బిగ్‌బాస్ 9 హౌస్‌లో విజయవంతంగా 12 వారాలు పూర్తయ్యాయి. ఆదివారం ఎపిసోడ్‌లో దివ్య ఎలిమినేట్ అయి బయటకెళ్లిపోవడం చాలామంది ఊహించిందే. మరకొరు కూడా ఎలిమినేట్ అవుతారేమో అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఇకపోతే 13వ వారానికిగానూ సోమవారం నామినేషన్స్ ప్రక్రియ చిత్రవిచిత్రంగా జరిగింది. అటు సుమన్ శెట్టి, ఇటు తనూజ.. డీమన్‌కి చిన్నపాటి షాక్‌లు ఇచ్చారు. ఇంతకీ సోమవారం ఎపిసోడ్‌లో ఏమేం జరిగింది? నామినేషన్స్‌లో ఎవరెవరున్నారు?
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన రష్మిక హారర్ సినిమా)
ప్రతి సభ్యులు ఇద్దరి సభ్యులకు చెందిన బాటిల్స్ పగలగొట్టి నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. తొలుత ఇమ్మాన్యూయేల్.. రీతూ, పవన్ పేర్లు చెప్పాడు. భరణి వచ్చి.. తన మెడిసన్స్‌తో ప్రాంక్ చేయడం నచ్చలేదని సంజనని, గతవారం సరిగా కనిపించలేదు అని పవన్‌ని నామినేట్ చేశాడు. రీతూ.. సుమన్, సంజనాని నామినేట్ చేసింది. తనూజ అయితే పవన్ పేరు చెప్పింది. కానీ ఈ డ్రామా కాస్త విచిత్రంగా నడిచింది.
తనూజ.. తొలుత ఇమ్మూని నామినేట్ చేస్తున్నట్లు చాలాసేపు మాట్లాడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి నన్ను నామినేషన్‌లోకి లాగాడు. ఏదో మాట అన్నంత మాత్రాన ఫ్రెండ్‌ని విసిరి పారేశాం అని కాదు. ఇప్పటికీ నువ్వు నా ఫ్రెండ్ వే. ఏదన్నా ఉంటే ముఖం మీద చెప్పు అని అడిగింది. దీనికి ఇమ్మూ తనవైపు నుంచి సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరూ తమ మధ్య దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు సడన్‌గా డీమన్ పవన్ పేరు చెప్పి తనూజ షాకిచ్చింది. ఇప్పటివరకు నామినేషన్ పాయింట్ చెప్పి మారిస్తే జోక్‌లా అనిపించిందని పవన్ ఆశ్చర్యపోయాడు. అలానే సంజనని కూడా నామినేట్ చేసింది.
(ఇదీ చదవండి: సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)
సుమన్ శెట్టి చేసిన నామినేషన్స్ అయితే వేరే లెవల్ కామెడీ అని చెప్పొచ్చు. నువ్వు హౌస్‌లో గట్టి గట్టిగా అరుస్తావ్, నాకు అది డిస్ట్రబెన్స్‌గా ఉందని చెప్పి రీతూని నామినేట్ చేశాడు. దీంతో రీతూ షాకయింది. మిగిలిన వాళ్లకు కూడా ఇబ్బందయితే వాళ్లు చెప్పుండేవాళ్లు కదా అని రీతూ అడిగితే.. వాళ్లకు భయమేమో చెప్పలేదు, నాకు భయం లేదు చెప్తున్నా అని వివరణ ఇచ్చాడు. తర్వాత డీమన్ పవన్ పేరు చెబుతూ.. నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కూడా, మాకంటే నువ్వే స్ట్రాంగ్ గనుక ఇంటికెళ్లిపోయి రెస్ట్ తీసుకో అని కారణం చెప్పాడు. దీనికి ఏమనలో తెలీక పవన్ నవ్వుకున్నాడు.
ఇక సంజన.. పవన్, రీతూని నామినేట్ చేసింది. డీమన్ పవన్.. తొలుత ఇమ్మూ పేరు చెప్పి కాస్త నవ్వించి తర్వాత సంజన, తనూజ పేర్లు చెప్పాడు. చివరగా కెప్టెన్ కల్యాణ్.. భరణిని నామినేట్ చేశాడు. అలా ఈ వారం మొత్తంగా ఆరుగురు నామినేషన్లలో నిలిచారు. వారిలో సంజన, రీతూ, భరణి, పవన్, తనూజ, సుమన్ ఉన్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)


