కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య తొలిసారి తెలుగు స్ట్రెయిట్ సినిమా చేస్తున్నారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. లక్కీ భాస్కర్ మూవీ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను తెరకెక్కించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ ఏడాది జులైలో థియేటర్స్‌లోకి రానుంది. అయితే, ఈ మూవీ రీమేక్ అంటూ సోషల్‌మీడియాలో కథనాలు వస్తున్నాయి.
పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ యాక్షన్-కామెడీ చిత్రం 'కంగారూ'(Kangaroo)కి రీమేక్ అని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. 2007లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమా రీమేక్‌గా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారని ప్రచారం మొదలైంది. అయితే, ఇందులో నిజం లేదని ఇండస్ట్రీకి చెందిన కొందరు చెబుతున్నారు. ఆ మూవీ రైట్స్ ఇప్పటికీ ఎవరూ కొనుగోలు చేయలేదని క్లారిటీ ఇస్తున్నారు.

విశ్వనాథ్ అండ్ సన్స్ అనేది వెంకీ అట్లూరి రూపొందించిన స్క్రిప్ట్‌తోనే తెరకెక్కిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ రీమేక్ టాపిక్‌పై ఆయన స్పిందించే ఛాన్స్ ఉంది. 45 ఏళ్ల కథానాయకుడిపై ఇరవై ఏళ్ల అమ్మాయి ఇష్టం పెంచుకుంటే.. వారి బంధం ఎలా ఉంటుంది. ఇద్దరి మధ్య ఎలాంటి భావోద్వేగాలు కనిపిస్తాయనేది ఈ మూవీ కథ అని సమాచారం. ఇందులో మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాష్‌కుమార్ అందించారు.


