మహేష్ ఫ్యాన్స్ కోసమే కామెంట్స్ ఓపెన్ చేశాను: హరీశ్ శంకర్ | Harish Shankarm says I opened the comments Box for Mahesh fans | Sakshi
Sakshi News home page

మహేష్ ఫ్యాన్స్ కోసమే కామెంట్స్ ఓపెన్ చేశాను: హరీశ్ శంకర్

Mar 12 2026 11:39 PM | Updated on Mar 13 2026 10:15 AM

Harish Shankarm says I opened the comments Box for Mahesh fans

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కోపానికి గురైన దర్శకుడు హరీశ్ శంకర్ తన పొరపాటును బహిరంగంగా ఒప్పుకున్నారు. “BoB రికార్డులు మళ్లీ లేపరా” అంటూ వచ్చిన ఒక పోస్టుకు హరీశ్ శంకర్ ‘తథాస్తు’ అని రిప్లయ్ ఇవ్వడం మహేష్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. వెంటనే ట్వీట్‌ను డిలీట్ చేసినప్పటికీ, అభిమానుల ఆగ్రహం మాత్రం తగ్గలేదు.  

“నేను అంత స్పీడ్‌గా రియాక్ట్ కాకుండా, ట్వీట్ పూర్తిగా చదివి రెస్పాండ్ అవ్వాల్సింది. 30 సెకన్లలోనే డిలీట్ చేశాను. ‘బీ..వో’ అనే పదాలు కనిపించడంతో తొందర్లో బాక్సాఫీస్ అనుకున్నాను. అది పొరపాటు. అయినప్పటికీ కర్మను నమ్ముతాను. అందుకే క్షమాపణలు చెబుతూ నోట్ పెట్టిన తర్వాత కామెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేశాను. ఎంతయినా తిట్టండి అని అనుమతించాను” అని హరీశ్ తెలిపారు.  

“గద్దలకొండ గణేశ్ సినిమా బాగుందని మహేష్ బాబు స్వయంగా ట్వీట్ చేసి నన్ను అభినందించారు. నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం లేని వ్యక్తి అయినా, మనస్ఫూర్తిగా అభినందించారు. అలాంటి వ్యక్తి గురించి పొరపాటున నేను తప్పుగా ట్వీట్ చేయడం మహాపాపం. నేను ధర్మబద్ధంగా బతికే వ్యక్తిని, అధర్మం పనులు చేయను. ఇది తప్పు కాదు, పొరపాటు మాత్రమే” అని హరీశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా అన్ని రికార్డులను బద్దలుకొడుతుందని తాను కూడా నమ్ముతున్నానని హరీశ్ ప్రకటించారు.  

Advertisement
 
Advertisement
Advertisement