ప్రియదర్శి ఇడుపు కాయితం.. మరో క్రేజీ సాంగ్ రిలీజ్ | Priyadarshi Idupu Kayitham movie song released | Sakshi
Sakshi News home page

Idupu Kayitham movie: ప్రియదర్శి ఇడుపు కాయితం.. మరో క్రేజీ సాంగ్ రిలీజ్

Nov 28 2026 11:11 AM | Updated on Nov 28 2026 11:11 AM

Priyadarshi Idupu Kayitham movie song released

తెలంగాణ పల్లెటూరి సంప్రదాయాలు, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్న టాలీవుడ్ మూవీ ఇడుపు కాయితం.  ఇందులో ప్రియదర్శి సరసన నాగదుర్గ కథానాయికగా నటిస్తోంది. వంశీరెడ్డి దొండపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ మూవీని  సుకుమార్ రైటింగ్స్ అండ్ బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి ఆదరణ వస్తోంది.

ఇప్పటికే రిలీజైన పాటలు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ మూవీలోని మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఉల్లిపూల అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు అభినయ శ్రీనివాస్ లిరిక్స్ అందించగా.. హెనాగ్రేస్ ఆలపించారు. ఈ సాంగ్‌ సురేశ్ బొబ్బిలి కంపోజ్ చేశారు. ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో అభినవ్ గోమటం, వినోద్ బాల, సురభి ప్రభావతి, మైమ్ మధు, సుజాత దీక్షిత్, గీతా భాస్కర్, బిత్తిరి సత్తి, శివ జ్యోతి, మౌనిక రెడ్డి, అభయ్ కీలక పాత్రల్లో నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement