నిర్మాత రవిశంకర్ , ఉస్తాద్ భగత్‌సింగ్, గబ్బర్ సింగ్, హరీష్ శంకర్
‘‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చాలా బాగా వచ్చింది. ‘గబ్బర్ సింగ్’ మూవీ స్థాయికి తగ్గకూడదనే లక్ష్యంతో హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించారు. ‘ఖుషి’ నాటి రోజులను గుర్తు చేసేలా ఈ చిత్రం ఉంటుందని హామీ ఇవ్వగలను. అన్ని వాణిజ్య అంశాలతో రూపొందిన ఈ సినిమా ఆద్యంతం ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అని నిర్మాత రవిశంకర్ యలమంచిలి పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ చిత్రం 19న విడుదల కానుంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘కాలరే ఎత్తరా..’ అంటూ సాగే మూడో పాటని విడుదల చేశారు మేకర్స్. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటని రామ్ మిర్యాల పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్ మాట్లాడుతూ–‘‘1500 నుంచి 2000 మందితో ఈ పాటను తెరకెక్కించాం. మైత్రి మూవీ మేకర్స్‌లాంటి నిర్మాతలు దొరకడం నా పూర్వజన్మ సుకృతం’’ అని తెలిపారు. ‘‘నేను కూడా ఈ పాటను ఎంతో ఎంజాయ్ చేశాను’’ అన్నారు రాశీ ఖన్నా. పాటల రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడారు.


