breaking news
Satvika Veeravalli
-
పవర్ఫుల్
‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో భాగమయ్యారు హీరోయిన్ శ్రుతీహాసన్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా, జనవరి 28న (బుధవారం) శ్రుతీహాసన్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో శ్రుతీహాసన్ నటిస్తున్న విషయాన్ని వెల్లడించి, ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమా కథలో ఓ కీలక మలుపుకు కారణమైన పాత్రలో శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ఆమె ప్రెజెన్స్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, మలయాళ తమిళ, హిందీ భాషల్లో ఈ వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
సాత్విక వీరవల్లి హీరోయిన్ గా ఎంట్రీ..
-
నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి?.. హీరోయిన్ ఇంట్రో గ్లింప్స్ చూశారా?
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఆకాశంలో ఒక తార. ఈ మూవీకి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ను పరిచయం చేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తున్నట్లు గ్లింప్స్ రిలీజ్ చేశారు. నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. రోడ్డు కూడా సరిగా లేని ఈ ఊరి నుంచి ఆకాశానికి నిచ్చేనేశావా? ముందు ఈ ఊరి పొలిమేర దాటి చూపించు చూద్దాం అనే డైలాగ్ వింటుంటే.. కనీస వసతులు కూడా లేని పల్లెటూరి అమ్మాయి తన కలలను ఎలా సాధించుకుంది అనే కథాంశంతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.


