రక్తపాతం.. ఇప్పటికైనా ఆపేస్తే బెటర్ ఏమో | Bhogi Movie Reviews And Trolls On BloodShed | Sakshi
Sakshi News home page

Bhogi Movie: 'భోగి'పై దారుణమైన విమర్శలు.. ఎందుకిలా?

Nov 28 2026 4:26 AM | Updated on Nov 28 2026 4:26 AM

Bhogi Movie Reviews And Trolls On BloodShed

శర్వానంద్ 'భోగి' సినిమా ఈ వీకెండ్ థియేటర్లలో రిలీజైంది. ముందునుంచే దీనిపై పెద్దగా అంచనాలేం లేవు. కానీ ఓవర్సీస్, మన దగ్గర షోలు పడిన తర్వాత బీభత్సమైన నెగిటివిటీ వచ్చింది. సినిమా బాగుందని అనేవాళ్లకంటే.. ఇదేం మూవీ అని అంటున్నవాళ్లే ఎక్కువమంది. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలోనూ చాలా పోస్టులు కనిపిస్తున్నాయి.

'భోగి' సినిమా 1960లోని తెలంగాణ నేపథ్యంగా తీశారు. మూఢనమ్మకాలు, నరబలి అనే కాన్సెప్ట్ ఇందులో చూపించారు. నరకడం, తలలు తెగిపడటం అనేది ఇందులోనూ ఎక్కువగానే ఉంది. రీసెంట్ టైంలో వచ్చిన ప్యారడైజ్, టాక్సిక్ సినిమాల్లో ఇలానే విపరీతంగా రక్తపాతం సీన్స్ ఉన్నాయి. పాన్ ఇండియా మోజులో పడిపోయిన చాలామంది తెలుగు హీరోలు.. తలలు నరికితేనే హీరోయిజం అనుకుంటున్నారు. కానీ 'ఎమోషన్' అనే ముడిసరుకు ఉందా లేదా అనేది చూసుకోవట్లేదు.

మరోవైపు దర్శకులు కూడా ట్రెండ్ పేరు చెప్పి ఈ తరహా సినిమాలే ఎ‍క్కువగా తీస్తున్నారు. ఇప్పటికే జనాలకు ఇవి బోర్ కొట్టేస్తాయి. అందుకు తగ్గట్లే చాలామంది.. ఇప్పటికైనా రా అండ్ రస్టిక్ పేరుతో తీస్తున్న యాక్షన్ సినిమాలు ఆపేయాలని కోరుతున్నారు. అయితే ఈ జానర్‌లో ఇప్పటికీ సినిమాలు తీయొచ్చు. 'ధురంధర్'నే ఉదాహరణగా తీసుకుంటే.. ఎంగేజింగ్‌గా ఉండే కథకు తగ్గట్లే రక్తపాతం సీన్స్ పెట్టారు. అది సెట్ అయింది. వేలకోట్ల రూపాయల వసూళ్లు వచ్చేలా చేసింది. కానీ 'భోగి'లో ఈ తరహా ప్రయత్నం వర్కౌట్ కాలేదు. ఈ రక్తపాతం అనే జానర్ నుంచి సాయిధరమ్ తేజ్ చేసిన 'సంబరాల ఏటిగట్టు', విజయ్ దేవరకొండ చేస్తున్న 'రౌడీ జనార్ధన' రిలీజ్ కావాల్సి ఉన్నాయి. వీటిలోనైనా సరే స్టోరీకి తగ్గట్లు ఈ తరహా యాక్షన్ సీన్స్ ఉంటే పర్లేదు. లేదంటే కష్టమే!

అదే టైంలో తెలుగు ఇండస్ట్రీలోని దర్శకులు కూడా ఒకే రకమైన మూస సినిమాలు కాకుండా ఎవరికి వాళ్లు కాస్త డిఫరెంట్‌గా ప్రయత్నించాలి. భిన్నమైన జానర్లు ఎంచుకుని, వాటితో స్టోరీలు రెడీ చేసి హీరోలని ఒప్పించాలి. అప్పుడే తెలుగు ప్రేక్షకుడు.. తమిళ, మలయాళ చిత్రాల వెంటపడటం మానేసి తెలుగు మూవీస్ చూస్తాడు. అలా కాదని అవే రెగ్యులర్ టెంప్లేట్ సినిమాలు చేసుకుంటూ పోతే తెలుగు హీరోలు, దర్శకనిర్మాతలని ప్రేక్షకుడే నిర్ధాక్షిణ్యంగా పట్టించుకోవడమే మానేస్తాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement