దివ్వెల మాధురి, బిగ్‌బాస్ ఫేమ్ తనూజపై టీటీడీ చర్యలు తీసుకోనుంది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నందుకు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేక్‌ను తిరుమలకు తీసుకెళ్లడం అక్కడ వేడుకలు చేయడం నిబంధనలకు విరుద్ధమని టీటీడీ పేర్కొంది. కొండపై ఇలాంటి వేడుకలు నిషేధమని తెలిపింది. అయితే, తాజాగా దువ్వాడ శ్రీనివాస్‌తో పాటుగా ముధురి వివరణ ఇచ్చారు. కొండపై తాము కట్ చేసిన కేక్ ఎగ్‌లెస్ అని అందుకు సంబంధించిన బిల్‌ను ఆయన షేర్ చేశారు.

తిరుమల కొండపై తనూజ బర్త్‌డే సందర్భంగా తాము కేక్ కట్ చేసింది వాస్తవమేనని దువ్వాడ శ్రీనివాస్ ఇలా అన్నారు. 'ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలు కావడంతో తన పుట్టినరోజు నాడు దర్శనం చేసుకోవాలనుకుంది. దీంతో మాతో పాటుగా తిరుమల వచ్చింది. అయితే, తనకు చెప్పకుండానే మేము కేక్ తిరుపతిలో కొన్నాం. అది పూర్తిగా ఎగ్‌లెస్ కేక్. మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. ఆయన పేరు పెట్టుకుని బతికే నేను ఎట్టి పరిస్థితిల్లోనూ తప్పు చేయను. నా మొదటి తలనీలాలు ఎడుకొండలవాడి సన్నిధిలోనే ఇచ్చాను. ఇప్పటికి వందసార్లకు పైగానే స్వామిని దర్శించుకున్నాను. ప్రయాణంలో కూడా మేము తినే ఆహారం పూర్తిగా శాఖాహారమే ఉంటుంది. అయితే, అక్కడ కేక్ కట్ చేయకూడదనే నిబంధనలు నాకు తెలియవు. తెలిసింటే ఆ పొరపాటు చేయం. కానీ, కొన్ని మీడియా ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.' అని ఆయన అన్నారు.
బీఆర్ నాయుడి వీడియో సంగతేంటి..?
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి వీడియో టాపిక్‌ను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి విషయాలను హైలెట్ చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మేము కేక్ కట్ చేసినందుకే కేసు పెట్టండని చెబుతున్నారు. మరి బీఆర్ నాయుడు చేసిన పనికి ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. తన వీడియో తానే చూసి ఏ తప్పు కనిపించలేదని అంటున్నాడు. అలాగే తాము కేక్ కట్ చేసిన వీడియోలో ఏం తప్పు ఉందని అన్నారు. మాకు తెలియక కేక్ కట్ చేశాం.. క్షమించమని స్వామిని వేడుకుంటాం. కానీ, నువ్వు చేసిన పనికి ఏం చేస్తావ్.. నీ వీడియో టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకే మాపై కేసులు పెడతావా అంటూ ఆయన ప్రశ్నించారు.


