నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి?.. హీరోయిన్‌ ఇంట్రో గ్లింప్స్‌ చూశారా? | Introducing Satvika Veeravalli in Aakasamlo Oka Tara Movie | Sakshi
Sakshi News home page

Aakasamlo Oka Tara Movie: నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి?.. హీరోయిన్‌ ఇంట్రో గ్లింప్స్‌ చూశారా?

Jan 19 2026 5:50 PM | Updated on Jan 19 2026 6:13 PM

Introducing Satvika Veeravalli in Aakasamlo Oka Tara Movie

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఆకాశంలో ఒక తార. ఈ మూవీకి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్‌ను పరిచయం చేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక గ్లింప్స్ రిలీజ్ చేశారు.  

ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గ్లింప్స్ రిలీజ్ చేశారు. నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి అనే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. రోడ్డు కూడా సరిగా లేని ఈ ఊరి నుంచి ఆకాశానికి నిచ్చేనేశావా? ముందు ఈ ఊరి పొలిమేర దాటి చూపించు చూద్దాం అనే డైలాగ్ వింటుంటే.. కనీస వసతులు కూడా లేని పల్లెటూరి అమ్మాయి తన కలలను ఎలా సాధించుకుంది అనే కథాంశంతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సమ్మర్‌ కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement