ఆకాశంలో ఒక తార అందరి మనసులను హత్తుకుంది: ఎస్‌ఎస్‌ రాజమౌళి | Rajamouli Speech At Aakasamlo Oka Tara Success Celebration | Sakshi
Sakshi News home page

ఆకాశంలో ఒక తార అందరి మనసులను హత్తుకుంది: ఎస్‌ఎస్‌ రాజమౌళి

Nov 28 2026 12:12 AM | Updated on Nov 28 2026 12:12 AM

Rajamouli Speech At Aakasamlo Oka Tara Success Celebration

‘ఆకాశంలో ఒక తార’ వేడుకలో ఓ దృశ్యం

‘‘భారతీయ చిత్ర పరిశ్రమలో, అలాగే తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటీమణులున్నారు. తెలుగు ప్రేక్షకులకు మన భాష, ఇతర భాషల వాళ్లు అనే తేడాలుండవు. శ్రీదేవి, జయప్రద, జయసుధగార్లలా ఒక తెలుగమ్మాయి ఆ స్థాయికి వెళితే బాగుంటుందని అనిపిస్తుంటుంది... అది మరెవరో కాదు సాత్విక అనిపిస్తోంది. ‘ఆకాశంలో ఒక తార’లో అద్భుతంగా నటించింది. రుహానీ శర్మ అద్భుతమైన నటన కనబరిచింది.

 శ్రుతీహాసన్‌ పాత్రని చాలా ప్రేమిస్తారు’’ అని ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి అన్నారు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్‌ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్‌ మీడియా బ్యానర్లపై సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించిన ఈ మూవీ ఈ నెల 20న విడుదలైంది. శుక్రవారం నిర్వహించిన ‘ఆకాశంలో ఒక తార స్కై హై సక్సెస్‌ సెలబ్రేషన్స్‌’కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఎస్‌ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ఆకాశంలో ఒక తార’ని తన భుజాలపైన మోశారు దుల్కర్‌.

‘తమ్మీ... నువ్వు మా వాడివే’ అని తెలుగు సినిమా భావిస్తోంది. తమ కల ఏదో ఒకరోజు సాకారం అవుతుందని ఇన్నేళ్లపాటు ఈ కథని మోసిన రమ్య, సందీప్, పవన్, రాజ్‌ బావతో పాటు యూనిట్‌ని అభినందిస్తున్నా. ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ సినిమాతో నేను, స్వప్న ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ‘ఆకాశంలో ఒక తార’ క్రెడిట్‌ తనకే ఇస్తున్నాను. అరవింద్‌గారు ‘గర్ల్‌ఫ్రెండ్, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి’ వంటి సినిమాలు చేస్తున్నారు... అఫ్‌కోర్స్‌ అవి అవార్డులు అందుకునే సినిమాలనుకోండి. 

మీరు ఒక్కరే గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ‘మగధీర’ సినిమా తీసినట్టు సోలోగా చేయాలి. ‘ఆకాశంలో ఒక తార’ కథ అందరి మనసులను హత్తుకోవడానికి కారణం అద్భుతమైన స్క్రీన్‌ ప్లే. ఈ చిత్రంలోని అందమైన సీన్స్‌ నాలో ఉద్వేగాన్ని కలిగించాయి. పవన్‌ సాధినేని ఎంత ఎఫర్ట్‌ పెడితే ఇలాంటి ఫలితం వస్తుందో ఒక డైరెక్టర్‌గా నాకు తెలుసు’’ అని చెప్పారు. దుల్కర్‌ మాట్లాడుతూ– ‘‘ఆకాశంలో ఒక తార’ సినిమాకు ఇంత అద్భుతమైన విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. స్వప్న దత్, సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం, విద్య కొప్పినీ , కార్తికేయ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement