవీని రూపొందించారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం ట్రైన్‌లోనే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. రైలులో జరిగే హత్యలు, ఛేజింగ్‌లు చూస్తుంటే ఓ మాఫియా కథలా అనిపిస్తోంది. ట్రైన్‌లో ఫైట్ సీన్స్ ఈ మూవీపై ఆసక్తిని పెంచేస్తున్నాయి.  కాగా.. ఈ చిత్రంలో నాజర్, యుగి సేతు, నరైన్, కేఎస్‌ రవికుమార్, సంపత్‌ రాజ్, ఐరా దయానంద్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. మిస్కిన్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీని కలైపులి ఎస్‌.థాను నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు దర్శకుడే సంగీతం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement