breaking news
thanuja
-
ప్రజలకు ఏడాదంతా వెన్నుపోటే
సాక్షి, న్యూఢిల్లీ: మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మాయలోపడేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్సీపీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి పేర్కొన్నారు. ఏడాదంతా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే పాలన సాగించారని మండిపడ్డారు. బాబు వెన్నుపోటు రాజకీయాలను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ోమవారం ఢిల్లీలోని ఆమె నివాసంలో తనూజ రాణి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు జూన్ 4న ఏపీవ్యాప్తంగా ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోజు ప్రజలంతా కూటమి మోసాల్ని నిలదీసేందుకు లోక్‌సభ నియోజకవర్గం కేంద్రాల్లో నిర్వహించే భారీ ర్యాలీకి హాజరై జయప్రదం చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.ఏడాది గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఇంకా కల్ల»ొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము వెన్నుపోటు దినాన్ని ఘనంగా నిర్వహించి, చంద్రబాబు మోసాలను ప్రపంచానికి చాటిచెబుతామని స్పష్టం చేశారు. -
గిరిజనుల కులదైవం ఫోటోతో పాటు వైఎస్ఆర్ గారి ఫోటో..
-
ఎంపీ తనూజా రాణి ప్రమాణస్వీకారం
-
ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించలేదని
బొమ్మనహళ్లి : ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన బుధవారం సాయంత్రం ఆనేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆనేకల్ పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన బి.తనూజ(22) ఇదే పట్టణంలోని కళాశాలలో ద్వితీయ పీయూసీ చదువుతోంది. తల్లిదండ్రులు మగ్గం ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. సదరు యువతి తాను చదివే కళాశాలలోనే ఓ యువకుడిని ప్రేమించింది. తమకు వివాహం చేయాలని తల్లిదండ్రులను కోరింది. వారు అంగీకరించకపోవడంతో బుధవారం రాత్రి ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఘోరం..
ట్రాక్టర్ బోల్తా.. టెన్త్ విద్యార్థిని మృతి పది మందికి తీవ్రగాయాలు.. క్షతగాత్రుల్లో ఆరుగురు విద్యార్థులు యల్లనూరు: కూలీలు, విద్యార్థులతో బయల్దేరిన ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. స్పెషల్ క్లాస్‌కు వెళుతున్నానని చెప్పి ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోతివా అంటూ మృతి చెందిన విద్యార్థిని తనూజ తల్లిదండ్రులు రాములు, గురక్కలు బోరున విలపించారు. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ రోదించారు. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండలం నీర్జాంపల్లి సమీపంలో గ్రామానికి చెందిన పెద్దిరాజు, ఆయన భార్య రామలక్ష్మమ్మ, పెద్దిరాజు తమ్ముడు చంద్రయ్య, ఆయన భార్య జయమ్మలు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ట్రాక్టర్లో ఇసుకను తీసుక తేవడానికి బయల్దేరారు. అదే సమయంలో నీర్జాంపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థులు తనూజ(15), భాస్కర్, గంగామహేష్, కామాక్షి, మణికంఠ, భారతి, పృధ్విలు తాము చదువుకుంటున్న పార్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు వెళ్లేందుకు ట్రాక్టర్లో ఎక్కారు. గ్రామం దాటి కొంతదూరం వెళ్లగానే ట్రాక్టర్ అదుపుతప్పి గోతిలోకి బోల్తాపడింది. అందరూ తీవ్రంగా గాయపడటంతో హుటిహుటిన పులివెందుల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తనూజ మృతి చెందింది. ప్రథమ చికిత్స అనంతరం విద్యార్థిని భారతిని మెరుగైన వైద్యం కోసం కుప్పం ఆస్పత్రికి తరలించారు. కామాక్షి, మణికంఠలను అనంతపురం, పెద్దిరాజును కర్నూలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మిగిలిన విద్యార్థులు గంగామహేష్, భాస్కర్‌తో పాటు చంద్రయ్య, జయమ్మ, రామలక్ష్మమ్మలు పులివెందులలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను పరామర్శ: రోడ్డు ప్రమాద విషయం తెలియగానే ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి పులివెందుల ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. -
చిన్నారి ప్రాణం తీసిన టీవీ
విడపనకల్లు (ఉరవకొండ): ప్రమాదవశాత్తు టీవీ (టెలివిజన్) మీద పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన మండలంలోని కరకముక్కల గ్రామంలో సోమవారం చోటు చేçసుకుంది. గ్రామానికి చెందిన తిమ్మప్ప, లక్ష్మీదేవిల కూతురు తనూజ(4) ఇంట్లో ఆడుకుంటూ, టీవీకి ఉన్న స్టాండ్‌ను పట్టుకుని ఊపడంతో.. టీవీ మీద పడింది. దీంతో చిన్నారి తలకు గాయమై స్పహ కోల్పోయింది. తల్లిదండ్రులు వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.